2, మే 2024, గురువారం

భగవద్గీత విశిష్టత

 *భగవద్గీత విశిష్టత*


లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది.


ఏమిటా విశిష్టత?


అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు  లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని 'జయంతి' గా జరుపుకుంటారు.అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల 'గీతాజయంతి' ని జరుపుకుంటారు.

ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేదు.


ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం?


సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో, 

కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనమును మోసుకొని ప్రవేశిస్తున్న తరుణంలో, ఆ అజ్ఞానపు గాడాంధకారాన్ని చీల్చుకుంటూ, మానవజాతిపై వెలుగులు విరజిమ్ముతూ  భగవద్గీత ఉదయించింది.


ఏముంటుంది ఈ భగవద్గీతలో?


ఏది తెలిస్తే మానవుడికి  ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో, ఏది ఆత్మ, పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో, ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో అదే ఉంటుంది.


నూనె రాస్తే రోగాలు పోతాయి. దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు. నన్ను నమ్మనివానిని చంపండి అనే ఉన్మాదం ఉండదు. నన్ను దేవుడిగా ఒప్పుకోనివానిని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు.


 భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితంపై ఆసక్తి పోతుందా?


భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు. గాండీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు. భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని   కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది.


 భగవద్గీత  శాస్త్రీయ గ్రంధమా? 


ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతని కోట్ చేసినవాళ్ళే. భగవద్గీతని మొదటిసారి  చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు  అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే.


ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే  ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి కదా. ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు.


కలియుగం లో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం. విదేశీయుల్లా కత్తి పట్టుకుని, రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు.


బ్రిటిష్ వాళ్లు, మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విధ్వంసం చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి.


వారు కొన్ని  వందల సంవత్సరాల పాటు  భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని,

ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా  కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని  కృష్ణభక్తులుగా మార్చారు.


ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగంతో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం.

A Best Collection from Brahmana Samaakya.

కామెంట్‌లు లేవు: