25, నవంబర్ 2020, బుధవారం

కార్తీకపురాణం 9 వ అధ్యాయము*

 **దశిక రాము**


*కార్తీకపురాణం 9 వ అధ్యాయము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*విష్ణు పార్షద, యమ దూతల వివాదము*


'ఓ యమ దూత లారా! మేము విష్ణు దూతలము వైకుంటము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు ' విష్ణు దూత లారా! మానవుడు చేయు పాపపున్యడులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధన౦జయాది వాయువులు,రాత్రి౦బవళ్లు సంధ్య కలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించు చుందురు. మా ప్రభువుల వారీ కార్య కలపములను చిత్ర గుప్తునిచే చూపించి ఆ మనిజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు.

వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారును, గోహత్య , బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు, పర స్త్రీ లను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను - గురువులను - బంధువులను- కుల వృతిని తిట్టి హింసి౦చు వారున్నూ, జీవ హింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం చొరత్వంచే భ్ర ష్టులగు వారును, యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును, చేసిన మేలు మరచిన కృత ఘ్నులును, పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ పాపాత్ములు. 


వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండి౦పుడని మా యమ ధర్మ రాజు గారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజా

మీళుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకు లోనై కుల భ్రష్టుడై జీవ హింసలు చేసి, కామాంధుడై వావివరసలు లేక, సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు? ' అని యడగగా విష్ణు దూతలు ' ఓ యమ కి౦కరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మ సుక్ష్మములు తెలియవు. ధర్మ సుక్ష్మములు లేట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును- అన్నదానము, కన్యాదానము, గోదానము , సాలగ్రామ దానము చేయువారును, అనాధ ప్రేత సంస్కాములు చేయువారును, తులసి వనము పెంచువరును, తటాకములు త్రవ్వి౦చువరును, శివ కేశవులను పూజి౦చు వారును సదా హరి నమ స్మరణ చేయువారును మరణ కాలమందు ' నారాయణా'యని శ్రీ హరిణి గాని, ' శివ ' అని శివుని గాని స్మరించు వారును, తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నమ స్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున" నారాయణా"అని పలికిరి.

అజా మీ ళుడు విష్ణు దూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యమొంది " ఓ విష్ణు దూతలారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములు గాని, ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్ర మాములు విడిచి కుల భ్ర ష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో " నారాయణా" యని నంత మాత్రమున నన్ను ఘోర నరక భాదలనుండి రక్షించి వైకున్తమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడు! నా పూర్వ జన్మ సుకృతము, నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది. " అని పలుకుచు సంతోషముగా విమాన మెక్కి వైకుంటమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలేక్కి భాద, కలిగించేనో, అటులనే శ్రీ హరి స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నోన్దేదారు. ఇది ముమ్మాటికినీ నిజము.


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*నవమద్యయము- తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.*

🙏🙏🙏


**ధర్మము-సంస్కృతి**

https://chat.whatsapp.com/LyeuNWbrRlW9fGDW4tOeNY


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95

🙏🙏🙏

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 పంచమస్కంధం యొక్క ప్రధామాశ్వాసం. -6


భరతుండు వనంబు జనుట 


ఇంకా శ్రీవత్సం, కౌస్తుభం, వనమాలల చేత అలంకరింపబడిన వాడు; సుదర్శనం మొదలైన ఆయుధాలను ధరించేవాడు, తన భక్తుల హృదయ పద్మాలలో నివసించేవాడు, పరమ పురుషుడు అయిన వాసుదేవుని పట్ల ఆ భరతుడు ఎల్లప్పుడు భక్తి ప్రపత్తులు కలిగి యాభై లక్షల వేల సంవత్సరాలు రాజ్యపరిపాలన సాగించాడు. తాత తండ్రుల కాలంనుండి తరతరాలుగా సంక్రమించిన ధనరాశిని తగినట్లు తన కుమారులకు పంచి ఇచ్చి అపార సంపదలు గల రాజసౌధాన్ని వదలిపెట్టి పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పుడు…

ఏ ఆశ్రమంలో విష్ణువు అక్కడి వాళ్ళను ఆదరిస్తూ ప్రత్యక్ష రూపంలో నిలిచి ఉంటాడో, సాలగ్రామాలకు ఆలవాలమైన గండకీనది ఏ ఆశ్రమ సమీపంలో ప్రవహిస్తూ ఉంటుందో అటువంటి ఆ రమణీయమైన పులహ ఆశ్రమంలో భరతుడు ఒంటరిగా ఉంటూ శ్రీహరిని నానావిధాలైన పువ్వులతో, చిగుళ్ళతో, తులసీదళాలతో, తీర్థజలాలతో, కందమూల ఫలాలతో, కమలాలతో నిత్యం గొప్పగా అర్చిస్తూ తనివితీరా సేవ చేస్తున్నాడు.అటువంటి హరిసేవ వల్ల అతనికి విషయవాంఛలు నశించాయి. శమ దమాది గుణసంపద అలవడింది. పరమపురుషుణ్ణి భక్తి భావంతో ఎడతెగకుండా భజిస్తుంటే అహంకారమనే ముడి విడిపోయి ఆనందానుభూతి కలిగింది. అతని మేను పులకించింది. కన్నులలో ఆనందాశ్రువులు పొంగిపొరలాయి. ఇష్టదైవమైన శ్రీహరి పాదపద్మాలను ధ్యానించడం వల్ల ప్రాప్తమైన భక్తియోగం కారణంగా అతని హృదయం పరమానందంతో నిండింది. ఆ ఆనందానుభవం అమృత సరోవరంలో అవగాహన చేసినట్లుగా అనిపించింది. ఆ అనుభూతితో భరతునికి తాను చేస్తున్న పూజకూడా తెలియనంత తన్మయత్వం కలిగించింది. ఈ విధంగా భగవంతుని సేవావ్రతంలో మునిగిపోయిన భరతుడు జింక చర్మం ధరించాడు. మంత్ర పూర్వకంగా మూడు వేళలా స్నానం ఆచరించాడు. నిత్యం స్నానం చేయడం వల్ల తల వెంట్రుకలు తడిసి వంపులు తిరిగి జడలు కట్టి రాగి రంగుతో మెరువసాగాయి. సూర్యమండల మధ్యవర్తి అయిన పరమేశ్వరుణ్ణి హిరణ్మయ పురుషునిగా భావిస్తూ భరతుడు ఇలా అన్నాడు. జీవులకు కర్మఫలాలను ప్రసాదించేవాడవు. కేవలం సంకల్పమాత్రాన ఈ లోకాలను సృష్టించావు. మరి నీవే ఈ లోకాలలో అంతర్యామివై ఉన్నావు. ఆనంద స్వరూపమైన బ్రహ్మాన్ని అందుకోవాలనే జీవులను నీ యందలి యోగశక్తితో ఎల్లప్పుడు కాపాడుతున్నావు. సూర్య మండలం మధ్యభాగంలో ప్రకాశిస్తూ సమస్త లోకాలలో నిండి ప్రకృతికి అతీతంగా ప్రకాశిస్తున్నావు” అంటూ ఆనందమయుడు, దివ్యమంగళ స్వరూపుడు అయిన భగవంతుని భరతుడు శరణు వేడాడు.అంత ఒకనాడు భరతుడు గండకీనదిలో స్నానంచేసి మూడు ముహూర్తాల కాలం నీటిలో నిలబడి ప్రణవం జపిస్తున్నాడు. అప్పుడు నిండు చూలాలైన లేడి ఒకటి నీరు త్రాగాలని ఒంటరిగా నదీ తీరానికి వచ్చింది. అది నీరు త్రాగుతుండగా ఆ నదీ సమీపంలో ఒక సింహం దిక్కులు పిక్కటిల్లే విధంగా భయంకరంగా గర్జించింది. పుట్టుకతోనే భయ స్వభావం గలిగిన లేడి ఆ ధ్వనిని విని అదిరిపడింది. ఆ ఆడజింక తత్తరపాటుతో దప్పిక తీర్చుకోకుండానే అమాంతం పైపైకిఎగిరి ఆవల గట్టుకు ఒక్క దూకు దూకింది. అలా అకస్మాత్తుగా కలిగిన భయంతో లంఘించడంలో దాని గర్భంలోని పిల్ల జారి నదీ జలాలలో పడింది. ఆందోళనగా ఒక్కసారిగా దూకటంలో తల్లి జింక ఆ నదీ తీరంలోని కొండరాతి మీద పడి ప్రాణాలు విడిచింది. అపుడు నదీ జలాలలో విలవిలలాడుతూ మునిగి తేలుతున్న లేడిపిల్లను చూచిన భరతుని హృదయం తల్లడిల్లింది. దయార్ద్రచిత్తుడై అతడా లేడిపిల్లను తన ఆశ్రమంలోనికి తీసికొని వచ్చాడు. ఆ బాలకురంగాన్ని ఎంతో గారాబంగా సాకడం మొదలు పెట్టాడు. దానిని లాలించడం పాలించడంలో, దానిని ముద్దుగా పెంచి పెద్ద చేయడంలో ఆసక్తుడై క్రమంగా భరతుడు తన నిత్యకృత్యాలైన అష్టాంగ యోగాలను, భగవంతుని పూజాకైంకర్యాలను మరిచిపోయాడు. క్రమక్రమంగా అతని నిత్యనైమిత్తిక క్రియాకలాపాలు ఒక్కటొక్కటే మూలబడ్డాయి.భరతుడు తన తపస్సు చెదరిపోవడాన్ని తెలిసికోకుండా యోగాభ్యాసానికి క్రమక్రమంగా దూరమయ్యాడు. ఆ జింకపిల్ల మీది గారాబంతో తన మనస్సులో ఇలా అనుకున్నాడు. పాపం! ఈ జింక పిల్లకు తల్లి లేదు. ఆప్తులు లేరు. దిక్కెవ్వరూ లేని కారణం వల్ల దీనిని ఇక్కడికి తీసుకొని వచ్చాను. నేనంటే ఎంతో ప్రేమతో నన్ను అంటిపెట్టుకొని తిరుగుతున్నది. అందుచేత నాచేత నయినంత వరకు దీనిని తప్పక కాపాడుతాను.శరణు కోరి వచ్చిన ఏ జంతువునైనా కనికరంతో కన్నెత్తి చూచి కాపాడటం కంటే మహాపుణ్యం మరేదీ లేదని మునీంద్రులు చెప్పారు.” 

అని భావించినవాడై భరతుడెంతో ఆసక్తితో, అనురాగంతో ఆ లేడిపిల్లను సాకడం మొదలు పెట్టాడు. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, అటు ఇటు తిరిగినపుడు, స్నానం చేసేటప్పుడు, సమిధలను పూలను పండ్లను ఆకులను దుంపలను ఏరి తెచ్చుకొనేటప్పుడు, నీరు తెచ్చుకొనేటప్పుడు, దేవతార్చన చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు అతడా బాల హరిణాన్ని తన ప్రక్కనే అట్టిపెట్టుకొనేవాడు. తోడేళ్ళు, నక్కలు మొదలైన క్రూరమృగాలు జింకపిల్లను ఏం చేస్తాయో అని దాని వెనువెంట అడవులకు వెళ్ళేవాడు. రానురాను ఆ జింకపై మమకారం ఎక్కువవుతుంటే దాన్ని భుజాలపై కెక్కించుకొనేవాడు. గుండెలపై పడుకోబెట్టుకొనేవాడు. ఒడిలో చేర్చుకుని బుజ్జగించేవాడు. నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించేటప్పుడు కూడా అప్పుడప్పుడు లేచి జింకపిల్ల ఏమయిందో అని చూచేవాడు. అది కనబడగానే మనసు కుదుట పరచుకొనేవాడు. ఒక్కొక్కప్పుడు ఆ లేడిపిల్లను దీవించేవాడు. నానాటికి ముద్దు మురిపాలతో పెంచుకుంటూ దానిమీద మోహం పెంచుకున్నాడు. ఆ సమయంలో…ఆ లేడిపిల్ల పరుగులు తీస్తూ, చెంగున దుముకుతూ, కొమ్ములతో విసురుతూ, అప్పుడప్పుడు దగ్గరికి వస్తూ, కాళ్ళతో త్రవ్వుతూ, గిట్టలతో గీరుతూ మారాం చేసేది. ఆ భరతుని తొడలపై పడుకొంటూ, భుజాలమీద ఎక్కి ఆడుకొనేది. ఆ జింకపిల్ల ఈ విధంగా తనపై బడి ఆట లాడుతూ ఉంటే భరతుడు సంతోషించేవాడు. ఒకనాడు అది ఆశ్రమ స్థలాన్ని విడిచి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు…

భరతుడు ఆ జింకపిల్ల కనిపించక పోయేసరికి మనసు చెదరిపోగా ధనం పోగొట్టు వానివలె దిగులు పడ్డాడు. అది ఎడబాసినందుకు బెంగతో మనస్సులో మాటిమాటికి జింకను తలచుకొంటూ దుఃఖించి ఇలా అన్నాడు.ఓ జింకపిల్లా! నీకు అడవిలో క్రూరమృగాల బెడద లేకుండా జాగ్రత్త పడ్డాను. అయినా నన్ను విడిచి పోయావా?” అని భరతుడు మనస్సులో ఆరాటపడి…

తల్లి చచ్చిన జింకపిల్ల దురదృష్టవంతుణ్ణైన నన్ను చేరి ఇప్పుడు విడిచిపోయింది. నేనేం చేయాలి? దానిని మళ్ళీ ఎలా చూస్తాను? చూచి ఎలా దానిని కాపాడుకొంటాను?

అయ్యో! ఈ ఆశ్రమంలో మొలిచిన గడ్డిపరకలను తిని నవనవలాడుతూ అటూ ఇటూ తిరుగుతున్న జింకను సింహం కొట్టి బాధించిందేమో?”ఈ విధంగా భరతుడు లేడిపిల్ల క్షేమంగా ఉండాలని కోరుకుంటూ “ అది ఎప్పుడు వచ్చి నన్ను సంతోషపెడుతుందో? రకరకాలైన తన నడకలతో నన్ను ఎప్పుడు మురిపిస్తుందో? నేను ధ్యానసమాధిలో ఉండగా కొమ్ములతో గోకేది. అలాంటి వినోదాలను మళ్ళీ ఎప్పుడు చూస్తానో? దేవుని పూజకై తెచ్చిన ద్రవ్యాలను తొక్కి వాసన చూసినప్పుడు నేను కోపంగా చూస్తే చప్పున చిన్నబిడ్డలాగా దూరంగా పోయి నిలబడి, నేను పిలిచినప్పుడు వచ్చి నా వెనుక నిలబడేది. దానికి ఇంతటి తెలివి ఎలా అబ్బింది? ఈ భూదేవి ఎంత పుణ్యం చేసుకుందో? ఇటువంటి జింకపిల్ల పాదస్పర్శ వల్ల ముక్తి కాములైన మునుల యజ్ఞవాటిక కావడానికి యోగ్యత సంపాదించుకుంది. ఆ జింకపిల్లను నేనెక్కడ వెదకాలి? భగవంతుడైన చంద్రుడు సింహం బారిన పడకుండా తల్లి, ఆశ్రయం లేని ఆ జింకపిల్లను తీసికొని పోయి పెంచుకుంటున్నాడేమో? పూర్వం నేను పుత్ర వియోగ తాపాన్ని చంద్ర కిరణాలతో శాంతింప జేసుకొనేవాణ్ణి. తరువాత ఈ జింకపిల్ల చంద్రకిరణాల కంటే చల్లనైన తన శరీర స్పర్షతో ఆ సంతాపాన్ని పోగొట్టింది” అనుకుంటూ ఎన్నో విధాలుగా జింకపిల్లను గురించి భావించి బాధపడుతున్న భరతుడు యోగభ్రష్టు డయ్యాడు. భగవంతుణ్ణి ఆరాధించడం మానుకున్నాడు. మృగజాతిలో పుట్టిన జింకపిల్ల మీద మోహం పెంచుకున్నాడు” అని శుకమహర్షి మళ్ళీ ఇలా అన్నాడు.

రాజా! పూర్వం భరతుడు మోక్షమార్గానికి ఆటంకమనే భావంతో విడువరాని కొడుకులు ఇల్లు మొదలైన వన్నీ వదలిపెట్టి తపస్వి అయ్యాడు. కాని ఇంతలో జింకపిల్ల తటస్థపడగా దానిని పెంచడం, లాలించడం, దాని కోరికలు తీర్చడంలో నిమగ్నుడైపోయాడు. కోడెత్రాచు ఎలుక కన్నంలో ప్రవేశించినట్లు వారింపరాని విఘ్నం అతనిలో చోటు చేసికొని భ్రష్టుణ్ణి చేసింది. ఎటువంటి వారికైనా విధిని దాటడం సాధ్యం కాదు. మహర్షులకైనా కర్మబంధాలను తప్పుకొనడం సాధ్యం కాదు. అటువంటప్పుడు సామాన్యుల సంగతి చెప్పేదేముంది?

ఈ విధంగా భరతుడు జింకపిల్ల గురించి బాధపడుతున్న సమయంలో అది తిరిగి వచ్చింది. దానిని చూసి అతడెంతో సంబరపడ్డాడు. అంతలో ఒకరోజు…


హరిణీగర్భంబున జనించుట 


భరతునికి తన చివరిరోజులు దగ్గర పడగా కన్నకొడుకును చూస్తున్నట్లు ఆ జింకవైపే ఆసక్తితో చూస్తూ దానినే తన మనస్సులో భావించుకుంటూ ప్రాణాలు విడిచి ఒక లేడి కడుపున పుట్టాడు. అతనికి పూర్వస్మృతి పోలేదు. ఈ విధంగా భరతుడు జింక కడుపులో పుట్టి కూడా భగవంతుణ్ణి ఆరాధించిన పూర్వ పుణ్యం కారణంగా తాను జింకగా పుట్టడానికి కారణం తెలిసికొని బాధపడి ఇలా అనుకున్నాడు. “రాజులు పొగడుతుండగా, దేవేంద్రునితో సమానమైన వైభవాన్ని అనుభవించి, కొడుకులను రాజులుగా చేసి, మునులు నన్ను రాజర్షి అని గౌరవించగా తపస్వినై ఈ జింకపిల్ల మీద మోహాన్ని పెంచుకొని, విధం చెడి సాటి యోగులలో భ్రష్టుణ్ణి అయ్యాను. ఈ విధంగా హరికథలను వినడం, హరిని తలచుకొనడం, హరిని కీర్తించడం, హరి పూజ చేయడం, హరి భక్తులను అనుసరించడం మొదలైన సత్కర్మలలో క్షణం తీరిక లేని నాకు జింకపిల్ల వల్ల విఘ్నం కలిగింది. మోక్షానికి దూరమయ్యాను” అని లోలోన బాధపడి, తల్లియైన జింకను వదలి, కాలాంజన పర్వతాన్ని విడిచి దట్టమైన సాల వృక్షాలచేత నిండిన సాలగ్రామ సమీపంలో ఉన్న పులస్త్య పులహాశ్రమాలకి చేరుకున్నాడు. ఆ ఆశ్రమాలలో శాంత స్వభావులైన మునులున్నారు. అది ఒక భగవత్ క్షేత్రం. అక్కడికి వచ్చి తన హరిణ దేహాన్ని వదలిపెట్టడానికి తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఎవరితోను సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటూ ఎండిన ఆకులు, గడ్డిపరకలు, తీగదుబ్బులు తింటూ తన జింక జన్మకు కారణమైన ఆ నదీ తీర్థంలోనే బ్రతుకు ముగించాలని కోరుతూ గడిపి చివరకు శరీరాన్ని విడిచాడు” అని శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పి ఇంకా ఇలా అన్నాడు.


విప్రసుతుండై జన్మించుట 


మహారాజా! భరతుడు లేడి దేహాన్ని వదలిపెట్టి తరువాతి జన్మలో పరిశుద్ధుడు, మహానుభావుడు, ఓర్పు, ఇంద్రియనిగ్రహం, గొప్ప తపస్సు, వేదాధ్యయనంలో నిష్ఠ మొదలైన సద్గుణాలు కలవాడు, నీతికోవిదుడు అయిన ఆంగిరసుడు అనే బ్రాహ్మణునికి పుత్రుడై జన్మించాడు. పుట్టినది మొదలు సంసార బంధాలకు దూరంగా ఉన్నాడు. కర్మబంధాలను త్రెంచేవాడు, సర్వేశ్వరుడు, అచ్యుతుడు, జననం లేనివాడు అయిన హరి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ, ఆయన కథలను వింటూ మళ్ళీ ఎటువంటి ఆటంకం రాకుండా ఆయనను సంస్తుతిస్తూ యశోభరితుడై కాలం గడపసాగాడు. ఆ ఆంగిరసునికి పెద్ద భార్యకు తొమ్మిది మంది కుమారులు, చిన్న భార్యకు ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు. పరమ భాగవతుడు, గొప్ప రాజర్షి అయిన భరతుడు తన హరిణ శరీరాన్ని విడిచి ఈ జన్మలో ఆ బ్రాహ్మణుని చిన్న భార్య కుమారుడై జన్మించాడు. ఇతరులతో సాంగత్యం జన్మపరంపరలకు కారణమౌతుందని భయపడిన భరతునికి శ్రీహరి అనుగ్రహం వల్ల పూర్వజన్మ స్మృతి కలిగింది. అందువల్ల అతడు బంధవిముక్తి కోసం ఉన్మత్తుడుగా, జడుడుగా, అంధుడుగా, చెవిటివాడుగా లోకులకు కనిపిస్తూ జీవితం గడుపుతున్నాడు. అప్పుడు…తండ్రి అయిన ఆంగిరసుడు తన కుమారుడు భరతుని ఎంతో గారాబంగా పెంచాడు. పుట్టు వెంట్రుకలు తీయించడం మొదలైన సంస్కారాలు చేయించాడు. కొడుకు మీది మోహంతో నిత్యం శౌచ సదాచారాలు నేర్పాడు. అవి తనకు ఇష్టం లేకున్నా భరతుడు విధేయతతో వాటిని నేర్చుకున్నాడు. ఈ విధంగా బ్రాహ్మణ కుమారుడైన భరతునికి కర్మలంటే ఆసక్తి లేకపోయినా, బోధించేవాడు తండ్రి కనుక వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రి దగ్గర ప్రణవం, వ్యాహృతులతో కూడిన గాయత్రి మంత్రోపదేశం పొందాడు. ప్రతి సంవత్సరం తప్పకుండా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో ఇతరులతో కలిసి వేదాధ్యయనం చేసాడు. తండ్రి కుమారునకు శిష్టాచారం నేర్పాలనే లోకాచారం మేరకు తన కుమారుడైన భరతునికి అతని తండ్రి శౌచవిధి, ఆచమనవిధి, అధ్యయనవిధి, వ్రతవిధి మొదలైన నియమాలను, అగ్ని ఆరాధనం, గురు శుశ్రూష వంటి సత్కార్యాలను నేర్పాడు. అయినా కుమారునికి వాటిపట్ల అభినివేశం లేకుండటం గుర్తించి తన ప్రయత్నం యావత్తూ వ్యర్థమయిందని, తన కోరిక నెరవేరలేదని నిరాశ పడ్డాడు. అప్పుడు…ఈ విధంగా తన కుమారునికి సదాచారాలు నేర్పే ప్రయత్నం చేసి కొంతకాలం సంసార జీవితం సాగించి ఆ విప్రుడు అకస్మాత్తుగా పరలోకగతు డైనాడు. ఆ తరువాత…తల్లి తండ్రితో సహగమనం చేయగా, అవినీతిపరులైన సవతి తల్లి కొడుకులు భరతుని గొప్పతనాన్ని తెలుసుకోలేక అతనిని శాస్త్రవిద్యలను చదువనీయలేదు. ఈ విధంగా బ్రాహ్మణ కుమారుడైన భరతుని సవతితల్లి కొడుకులు వేదవిద్యలు చదువనీయకుండా ఇంటిపనులు చేయడానికి నియమించగా…భరతుడు వారు చెప్పిన పనులన్నీ కాదనకుండా పనులలో ఏమాత్రం ఏమరుపాటు లేకుండా చేస్తున్నాడు. కాని ఆ పనులపట్ల అతనికి ఆసక్తి మాత్రం లేకపోయింది.ఈ విధంగా భరతుడు ఇంటిపనులు చేస్తూ ఉండగా మూఢులు, పశుప్రాయులు అయిన జనుల చేత పిచ్చివాడు, మొద్దు, చెవిటివాడు అని పిలువబడుతూ, అందుకు తగినట్టుగానే వారితో మాట్లాడుతూ వారి ఆజ్ఞల మేరకు నడుకునేవాడు. వెట్టిపని, కూలిపని, భిక్షాటన మొదలైనవి చేస్తూ కాలం గడుపుతూ…భరతుడు షడ్రసోపేతమైన మృష్టాన్నమైనా ఇష్టంగానే తినేవాడు. అంతేకాని రుచులకోసం అఱ్ఱులు చాచేవాడు కాదు. ఆ బ్రాహ్మణుడు నిత్యం ఆత్మానందాన్ని పొందుతూ బాహ్యమైన సుఖ దుఃఖాలపైన, దేహం పైన శ్రద్ధ లేకుండా ఉండేవాడు. చలి, వేడి, గాలి, వాన, ఎండలకు లొంగి శరీరం మీద బట్ట కప్పుకోకుండా, ఆబోతు లాగా బలిసి గట్టిపడిన దేహంతో కటిక నేలపై పడుకునేవాడు. మట్టికొట్టుకున్న మాణిక్యంలాగా ప్రకాశిస్తూ బ్రహ్మవర్చస్సుతో కనిపించేవాడు. మాసిన బట్టను నడుముకు చుట్టుకొని, మడ్డి పట్టిన యజ్ఞోపవీతం కలిగి ఉండేవాడు. అజ్ఞానులైన జనులు అతనిని వీడు వేషానికి మాత్రమే బ్రాహ్మణుడని, తెలివితక్కువవాడని అనుకునే విధంగా తిరిగేవాడు. ఏదయినా పని చేసి భరతుడు ఇతరులనుండి ఆహారాదులను తీసుకొనేవాడు కాని ఉచితంగా స్వీకరించేవాడు కాదు. అప్పుడు స్వంత మనుష్యులైన సవతితల్లి కొడుకులు భరతుణ్ణి వ్యవసాయపు పనులలో నియమించారు. ఊక, తవుడు, తెలికపిండి, పొట్టు, మాడిపోయిన పెచ్చులు ఏది పెట్టినా అమృతంగా భావించి తింటూ పొలానికి కాపలా కాస్తుండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు…


 విప్రుడు బ్రతికివచ్చుట 


భరతుడు ఉంటున్న నగరానికి నాయకుడైన భిల్లరాజుకు పిల్లలు లేరు. సంతానం కోసం కాళికాదేవికి నరబలి ఇవ్వడం కోసం ఒక మనుష్యుణ్ణి వెంట బెట్టుకొని పోతుండగా ఆ బలిపశువు తప్పించుకొని పారిపోయాడు. అప్పుడు సేవకులు…(భటులు) ఎంత వెదకినా ఆ వ్యక్తి కనిపించలేదు. చేలో ఒకచోట వీరాసనం వేసికొని పొలానికి కావలి కాస్తున్న బ్రాహ్మణ యోగి భరతుని చూచి నరబలికి తగినవాడని భావించి పట్టుకున్నారు. ఆ విధంగా సేవకులు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని కాళికాలయానికి తీసికొని వెళ్ళారు. తలంటి పోయడం మొదలైన బలి సంస్కారాలు చేశారు. ఈ విధంగా భరతుణ్ణి అభ్యంజన స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి గంధం, పుష్పాలు, ఆభరణాలు, అక్షతలు మొదలైన వాటితో అలంకరించారు. మృష్టాన్నాదులు తినిపించారు. పూలదండలు, పేలాలు, చివుళ్ళు, పండ్లు మొదలైన ఉపహారాలు సమర్పించారు. డప్పులు మొదలైన పంచ మహావాద్యాలను మ్రోగించారు. బలిపశువును కాళికాదేవి ఎదుట కూర్చోబెట్టారు. ఆ భిల్లరాజు నరబలి ఇచ్చి ఆ రక్తంతో భద్రకాళిని సంతోష పెట్టాలని భావించి, కాళికా మంత్రంతో మంత్రితమైన భయంకరమైన ఖడ్గాన్ని ధరించి తన కోరిక తీర్చుకొనడానికి ఆ భరతుణ్ణి హింసించడానికి సిద్ధపడగా…సర్వజీవరాసులకు మిత్రుడు, పరబ్రహ్మ స్వరూపుడు, వైరభావం లేనివాడు అయిన భరతుడి తేజస్సును చూచి భద్రకాళి భయపడి వణికిపోతూ, భరింపరాని కోపం ముప్పిరి గొనగా హుంకారంతో అట్టహాసం చేసింది. పాపాత్ములు, దుష్టులు, రాజోగుణ తామస గుణాల ప్రేరణతో బ్రాహ్మణుని హింసించే బోయరాజు మీద, అతని సేవకుల మీద విజృంభించింది. వారి తలలను నేల కూల్చింది. నాయకుడైన భిల్లరాజు శిరస్సు చేత పట్టుకొని ఆడుతూ పాడుతూ ఆనంద తాండవం చేసింది.బ్రాహ్మణులలో విష్ణువు ఉంటాడు. అందువల్ల లోకంలో ఎవరైనా సరే వారికి కీడు తలపెడితే తప్పక చెడిపోతారు. ఇంకా…ఆ బ్రాహ్మణ కుమారుడైన భరతుడు ఏమాత్రం భయపడకుండా తనను చంపడానికి వచ్చినవారిలోను, కత్తిలోను, కాళికాదేవిలోను అచ్యుత భావాన్నే ఉంచి. పద్మాక్షుడైన విష్ణువును మనస్సులో నిల్పుకొని, ఏమాత్రం అనుమానం లేకుండా నిశ్చలంగా ఉన్నాడు.తరువాత బ్రహ్మణ శ్రేష్ఠుడైన భరతుడు కాళికాలయం నుండి బయలుదేరి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి కాపలా కాస్తున్నాడు.

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఇరవైయవ శ్లోక భాష్యం - ఎనిమిదవ భాగం


ప్రేమగా ఐక్యమవడంలో నున్న మహదానందము కొంతకాలం ఎడబాటు అనంతరం జరిగితే చాలా అనుభవం లోకి వస్తుంది. ఇద్దరు విడిపోయిన తరువాతనే కదా కలవడం సంభవిస్తుంది. అసలు ఎప్పుడూ విడిపోకపోతే కలవడంలో ఉన్న ఆనందం ఎలా తెలుస్తుంది. అందువలననే అద్వైతస్థితి శివశక్తులుగా, కామేశ్వరీ కామేశ్వరులుగా, సృష్టిగా పిల్లలుగా విడిపోయింది. మరో రకంగా చూస్తే ప్రేమ ఆప్యాయతలను అనుభవంలోకి తెచ్చుకోవడానికి మూలకారణమైన పరబ్రహ్మ ఆ తెలుపు - ఎఱుపుగా అయింది. అందువలననే ఎఱుపు శృంగార భావానికి ప్రతీకగా చెప్పబడుతోంది.  


ఈ ప్రపంచ సృష్టికి మూలం ఎఱుపు. కోరికలు లేని అద్వైత స్థితి కోరికచే ఉత్సాహపరచబడింది. అది ఈ సృష్టికి ప్రధాన కారణమయింది. అందువల్లనే ఈ సృష్టి ఎరుపు రంగుగా చెప్పబడుతోంది. సృష్టి కార్యాన్ని నిర్వహించే చతుర్ముఖ బ్రహ్మ ఎరుపురంగు. రక్తప్రసారం జరుగుతున్నంత కాలమే జీవం ఉంటుంది. ఈ నెత్తురు ఎటుపు. అసలు సంస్కృతంలో ఎటుపకు రకవరమని పేరు. కవులేమి చేస్తారు. కోరికతో ఒక గీతం సృజిస్తారు. ఆ అనుభవం పంచడం ద్వారా తన శ్రోతలతో ఒక రకమైన ఐక్యతను సాధిస్తారు. అందువలననే  కవితా శక్తి ఎఱుపుగా అర్థం చేసుకోబడుతుంది. 


దయ అనేది ప్రేమ యొక్క పరిణత స్థితి. పరమాత్మ నుండి ప్రవహించిన ఉన్నత శ్రేణికి చెందిన ప్రేమభావమే దయ. అందువలననే సౌందర్యలహరి 93వ శ్లోకంలో ఆచార్యుల వారు శంభుడనే వర్ణరహితమైన పరబ్రహ్మ ప్రపంచాన్ని రక్షించడానికి అరుణ వర్ణాన్ని పొందారని అభివర్ణిస్తారు. ఆయన తన కరుణ వలన అరుణ అయినారు. అంతేకాదు. ఆ రక్షణ కార్యాన్ని జయవంతంగా నిర్వహించారు. 


“జగత్రాతుం శంభోర్ణయతి కరుణా కాచిదరుణా" - అంతకు ముందు శ్లోకంలో ఆచార్యుల వారు “అమ్మా! నీ అరుణకాంతి శుద్ధ స్ఫటిక సంకాశమైన పరమేశ్వరునిపై పడి ఆయనను శృంగారమూర్తిగా చేస్తోంది” అంటారు.


మనకు సత్త్వం తెలుపు, రజస్సు ఎఱుపు అని తెలుసు. సత్త్వం కంటే రజస్సు తక్కువైనదని కూడా తెలుసు. అయితే ఇక్కడ ఎరుపును ఇంత గొప్పగా చెప్పటం దేనికి? ద్వైత ప్రపంచానికి చెందిన ప్రేమ అనే , లక్షణానికి ఇద్దరు వ్యక్తులు కావలసి వస్తుంది. శుద్ద ధవళము, సాత్త్వికము, అద్వైతము అయిన బ్రహ్మము నుండి ప్రేమ ఆవిష్కరించ బడినపుడు, అది ఉన్నతమైన రాజసిక అరుణంగా అవుతుంది.


సాత్త్వికస్థితిలో శాంతిగా ఉండటంలో సాధా రణంగా వైయక్తికమైన జీవాత్మ ఆనందాన్ని పొందు తుంది. ఒక వ్యక్తి రాజసిక ప్రవృత్తిలో కార్యమగ్నుడై ఉన్నప్పుడు ప్రశాంతత కొరవడుతుంది. మరి పరమశాంతుడైన పరమాత్మ విషయంలో మాత్రం ప్రపంచ వ్యవహారంలో ఉన్నప్ప టికి శాంతి భంగమవదు. స్పటికమును పోలిన ఆయన నిజ రూపం అలానే ఉంటుంది. ఎఱుపు ఆ స్పటికంలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఆయన విషయంలో మాత్రం పతితమవడమనేది ఉండదు. మనం మామూలు రజోగుణం నుండి ఉత్కృష్ట స్థాయికి చెందిన రజోగుణం ఆవిష్కరింప చేసుకోవాలి. అప్పుడు పరమేశ్వరుడు రజోగుణం యొక్క ఉన్నతమైన స్థితి అయిన దయా, ప్రేమలతో మన ప్రయత్నమునకు తోడై త్రిగుణాతీతమైన స్థితికి చేరడానికి చేరడానికి దోహదం చేస్తాడు. 


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కాశీ_ఖండం

 **దశిక రాము**


**కాశీ_ఖండం**


 PART-15


కవిసార్వభౌముడైన  శ్రీనాధుని రచన


తర్వాత సూర్య లోకానికి చేరుకొన్నాడు శివ శర్మ .సూర్య లోక ము తిమ్మిది యోజనాల విస్తీర్ణం కలది .విచిత్రాలైన ఏడు గుర్రాలు ,ఒకే చక్రం ఉన్న రధం పై అనూరుడు సారధి గా సూర్యుడు నిత్య సంచారం చేస్తూంటాడు .క్షణ కాలం లోనే ఆవిర్భావ ,తిరోభావాలను పొందే సూర్యుడు ప్రత్యక్ష వేద పురుషుడు .ఆదిత్యుడే సాక్స్శాత్తుబ్రహ్మ .సూర్యుని వల్లనే సకల జీవరాశులు ఆహారాన్ని సంపాదిన్చుకొంటున్నాయి .ప్రత్యక్ష సాక్షి ,కర్మ సాక్షి .గాయత్రీ మంత్రం తో సకాలం లో వదల బడిన అర్ఘ్యం నశించదు అది మూడు లోకాల పుణ్యాన్ని అందిస్తుంది .సూర్యోపాసన చేసే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ,మిత్ర ,పుత్ర ,కలత్రాలు అష్ట విధ భోగాలు స్వర్గ మోక్షాలు కలుగుతాయి .

ఆస్టా దశ విద్యల్లో మీమాంస గొప్పది .దాని కంటే తర్కం ,దాని కంటే పురాణం గొప్పవి .వీటి కంటే ధర్మ శాస్త్రం ,వాటికంటే వేదాలు వేదం కంటే ఉపనిషత్తులు వీటికంటే గాయత్రీ మంత్రం గొప్పవి .అది ప్రణవ సంపుటి .గాయత్రి మంత్రం కంటే అధిక మైన మంత్రం మూడు లోకాలలోనూ లేదు .గాయత్రి వేద జనని .గాయత్రి వల్ల బ్రాహ్మణులు జన్మిస్తున్నారు .తన మంత్రాన్ని ఉపాశించే వారిని రక్షిస్తుంది కనుక గాయత్రి అని పేరు .సూర్యుడు సాక్షాత్త్ వాచ్యుడు .గాయత్రి సూర్యుని గూర్చి చెప్పే వాచకం .

గాయత్రి మంత్రం చేత రాజర్షి విశ్వా మిత్రుడు బ్రహ్మర్షి అయాడు .గాయత్రియే విష్ణువు ,శివుడు ,బ్రహ్మా .అమ్శుమాలి అని పిలువ బడే సూర్యుడు దేవత్రయ స్వరూపుడు .అన్ని తేజస్సులు దివాకరునిలో ఉన్నాయి .ఆయనే కాల స్వరూపుడు, కాలుడు కూడా .తూర్పున ఉదయించి సమస్త విశ్వాన్ని ధరించే విశ్వ సృష్టికర్త .పడమర దిశ లో సర్వతోముఖుడై కనీ పిస్తాడు . ఉత్తరాయణ ,దక్షిణాయణ పుణ్య కాలాలో షడతీతుల్లో ,విష్ణు పంచకం లో ఎవరు మహా దానం చేస్తారో పిత్రుక్రియలు నిర్వ హిస్తారో ,వారు సూర్య సమాన తెజస్కులై ,సూర్య లోకం లో నివ శిస్తారు .ఆదివారం సూర్య గ్రహణం నాడు దానం చేస్తే ఉత్తమ లోక ప్రాప్తి . PART-15🕉️🙏🏻🚩

🙏🏻ప్రతి హిందువు చదివి బంధుమిత్రుల చేత చదివించి శ్రీ ఉమామహేశ్వర కృపకు పాత్రులు కాగలరు🙏🏻

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

https://chat.whatsapp.com/D9gWd7SgdmG2Rbh7b3VXl9


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/KCfWMHlFNsM1PTptFf2RwR

🙏🙏🙏

*భ ర్తృ హ రి శ్లో కం* .

 *భ ర్తృ హ రి శ్లో కం* .


*భోగే రోగభయం , కులే చ్యుతిభయం , విత్తే నృపాలాద్భయం , మానే దైన్యభయం , బలే రిపుభయం , రూపే జరాయా భయం , శాస్త్రే వాదభయం , గుణే ఖలభయం , కాయే కృతాన్తాద్భయం , సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం , వైరాగ్యమేవాభయం* .


*భోగములు అనుభవించు వాడికి రోగమంటే భయం , కులములకు భ్రష్టత్వమంటే భయం , ధనవంతునికి ప్రభుత్వమంటే భయం , అభిమానవంతులకు దీనస్థితి అంటే భయం , బలవంతునికి శత్రువంటే భయం , రూపం కలవానికి  ముసలితనమంటే భయం , శాస్త్రం చదివిన వానికి ప్రతివాది అంటే భయం , గుణవంతునికి దుష్టుడంటే భయం , ఈ శరీరమునకు యముడంటే భయం* .

*ఈ లోకంలో భయములేని వస్తువులే లేవు . భయములేనిది ఒక్క వైరాగ్యము మాత్రమే* ! .

హరి యవతారములు

 హరి యవతారములు 


ఖగవాహను తనయుని కడ 

నిగమంబులు దొంగలించి నీరధి జేరన్ 

తెగవేసెను యా సోమకు 

జగపతి శ్రీ విష్ణుమూర్తి జగముల గావన్ 


సురలసురులు సుధకొరకును 

తరియించెడి తరుణమందు సాగరమందున్ 

గిరి క్రుంగగ పరమేశుడు 

కరుణను జూపించి మోయ  కఛ్చప మయ్యన్ 


కడు క్రూరుడు కనకాక్షుడు 

పుడమిని వడితోడ  బట్టి పోడిమితోడన్ 

కడలిలొ ముంచగ విష్ణువు 

వడితో  వధియించె నతని వరలియు కిటిగన్ 


హరి ఎక్కడ ? చూపించుము 

హరియించుదు ననుచు బలుకు హాటకకశిపున్ 

హరియించను హరి యంతట 

నరహరి రూపంబు దాల్చి నఖముల జంపెన్ 


బలిదనుజుని  మదమణచగ

పలు యమరులమొరలు వినియు పటు వటువుగనూ 

నిలమూడడుగుల నడిగియు 

పలు లోకము లెల్ల గొలిచె పాదము తోడన్ 


అరయగ రజ తమ గుణముల 

ధరనేలుచు బ్రతుకు చున్న దర్పపు నృపులన్ 

నిరువది మారులు దిరిగియు 

పరశువుతో నరికె విష్ణు భార్గవు డయ్యున్ 


వరబలుడగు దశకంఠుని 

ఖర ధూషను కుంభకర్ణు కడతేర్చుటకున్ 

నరునిగ బుట్టియు విష్ణువు 

ధరణిజపతి రాము డయ్యె ధరపులకింపన్ 


గోపాలునిగను బుట్టియు 

పాపాత్ముని కంసు జంపి పార్థుని సఖుడై 

"గో" పాలుడు శ్రీవిష్ణువు 

కాపాడెను ధర్మ నిరతి ఘనకృష్ణుండై 


✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

_*శ్రీ శివ మహాపురాణం - 10 వ అధ్యాయం*_

 _*శ్రీ శివ మహాపురాణం - 10 వ అధ్యాయం*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



_*పంచకృత్యములు - ప్రణవము - పంచాక్షరి*_



☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️



*బ్రహ్మవిష్ణువులిట్లు పలికిరి -*


ప్రభో!మాకు సృష్టి మొదలగు ఐదు జగత్కార్యముల లక్షణమును చెప్పుము .


*శివుడిట్లు పలికెను -*


ఈ నా కర్తవ్యముల జ్ఞానము రహస్యమైనది. అయిననూ, మీకు కృపతో చెప్పెదను . ఓ బ్రహ్మ విష్ణువులారా! సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహములను ఐదు జగత్కార్యములు నాకు నిత్యసిద్ధములు . సంసారము యొక్క ఆరంభము సర్గము ఆరంభింపబడిన జగత్తు స్థిరముగా మనుట స్థితి. జగత్తు యొక్క వినాశము సంహారము. జీవుల ప్రాణోత్క్రమణము తిరోభావము . జీవుల మోక్షము అనుగ్రహము. ఈ ఐదు నా కార్యములు. ఇతరులు ఈ కార్యముల ననుష్ఠించుట, గోపురము మీది బొమ్మ గోపురమును మోయుట వంటిది .


సర్గము మొదలుకొని నాలుగు కృత్యములు సంసారమును విస్తరింపజేయును. మోక్షహేతువగు ఐదవ కార్యము నా యందు నిత్యము స్థిరముగ నుండును . నా భక్తులీ ఐదు కార్యములను పంచభూతములలో దర్శింతురు. భూమి యందు సృష్టి, నీటి యందు స్థితి, అగ్ని యందు సంహారము , వాయువు నందు తిరోభావము, ఆకాశము నందు అనుగ్రహము గలవు. సర్వమును భూమి సృష్టించును. సర్వమును జలము వర్థిల్లజేయును . అగ్ని సర్వమును నశింపజేయును. వాయువు ప్రాణములను గొనిపోవును. ఆకాశము అనుగ్రహరూపము అని పండితులు తెలియనగును .


ఈ ఐదు కార్యముల భారమును వహించుటకై నాకు ఐదు ముఖములు గలవు. నాల్గుదిక్కులలో నాల్గు ముఖములు, వాటి మధ్యలో ఐదవ ముఖము గలవు . కుమారులారా ! మీరు తపస్సు చేసి, సంప్రీతుడనైన నా నుండి సృష్టి స్థితులనే రెండు కార్యములను నిర్వర్తించు భాగ్యమును పొందియున్నారు . అదే విధముగా, రుద్ర మహేశులు తరువాతి రెండు కృత్యములను నిర్వహించుచున్నారు. అనుగ్రహమనే ఐదవ కృత్యము నాకు తక్క మరియొకనికి పొంద శక్యము కాదు . ఈ పూర్వకాలీన వృత్తమును అంతయూ మీరిద్దరు కాలక్రమములో విస్మరించినారు. కాని, రుద్రమహేశులు ఈ సత్యమును విస్మరించలేదు . వారిద్దరికి రూప, వేష, కార్య, వాహన, ఆసన, ఆయుధాదులలో నాతోటి సామ్యమును కల్పించినాము .


వత్సలారా! నాధ్యానమును వీడుట వలన మీకీ అజ్ఞానము కలిగినది. నా జ్ఞానము ఉన్నచో ఇట్టి గర్వము కలుగకపోగా, మహేశుని వంటి రూపము కలుగును . కావున మీరీ పైన నా జ్ఞానము సిద్ధించుట కొరకై, ఓంకారమనే పేరు గల, గర్వమును పోగొట్టే, నా మంత్రమును జపించుడు . నేను పూర్వము సర్వమంగళ ప్రదమగు, ఓంకారమనే నా మంత్రమును ఉపదేశించియుంటిని. ఓంకారము మున్ముందు నా ముఖము నుండి పుట్టెను. అది నన్ను బోధించును . ఈ ఓంకారము వాచకము నేను వాచ్యుడను. ఈ మంత్రము నా స్వరూపమే. దానిని నిత్యము స్మరించుట నన్ను స్మరించుట యగును .


ముందుగా ఉత్తర ముఖము నుండి ఆకారము, పశ్చిమ ముఖము నుండి ఉకారము, దక్షిణముఖము నుండి మకారము, మరియు తూర్పు ముఖము నుండి బిందువు , మధ్య ముఖము నుండి నాదము పుట్టి ఈ మంత్రము ఐదు విధములుగా విస్తరించి, మరల ఐదు కలిసి ఒక్కటియై, ఓం అనే ఏకాక్షర మంత్రము అయెను . నామరూపాత్మక మగు సకల జగత్తు, వేదము నుండి పుట్టిన స్త్రీ పురుష అనే రెండు కులములు ఈ మంత్రముచే వ్యాపించబడియున్నవి. ఈ మంత్రము శివశక్తులను కూడ బోధించును .


దీనినుండి అకారాది వరుస, మరియు నకారాది వరుసలో పంచాక్షర మంత్రము పుట్టెను. ఈ పంచాక్షరి సాకారుడగు భగవానుని బోధించును . ఈ పంచాక్షరి నుండి ఐదైదు వర్ణములు గల ఐదు వర్గములతో కూడిన వర్ణమాల పుట్టెను. మరియు, శిరోమంత్రము అనే నాల్గవ పాదముతో సహా, ముడు పాదములు గల గాయత్రీ మంత్రము పుట్టెను . దాని నుండి సమస్త వేదములు, వాటి నుండి కోట్లాది మంత్రములు పుట్టెను. ఆయా మంత్రముల వలన ఆయా సిద్ధులు మాత్రమే లభించును. కాని, ఈ ప్రణవము వలన సర్వసిధ్ధులు కలుగును .


మంత్రసారమగు ఈ ప్రణవము వలన భోగమే గాక, మోక్షము కూడ సిద్ధించును. సాకారుడగు శివుని బోధించు శ్రేష్ఠ మంత్రములు ప్రత్యక్షభోగములనే గాక, మోక్షమును కూడ నిచ్చును .


*నందికేశ్వరుడిట్లు పలికెను -*


అంబికతో కూడియున్న శివగురువు తిరోధాన వస్త్రము వెనుక ఉత్తరముఖముగా కూర్చన్న వారిద్దరి శిరస్సులపై పద్మము వంటి తన హస్తమును మెల్లగా నుంచి, వారికి మరల ఆ మహా మంత్రము నుపదేశించెను . వారిద్దరు మంత్రమును మూడుసార్లు ఉచ్చరించి, యంత్ర తంత్రపూర్వకముగా స్వీకరించి, గురుదక్షిణగా తమను తాము సమర్పించుకొనిరి . వారిద్దరు చేతులు జోడించి , జగద్గురువగు మహాదేవుని ఇట్లు స్తుతించిరి .


బ్రహ్మాచ్యుతులిట్లు పలికిరి

 -*

నిరాకారుడవగు నీకు నమస్కారము. తేజోరూపుడవగు నీకు నమస్కారము. సాకారుడవగు ఈశునకు నమస్కారము . ఓంకార వాచ్యుడవగు నీకు నమస్కారము. ఓంకారము నీ చిహ్నము. సృష్ట్యాది పంచకృత్యములను చేయు, ఐదు ముఖములు గల నీకు నమస్కారము . సృష్ట్యాది ఐదు కృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్కారము. ఆత్మరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు, అనంత గుణములు, శక్తి గలవాడు నగు నీకు నమస్కారము . సాకార, నిరాకార రూపుడగు శివగురువునకు నమస్కారము. బ్రహ్మ విష్ణువులు ఇట్లు గురువును శ్లోకములతో స్తుతించి నమస్కరించిరి .


*ఈశ్వరుడిట్లు పలికేను -*


వత్సలారా ! నేను మీకు తత్త్వము నంతనూ బోధించి, నా స్వరూపమును చూపించితిని. మీరు దేవీకృప వలన లభించిన, నా స్వరూపమైన ఓంకార మంత్రమును జపించుడు . ఓంకార జపము వలన సుస్థిరమగు జ్ఞానము, శాశ్వతమగు సర్వభాగ్యములు కలుగును. ఆర్ద్రా నక్షత్ర యుక్త చతుర్దశి నాడు జపించినచో, అక్షయఫలము కలుగును . సూర్యుడు మహా ఆర్ద్రా నక్షత్రములో ప్రవేశించినపుడు చేసిన ఒక ప్రణవ జపమునకు కోటి రెట్లు ఫలము లభించును. మృగశీర్ష యొక్క అంతిమ సమయము, పునర్వసు యొక్క ఆదిమకాలము . పూజా, హోమ, తర్పణాదులకు ఆర్ద్రతో సమమైన శ్రేష్ఠత కలవియని తెలియవలెను. ప్రాతఃకాలము నందు, మధ్యాహ్నమునకు ముందు నన్ను దర్శించవలెను . రాత్రి యందు గాని, లేక ప్రదోషమునందు గాని వ్యాపించి యున్న చతుర్దశి తరువాతి తిథితో కలిసియున్న కాలము నన్ను దర్శించుటకు శ్రేష్ఠమగు కాలము .


నా మూర్తి లింగములు సమానమైనవే. అయిననూ, సాధకులకు లింగార్చన శ్రేష్ఠమైనది. మోక్షమును కోరువారికి మూర్తి పూజ కంటె లింగార్చన శ్రేష్ఠతరము . సాధకుడు లింగమును ఓంకార మంత్రముతోను, మూర్తిని పంచాక్షరితోను పూజించవలెను. సాధికుడు స్వయముగా లింగమును ప్రతిష్ఠించి, లేదా ఇతరులచే ప్రతిష్ఠింపజేసి , వివిధ వస్తువులతో, ఉపచారములతో అర్చంచినచో, నా ధామను పొందుట సులభమగును. ఈ విధముగా శిష్యులకు ఉపదేశించి, శివుడచటనే అంతర్ధానమందేను .



*శ్రీ శివ మహా పురాణ విద్యేశ్వర సంహిత యందు పదవ అధ్యాయము ముగిసినది.*




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

వ్రత కథ

 క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ.


క్షీరాబ్ధిద్వాదశి కధను బ్రహ్మ దేవుడు ఈ విధంగా చెప్పుచున్నాడు .ఎల్లప్పుడూ క్షీర 

సముద్రంలో శయనించి యుండు విష్ణువు కార్తిక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీ 

బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావనమున కేగును(వెళ్ళును). కావున ఆ రోజున 

బృందావనమందు ఎవరు శ్రద్దా భక్తులతో విష్ణు పూజ చేయుదురో వారికి దీర్ఘమైన 

ఆయుష్షు , ఆరోగ్యము, ఐశ్వర్యములు కలిగి సంతోషముగా ఉందురు .ఈ వ్రతము 

చేయువారు కార్తిక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడస్తమించిన తరువాత స్నానము 

గాని ,దానము గాని ,పూజ గాని చేసినచో అధిక ఫలమును పొందుదురు. క్షీర సముద్రము

నుండి లక్ష్మీ దేవితో గూడి సమస్తమైన మునులచేత కీర్తించ బడుచున్న పరమేశ్వరుడైన నారాయణుడు ఎచ్చట వాసము చేయునో అట్టి బృందావనమందు పూజనీయుడై, నిత్యుడై, తులసీ సహితుడైనట్టి శ్రీమన్నారాయణ మూర్తిని,బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్దా భక్తి యుక్తులై పూజించియున్నారు . కావున మానవ మాత్రులెవరు ఈవ్రతమును చేసినను సమస్త పాపములు నశించి విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. శ్రీ మహా విష్ణువు వశిష్టాది మహామునులచేత నానా విధ స్తోత్ర పూర్వకంగా తులసీ వనమందు పూజింప బడుతుంటాడు . ఆ కాలమందు ఈ కార్తిక శుద్ధ ద్వాదశినాడు తులసీవనమందు ఎవరు తులసీ సహిత విష్ణువును పూజించు చుందురో వారు సర్వ పాపములను పోగొట్టు కొన్నవారై విష్ణు సాన్నిధ్యము పొందుదురు. మునీశ్వరులైనను, యక్షులు, నారదుడు మొదలగువారు కూడ సమస్త పాపములు నశించుటకు గాను బృందావనములో సన్నిహితుడైన శ్రీ మహా విష్ణువును పూజ చేయుచున్నారు .


పతితుడైనను ,శూద్రుడైనను, మహాపాతకము చేసిన వాడైనను కార్తిక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి ) రోజున తులసీ సహిత విష్ణువును పూజించిన వారి పాపములు అగ్నిహోత్రంలో వేసిన ప్రత్తి పోగువలె నశించును . ఇక బ్రాహ్మణుడైనచో ఫలము ఇట్టిదని చెప్పవలసిన పనిలేదు .తులసీ సహితుడైన విష్ణువును పూజ చేయని వారు పూర్వ పుణ్యములు కూడా పోయి నరకమును పొందుదురు . బృందావనమున సన్నిహితుడైన విష్ణువును పూజించినచో స్వర్గమును పొందుదురు. బృందావనము చాలా మహత్యము కలిగినదని ,అచ్చట పూజించి నట్లయితే విష్ణువునకు అత్యంత సంతోష కరమని పూర్వము దేవతలు ,గంధర్వులు ,ఋషులు మొదలగు వారందరును బృందావనమందు సన్నిహితుడైన శ్రీ మహా విష్ణువును పూజ చేసిరి . కార్తిక శుద్ధ ద్వాదశి రోజున తులసీ సహితుడైన నారాయణ మూర్తిని పూజించని మనుజుడు కోటి జన్మలు పాపిగా చండాలునిగా పుట్టును. ఆ రోజున బృందావనమందు శ్రీ మహా విష్ణువును శ్రద్దా భక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మ హత్యా మహా పాతకములు కూడ పూర్తిగా పోయి అనేక పుణ్య ఫలములు పొందుదురు. అట్టి మహా పుణ్య కరంబగు నట్టిది గాన తులసీ బృందావన సన్నిధానము నందు శ్రీ మహావిష్ణువును పూజించుట ప్రశస్తమగును . ఈ వ్రతమును చేయువారు (పురుషులు ) స్నాన సంధ్యా వందనములను పూర్తి గావించుకొని , యధావిధిగా నానావిధ వేద మంత్రములచేత గాని ,పురుష సూక్తము చేత గాని శ్రద్దా భక్తులతో పూజ చేయవలెను .ఎలాగంటే ప్రధమమున పంచామృత స్నానం గావించి , ఆ పిమ్మట శుద్దోకములచే అభిషేక మొనర్చి శ్రీ విష్ణువును వస్త్రములచే అలంకరించి నానావిధములగు పుష్పములచేతను , ధూప దీపముల చేతను పూజించి ,భక్తితో నైవేద్యము నిచ్చి ,దక్షిణ తాంబూలములు సమర్పించి ఆ తరువాత కర్పూర నీరాజనములు సమర్పించవలెను . లోకమునందు ఎవరు ఈ ప్రకారము పూజ గావించుదురో వారు సకల పాపములు తొలిగి సమస్త సుఖములు పొందుదురు .ఇంటిలో ఈశాన్య మూలములో గోమయముచే (ఆవుపేడ ) అలికి, రంగుల ముగ్గులతో అలంకరించి పద్మము ,శంఖము, చక్రము, పాదములు ఆ తిన్నె మీద అలంకరించి పూజించి గీత వాద్యములతో వేద ఘోషములతో తులసి కధను వినవలెను. పుణ్యము కోరువారు ఎట్లైన తులసీ వ్రత మహత్యమును వినవలెను. విష్ణు దేవునికి మిక్కిలి ప్రీతి చేయవలెనన్న ద్వాదశి రోజున ,బ్రాహ్మణ సభలో తులసీ వ్రత మహత్యమును విన్నచో దుఃఖములన్నియు నశించి విష్ణు లోకమును పొందుదురు. ఈ పూజా సమయమునందు ధూప దీపములు చూచినా వారు గంగా స్నాన ఫలమును పొందుదురు . నీరాజనము (హారతి ) చూచినచో పాపమంతయు నిప్పులో పడిన ప్రత్తివలె నశించును.

నీరాజనమును నేత్రములందు ,శిరస్సు నందు అద్దుకొనుదురో వారికి విష్ణు లోకము కలుగును. తరువాత బెల్లము, టెంకాయలు , ఖర్జూరము , 

అరటిపళ్ళు ,చెరకు ముక్కలు మొదలగునవి . స్వామికి నివేదనము చేయవలెను. తులసీ సహితుడైన శ్రీ మహా విష్ణువునకు నైవేద్యము సమర్పించి ,బ్రాహ్మణుల శ్రద్దా భక్తులతో పూజించి ,దక్షిణలను ఇవ్వవలెను .ఈ వ్రతమును ఆచరించిన వారి కోటిజన్మల పాపములు నశించి ,లోకమున సమస్త భోగములు అనుభవింతురు. ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు అవశ్యము దీపదానం చేయవలెను. ఒక దీపము దానము చేసినట్లయిన ఉపపాతకములు నశించును. పది దీపములు దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలుగును. ఇంతకు మీదట దీపదానం చేయుటవలన స్వర్గాదిపత్యమును పొందుదురు . బ్రహ్మాదులకు దీపదానం ప్రభావం వల్లనే వైకుంటము నందు శాశ్వతమైన నివాసము కలిగెను . 


కార్తిక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు దీపదానమును ఎవరు చేయుదురో వారు వైకుంటములో సమస్తమైన భోగముల ననుభవించి విష్ణు సాన్నిధ్యమును పొందుదురు .ఆ దీప దర్శన మాత్రముననే ఆయుష్షు , బుద్ది, బలము, ధైర్యము, సంపత్తులు ,పూర్వ జన్మ స్మరణం మొదలగునవి అన్నియు కలుగును.

దీపమునకు ఆవునెయ్యి ఉత్తమం అనగా మంచిది .మంచినూనె మధ్యమము (అనగా మంచినూనె అయిననూ పరవాలేదు ) ఇతర వన్య తైలములు (అడవిలో లభించు నూనెలు ), ఇప్పనూనె అధమము (పై రెండు నూనెలు దొరకని సమయమున ఈ నూనెలు వాడవచ్చును ) ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానము చేసినట్లయిన జ్ఞాన లాభములు, మోక్ష ప్రాప్తియు ను లభించును. మంచినూనెతో దీపము వెలిగించిన కీర్తి సంపదలు లభించును . ఇప్పనూనె ఇతర వన్య తైలములు కార్య సిద్ది కలుగును. ఆవనూనె గాని ,అవిశ నూనెతో గాని దీపము పెట్టిన శత్రువులు నశింతురు . ఆముదముచే దీపముంచిన సంపద ,కీర్తి , ఆయుష్షు క్షీణ మగును. గేదె నెయ్యితో దీపము వెలిగించిన పూర్వము చేసిన పుణ్యము కూడా నశించి పోవును. దానికి స్వల్పముగా ఆవునెయ్యి కలిపి దీపము పెట్టినట్లయిన దోషము లేదు.

ఒక వత్తితో దీపము పెట్టి దానము చేసిన సమస్త పాపములు పోయి ,తేజస్వి గాను ,బుద్ది మంతుడుగాను అగును. నాలుగు వత్తులతో దీపములు పెట్టి దానము చేసిన రాజు అగును. పది వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన చక్రవర్తి అగును. ఏబది వత్తులతో దీపము వెలిగించి దానము చేసిన దేవతలలో ఒకడును ,వంద వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన విష్ణు సాన్నిధ్యమును పొందును. వేయి వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన ఇంద్రుడితో సమాన మైన వాడగును. ఈ దీప దానము విష్ణు క్షేత్రమందు తులసీ సన్నిధి యందు చేసినట్లయిన విష్ణు లోక ప్రాప్తి కలుగును. ఈ వ్రత విధానము మరియు కధ ఈ క్రింది విధముగా కూడా చెబుతారు.


ఈ క్షీరాబ్ది ద్వాదశిన అంబరీషుడు అను విష్ణు భక్తుడు ' ద్వాదశి వ్రతము'ను ఆచరించెను. కార్తిక శుద్ధ దశమి రోజున ,పగలు మాత్రమే భుజించి మరునాడు అనగా ఏకాదశి రోజున యే వ్రతమూ చేయక పూర్తి ఉపవాస ముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత నే భుజించవలయును. అంబరీషుడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు . ప్రతి ద్వాదశి నాడు తప్పక వ్రతం చేసేవాడు ఒక ద్వాదశి నాడు , ద్వాదశి ఘడియలు స్వల్పముగా ఉండెను. అందుచే ఆరోజు పెందలకడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచెను. ఆ సమయమునకు అచ్చటకు కోప స్వభావుడగు దూర్వాసుడు వచ్చెను.

అంబరీషుడు ఆ మునిని గౌరవించి ,ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయును గాన త్వరగా చేసి రమ్మని కోరెను. దూర్వాసుడు అందుకు అంగీకరించి వెడలెను.అంబరీషుడు ఎంత సేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటి పోవుచున్నవి. ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు పిలిచి తరువాత పెట్టక పోయినచో మాట తప్పినట్లయి మహాపాప మగును. అది గృహస్తునకు ధర్మము కాదు .ఆయన వచ్చు వరకూ ఆగినచో ద్వాదశి ఘడియలు దాటిపోవును. వ్రత భంగ మవును. ఆయన రాకుండా నేను భుజించినచో నన్ను శపించును. నాకేమి తోచుట లేదు అని మనస్సులో తలచు చుండెను. భ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు . ద్వాదశి ఘడియలు మించి పోకూడదు . ఘడియలు దాటిపోయిన పిదప హరి భక్తి వదలిన వాడనగుదును అని అంబరీషుడు ఆలోచించి ,బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహా విష్ణువే పోగొట్ట గలడు. అని ద్వాదశి ఘడియలు ఉండగానే భోజనము చేయ నిశ్చయించి ,పండిత శ్రేష్టులతో యోచించి జలపానము చేయుట దోషము గాదని యెంచి , స్వీకరించ బోవునంతలో దూర్వాసుడు వేగముగా కోపముతో అంబరీషుని యొద్దకు వచ్చి ఓరీ ! మధాందా నన్ను భోజనమునకు రమ్మని పిలిచి నేను రాక మునుపే నీవేల భుజించితివి ? ఎంత నిర్లక్ష్యము ? ఎంతటి ధర్మ పరిత్యాగివి. నీవు భోజనము స్వీకరించి హరి భక్తిని అవమానించినావు. బ్రాహ్మణ అవమానమును శ్రీ హరి సహింపడు నీవు మహా భక్తుడునని అతి గర్వము కలవాడ వైనావు. అని నోటికి వచ్చినట్లు తిట్టేను. అంబరీషుడు గడ గడ వణుకుచూ మహానుభావా ! నేను ధర్మ హీనుడను , నా అజ్ఞానం చే ఇట్టి అకార్యమును చేసితిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు దయగల వారుగాన నన్ను కాపాడుమని వేడుకొనెను . అంత దూర్వాసుడు దోషికి శాప మివ్వకుండా ఉండరాదని ఘోర శాపము నివ్వబోగా శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ శాపము వృధా కారాదు ,అటులనే తన భక్తునికి ఏ అపాయము కలుగ కూడదని ఎంచి తన సుదర్శన చక్రము అడ్డు పెట్టెను. ఆ సుదర్శనము దూర్వాసుని వెంబడింపగా అతను భీతి చెంది సర్వ మునులను, దేవతలను, బ్రహ్మను, శివుని ఎంత ప్రార్ధించిననూ ఎవ్వరునూ ఆ ఆయుధ భారి నుండి దూర్వాసుని కాపాడ లేక పోయిరి. ఏ లోకములోనివారు తనను రక్షించక పోవుటచే వైకుంట మందున్న మహావిష్ణువు కడకు వెళ్లి జగన్నాధా ! వాసుదేవా ! నేను అపరాధము చేసితిని నీవు నన్ను క్షమింపుము .నీ చక్రాయుధము నన్ను జంపగా వచ్చుచున్నది . దానిని నివారించి నన్ను అనుగ్రహింపుము . నీవు బృగు మహర్షి చేసిన అపరాధమును సహించితివి. నా యందు కూడా నీ దయ కురిపించుము. అని వేడుకొనగా శ్రీ హరి చిరునవ్వు చిరునవ్వు నవ్వి ,దూర్వాసా నేను బ్రాహ్మణ ప్రియుడను నీవు బ్రాహ్మణావతారమెత్తిన రుద్రుడవు. నేను త్రికరణ ములచే బ్రాహ్మణులకు ఎట్టి హాని కలిగించను ప్రతియుగమున గో, దేవ, బ్రాహ్మణ ,సాదు జనంబులకు సంభవించే ఆపదలు పోగొట్టుటకు అవతారములెత్తి దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ గావింతును నీవు అకారణముగా అంబరీషుని శపించితివి నీవిచ్చిన పది శాపములకు అనుభవించెదనని అంబరీషుని ద్వారా బదులు పల్కిన వాడను నేనే. బ్రాహ్మణులను దూషించరాదు. నీవు పోయి అంబరీషుని వద్దకే వెళ్లి వేడుకొమ్మని పంపెను. వెంటనే శ్రీ మన్నారాయణుని వద్ద సెలవు తీసుకుని , అంబరీషుని వద్దకు వచ్చి ధర్మ పాలకా అంబరీషా నన్ను రక్షింపుము నా తప్పును క్షమింపుము . శ్రీ మన్నా రాయణుని వేడుకొనగా నీ దగ్గరకు పంపినాడు . అనిన అంబరీషుడు సుదర్శన చక్రమును ధ్యానింపగా అది శాంతించెను . ఈ రీతిగా దూర్వాసుడు శాంతించి అంబరీషునితో నీ వలన సుదర్శన చక్రమును ,శ్రీ మహావిష్ణువును దర్శించు భాగ్యము నాకు కలిగినది .నీతో భోజనము చేయుట నా భాగ్యము అని దుర్వాస మహా ముని పలికి , అంబరీషుని కోరిక మేరకు పంచ భక్ష్య పరమాన్నములతో విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి తిరిగి తన ఆశ్రమమునకు వెళ్ళెను.

మొగలిచెర్ల అవధూత

 *రుద్రహోమము..ఒక వివరణ..*


"ప్రసాద్ గారూ..వచ్చే *కార్తీక పౌర్ణమి* నాడు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద *రుద్రహోమము* నిర్వహిస్తున్నామని సూచన ప్రాయంగా తెలిపారు ..ఏ తేదీన *రుద్రహోమము* నిర్వహిస్తున్నారు?..ఎలా పాల్గొనాలి?" అంటూ చాలా మంది సోషల్ మీడియా పాఠకులు  నన్ను వివిధ మాధ్యమాల ద్వారా అడుగుతున్నారు..రుద్రహోమము గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించి..ఈరోజు ఈ పోస్ట్ పెడుతున్నాను..


*నవంబర్ 30వతేదీ సోమవారం నాడు శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర ప్రాంగణంలో రుద్రహోమము నిర్వహించాలని సంకల్పించాము..*  

ఆషాఢమాస పౌర్ణమి నాడు (గురుపౌర్ణమి) దత్తహోమము... శ్రావణ మాస పౌర్ణమి నాడు చండీ హోమము..భాద్రపద మాసం లో లక్ష్మీగణపతి హోమము..ఆశ్వీయుజ మాసం దసరా ఉత్సవాల లో భాగంగా భవానీ కంకణ దీక్షా కార్యక్రమం..ఇలా ప్రతినెలా ఏదో ఒక కార్యక్రమం శ్రీ స్వామివారి మందిరం వద్ద నిర్వహిస్తూ ఉన్నాము..సాధ్యమైనంత వరకూ భక్తులను ఆయా కార్యక్రమాలలో భాగస్వాములు గా చేయాలని ఒక చిన్న సంకల్పం..


నవంబర్ 30వతేదీ సోమవారం నాడు జరుపబోయే *రుద్రహోమము* లో కూడా భక్తులు పాల్గొనవచ్చు..ముందురోజు ఆదివారం నాటి సాయంత్రానికి మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు చేరుకోవాలి..ఆరోజు రాత్రికి భక్తులందరికీ అన్నప్రసాద ఏర్పాట్లు ఉన్నాయి..ప్రక్కరోజు సోమవారం ఉదయం 9 గంటలకు రుద్రహోమము మొదలు అవుతుంది..మధ్యాహ్నం 1.30 గంటలకు  హోమము పరిసమాప్తి అవుతుంది..

*శని, ఆది, సోమవారాల్లో (నవంబర్ 28, 29, 30 తేదీలలో ) శ్రీ స్వామివారిని దర్శించుకొనడానికి వచ్చిన ప్రతి భక్తుడికీ రెండు పూటలా ఉచిత ఆహార వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది..*


రుద్రహోమము నందు పాల్గొనాలి అనే ఆసక్తి ఉన్నవారు నేరుగా మమ్మల్ని సంప్రదించండి..(సంప్రదించడానికి సెల్ నెంబర్ల ను ఈ పోస్ట్ చివర ఇవ్వడం జరిగింది..) ముందుగా మీ గోత్రనామాలను నమోదు చేసుకుంటాము..హోమము లో పాల్గొనే వారు సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించాలి..హోమము లో పాల్గొనే వారికి హోమద్రవ్యాలు, పూజా సామాగ్రి శ్రీ స్వామివారి మందిరం వద్ద మేము ఏర్పాటు చేస్తాము..


*రుద్రహోమము గురించి సంప్రదించవలసిన సెల్ నెంబర్లు : 94419 16557 మరియు 99497 53615.*


సర్వం.. 

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114.).

క్షీరాబ్ధి ద్వాదశి

 Padmini Devi:

క్షీరాబ్ధి ద్వాదశి

శ్రీ పసుపు గణపతి పూజ

శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం

కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,

మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,

వామనాయ నమః, శ్రీధరాయ నమః,

ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,

దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,

వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,

అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,

అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,

అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,

ఉపేంద్రాయ నమః, హరయే నమః,

శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః

యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః

అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః

నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః

ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవతా ముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః

కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్ష


తలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

ప్రాణప్రతిష్ఠపన

అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా// తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే // అధ ధ్యానం.

క్షీరాబ్ధి పూజ విధానము

ధ్యానం:

(పుష్పము చేతపట్టుకొని)

శ్లో. దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యథః కరే

చక్రమూర్ధ్వకరే వామం, గదా తస్యా న్యధః కరే

దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం

క్షీరాబ్ధిశయనం దేవ ధ్యాయే న్నారాయణం ప్రభుం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // ధ్యాయామి ధ్యానం సమర్పయామి.

(పుష్పము వేయవలెను).

ఆవాహనం:

ఓం సహస్రశీర్ షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్,

స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠ ద్దశాంగులమ్.

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.

(పుష్పము వేయవలెను).

ఆసనం:

శ్లో. అనేక హార సంయుక్తం నానామణి విరాజితం

రత్న సింహాసనందేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః రత్నసింహాసనం సమర్పయామి.

(అక్షతలు వేయవలెను.)

పాద్యం:

శ్లో . పద్మనాభ సురారాద్య పాదాంబుజ శుభప్రద

పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పాద్యం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

అర్ఘ్యం:

శ్లో. నిష్కళంక గుణారాధ్య జగత్రయ రక్షక,

ఆర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్దోదక వినిర్మితం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // ఆర్ఘ్యం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

ఆచమనం:

శ్లో. సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవతారక

గృహాణ దేవమద్దత్తంపరమాచమనీయకం .

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

పంచామృతస్నానం

శ్లో. స్వాపాదపద్మసంభూత గంగాశోభిత విష్ణునం

పంచామృతైః స్నాపయిష్యేతంశుద్ధో దకేనాపిచ //

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // పంచామృతస్నానం సమర్పయామి.

టహ్దనంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

వస్త్రం:

శ్లో. విద్యుద్విలాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం,

వస్త్రయుగ్మం గృహణేదం భక్తాదత్తం మయాప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం:

శ్లో.నారాయణ నమస్తేస్తు నాకాధిపతిపూజిత,

స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతి గృహ్యతాం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:

శ్లో. రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే

కస్తూరీమిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః గంధం సమర్పయామి.

(గంధం చల్లవలెను.)

అక్షితలు:

శ్లో. అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజధ్వ జావ్యయ,

గృహాణ స్వర్ణవర్ణాంశ కృపయాభక్త వత్సల

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // అక్షితాన్ సమర్పయామి.

(అక్షితలు సమర్పించవలెను)

పుష్పసమర్పణం:

చామంతికా వకుళచంపక పాటలాబ్జ పున్నాగ జాజికరవీరరసాల పుష్పై బిల్వ ప్రవాళతులసీదళ మల్లికాభిస్త్వాం

పూజయామి జగదీశ్వర, వాసుదేవః పుష్పాణి పూజయామి.

(పుష్పాములు వేయవలెను)

అథాంగపూజా:

శ్రీకృష్ణాంగపూజా


పారిజాతాపహారకాయనమః పాదౌ పూజయామి,

గుణాధరాయ నమః గుల్ఫౌ పూజయామి,

జగన్నాథాయ నమః జంఘే పూజయామి,

జానకీవల్లభాయ నమః జానునీ పూజయామి,

ఉత్తాలతాల భేత్రై నమః ఊరూ పూజయామి,

కమలానాథాయ నమః కటిమ్ పూజయామి,

నిరంజనాయ నమః నితంబర పూజయామి,

నారయణాయ నమః నాభిమ్ పూజయామి,

వామ్నాయ నమః వళిత్రయం పూజ,

కాలాత్మనేనమః గుహ్యం పూజయామి,

కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరమ్ పూజయామి,

హృషీకేశాయ నమః హృదయమ్ పూజయామి,

లక్ష్మీవక్షస్థలాయ నమః వక్షఃస్థలమ్ పూజయామి,

పార్థసారథయే నమః పార్శ్వే పూజయామి,

మధురానాథాయ నమః మధ్యమ్ పూజయామి,

హరయే నమః హస్తాన్ పూజయామి,

అనిరుద్ధాయనమః అంగుళీః పూజయామి,

శంఖచక్ర గదాశారఙ్గథారిణే నమః బాహూన్ పూజయామి,

వరదాయనమః స్తనౌ పూజయామి,

అధోక్షజాయ నమః అంసౌ పూజయామి,

కంబుకంఠాయ నమః కంఠం పూజయామి,

ఓజిస్వినే నమః ఓష్ఠౌ పూజయామి,

దామోదరాయ నమః దన్తాన్ పూజయామి,

పూర్ణేందునిభవక్త్రాయ నమః ముఖమ్ పూజయామి,

గరుడవాహనాయ నమః గండస్థలమ్ పూజయామి,

నరనారాయణాత్మకాయ నమః నాసికమ్ పూజయామి,

నీలోత్పలదళశ్యామాయ నమః నేత్రే పూజయామి,

భృగ్వాదిమునిసేవితాయై నమః భ్రువౌ పూజయామి,

భృంగరాజవిరాజిత పాదపంకజాయ నమః భ్రూమధ్యమ్ పూజయామి,

కుండలినే నమః శ్రోత్రే పూజయామి,

లక్ష్మీపతయే నమః లలాటమ్ పూజయామి,

శిశుపాలశిరశ్చేత్త్రే నమః శిరః పూజయామి,

సత్యభామారతాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి

ధూపం:

శ్లో . దశాంగం గుగ్గులో పేతంచందనాగురువాసితం

ధూపం గృహాణ దేవేశ దూర్జటీనుతసద్గుణా

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూప మాఘ్రాపయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

దీపం:

శ్లో// అజ్ఞాన ధ్వాంతనాశాయ అఖండ లోకశాలినే

ఘృతాక్తవర్తి సంయుక్తం దీపం దద్యామి శక్తితః

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి

నైవేద్యం:

పృధుకానిక్షుఖండాంశ్చ కదళీఫల కానిచ,

దాపయిష్యే భవత్ప్రీత్యై గృహాణసురపూజిత

(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)

ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,

(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా,

ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా

ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి

హస్తౌ పక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి.

తాంబూలం:

విస్తీర్ణ సుసంయుక్తం నాగవల్లీ విరాజితం

కర్పూరేణసుసమ్మి శ్రం తాంబూలం స్వీకురుప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం:

ప్రదీపితంచ కర్పూర ఖండకైః జ్ఞానదాయినం

గృహాణేదంమయాదత్తం నీరాజనమిదం ప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి.

(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)

నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

మంత్రపుష్పమ్:

పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యాభక్తాశ్రయ ప్రభో అనుగ్రహంతుభద్రం మే దేహి దేవేశ్వరార్చిత!

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.

( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )

ప్రదక్షిణ

ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం సంసార సాగరాన్మాం త్వ ముద్ధరస్య మహాప్రభో ప్రదక్షిణ.

(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)

శ్లో//యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ

త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల

అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన

ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం.

సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో.

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం ఏతత్ఫలం

తులసీధాత్రీసమేత శ్రీలక్ష్మీ నారాయణార్పణమస్తు

శ్రీ కృష్ణార్పణమస్తు.

(శ్రీ తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి షోడశోపచార పూజ సమాప్తం.)

క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ

పూర్వము దర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందుండగా, నచ్చటికి అనేక ఋషులతోఁ గూడి వ్యాసులవారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగుపూజలు సలిపి కూర్చొండబెట్టి తానును వారి యనుజ్ఞ బొంది కూరుచుడి కొంతతడువు మాటలాడి యాయనతో 'స్వామీ! మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు దెలియని దర్మసూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ యుపాయము చేత సిద్దించునో సెలవిండు, అని య


డుగగా వ్యాసుడు 'నాయనా! మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వం నారదమహాముని బ్రహ్మనడుగగా నాతడు సర్వకామప్రదములగు రెండు వ్రతములు చెప్పినాడు.క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము, క్షీరాబ్ధి శయన వ్రతము అను నా రెండు వ్రతములలో క్షీరాబ్ధి ద్వాదశీవ్రతమును నీకు జెప్పెదను వినుము. కార్తిక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూఁకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునులతోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చి యుండి, యొక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా - ఏ మానవుడైనను ఈ కార్తిక శుద్ద ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసిపూజచేసి తులసికథను విని భక్తితో దీపదానము చేయునోవాడు సర్వపాపములు వీడి నా సాయుజ్యమును బొందును. అని శపథము చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము, అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధాన మెట్టిదో నాకు జెప్పమని యడుగగా వ్యాసిడిట్లు చెప్పదొండగెను. ' దర్మరాజా! ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసికొని సాయంకాలమున మరల స్నానము చేసి శుచియై తులసికోట దగ్గర చక్కగా శుద్ది చేసి ఐదు వన్నెల మ్రుగ్గుల పెట్టి పలువిధముల నలంకరించి తులసీ మాలమందు లక్ష్మీసహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోను బూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెఱుకుముక్కలు సమర్పించి తాంబూలనీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యమును దీపదాన ఫలమును విని యనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తిచేయవలెను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టముంగాంచును. ధర్మరాజది విని దీపదాన మహిమను జెప్పుమని యడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. 'యుధిష్టిరా! దీపదానమహిమనెవడు చెప్పగల్గును ? కార్తిక శుద్ద ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉప పాతకములు పోవును. నూఱు చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగాఁ జేసిన నా ఫలములు నేను జెప్పలేను. భక్తితో నొకవత్తితో దీపము బెట్టిన బుద్దిశాలి యగును. నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును. పదివేసిన విష్ణుసాయుజ్యము నొందును. వేయివత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన యెడల కురుక్షేత్రమందు జేసినంత ఫలము గలుగును. దీనికి ఆవునేయి మంచిది. నూవులనూనె మధ్యమము. తేనె యదమము. ఇతరములైన అడవినూనెలు కనీసము, ఆవునేయి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్పనూనె భోగప్రదము, అడవినూనె కామ్యార్థప్రదము, అందులో ఆవనూనె మిగుల కోరికలనిచ్చును. అవిసెనూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బఱ్ఱె నేయి పూర్వపుణ్యమును దొలగించును. వీనిలో కొంచమైన ఆవునేయి కలిసిన దోషపరిహారమగును. ఈ దీపదానములవలననే యింద్రాదులకు వారివారి పదవులు దొరకినవి. దీనివలన ననేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి యున్న నెవడు చూచి యానందపడునో వాని పాపములన్నియు నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు.' అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును జెంది తులసీ మహత్మ్యమును జెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు జెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తికమాసమందు తులసిపూజ చేయువారుత్తమలోకమును బొందుదురు. తుదకు ఉత్థానద్వాదశినాడైనను తులసిపూజ చేయనివారు కోటిజన్మలు చండాలులై పుట్టుదురు. తులసిమొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీదళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము బొందుదురు. తులసి యున్న ఇంటిలో గాపురము చేయుట, తులసితోట వేసి పెంచుట, తులసిపేరులు దాల్చుట, తులసిదళము భక్షించుట, పాపహరములు. తులసి యున్న చోటునకు యమకింకరులు రారు. 'యాన్ములే....' అను మంత్రమును బఠించు వారికి నే బాధయు నంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను జెప్పెద వినుము. కాశ్మీరదేశ వాసులగు హరిమేధసుమేదులను నిద్దఱు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక స్థలములో నొక తులసితోటను జూచిరి. చూచినతోడనే వారిలో సుమేధుడు భక్తితో బ్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని యడిగెను. సుమేధుడు ఇక్కడ నెండబాధగా నున్నదని యొక మఱ్ఱిచెట్టునండకుజేరి తులసికథ నిట్లు చెప్ప దొడఁగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా నెన్నియో యుత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృతకలశము పుట్టెను. ఆ యమృతకలశమును జేత బూని మహానందము నొంది విష్ణువు ఆ కలశముపై నానందబాష్పములు విడువగా నందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో


తులసిని తొడమీద నుంచుకొని నీవు లోకముల పావనము జేయగలదానవగు మని ప్రేమ మీఱ బలికెను. అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మ్రొక్కినాను. అని యా బ్రాహ్మణుండు పలుకుచుండగానే యామఱ్ఱి ఫెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొఱ్ఱలోనుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహధారులైన మీ రెవరిని యడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియెను. ' నేను దేవలోకవాసిని, నాపేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతోగూడి నందనవనమున గామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనిబడి మా సందడివలన సమాధి చలించి యచ్చట తపస్సు చేయుచున్న రోమశమహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై యిట్లు నాకలజడి కలిగించితివి గావున బ్రహ్మ రాక్షసుడవగు మని శపించి తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతంత్రలు గనుక వారివలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు వెఱచి యా మునిని వేడి ప్రసన్నునిజేయగా నాయన యనుగ్రహము గలిగి నీవెప్పుడు తులసిమహిమను, విష్ణుప్రభావమును విందువో అప్పుడు శాపవిముక్తుడవుగుదువని అనిగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసునై యీ చెట్టు తొఱ్ఱలో జేరి మీ దయవలన నేడు శాపమోక్షణము నొందితిని' అని జెప్పి , రెండవవాని వృత్తాంతము చెప్పసాగెను. ' ఈయన పూర్వమొక మునికుమారుడిగానుండి గురుsకులవాసము జేయుచుండి ఒక యపరాధము వలన బ్రహ్మరాక్షస్సువగు మని గురువు వలన శాపము బొంది యిట్లు నాతో గలసియుండెను. మేమిద్దఱమును మీదయ వలన బవిత్రులమైతిమి. ఇట్లు మమ్మనుగ్రహించినారు గాన మీతీర్థయాత్రాఫలము సిద్దించినది.' అని చెప్పి వారిరువురు వారిత్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దఱు ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను బొగడుచు యాత్రముగించుకొని యిండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదలి యుత్తమగతిని జెందుదురని బ్రహ్మ నారదునకు జెప్పెను.' అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ! ఇట్లు క్షీరాబ్ధివ్రతము జేసి తులసికథ విన్నవారుత్తములగుదురు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

కఠోపనిషత్‌

 *🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 112 🌹*

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻.   ఆత్మను తెలుసుకొను విధము -42 🌻*


పరమాత్మను దర్శింపగోరువారు ముందు వాక్కును అనగా కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, విషయములందు పోనీయక, వాటి నుండి మరల్చి, మనస్సునందు చేర్చవలెను. 


ఇంద్రియములు గోళకముల ద్వారా బహిర్గతమై, రూపాదులను దహించుచున్నది. అట్లు గోళకముల ద్వారా బయటకు వ్యాపించకుండా, ఇంద్రియములు తమ స్వస్థానములో ఉండునట్లు చూడవలెను. అచట నుండి వాటికి అంతరముగా ఉన్న మనస్సునందు చేర్చవలెను. అప్పుడు మనస్సు కూడా బహిర్ముఖము కాకుండా స్వస్థానంలో ఉండును. 


ఆ మనస్సును బుద్ధి యందు చేర్చవలెను. మనస్సు బాహ్యవిషయముల నుండి మరలినప్పుడు బుద్ధికి స్థూల విషయములను నిశ్చయించవలసిన అవసరము లేకపోవుట చేత ఏకాగ్రమై సూక్ష్మవస్తువులను పరిశీలించగలుగును. అట్టి బుద్ధిని తనకు అంతరముగా వున్న మహతత్త్వమునందు చేర్చవలెను. ఆ మహతత్త్వమును ఆత్మయందు చేర్చవలెను. సాంఖ్య విచారణచే సాధకులకు ఈ విధానము చాలా ఉపయోగముగా ఉండును.


        ఈ రకముగా క్రమంగా ఎట్లా మరలించాలి? విరమించాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తు్న్నారు. బోధిస్తున్నారు. అంటే, సాధకులకు మొట్టమొదటిది వాక్‌ సంయమనం. అనగా మనో సంయమనము సాధించాలి, మనో జయాన్ని సాధించాలి అనేటువంటి సాధకులందిరికీ కూడా మొదట్టమొదటిది వాక్‌ సంయమనము.


        అనగా అర్థం ఏమిటంటే, ఈ శరీరం అనే కోటకి, రెండు ద్వారములు ఉన్నాయి. ఒకటి ప్రధాన ద్వారము రాజద్వారము జిహ్వేంద్రియము. అట్లానే వెనుక ద్వారము ఉపస్థేంద్రియము. అంటే పునరుత్పత్తి కార్యక్రమములో పాల్గొనేటటువంటి ఉపస్థేంద్రియమేమో వెనుక ద్వారము. 


అలాగే జిహ్వేంద్రియము. ఎప్పుడూ రెండు రెండు పనులు చేస్తుంది. రెండు రెండు పనులు చేసేటువంటి ఇంద్రియములు ఇవి రెండే. ఈ రెండింటి మీద అదుపు సంపాదిస్తే, వీటిని కనుక స్వాధీనమొనర్చుకొనగలిగితే, సాధకులకి యాభై శాతము విజయము వచ్చినట్లే! 


అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోళకం కానీ, ఒక్కొక్క ఇంద్రియము కానీ, ఒక్కొక్క శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ.... తన్మాత్ర గానీ, లేదా సాక్షిగా ఉండవలసిన మనస్సులోనే బలహీనతగానీ లేదా బుద్ధియందే బలహీనతగానీ, వారి వారి యొక్క స్థితిని వారు స్వాధ్యాయం చేయాలన్నమాట! అధ్యయనం చేయాలి. ఎందుకంటే, ప్రతీరోజు తప్పక తమను తాము పరిశీలించుకొనడం అనే పనిని చేపట్టాలి. తనకి ఎక్కడ బలహీనత ఉంది? అనేది తానే గుర్తించాలి.


        డాక్టరుగారి వద్దకు వెళ్ళినప్పుడు, ఏమండీ! నాకేమి సమస్య ఉందో మీరే గుర్తించాలి...! అన్నామనుకో? అప్పుడు వైద్యం ఎలా చేస్తాడు? చేయలేడు కదా!  నీ సమస్య ఏమిటో, నువ్వు చెబితే తప్ప, దానిని ఆరోగ్యశాస్త్ర రీత్యా పరిశీలించి, ఏమి సలహా ఇవ్వాలో, ఏమి వైద్యం చేయాలో, ఆ విచారణ చేసి దాని ప్రకారం నీకు సహాయపడ గలుగుతాడు. 


అట్లానే గురువుకూడా స్వాధ్యయన శీలియైనటువంటి సాధకుడికి మాత్రమే ఉపయోగపడగలుగుతాడు. అంతా మీరే గురువుగారు, అంతా మీరే గురువుగారు అని మనం ఎన్ని సార్లు చెప్పినప్పటికీ, నీ సమస్య ఏమిటో నువ్వు స్పష్టంగా గుర్తు పట్టగలిగేటటువంటి స్థాయికి ఎదిగేటట్లు చేస్తారు మొట్టమొదట.


అందుకనే ప్రతి ఒక్కరిని నాలుగు సంధ్యలలో ఉపాసనా క్రమాన్ని, ధ్యాన విశేషాల్ని, సాధనా బలాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయమని చెప్పేది. దాని వల్ల ఏమౌతుంది అంటే, ఒక సరైనటువంటి, క్రమమైనటువంటి, క్రమశిక్షణతో కూడినటువంటి, యమనియమాలతో కూడినటువంటి, ఆసనసిద్ధితో కూడినటువంటి, మనస్సుద్ధికారకమైనటువంటి, చిత్తశుద్ధి కారకమైనటువంటి జీవన ప్రయాణాన్ని నువ్వు కనుక చేస్తూవున్నప్పుడు తద్భిన్నమైన, తద్విరుద్ధమైన, తద్వ్యతిరిక్తమైన, ఆలోచనలు గానీ, స్వభావయుత ప్రేరణలు గానీ లేదా అరిషడ్వర్గాల యొక్క ఉత్ప్రేరకమైనటువంటి పరిస్థితులు గానీ, ఏవైనా ఏర్పడుతున్నప్పుడు నువ్వు సూక్ష్మంగా గుర్తించ గలిగేటటువంటి శక్తి నీకు కలుగుతుంది. 


కలిగి వాటి నుంచి ఎలా విరమించాలి? అనేటటువంటి ప్రాధాన్యతని నువ్వు లక్ష్యం కొరకు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి, ఏ రకమైనటువంటి యమనియమాదులు లేకుండా కేవలం విషయవ్యావృత్తితోటి, విషయానురక్తులై జీవించేటటువంటి వారు ఈ సాధన బలాన్ని పొందలేరన్నమాట!


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

Narasimha Swamy











































 

God








 

Homam










 

Hindu

 









Faith