🙏🙏🙏 జ్ఞాన్వేషణ🙏🙏🙏
దీపం తన చుట్టూ వుండే చీకటిని నివారిస్తుంది. కాని తన క్రింద వుండే చీకటిని పోగొట్టుకోలేదు. ఆ చీకటి పోవాలంటే, మరో దీపం తన సన్నిధిలోనికి రావలె. దీపం తన క్రింద చీకటిని ఈ దీపం వెలుతురులో పోగొట్టుకొంటుంది. అట్లే ఎంత మహనీయుడైనా తనకు తెలియని లోపం యేదో తనలో వుండనే వుంటుంది. ఆ లోపాన్ని తొలగించుకొనే కోసం **సత్సాంగత్యం**చేయవలసి వుంటుంది.
తనలోని లోపానికి కారణాన్ని పామరుడు బైట వెతుకుతాడు. పక్వ (తాత్విక / జ్ఞానం) హృదయం కలవాడు దాని కారణాన్ని తన *లోపలనే* అన్వేషిస్తాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి