9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*భాసురలీల గాంచిరి సు పర్వులు భక్తజనైకమానసో*

*ల్లాసము కిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా*

*వాసము సిద్ధగుహ్యక నివాసము రాజితభూవికాసికై*

*లాసము కాంతినిర్జిత కులక్షితిభృత్సుమహద్విలాసమున్*


పరమేశ్వరుని భక్తుల మనస్సులకు ఉల్లాసం కలిగించే ఒకేఒక చోటు కైలాసం. అక్కడ కిన్నరకాంతల ఇంపుసొంపులు చూడముచ్చటగా ఉంటాయి. సర్వకాలాలలో వెలుగొందే వైభవాలూ, మంగళా లూ అక్కడ కానవస్తాయి. సిద్ధులూ, యక్షులూ మొదలైన దేవజాతుల వారికి అది నివాసం. వెండి వెలుగులు నిండిన భూమితో అలరారుతూ ఉంటుంది. ఆ కైలాసపర్వతం కాంతులలో ఏడు కులపర్వతాల గొప్పవిలాసాలన్నీ వెలతెలబోతూ ఉంటాయి. అటువంటి కైలాస పర్వతాన్ని దేవతలు చూచారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

కామెంట్‌లు లేవు: