🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *శతరుద్రీయము-50*
(వ్యాఖ్య: శ్రీ తురుమెళ్ళ మాధవ కుమార్)
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*చతుర్థానువాకము - 4 వ యజుస్సు*
*నమకనామాని : ఓం తస్కరాణాంపతయే నమః*
*నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః!*
ప్రత్యేకించి ఒక పనియంటూ కాక, ఏ పనినైనా చేయు సమూహముల యందున్న మీకు నమస్కారము♪. రుద్రులారా! అటువంటి సమూహములకు నాయకులైన మీకు నమస్కారము♪.
*వివరణ :*
నక్కలవాళ్లు, బొక్కలవాళ్లు, లంబాడీలు అంటూ కొండతెగలు కొన్ని ఇంకా ఇప్పటికీ ఉన్నాయి♪. వీళ్లు పదిపదిహేనుగురు కలిసి గుంపుగా తిరుగుతుంటారు♪. రైతులకు కుప్పనూర్పిళ్ళ సమయంలో కూలిపని చేసి పెడుతుంటారు, భవన నిర్మాణాలలో పనిచేస్తూంటారు♪. అన్ని పనులూ చేస్తూంటారు♪. అలాగే నిర్దుష్టమైన గమ్యం లేకుండా తిరిగే వాళ్ళని గూడా *వ్రాతులు* అంటారు♪. ఇటువంటివారికి ఉండే నాయకుడిని *వ్రాతపతి* అన్నారు♪.
(రేపు.... చతుర్థానువాకం 5 వ యజుస్సు)
*సశేషం.....*
❀┉┅━❀🛕❀┉┅━❀
*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి