💎🌅 *_-|¦¦| శుభోదయమ్ |¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
👇 //---------- ( *భజగోవిందం* )---------// 👇
*శ్లో𝕝𝕝 కాతే కాంతా కస్తే పుత్రః*
*సంసారో యమతీవ విచిత్రః |*
*కస్య త్వం కః కుత ఆయాతః*
*తత్వం చింతయ తదిహ భ్రాతః | 8 |*
*భావం: నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా! ఆ తత్వాన్ని ఇక్కడే - ఈ దేహం లో ఉండగానే ఆలోచన చేయి*.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కాతే కాన్తా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః ॥
కస్యత్వం కః కుత ఆయాతః
తత్వం చిన్తయ తదిహ భ్రాతః !!భజ !!8*
*ప్రతి॥ తే = నీయొక్క; కాన్తా = భార్య; కా= ఎవరు?; తే ='నీయొక్క; పుత్రః = కుమారుడు; కః =ఎవడు?; అయం = ఈ; సంసారః = సంసారము; అతీవ = చాలా ఎక్కువైన; విచిత్రః = తమాషా అయినట్టిది; త్వం= నీవు; కస్య = ఎవరివాడివి?; కః = ఎవరవు అసలు? కుతః = ఎక్కడనుంచి; ఆయాతః = వచ్చినవాడవు; భ్రాతః= సోదరుడా!; తత్వం = ఈ తత్వమును; తదిహ = ఇక్కడకు, ఇక్కడనే; చిన్తయః = విచారించుము.*
భావం:-
నీ భార్య ఎవరు? నీ కుమరుడెవరు? ఈ సంసారమనేది చాలా విచిత్ర మైనది సుమా! నీ వెవరివాడవు? ఎక్కడినుంచి వచ్చావు? సోదరా! ఈ తత్వ విషయాన్ని గూర్చి విచారణ చేయుము.
వివరణ:-
కుటుంబం, బంధువులు, వారితో గూర్చిన బంధములు ఇవన్నీ వ్యక్తికి హితాన్నిచ్చేననేదాన్ని ఎవరూ కాదనలేరు. ఈ బంధం తన చుట్టూరా మాత్రమే కేంద్రీకరింపబడే స్వార్థం నుంచి వ్యక్తిని బయటకు లాగుతుంది. అలా అన్నామని ఈ బంధాన్ని పెంచుకుని ఊరుగున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఈ బంధాల పరిమితి చాలా చిన్నది. ఆ మాత్రం పరిధిలో కూలబడిపోతే చాలదు. వీటిని సరిపూర్తి చేసి ఆ పై విషయం విచారిద్దాం లెమ్మనుకుంటే కూడా చాలదు. అవి పరిపూర్తి కావటం అనేది మృగ్యమయిన విషయం. మగువ మగాడు కలిసి నివసించి ఒకరినొకరు ప్రేమ మర్యాద ఇచ్చిపుచ్చుకొని, దంపతులుగా జీవితం ఆరంభించి తర్వాత తల్లిదండ్రులుగా ఒకానొక ఉన్నత హోదాలో ఉండేవారై ఒకరినుంచి ఒకరు చాలా విషయాలను తెలుసుకోవలసినవి ఉంటాయి.
భార్యా భర్తలు ఒకరికొకరు సన్నిహితులై ఉంటారు, ఉండాలి. ఆ స్నేహంయొక్క నిజమైన అర్థం తెలిసి అలా నివసిస్తే వాళ్ళు ఎంతో మంచి శిక్షణను పొందిన వాళ్ళవుతారు. అయితే అలా అంతా సరియైన క్రమశిక్షణలో కాలం గడపరు. అందుకనే వారికి ఒకరి మీద ఒకరికి రాగద్వేషాలు అలముకొంటవి. సుఖంగా వుండాలని దేన్నైతే ముఖానికి రాసుకుంటామో అదే విషమై బాధిస్తున్నప్పుడెలాంటి పరిస్థితో ఈ దాంపత్యంలో కూడా అలాంటిదే సంభవిస్తూ ఉంటుంది. హిందూ ధర్మ శాస్త్రాల్లో భార్యా భర్తలు కలిసి వుండాలని నివసించాలనేది సిద్ధాంతమైన విషయం అందులో సందేహం లేదు. కాని ఆచార్యవర్యులేమన్నారంటే ఈ కలిసి ఉన్నప్పుడు ఇద్దరి మధ్యనూ కొద్దిగా ఖాళీ వుండవలెనన్నారు. ఒకరికి ఇంకొకరు లంపటంగా అతుక్కున్నట్లు ఒకరు లేకపోతే ఇంకొకరు బ్రతకలేని పరిస్థితిని తెచ్చిపెట్టుకోవద్దన్నారు. అది ఇద్దరికి భవ రోగాన్నిస్తుంది. కనుక అనారోగ్యకరమైనదే నన్నారు.
కుటుంబమనే సాధన ఉపకరణం. పరీక్షించుకోవటానికి సదవకాశం. తద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని ఉన్నతిలోనికి పెరగడానికి అనువైనదిన్నీ. కాని అది తనంత తానుగా వ్యక్తికి గమ్యం అని అనడానికి వీలులేదు. అసంగత్వంతో కుటుంబజీవితాన్ని నడిపించు కుటుంబం జీవితానికి ఒకానొక కళాశాల లాంటిది. అది ప్రధానమైన సాధనల ద్వారా మనిషి పొందదగిన గమ్యక్షేత్రమని మాత్రం పొరపాటు పడకూడదు.
వేదాంతములోని సూత్రాలు; వ్యక్తి మామూలు జీవితంలో ప్రవేశ పెట్టరానివయేటట్లయితే వేదాంతం ఒకానొక పుస్తకాల ఆదర్శము మాత్రమే, అయేది. ఎవరో భావలోకాల్లో విహరించే కవులు దానిని పాటలుపాడి శిల్పాన్ని చూపించవలసిందే. జీవితాన్ని సంస్కృతికి ఉత్తేజపరచదగిందిగా చెప్పలేము. జీవితం వంక చూద్దామంటే ఆలుమగలు ఉధృదమైన రాగపంకిలంలో ఇరుక్కుపోవటం సహజమనిపిస్తుంది. బాతుకు నీరెంత సన్నిహితమో మనసుకు ఈ “రాగ” మనేది అంత సన్నిహితమై వుంటుంది. నీటిని చూసి అది ఎలా కులుకుతూ అడుగులు వేసుకొంటూ వెళుతుందో అలాగే మనసుకూడా ఈ ప్రియమైన రాగము వైపుకు పరుగెడుతుంది. `అందువల్లనే వేదాంతమునకు అసంగత్వమనే స్థితిలోకి వ్యక్తి యెలా జొరబడవలెనో ఆ కీలకం చెప్పవలసిన అవసరం వుంది. ఆ కీలకం ఈ శ్లోకంలో చెప్పారు.
ఈ పైన చెప్పిన మోహమనే మురికి కుప్పకు తెలివైన విచారణమె ఒక గొడ్డలి వంటిది. మోహ ముద్గరమని ఈ భజగోవిందానికి ఇంకో పేరు అందుకనె కలిగింది. ఆ విచారణ చేసే పద్ధతి ఎలాంటిదో ఇక్కడ సూచింపబడింది. ఆచార్యుల వారిచేత విచారణ ఏమంటే నిన్ను/ నీవు ప్రశ్నించుకోవాలి. ఈ భార్య యెవరు? కుమారుడెవరు అని పరిశీలించి చూస్తే ఈ ప్రియురాలయిన ఇల్లాలు ఆమె తండ్రికి కుమార్తె మాత్రమే, పెళ్ళి అయ్యేవరకూ పెండ్లయినప్పుడు నీకు ఆమె ముడి పెట్టబడింది. పోనీ ఆ తరువాత అయిన ఎంతకాలం ఇలా? ఎవరుముందు ఎవరు వెనకో! వెళ్ళిపోయేదీ ఎవరికీ తెలియదు. ముందు నీవు వెళ్ళిపోయినా ఆమె వెళ్ళిపోయినా రెండో వారలాగే ఉండిపోతారు. ఈ కలిసి వుండడమనేది అస్థిరమని ధ్వని, మనిషి అతడి భార్యతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పుట్టినవాడు ఆమె అలాగే భర్తతో సంబంధం లేకుండా స్వతంత్రంగా జన్మించింది. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ సంబంధం చూచుకోకుండా ఎవరికి వారే వెళ్ళిపోతారు. పుట్టునుంచి చావువరకు వెళ్ళే ఈ యాత్రలో బ్రతుకు నుంచి మృత్యువు వరకూ వెళ్ళే ప్రస్థానంలో ఒకానొక శృంగార నాటకంలో ఒకళ్ళు మరొకళ్ళతో కలుస్తారు. కలిసి అలా కొంతకాలం ప్రయాణిస్తారు.
ఒకరి నొకరు సేవిస్తూనే ప్రయాణిస్తారు, గాక సహృదయులైన ఇద్దరు ప్రయాణీకులు బస్సులో ప్రయాణం చేసినట్లే ప్రయాణం చేస్తారు, ఈ స్నేహం ఏ ఒక్కరి గమ్యస్థానం - దిగవలసిన చోటు - వదలిపోతుంది. ఇలా విచారించి తర్కించినట్లయితే ఎవడుగాని ప్రపంచంతో ఎలాంటి సంబంధాన్ని పెట్టుకోవాలో సరియైన మనః పరిస్థితితో ఎప్పటికప్పుడెలా వుండాలో అది అర్థమవుతుంది.
ఆలాగే కుమారుని గురించి కూడా కొడుకయిన అతడు ఎలా వచ్చాడు. జీవితంలోకి, వచ్చినప్పటినుంచి అతడు అతడు పుట్టినప్పటి నుంచి నీవాడైనాడు. అంతకుముందు? గర్భస్థ పిండం, దానికి ముందు నీ శరీరంలో ఒక బీజంలా వున్నాడు. ఆ బీజం నీవు తినే భోజనం అరిగిన మీదట నీలో జనించింది. భోజనము భూమిలోంచి వచ్చింది. మట్టిలో వున్న పదార్థమేదో అనేక మార్పులు చెంది నీకు భోజనమై నీ సంతతి కొఱకు బీజమైన అప్పుడు పిండమై తరువాత బిడ్డ అయింది. ఈ బిడ్డ మట్టియొక్క ఆఖరి రూపమే- ఆ తరువాత సంగతి మాటటుంచితే అలాగే నిన్న నీవు తండ్రిగా యెలా అయినావని విచారణం చేసినట్లయితే నీవు కూడ మట్టియొక్క మరొకరూపంగా లభించినవాడవని అర్థమవుతుంది. కాకపోతే ఆ బిడ్డ కంటే కాలంలోనూ అవకాశంలోను మార్పిడి వున్నదనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఒక మట్టిగడ్డ యింకొక మట్టిగడ్డతో కలిసి రాగాన్ని పెంచుకుంటున్నది. పైనుంచి చూస్తే ఆ మట్టిగడ్డ లు చేసే పనిని చూచి ఎంత నవ్వుతాము? ఈ భ్రమ ఎంత శక్తివంతమైనది! పైన చెప్పినట్టు ఉన్నది వున్నట్లుగా చూచి గ్రహించటం మానేసి నాది నాదని వెంటపడే ఈ భ్రమకు యెంత శక్తివుంది! ఇదే మాయ!
ఊహాభరితమయిన ఈ జీవితం ఈ సంసారం - బుర్రలేనివానికి మహా ప్రమో దము ( మహా ప్రమాదం కూడ కావచ్చు) అవుతుంది. చాకచక్యంతో విషయ విమర్శనం చేస్తూ విచారణ చెయ్యాలి. "నేను" అనేది ఎవరికి చెందినట్టిదని విచారణ చెయ్యి. ఈ నేను ఇలా వుంటూనే వుండటమనేది ఏ దివ్యమయిన పదార్థము యొక్క దయా ప్రసరణమువల్ల కలిగింది? ఎక్కడికి ఇది పోయేది? ఈ భువి నుంచి పోతే ఇక ఈ ''నేను'' దిగే చోటేది?
నిజంగానే మనం ఎక్కడనుంచో వస్తూవుండి ఎక్కడకో వెలుతున్న వాళ్ళమే. అయితే ఇక్కడ యిప్పుడు మనకున్న పనేమిటి- కర్తవ్యమేమిటి? మనం పోతుంటే మనకు కాలికి, చేతికి, తగిలే, ఈ వస్తువులు జీవులు అనంతమైన సంఘటనలు జనసమూ హం యిలా వుంటే మనకుండవలసిన మనః పరిస్థితి ఎలాంటిది? ఇక్కడ ఈ దోవలో - ఎలా ప్రవర్తించాలి?
సోదరా! విచారించు ఈ విషయం విచారించు, శంకరులు ఒజ్జగా తన హోదాను చలాయించక పెద్దన్న చిన్నవానికి చెప్పినట్లు భ్రాతః అని సంబోధిస్తున్నారు కొందరు ఈ శ్లోకాన్ని ఈ చోట భ్రాంత అనికూడ చదువుతారు. ఒక వేళ అలా అన్నా అది కూడ ఎంతో సహజమైన పదముగా తోస్తుంది. పిచ్చివాడా అని అర్థం. భ్రాంతః అనే పదానికి బాహ్య ప్రపంచంలోని వస్తువుయై అంతులేని రాగాన్ని కల్పించుకొని మూఢుడై భ్రాంతి నొందినవాడు పిచ్చివాడు కాకేమవుతాడు? సరియైన పంథాలో నడవలేక ఆలోచించలేక పోయినవాడు జీవితంలో భ్రాంతి నొందినవాడే- పిచ్చి వాడేమరి!✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 944065 2774.
లింక్ పంపుతాము.
దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
🪷 ✍️🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి