2, మే 2024, గురువారం

యోగవాసిష్ఠ రత్నాకరము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *హరి ఓం*

 *ఓం శ్రీ మహాగణాధిపతయే నమః* 

*ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః* 

*ఓం నమో వసిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి శుకాదిభ్యః*

 

. *🌹యోగవాసిష్ఠ రత్నాకరము🌹* 

*వైరాగ్య ప్రకరణము - 1వ అధ్యాయము* 

. *🌹రాఘవ వైరాగ్య వర్ణనము🌹*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *శ్రీ వాల్మీకి రువాచ :-*

0049


*1-146*

*మోహమాతంగమృదితా కలంకకలితాంతరా* 

*పరం ప్రసాదమాయాతి శేముషీసరసీ కథమ్‌* 


అజ్ఞానమగు ఏనుగు వలన కెలకబడి, మురికియైన బుద్ధియను సరోవరము ఏ విధముగ అత్యంత నిర్మలత్వమును బొందగలదు? 


*1-147*

*సంసార ఏవ నివహే జనో వ్యవహరన్నపి*

*న బంధం కథమాప్నోతి పద్మపత్రే పయో యథా*


మనుజుడు సంసార వ్యవహారములందు బాల్గొనుచున్నను తామరాకునందలి నీటిబొట్టువలె, నిర్లిప్తుడై యుండగల్గుట కుపాయమేమి? 


*1-148*

*అత్మవత్తృణవచ్చేదం సకలం కలయన్‌ జనః* *కథముత్తమతామేతి మనోమన్మథమస్పృశన్‌*  


ఈ సమస్త జగత్తును అంతర్దృష్టిచే ఆత్మగను, బహిర్దృష్టిచే తృణతుల్యము (తుచ్ఛము) గను గాంచుచు, మనస్సుచే కామాది వృత్తులను స్పృశించక ఇవ్విధమున మనుజుడు ఉత్తమత్వము నెట్లు పొందగలడు?


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

కామెంట్‌లు లేవు: