9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

Panchang

 


మాఘమాసము

 🕉️ *రేపటి నుండి మాఘమాసము* 🕉️



*మాఘమాసం విశిష్టత*


🍁🍁🍁🍁🍁


చంద్రుడు మఖ నక్షత్రంలో కూడిన మాసం "మాఘమాసం". ఇది విష్ణువునకు అత్యంత ప్రీతికరమైనది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైనది. 


మాఘ స్నానం:


ఉషోదయానికి ముందే చేసే స్నానాలు ఆత్యంత పుణ్యప్రదమైనవి మరియు అరోగ్యవంతమైనవి. ఈస్నానాలకి అధిపతి సూర్య భగవానుడు. కార్తీక గాలుల్లో చంద్రుడు ఓషది కారకుడై ఆరోగ్యం ఎట్లు కలిగించునో అట్లే రవి కూడా ఈకాలమందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్నిస్తాడు. అందుకే స్నానానంతరం సూర్యునికి ఆర్గ్యం ఇస్తారు. ఇక ఈ స్నానాలు అఘమర్షణ స్నానఫలాన్ని ఇస్తాయి. పుష్కర స్నానం ఫలాన్ని ఇస్తాయి. శతగుణ ఫలాన్ని ఇస్తాయి. 


"దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషనాయ చl

ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనంll

మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవl

స్నానేనానేనమే దేవ యథోక్త ఫలదోభవll"


అనే శ్లోకం చదువుతూ మాఘ స్నానం చేయాలి.

ఈమాసం ఏ పారాయణ చేసిన అది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. 


అరుణోదయేతు సంప్రాప్తే, స్నానకాలే విచక్షణః

మాధవాంఘ్రి యుగం ధ్యాయన్ యః స్నాతి సురపూజితః


ఇలా బ్రహ్మ పురాణం చెబుతున్నది. అనగా, సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతలచేత పూజితుడుఅవుతాడు. ఇక, నక్షత్రాలు ఉండగా చేయడం ఉత్తమం. లేనప్పుడు చేయడం మధ్యమం. సూర్యోదయం తదుపరి చెస్తే అధమం. 


ఇక తిలలు, ఉసిరికలు దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అశ్వద్ధ వృక్షాన్ని పూజించడం చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. పుష్య బహుళ అమావాస్య నుండే మొదలు పెట్టాలి స్నానాలు. 


ఇక మాఘమాసంలో వచ్చే నోములు పండుగలు చాలా ఉన్నవి. ఆదివారాలు గొప్పవి. ఆయా వారాలలో నోముల్లో ఉన్న స్త్రీలు తరిగిన కూరలు తినరు. 

మాఘ గౌరినోము, మాఘ ఆదివారం నోము ఉంటాయి. అలాగే, మాఘ శుద్ధ చతుర్థి అనగా వరచతుర్ధి, పగలు ఉపవాసం ఉండి గణపతిని పుజించి రాత్రి భుజించాలి. సాయంత్రం శివుని పూజచేయాలి. ఇక, మాఘశుద్ద పంచమి శ్రీ పంచమి. సరస్వతి అవిర్భవించిన రోజు. ఆనాడు అక్షరాభ్యాసం చేసుకున్నవారు అదృష్టవంతులు. తదుపరి మాఘ శుద్ధ సప్తమి -రథ సప్తమి యనబడును. బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథం ఆకారాన్ని కలిగి యుండునని పురాణ వచనం. రవి విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు. ఆనాటి నుండి రవికి భూమి దగ్గరవడం మొదలు ఆపై వేసవికాలం మొదలు. ఆనాడు ఆయన్ని పూజిస్తే రాజయోగాలు, ఆరోగ్యం, అదృష్టం కలుగుతుంది. 


ఆపై మాఘ శుద్ధ అష్టమి భీష్మాష్టమి. ఆయన పరమపదించిన రోజు. తదుపరి, మాఘ శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి. కృష్ణుడిచే సత్యవ్రతుడు వరం పొందినరోజు. ఆనాడు ఆయన మోక్షం పొందిన రోజు. ఆనాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణువునకు ప్రీతి. మరునాడు భీష్మ ద్వాదశి. ఆనాడు కృష్ణుడిలో లీనమైన రోజు. 


ఆపై, మాఘ శుద్ధ పూర్ణిమ అంటే మహా మాఘి. దేవి శక్తి అపారమైనదిగా మారే రోజు. ఆపై, మాఘ బహుళ చతుర్థి. సంకష్టహర చతుర్థి. ఆపై, మాఘ బహుళ చతుర్దశి. మహా శివరాత్రి పర్వదినం. 


ఇంత ప్రత్యేకమైనది గొప్పదైనది అయిన మాఘమాసం అందరూ విష్ణువుని ఆరాధించి స్వామి కృపకి పాత్రులమవుదాం

జ్ఞాన్వేషణ లోపలనే* అన్వేషిస్తాడు.

 🙏🙏🙏 జ్ఞాన్వేషణ🙏🙏🙏


దీపం తన చుట్టూ వుండే చీకటిని నివారిస్తుంది. కాని తన క్రింద వుండే చీకటిని పోగొట్టుకోలేదు. ఆ చీకటి పోవాలంటే, మరో దీపం తన సన్నిధిలోనికి రావలె. దీపం తన క్రింద చీకటిని ఈ దీపం వెలుతురులో పోగొట్టుకొంటుంది. అట్లే ఎంత మహనీయుడైనా తనకు తెలియని లోపం యేదో తనలో వుండనే వుంటుంది. ఆ లోపాన్ని తొలగించుకొనే కోసం **సత్సాంగత్యం**చేయవలసి వుంటుంది.


తనలోని లోపానికి కారణాన్ని పామరుడు బైట వెతుకుతాడు. పక్వ (తాత్విక / జ్ఞానం) హృదయం కలవాడు దాని కారణాన్ని తన *లోపలనే* అన్వేషిస్తాడు.

ఘనమగు *భారతరత్నము*

 కం. 

మన *పీవీ* ఠేవ యలరె 

మన ఠీవికి చేవ యమరె మన్నన పెరిగెన్ 

ఘనమగు *భారతరత్నము*

పెనవేసిన లతికవోలె *పీవీ* నమరెన్ 

*~శ్రీశర్మద*

8333844664

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం -‌ చతుర్ధశి & అమావాస్య - శ్రవణం -‌ భృగు వాసరే* *(09-02-2024)* 


ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

అవంతిస్వర్ మందిర్

 🕉 మన గుడి : నెం 325


⚜ జమ్మూకాశ్మీర్  : అవంతిపుర


⚜ శ్రీ అవంతిస్వామి/అవంతిస్వర్ మందిర్ 



💠 8వ శతాబ్దంలో, హిందువులలో వైష్ణవ మరియు శైవ ఆరాధనలు అలాగే సంస్కృత అభ్యాసం మరియు సాహిత్యం యొక్క స్థానం కాశ్మీర్ లోయలలో వృద్ధి చెందింది.


💠 అవంతిపూర్ మరియు మార్తాండ్, శ్రీనగర్ నుండి పెహెల్గామ్ వెళ్లే రహదారిలో మూడు హిందూ దేవాలయాలు ఉన్నాయి.  అవంతిపూర్‌లోని రెండు దేవాలయాలు 9వ శతాబ్దానికి చెందినవి మరియు మార్తాండ్‌లోని మూడింటిలో పెద్దది 8వ శతాబ్దానికి చెందినది. 


💠 ఈ దేవాలయాల శైలి ప్రత్యేకమైనది, బౌద్ధ గాంధార కళలచే ఎక్కువగా ప్రభావితమైంది, ఇది గ్రీకు మరియు హెలెనిస్టిక్ కళ మరియు వాస్తుశిల్పాలచే ఎక్కువగా ప్రభావితమైంది. 


💠 కాశ్మీర్లో విష్ణుమూర్తి, శివాలయం ఒకే చోటగల ప్రదేశము. 

స్వామివార్లు అవంతిస్వామి (విష్ణుమూర్తి), అవంతీశ్వర్ (శివస్వామి). 


💠 ఇక్కడ విష్ణుమూర్తికి ఆరు భుజములు ఉంటాయి. రెండు చేతులలో శ్రీదేవిని, భూదేవినిని కలిగి మిగిలిన నాలుగు చేతులలో శంఖ, చక్ర, గద, ధనుస్సులు వుంటాయి.


💠 స్థానికులు ఈ ఆలయాన్ని పాండవ్ లారీ అని పిలుస్తారు, దీని అర్థం " పాండవుల ఇల్లు ". 


💠 ఈ ఆలయాన్ని చమర్ రాజు అవంతివర్మన్ 853-855 లో నిర్మించారు. 

వాస్తవానికి విశ్వాసరా అని పిలువబడే పురాతన పట్టణం కూడా ఒక రాజధాని నగరం. అవంతివర్మన్ అవంతిపూర్ స్థాపకుడు మరియు 9వ శతాబ్దంలో ఉత్పల రాజవంశం. అతను తన పాలనలో కాశ్మీర్‌లో అనేక హిందూ దేవాలయాలను నిర్మించాడు, అవి ముస్లింల ఆక్రమణల కారణంగా చాలా వరకు ధ్వంసమయ్యాయి . 


💠 అవంతివర్మన్ పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. 

అవంతిస్వామి ఆలయం ఆ కాలంలో కాశ్మీర్‌లోని రాతి ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణ .

ముస్లింల ఆక్రమణలకు ముందు, కాశ్మీర్ శైవ మతం మరియు హిందూ తత్వశాస్త్రానికి కేంద్రంగా ఉంది మరియు సంస్కృత అభ్యాసం మరియు సాహిత్యానికి కేంద్రంగా ఉంది . 


💠 14వ శతాబ్దం నాటికి, కాశ్మీర్ ముస్లిం పాలనలోకి వచ్చింది మరియు 15వ శతాబ్దం ప్రారంభంలో దాని దేవాలయాలు చాలా వరకు నిర్జనమైపోయాయి లేదా తొలగించబడ్డాయి. ఇక్కడ రెండు ఆలయాలు తప్ప...


💠 అవంతిపురాలోనే అవంతివర్మన్ రెండు అద్భుతమైన ఆలయాలను నిర్మించాడు.

ఒకటి అవంతీస్వామి అని పిలువబడే విష్ణువుకు అంకితం చేయబడింది మరియు మరొకటి అవంతీశ్వరా అని పిలువబడే శివునికి అంకితం చేయబడింది.


💠 ఇది ఆయన సింహాసనాన్ని అధిష్టించడానికి ముందు నిర్మించబడింది మరియు రెండవది సార్వభౌమాధికారాన్ని పొందిన తరువాత.


💠 ఉత్తర భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లోని అవంతిపోరా లేదా అవంతిపూర్‌లో హిందూ దేవాలయంగా ఉన్న అవంతిస్వామి ఆలయ శిధిలాలు ఇప్పటికీ ఉన్నాయి .


💠 అవంతిస్వామి ఆలయం ఈ ప్రదేశంలో ఉన్న రెండు దేవాలయాలలో పెద్దది. హిందువుల ఆరాధ్యదైవం విష్ణువుకి అంకితం చేయబడిన అవంతిస్వామి దేవాలయం కూడా అదే విధమైన శిథిలావస్థలో ఉంది. 


💠 ఆలయ ప్రధాన గర్భగుడి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది మరియు విష్ణువు యొక్క ఇతర రూపాలైన పర విష్ణువు, అనిరుద్ధ, కపిల, ప్రద్యుమ్న, లక్ష్మి, గణేష్, భూదేవి మరియు గరుడులకు అంకితం చేయబడిన ఇతర శిల్పాలు ఆలయంలో స్థాపించబడ్డాయి.



💠 దేవాలయం యొక్క భారీ శిధిలాలు ఇప్పటికీ అందమైన శిల్పాల ఛాయను వెల్లడిస్తున్నాయి.  ప్రవేశద్వారం వద్ద, భారతీయ నాగరికత కొనసాగింపుకు ప్రతీకగా గంగాదేవి మరియు యమునాదేవి శిల్పాలు ఉన్నాయి. 


💠 అంతేకాకుండా, శేషనాగపై విష్ణువు శయనించిన భంగిమ చూడదగ్గదే.  

ఇతర శిల్పాలలో ఒకటి అవంతివర్మన్ తన ఇద్దరు రాణులతో ఉన్నట్టు చూపుతుంది. 

రతి మన్మధుల విగ్రహాలు కూడా చూడముచ్చటగా ఉంటాయి

 

💠 అప్పటి ఆక్రమణదారుడు మరియు కాశ్మీర్ పాలకుడు సికందర్ షా మిరీ ఈ రెండు దేవాలయాలను కాశ్మీర్‌లోని అన్ని దేవాలయాలతో పాటు, అయ్యోధ్యా, మార్తాండ్ సూర్య దేవాలయంతో సహా ధ్వంసం చేశాడు. మతోన్మాద ఆక్రమణదారు ఈ దేవాలయాలను తప్పించినట్లయితే, ఇది ఖచ్చితంగా ఈ తేదీ వరకు కూడా బలంగా ఉండి ఉండేది.


💠 ఇది దక్షిణ భారతదేశం మరియు ఒడిశాలోని హిందూ దేవాలయాల మాదిరిగానే ఉంటుంది . దాని వాస్తుశిల్పం గురించి చెప్పాలంటే, ఈ ఆలయం ఒక దీర్ఘచతురస్రాకార ప్రాంగణంలో నిర్మించబడింది మరియు దాని చుట్టూ మూలల్లో నాలుగు మందిరాలు ఉన్నాయి. అలాగే, ప్రధాన మందిరానికి సంబంధించిన మెట్ల ముందు స్తంభాల మండపాన్ని చూడవచ్చు. 

కాలక్రమంలో ఆలయం భూమి నుండి 20 అడుగుల లోతుకు వెళ్లిందని చెబుతారు.


💠 ప్రస్తుతం ఆలయ శిఖరం మాత్రమే కనిపిస్తుంది. మనకు కనిపించే భవనం కూడా ఆనాటి అద్భుతమైన శిల్పాలు మరియు శిల్పాల గురించి పుష్కలంగా ఆధారాలు ఇస్తుంది.



💠 ఇది శ్రీనగర్ కి 30 కి.మీ. దూరంలో ఉంది. 

ఆత్మ కథ,

 👂 చెవి యొక్క ఆత్మ కథ, 👂


ఒక సారి తప్పక చదవండి. 

మనసులో గిలిగింతలు 

కలుగుతాయి. ☺


  నేను చెవిని. ......👂

  మేము ఇద్దరము. 👂👂 

  ఇద్దరము కవలలము. 

  కానీ మా దురదృష్టమేమిటంటే,   

  ఇప్పటి వరకు మేము

  ఒకరినొకరు చూసుకోలేదు .

  ఏ శాపమో తెలియదు  

  మేము వ్యతిరేక దిశలో

  అంటకుని పంపించబడ్డాము. 

  మా బాధ ఇంత మాత్రమే , 

  మా బాధ్యత కేవలము 

  వినడము మాత్రమే. 

  తిట్లు గానీ లేదా చప్పట్లు, 

  మంచి లేదా చెడు. 

  అన్నీ మేము వింటాము. 

  

  క్రమ క్రమంగా మమ్మల్ని 

  ఒక ఆధారంగా ( మేకు ) భావించారు. 

  కళ్ళ జోడు బరువు ను 

  మాపై పెడుతున్నారు. 

  ఫ్రేమ్ యొక్క కాడలను 

  మా పై మోపుతారు. 

  ఈ నొప్పిని మేము భరించాలా?  

  ఎందుకు?   

  కళ్ళ జోడు సంబంధము 

  నేత్రాలకు చెందినది. 

  మరి మరి మమ్మల్ని మధ్య లోకి 

  లాగడం లో సంగతేమిటి? ?

  మేము మాట్లాడము , 

   అయితే ఏమైంది , 

   వినగలము కదా! 

  ప్రతిచోట మాట్లాడే వారే 

  ఎందుకు ముందుంటారు ?

  

   బాల్యంలో చదువుకునేటప్పుడు 

   ఎవరికైనా మెదడు పని 

  చేయకపోతే మాస్టరు గారు 

   మమ్మల్నే మెలేస్తారు 

 

  యవనంలో పురుషులు, 

  మహిళలు అందరూ 

  అందమైన జూకాలు,

  కమ్మలు , లోలకులు 

  మొదలైనవి చేయించుకొని  

  మాపైన వేలాడదీస్తారు. 

  రంద్రాలు చేయడం మాకైతే, 

  పొగడ్తలు మాత్రము ముఖానికి. 


   ఇంకా అలంకరణ చూడండి. ! 

   కండ్లకు కాటుక ,ముఖానికి క్రీములు

  పెదవులకు లిపిస్టిక్, 

  మరి ఇప్పటి వరకు మేము 

  ఏమైనా అడిగామా

  చెప్పండి? 


  ఎప్పుడైనా ఏ కవి అయినా కూడా 

  ఏ శాయర్ అయినా చెవుల 

  గురించి ప్రశంసిస్తె పొగిడితే చెప్పండి .

  వారి దృష్టిలో కండ్లు,

  పెదవులు, చెంపలు ఇవే సర్వస్వము. 

 

మేము ఏదో మృత్యుభారము లాగా మగిలిపోయిన రెండు పూరీల 

మాదిరిగా లేపి ముఖానికి ప్రక్కల అతికించబడినాము. 

  

కొన్ని సార్లు వెంట్రుకలు కత్తిరింపులో మాపై కూడా గాట్లు పడతాయి 

డెటాల్ పూసి శాంతపరుస్తారు. 

 

విషయాలు చాలా ఉన్నాయి,  

ఎవరితో చెప్పుకోవాలి .?? 

బాధలు పంచుకుంటే 

మనసు తేలిక 

అవుతుందని అంటారు.

   

కండ్ల తో చెప్పకుంటే అవి కన్నీరు కారుస్తాయి, 

ముక్కు తో చెప్పుకుంటే అది చీదరిస్తుంది.  

నోటితో చెప్పకుంటే అది 

అయ్యో అయ్యో అని రోధిస్తుంది.  

ఇంకా చెప్పాలంటే 

  

పండితుల వారి జంధ్యము, 

టేలర్ మాస్టర్ యొక్క పెన్సిల్, 

మేస్త్రీ యొక్క మిగిలిపోయిన 

గుట్కా పొట్లము, 

మొబైల్ ఫోన్ యొక్క ఇయర్ ఫోన్స్, వీటన్నింటిని మేమే సంభాళించాలి. 

   

  ఇంకా 

ప్రస్తుత పరిస్థితి లో ఈ క్రొత్త క్రొత్త మాస్కుల జంజాటము కూడా 

మేమే భరించవలసి వస్తుంది. 

చెవులు కాదు పక్కా మేకులు లాగా ఉన్నాము మేము.  

ఇంకా ఏమైనా తగిలించాలి ,

వ్రేలాడదీయాలనుకుంటే తీసుక రండి.  

మేము ఇద్దరము సోదరులము 

సిద్ధంగా ఉన్నాము. 


కొంచం నవ్వుతూ ఉండండి, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండండి. 

😃

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 17*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*నాసతో విద్యతే భావో*

*నాభావో విద్యతే సతః ।*

*ఉభయోరపి దృష్టొంఽతః*

*త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।।*



*భావము:* 

క్షణభంగురమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని యథార్థముగా గమనించి ఉన్నారు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*భాసురలీల గాంచిరి సు పర్వులు భక్తజనైకమానసో*

*ల్లాసము కిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా*

*వాసము సిద్ధగుహ్యక నివాసము రాజితభూవికాసికై*

*లాసము కాంతినిర్జిత కులక్షితిభృత్సుమహద్విలాసమున్*


పరమేశ్వరుని భక్తుల మనస్సులకు ఉల్లాసం కలిగించే ఒకేఒక చోటు కైలాసం. అక్కడ కిన్నరకాంతల ఇంపుసొంపులు చూడముచ్చటగా ఉంటాయి. సర్వకాలాలలో వెలుగొందే వైభవాలూ, మంగళా లూ అక్కడ కానవస్తాయి. సిద్ధులూ, యక్షులూ మొదలైన దేవజాతుల వారికి అది నివాసం. వెండి వెలుగులు నిండిన భూమితో అలరారుతూ ఉంటుంది. ఆ కైలాసపర్వతం కాంతులలో ఏడు కులపర్వతాల గొప్పవిలాసాలన్నీ వెలతెలబోతూ ఉంటాయి. అటువంటి కైలాస పర్వతాన్ని దేవతలు చూచారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*భాసురలీల గాంచిరి సు పర్వులు భక్తజనైకమానసో*

*ల్లాసము కిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా*

*వాసము సిద్ధగుహ్యక నివాసము రాజితభూవికాసికై*

*లాసము కాంతినిర్జిత కులక్షితిభృత్సుమహద్విలాసమున్*


పరమేశ్వరుని భక్తుల మనస్సులకు ఉల్లాసం కలిగించే ఒకేఒక చోటు కైలాసం. అక్కడ కిన్నరకాంతల ఇంపుసొంపులు చూడముచ్చటగా ఉంటాయి. సర్వకాలాలలో వెలుగొందే వైభవాలూ, మంగళా లూ అక్కడ కానవస్తాయి. సిద్ధులూ, యక్షులూ మొదలైన దేవజాతుల వారికి అది నివాసం. వెండి వెలుగులు నిండిన భూమితో అలరారుతూ ఉంటుంది. ఆ కైలాసపర్వతం కాంతులలో ఏడు కులపర్వతాల గొప్పవిలాసాలన్నీ వెలతెలబోతూ ఉంటాయి. అటువంటి కైలాస పర్వతాన్ని దేవతలు చూచారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం  -‌ చతుర్ధశి & అమావాస్య -  శ్రవణం -‌ భృగు వాసరే* *(09-02-2024)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/vaJSoMXFiao?si=k-uEWuL_n-oWSYqy


🙏🙏

దూరంగా ఉండడం

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 శాంతితుల్యం తపో నాస్తి

న సంతోషాత్పరం సుఖమ్|

న తృష్ణయా పరో వ్యాధి:

న చ ధర్మో దయాపర:||


*చాణక్యనీతి*


తా𝕝𝕝 శాంతి కంటే మించిన తపస్సు లేదు. తృప్తి, సంతోషాల కంటే మించిన సుఖము లేదు. పేరాశని మించిన రోగము లేదు. దయాగుణముని మించిన ధర్మము లేదు.

*సంస్కృతసుధాసింధువు_*


卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐


*మణినాలంకృతో సర్పః*

*కిమసౌ న భయంకరః |*

*దుర్జనః పరిహర్తవ్యో*

*విద్యయా భూషితోఽపి సన్ ||*


భావం: దుర్మార్గుడై ఎంతటి విద్యావంతుడైనా, చాకచక్యం కలవాడైనా అతడికి దూరంగా ఉండడం అభిలషణీయం..... పాము మణితో అలంకరింపబడినా అది భయంకరమే కదా....? దాని అసలు స్వభావం కొంచెమైనా మారుతుందా?

09-02-2024 / శుక్రవారం / రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*09-02-2024 / శుక్రవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం


భూ క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి. సోదరులతో వివాదాలు రాజి చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

వృషభం


రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. పాత బాకీలు కొంత వరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

---------------------------------------

మిధునం


నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. సంతాన విద్యా విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి.

---------------------------------------

కర్కాటకం


దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆర్థిక వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

సింహం


చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. సంతాన శుభకార్య విషయాలపై చర్చలు ఫలిస్తాయి. అవసరానికి చేతికిడబ్బు అందుతుంది.

---------------------------------------

కన్య


బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

తుల


ఋణదాతల ఒత్తిడి నుండి అధికమై నూతన ఋణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. వ్యాపారాలలో ఊహించని నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలించదు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు.

---------------------------------------

వృశ్చికం


ఆస్తి వ్యవహారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానిస్తాయి. మాతృ వర్గ బంధువుల నుండి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.

---------------------------------------

ధనస్సు


వివాదాలకు సంభందించి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఓర్పుతో మీ సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు.

---------------------------------------

మకరం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

---------------------------------------

కుంభం


ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి వ్యాపారమున ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు.

---------------------------------------

మీనం


కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సన్నిహితుల నుండి ఊహించని సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

🍀 *శుభం భూయాత్* 🍁

కాలం కలిసి రాకపోతే

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 శ్లో𝕝𝕝 

*న మాతృపితృశుశ్రూషా*

*న చ దైవతపూజనమ్*౹

*నాన్యో గుణసమాచారః*

*పురుషస్య సుఖావహః॥* 


                          *-మహాభారతం*


 *తా𝕝𝕝* తల్లిదండ్రుల సేవకానీ, దేవతల పూజ కానీ, నిత్యం మరేదయినా సత్ప్రవర్తన కానీ.. *కాలం కలిసి రాకపోతే మనిషిని సుఖపెట్టలేవు*.