2, మే 2024, గురువారం

వినాశకాలే విపరీత బుధ్ధిః"

 *హిందువులారా ఒకసారి గమనించండి*

       అకృత్యాలు, అఘాయిత్యాలతో(డిజెలు, ఈవెంట్ లు, బాణసంచాలు,వైదిక క్రతువు ను ఇబ్బంది పెట్టే ఫొటో షూట్ లు,బాచిలర్ పార్టీ పేరుతో మద్యమాంసాది పార్టీ లు మొదలైనవి) పెళ్ళి పందిరిని, మంటపాలంకృతమైన ముక్కోటి దేవతలను, సాక్షీభూతుడైన దిక్పాలకుడు అగ్నిహోత్రుని ముందుగా అవమానించి దేవతాప్రతినిధులు,సాక్షాత్తూ దైవాంశసంభూతులు అయిన పురోహితుని ధిక్కృతావమానాలు చేసే విధంగా ప్రవర్తించి, అవైదిక అకృత్యాలకు లక్షల్లో ఖర్చు చేసి పురోహితునికి అరకొర దక్షిణలిచ్చి,పైగా పంతులు డిమాండు చేసాడంటూ వీరిచ్చిన చిల్లర లకే దుష్ప్రచారాలు చేసి ఈ అకృత్యాల ఫలితంగా పెళ్ళి పెటాకులైనా,సంతానం కలగకపోయినా పురోహితుడు సరిగా  పౌరోహిత్యం చేయలేదంటూ మరీ దుష్ప్రచారాలు చేయడం ఈనాడు హిందువులలో బాగా ఫ్యాషన్ అయిపోయింది... ఇదే "వినాశకాలే విపరీత బుధ్ధిః"  కి భావం. 

      బాగుపడాలనుకునే వారు పెళ్ళిని సంప్రదాయబధ్ధంగా, పురోహితుని దైవంగా భావించి, పురోహితుడు అడిగి న దాని కంటే ఎక్కువ పారితోషికం ఇచ్చి(నిజానికి పెళ్ళి ఖర్చులలో అత్యధిక ధనం ఇచ్చిన నూ పురోహితుని విలువ కంటే తక్కువే అవుతుంది) మద్యమాంసాదులను పెళ్ళి పనులు ప్రారంభించే విఘ్నేశ్వర పూజ నాటి నుండి పెళ్ళిముగిసే16 రోజుల పండుగ అయ్యే వరకూ పూర్తిగా విసర్జించి ఇలా పురోహితుని వైదిక సూచనలతో వివాహ క్రతువు నిర్వహించుకొనగలరు.

*శుభమస్తు*

కామెంట్‌లు లేవు: