2, మే 2024, గురువారం

భగవద్గీత విశిష్టత

 *భగవద్గీత విశిష్టత*


లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది.


ఏమిటా విశిష్టత?


అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు  లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని 'జయంతి' గా జరుపుకుంటారు.అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల 'గీతాజయంతి' ని జరుపుకుంటారు.

ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేదు.


ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం?


సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో, 

కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనమును మోసుకొని ప్రవేశిస్తున్న తరుణంలో, ఆ అజ్ఞానపు గాడాంధకారాన్ని చీల్చుకుంటూ, మానవజాతిపై వెలుగులు విరజిమ్ముతూ  భగవద్గీత ఉదయించింది.


ఏముంటుంది ఈ భగవద్గీతలో?


ఏది తెలిస్తే మానవుడికి  ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో, ఏది ఆత్మ, పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో, ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో అదే ఉంటుంది.


నూనె రాస్తే రోగాలు పోతాయి. దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు. నన్ను నమ్మనివానిని చంపండి అనే ఉన్మాదం ఉండదు. నన్ను దేవుడిగా ఒప్పుకోనివానిని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు.


 భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితంపై ఆసక్తి పోతుందా?


భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు. గాండీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు. భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని   కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది.


 భగవద్గీత  శాస్త్రీయ గ్రంధమా? 


ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతని కోట్ చేసినవాళ్ళే. భగవద్గీతని మొదటిసారి  చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు  అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే.


ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే  ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి కదా. ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు.


కలియుగం లో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం. విదేశీయుల్లా కత్తి పట్టుకుని, రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు.


బ్రిటిష్ వాళ్లు, మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విధ్వంసం చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి.


వారు కొన్ని  వందల సంవత్సరాల పాటు  భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని,

ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా  కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని  కృష్ణభక్తులుగా మార్చారు.


ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగంతో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం.

A Best Collection from Brahmana Samaakya.

Panchang


 

_కర్మ _పునర్జన్మ

 #_కర్మ _పునర్జన్మ*

                 

 మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనకి మూడు లాభాలు కలుగుతున్నాయి.


1.మొదటిది

మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది.


2.రెండవది

వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి.


  3. మూడవది

ఈ శక్తులు మన వర్తమానం లోనూ భవిష్యత్తులోను గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తాయి.


ఈ పనే పాండవులు చేశారు. మనం మాత్రం ఎందుకు చేయకూడదు.


మహర్షులు, యోగులు కర్మలనుండి ఎలా తప్పించుకోవాలా? అని ఎప్పుడు ఆలోచించలేదు. కర్మ క్షాళనం కోసం తపించారు. వారు అనుసరించిన పద్ధతినే మనం కూడా అనుసరించ వచ్చును.


మనం గత జన్మల్లో చేసుకున్న పాప రాశి కొండంత ఉంటుంది. దీనిని చాలా నెమ్మదిగాను, వాటినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చే జన్మలకి వాయిదా పడి ఇంకా జన్మలు పెరిగి పోతాయి.ఆదిత్యయోగీ..


విష్ణుమూర్తి ద్వారపాలకులు అయిన జయవిజయులని “మూడు జన్మల్లో హరి వైరులుగా మారి, శ్రీహరి తో చంపబడి వైకుంఠం చేరతారా? లేదా ఏడు జన్మల్లో హరిభక్తులు గా జన్మించి వైకుంఠం చేరతారా?” అని అడిగితే వారు “ఏడు జన్మల హరి విరహం భరించలేము. ఏడు జన్మల సుదీర్ఘ కాలం భరించలేము

Jai Shri Ram 

Kancherla Venkata Ramana

మట్టికుండ

 ..   ☘️మట్టికుండ


☘️మిత్రులారా ఇది మెసేజ్ మాత్రమే మీ ఇష్టం మీరు ఎలాగైనానీరు త్రాగండి



.

.  --  వేసవి తాపానికి తాళలేక రిఫ్రిజిరేటర్ లోంచి బాటిల్ తీసి కూలింగ్ వాటర్ తాగేయటం మనలో చాలామందికి అలవాటే.  ఐతే యీ అలవాటు తక్షణమే మానుకోవాలి.  మన శరీరంలో ఉష్ణోగ్రత బయటి వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉండకూడదని మనం  తెలుసుకోవాలి.  బయటి ఎండ వేడి నుంచి రాంగానే.. వచ్చిన వెంటనే ఫ్రిజ్ లో ఉంచిన చల్లని నీరు తాగేయకూడదు.  ఓ 10-15 నిమిషాల తర్వాత తాగడం శ్రేయస్కరం.  ఇలా చేయడం వల్ల దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వైద్యులు పరిశోధకులు చెబుతున్నారు.  రిఫ్రిజిరేటర్ వాటర్..  మామూలు మంచినీళ్ళలా గడగడ తాగేయకూడదు‌.  మాత్రలు క్యాప్సూల్స్ వేసుకోవడానికి ఫ్రిజ్ వాటర్ వాడకూడదు.  భోజన ఫలహారాలు అవగానే  కూడా ఈ చల్లని నీళ్ళు తాగకూడదు.  మిగతా సమయాల్లో రెండు మూడు గుక్కల కంటే ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ తీసుకోకూడదు.  అతిథులు వస్తే చల్లని నీరు అడిగితే మిక్స్ చేసి ఇవ్వడం మంచిది.  చాలామంది వేడి వాతావరణంలో ఐస్ క్రీం లు తింటుంటారు.  ఇదికూడా మంచిదికాదు.  ఐస్ లోపల వేడి ఉంటుంది.  వేసవి దాహాన్ని తీర్చుకోవడానికి.. మట్టి కుండలు.. ది బెస్ట్.  మట్టి కుండలో ఏరోజుకారోజు మంచినీటితో నింపి చల్లబడ్డాక ఆ మంచినీళ్ళు తాగడం అంత ఉత్తమం మరొకటి లేదు.  మంచి ఆరోగ్యం కూడా.  ఆహారం తీసుకున్నాక మట్టి కుండలో నీరు తాగితే జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుందని ఆయుర్వేదం చెబుతోంది.  రిఫ్రిజిరేటర్ లు లేని పూర్వపు రోజుల్లో చల్లని నీరు మట్టి కుండలో నుంచి తీసుకుని తాగేవారు.  వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమే అని మనం తెలుసుకోవాలి.  మట్టి కుండలో చల్లని నీరు తీయగా సహజంగా ఉంటుంది.  ఓ పాటలో.. మట్టి కుండలో నీరు తీయనా..  అని చరణంలో వస్తుంది.  కొత్త కాపురం మట్టి కుండ నీటిలో ఉన్నంత తీయగా ఉండాలని అంటారు.  మన సౌత్ లో పలమనేరు టెర్రకోట మట్టి కుండలు చాలా ప్రసిద్ధి పొందాయి.  మట్టికుండని కడవ అనికూడా అంటారు.  మొక్కల్ని పెంచే మట్టికుండలను పూలకుండీలు అంటారు.  మట్టి కుండలు, పూలకుండీలు అందరి ఇళ్ళలో ఉండటం ఆరోగ్యపరంగా చాలా అవసరం.. మంచిది కూడా.  ఫ్రిజ్ వాటర్ బదులు మట్టి కుండ నీళ్ళే మనం అలవాటు చేసుకోవాలి..  ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....

Joke etc





















 

మహాభారతంలో

 శాస్త్రవేత్తలకే అంతుచిక్కని సైన్స్.... 

మహాభారతంలో ఏంటో 🤔చూద్దాం పదండి*


👉మహాభారతం వ్యాసుడు రచించి 5,000 సంవత్సరాలు అవుతుంది. అని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.


*5 వేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలో సంసృుతం తప్ప వేరే భాష లేదు. ఇప్పటికీ వేరే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా గ్రంధాన్ని రచించడం గొప్ప విషయం.*


👉 మహాభారతం మించిన ఇతిహాసం, అంత సాహిత్యం ఇంకోటి రాలేదు, ఇంతటి *5000 సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్ప సాహిత్యం వేరే ఏదీ రాకపోవడం విచిత్రం.*


👉 భారతం అప్పటి గొప్ప చరిత్రను తెలియజేస్తుంది, ఇప్పటికీ అందని *సైన్స్ కనుక్కొని విషయాలను ఎన్నో మనకు మహాభారతం చెపుతుంది. 


వాటిలో కొన్ని:


*👉మహాభారతంలోని ఆదిపర్వం లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.*


👉ముఖ్యంగా ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టుక వ్యాసుడు *నియోగ ధర్మం* ద్వారా అంబా, అంబాలిక లకు కనడం. దాసికి *విదురుడు జన్మించడం.*


*👉 ఇందులో ఏం విచిత్రం ఉంది అంటున్నారా?*


👉ఇక్కడ ముగ్గురికి పుత్రుల జన్మించడం జరిగింది మరి దీన్ని వ్యాసుడు ఎలా నిర్ణయం చేశాడు.

*1974లో  అయోవ యూనివర్సిటీలో *డోనాల్డ్ లాకె* అనే ఇద్దరూ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు, *స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక స్థితి లే బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తాయి, అని ప్రపంచానికి తెలియజేశారు.*


👉నేడు మనం వాడే *స్పెర్మ్ డొనేషన్* ఆనాటి

*నియోగపద్ధతి ఒకటే.*


గాంధారి కుంతి పై అసూయతో తన గర్భంపై కొట్టుకోగా ఆ పిండం కింద పడింది.

👉 వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని 101 కుండల్లో ఆవు నెయ్యి నింపి, ఒక పద్ధతి ద్వారా దాచి ఉంచాడు, గాంధారిని ప్రతిరోజు వాటిని తాకమని చెప్పేవాడు, మాతృ తల్లి ప్రేమ స్పర్శ ద్వారా ఆ కుండలలోని పిండాలు బయట కూడా పెరిగాయి.


*👉 వీటిని నేటి ఆధునిక  వైద్యులు మూడు రకాలుగా విభజించారు.*


పిండాలను ముక్కలు చేయడం మెడికల్ భాషలో 1.*స్లైసింగ్ ఎంబ్రియో*


2.*ఆర్టిఫిషియల్ యూటర్నెస్* కృతిమ గర్భాన్ని పోలిన వాతావరణాన్ని నిర్మాణం చేయడం. 


3. *మదర్ టచ్*


*👉 టెస్ట్ ట్యూబ్ బేబీ లు గా పుట్టిన వారు -వశిష్ఠుడు, అగస్త్యుడు. ద్రోణాచార్యుడు , క్రుతుడు, కృపి. 


అనగా ఆ రోజులలోనే స్త్రీ బీజం నుంచి అండ కణాన్ని  సేకరించి , గర్భాశయం బయట చుట్టూ పోషకాల నుంచి వీర్యకణాలను వదలడం అనేది 5 వేల సంవత్సరాల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యమే కదా!


*👉 ద్రోణుడిని కుంభసంభవుడు అని అంటారు* అంటే ప్రత్యేకమైన కుండ లో పుట్టిన వాడు అని అర్థం.


ఇక శిఖండి పాత్ర:-

*Transgender*  *Trans sexual* *లింగ మార్పిడి*

మహాభారతం కాలం నాటికే ఇది ఉంది భీష్ముడిని చంపేందుకు అంబా శిఖండి గా మారింది. *మొదటి అడ పిల్లగా పుట్టి మగవాడి లక్షణాలు గల పాత్ర శిఖండి. ఇప్పుడూ మనం చెప్పుకునే *Transsexualism* ఇపుడు surgery లు చేసుకోవడం కూడా చూస్తున్నాం. ఒక యక్షుడు ఆమెకు *సైకియాట్రిక్ treatment చేయటం జరిగింది.* అడ పిల్లగా పుట్టి పూర్తిగా మగ వాడిలా మారడం.


*బృహన్నల పాత్ర:-

*Temporary Trans-sexualisum* ఇప్పటి మోడర్న్ సైన్స్ లో *hermaphroditism*

అంటారు. కొంతకాలం స్త్రీగా ఉండి పురుషుడు గా మారే ప్రక్రియ ఇది ఉర్వశి శాపం వలన అర్జునుడు అజ్ఞాతవాసంలో  శాపం ఆయనకు అదే మేలు చేసింది.


*ఇద్దరు తల్లుల గర్భంలో కొన్నాళ్ళు పెరిగిన బలరాముడు:-

యోగ మాయ ద్వారా *రోహిణి గర్భం లోకి మార్పు  చేయ బడిన ఎంబ్రీయో ద్వారా ఇది సాధ్య పడింది.


దీనికి నేటి సైన్సు వివరణ:-

*Effortless reciprocal IVF* అని ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది మీరు గానీ *3 నవంబర్ 2018 ఈనాడు పేపర్* తీసి అందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే అమెరికాలో ఇద్దరు యువతులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరికీ ఒక పిల్లవాడిని కనాలనిపించింది. కానీ ఇద్దరు యువతులే కదా ఎలా కంటారు, ప్రకృతి ఒప్పుకోదు కదా! 


కాని దీనిని *Bedford hospital in Texas* వాళ్ళు చేశారు.

IVF ద్వారా ఎంబ్రియో కొన్నాళ్లు ఒక తల్లి గర్భంలో మరికొన్నాళ్లు ఇంకో తల్లి గర్భంలో పెరిగిన బిడ్డనుకన్నారు.


*జరాసంధుడు పాత్ర*

జర అనే రాక్షసి చేత సంధి చేయబడ్డాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు.


ఈమధ్య మోడన్ మెడిసిన్ లో *Replantation surgery* యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారి శరీరంలోని ఏదైనా ఒక భాగం తెగిపోతే దాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి సర్జరీ చేస్తే ఆ తెగిపోయిన భాగాన్ని శరీరానికి అతికించవచ్చు దాన్ని  మళ్ళీ యదావిధిగా చేయవచ్చు.


*1962 లో బోస్టన్ లో తెగిన చెయ్యిని 

అతికించారు, award కూడా పొందాడు.*


*అర్జునుడు-  సమ్మోహన ప్రయోగించిన సమ్మోహనాస్త్రం మరొక విచిత్రం.  దీనిని ఉత్తర కుమారుడి తో పాటు కౌరవుల మీద యుద్దం చేసే సమయంలో తను ప్రయోగించిన విషయం మనకు తెలుసు. (నర్తనశాల సినిమాలో మనకు చూపించారు).


ఇలాటిదే మనకు 1770 లో Mesumer ద్వార వచ్చినా mesumerisum BV పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్, PC సర్కార్ వాళ్ళు చేసి చూపారట.


*మహాభారత యుద్దం సమయంలో ఇలాటివే 

అనేక అస్త్ర, శాస్త్రాలూ ఉపయోగించారన్నది 

మనం చదివాము. 

ఉదా:- బ్రహ్మాస్త్రం,  నారాయణ అస్త్రం, పాశుపతాస్త్రం etc*


ఇలాటిదే ఆ మద్య world war లో 06-Aug-1945 హీరోషిమా నాగసాకి పై జరిపిన అణు విస్ఫోటనం*


👉  Physics సూత్రాలు 

*నాసతో విద్యతే బహో నా భావవన్ విద్యతే సతః* అంటే ఉన్నదాన్ని పూర్తిగా నాశనం చేయలేము, లేని దాని నుంచి పుట్టించలేం.


👉పదార్థం శక్తిగా మారుతుంది, 

శక్తి పదార్థంగా మారుతుంది. E=mc2


*👉 ఓపెన్ హైమర్ అణుబాంబు గురించి అడిగితే గీతా లో దివి సూర్య సహస్రశ్చ అనే శ్లోకాన్ని విదేశీయుడు వివరించాడు.*

ఆటంబాంబ్ విస్ఫోటనం తో సమానం శ్రీ కృష్ణుని విశ్వరూప సందర్శనం అంధుడైన  ధృతరాష్ట్రుడు 

ఈ విశ్వరూపన్ని చూసినట్టు మహాభారతం చెబుతోంది. అంటే అందులకు కూడా 

కనిపించెంత శక్తి అదీ. 


మహాభారతంలో *భారతీయులు 

ఇలాంటివి ఎన్నో చేసి చూపారు.  


ఆధునిక కాలంలో ఈ విదేశీయులు చేస్తున్నది 

వేల సం॥ క్రితమే మన పూర్వులు చేసారు.


*AA Garbosky scientists* హర్యానా లోని  అస్తిపంజరాలు సేకరించి వాటిలో *రేడియో యాక్టివిటీ* ఎంత ఉందో పరిశోధన చేశాడు

ఆశ్చర్యంపోయి ఇలా అన్నాడు. *మహాభారతంలో ఇప్పుడు మనం వాడే అన్నిటికంటే గొప్ప ఆయుధాలను వాడారు కానీ వాటిని అయోగ్యులకు తెలియకూడదు అని గుప్తంగా ఉంచారు అని చెప్పారు.*


*👉 మాక్రో, మైక్రో  వైజేశన్ శరీరం పెరగటం వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆసిమ్మం కూడా వివరించారు, స్థూల పెద్ద, సూక్ష్మ చిన్న రూపం.*


*ఎందరో విదేశీయులు మహాభారతంలోని గుర్తించిన విషయాలను మనం గుర్తించలేకపోయారు. మన ఊహకు కూడా అందనంత సైన్స్ టెక్నాలజీ మన గ్రంథాల్లో ఉంది.*


*ఇలాంటి విషయాలను తెలుసుకోలేని అజ్ఞానులు అసలు మహాభారతంలో, పురాణాల్లో ఏముందండి అంతా ట్రాష్, పుక్కిటి పురాణాల్లో అని చెప్తారు ఇప్పుడు అలాంటి వారే పాశ్చాత్యులు చెప్తే నోర్లు వెళ్ళబెట్టి చూస్తారు.*


*మన న దౌర్భాగ్యం ఏంటంటే మన పురాణ ఇతిహాసాల పైన పాశ్చాత్యులు పరిశోధనలు చేసి వాటిని మేమే నూతనంగా కడుక్కున్నాము వాటిని అని నమ్మిస్తే మనం కూడా వారికి జైజైలు కోడుతున్నాము.*


*ఇప్పటికైనా ఆలోచిద్దాం భావితరాలకు 

మన పురాణ ఇతిహాసాల లోని

గొప్పదనాన్ని వివరింద్దాము.*

⚜ *శ్రీ కమలేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 305*


⚜ *కర్నాటక  : జలసoగ్వి-  బీదర్*


⚜ *శ్రీ కమలేశ్వర ఆలయం*



💠 ఈశ్వర ఆలయం, కమలేశ్వర ఆలయం, కల్లేశ్వర ఆలయం, ఈశ్వర  దేవాలయం అని పిలువబడే శివుని ఆలయం భారతదేశంలోని కర్ణాటకలోని బీదర్ జిల్లా, హుమ్నాబాద్ తాలూకాకు వాయువ్యంగా 10 కి.మీ దూరంలో ఉన్న జలసంగ్వి గ్రామంలో ఉంది.  


💠 జలసంగ్వి చాళుక్య రాజవంశానికి చెందిన రాజు విక్రమాదిత్య VIచే నిర్మించబడిన ఒక చారిత్రక ప్రదేశం.  

గ్రామ ప్రాంతంలో ఒక పెద్ద చెరువు ఉంది, దానికి సమీపంలో వివిధ రాష్ట్రాల్లో శిథిలావస్థలో ఉన్న కొన్ని చాళుక్యుల దేవాలయాలు ఉన్నాయి.


💠 14వ శతాబ్దానికి ముందు, జలసంగ్వి ఒక ప్రధాన పట్టణం. మహాభారత ఇతిహాసంలో, విరాట రాజు రాజధానిగా మరియు పాండవ సోదరులు వారి అజ్ఞాతవాస సమయంలో నివసించిన ప్రదేశాలలో ఇది ఒకటిగా పేర్కొనబడింది. 

శాసనాలు మరియు సాహిత్యం జలసంగ్వి అని కూడా సూచిస్తున్నాయి.  

జలసంఘ్వి, జలసంఘ్వి, జలసంఘవి - ఒకప్పుడు దేవాలయాల సమూహానికి ఆతిథ్యం ఇచ్చింది.


💠  "15వ శతాబ్దం తర్వాత, ఇస్లామిక్ సుల్తానేట్‌లు మరియు హిందూ రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలలో ఈ ఆలయం చాలా వరకు ధ్వంసమైంది మరియు ఇతర ప్రాంతీయ హిందూ దేవాలయాలతో పాటు శిథిలావస్థకు చేరుకుంది. 

ప్రస్తుతం ఆలయాన్ని పునరుద్ధరించారు.


💠 ఇది అత్యుత్తమ సాలభంజిక లేదా మదనిక శిల్పాలకు ప్రసిద్ధి చెందింది.  

సాంప్రదాయ భారతీయ కళాత్మక నియమాల ప్రకారం, సమ్మోహన త్రిభంగ భంగిమల్లో ఈ చక్కటి స్త్రీలింగ బొమ్మలు "...చంద్రుని రొమ్ము, హంస నడుము మరియు ఏనుగు తొడతో" ఉంటాయి.  

జలసంగ్వి దేవాలయంలోని శిల్పాలు బేలూరు, హళేబీడు మరియు సోమనాథపురలోని హొయసల బ్రాకెట్-బొమ్మలకు ప్రేరణగా నిలిచాయి.  

ఈ చాళుక్య దేవాలయం నక్షత్రాకారంలో నిర్మించబడింది.


💠 ఆలయ శిల్పాలలోని ప్రధాన ఆకర్షణలలో ఒక మహిళ, శాసన సుందరి (శిలాబాలిక) అనే పౌరాణిక మహిళ యొక్క శిల్పం, కన్నడ అక్షరాలతో సంస్కృత శిలాశాసనాన్ని చెక్కినట్లు చిత్రీకరించబడింది.


💠 ఆలయంలో మూడు గదులు ఉన్నాయి.  ఎనిమిది స్తంభాలతో కూడిన నృత్య గది, అందమైన శిల్పాలు మరియు గర్భగృహతో కూడిన నంది గది. 

గర్భగృహంలో లింగం ఉంది.  

గర్భగృహ ప్రవేశ ద్వారం ద్వారపాల మరియు యాలి డిజైన్లతో రూపొందించబడింది.  

తలుపు పైభాగంలో గణపతి విగ్రహం ఉంది


💠 

ఆర్కియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1996లో విడుదల చేసిన "ఇండియన్ ఆర్కియాలజీ 1991-1992 - ఎ రివ్యూ" నివేదికలో ఈ ఆలయంలో జరిగిన పునరుద్ధరణ పనుల గురించి చెబుతుంది. 

"గోడ యొక్క శిథిలమైన వెనిరింగ్ రాళ్లను కూల్చివేసి, రీసెట్ చేశారు. 

తప్పిపోయిన స్లేట్‌లు మరియు పైకప్పు బీమ్‌లను కొత్త వాటితో రీసెట్ చేశారు. 

లీకైన టెర్రస్‌కు వెదర్ ప్రూఫ్ కోర్సు అందించబడింది" అని నివేదికలో పేర్కొన్నారు. 


💠 మళ్లీ 2003లో ప్రభుత్వం పెద్ద పెద్ద రాతి పలకలను అతికించి శిల్పాలను ధ్వంసం చేయడంతో పునరుద్ధరణ పనులు చేపట్టింది. ప్రస్తుత సాంకేతికతతో ఆలయ వాస్తవికతను పాడుచేశారని ఆరోపించారు.


💠 ఎలా చేరుకోవాలి: 

జలసంగ్వి బెంగళూరు నుండి 700 కి.మీ మరియు జిల్లా రాజధాని బీదర్ నుండి 45 కి.మీ. 

బీదర్ సమీప విమానాశ్రయం (42 కిలోమీటర్ల దూరంలో). హుమ్నాబాద్ సమీప రైల్వే స్టేషన్ (12 కి.మీ దూరంలో) ఉంది

Koti pilla chestalu


 

Rayalaseema recepy


 

Baby monkey's actions


 

Volcano


 

Coconut removing


 

A C cleaning


 

Phalani swami kirana shop rajmandry


 

శతరుద్రీయము-50*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

. *శతరుద్రీయము-50*

(వ్యాఖ్య: శ్రీ తురుమెళ్ళ మాధవ కుమార్)

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

*చతుర్థానువాకము - 4 వ యజుస్సు*


*నమకనామాని : ఓం తస్కరాణాంపతయే నమః*


*నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః!*


ప్రత్యేకించి ఒక పనియంటూ కాక, ఏ పనినైనా చేయు సమూహముల యందున్న మీకు నమస్కారము♪. రుద్రులారా! అటువంటి సమూహములకు నాయకులైన మీకు నమస్కారము♪.


*వివరణ :*

నక్కలవాళ్లు, బొక్కలవాళ్లు, లంబాడీలు అంటూ కొండతెగలు కొన్ని ఇంకా ఇప్పటికీ ఉన్నాయి♪. వీళ్లు పదిపదిహేనుగురు కలిసి గుంపుగా తిరుగుతుంటారు♪. రైతులకు కుప్పనూర్పిళ్ళ సమయంలో కూలిపని చేసి పెడుతుంటారు, భవన నిర్మాణాలలో పనిచేస్తూంటారు♪. అన్ని పనులూ చేస్తూంటారు♪. అలాగే నిర్దుష్టమైన గమ్యం లేకుండా తిరిగే వాళ్ళని గూడా *వ్రాతులు* అంటారు♪. ఇటువంటివారికి ఉండే నాయకుడిని *వ్రాతపతి* అన్నారు♪.


(రేపు.... చతుర్థానువాకం 5 వ యజుస్సు)

                                             


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *నాలుగవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము*

. *శ్లోకము 08-09*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।*

*ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। 8 ।।*


*భావము:*

ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, మరియు ధర్మ సూత్రములను తిరిగి స్థాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.


<>><<>><♾️🔘♾️<>><<>><


*జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః ।*

*త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సొఽర్జున ।। 9 ।।*


*భావము :*

నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థంచేసుకుంటారో, ఓ అర్జునా, వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తరు, నా నిత్యశాశ్వత ధామానికే వస్తారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

యోగవాసిష్ఠ రత్నాకరము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *హరి ఓం*

 *ఓం శ్రీ మహాగణాధిపతయే నమః* 

*ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః* 

*ఓం నమో వసిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి శుకాదిభ్యః*

 

. *🌹యోగవాసిష్ఠ రత్నాకరము🌹* 

*వైరాగ్య ప్రకరణము - 1వ అధ్యాయము* 

. *🌹రాఘవ వైరాగ్య వర్ణనము🌹*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *శ్రీ వాల్మీకి రువాచ :-*

0049


*1-146*

*మోహమాతంగమృదితా కలంకకలితాంతరా* 

*పరం ప్రసాదమాయాతి శేముషీసరసీ కథమ్‌* 


అజ్ఞానమగు ఏనుగు వలన కెలకబడి, మురికియైన బుద్ధియను సరోవరము ఏ విధముగ అత్యంత నిర్మలత్వమును బొందగలదు? 


*1-147*

*సంసార ఏవ నివహే జనో వ్యవహరన్నపి*

*న బంధం కథమాప్నోతి పద్మపత్రే పయో యథా*


మనుజుడు సంసార వ్యవహారములందు బాల్గొనుచున్నను తామరాకునందలి నీటిబొట్టువలె, నిర్లిప్తుడై యుండగల్గుట కుపాయమేమి? 


*1-148*

*అత్మవత్తృణవచ్చేదం సకలం కలయన్‌ జనః* *కథముత్తమతామేతి మనోమన్మథమస్పృశన్‌*  


ఈ సమస్త జగత్తును అంతర్దృష్టిచే ఆత్మగను, బహిర్దృష్టిచే తృణతుల్యము (తుచ్ఛము) గను గాంచుచు, మనస్సుచే కామాది వృత్తులను స్పృశించక ఇవ్విధమున మనుజుడు ఉత్తమత్వము నెట్లు పొందగలడు?


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5125* *శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం -‌ నవమి - ధనిష్ట -‌‌ గురు వాసరే* *02.05.2024.* 


ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

కన్నులకాటుక చమత్కారం!

 శు భో ద యం🙏



కన్నులకాటుక చమత్కారం!


బులుసువారి "నీలమోహనం" కవితా చమత్కార భాసురం స్వభావసుందరం!ఆచమత్కారమేదో ఈపద్యంలో రసజ్ఞులు

చిత్తగింతురుగాక!


"స్వామీ!కజ్జలరేఖలా కనుల? వహ్వా!! ప్రేయసుల్ గోపికా

భామల్,ముచ్చట లిట్లు దీర్చికొనిరే! వాదేలనీతోడ? మీ

ప్రేమల్ లోకమెఱుంగ ఱేపకడ గోపీ గండభాగమ్ములన్

గోమై కాటుక చుక్కలై మెఱసి నీకున్ కీర్తులందెచ్చులే! 14:ప.

    ఓస్వామీ!నీవిశాలనేత్రాలకు అందంగా అలంకరించిన యీకాటుకరేఖలు యెంతసొగసుగా ఉన్నాయో?ఈవిధంగా నీప్రియతమగోపికామణులు తమముచ్చటను దీర్చికొన్నారాయేమి,?వహ్వా!!బాగుబాగు!!

        ఎందుకయ్యా!అలాకోపంగా నావైపుచూస్తావు.?ఓహో?నీప్రేయసీమణుల నెకసెక్కమాడితిననియా?

          నీతో నాకు వాదములేల!మీ మీప్రేమలను ప్రపంచమెరుగదా?అందరకూ విదితమే?

ఎట్లందువా?

         రేయి రాసక్రీడలలో నీకన్నులకాటుక వారి గండభాగములకలంకృతమయి తెల్లవారుసరకి అందరకూ తేటతెల్లము జేయునుగదా!

    అవినీకీర్తిపతాకములై భాసించునులెమ్ము.

        ఇదీ దీని భావము.

నీవుగోపికాలోలుడవని కంఠోక్తిగా కవిచెప్పడు.వారికంఠభాగములందలముకొన్న కాటుక రేఖలే ,మీలౌల్యమునకు నిదర్శనమలంటాడు.

 ఎంతచమత్కారం!

నేనన్నాననికోపపడకయ్యో!నీచేతలే నిన్నుబయటపెడతాయిలే!యంటాడు.

       పైగా ఆకాటుక మరకలు (తెల్లనివికాదు-నల్లనివి) ఆయనకీర్తికిగుర్తులట!

జరిగినది జారత్వము.అందువలన వచ్చుకీర్తి యపనిందయే అందువలలననే ఆకీర్తికి నలుపురంగునాపాదించినాడుకవి!

   ఆహా!ఏమిభావుకత!!

కీలెరిగి వాతబెట్టుటయా?

పొగడుటయా?

నిందాస్తుతియే!!!


ఈతీరుగా ననిదంపూర్వకములైన చమత్కారములు పద్యాలలో కోకొల్లలు.ప్రతీపద్యంలోనూ ఏమున్నాదా ?యనురిరంసతో పద్యాలు చదువుకోవాలి.పుటలుత్రిప్పితే ప్రయోజనంలేదు.భావుకులైన రసజ్ఙభారతి పండితులారా!మంచికావ్యాలను చదవండి!

చదివించండి!కవినిప్రోత్సహించండి! కవికోరేదదే!

"ఆపరితోషాద్విదుషాం నసాధుమన్యే ప్రయోగవిజ్ఙానం"-

అన్నాడు కాళిదాసు.ఆమాట త్రైకాలిక సత్యం!!

 *బులుసు వారి కన్నులకాటుక చమత్కారమును అత్యద్భుతంగా విశదీకరించినందుకు శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారికి ధన్యవాదములు మరియు శుభోదయ వందనములు.* 👌👌👌🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷

తత్వాన్ని ఇక్కడే -

 💎🌅 *_-|¦¦| శుభోదయమ్ |¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

   

  👇 //---------- ( *భజగోవిందం* )---------// 👇


*శ్లో𝕝𝕝 కాతే కాంతా కస్తే పుత్రః*

 *సంసారో యమతీవ విచిత్రః |*

*కస్య త్వం కః కుత ఆయాతః*

 *తత్వం చింతయ తదిహ భ్రాతః | 8 |*


*భావం: నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా! ఆ తత్వాన్ని ఇక్కడే - ఈ దేహం లో ఉండగానే ఆలోచన చేయి*. 

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀




కాతే కాన్తా కస్తే పుత్రః     

సంసారో యమతీవ విచిత్రః ॥

కస్యత్వం కః కుత ఆయాతః 

తత్వం చిన్తయ తదిహ భ్రాతః !!భజ !!8*



*ప్రతి॥ తే = నీయొక్క; కాన్తా = భార్య; కా= ఎవరు?; తే ='నీయొక్క; పుత్రః = కుమారుడు; కః =ఎవడు?; అయం = ఈ; సంసారః = సంసారము; అతీవ = చాలా ఎక్కువైన; విచిత్రః = తమాషా అయినట్టిది; త్వం= నీవు; కస్య = ఎవరివాడివి?; కః = ఎవరవు అసలు? కుతః = ఎక్కడనుంచి; ఆయాతః = వచ్చినవాడవు; భ్రాతః= సోదరుడా!; తత్వం = ఈ తత్వమును; తదిహ = ఇక్కడకు, ఇక్కడనే; చిన్తయః = విచారించుము.*


  భావం:-


నీ భార్య ఎవరు? నీ కుమరుడెవరు? ఈ సంసారమనేది చాలా విచిత్ర మైనది సుమా! నీ వెవరివాడవు? ఎక్కడినుంచి వచ్చావు? సోదరా! ఈ తత్వ విషయాన్ని గూర్చి విచారణ చేయుము.


  వివరణ:-


కుటుంబం, బంధువులు, వారితో గూర్చిన బంధములు ఇవన్నీ వ్యక్తికి హితాన్నిచ్చేననేదాన్ని ఎవరూ కాదనలేరు. ఈ బంధం తన చుట్టూరా మాత్రమే కేంద్రీకరింపబడే స్వార్థం నుంచి వ్యక్తిని బయటకు లాగుతుంది. అలా అన్నామని ఈ బంధాన్ని పెంచుకుని ఊరుగున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఈ బంధాల పరిమితి చాలా చిన్నది. ఆ మాత్రం పరిధిలో కూలబడిపోతే చాలదు. వీటిని సరిపూర్తి చేసి ఆ పై విషయం విచారిద్దాం లెమ్మనుకుంటే కూడా చాలదు. అవి పరిపూర్తి కావటం అనేది మృగ్యమయిన విషయం. మగువ మగాడు కలిసి నివసించి ఒకరినొకరు ప్రేమ మర్యాద ఇచ్చిపుచ్చుకొని, దంపతులుగా జీవితం ఆరంభించి తర్వాత తల్లిదండ్రులుగా ఒకానొక ఉన్నత హోదాలో ఉండేవారై ఒకరినుంచి ఒకరు చాలా విషయాలను తెలుసుకోవలసినవి ఉంటాయి.


భార్యా భర్తలు ఒకరికొకరు సన్నిహితులై ఉంటారు, ఉండాలి. ఆ స్నేహంయొక్క నిజమైన అర్థం తెలిసి అలా నివసిస్తే వాళ్ళు ఎంతో మంచి శిక్షణను పొందిన వాళ్ళవుతారు. అయితే అలా అంతా సరియైన క్రమశిక్షణలో కాలం గడపరు. అందుకనే వారికి ఒకరి మీద ఒకరికి రాగద్వేషాలు అలముకొంటవి. సుఖంగా వుండాలని దేన్నైతే ముఖానికి రాసుకుంటామో అదే విషమై బాధిస్తున్నప్పుడెలాంటి పరిస్థితో ఈ దాంపత్యంలో కూడా అలాంటిదే సంభవిస్తూ ఉంటుంది. హిందూ ధర్మ శాస్త్రాల్లో భార్యా భర్తలు కలిసి వుండాలని నివసించాలనేది సిద్ధాంతమైన విషయం అందులో సందేహం లేదు. కాని ఆచార్యవర్యులేమన్నారంటే ఈ కలిసి ఉన్నప్పుడు ఇద్దరి మధ్యనూ కొద్దిగా ఖాళీ వుండవలెనన్నారు. ఒకరికి ఇంకొకరు లంపటంగా అతుక్కున్నట్లు ఒకరు లేకపోతే ఇంకొకరు బ్రతకలేని పరిస్థితిని తెచ్చిపెట్టుకోవద్దన్నారు. అది ఇద్దరికి భవ రోగాన్నిస్తుంది. కనుక అనారోగ్యకరమైనదే నన్నారు.


కుటుంబమనే సాధన ఉపకరణం. పరీక్షించుకోవటానికి సదవకాశం. తద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని ఉన్నతిలోనికి పెరగడానికి అనువైనదిన్నీ. కాని అది తనంత తానుగా వ్యక్తికి గమ్యం అని అనడానికి వీలులేదు. అసంగత్వంతో కుటుంబజీవితాన్ని నడిపించు కుటుంబం జీవితానికి ఒకానొక కళాశాల లాంటిది. అది ప్రధానమైన సాధనల ద్వారా మనిషి పొందదగిన గమ్యక్షేత్రమని మాత్రం పొరపాటు పడకూడదు.


 వేదాంతములోని సూత్రాలు; వ్యక్తి మామూలు జీవితంలో ప్రవేశ పెట్టరానివయేటట్లయితే వేదాంతం ఒకానొక పుస్తకాల ఆదర్శము మాత్రమే, అయేది. ఎవరో భావలోకాల్లో విహరించే కవులు దానిని పాటలుపాడి శిల్పాన్ని చూపించవలసిందే. జీవితాన్ని సంస్కృతికి ఉత్తేజపరచదగిందిగా చెప్పలేము. జీవితం వంక చూద్దామంటే ఆలుమగలు ఉధృదమైన రాగపంకిలంలో ఇరుక్కుపోవటం సహజమనిపిస్తుంది. బాతుకు నీరెంత సన్నిహితమో మనసుకు ఈ “రాగ” మనేది అంత సన్నిహితమై వుంటుంది. నీటిని చూసి అది ఎలా కులుకుతూ అడుగులు వేసుకొంటూ వెళుతుందో అలాగే మనసుకూడా ఈ ప్రియమైన రాగము వైపుకు పరుగెడుతుంది. `అందువల్లనే వేదాంతమునకు అసంగత్వమనే స్థితిలోకి వ్యక్తి యెలా జొరబడవలెనో ఆ కీలకం చెప్పవలసిన అవసరం వుంది. ఆ కీలకం ఈ శ్లోకంలో చెప్పారు.


 ఈ పైన చెప్పిన మోహమనే మురికి కుప్పకు తెలివైన విచారణమె ఒక గొడ్డలి వంటిది. మోహ ముద్గరమని ఈ భజగోవిందానికి ఇంకో పేరు అందుకనె కలిగింది. ఆ విచారణ చేసే పద్ధతి ఎలాంటిదో ఇక్కడ సూచింపబడింది. ఆచార్యుల వారిచేత విచారణ ఏమంటే నిన్ను/ నీవు ప్రశ్నించుకోవాలి. ఈ భార్య యెవరు? కుమారుడెవరు అని పరిశీలించి చూస్తే ఈ ప్రియురాలయిన ఇల్లాలు ఆమె తండ్రికి కుమార్తె మాత్రమే, పెళ్ళి అయ్యేవరకూ పెండ్లయినప్పుడు నీకు ఆమె ముడి పెట్టబడింది. పోనీ ఆ తరువాత అయిన ఎంతకాలం ఇలా? ఎవరుముందు ఎవరు వెనకో! వెళ్ళిపోయేదీ ఎవరికీ తెలియదు. ముందు నీవు వెళ్ళిపోయినా ఆమె వెళ్ళిపోయినా రెండో వారలాగే ఉండిపోతారు. ఈ కలిసి వుండడమనేది అస్థిరమని ధ్వని, మనిషి అతడి భార్యతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పుట్టినవాడు ఆమె అలాగే భర్తతో సంబంధం లేకుండా స్వతంత్రంగా జన్మించింది. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ సంబంధం చూచుకోకుండా ఎవరికి వారే వెళ్ళిపోతారు. పుట్టునుంచి చావువరకు వెళ్ళే ఈ యాత్రలో బ్రతుకు నుంచి మృత్యువు వరకూ వెళ్ళే ప్రస్థానంలో ఒకానొక శృంగార నాటకంలో ఒకళ్ళు మరొకళ్ళతో కలుస్తారు. కలిసి అలా కొంతకాలం ప్రయాణిస్తారు.


ఒకరి నొకరు సేవిస్తూనే ప్రయాణిస్తారు, గాక సహృదయులైన ఇద్దరు ప్రయాణీకులు బస్సులో ప్రయాణం చేసినట్లే ప్రయాణం చేస్తారు, ఈ స్నేహం ఏ ఒక్కరి గమ్యస్థానం - దిగవలసిన చోటు - వదలిపోతుంది. ఇలా విచారించి తర్కించినట్లయితే ఎవడుగాని ప్రపంచంతో ఎలాంటి సంబంధాన్ని పెట్టుకోవాలో సరియైన మనః పరిస్థితితో ఎప్పటికప్పుడెలా వుండాలో అది అర్థమవుతుంది.


 ఆలాగే కుమారుని గురించి కూడా కొడుకయిన అతడు ఎలా వచ్చాడు. జీవితంలోకి, వచ్చినప్పటినుంచి అతడు అతడు పుట్టినప్పటి నుంచి నీవాడైనాడు. అంతకుముందు? గర్భస్థ పిండం, దానికి ముందు నీ శరీరంలో ఒక బీజంలా వున్నాడు. ఆ బీజం నీవు తినే భోజనం అరిగిన మీదట నీలో జనించింది. భోజనము భూమిలోంచి వచ్చింది. మట్టిలో వున్న పదార్థమేదో అనేక మార్పులు చెంది నీకు భోజనమై నీ సంతతి కొఱకు బీజమైన అప్పుడు పిండమై తరువాత బిడ్డ అయింది. ఈ బిడ్డ మట్టియొక్క ఆఖరి రూపమే- ఆ తరువాత సంగతి మాటటుంచితే అలాగే నిన్న నీవు తండ్రిగా యెలా అయినావని విచారణం చేసినట్లయితే నీవు కూడ మట్టియొక్క మరొకరూపంగా లభించినవాడవని అర్థమవుతుంది. కాకపోతే ఆ బిడ్డ కంటే కాలంలోనూ అవకాశంలోను మార్పిడి వున్నదనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఒక మట్టిగడ్డ యింకొక మట్టిగడ్డతో కలిసి రాగాన్ని పెంచుకుంటున్నది. పైనుంచి చూస్తే ఆ మట్టిగడ్డ లు చేసే పనిని చూచి ఎంత నవ్వుతాము? ఈ భ్రమ ఎంత శక్తివంతమైనది! పైన చెప్పినట్టు ఉన్నది వున్నట్లుగా చూచి గ్రహించటం మానేసి నాది నాదని వెంటపడే ఈ భ్రమకు యెంత శక్తివుంది! ఇదే మాయ!


ఊహాభరితమయిన ఈ జీవితం ఈ సంసారం - బుర్రలేనివానికి మహా ప్రమో దము ( మహా ప్రమాదం కూడ కావచ్చు) అవుతుంది. చాకచక్యంతో విషయ విమర్శనం చేస్తూ విచారణ చెయ్యాలి. "నేను" అనేది ఎవరికి చెందినట్టిదని విచారణ చెయ్యి. ఈ నేను ఇలా వుంటూనే వుండటమనేది ఏ దివ్యమయిన పదార్థము యొక్క దయా ప్రసరణమువల్ల కలిగింది? ఎక్కడికి ఇది పోయేది? ఈ భువి నుంచి పోతే ఇక ఈ ''నేను'' దిగే చోటేది?


 నిజంగానే మనం ఎక్కడనుంచో వస్తూవుండి ఎక్కడకో వెలుతున్న వాళ్ళమే. అయితే ఇక్కడ యిప్పుడు మనకున్న పనేమిటి- కర్తవ్యమేమిటి? మనం పోతుంటే మనకు కాలికి, చేతికి, తగిలే, ఈ వస్తువులు జీవులు అనంతమైన సంఘటనలు జనసమూ హం యిలా వుంటే మనకుండవలసిన మనః పరిస్థితి ఎలాంటిది? ఇక్కడ ఈ దోవలో - ఎలా ప్రవర్తించాలి?


 సోదరా! విచారించు ఈ విషయం విచారించు, శంకరులు ఒజ్జగా తన హోదాను చలాయించక పెద్దన్న చిన్నవానికి చెప్పినట్లు భ్రాతః అని సంబోధిస్తున్నారు కొందరు ఈ శ్లోకాన్ని ఈ చోట భ్రాంత అనికూడ చదువుతారు. ఒక వేళ అలా అన్నా అది కూడ ఎంతో సహజమైన పదముగా తోస్తుంది. పిచ్చివాడా అని అర్థం. భ్రాంతః అనే పదానికి బాహ్య ప్రపంచంలోని వస్తువుయై అంతులేని రాగాన్ని కల్పించుకొని మూఢుడై భ్రాంతి నొందినవాడు పిచ్చివాడు కాకేమవుతాడు? సరియైన పంథాలో నడవలేక ఆలోచించలేక పోయినవాడు జీవితంలో భ్రాంతి నొందినవాడే- పిచ్చి వాడేమరి!✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

🪷 ✍️🙏

దూసుకుపోవచ్చు

 💎🌅 *_-|¦¦| శుభోదయమ్ |¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 *శ్లో𝕝𝕝 యద్వత్ ప్రత్యఞ్చి బాణస్య* | *తీవ్రగతిశరాయణం|*

      *తద్వత్ ప్రత్యఞ్చి విక్రాంతే |* *యశోమార్గపరాయణం ||*


*భావం: ఎలాగైతే వింటి నారిని వెనక్కి సారించి వదిలితే బాణం అత్యంత వేగంగా వెళుతుందో, అలాగే జరిగిన విషయాలని ఒక్కసారి సింహావలోకనం చేసుకుని ప్రణాళిక వేసుకుంటే అభివృద్ధి పథంలో శరవేగంతో దూసుకుపోవచ్చు* 


🪷 ✍️🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏

*02-05-2024 / గురుౠ / రాశిఫలాలు



గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును


మేషం

వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటాయి.

---------------------------------------

వృషభం


సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

---------------------------------------

మిధునం


చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన ఫలితాలు పొందుతారు. 

---------------------------------------

కర్కాటకం


ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

సింహం


దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ధన ఇబ్బందులుంటాయి.

---------------------------------------

కన్య


పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. బంధుమిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో పరిస్థితి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగ అంత సంతృప్తికరంగా సాగుతాయి. ఆదాయం మరింతగా పెరుగుతుంది.

---------------------------------------

తుల


ముఖ్యమైన పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు వృత్తి వ్యాపారములు పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

---------------------------------------

వృశ్చికం


ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

---------------------------------------

ధనస్సు


ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధువులుతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో స్థిరత్వం లేని ఆలోచనలు చేయడం వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తప్పవు. విద్యార్థులకు నిరుద్యోగులకు అధిక కష్టం మీద స్వల్ప ఫలితం పొందుతారు.

---------------------------------------

మకరం


గృహమున శుభకార్య వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

---------------------------------------

కుంభం


చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం కలుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు.

---------------------------------------

మీనం


సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు భవిష్యత్తు ఉపయోగపడతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. గృహంలో శుభకార్యాలు పరమైన ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడిని అధిగమించి లాభాల అందుకుంటారు.

🍁 *శుభం భూయాత్* 🍀

*#విధి... చక్కని సందేశం

 *#విధి... చక్కని సందేశం 👌*


ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది.


ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు.


ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి..!


" మీరేంచేస్తారో నాకు తెలియదు నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను" అని కన్నీరుపెట్టుకుంది..!


దానికి ఇంద్రుడు...

"దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ కదా..! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను.నువ్వేం దిగులు పడకు..!" అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు.


ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ..!

"నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు..! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద.!" అంటూ బయలుదేరారు.


వీరిరాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు.

"నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే..! కానీ..! చిలుక ప్రాణం చివరి దశలో ఉంది..! మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం..! మనం ముగ్గురం శివుని ప్రార్థిస్తాం పదండి..! " అన్నారు.


ముగ్గురూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు.

" ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను..! మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! " అంటూ అందరూ బయలుదేరారు.


ఇంద్ర,బ్రహ్మ,విష్ణువు,శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాదారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు.


"అయ్యో..! అదేమి పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను,వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం..! " అని అన్నాడు .


యముడు , అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం వ్రాసి ఉంది ఇలా..!


"ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది..! "అని వ్రాసి ఉంది.


ఇదే విధి..! విధిని ఎవ్వరూ మార్చలేరు!!

A Beautiful Collection from Brahmana Samaakya.🦜

నిబద్దత ఉన్న నాస్తికుడు - శ్రీ శ్రీ

 నిబద్దత ఉన్న నాస్తికుడు - శ్రీ శ్రీ

(శ్రీ శ్రీ జన్మదినం సందర్బంగా )

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి


నాస్తికులు....

దేవుడిని...అతీత శక్తులను నమ్మనివాళ్ళు...! 

కనిపించేది వినిపించేది మాత్రమే నమ్మేవాళ్ళు....! 

మొత్తానికి - 

శాస్త్రీయతకు అందని ఏ అంశాన్ని అయినా విషయాన్ని అయినా తోసిచ్చేవాళ్ళు నాస్తికులు ! 

కానీ.... ఈ మధ్య కాలంలో సాంఘిక మాధ్యమాల్లో నాస్తికుడికి అర్థం మారిపోయి కనిపిస్తున్నది ! 


దేవుడిని గేలి చేసేవాళ్ళు .... ఇతరుల నమ్మకాలను అపహాస్యం చేసేవాళ్ళు...దేవతా స్త్రీల అంగంగాలని గూర్చి వెకిలిగా మాట్లాడేవాళ్లు.... పురాణాల్లో రాక్షస పాత్రలను వెనుకేసుకి వచ్చేవాళ్ళు... దేవుడు లేడు అంటూనే దేవుడిని తీవ్ర పదజాలంతో దుషించే వాళ్ళు... దేవతా ప్రతిమల్ని తొక్కుతూ వికృతానందం పొందేవాళ్ళు... నాస్తికులుగా కనిపిస్తుంటారు.


విప్లవ కవి ...అభ్యుదయ వాది ...అక్షరాలతో హడలెత్తించిన నిత్య చైతన్యశీలి.... పిడికిలెత్తిన నిప్పుకణిక...ముసలి తనం శరీరానికే మనసుకు కాదన్నట్టు చివరి శ్వాస వరకు గర్జించిన కవితా కేసరి.... మహాకవి శ్రీ శ్రీ - ఒక కరుడుగట్టిన నాస్తికుడు ! 


వస్తున్నాయ్ వస్తున్నాయ్

జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయ్

అంటూ పీడితులను తాడితులను కదిలించిన శ్రీ శ్రీ

దేవుడిని నమ్మలేదు కానీ వారి సతీమణి శ్రీమతి సరోజ గొప్ప దైవ భక్తురాలు. ఈ విషయమై శ్రీ శ్రీ స్పందన చూస్తే....

" కనిపించని దేవుడు కోసం ఇంట్లో ఒక గది కేటాయించుకుంది మా సరోజ. పోనీయ్....కనిపించే ప్రతి రాయికి రప్పకు మాత్రం మొక్కదు. తన నమ్మకం గొప్పది " అనేవాడు. అంతేకాదు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆయా ప్రాంతాలకు సభలు సమావేశాలకై వెళ్ళినప్ప్పుడు ఆ ప్రాంతాల్లో ఉండే ప్రఖ్యాత దేవాలయాలను సరోజ గారు దర్శించుకునే వారు.

శ్రీ శ్రీ ఎటువంటి అభ్యంతరం చెప్పేవాడు కాదు.


ఈ విషయమై సరోజ గారు - " వారు నా నమ్మకాన్ని గౌరవిస్తారు " అని చెప్పుకోవడంలో శ్రీ శ్రీ ఉన్నత వ్యక్తిత్వం ప్రస్పుటమౌతుంది.


అట్లాగే - 

1.పిట్స్ బర్గ్ వేంకటేశ్వరుని మీద భక్తి గీతం

2. జై సంతోషి సంగీత విద్యాలయ

 3.కూతురు పెళ్ళిలో సాధారణ తండ్రిగా


 ఈ మూడు విషయాల్లో కూడా శ్రీశ్రీ హుందాతనం 

 ఒకసారి గమనిద్దాం..


▪️పిట్స్ బర్గ్ వేంకటేశ్వరుని మీద భక్తి గీతం


తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని పోలిన వెంకటేశ్వర దేవస్థానం ఒకటి అమెరికాలోని పెన్సిల్ వేనియా రాష్ట్రంలో పిట్స్ బర్గ్ నగరంలో ఉంది. అమెరికాలోనే తొలి దేవాలయంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవస్థానాన్ని 1976 నవంబరు 17 న ప్రతిష్ఠాపన జరిపారు.మన శ్రీ శ్రీ ఈ వేంకటేశ్వరుడి మీద భక్తి గీతం ఒకటి రాశారు. నాస్తికుడు భక్తి గీతం రాయడంపై అందరూ ఆశ్చర్య పోయారు. ఈ విషయమై ఒక సంపాదకుడు శ్రీ శ్రీ గారిని ప్రశ్నించారు కూడా.


" శ్రీశ్రీగారూ ! మీరు దైవప్రార్థనంటూ ఇక్కడ పిట్స్బర్గ్ వేంకటేశ్వరుని మీద నిజంగా భక్తిగీతం రాశారా? లేక వెంకటేశ్వరా నువ్వు పిట్స్బర్గ్ వేంచేశావు . శ్రీరంగం శ్రీనివాసుని నేను వచ్చాను , నీకు పొగడ్తలు ఇష్టం గనుక ఒకటి అందుకో . విదేశంలో వున్న మనకెందుకులే తగవులాటని....అనుకున్నారా? " అనేది సంపాదకుడి ప్రశ్న శ్రీ శ్రీ భార్య సరోజ తన శ్రీ శ్రీ సంసార ప్రస్థానంలో స్పష్టంగా రాయడం జరిగింది.


ఇందుకు శ్రీ శ్రీ ఇచ్చిన సమాధానం కూడా ఆమె రాస్తూ.... " ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకోవటంలో నాకేమీ అభ్యంతరంలేదు . కానీ మిత్రులు కోరిన మాటను కాదనలేక వాళ్ళని కించపరచటం ఇష్టంలేక ఆ పాటను రాశానని మాత్రం నిశ్చయంగా చెప్పగలను.... " అని చెప్పినట్టుగా తెలిపారు.


ఇక్కడ

శ్రీ శ్రీ గారి ఉత్తమ తత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించవచ్చు. నమ్మని నమ్మకం లేని విషయాల పట్ల నాస్తికులు వితండవాదం చేస్తారు. తమని తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ శ్రీ శ్రీ వాదనకి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఒకరికి రుచించనిది మరొకరికి రుచిస్తుందనే భావనతోనే పెద్దరికం ప్రదర్శించారు. నాస్తికత్వానికి గౌరవం తెచ్చిపెట్టారు.


▪️ జై సంతోషి సంగీత విద్యాలయ


శ్రీ శ్రీ జీవన సహచరి సరోజమ్మ మంచి వెండితెర గాయని. తర్వాత శ్రీ శ్రీ గారికి అసిస్టెంట్ గా కూడా పనిచేసింది. ఆ తర్వాత అర్ధాంగి అయ్యింది .పెళ్లి తర్వాత కొన్నాళ్ళకు సినిమా రంగానికి దూరం అయ్యింది.


సరోజమ్మ సాధారణ గాయని కాదు.వీణ , మృదంగం , వయోలిన్ , హార్మోనియం వాయిద్యాలు వాయించగలదు. సంగీతంలో గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన పరీక్షలన్నీ ఉత్తీర్ణత సాధించింది.ఓకల్ కూడా పాసయ్యింది.సంగీత విద్వాన్ సర్టిఫికేట్ పొంది ఉన్నది. అయినప్పటికి గృహిణిగా ఇంటికి అంకితం అయ్యింది.


శ్రీ శ్రీ గారికి ఇది నచ్చలేదు. ప్రతిభ ప్రజ్ఞ ఇంటి నాలుగు గోడలకు పరిమితం కావడం ససేమిరా అంగీకరించలేదు. అందుకే ఒక మూడేండ్ల తర్వాత సరోజమ్మతో మాట్లాడుతూ -

" నా మాట విని హాయిగా స్కూలు పెట్టుకో . దానివల్ల నాలుగు డబ్బులు వస్తాయి , నువ్వు కష్టపడి నేర్చుకున్న విద్యలకి ప్రాణాలు వస్తాయి . ఒక్కొక్క సర్టిఫికేట్కీ ఎన్నేళ్ళు కష్టపడ్డావు?మూడేసి సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న విద్య , సంపాదించిన సర్టిఫికేట్లు మూలనపడి మూలుగుతున్నాయి . నీకేమయినా బుద్ధుందా ? నేను చెప్పినట్టు చెయ్యి . ఇప్పటికయినా నా మాట విను . ఎంత డబ్బు ఖర్చయినా ఫరవాలేదు . ప్రస్తుతం నీకు మూడవేల రూపాయలు సేంక్షన్ చేస్తాను . మీ కాలేజీలో ప్రొఫెసర్స్ని , స్టూడెంట్స్ని పిలిచి మ్యూజిక్ స్కూల్ ఓపెన్ చెయ్యి " అన్నాడు.


భర్త ప్రోత్సాహంతో " జై సంతోషి సంగీత విద్యాలయ" పేరుతో సంగీత పాఠశాల తెరిచింది. నాస్తికుడైన శ్రీ శ్రీ అన్నీ తానై దగ్గరుండి చూసుకుంటూ కూడా ,, పరిపూర్ణ అస్తికత్వాన్ని కనబరుస్తున్న పేరు విషయంలో ఏ అభ్యంతరం చెప్పలేదు. అందుకేనేమో.... సరస్వతి మాత అతడికీ సారస్వతనిలయంలో శాశ్వత స్థానాన్ని ఇచ్చింది. ఏది ఏమైనా శ్రీ శ్రీ విశాల దృక్పథానికి.... సువిశాల మనస్తత్వానికి ఈ ఘటన ఒక గొప్ప నిదర్శనం.


 ▪️కూతురు పెళ్ళిలో సాధారణ తండ్రిగా


భావజాలం మనిషిని కట్టి పడేస్తుంది. శ్రీ శ్రీ తన భావజాలానికి కట్టుబడిన వాడే. కానీ తనదైన భావజాలాన్ని పక్కకు పెడుతూ ఒక తండ్రిగా 

సాధారణ మనిషిగా మారిపోయిన సందర్బం..శ్రీ శ్రీ ని ఒక కొత్త కోణంలో చూపెడుతుంది.


తను నివసిస్తున్న పరిసరాలు , తన చుట్టూ ఉన్న వ్యక్తులు, తన దేశంలో సాధారణంగా కుటుంబాల్లో నెలకొని ఉన్న ఆచార వ్యవహారాలు , వీటన్నిటి నేపథ్యం శ్రీ శ్రీ భావజాలానికి కొంత విరామం ఇచ్చింది. అది తన కూతురు పెండ్లి సందర్బం. తనకు ఆచార వ్యవహారాలు గిట్టకపోయినా పిల్లల కోసం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.


పెండ్లిలో పెండ్లికూతురు గౌరీ పూజా చేయాల్సి వచ్చినప్పుడు అందరూ సరోజమ్మ ఒక్కతే కూర్చుని కూతురుతో గౌరీ పూజా చేయిస్తుంది అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న తండ్రి సామాన్యమైన వ్యక్తి కాదు.


పదండి ముందుకు

పదండి తోసుకు

పోదాం పోదాం పై పై పైకి

అంటూ తన కవితలతో ప్రపంచాన్ని కదిలించిన వాడు. వేలాది గుండెల్లో చైతన్యం నింపిన వాడు. విప్లవ సెగలతో స్ఫూర్తిని పంచి ఆదర్శంగా నిలిచిన వాడు. విటన్నీటికి తోడు దైవశక్తిపై ఏ మాత్రం నమ్మకం లేని నాస్తికుడు.

అందుకే పెండ్లి సంప్రదాయాల విషయంలో

శ్రీ శ్రీ ని ఎవ్వరు బలవంత పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు.

కానీ...

అనూహ్యంగా...

ఆకస్మికంగా....

" సరోజా గౌరీ పూజకు వెళ్ళాలి పదా " అంటూ భార్యని పిలిచిన శ్రీ శ్రీ ని చూసి అందరూ

ఆశ్చర్యపోయారు. సరోజమ్మ మాత్రం ఏకంగా అక్కడే పెళ్లి పందిట్లోనే భర్తను కౌగిలించుకుని ఏడ్చేసింది.


శ్రీ శ్రీ కవిగా ఎంతటి వాడయినప్పటికి తండ్రిగా మాత్రం అతి సున్నితమైన వాడు. అందరి తండ్రులలాగే పిల్లల కోసం పట్టు వీడి దిగివచ్చిన వాడు. 


గౌరీ పూజా తర్వాత అల్లుడికి సతి సమేతంగా కాళ్ళు కడికి కన్యాదానం కూడా చేసాడు.


ఇది శ్రీ శ్రీ జీవన ప్రస్థానంలో ఒక సందర్బం! నాస్తికుడిలో ఒక కారుణ్యమూర్తి దర్శనం ! నకిలీ నాస్తికులు శ్రీ శ్రీ ని చూసి నేర్చుకోవాలి.

గురువారం, మే 2, 2024*

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*గురువారం, మే 2, 2024*

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

       *చైత్ర మాసం - బహళ పక్షం*   

🔔తిథి      : *నవమి* రా10.47 వరకు

🔯వారం   : *గురువారం* (బృహస్పతివాసరే )

⭐నక్షత్రం  : *ధనిష్ఠ* రా11.07 వరకు

✳️యోగం : *శుక్లం* మ2.58 వరకు

🖐️కరణం  : *తైతుల* ఉ11.52 వరకు

           తదుపరి *గరజి* రా10.47 వరకు

😈వర్జ్యం   : *ఉ.శే.వ5.46 వరకు*

💀దుర్ముహూర్తము :  *ఉ9.50 - 10.40* 

                 మరల *మ2.53 - 3.43*

🥛అమృతకాలం    :  *మ1.18 - 2.48* 

👽రాహుకాలం       : *మ1.30 - 3.00*

👺యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30*

🌞సూర్యరాశి: *మేషం* || 🌝చంద్రరాశి: *మకరం*

🌅సూర్యోదయం: *5.38* || 🌄సూర్యాస్తమయం: *6.15*

*సర్వేజనా సుఖినో భవంతు* 

 ఇరగవరపు రాధాకృష్ణ

వినాశకాలే విపరీత బుధ్ధిః"

 *హిందువులారా ఒకసారి గమనించండి*

       అకృత్యాలు, అఘాయిత్యాలతో(డిజెలు, ఈవెంట్ లు, బాణసంచాలు,వైదిక క్రతువు ను ఇబ్బంది పెట్టే ఫొటో షూట్ లు,బాచిలర్ పార్టీ పేరుతో మద్యమాంసాది పార్టీ లు మొదలైనవి) పెళ్ళి పందిరిని, మంటపాలంకృతమైన ముక్కోటి దేవతలను, సాక్షీభూతుడైన దిక్పాలకుడు అగ్నిహోత్రుని ముందుగా అవమానించి దేవతాప్రతినిధులు,సాక్షాత్తూ దైవాంశసంభూతులు అయిన పురోహితుని ధిక్కృతావమానాలు చేసే విధంగా ప్రవర్తించి, అవైదిక అకృత్యాలకు లక్షల్లో ఖర్చు చేసి పురోహితునికి అరకొర దక్షిణలిచ్చి,పైగా పంతులు డిమాండు చేసాడంటూ వీరిచ్చిన చిల్లర లకే దుష్ప్రచారాలు చేసి ఈ అకృత్యాల ఫలితంగా పెళ్ళి పెటాకులైనా,సంతానం కలగకపోయినా పురోహితుడు సరిగా  పౌరోహిత్యం చేయలేదంటూ మరీ దుష్ప్రచారాలు చేయడం ఈనాడు హిందువులలో బాగా ఫ్యాషన్ అయిపోయింది... ఇదే "వినాశకాలే విపరీత బుధ్ధిః"  కి భావం. 

      బాగుపడాలనుకునే వారు పెళ్ళిని సంప్రదాయబధ్ధంగా, పురోహితుని దైవంగా భావించి, పురోహితుడు అడిగి న దాని కంటే ఎక్కువ పారితోషికం ఇచ్చి(నిజానికి పెళ్ళి ఖర్చులలో అత్యధిక ధనం ఇచ్చిన నూ పురోహితుని విలువ కంటే తక్కువే అవుతుంది) మద్యమాంసాదులను పెళ్ళి పనులు ప్రారంభించే విఘ్నేశ్వర పూజ నాటి నుండి పెళ్ళిముగిసే16 రోజుల పండుగ అయ్యే వరకూ పూర్తిగా విసర్జించి ఇలా పురోహితుని వైదిక సూచనలతో వివాహ క్రతువు నిర్వహించుకొనగలరు.

*శుభమస్తు*

పంచాంగం 02.05.2024

 ఈ రోజు పంచాంగం 02.05.2024  Thursday 


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు చైత్ర మాస కృష్ణ  పక్ష: నవమి తిధి బృహస్పతి  వాసర: ధనిష్ఠ నక్షత్రం శుక్ల యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


నవమి రాత్రి 01:51 వరకు.

ధనిష్ఠ  రాత్రి 01:46 వరకు. 

సూర్యోదయం : 05:53

సూర్యాస్తమయం : 06:33


వర్జ్యం : ఉదయం 06:55 నుండి 08:25 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:06 నుండి 10:57 వరకు తిరిగి మధ్యాహ్నం 03:10 నుండి 04:01 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 03:58 నుండి సాయంత్రం 05:28 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.



శుభోదయ:, నమస్కార: