23, జనవరి 2025, గురువారం

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయస్వామి వారి లీలలు..*


*సంతాన భాగ్యం..* 


మొగలిచెర్ల గ్రామ సరిహద్దుల లోని ఆశ్రమం లో కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ..తనను నమ్మి కొలచిన భక్తుల కోర్కెలు సత్వరమే తీర్చేవారు..


"శరీరం తో ఉంటేనే సమాజానికి ఉపయోగమా?..నా సమాధి నుండి కూడా భక్తులను అనుగ్రహిస్తాను.." అని చెప్పిన మాటలు అక్షర సత్యాలని నిరూపించే ఘటనలు కోకొల్లలు..


ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మనంపాడు గ్రామ వాస్తవ్యులు వెదురూరి మాలకొండయ్య వెంకటమ్మ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని భక్తితో కొలుచుకునేవారు..వెంకటమ్మ కు శ్రీ స్వామివారి మీద ఎనలేని భక్తి..శ్రీ స్వామివారు తపస్సు చేసుకునే రోజుల్లోనే..వారు ఆశ్రమానికి వచ్చి వెళ్లే వారు..శ్రీ స్వామివారు సమాధి చెందిన తరువాత కూడా మందిరానికి వచ్చి దర్శనం చేసుకునేవారు..  తమ కూతురిని కడప జిల్లా మైదుకూరు వాస్తవ్యులు లక్షుమయ్య తో వివాహం చేసారు..తమ కూతురు కొండమ్మ కు వివాహం అయి నాలుగు సంవత్సరాల కాలం గడచినా..సంతానం కలుగలేదు..


వెంకటమ్మ కూతురుకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి ని దర్శించి మొక్కు కోమని సలహా ఇచ్చింది..కూతురు కొండమ్మ, అల్లుడు లక్షుమయ్య ఇద్దరూ మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు..కొండమ్మ నిష్ఠతో మండలం రోజుల పాటు దీక్ష బూని శ్రీ స్వామి వారి మందిరం వద్దే ఉండిపోయింది..


ఒకరోజు స్వప్నం లో శ్రీ స్వామివారు కనబడి, మామిడిపండు చేతికిచ్చి..భుజించమని చెప్పారట!..కొండమ్మ శ్రీ స్వామివారు ఇచ్చిన ఆ ఫలాన్ని కళ్లకద్దుకుని భుజించించింది..తరువాత మెలుకువ వచ్చింది..తనకు వచ్చిన స్వప్నం గురించి భర్తకు చెప్పింది.. మరుసటి నెలలోనే కొండమ్మ నెల తప్పింది..1977 నవంబరు లో పండంటి బిడ్డకు జన్మ నిచ్చింది..


ఆ దంపతుల ఆనందానికి హద్దులు లేవు..బిడ్డకు శ్రీ స్వామి వారి పేరే.."దత్తాత్రేయ" అని నామకరణం చేసుకున్నారు..శ్రీ స్వామివారి కరుణను పదే పదే తలచుకునే వారు..ఆ పిల్లవాడికీ చిన్నతనం నుంచే శ్రీ స్వామివారి మీద భక్తి ఏర్పడింది..కాలక్రమేణా దత్తాత్రేయ పెరిగి పెద్దవాడు అయ్యాడు.. చదువుకొని ఉద్యోగం లో చేరాడు...వివాహమూ జరిగింది..సంతానం కోసం దత్తాత్రేయ కూడా శ్రీ స్వామివారిని మొక్కుకున్నాడు..వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.."దత్త చరిత" .."దత్త వర్షిత" అని  పేర్లు పెట్టుకున్నారు..మగ సంతానం కావాలని మళ్లీ ఆ స్వామివారిని వేడుకున్నాడు..భక్తుడి కోరిక తీర్చడమే భగవంతుని పని..ఈసారి దత్తాత్రేయకు కుమారుడు కలిగాడు.."విష్ణు దత్త" అని పేరు పెట్టుకున్నాడు..


కష్టమైనా సుఖమైనా..ఆ మొగలిచెర్ల దత్తాత్రేయుడి పాదాలే మాకు శరణ్యం అని దత్తాత్రేయ భక్తి పూర్వకంగా చెప్పుకునే మాట!..


ప్రస్తుతం కడప పట్టణం లోని INDUS IND BANK లో పని చేసే దత్తాత్రేయకు ..సర్వకాల సార్వావస్థలయందూ గుర్తుకొచ్చే దైవంఆ మొగలిచెర్ల అవధూత దత్తాత్రేయుడే!..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114...సెల్..94402 66380 & 99089 73699).

శుక్రవారం🌹* *🪷24, జనవరి, 2025🪷* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌹శుక్రవారం🌹*

*🪷24, జనవరి, 2025🪷*   

     *ధృగ్గణిత పంచాంగం*

 

  *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - కృష్ణపక్షం*

*తిథి      : దశమి* రా 07.25 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : శుక్రవారం* ( భృగువాసరే )

*నక్షత్రం  : అనూరాధ* పూర్తిగా రోజంతా రాత్రితో సహా

*యోగం  : వృద్ధి* (25) తె 05.09 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం  : భద్ర* రా 07.25 ఉపరి *బవ* పూర్తిగా రాత్రంతా

*సాధారణ శుభ సమయాలు* 

      *ఉ 06.30 - 09.00 సా 04.30 - 05.30*

అమృత కాలం  : *రా 07.52 - 09.36*

అభిజిత్ కాలం  :  *ప 11.57 - 12.42*

*వర్జ్యం             :  ఉ 09.28 - 11.12*

*దుర్ముహూర్తం  : ఉ 08.56 - 09.41 మ 12.42 - 01.28*

*రాహు కాలం   : ఉ 10.55 - 12.20*

గుళికకాళం       : *ఉ 08.05 - 09.30*

యమగండం     : *మ 03.10 - 04.35*

సూర్యరాశి : *మకరం* 

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.39* 

సూర్యాస్తమయం :*సా 06.00*  

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం          :  *ఉ 06.39 - 08.56*

సంగవ కాలం         :      *08.56 - 11.12*

మధ్యాహ్న కాలం    :      *11.12 - 01.28*

అపరాహ్న కాలం    : *మ 01.28 - 03.43*

*ఆబ్ధికం తిధి         : పుష్య బహుళ దశమి*

సాయంకాలం        :  *సా 03.44 - 06.00*

ప్రదోష కాలం         :  *సా 06.00 - 08.32*

రాత్రి కాలం            :  *రా 08.32 - 11.54*

నిశీధి కాలం          :*రా 11.54 - 12.45*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.58 - 05.49*

________________________________

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷_శ్రీ లక్ష్మీదేవి కవచం_🪷*


*ధనధాన్య మహారాజ్య సర్వసౌభాగ్య కల్పకం*

*సకృత్స్మరణ మాత్రేణ మహాలక్ష్మీః ప్రసీదతి*


*🪷ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🪷🪷🌹🌷

 🌹🌷🪷🪷🪷🪷🌷🌹

Panchang

 


భగవద్గీత మహాభారతం రామాయణం

 🙏

భగవద్గీత మహాభారతం రామాయణం రచనలు సంబంధ 03 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

Install play store ...

https://play.google.com/store/apps/details?id=com.infinity.sanatanadharm

WhatsApp 

https://chat.whatsapp.com/BJPutPfjH726HUkGwzCber

శ్రీమద్భగవద్గీత: మొదటి అధ్యాయం

 శ్రీమద్భగవద్గీత: మొదటి అధ్యాయం

అర్జునవిషాదయోగం: సంజయఉవాచ


కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః

ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః (17)


ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే

సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ (18)


స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్

నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్(19)


కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలు అన్నివైపులా ఊదారు.

 ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్లజేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి.

కీళ్ల వాతం/ అమ వాతం

 కీళ్ల వాతం/ అమ వాతం/ rheumatoid arthritis 


విచిత్రం ఏమిటంటే మనల్ని వివిధ రోగాల బారి నుండి కాపాడే మన శరీరంలోనే రోగనిరోధక శక్తే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి శరీరంలోని తన స్వంత కణజాలాలపై దాడిచేస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో అంతర్గత అవయవాలపైనా దాడి చేస్తుంది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి ఉన్నవారిలో కీళ్ల లైనింగ్‌లు దెబ్బతింటాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో బాధాకరమైన నొప్పి, వాపు వస్తుంది. చాలా కాలం పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను అనుభవిస్తే చివరకు అది ఎముకల కోతకు, అలాగే కీళ్ల వైకల్యానికి కారణమవుతుంది.

అంతేకాదు ఈ వ్యాధికి ఇంతవరకు చికిత్స లేదు, ఒకసారి ఎవరికైనా కలిగితే వారసత్వంగా తమ కుటుంబంలో తర్వాతి తరం వారినీ ఈ సమస్య వేధించే అవకాశం ఉంది.

అయితే లక్షణాలు తెలిసినపుడు మొదటి 3-4 నెలలలో ఫిజియోథెరపీ, కొన్ని యాంటీ-రుమాటిక్ డ్రగ్స్ వాడుతూ దూకుడుగా నివారణ ప్రయత్నాలు చేస్తే అది ఈ వ్యాధి వృద్ధి చెందకుండా మందగించడంలో సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది.

ప్రారంభ దశలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు

మోచేతులు, మోకాళ్లు, మణికట్టు, వేళ్లు ఇతర కీళ్లలో వాపు లేదా నొప్పి ఉంటుంది, ప్రభావిత భాగాలు సున్నితంగా మారతాయి.

కొంతమందికి మోకాలు లేదా మోచేయి లేదా చీలమండలలో ఏదో ఒకచోట మాత్రమే నొప్పులు ఉండవచ్చు.

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ ఉన్నపుడు తెల్లవారుజామున కీళ్లు గట్టిగా కట్టెలాగా మారతాయి. 30 నిమిషాల లేదా అంతకంటే ఎక్కువ సేపు కదిలించలేనట్లుగా అనిపిస్తుంది.

వృద్ధులు, 60 ఏళ్లు పైబడిన వారిలో స్వల్ప జ్వరం, కండరాల నొప్పులు, అలసట, బరువు తగ్గటం వంటి లక్షణాలు ఉంటాయి.

ఈ వ్యాధిలో పాలిండ్రోమిక్ RA అనేది మరొక అసాధారణ రూపం. ఇది ఉన్నప్పుడు కీళ్ల నొప్పులు ఒక రోజు కొద్దిసేపు ఉంటాయి. ఆ తర్వాత అంతా మామూలుగానే అనిపించినా కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుంది.

రోగ నిర్ధారణ- నివారణ

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ వ్యాధిని ఎదుర్కోవాలంటే కచ్చితంగా సరైన వైద్య సహాయం తీసుకోవాలి. ఒక వ్యక్తికి 6 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కీళ్ల నొప్పులు ఉంటే, అవి రెండువైపులా కలుగుతుంటే, పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే  వైద్యుల సూచన మేరకు నడుచుకోవడమే ఉత్తమం.

ఆయుర్వేదంలో ఉత్తమ చికిత్స కలదు


మీ సమస్య చెబితే తగిన విధంగా మందులు చేసి ఇవ్వగలను

Call 9949363498

⚜ శ్రీ కిలిమరతుకావు దేవాలయం

 🕉 మన గుడి : నెం 998


⚜ కేరళ  : కొల్లం 


⚜ శ్రీ కిలిమరతుకావు దేవాలయం 



💠 కిలిమరతుకవు శివ పార్వతి ఆలయం భారతదేశంలోని కేరళలోని కొల్లంలోని కడక్కల్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం.  

ఇది అయ్యప్పన్ యొక్క సారాంశమైన 'ధర్మ శాస్తా' యొక్క అతిపెద్ద విగ్రహం కలిగి ఉంది.


🔆 చరిత్ర


💠 పురాతన ఆలయం గతంలో ధ్వంసం చేయబడిందని మరియు విగ్రహాలు మాత్రమే మిగిలి ఉన్నాయని నమ్ముతారు.  

21వ శతాబ్దంలో కొత్త దేవాలయం నిర్మించబడింది.  2011లో ఆలయ సలహా కమిటీ సహాయంతో ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు పునరుద్ధరించిన ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది.


🔆 ఆలయ పురాణం


💠 పాండవుల అరణ్యవాస సమయంలో, అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందడానికి సన్యాసిగా ప్రయాణించాడు.  ఒక రోజు ప్రయాణంలో, అతను ఒక పక్షిని చూశాడు, అతను దానిని అనుసరించడం ప్రారంభించాడు.  చాలా రోజుల తర్వాత అది ఒక లోయకు చేరుకుంది, అక్కడ అది శుభ్రమైన ప్రవాహానికి సమీపంలో ఉన్న కిలిమారం అనే చెట్టుపై కూర్చుంది.  అర్జునుడు పక్షి దగ్గరికి వచ్చాడు.  పక్షి సమీపంలోని కూవలం చెట్టు నుండి మూడు ఆకులను తెంచుకుంది, మరియు అర్జునుడు శివుని కోసం తన తపస్సును పెంచమని కోరినట్లు భావించాడు.  అర్జునుడు సమీపంలోని చెరువులో స్నానం చేసి అక్కడ దొరికిన శివలింగాన్ని పూజించాడు.  కాలం గడుస్తున్న కొద్దీ అర్జునుడి తపస్సు తీవ్రమైంది.


💠 అర్జునుడు పక్షి కిలకిలారావాల ప్రదేశానికి చేరుకున్నాడు.  అది “కిలిమారం” అనే పెద్ద చెట్టు, పక్షి కూర్చుని కిలకిలలాడుతోంది.

ఆ విధంగా ఈ ప్రదేశం "కిలిమరతిల్ కావు"గా మరియు తరువాత "కిలిమరతుకావు"గా మారింది.



💠 పార్వతి కోరినట్లుగా, శివుడు అర్జునుడి వద్దకు గిరిజన వ్యక్తిగా మరియు పార్వతి గిరిజన మహిళగా వచ్చారు.  పంది రూపంలో ఉన్న ఒక అసురుడు (రాక్షసుడు) అర్జునుడిని చంపడానికి దుర్యోధనుడు పంపాడు.  అర్జునుడు, శివుడు అతని వేషధారణలో రాక్షసుడిని బాణాలతో కొట్టారు.  ఆ తర్వాత జరిగిన వాదనలో అర్జునుడు తన విల్లుతో గిరిజనుడిని కొట్టాడు.  పార్వతి అతడిని ఆపి ఆ వ్యక్తి నిజస్వరూపాన్ని బయటపెట్టింది.  ఇది విన్న అర్జునుడు సాష్టాంగ నమస్కారం చేసాడు మరియు శివుడు అతనికి పాశుపతాస్త్రాన్ని బహుమతిగా ఇచ్చాడు.  గణపతి, మురుగన్, శాస్త, మరియు ఆంజనేయన్‌తో సహా అనేక ఇతర దేవతలు కూడా సన్నివేశంలోకి ప్రవేశించారు.  శివుడు అర్జునుడికి "మనం ఇప్పుడు ఉన్న ప్రదేశం చాలా పవిత్రమైనది మరియు ప్రార్థన కోసం ఇక్కడకు వచ్చిన వారిని ఆశీర్వదించాలి" అని చెప్పి అదృశ్యమయ్యాడు.  అతను నిలబడిన చోట ఒక శివలింగం కనిపించింది


💠 ఈ ఆలయంలో రెండు శివ లింగాలు ఉన్నాయి 

,శివ మరియు మహానదన్.  పూజించబడే ఇతర దేవతలు పార్వతి, మురుగన్, శాస్తా, హనుమాన్,  మురుగన్, గణపతి, నాగ మరియు నవగ్రహాలు.


💠 ప్రధాన గర్భగృహంలో శివుడు మరియు పార్వతి చిత్రాలు ఉన్నాయి.

 ఆలయ చెరువు మధ్యలో హనుమంతుని ఆలయం ఉంది.


🔅 పండుగలు


నవరాత్రి పూజ,

కుంభం మలయాళ క్యాలెండర్‌లో మహా శివరాత్రి.

కన్నీ మలయాళ క్యాలెండర్‌లో నవరాత్రి. 

తులం మలయాళ క్యాలెండర్‌లో స్కంధ షష్టి.

వృశ్చికం మలయాళం క్యాలెండర్‌లో మండలపూజ మకరవిళక్కు.

మేడం మలయాళ క్యాలెండర్‌లో హనుమాన్ జయంతి.

స్కంద షష్ఠి


🔅 పూజలు


💠 మాతృ పూజ :

మాతృపూజ మాతృదినోత్సవం రోజున దేవి యొక్క ప్రాతినిధ్యంగా అమ్మవారికి గౌరవం ఇవ్వడానికి నిర్వహిస్తారు.  తల్లులు తమ పిల్లలతో ఆలయానికి హాజరవుతారు.  పిల్లలు తమ తల్లికి పాలు, పన్నీరు మరియు నీటితో పూజ చేస్తారు మరియు మంత్రాలు పఠిస్తారు.  పూజ ముగిశాక, అమ్మలు తమ పిల్లలను ఆశీర్వదించి, ఆపై వారికి మిఠాయిలు ఇస్తారు.


💠 ఔషధ కంజి: 

ఔషధ కంజి కర్కిడకమాసంలో వస్తుంది.  

ఆయుర్వేద పదార్థాలతో నెల మొత్తం అన్నం పులుసును ఆలయంలో తయారుచేస్తారు.  

ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు పులుసు పంపిణీ చేస్తారు.  సూప్ ఒకరి ఆరోగ్యానికి మంచిదని మరియు వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని నమ్ముతారు.


💠 ఆలయానికి ఎలా చేరుకోవాలి

రైలు మార్గం:కిలిమరతుకావు దేవాలయం సమీపంలోని రైల్వే స్టేషన్, కజకూట్టం - కిలిమనూర్ రోడ్ మీదుగా 1 గం 16 నిమి (54.1 కిమీ)


రచన

©️ Santosh Kumar

12-13,14-గీతా మకరందము

 12-13,14-గీతా మకరందము

          భక్తియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అI ఇంతదనుక భక్తియొక్క అంగములైన వివిధసాధనలను జెప్పి, ఇక ఏడు శ్లోకములద్వారా ఉత్తమ భక్తుని లక్షణములను పేర్కొనుచున్నారు-


అద్వేష్టాసర్వభూతానాం 

మైత్రః కరుణ ఏవ చ 

నిర్మమో నిరహంకారః 

సమదుఃఖసుఖః క్షమీ.


సంతుష్టస్సతతం యోగీ 

యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనోబుద్ధిః

యో మద్భక్తస్స మే ప్రియః


తా:- సమస్తప్రాణులయెడల ద్వేషములేనివాడును, మైత్రి,  కరుణగలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖదు:ఖములందు సమభావముగలవాడును, ఓర్పుగలవాడును, ఎల్లప్పడు సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపరచుకొనినవాడును, దృఢమైననిశ్చయముగలవాడును, నాయందు సమర్చింపబడిన మనోబుద్ధులుగలవాడును, నాయందు

భక్తిగలవాడును ఎవడుకలడో, అతడు నాకు ఇష్టుడు.


వ్యాఖ్య:- ఎట్టివాడు తనకు ప్రియుడో భగవానుడు ఏడు శ్లోకములద్వారా చెప్పుచున్నారు. ముప్పదియెదు సుగుణములను పేర్కొని "ఇవి కలవాడే నాకు ప్రియుడు' అని శ్రీకృష్ణపరమాత్మ తెలియజేయుచున్నారు. ఈ గుణములన్నియు 'అద్వేష్టా అను పదముతో ప్రారంభమగుటచే 'అద్వేష్టృత్వాది గుణములని ప్రసిద్ధికెక్కినవి. ఈ ముప్పది ఐదున్ను ముప్పదియైదు పాఠములు, లేక పాఠ్యవిషయములు (Subjects) అయివున్నవి. విద్యార్థి పరీక్షలో అన్నిపాఠ్యవిషయములందును ఉత్తీర్ణుడైనచో మాత్రమే పై తరగతికి బోవుటకు అర్థత గలిగియుండు విధమున ఈ 35 సుగుణములను చక్కగ గలిగియుండువాడు మాత్రమే భగవంతునకు ప్రీతిపాత్రుడు కాగలడు. ఇవి లేనివాడు భగవత్కృపకు పాత్రుడుకానందుచే ఆత డీ జననమరణ సంసార ప్రవాహమునబడికొట్టుకొనుచునే యుండును, దుఃఖమునుండి విడువబడవలెననిన, భగవదనుగ్రహమును సంపాదించవలెను. వారి యనుగ్రహమో ఈ సల్లక్షణములు, ఈ సద్గుణములు గలవానిపైననే ప్రసరించును.


సమో౽హం సర్వభూతేషు 

న మే ద్వేష్యో౽స్తి న ప్రియః 

యే భజంతి తు మాం భక్యా 

మయి తే తేషు చాప్యహమ్.

- (గీత 9-29)


అని భగవానుడు చెప్పిన రీతిగా, వాస్తవముగ వారికి ఎవనిపైనను ప్రీతిగాని, ద్వేషముగాని లేకున్నను ఎవరు వారిని భక్తితో సేవించుదురో వారిపై వారనుగ్రహమును వర్ణించుదురు. అట్టి భగవదనుగ్రహమహిమచే

ఆత్మజ్ఞానమును, తద్ద్వారా ముక్తిని అతడు పొందియేతీరును. కాబట్టి మోక్షము నభిలషించువాడు, సంసారదుఃఖమును అంతరింప జేసికొనదలంచువాడు, భగవదనుగ్రహమును పొందుగోరువాడు ఈ అధ్యాయమందు తెలుపబడిన ఈ భక్తుని లక్షణములన్నిటిని చక్కగశీలించవలెను.


అనేకులకు భగవంతునిపై ప్రీతి యుండును. కాని అది చాలదు. భగవంతునకు తనపై ప్రీతి జనించినదా యని పరీక్షించుకొనుచుండవలెను. దేవుడు జీవునకు ప్రియుడైనను, దేవునకు జీవుడు ప్రియుడుగానున్నాడా యని చూచుకొనవలెను. అట్టిస్థితి చేకూరెనా ఇక జీవుడు తరించినట్లే. అయితే భగవంతుడు తాను చెప్పిన ఈ సుగుణములు కలవానినే ప్రియుడుగ నెంచునని 'యో మద్భక్తః స మే ప్రియః' మున్నగు వాక్యములద్వారా ఇట తెలియజేసిరి గావున వానిని జీవుడు తప్పక సంపాదించవలసియుండును.


సాధ్యవస్తువగు పరమాత్మను జేరవలెననిన, సాధనయందు చక్కగ ఆరితేరవలెను. గీతాగ్రంథము సాధ్యవస్తువును గురించి ఒకింతయు, సాధనను గూర్చియే విశేషముగను తెలుపుచుపోవును, కనుకనే దీనిని అనుష్ఠానవేదాంత గ్రంథమని చెప్పుదురు. మొట్టమొదట స్థితప్రజ్ఞలక్షణములు, తదుపరి అద్వేష్టృత్వాది భక్తలక్షణములు, ఆ పిమ్మట అమానిత్వాది జ్ఞానగుణములు, ఆ వెనుక "అభయం" ఇత్యాది దైవీసంపత్తి లక్షణములు - ఈ ప్రకారముగ అనుష్ఠానమును గీతాచార్యులు జనులకు నూరిపోసిరి.


కాబట్టి ముముక్షువులు వానినన్నింటిని చక్కగ శీలించి భగవంతునకు ప్రీతిపాత్రులై జన్మసార్థకత నొందవలయును. "సర్వభూతానామ్" - అని చెప్పుటవలన ఏ ఒకరిద్దరిపై ద్వేషములేకుండుట కాదనియు, సమస్తప్రాణికోట్ల యెడల ద్వేషరాహిత్యము కలిగియుండవలెననియు బోధింపబడినది.


"సంతుష్టః సతతమ్' = ఏ కొద్దిసేపో తృప్తిగలిగి మరల విషయవాంఛలతో గూడియుండుట సరికాదు. ఎల్లప్పడు సంతృప్తుడై యుండవలయును,


" దృఢనిశ్చయ* - దైవవిషయమునగాని, ప్రపంచవిషయమునగాని స్థిరమైన నిర్ణయములు కలిగి సాధనయందు గట్టి నిశ్చయములతో దృఢవ్రతములతో గూడియుండవలెను. శాస్త్ర, గురువాక్యములందు దృఢవిశ్వాసము యుండవలెను. ఇది " ఔనో, కాదో " అను ఊగులాట పనికిరాదు. " దేవుడున్నాడు, వారిని నేను పొందితీరెదను' అనునిట్టి దృఢనిశ్చయములు గల్గియుండవలెను. లేనిచో 'మాయ' చపలమనస్కుని ఊపివేయును.


"మయ్యర్పిత మనోబుద్ధిః - మనస్సుతో బాటు బుద్ధినిగూడ తనయందు నిలుపవలెనని గీతయందు అచటచట భగవానుడు హెచ్చరికలు చేయుచున్నారు. ఏలయనిన మనస్సు వికలాత్మకమైనది గనుక, నిశ్చయాత్మకమగు బుద్ధి దానితో చేరనిచో ఆ మనస్సు చంచలముగనేయుండి లక్ష్యమును సరిగా పొందజాలకుండును.

తిరుమల సర్వస్వం 127-*

 *తిరుమల సర్వస్వం 127-*

* శ్రీవారి సంవత్సర సేవలు 2*

 *వైకుంఠ ఏకాదశి* 


 తమిళులు అధికంగా అనుసరించే సౌరమానం లోని ధనుర్మాసంలో (అంటే మన మార్గశిర పుష్య మాసాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని *"వైకుంఠ ఏకాదశి"* గా లేదా *"ముక్కోటి ఏకాదశి"* గా వ్యవహరిస్తారు. "ఏకాదశ" అనగా "పదకొండు" అని అర్థం; అవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు. ఈ ఏకాదశముల పరిపూర్ణస్థితి యైన ప్రతి "ఏకాదశి" పవిత్రమైనదే. అందువల్లనే ఏకాదశి దినాన ఉపవాసముండే సాంప్రదాయం ఈనాటికీ కొనసాగుతోంది. అయితే, వైకుంఠ ఏకాదశి మరింత ప్రశస్తమైనది. ఈ ప్రాశస్త్యాన్ని వివరించే రెండు వృత్తాంతాలు మన పురాణాలలో ఉన్నాయి:


 మొదటిది ఈ తిథి యందే రావణుని బాధలను భరించలేని బ్రహ్మాది దేవతలు వైకుంఠాని కేగి తమను కాపాడ వలసిందిగా శ్రీహరిని వేడుకొని వారి నుండి అభయం పొందారు.


 మరో వృత్తాంతం ప్రకారం – అదే తిథినాడు శ్రీమహావిష్ణువు మధుకైటభులనే రాక్షసులను సంహరించిగా; వారు దివ్య రూపాలు ధరించి ఆ రోజున ఉత్తరమార్గం ద్వారా ఆలయమందు ప్రవేశించి శ్రీహరిని కొలిచిన వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించమని శ్రీమహావిష్ణువును ప్రార్థించారు.


 ఈ విధంగా ఈ "ఏకాదశి" మోక్షప్రదాత కావున దీనిని "మోక్షోత్సవ దినం" గాను; ముక్కోటి దేవతల వెతలు బాపినందున దీనిని "ముక్కోటి ఏకాదశి" అని; వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక దీనిని "వైకుంఠ ఏకాదశి" అని; భగవంతుని దర్శనం కలిగించేది కావున *"భగవదవలోకనదినము"* అని; వివిధ నామాలతో పిలుస్తారు.


  ఏరకంగా చూచినా, వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైనదే!


 కలియుగ వైకుంఠమైన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం అత్యంత వైభవంగా జరుపబడుతుంది. ఏకాదశి ముందురోజు రాత్రి, ఏకాంతసేవ అనంతరం యథావిధిగా బంగారు వాకిళ్ళను మూసివేస్తారు. మరుసటి రోజు అనగా ఏకాదశి - తెల్లవారు ఝామున జరిగే సుప్రభాత వేళ మొదలుకొని, మరునాటి ద్వాదశి అర్ధరాత్రి జరిగే ఏకాంతసేవ పూర్తయ్యేవరకు, శ్రీవారి ఆలయానికి ఆనుకుని ఉన్న *"ముక్కోటి ప్రదక్షిణ"* మార్గాన్ని భక్తుల సందర్శనార్థం తెరచి ఉంచుతారు. ఈ ప్రదక్షిణ మార్గం యొక్క వివరాలను మనం ఇంతకు ముందే "విమానప్రదక్షిణం" ప్రకరణంలో వివరంగా తెలుసుకున్నాం! –

 ఈ రెండు రోజులు (ఏకాదశి-ద్వాదశి) శ్రీవారి దర్శనానంతరం భక్తులందరూ గర్భాలయ ప్రాకారాన్ని ఆనుకొని ఉన్న ముక్కోటి ప్రదక్షిణమార్గంలో ప్రదక్షిణ గావిస్తారు. ఈ ప్రదక్షిణమార్గం యొక్క ప్రవేశద్వారాన్ని *"వైకుంఠద్వారం"* అని, ఆ మార్గాన్ని *"వైకుంఠప్రదక్షిణ"* మని పేర్కొంటారు. ఈ రెండు రోజులు ఆ ప్రదక్షిణ మార్గమంతా విద్యుద్దీప కాంతులతో, పరిమళాలను వెదజల్లే పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకరింప బడుతుంది. సంవత్సర కాలంలో కేవలం రెండు రోజులు మాత్రమే ప్రాప్తించే ఈ వైకుంఠ ప్రదక్షిణం కావించుకున్న భక్తులు ఒక విశిష్టమైన దివ్యానుభూతికి లోనవుతారు.


 ఏకాదశి పవిత్ర దినాన – ముల్లోకాలలో కొలువై వున్న మూడు కోట్ల యాభై లక్షల పుణ్య తీర్థాలు, పుష్కరిణిలు – అన్ని తిరుమల లోని స్వామిపుష్కరిణి యందు సూక్ష్మరూపంలో లీనమై ఉంటాయని ప్రతీతి. -


 ఆ రోజు ఉభయ దేవేరులతో కూడిన మలయప్పస్వామి వారికి కన్నుల పండువగా రథోత్సవం జరుగుతుంది. శ్రీవారిసన్నిధిలో *"రాపత్తుతొడక్కం"* అనే వేడుకను ఘనంగా జరిపి, శ్రీనమ్మాళ్వార్ రచించిన *"భగవద్విషయం"* లేదా *"తిరువాయ్ మొళి"* అనే దివ్యప్రబంధం లోని *"నాల్గవ ఆయిరం"* అధ్యయనం ప్రారంభిస్తారు.


 మరునాటి, ద్వాదశి తిథి యందలి సూర్యోదయ వేళలో *"శ్రీస్వామిపుష్కరిణి తీర్థముక్కోటి"* అనే ఘట్టం ఘనంగా జరుపబడుతుంది. ఆరోజు ఉదయం సేవలన్నీ యథావిధిగా జరిగిన తరువాత, ఆనందనిలయం లోని చక్రత్తాళ్వార్ (సుదర్శనచక్రం యొక్క ఉత్సవమూర్తి) పల్లకిని అధిరోహించి, తిరుమల మాడవీధుల్లో ఊరేగింపుగా వచ్చి శ్రీవరాహస్వామి ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. అక్కడ చక్రత్తాళ్వార్ కు అభిషేకం జరిపి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. వారితో పాటుగా వేలాది మంది భక్తులు కూడా పుష్కరిణిలో పవిత్రస్నాన మాచరించిన తదనంతరం, చక్రత్తాళ్వార్ కు వస్త్రాలంకరణ గావించి, నివేదనలనిచ్చి, హారతులు అందజేస్తారు. ఆ తరువాత చక్రత్తాళ్వార్ వారు ఆలయ పునఃప్రవేశం చేస్తారు.


‌ శ్రీవారి దర్శనానంతరం అసంఖ్యాకమైన భక్తులు వైకుంఠ ప్రదక్షిణం గావిస్తున్నందున, ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని *"వైకుంఠద్వారస్థ భగవదవలోకన మహోత్సవం"* గా కూడా అభివర్ణిస్తారు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

భగవంతునికి దగ్గర

 తొమ్మిది మార్గాలలో మన పూర్వీకులు ఎవరు ఏ విధంగా భగవంతునికి దగ్గర అయ్యరో చూద్దాం............!!

1. శ్రవణం( వినడం ) భక్తి చేత పరిక్షిత్ మహరాజు తరించాడు.

2. కీర్తనం( పాడడం ) చేత నారద మహర్షి తరించాడు.

3. స్మరణం ( నోటితో ఎల్లప్పుడు పలకడం ) చేత ప్రహ్లదుడు తరించాడు.

4. పాదసేవనంతో లక్ష్మణుడు తరించాడు.

5. అర్చణంతో పృధు చక్రవర్తి తరించాడు.

6. వందనం చేత అక్రూరుడు తరించాడు.

7. దాస్య భక్తి (సేవ )చేత గరుత్మంతుడు, హనుమంతుడు తరించాడు.

8. సఖ్యం భక్తి చేత అర్జునుడు తరించాడు.

9. ఆత్మనివేదనంతో బలిచక్రవర్తి తరించారు.


*శ్రీవారి సుప్రభాత సేవ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది తెలుసా......

* శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం" ..........


*కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము.*  


*"సు-ప్ర భాతము" అనగా "మంచి ఉదయం" అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను,*


*భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది.*


*ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ ప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం" అని అంటారు.*


*చాలా శైవ, వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్నా "సుప్రభాతం" అనగానే వెంకటేశ్వర సుప్రభాతం మాత్రమే  స్ఫురణకు రావడం ముమ్మాటికీ నిజం.*


*సుప్రభాతం జరుగు విధానం :........

*ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తం (2.30 నుండి 3.00) గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది.*


*ఆ సమయంలోనే 'సన్నిథిగొల్ల' దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖాసన అర్చకస్వామి ఇంటికి,*


*బేడిఆంజనేయస్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు.*


*అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే 'కుంచెకోల' అనే సాధనం, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు.*


*వారు క్షేత్ర పాలకులకు, ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి, బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు.*

   

*ఆ సమయానికి ఆలయ అధికారులు, పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులు,*


*తాళ్ళపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు.*


*తాళాలు తీసిన తర్వాత సన్నిథిగొల్ల బంగారు వాకిలి తెరచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు.*


*ఆ తర్వాతే అర్చకులు మధురస్వరంలో "కౌసల్యా సుప్రజా రామా ...'' అంటూ సుప్రభాతం అందుకొంటూ లోనికి ప్రవేశిస్తారు.*


*ఆ తర్వాత మహంతు, మఠం వారు తెచ్చిన 'పాలు, చక్కర, వెన్న, తాంబూలం' ఉన్న పళ్లెరాన్ని ఏకాంగి అందుకుని లోనికి తీసుకొని వెళ్తారు.*

    

*బంగారు వాకిలి ముందునున్న వేదపండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనాను కొనసాగిస్తారు.*


*సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాలరాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు.*


*దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిథిగొల్ల 'కులశేఖర పడి' వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు.*


*ఆ తరువాత అర్చకులు, ఏకాంగి 'కులశేఖరపడి' దాటి లోపలికి ప్రవేశిస్తారు.*

   

*తరువాత శయన మండపంలో బంగారుపట్టు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు.*


*ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు ఆపైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో.. మూల మూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు.*


*ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన, ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు.*


*మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి, స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు.*

 

*బంగారు వాకిలి ముంగిట్లో వేదపండితులు (సుప్రభాతం) మంగళా శాసనాన్ని ముగిస్తూ ఉండగా, లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు.*


*నవనీత హారతి' అంటే నివేదనాంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు. ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు.*

    

*అపుడు శ్రీవారి పాదాలపై తులసీదళాలు, పుష్పాలు కూడా ఉండవు.*


*భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని 'విశ్వరూప సందర్శనం' అని భక్తితో పిలుస్తారు.*

    

*ఈ హారతి తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని, శఠారిని తాము ముందుగా స్వీకరించి.*


*ఆ తరువాత జియ్యంగారికి, ఎకాంగికి ఇస్తారు. సన్నిథిగొల్లకు కూడా తీర్థం, శఠారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు.*


*స్వామివారి సుప్రభాత సేవకోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించి తీర్థం, శఠారులను స్వీకరిస్తారు.*


*ధనుర్మాసంలో మాత్రం `సుప్రభాత గానం లేదు. ఆళ్వారులలో ఒకరయిన అండాళ్ తిరుప్పావై పాశురాన్ని గానం చేస్తారు.* 


*ఇతర మాసాలలో భోగశ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా,  ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణస్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకొంటారు..


*కౌసల్యా సుప్రజా రామ ..గోవిందా నవనీత చొర గోవిందా.. విశ్వరూప సందర్శక.. గోవిందా..


            ఓం నమో వేంకటేశాయ.

రేడియో కార్యక్రమాలు

 ఫేస్బుక్కులోంచి  ( రామిశెట్టి దుర్గాప్రసాద్ గారు వ్రాసింది) - 


*రేడియో కార్యక్రమాలు & రేడియో పంచిన ఆనందం* ఇలా ఉండేది...

**********************************************

*📻ఉదయం ఆరు గంటలకు*


*📻ఆకాశవాణి... విజయవాడ కేంద్రం* ఇప్పుడు *సమయం* (గంటలు, నిమిషాలు, సెకండ్లు) చెప్పేవారు.


📻రెడీగా దగ్గర పెట్టుకున్న గడియారంలో టైము సరిచేసేసుకొనేవారు!


*📻రేడియోలో ప్రతి హిందూ పండగకి ఉదయం 4 గంటలకే కార్యక్రమాలు మొదలయ్యేవి.*


*📻4 గంటలనుండి *మంగళ స్నానం* చేసుకునే సమయంలో *మంగళ వాయిద్యాలు* (సన్నాయి) ప్రసారం చేసేవారు.


ఆరు గంటలకు *పుష్పాంజలి* మొదలయ్యేది.


📻ఆదివారం నాడు *'శ్రీ సూర్య నారాయణ... వేద పారాయణ...',*


సోమవారం నాడు

*📻భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, 'శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా'* అన్నపాటో, *కలియుగ రావణాసురుడు సినిమాలో 'నమో నమో హనుమంతా' అన్నపాటో... ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది* ఏంవినబోతున్నామో!


7 *గంటలకు! వార్తలు చదువుతున్నది "అద్దంకి మన్నార్* "


*📻మధ్యాహ్నం 'ఆకాశవాణి! వార్తలు చదువుతున్నది...'* *అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, పార్వతీ ప్రసాదో...* ఎవరో ఒకరు పలకరించేవారు. ఆ తర్వాత... '


*📻కార్మికుల కార్యక్రమం'.*

*చిన్నక్క, ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు.


📻సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే *పసిడిపంటలు* మొదలయ్యేది.


పసిడిపంటలవ్వగానే *ప్రాంతీయ వార్తలు* చదివేవారు... ప్రయాగ రామకృష్ణ లేక తిరుమలశెట్టి శ్రీరాములు.*


📻అవవ్వగానే *మనోరంజని!* మీరు కోరిన మధురగీతాలు వింటారు! అని మీనాక్షో, ఏవియస్ రామారావో అనగానే ఇంట్లో అందరం సంబరపడిపోయేవాళ్ళం.


*📻ఆ అరగంటా ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచి మంచి పాటలన్నీ వేసేవారు. అవన్నీ చెవులు రిక్కించి మరీ వినేవాళ్ళం.*


📻రెండవ్వగానే *ఢిల్లీ నుంచి వార్తలు* అని చెప్పేవారు. ఇంకా కొన్ని సెకన్లు ఉంటే... కు... కు... కు... అంటూ ఏదో రకం సౌండ్ పెట్టేవారు. *ఇంగ్లీషులో వార్తలు*... ఢిల్లీనించి ప్రసారమయ్యేవి.


*ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం.*


*📻ఇక ఆదివారాలు*

*సంక్షిప్త శబ్ద చిత్రం, సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారం చేసేవారు...* *వి.బి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఎ.వి.యస్. రామారావు, పాండురంగ విఠల్...* వీరందరూ ఎక్కువగా వినబడేవారు. వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్ళం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లూలేని ఆ భాష వింటే చాలు...మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.


*📻ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ పాటలవీ వేస్తుండేవారు.*


📻అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీనుంచి *శాస్త్రీయ సంగీత కార్యక్రమం* వెలువడేది. ఉద్దండులైన కళాకారులందరూ వినిపించే ఆ స్వరవిన్యాసాన్ని ఆలకించిన మాజన్మలు ధన్యం.


📻ఇక *సిలోన్* ఇక్కడ హిందీ పాటలు బాగా వచ్చేవి. మధ్యాహ్నం కొన్ని తెలుగు పాటలు వచ్చేవి. *📻ఆ సిలోన్ స్టేషన్ సరిగ్గా వచ్చేది కాదు, కానీ, చెవి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినేవాళ్ళం.*


*📻రేడియో ఒక ప్రసారసాధనంలానో, పాటలపెట్టెలానో కాకుండా మాకు భాషమీద మంచి పట్టును తెచ్చిపెట్టిన యంత్రంలా మేమందరం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం.*


*📻ఆ కాలంలో... పసితనం నుండి మనమందరం రేడియోతో పెనవేసుకుపోయాం. కాలక్షేపం, వినోదం అంతా రేడియోతోనే!*


*📻అప్పట్లో... సినిమా, రేడియో తప్ప వేరే వినోదం అనేది ఉండేది కాదు.* రేడియోలో పాత, కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం.


📻ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల మ్యూజిక్ ను బట్టి ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో, పాట ఏమిటో చెప్పే వాళ్ళం. S.D. బర్మన్, నౌషాద్, మదన్ మోహన్...శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ , R. D. బర్మన్...ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు.


*📻ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.*


📻అసలు రేడియో విచిత్రం..

అందులోకి మనుషులు

వెళ్లి మాట్లాడతారా అన్న

ఆశ్చర్యం...అమాయకత్వం..


📻ఆదివారం మధ్యాహ్నం గుమ్మం ముందు కూర్చుని రేడియో లో *సంక్షిప్తశబ్ద చిత్రం*

(*ఒక గంటకి కుదించిన)* సినిమాని వింటే ఎంత ఆనందం...


*📻📻రారండోయ్... రారండోయ్...'*

*హైదరబాదు బాలలమూ* *జైహిందంటూ పిలిచామూ*...*రఁయ్ రఁయ్ మంటూ* *రారండోయ్*...*రేడియో ప్రోగ్రామ్* *వినరండోయ్*...అని

*ఆంధ్ర బాలనంద సంఘం* రేడియో కార్యక్రమం ప్రారంభంలో వినిపించే *పిలుపు పాట.*

ప్రోగ్రామ్ అయిపోయిం తర్వాత...

*📻బాలవినోదం విన్నాము... బాలల్లారా ఈపూట... చాలిక కథలు చాలిక మాటలు చాలిక పాటలు... నాటికలు...చెంగున రారండి...చెంగు చెంగున పోదాము* అని ఉండేది.


*📻1950లనుండి కొనసాగిన బాలానందం ప్రోగ్రాం రేడియోలో వినని వారుండరు. న్యాయపతి రాఘవ రావు (రేడియో అన్నయ్య) గారు, న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య) రూపొందించిన ఆ ప్రోగ్రాం లో పి. సుశీల గారు కూడా పాడేవారు.*


*📻క్రికెట్ కామెంటరీ వింటూ... మురిసిపోయేవాళ్ళం.*


రేడియో సిలోన్ లో ప్రతీ బుధవారం, రాత్రి 8గంటలకు క్రమం తప్పకుండా *బినాకా గీత్ మాలా* వినేవారం.


📻వాతావరణ విశేషాలు వరకు విని, 'అబ్బో... ఇంకో రెండు రోజులు వర్షాలు' అని గొణుక్కుంటూ...* ఇలా ...


*📻ఇంకా అనేకానేక ఆనందాలనందించిన రేడియోకి ధన్యవాదాలు*

తాడ్ బండ -- శ్రీ హనుమాన్ దేవాలయం

 🎻🌹🙏 స్వయంభూగా  వెలసిన 

తాడ్ బండ  -- శ్రీ హనుమాన్ దేవాలయం...!!


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌸 ఆంజనేయుడు మహా పరాక్రమవంతుడు, అపజయమే ఎరుగనివాడు. శత్రువులను సంహరించడంలోను భక్తులకు అభయమివ్వడంలోను ఆయన ఎంత మాత్రం వెనుకాడడు. 


🌿ఆయన పేరు వింటేనే భూత.. ప్రేత.. పిశాచాలు కంటికి కనిపించనంత దూరం పారిపోతాయి. అంతటి శక్తిమంతుడైన ఆంజనేయుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు. 

       

🌸ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమ ఉంటారు..హనుమ ఉన్న చోట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది..హనుమ అంటే కాషాయం.. ఇంటింటి పైన కాషాయ జెండా ఉన్నంత వరకు మనకు,మన కుటుంబానికి,మన సమాజానికి,మన దేశానికి,మన ధర్మానికి ఎటువంటి డోఖా లేదు..ఏ దుష్ట శక్తులు ఏమి చేయలేవు..అదే సనాతన ధర్మం చెబుతుంది.


🌿 సనాతన ధర్మం లో భాగంగా  ఆవిర్భవించిన ఆలయమే శ్రీ తాడుబందు వీరాంజనేయ ఆలయం.

భాగ్యనగరం లోని సైనిక్పురి సమీపంలోని  సిఖ్ విల్లెజ్  దగ్గర పూర్వం తాడ్బంద్  గ్రామం ఉండేది. అక్కడ వెలసిన వీరంజనేయుడే తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి దేవాలయంగ వెలుగొందుతున్నది . 


🌸 ఈ గ్రామంలో ఎనబై సంవత్సరాల క్రితం పొదల్లో ఒక పెద్ద బండ రాయి బయటపడింది బండరాయి పైన వీరంజనేయుడూ  సుందర రూపం లో చెక్కబడి ధర్శనం ఇచ్చాడు.


🌿ఇక్కడే స్వామి వారి కోసం ఆలయాన్ని నిర్మించారు. రామాయణ కాలం లో జాబిలి మహర్షి ప్రతిష్టించిన మూడు ఆంజనేయ విగ్రహాలలో ఇది ఒకటి అని  స్థల పురాణం


 🌸త్రేతాయుగంలోనే ఇక్కడ స్వామి స్వయంభువుగా అవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతున్నది. 

జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు. మరి ఈ ఆలయ విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం..


🌹 స్థలపురాణం:🌹


🌿 శ్రీ తాడుబందు వీరాంజనేయ ఆలయం వాడుకలో ఈ ప్రాంతాన్ని తాడ్‌బండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. తాడ్ బండ్ ప్రాంతంలో నెలకొన్న

 శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం స్వయంభువుడని ప్రతీతి. 


🌸 మొగలులు, రాజపుత్రులు, కుతుబ్ షాహీలు ఈ దేవాలయం కోసం కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెబుతుంటారు.


🌿 త్రేతాయుగంలో జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేయగా ఆంజనేయుడు ప్రత్యక్షమైనట్లు చెబుతారు. అందుకే జాబాలి మహర్షి ఇక్కడ వీరాంజనేయస్వామిని ప్రతిష్ఠించినట్టు చెబుతారు. 


🌸తన తపస్సుకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూడమని మహర్షి వినాయకుడిని ప్రార్థించాడట. అందువల్ల ఇక్కడ ఆంజనేయుడితో సహా వినాయకుడు కూడా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.


🌿శ్రీ తాడుబందు వీరాంజనేయుడిని పూజిస్తే ఆపదలు, అనారోగ్యాలు తొలగిపోతాయి


🌸 జాబాలి మహర్షి ఇక్కడ వీరాంజనేయస్వామిని ప్రతిష్ఠించినట్టు తెలిసి శ్రీ రాముడు హర్షాన్ని వ్యక్తం చేసినట్టు స్థలపురాణంలో వుంది. 

ఆ తరువాత ఎందరో మహనీయుల రాకతో మరింత పవిత్రమైన ఈ క్షేత్రం, కాలక్రమంలో కనుమరుగైపోయింది.


🌿ఆ తరువాత 19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేశాడు. అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయ సహకారాలతో, నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు. ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి. 


🌹ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే...🌹


🌸 హనుమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలు శిలాఫలకంపై ఉన్నాయి. నవ వ్యాకరణంలో చివరి నాలుగు అంకాలను పూర్తి చేయాలంటే ఖచ్ఛితంగా గృహస్తుడై ఉండాలని, ఇందుకోసం తన కమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని స్వామివారికి గురువైన సూర్యుడు సూచిస్తాడు.


🌿ఇందుకు అంగీకరించిన ఆంజనేయుడు ఆమెను వివాహమాడతాడు. కానీ, ఆపై బ్రహ్మచారిగానే కొనసాగాడు. ఇక సువర్చల స్వామివారి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపేస్తుంది. వీరిద్దరి ప్రతిమలు ఇక్కడ మనకు గోచరిస్తాయి. 

       

 🌸ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా మంగళ - శని వారాల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. 


🌿ఇదే ప్రాంగణంలో సీతారాములు ... శివుడు దర్శనమిస్తూ వుంటారు. హనుమజ్జయంతి శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతుంటాయి. 


🌸40 రోజులపాటు జరిగే మండల దీక్షలు, మండల ప్రదక్షిణాలు, మండల అభిషేకాల కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు. మండల ప్రదక్షిణలు, పూజల కోసం ప్రత్యేకంగా నలభై రోజులపాటు ఇక్కడే ఉండాలని కోరుకుంటారు.


🌹 హనుమాన్ జయంతి వేడుకలు :


🌿భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు తాడ్‌బంద్ వరకు నిర్వహించే శోభాయాత్రతో ఘనంగా ముగుస్తాయి.


🌸 ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్‌మాన్ (చిన్నజయంతి), వైశాఖ బహుళ దశమినాడు (పెద్ద హను మాన్) జయంతిని ఘనంగా నిర్వహిస్తారు.


🌿 లక్షలాది దీక్షాపరులు, భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ముఖ్యంగా పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మూడురోజుల పాటు హోమం, యాగాదులు నిర్వహిస్తారు... స్వస్తి....🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

భాగవత సప్తాహం యొక్క విశిష్టత

 *భాగవత సప్తాహం యొక్క విశిష్టత*

       ---చాగంటి వారి ప్రవచనం నుండి...


     భాగవతమును శుకబ్రహ్మ పరీక్షిత్తు మహారాజుకు 7 రోజులు చెప్పారు. 

ఎందుకు 7 రోజులు చెప్పవలసి వచ్చింది... 

   భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది. 


     ఒక మనిషి ఎన్ని సంవత్స రములు బ్రటకనివ్వం డి.. 70 కానీ 90 కానీ నూరు సంవత్సరములు కానీ పూర్ణంగా బ్రతకనివ్వండి. ... కానీ ఎన్నిరోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడు రోజులే అని మనం తెలుసుకోవాలి.


   *ఎందుచేత???..* ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని... ఇంత కన్నా ఇంకా రోజులు లేవు.  

ఎనిమిదవ రోజు ఇంక లేదు... ఎప్పుడు మరణిస్తాడు.... ఎంత గొప్పవాడని వాడు పోవడానికి 8 వ రోజు ఉండదు,  ఆ ఏడు రోజులలోనే ఎవ్వరైనా వెళ్లిపోవాలి. 

ఆ ఏడు రోజులలోనే పుట్టాలి, ఆ ఏడు రోజులలోనే ఉండాలి, ఆ ఏడు రోజులలోనే తిరగాలి, కాబట్టి భాగవత సప్తాహము అంటే నీవు ఏరోజు న భగవంతుడిని స్మరించడం మానివేసావో ఆరోజు పరమ అమంగళ కరమైన రోజు.

 ఆరోజు భగవంతుని యెడల విస్మృతి కలిగింది కాబట్టి తను భగవన్నామమును పలుకలేదు. 


ఈశ్వరునికి నమస్కరించలేదు, ఈశ్వరుని గురించి తలంపు లేదు, ఆ రోజున తను ఉండి మరణించిన వానితో సమానం. 

     

    కాబట్టి ఆరోజున ఇంటి ఏమి తిరిగింది... నడయాడిన పీఠము ఒకటి తిరిగింది. 

ఒక శవం ఆ ఇంట్లో నడిచింది, కాబట్టి ఆరోజు ఆ ఇల్లు అమంగళము అయింది. 


    *కాబట్టి ఏది బ్రతుకు, నిజమైన బ్రతుకు ఏది.. నిజమైన బ్రతుకు ఈశ్వరుని నామ స్మరణమే. 

భగవంతుని నామమును ఎవరు స్మరిస్తా రో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు. 


అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్ఫురణకు వస్తుందా... 

ఆ వస్తువు నందు నీకు ప్రీతి ఏర్పడితే నీ మనస్సు భగవన్నామస్మరణం చేయడానికి అవరోధం ఉండదు. 

మీరు ఎక్కడ కూర్చున్నా మీ మనస్సు మీకు ఇష్టమైన వస్తువును గురించి స్మరిస్తూ ఉంటుంది. 

మనస్సు ఆ వస్తువు నందు ప్రీతి చెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. 

    

మీ మనస్సు ఈశ్వరుని యందు ప్రీతి చెందక పోతే ఈశ్వరుని నామమును స్మరించదు. 

ఇపుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాస భగవానుడు భాగవతము నందు ప్రతిపాదన చేస్తున్నారు. 

     

అందుకే భాగవతమును ఎవరు వింటారు వారి మనస్సు తెలిసో, తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది.


🙏🌸జై శ్రీమన్నారాయణ🌸🙏

*శ్రీ అయ్యప్ప స్వామి వారి - సన్నిధానం

 *శ్రీ అయ్యప్ప స్వామి వారి -   సన్నిధానం🙏🌺🌷*



💠 అయ్యప్ప అంటే "హరిహరసుతుడు". 

 విష్ణువు (హరి) మరియు శివుడి (హరుడు) యొక్క కుమారుడు. "అయ్యా" - "అప్ప" కలిసి "అయ్యప్ప" అని అంటారు. 

అయ్యప్పని "మణికంఠుడు", "ధర్మశాస్త" అని కూడ అంటారు.


*🔆 అయ్యప్పస్వామి జన్మ రహస్యం*


💠 అయ్యప్ప అనుచరులకు వచనమైన భూత్నాథోపాఖ్యానం ప్రకారం, అయ్యప్ప ఎలా జన్మించాడనే కథను సూత మహర్షి తన అనుచరులకు చెప్పాడు . 


💠 చాముండి మహిషాసురుడిని చంపిన తర్వాత, అతని సోదరి మహిషి దేవతల మీద పగ తీర్చుకోవడానికి వచ్చింది . 

బ్రహ్మ మహిషికి ఒక వరం ఇచ్చాడు- ఇద్దరు మగవారికి జన్మించిన మానవుడు మాత్రమే ఆమెను చంపగలడు.


💠 దేవతలు భయపడి శ్రీ మహావిష్ణువు నుండి సహాయం కోరారు. మోహిని అవతారం తీసుకున్న శివ విష్ణువుల కలయిక వల్ల మణికందన్ అనే కొడుకు పుట్టాడు.


💠 మణికందన్ దక్షిణ భారతదేశంలోని పంపా నది ఒడ్డున విడిచిపెట్టబడ్డాడు. సంతానం లేని పంథాలం వంశానికి చెందిన రాజశేఖర చక్రవర్తి ఈ బిడ్డను కనుగొన్నాడు. 

ఇంతలో, రాణి ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

 రాణికి మణికందన్ నచ్చలేదు మరియు అతనిని తొలగించడానికి ఒక పథకం వేసింది. పులి పాలు తాగితేనే వైద్యం అందుతుందని ఆమె తన అనారోగ్యం గురించి అబద్ధం చెప్పింది. 


💠 పన్నెండేళ్ల మణికందన్ తన తల్లి కోసం పులి పాలను వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్లి  మహిషిని నాశనం చేశాడు. 

మహిషి మరణానికి దేవతలు సంతోషించారు. ఇంద్రుడు పులి రూపాన్ని ధరించాడు .

అతను ఆలయం ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి అడవిలోకి బాణం విసిరాడు, ఆలయాన్ని నిర్మించమని వారిని ఆదేశించాడు, ఆపై దేవలోకానికి బయలుదేరాడు.


💠 అయ్యప్ప  ఇక్కడ ధ్యానం చేయడానికి వచ్చారు. ఈ క్షేత్రాన్ని మణిమండపం అంటారు. శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించాడు మరియు ఆయన స్థాపించిన ఐదు శాస్తా ఆలయాలలో ఇది ఒకటి. 


*🔆 శబరిమల ఆలయ ప్రాముఖ్యత*


💠 అయ్యప్ప దీక్షాకాలంలో 40 రోజుల ఉపవాసం మరియు సంపూర్ణ బ్రహ్మచర్యం భక్తులకు అవసరం మరియు ప్రాపంచిక వ్యవహారాల నుండి స్వీయ నిగ్రహం కూడా అవసరం.

ఆలయం నుండి తిరిగి వచ్చే వరకు, భక్తులు క్షౌరము చేయరు మరియు వారి నుదిటికి గంధం పూస్తారు.

యాత్రికులు వారి నలుపు లేదా నీలం దుస్తులు, రుద్రాక్ష మాల ద్వారా గుర్తించబడతారు మరియు వారు మాంసం మరియు పొగాకును ఖచ్చితంగా నివారించాలి.


💠 ప్రధాన ఆలయానికి దారితీసే 18 పవిత్ర మెట్లు ఉన్నాయి మరియు అనేక నమ్మకాల ప్రకారం, మొదటి ఐదు మెట్లు ఇంద్రియ అవయవాలను సూచిస్తాయి, తదుపరి ఐదు రాగ్సాలను సూచిస్తాయి, మరో మూడు గుణాలను సూచిస్తాయి మరియు మిగిలిన రెండు విద్య మరియు అవిద్యలను సూచిస్తాయి. కొన్ని ఇతర నమ్మకాల ప్రకారం ఈ 18 మెట్లు పురాణాలను సూచిస్తాయి.


💠 ఈ ఆలయం 40 అడుగుల ఎత్తులో ఉన్న పీఠభూమిపై నిర్మించబడింది మరియు ఆలయ గోపురం బంగారంతో కప్పబడి ఉంటుంది.

ఐదు లోహాల మిశ్రమం అయిన పంచలోహ మూలకాన్ని ఉపయోగించి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తయారు చేశారు.


*🔆 శబరిమల ఆలయంలో పండుగలు*


💠 నవంబర్ నుండి ఏప్రిల్ నెలలలో, ఆలయంలో వార్షిక ఉత్సవాలు జరుపుకుంటారు. 

మకర సంక్రాంతి పూజ మరియు మండల పూజ ఈ ఆలయంలో జరిగే రెండు ప్రధాన పూజలు.

 ఈ సమయంలో, గరిష్ట సంఖ్యలో ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తారు. మండలపూజ నవంబర్ 15న ప్రారంభమై డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది. 

తరువాత, జనవరి 14 న, మకరవిళక్కు లేదా మకర సంక్రాంతి పూజ ప్రారంభమవుతుంది, ఇది ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. 

ఏప్రిల్ 14న జరుపుకునే మహావిషువ సంక్రాంతి కూడా ఈ ఆలయంలో పూజలందుకుంటుంది. 

 

💠 ఈ ఆలయం 40 అడుగుల ఎత్తులో ఉన్న పీఠభూమిపై నిర్మించబడింది మరియు ఆలయ గోపురం బంగారంతో కప్పబడి ఉంటుంది. పంచలోహ మూలకాన్ని ఉపయోగించి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తయారు చేస్తారు.


💠 మకర విళక్కు : 

శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగ మకర విళక్కు.  

ఇది ఏడు రోజుల పండుగ, ఇది మకర సంక్రాంతి రోజున, సూర్యుడు వేసవి కాలం లో ఉన్న రోజున ప్రారంభమవుతుంది.  

పురాణాల ప్రకారం, ధర్మ శాస్తా విగ్రహం ఈ రోజున ఆలయంలో ప్రతిష్టించబడింది.  మకర విళక్కు వార్షిక ఉత్సవాలు ఈ పవిత్ర ఘట్టాన్ని గుర్తు చేస్తాయి.

  

💠 వేడుకల సమయంలో విగ్రహాన్ని అలంకరించే ఆభరణాలు మకర సంక్రాంతికి మూడు రోజుల ముందు పందళంలోని వలియ కోయిక్కల్ శాస్తా ఆలయం నుండి తీసుకువస్తారు.  


💠 ఈ పండుగలో మరో విశేషం ఏంటంటే.. లక్షలాది మంది వీక్షించేవారిపై చెరగని ముద్ర వేసే మకరజ్యోతి. 



💠 రైలు మార్గంలో యాత్రికులు రైలు ద్వారా కొట్టాయం & చెంగన్నూరు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో పంపా చేరుకోవచ్చు.

శబరిమల మాలికపురత్తమ్మ .

 *శబరిమల మాలికపురత్తమ్మ ...!!* 🙏🌺


🌿మాలికపురత్తమ్మ గుడిలో టెంకాయ  దొర్లించి

వదిలేయడం ఎందుకు

ఇందులోని పరమార్థం ఏమిటి ?🙏*

    

🌸కేరళలోని శబరిమల గురించి తెలియని వారు బహుశా ఉండరు. మండల దీక్షలో ఉండి , ఇరుముడి కట్టుకొని , అందులో నెయ్యి నింపిన ముద్రకాయ , పీచు తీసిన కొబ్బరికాయలు శబరిమలకు అయ్యప్పలు తీసుకవెళ్లటం ఆచారం.

    

🌿ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగులకొట్టి , అందులోని నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయిస్తారు. 


🌸గుడిలో కాయను కొట్టరు ఆ కొబ్బరికాయను  కాల్చేస్తారు. మరొక కొబ్బరికాయ అమ్మవారి గుడిలో అమ్మ గుడి చుట్టూ దొర్లించి , కొట్టక ఒక మూలకు విడిచి వస్తారు. ఎందుకు? 


🌿మాలికాపురత్తమ్మ గుడిలో  కొబ్బరి కాయలు దొర్లించుటలో పరమార్తము , ఆధ్యాత్మిక భావన దాగి ఉన్నది.  


🌸 నెయ్యి నింపని కొబ్బరికాయను అనగా మూడు కన్నులు కల నారికేళము లో స్వచ్ఛమైన భగవత్ప్రసాదిత జలము ఉండును. 


🌿ఈ కాయను పగులకొట్టరాదు. మనలో దాగి ఉన్న 18 భావనలను ఈ కొబ్బరికాయలో ఇమిడ్చి అమ్మవారి సన్నిధిలో వదిలివేయడమే ఈ చర్యలోని భావన.


🌸మాలికాపురత్తమ్మ దేవి సాక్షిగా నా లోని కామ , క్రోధ , లోభ , మోహ , మధ మాత్సర్యాలను  సదరు కాయలో భందించి , ఇక్కడే వదిలి పెట్టివెళుతున్నానని , చెప్పి భక్తులు ఇక్కడ టెంకాయను దొర్లించి నిర్గుణులై , పరిశుద్ధులై వెళ్లడం అనేది అంతరార్థం.


🌿నారికేళము ఈశ్వర , విష్ణు సంభంధమైనది. టెంకాయ పై  నిలువు చారలు విష్ణు రూపమైతే , కొబ్బరికాయ పై ఉన్న మూడు కన్నులు శివరూపం.


🌸కొబ్బరికాయలోని "అహం" అనే నీటిని తీసి , హరి హరుల కిష్టమైన నెయ్యిని  అందులో నింపి , స్వామికి ఆ నెయ్యే నా జీవమని అభిషేకమునకు ఇస్తారు.


🌿 ఆయన తృప్తితో మన జీవాన్ని తిరిగి ప్రసాద రూపంలో (నెయ్యి)  మనకిస్తాడు. పిదప జీవత్సవమైన కాయ (కాయము , అనగా మన శరీరం) ను మంటల్లో వేసి కాలుస్తారు. 


🌸శబరి యాత్ర చేసి వచ్చువారు పుణ్యజీవులై , పరిశుద్ద శరీరంతో , లోన దుర్గుణాలన్నియు సత్సీలురై  పరమ పావన రూపులై వస్తారని అర్థం...


స్వస్తి..🙏🌹


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

*శ్రీ శాస్తా పంచాక్షర స్తోత్రం*

 *శ్రీ శాస్తా పంచాక్షర స్తోత్రం*


*ఓంకారమూర్తిమార్తిఘ్నం దేవం హరిహరాత్మజమ్ |*

*శబరీపీఠనిలయం శాస్తారం ప్రణతోస్మ్యహమ్ || ౧ ||*


*నక్షత్రనాథవదనం నాథం త్రిభువనావనమ్ |* 

*అమితాశేషభువనం శాస్తారం ప్రణతోస్మ్యహమ్ || ౨ ||*


*మన్మథాయుతసౌందర్యం మహాభూతనిషేవితమ్ |* 

*మృగయారసికం శూరం శాస్తారం ప్రణతోస్మ్యహమ్ || ౩ ||*


*శివప్రదాయినం భక్తదైవతం పాండ్యబాలకమ్ |* 

*శార్దూలదుగ్ధహర్తారం శాస్తారం ప్రణతోస్మ్యహమ్ || ४ ||*


*వారణేంద్రసమారూఢం విశ్వత్రాణపరాయణమ్ |* 

*వేదోద్భాసికరాంభోజం శాస్తారం ప్రణతోస్మ్యహమ్ || ౫ ||*


*యక్షిణ్యాభిమతంపూర్ణ పుష్కళా పరిసేవితం |*

*క్షిప్రప్రసాదకం నిత్యం శాస్తారం ప్రణతోస్మ్యహమ్ || ౬ ||*


*॥ఇతి శ్రీ శాస్తా పంచాక్షర స్తోత్రం॥*

మంత్రం యొక్క పరమార్ధం

 మంత్రం యొక్క పరమార్ధం


(శృంగేరి శారదా పీఠం 34వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి బోధలు)


“మననాత్ త్రాయతే ఇతి మంత్ర:” మననం చేయువానిని రక్షించునది మంత్రము. అయితే అది ఏదో విచిత్ర ధ్వనుల కలగూరగంప అని, దానినే ముద్రిత గ్రంధమునుండి గాని గ్రహింపవచ్చు అని కాని భావించినప్పుడు ఆ మంత్రం సారహీనము, నిష్ఫలము. అట్టి మంత్రములు అమిత ఆధ్యాత్మిక తపశ్శక్తి సంపద కలిగిన శ్రీ జగద్గురువుల వంటి వారిచే ఉపదేశింపబడినప్పుడే శక్తివంతములు, ఫలవంతములు. మంత్రముల యందు, వైదిక కర్మకాండయందు సామాన్యముగా సామాన్య జనముకు విశ్వాసము తగ్గడానికి కారణం ఏమిటి అనగా - అట్టి వాటిని యోగ్యత లేనివారు చేబూని ఆర్భాటము చెయ్యడం వలన, అటువంటి వారి యందు అవి నిష్ఫలములే కాదు, అపాయమును, ఉపద్రవమును కలిగించవచ్చును కూడా. అందరూ మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని వెటకారం చేస్తున్నారు కానీ నిజంగా ఆ మంత్రములను ప్రయోగిస్తున్న వారి యోగ్యత చూడడం లేదు. 


కొందరు మూర్ఖులు వీటి విలువ తెలియక వైదిక క్రియలు, విగ్రహ అభిషేకాలు, యజ్ఞాది క్రతువులు కేవలం నిరుపయోగం అని, ధన వ్యయం, ద్రవ్య వ్యయము, శక్తి వ్యయము అని నిందిస్తూ దాని బదులు కొంతమందికి ఇల్లు కట్టచ్చు, భోజనం పెట్టచ్చు, ఇతరత్రా మానవ ఉపయోగామునకై మళ్ళించవచ్చు అని చెబుతున్నారు.


అటువంటి మూర్ఖులను మనం నేడు ఈ సామాజిక సంఘాలలో కూడా చూడవచ్చును. ఆ క్రతువుల విలువ వాటిద్వారా ఫలం పొందిన వారికి అర్ధం అవుతుంది. గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన అన్నట్టు  వారికి  తెలియని విషయాలను అనవసరంగా వాళ్లకు ఉన్న చత్వారపు కళ్ళజోళ్ళలో చూసి తీర్పు చెయ్యకూడదు. తద్వారా ఆ మంత్రశక్తి ని అవమానించి అనవసరపు పాపాన్ని పోగు చేసుకుంటున్నారు. అన్ని పాపాలు ఒక్క సారే తేలిపోవు. కొన్ని పాపాలు పండాలంటే కొన్ని జన్మలు పడతాయి. అలాగే మనం నేడు అనుభవించే కష్టాలు కొన్ని జన్మల క్రితం చేసిన పాప ఫలమే. ఒక కధ ఉన్నది. 


ధృతరాష్ట్రుడు తాను 100 మంది కుమారులు పోగొట్టుకుని తాను ఎప్పుడు చేసిన పాపమని భగవంతుని అడుగుతాడు. అతడు ఒక యాభై జన్మల క్రితం కిరాతకుడు అని, ఒకసారి ఒక పక్షి 100 పిల్లల్ని దాని తల్లి తండ్రుల యెదుటనే చంపాడని అందుకు ఆ పాపం ఇప్పటికి ఫలించిందని చెబుతాడు. అప్పుడు ధృతరాష్ట్రునికి ఒక అనుమానం వస్తుంది, మరి 50 జన్మలు ఎందుకు ఆగవలసి వచ్చింది అని. దానికి 100 మంది పిల్లలు పుట్టాలంటే సంపాదింకోవలసిన పుణ్యానికి 50 జన్మలు పట్టిందని చెబుతాడు శ్రీకృష్ణుడు. 


ఈరోజు మనం చేసే పాపం ఈ జన్మలోనే ఫలితం చూపించక పోవచ్చును, కానీ వడ్డీ, చక్ర వడ్డీలతో భారీగా మనకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నేడు మనకు అర్ధం కానిదానిని అవహేళన చెయ్యవద్దు. మన మహర్షులు, పెద్దలు, తాతలు ఎంతో ఆలోచించి, తర్కించి చేసిన సాంప్రదాయ పద్ధతులను విమర్శించే అర్హత లేని వారు కూడా నోరు పారేసుకుని పాపం మూటకట్టుకుంటూ వున్నారు. ఆ భగవంతుని దయ వలన మనం అటువంటి వెర్రి వాగుడు వాగకుండుగాక !!


#SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం

అష్టదిక్పాలక స్తుతి

 *🌹అష్టదిక్పాలక స్తుతి🌹*

*1.ఇంద్రః*


కశ్యపాదితిసంభూత మఘవన్ మారుతాగ్రజl

పురస్తాత్పాహి దేవేంద్ర

పురందర నమోఽస్తుతేll


*2.అగ్నిః*


వైశ్వానర నమస్తుభ్యం 

నమస్తే హవ్యవాహనl

ఆగ్నేయాత్పాహి మామగ్నే

స్వధాస్వాహాపతే ముదాll


*3.యమః*


కర్మనిష్ఠాగరిష్ఠం చ

ధర్మిష్ఠం దండపాణినంl

దక్షిణాధిపతిం వందే

యమం మహిషవాహనమ్ll


*4.నిరృతిః*


రాక్షసం నరవాహం చ

నిరృతిం ధూమ్రవర్ణకంl

నైరుత్యాధిపతిం వందే

గృహసౌఖ్యాభివృద్దయేll


*5.వరుణః*


ప్రత్యగాశీపతిం శాంతం

పాశపాణిం ప్రచేతసంl

సర్వేషాం జీవనాధారం

వారీశం వరుణం శ్రయేll


*6.వాయుః*


జగదుచ్ఛ్వాసనిశ్వాసకారణం ప్రాణరూపిణంl

వాయుం సమీరణం వందే

పవనం చ ప్రభంజనమ్ll


*7.కుబేరః*


కుబేరం ధనధాన్యేశం

యక్షేశం  విశ్రవస్సుతంl

వందేఽలకాపురీనాథం

సోమముత్తరదిక్పతిమ్ll


*8.ఈశానః*


విద్యానాం చ పశూనాం చ భూతానాం బ్రహ్మణస్తథాl

య ఏకోఽధిపతిర్లోకే

తమీశానమహం భజేll

~మల్లిభాగవతః... 🙏


*🌹సమిష్టిశ్లోకః🌹*

ఇంద్రమగ్నిం యమం చైవ నిర్ఋతిం వరుణం తథాl

వాయుదేవం కుబేరం వై ఈశానం తు నమామ్యహంll


(ఇది 2000వ సంవత్సరంలో అనగా పాతికేళ్ళ క్రితం నా కోరిక మేరకు మా మేనమామగారైన వే.బ్ర.శ్రీ పంచాంగం సూర్యనారాయణ శాస్త్రిగారు రాసిచ్చిన శ్లోకం.మా సర్కిల్ లో అప్పట్నుండీ ప్రతిపూజలోనూ వినియోగింపబడుతోంది🙏)

చిలుకూరి బాలాజీ

 🎻🌹🙏 *కోరిన వరాలిచ్చే చిలుకూరి బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం...!!*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿 ప్రత్యేక దర్శనాలు, అర్చన టిక్కెట్లు, హుండీల గొడవలు లేని ఆలయంగా చిలుకూరు బాలాజీ క్షేత్రం వినుతి కెక్కింది.


🌸 కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణ లోని చిలుకూరు గా ప్రతీతి. 


🌿 భాగ్యనగరంలోని చిలుకూరులో వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి కొరినదే తడవుగా కొండంత వరాలు అనుగ్రహించినప్పటికీ, భక్తుల వద్ద నుండి వడ్డి కాసులు మాత్రం ఆశించడు. 


🌸 ఇటీవలికాలంలో ఇంతగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ టెంపుల్ నిజానికి ఇప్పటిది కాదు. ఉస్మాన్ సాగర్ తీరంలో ఉన్న ఈ చిలుకూరు చాలా పురాతనమైంది. చిలుకూరులో 10,12 శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.


🌿 రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి. అబుల్ హసన్ తానీషా మంత్రులు అక్కన్న, మాదన్నలు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను దర్శించుకున్నారు. అంటే భద్రాచలం రామాలయం కంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ పురాతనమైంది.


🌹🙏 *స్థలపురాణం :*🙏🌹


🌸 సుమారు 500 ఏళ్ల కిత్రం.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా.. కాలినడకన తిరుపతి వెళ్లి.. స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. 

వృద్ధాప్యంలో సైతం ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు.


౦🌿 అలా ఒకసారి తిరుమలకు బయల్దేరిన మాధవరెడ్డి.. ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు.


🌸 ‘మాధవా.. ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే. 

నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా.. వెలికి తీసి గుడి నిర్మించి ,నన్ను సేవించి తరించు’.. అని చెప్పి మాయమయ్యాడట! 


🌿నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. 

అంతా కలిసివచ్చి.. అక్కడ ఉన్న పుట్టను గునపాలతో పెకిలిస్తుండగా.. గునపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా ఆ దేవదేవుణ్ని క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. 


🌸అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి.. పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థలపురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి.


🌿అలా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్య పూజలందుకుంటు భక్తుల కొంగుబంగారంగా మారాడు. 

ఇక్కడ ఏకశిలలోనే శ్రీదేవి, భూదేవి. వేంకటేశ్వరస్వామి ఉండటం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. 


🌸 చిలుకూరు స్వామి మహిమ అంతా ఇంతా కాదని ఆయన భక్తులు చెపుతారు. భక్తులు ముందుగా ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి, స్వామివారికి తమ కోరికను విన్నవించుకుంటారు.


🌿  కోరిక తీరగానే 108 ప్రదక్షిణలు చేసి, స్వామివారిని దర్శించుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటారు. భక్తుడు తన కోరిక సఫలమయ్యేవరకు ఆ కోరికను తనకు, స్వామివారికి మధ్యనే రహస్యంగా ఉంచాలి. 


🌸మూడో మనిషి చెవిన వెయ్యకూడదట ఇక్కడ దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి అని చెబుతారు. వీఐపీ దర్శనాలు, ప్రత్యేకపూజ టికెట్‌ వంటివేవీ లేవు. బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే. దేవుని వద్ద అంతా సమానమే.


🌿 ఆలయంలో భక్తుడు చూడవలసింది దైవాన్ని మాత్రమే. భగవంతునికి భక్తునికి మధ్య డబ్బు వ్యవహారం అవసరం లేదనే పద్ధతిని చిలుకూరు ఆలయం పాటిస్తోంది. 

ప్రజాభిప్రాయాన్ని, అర్చకుల అభిమతాన్ని గౌరవించి రాష్ట్రప్రభుత్వం స్వయంప్రతిపత్తినిచ్చింది.


🌸 శ్రీరామనవమి తరువాతి రోజు అంటే చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో ఆరంభించి వారం రోజులపాటు పంచాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. రోజూ వాహన సేవలుంటాయి. చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. 


🌿 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతో ఉంటుంది.


🌸 చిలుకూరు స్వామిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తారు. అందువల్ల యువతకు ఆరాధ్య క్షేత్రమయ్యింది... స్వస్తి..🌞🙏🌹🎻


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

కోరికలు కడలి వంటివి

 2🙏🕉️🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏       🔥 *కోరికలు కడలి వంటివి.. తీరం చేరిన అల చెదిరిపోతుందని తెలిసినా అలలు పుడుతూనే ఉంటాయి.. అలాగే కోరికలు కూడా.. ప్రమాధకరమైన కెరటం ఎలా బీభత్సం సృష్టిస్తుందో మితిమీరిన కోరికలు మనిషి జీవితం నాశనం చేస్తుంది* 🔥మనిషికి సంతృప్తి సహజ సంపద అయితే విలాసం కుత్రిమ దరిద్రం..మనసు అదుపు తప్పితే జీవితం దారి తప్పుతుంది.. మాట అదుపు తప్పితే బ్రతుకే దారి తప్పుతుంది..సమయం చెబుతుంది జాగ్రత అని..ఆహ్లాదం పంచే పకృతి సైతం హెచ్చరిస్తూ ఉంటుంది..హెచరికను  హేళన చేస్తే జీవితం నాశనం అవుతుంది తప్ప మిగిలేది ఏమి ఉండదు🔥క్రమశిక్షణ నుండే జీవితం తన విలువను పొండుతుంది.. కాబట్టి జీవితపు క్రమశిక్షణ అన్నది జీవితం కంటే చాలా అమూల్యమైనది..బంధాలను తప్పుగా వాడుకోకండి.. ఎందుకంటే బంధాలు ఎన్నో ఉంటాయి.. కానీ మంచి మనస్సు కలిగిన బంధం ఒక్కసారి వీడిపోతే మళ్ళీ దొరకడం చాలా కష్టం🔥🔥మీ *అల్లoరాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంకు ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారు కొత్తవారికి రాలిని వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593. 9182075510* 🕉️🙏

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మొదటి అధ్యాయం

అర్జునవిషాదయోగం: సంజయఉవాచ


పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః

పౌండ్రం ధధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః(15)


అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః

నకుల స్సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ(16)


శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రకం ఊదారు. ధర్మరాజు అనంతవిజయం, నకుల సహదేవులు సుఘోషమణిపుష్పకాలూ పూరించారు.

అధర్మము చేసినవాడు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో𝕝𝕝  యదినాత్మనిపుత్రేషు నచేత్ పుత్రేషు నప్తృషు/* 

         *నత్వేవతు కృతో ధర్మః కర్తుర్బవతి నిప్పలః||* 


*తా𝕝𝕝 అధర్మము చేసినవాడు ఒకవేళ ఆ పాపమును తను అనుభవించకపోయినా తన కుమారుడుకానీ? మనువడుకానీ? తప్పక అనుభవించవలసి ఉంటుంది అంతేకానీ వ్యర్థముగా పోదు.... కావున తాత్కాలికముగా సుఖమును అనుభవించుటకుగానీ? దుఃఖమును తప్పించుకొనుటకు గానీ? అధర్మమును చేయరాదు...*


*పాపము చేయడం - అధర్మముగా ప్రవర్తించడం మానవలె.... కర్మఫలం తప్పించుకోవడం కుదరనిపని....*

 

✍️🪷🌷🌸🙏

నాగసాదువులు - నానో టెక్నాలజీ.

 *నాగసాదువులు - నానో టెక్నాలజీ...🕉️* 

 *ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది ఇదే నానో టెక్నాలజీ.* 


 *దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి.* 


 *దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. అది ఇప్పటికీ వుంది.* 


 *హిమాలయాల్లో సజీవంగా వుంది. మన ఋషులు,* *యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు.*


*మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం.*


 *దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే.*


 *మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. త్రిలోక సంచారి అయిన నారదుడు నిత్యం నానో టెక్నాలజీ ద్వారానే ప్రయాణించేవాడు.* 


*హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమంలోనూ జరిగే కుంభమేళాలకు లక్షలాది మంది నాగసాదువులు రావటం మనం టీవీల్లో, పేపర్ లలో చూశాం.*


*నాగసాదువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో వుంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు.*


*హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి. ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం.*


*కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా?*


*ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా?*


*ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. ఎక్కడైనా, ఏ ఫోటోగ్రాఫర్కి అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా?*


*ఎక్కడైనా ఇంతమంది ప్రత్యెక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా?*


*లేదే? సరిగ్గా అందరూ ఒకేసారి కుంభ మేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు?*


 *కుంభ మేలా ముగిశాక తిరుగు ప్రయాణంలో కొద్ది దూరం వరకే కన్పించి హటాత్తుగా ఎలా మాయమైపోతారు?*


*ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు?*


*వీటన్నింటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం. అదే నానో టెక్నాలజీ, నాగసాదువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం.*


*ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం.*


*ఎవరో అమెరికా, రష్యా, చైనా, జపాన్, జర్మనీ వాళ్లు చెప్పే సొల్లు అంతా విని చంకలు ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి.*


*వాటిని అనుసరించి అమలు చేసే ప్రయత్నం చెయ్యండి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు. అవునా!! కాదా ఒక్కసారి అలోచించండి..*


*#హిందురాష్ట్రదేవోభవ.*

*జైశ్రీరామ్ 🙏🚩*

కులతుపుజ శాస్తా ఆలయం

 🕉 మన గుడి : నెం 997


⚜ కేరళ  : కొల్లం


⚜ కులతుపుజ శాస్తా ఆలయం



💠 భాగవతం ప్రకారం, శివుడు మోహినీ రూపంలో ఉన్నప్పుడు విష్ణువుతో ప్రేమలో పడ్డాడు. 

 వారి సంబంధమే శాస్తా యొక్క జన్మకి  దారితీసింది.  శివునికి మరొక పేరు హర మరియు విష్ణువు యొక్క మరొక పేరు హరి కాబట్టి, పుట్టిన బిడ్డను హరిహరపుత్ర అని కూడా అంటారు. అయ్యప్ప శాస్తా అవతారమని నమ్ముతారు.



💠 శాస్తా ఆరాధన దక్షిణ భారతదేశపు ప్రాచీన చరిత్రలో భాగం.

దక్షిణ భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక శాస్తా ఆలయాలు ఉన్నాయి


💠 ఐదు శాస్తా ఆలయాలు విష్ణువు అవతారమైన పరశురాముడితో ముడిపడి ఉన్నాయని చెబుతారు.  కులతుపుజ, ఆర్యంకావు, అచ్చన్‌కోవిల్, శబరిమల మరియు పొన్నంబల్మేడులోని శాస్తా ఆలయాలు ఐదు శాస్తా ఆలయాలలో ఉన్నాయి


💠 కులతుపూజ శాస్తా ఆలయం కల్లాడ నదికి ఉపనది అయిన కులతుపుళ నది ఒడ్డున ఉన్న హిందూ దేవాలయం.  

ఇది భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలోని పునలూర్ తాలూకాలోని కులతుపుజలో ఉంది.  అక్కడి ప్రధాన దైవం బాలశాస్త రూపంలో ఉన్న అయ్యప్ప.  ఇది పంచ శాస్తా క్షేత్రాలలో ఒకటి మరియు కేరళలోని 108 శాస్తా క్షేత్రాలలో ఒకటి.  అక్కడ ఉన్న విగ్రహం పరశురామునిచే ప్రతిష్టించబడిందని నమ్ముతారు మరియు ఎనిమిది రాళ్లతో తయారు చేయబడింది. 

 ఈ ఆలయం కేరళ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.

ఈ ఆలయాన్ని సాధారణంగా 'కులతుపూజ బాలకన్' అని పిలుస్తారు.


💠 ఇక్కడ దేవత ఉగ్ర మూడ్ (ఉగ్రమూర్తి) అలాగే శుభ మూడ్ (మంగళప్రదాయకం)లో ఉంటాడు.  శివుడు, యక్షి, విష్ణువు, గణపతి, బూతథాన్, నాగర్ మరియు కరుప్పస్వామి ఈ ఆలయంలోని ఇతర అధీన దేవతలు. 

 

💠 కులతుపుళలోని ఆలయ మూలం గురించిన ఆసక్తికరమైన పురాణం ఏమిటంటే, ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన రామేశ్వరం తీర్థయాత్ర నుండి తిరిగి వస్తున్న కల్లాడ నది ఒడ్డున విడిది చేసాడు, సేవకులలో ఒకరు వంట చేయడానికి కొంత రాయిని అమర్చారు.  రాయి స్థాయి సరిగా లేనందున, అతను విసుగు చెందాడు మరియు స్థిరమైన రాయిని మరొక రాయితో కొట్టాడు.  అకస్మాత్తుగా స్థిరమైన రాయి నుండి రక్తం కారింది.

 

💠 బ్రాహ్మణుడు వెంటనే ఇది దైవిక శిల అని గుర్తించి గాయపడిన వారిపై రామేశ్వరం నుండి తెచ్చిన పవిత్ర జలాన్ని చల్లాడు.  ఇలా చేయడంతో రక్తస్రావం ఆగిపోయి ధర్మశాస్త వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.  వారిని ఆశీర్వదించిన తరువాత, అయ్యప్ప స్వామి ఆ ప్రదేశంలో దేవాలయాన్ని నిర్మించమని బ్రాహ్మణుడికి సూచించాడు.


💠 చుట్టుపక్కల అడవిలో జీవరాశులకు ఇబ్బంది కలగకుండా ఈ ఆలయాన్ని నిర్మించాలని ఆయన ఆదేశించారు.  కొట్టారక్కర రాజు ఆదరణతో పర్యావరణానికి విఘాతం కలగకుండా నూతన ఆలయాన్ని నిర్మించారు.  నిజానికి ఈ రోజు వరకు, యాత్రికులు ఆలయం చుట్టూ ఉన్న జీవులకు ప్రత్యేక గౌరవం చూపుతారు.  


💠 ఈ ఆలయంలోని దేవత బాలశాస్త, ఆయనను మణికండ అని పిలుస్తారు.  ఈ ఆలయాన్ని సందర్శించేందుకు మహిళలకు అనుమతి ఉంది.

ఈ ఆలయం ఇప్పుడు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు ఆధీనంలో ఉంది.


💠 కులతుపుజై, అంటే "నది".  ఎప్పుడూ ప్రవహించే భగవంతుని అనుగ్రహానికి పేరు.  భగవంతుడు మనశ్శాంతి మరియు ప్రశాంత విశ్రాంతి కోసం ఈ స్థలాన్ని ఎంచుకున్నాడు.  కానీ ఇక్కడ అతని ఉనికికి చాలా ప్రాముఖ్యత ఉంది.


💠 ఆలయ ప్రవేశ ద్వారం వద్ద, మంత్రముగ్ధులను చేసే నదిని ఎదుర్కొంటాము.  ఈ నది దాని పవిత్ర జలానికి మరియు చేపలకి ప్రసిద్ధి చెందింది.  ఆ  నదిలో చేపలకు ఆహారం అందించడం ఆలయంలోని ఒక ముఖ్యమైన ఆచారం.


💠 ఆలయ చెరువు అనేక చేపలను సంరక్షిస్తుంది, ఎందుకంటే అవి అయ్యప్ప స్వామికి ఇష్టమైనవిగా పరిగణించబడతాయి. 

 ఇక్కడ చేపలు పట్టడం కూడా ఖచ్చితంగా నిషేధించబడింది.

ఈ ఆలయం మీనూట్టు (చేపల దాణా) నైవేద్యానికి ప్రసిద్ధి చెందింది.


💠 తనపై మోహాన్ని కలిగి ఉన్న ఒక జల కన్యక (మత్స్యకన్య)ను మందిర చెరువులో చేప రూపంలో నివసించడానికి శాస్త అనుమతించాడని కూడా నమ్ముతారు.  


💠 చర్మంలోని మొటిమలను నయం చేసేందుకు భక్తులు మీనూట్టు (చేపల దాణా)ని అందిస్తారు.  చేపలను తిరుమక్కల్ (దైవిక పిల్లలు) అని పిలుస్తారు.


💠 సేవకుడు పగలగొట్టిన అసలు రాయి రూపంలో సాస్తాను పూజిస్తారు.  ఇప్పుడు అలంకార నిమిత్తం పంచలోక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  ఆలయ ప్రాంతం విశాలంగా మరియు పెద్దది కానీ గర్భాలయం చాలా చిన్నది కానీ చల్లగా మరియు నిశ్శబ్దంగా ఉంది.


💠 కులతుపుజ్హై అనాహత చక్రంతో అనుసంధానించబడి ఉంది, ఇది హృదయ కేంద్రం, ఇది ప్రత్యక్ష జ్ఞానం మరియు గ్రహణశక్తికి శక్తినిస్తుంది. 


💠 రైలు కొల్లాం రైల్వే స్టేషన్ ద్వారా సుమారు 58.8 కి.మీ.


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం 126-*

 *తిరుమల సర్వస్వం 126-*

 శ్రీవారి సంవత్సర సేవలు 1* 



 *ఉగాది ఆస్థానం*


 తెలుగు లోగిళ్ళలో నూతన సంవత్సరపు తొలిరోజైన ఉగాది నాడు, సందర్భోచితంగా తెలుగువారి కొంగుబంగారమైన శ్రీవేంకటేశ్వరునికి ఉగాది ఆస్థానం జరుగుతుంది. తిరుమలేశుని వార్షికోత్సవాలు, ఉత్సవాలు అన్నీ ఉగాది తోనే మొదలవుతాయి.


 ఉగాది పర్వదినాన ప్రాతఃకాల మందు, నిత్యసేవలైన సుప్రభాతసేవ, తోమాలసేవ యథావిధిగా పూర్తయిన తరువాత; ఉభయ దేవేరుల సమేతుడైన శ్రీమలయప్పస్వామి వారికి, సేనాపతి విష్వక్సేనులవారికి ఏకాంతంగా తిరుమంజనం జరుపబడుతుంది. తరువాత, బంగారువాకిలి ముందున్న మహామణిమంటపంలో గరుడాళ్వార్ కు ఎదురుగా స్వర్ణకాంతులీనే సర్వభూపాల వాహనం లో శ్రీదేవి భూదేవి సహిత మలయప్పస్వామి వారిని వేంచేపు చేస్తారు. పట్టు పీతాంబరాలతో, కిరీటాలతో, సర్వాభరణాలతో, పరిమళ భరితమైన పూలమాలలతో ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరిస్తారు. మలయప్పస్వామికి ఎడమవైపున మరో పీఠంపై దక్షిణాభిముఖంగా విష్వక్సేనులవారు ఆసీను లవుతారు. గర్భాలయంలోని మూలమూర్తికి, మిగిలిన ఉత్సవమూర్తు లందరికీ అన్నప్రసాదాలు నివేదించ బడతాయి. తదనంతరం, జియ్యంగార్లు, వారి పరిచారకులైన ఏకాంగులు, అధ్యాపకులు, అర్చకులు, వేదపండితులు వేదపారాయణం చేస్తారు. పెద్దజియ్యంగార్ మూలవిరాట్టు అలంకరణ నిమిత్తం ఒక వెండిపళ్లెంలో ఆరు పట్టువస్త్రాలను అర్చకులకు అందజేస్తారు. తరువాత అర్చకులు స్వామివారికి బంగారుపళ్లెంతో పచ్చ కర్పూర హారతినిచ్చి, అధికారులకు తీర్థ-చందనాదులను అందజేస్తారు. మరో రెండు పట్టు వస్త్రాలను బంగారువాకిలి కెదురుగా ఉన్న మలయప్పస్వామి వారికి, విష్వక్సేనులవారికి ఒక్కొక్కటి చొప్పున అలంకరిస్తారు. 


 అనంతరం శ్రీవారి పాదపద్మాల పైనున్న పంచాంగాన్ని చేతిలోనికి తీసుకొని, ఆస్థానసిద్ధాంతుల వారు శ్రీవెంకటేశ్వరునికి నూతన పంచాంగశ్రవణం చేయిస్తారు. తరువాత, నూతన సంవత్సర ఫలాలను; అన్ని నక్షత్రాల వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలను, నిష్పత్తులతో సహా వివరిస్తారు. స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం గురించి వివరించి, భక్తులందరినీ కాపాడ వలసిందిగా నవగ్రహ దేవతలను ఆదేశించమని; విశ్వమంతా సస్యశ్యామలంగా, అతివృష్టి అనావృష్టి వంటి ఈతి బాధలు లేకుండా చూడమని శ్రీవారిని ప్రార్థిస్తారు. తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా నక్షత్ర ఫలితాలు చెప్పి తీర్థ ప్రసాదాలు నివేదిస్తారు


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

12-12-గీతా మకరందము

 12-12-గీతా మకరందము

          భక్తియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ| కర్మఫలత్యాగము యొక్క విశిష్టతను నిరూపించుచున్నారు-


శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే ధ్యానాత్కర్మఫలత్యాగః

త్యాగాచ్ఛాంతిరనన్తరమ్.


తా:- (వివేకముతో గూడని)అభ్యాసముకంటె (శాస్త్రజన్య)జ్ఞానము శ్రేష్టమైనది కదా! (శాస్త్రజన్య)జ్ఞానముకంటె ధ్యానము శ్రేష్టమగుచున్నది. ధ్యానము (ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగనుండు మనఃస్థితి) కంటె కర్మఫలమును విడుచుట (ప్రవృత్తియందును విషయదోషములేకుండుట) శ్రేష్టమైయున్నది. అట్టి కర్మఫలత్యాగముచే శీఘ్రముగ (చిత్త)శాంతి లభించుచున్నది.


వ్యాఖ్య: - ఇచట అభ్యాసమని చెప్పినచోట వివేకముతో గూడని అభ్యాసమనియు, జ్ఞానమని చెప్పినచోట శాస్త్రజన్యజ్ఞానమని, ధ్యానమని చెప్పినచోట అసంపూర్ణమగు ధ్యానమని, ధ్యానకాలమందు మాత్రము విషయదోషములేని స్థితియని, అనగా ధ్యానాభ్యాసియొక్క స్థితియని గ్రహించుకొనవలెను.


"జ్ఞానాద్ద్యానం విశిష్యతే"- "వాచా"జ్ఞానముకంటె అనుభవపూర్వకమైన జ్ఞానము గొప్పది. జ్ఞానవిషయములను తదేకనిష్ఠతో చింతనచేయుటయే, అనుభూతమొనర్చుకొనుటయే ధ్యానము. కాబట్టి "వాచాజ్ఞానముకంటె,  శాస్త్రజన్యజ్ఞానముకంటె ధ్యానము గొప్పదని వచింపబడినది.


' ధ్యానాత్కర్మఫలత్యాగః'- కర్మఫలములను త్యజించువాని మనస్సు అసంగమై, విషయదోషము లేనిదైయుండును. ధ్యానాభ్యాసికి ధ్యానకాలమందు మాత్రము చిత్తము నిర్విషయమైయుండును. త్యాగికి ఎల్లప్పడును అట్లేయుండును. కనుకనే ధ్యానము కంటె కర్మఫలత్యాగము శ్రేష్టమని చెప్పినారు. దీనిని బట్టి నిష్కామకర్మయోగమెంత మహిమ గలిగియున్నదో స్పష్టమగుచున్నది. జనులలో అధికులకు నివృత్తి కంటె ప్రవృత్తిసంస్కారమే ఎక్కువగ యుండియుండును. కాబట్టి అట్టివారు కర్మలనాచరించుచు కర్మఫలత్యాగమును చక్కగ అలవాటు చేసికొనినచో వారు ధ్యాన్యాభ్యాసికంటె, జ్ఞానాభ్యాసికంటె గొప్పస్థానమును బొందినవారగుదురు. మరియు భక్తికొఱకైనను, ధ్యానముకొరకైనను, జ్ఞానము కొరకైనను చిత్తశుద్ది చాల అవసరము. అదియో, నిష్కామకర్మయోగముచే, కర్మఫలత్యాగముచే లభించుచున్నది. కాబట్టి అద్దానిని చక్కగ అనుష్ఠించినచో మాత్రమే - పునాది గట్టిగనున్నచో పైనగల మేడయు సుస్థిరముగ నుండునట్లు - ధ్యాన, జ్ఞానాదులన్నియుకూడ చక్కగ అభివృద్ధి నొందగలవు. కనుకనే భగవాను డీశ్లోకమున నిష్కామకర్మయోగము (కర్మఫలత్యాగము) యొక్క ప్రాశస్త్యమును వెల్లడించిరి.


"త్యాగాచ్ఛాంతిరనన్తరమ్"-

 కర్మఫలత్యాగముచే, ఈశ్వరార్పణ బుద్ధిచే చిత్తము శుద్ధమగుటవలన వెంటనే శాంతి ఉదయించుచున్నది. కర్తృత్వత్యాగమువలననే, అహంభావత్యాగమువలననే, దోషత్యాగమువలననే, ప్రాపంచికవిషయసుఖత్యాగము

వలననే శాంతి లభింపగలదు. చిత్తమందలి దోషములు తొలగుటయే శాంతికి మార్గము, (తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషామ్). ఏలయనగా నిర్మలచిత్తమున ఆత్మ ప్రత్యక్షము కాగలదు. దుఃఖభూయిష్ఠమగు ఈ సంసారమున ప్రతివాడును శాంతినే అభిలషించుచున్నాడు. కాని ఆ శాంతి యెట్లు లభింపగలదో తెలియజాలకున్నాడు. 'త్యాగాత్ శాంతిః = త్యాగము వలననే శాంతిచేకూరునని భగవాను డిచట స్పష్టముగ తెలియజేసెను. కాబట్టి విషయసుఖములను, కర్మఫలములను, మమత్వమును, అహంభావమును, కర్తృత్వమును, త్యాగముచేసి పరమశాంతిని జీవుడనుభవించవలెను.


ప్ర:- కర్మఫలత్యాగముయొక్క మహిమయెట్టిదో పేర్కొనుము?


ఉ:- అది (వివేకముతో గూడని)అభ్యాసము కంటెను, (శాస్త్రజన్య)జ్ఞానము కంటెను, (ధ్యాన కాలము మాత్రము నిర్విషయస్థితిగలిగియుండు)ధ్యానముకంటెను శ్రేష్టమైనది.


ప్ర:- శాంతి యెట్లు లభించును?

ఉ:- (కర్మఫల)త్యాగముచే.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*


*265వ రోజు*

* తొమ్మిదవ రోజు యుద్ధారంభం*

తొమ్మిదవ రోజు యుద్ధానికి కౌరవ సేన సర్వతోభద్ర వ్యూహమున నిలిచారు. కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, శకుని, సుదక్షిణుడు, సైంధవుడు, కురుకుమారులు, భీష్మునితో వ్యూహం ముందు భాగంలో ఉన్నారు. ద్రోణుడు, భూరిశ్రవసుడు, భగదత్తుడు అతడి కుడి వైపున సోమదత్తుడు, అశ్వత్థామ, విందాను విందులు ఎడమ వైపున శ్రుతాయువు వెనుక వైపున త్రిగర్తాధీసునితో సుయోధనుడు మధ్యభాగమున నిలిచారు. ఈ వ్యూహము చూసి ధర్మరాజు " ధృష్టద్యుమ్నా ! తాత భీష్ములు పన్నిన వ్యూహమును చూసావు కదా మనం ఈ రోజు శిఖండిని ముందుంచి అతనికి సాయంగా మనం నిలిచి పోరాడవలెను. అందుకు అనువైన వ్యూహ రచన చేయుము " అన్నాడు. సాత్యకి, విరాటుడు కుడి వైపున , అభిమన్యుడు, పాంచాల కేకయ రాజులు ఎడమ వైపున కుంతి భోజుడు వెనుక వైపున, యుధిష్టరుడు, నకులసహదేవ , ద్రౌపదీ పుత్రులతో మధ్యభాగమున నిలిచారు. శిఖండిని ముందు నిలిపి అతడికి ఒక వైపున ఘటోత్కచుడు, భీమసేనుడు నిలువగా అర్జునుడు వేరొక వైపు నిలువగా సకల యోదులు వారికి రక్షణగా నిలువగా ధృష్టధ్యుమ్నుడు యుద్ధానికి సిద్ధం అయ్యాడు. భేరి నినాదములు, శంఖముల పూరింపుల శభ్దాలు మిన్నంటుతుండగా యుద్ధం మొదలైంది.


*అభిమన్యుని పరాక్రమం*


అభిమన్యుడు కౌరవ వ్యూహంలోకి చొచ్చుకొని పోయి దూదిని నిప్పంటుకున్నాట్లు కౌరవ వీరులను మట్టు పెడ్తుతున్నాడు. తన రధమును గుండ్రంగా తిప్పుతూ ద్రోణా, కృపాచార్య, సైంధవులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఇది చూసి సుయోధనుడు అలంసుని పిలిచి " అలంబసా ! చూసావా అభిమన్యుడు చిచ్చెర పిడుగులా విజృంభిస్తున్నాడు. వాడిని ఎదుర్కొనగలిగిన వాడివి నీవే నీవే వాడిని చంపాలి " అన్నాడు. అలంబసుడు తన రాక్షస మూకతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. వారి ధాటికి పెను గాలికి ఎండుటాకుల వలె పాండవ సైన్యం కకావికలైంది. ఇది చూసి ద్రౌపదీ సుతులు అభిమన్యునికి సాయంగా వచ్చి రాక్షసులను హతమారుస్తున్నారు. కోపించిన అలంబసుడు పాండవ కుమారులపై శరవర్షం కురిపించారు. ద్రౌపదీ సుతులు అలంబసునిపై జడివానలా బాణములు కురిపించారు. ఆ బాణముల ధాటికి అలంబసుడు తెలివి తప్పి మరు క్షణంలో తేరుకుని ద్రౌపతీ సుతులపై పుంకానుపుంఖాలుగా బాణములు గుప్పించి వారి విల్లులు, కేతనములు విరిచి ఒక్కొక్కరిపై అయిదు బాణములు వేసాడు. సోదరుల అవస్థ అలంబసుని విజృంభణ చూసిన అభిమన్యుడు అలంబసునిపై అతి క్రూరమైన నారాచ బాణములు ప్రయోగించాడు. మిగిలిన వారు అలంబసుడు మాయావిధ్యా ప్రవీణుడు అభిమన్యుడు దివ్యాస్త్ర సంభూతుడు వీరిరువురి యుద్ధం ఎంత రసవంతరమో అని చూస్తున్నారు. అభిమన్య అలంబచులు దేవేంద్ర వృత్తాసురుల వలె యుద్ధం చేస్తున్నారు. అలంబసుడు తన మాయాశక్తితో రణభూమిని అంధకార బంధురం చేసాడు. అభిమన్యుడు భాస్కరాస్త్ర ప్రయోగంతో ఆ చీకట్లను పటాపంచలు చేసాడు. అలంబసుడు అనేక మాయలు చేయగా అభిమన్యుడు వాటిని అన్నిటినీ తిప్పి కొట్టాడు. అభిమన్యుని శస్త్రధాటికి తాళలేక అలంబసుడు రథం దిగి పారిపోయాడు. అలంసుడు పారి పోగానే అభిమన్యుడు విజృంభిస్తూ కౌరవ సేనలో చొచ్చుకు పోయి ఊచ కోత కోయడం మొదలుపెట్టాడు. కౌరవ సేనలు అభిమన్యుని ధాటికి గజగజలాడాయి. అది చూసి భీష్ముడు అనేక మంది రథికులతో అక్కడికి చేరి అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు జంకక అనేక రూపములతో వీరవిహారం చేస్తున్నాడు. అది గమనించిన అర్జునుడు కుమారుని పరాక్రమానికి సంతసింస్తూ భీష్ముని ఎదుర్కొన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

⚜ శ్రీ వెంకటాచలపతి ఆలయం

 ⚜ కేరళ  : త్రివేండ్రం 


⚜ శ్రీ వెంకటాచలపతి ఆలయం



💠 శ్రీ వెంకటాచలపతి దేవాలయం కేరళలోని త్రివేండ్రంలో ఉంది మరియు దీనిని శ్రీనివాసర్ కోవిల్, పెరుమాళ్ కోవిల్, అయ్యంగార్ కోవిల్ లేదా దేశికర్ సన్నిధి అని కూడా పిలుస్తారు. 


💠 వెంకటాచలపతి ఆలయం 1898లో నిర్మించబడింది మరియు అప్పటి నుండి ఈ ఆలయాన్ని సందర్శించడానికి అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వస్తుంటారు.


💠  శ్రీ వేంకటాచలపతి దేవాలయం కేరళలోని సర్వోనత వైష్ణవ వడగలై సంప్రదాయం (వైష్ణవులు)కి అంకితం చేయబడిన ఏకైక ఆలయం.  అంతేకాకుండా, శ్రీ వేంకటాచలపతి ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి, వైకుంఠ ఏకాదశి, తిరు ఆదిపూరం మరియు ఆది స్వాతి వంటి వైష్ణవ పండుగలతో పాటు, పొంగల్, దీపావళి, విషు మరియు ఓనం వంటి ఇతర జాతీయ పండుగలు కూడా ప్రసిద్ధి చెందాయి.


🔆 ఆలయ చరిత్ర


💠 తిరుమల నాయకర్ రాజు పాలనలో ఒక సమూహం దేశం చుట్టూ తీర్థయాత్రకు వెళ్ళింది.

 వారి పర్యటనలో వారు దట్టమైన అడవి వద్ద ఆగారు. 

వంట కోసం బండిలోని రాయిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా కదలలేదు. 

వారిలో ఎవరైనా తప్పు చేసి ఉంటారని భావించి, వారు భగవంతుని కీర్తనలు పాడటం ప్రారంభించారు. 

రాయిని తొలగించలేని ప్రదేశంలో వెంకటాచలపతి దేవుడు ఉన్నాడని సమూహంలోని ఒక వ్యక్తి చెప్పాడు. అది విని ఆ రాయి చుట్టూ చిన్న మట్టి వేదిక చేసి దానిపై దీపం పెట్టి స్వామిని పూజించారు. 

తర్వాత తమ అనుభవాన్ని రాజుకు తెలియజేశారు. 


💠 రాజు వెంకటాచలపతికి ఆలయాన్ని నిర్మించి, రోజూ పూజలు చేసేవాడు. 

ఈ ఆలయ దైవం శ్రీ వేంకటాచలపతి. వీరవనల్లూర్‌కు చెందిన ఒక శ్రీరంగ అయ్యంగార్ సుమారు 100 సంవత్సరాల క్రితం తన ఇంటి సమీపంలోని చెరువులో విగ్రహాన్ని చూశారని చెబుతారు.


💠 'పాంచరాత్ర ఆగమం'లోని 'పద్మసంహితై' (మూడు సంహితలలో ఒకటి) ప్రకారం 40వ అజ్కియ సింగర్ శ్రీ రంగనాథ శతగోప యతీంద్ర మహదేశికర్ ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

 జీయర్ సూచనల మేరకు, శ్రీరంగ అయ్యంగార్ కుటుంబంలో పెద్ద కుమారుడు ఆలయ ప్రధాన పూజారి మరియు గత మూడు తరాలుగా దాని పరిపాలనా బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నాడు. 

ఆలయంలో నిత్య పూజలు వడగళై పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి.


💠 శ్రీ వేంకటాచలపతి ఆలయంలో భార్యాభర్తలు 9 విశిష్ట భంగిమల్లో ఉంటారు. ఆలయంలో పూజించబడే ఉప దేవతలలో నవనీత కృష్ణ, పెరియ తిరువడి ( గరుడ ) ఉన్నారు.

 

💠 ఒక పౌరాణిక కథనం ప్రకారం, ఒక రాజు ఈ పవిత్ర స్థలంలో భగవంతుడిని ప్రేమించినప్పటి నుండి కోల్పోయిన చూపును తిరిగి పొందాడు. 

ఇది విన్న భక్తులు వేలాదిగా ఆలయాన్ని సందర్శించడం ప్రారంభించారు.

 

💠 ఈ ఆలయం అన్ని రకాల మానవ సమస్యలను పరిష్కరిస్తుంది, ముఖ్యంగా ప్రజల జీవితంలో సూర్య మరియు చంద్ర గ్రహణాల నుండి ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరిస్తుంది.

 కొత్తగా పెళ్లయిన జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి మరియు సామరస్యం కోసం విజయదశమి రోజున ఆలయాన్ని సందర్శిస్తారు. 


💠 గర్భ గృహంలో ఆలయ ప్రధాన దైవం శ్రీ వేంకటాచలపతి పెరుమాళ్. గర్భగుడిలో అలమేలు మంగై తాయార్ మరియు పద్మాసిని తాయార్ విగ్రహాలు ఉన్నాయి. 

నవనీత కృష్ణర్ (సంతాన గోపాలన్), పెరియా తిరువడి మరియు గరుడర్ దేవతలకు కూడా ఆలయాలు ఉన్నాయి .


💠 ఈ ఆలయంలో అనేక శతాబ్దాల క్రితం ఈ భూమిని పాలించిన కులశేఖర ఆళ్వార్ విగ్రహం కూడా ఉంది. 

భక్తుడైన వైష్ణవుడు అయిన రాజుకు గౌరవ సూచకంగా, కులశేఖర ఆళ్వార్ విగ్రహంతో పాటు నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, బాష్యకారర్ ( రామానుజర్ ) విగ్రహాలు ఉన్న సన్నిధిని నిర్మించారు .



💠 ఈ ఆలయ  ఆకర్షణీయమైన లక్షణం గరుడ వాహనం, ఇక్కడ గరుడ విగ్రహంపై ఉంచిన ప్రధాన దేవతను పద్మనాభస్వామి ఆలయంలో తీర్థవారి సమయంలో విష్ణువును బయటకు తీసి పల్లకిని పోలి ఉండే గొప్పగా అలంకరించబడిన పల్లకిపై ఊరేగింపుగా తీసుకువెళ్లతారు.

పురటాసి మాసంలోని అన్ని శనివారాల్లో గరుడవాహనం బయటకు తీస్తారు.


💠 మార్గశిర్షం మాసంలో ముఖ్యమైన పండుగ తిరుప్పావై పఠనం. 

ఈ పద్యాలను పెరుమాళ్ యొక్క ముఖ్యమైన భక్తురాలైన "అండాళ్" స్వరపరిచారు. 

దీని పక్కనే వైకుంట ఏకాదశి పండుగ వస్తుంది, దీనిలో పెరుమాళ్ శయన అలంగారంలో (తిరుప్ పార్కాడల్‌లో లాగా) దర్శనమిస్తారు.


💠 పులియోగరే (చింతపండు అన్నం), దధ్యోనం (పెరుగు అన్నం), పొంగల్, చక్కరై పొంగల్, ఎల్లోదరై (నువ్వుల అన్నం), ఖీర్, అమృత కలశం మరియు చక్కరై సుండాల్ వంటివి ఇక్కడ సమర్పించే నైవేద్యాలు



💠 ఆలయానికి 1 కి.మీ దూరంలో తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్  ఉంది.

తెలుగు లిపి పరిణామం

 🙏🙏🙏తెలుగు లిపి పరిణామం -- నన్నయ పాత్ర

భాషా చరిత్రలో కూడా నన్నయకు సముచిత స్థానం ఉంది 

మౌర్యుల తరవాత బ్రాహ్మీ లిపి దేశమంతా విస్తరించింది. మెల్లమెల్లగా, ఉత్తరాది లిపికి, దక్షిణాది లిపికి మధ్య తేడాలు కనిపించడం మొదలయ్యింది. ఇంతకు ముందు భారత లిపులలో, హల్లులో అకారాన్ని అంతర్గతం చెయ్యడానికి తలకట్టు, పైన గీత వంటి ఒక గుర్తు ప్రతి హల్లు రూపానికి ఉంటుంది . ఈ పద్ధతి మౌర్యుల కాలం తర్వాత వ్యవస్థీకృతం అయ్యింది. ఒరియా లిపిలో గొడుగు, తెలుగులో తలకట్టు, నాగరి లిపిలో పైన అడ్డంగా గీసే గీత – ఇవన్నీ హల్లుకి అ-కార సంపర్కాన్ని తెలియజేసేవే. అందుకే కాబోలు, దక్షిణాది ఉత్తరాది లిపుల మధ్య తేడాలు కూడా ఈ కాలంలోనే ప్రస్ఫుటమైన ముద్రతో వచ్చాయి. నిలువు గీతలున్న అక్షరాల్లో గీత పరిణామం ఒకే పొడుగుకి చెయ్యడం, క, గ అక్షరాల్లో నిలువుపాటి గీతలను కాస్త సాగతీసి వాటిని గుండ్రంగా చెయ్యడం, ఇవన్నీ ఈ కాలంలో లిపి స్వరూపంలో వచ్చిన మార్పులు.

తమిళ బ్రాహ్మీ లిపి 

ఉత్తరాది లిపులకంటే దక్షిణాది లిపులలో ఎన్నో మార్పులు వచ్చాయి. భట్టిప్రోలు శాసనాల లిపిలో ప్రత్యేకత హల్లు నుంచి అంతర్గతమైన అ-కారాన్ని తీసేసి, అకారాన్ని సూచించడానికి మిగిలిన అచ్చుల లాగానే ఒక ప్రత్యేకమైన గుర్తుని హల్లుకి జత చెయ్యడం. అంటే భట్టిప్రోలు శాసనలిపిలో ‘క’ మిగిలిన లిపులలో ‘క్’ అనే వ్యంజన రూపానికి సమానమైనది. ఇది కాక, ఘ, జ, మ, ల స (శ) లకు కూడా బ్రాహ్మీ కంటే వేరు రూపాలున్నాయి.


ఈ కాలంనాటి దక్షిణాది లిపులలో ముఖ్యంగా చెప్పుకోవలసినది తమిళ బ్రాహ్మీ శాసనలిపులు. ఈ శాసనాలన్నీ కూడా నాలుగైదు వాక్యాల దానాల పట్టాల వంటివి. ఇవి ఏ కాలానికి చెందినవనే విషయంపై ఇంకా ఏకాభిప్రాయం లేదు. ఈ తమిళ బ్రాహ్మీ లిపికి కూడా రెండు ప్రత్యేకతలున్నాయి: 1. నాలుగు కొత్త అక్షరాలు (న, ఱ, ఱ (ఇది డ్జ) ళ ) – ఇవి బహుశ ద్రావిడ భాషల లోని శబ్దాల కోసం అవసరమై ఉండొచ్చు. 2. అచ్చులను రాసే పద్ధతి భట్టిప్రోలు శాసనాలలో లాగానే, బ్రాహ్మీ లిపికి వేరుగా ఉంటుంది.

భాషాపరంగా కన్నడ తమిళ భాషలు దక్షిణ ద్రావిడ కుటుంబానికి చెందినవి. కాని, చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆంధ్ర కర్నాట దేశాలను పాలించడంవల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామము చెందింది. శాతవాహనుల కాలములోనే భట్టిప్రోలు లిపి కర్ణాట దేశానికి వ్యాప్తి చెందింది. ఆంధ్రదేశము, వేంగీ విషయము, కమ్మనాడు, పుంగనూరు వాస్తవ్యుడైన పంప అనే బ్రాహ్మణపండితుడు జైనమతావలంబియై వేములవాడను పాలించిన అరికేసరి అను చాళుక్య రాజు ఆశ్రయముపొంది విక్రమార్కవిజయము అనబడు తొలి కన్నడ గ్రంథము వ్రాశాడు. ఇతడే కన్నడ సాహిత్యానికి ఆది కవి.తెలుగు కన్నడ లిపులు ముడిపడి ఉండడానికి ఇలాంటి కారణాలు కొన్నిఉన్నాయి. .


తెలుగున నన్నయ్య కావ్యవ్యాకరణచ్చంద సంప్రదాయములకేకాక, తెలుగు లిపి సౌందర్యము నావిష్కరించుటయందు ప్రథమాచార్యుడు. నన్నయకు పూర్వము తెలుగు కన్నడభాషలకు ఒకే లిపి ఉండేది. దానిని వేంగీచాళుక్య లిపి అని దానిపేరు.నన్నయకు ముందు శాసనాలన్నీ వేంగీచాళుక్య లిపిలోనే వ్రాయబడినవి. ఆ లిపి చతురస్రముగాను, తలకట్లు గీతలకొరకు గంటము వ్రాతకు సాధనముగా ఏర్పడినది. తాటాకుపైనగాని గంటముతో వ్రాయునప్పుడు తలకట్లు అడ్డుగీతలుగా వ్రాసిన తాటాకు చినిగిపోవును. తలకట్టు-అనగా ఆకారమునకేగాక, ఆ దీర్ఘము వ్రాయవలసివచ్చినప్పుడు, ఆ దీర్ఘమును ఇప్పటివలె ా వ్రాయక --- అని నిలువుగీతగా రాసేవారు. ఒ కార చిహ్నమగు కొమ్ము ొ ా అని గీతగానే ఉండేది. -జ్క, ణ్బ, న + తవత్తు, ం + ప వత్తు, ఞ + చ వత్తు -అను రీతిగా వ్రాసెడివారు. ఇట్టివి తాటియాకుపైన వ్రాయుట కష్టసాధ్యము.

ఉదాహరణకు : పఞ్చాఙ్గము అని పూర్వము వ్రాసేవారు తాటాకు ఇది వ్రాయడం కష్టం కావున -పంచాంగము అని ఇటువంటి మార్పులతో నన్నయ గారు వ్రాశారు. ఇటువంటి ఉదాహరణలు భారతములో ఎన్నైనా చూపవచ్చు. 


నన్నయ వీటిని పరిశీలించి, పైగా తెలుగు లిపిని చతురస్ర స్వరూపమునుండి గుండ్రదనమునకు మార్పు చేసి పలు మార్పులు చేసాడు. అవే తలకట్టునకు ా గాక ప్రస్తుత తలకట్టు లాగా, కొమ్ముల మార్పు ప్రస్తుత వరుసగా, ర్గ సంయుక్తాక్షరములు అనునవి పంకచంక-ఖండ-నంద-డింబ-అనురీతి పూర్ణబిందువులుగా వ్రాయుట, రకార సంయుక్తాక్షరములను ర్క, ర్త, ర్చ మొదలగునవి అర్క-అక౯, కర్త-కత౯, కర్చ-కచ౯ గా వ్రాయుట మొదలుచేసాడు. ౯ ఈ చిహ్నమునకే వలపలగిలక అని పేరు. ఈ వలపలగిలక వలన రకార సంయుక్తాక్షరములుగా నుండక ఏకాక్షరములుగా ఉండును. ఇందువలన లిపికి సమత ఏర్పడినది, అంతకుముందున్న ఒక అక్షరము శకటరేఫముకన్నా భిన్నమైనది, ష్జగా పలుకునదానిని "డ"గా మార్చాడు. ఈ మార్పుల వలన తెలుగు లిపికి గుండ్రనిదనము, సౌందర్యము చేకూరినవి. తెలుగులిపినందు ఈమార్పులు చేయుటయేకాక నన్నయ, తాను వ్రాసిన నందంపూడి శాసనము లో తాను ప్రతిపాదించిన సంస్కరణలిపిని ప్రవేశపెట్టి - ఆవెనుక తాను వ్రాసిన మహా భారతమును ఆ లిపిలోనే వ్రాసినాడు. తెలుగు అక్షరములకు అంతకుముందులేని రమ్యతను-లేక మనోహరత్వమును తాను ప్రతిపాదించుటచేత - నన్నయ తెలుగులిపి సౌందర్యమును వ్యక్తపరిచాడు. అక్షర రమ్యత లిపి సంబంధమైనది అనే విషయాన్ని గమనించగలరు 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

తెలుగు భాష లో ' తెలుగు ' ఎంత? ఇది

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹మనం మాట్లాడే తెలుగు భాష లో ' తెలుగు ' ఎంత? ఇది ఆలోచించవలసిన ప్రశ్న. మనం వాడుకునే పాలలో  ' పాలు' ఎన్ని? అనే ప్రశ్న లాంటిదన్నమాట. ఈ శీర్షిక భాషలో తమాషాలు లో కూడా తమాషాలు మన పదం కాదు. ఇంకా నిషా, దేశ్, తయారు, దస్తూరీ, ఫర్వాలేదు, వాకబు, మునసబు వంటి అనేకానేక పదాలు తెలుగులో కలిసి పోయి తెలుగే అనిపించేలా అలవాటయిపోయాయి.  ఆ విషయాలు  చక్కగా విశ్లేషించారు ప్రముఖ సాహితీవేత్త డా. తిరుమల నీరజ గారు. విని తెలుసుకోండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కర్మలకు_పద్దెనిమిది 18మందిసాక్షులు..

 మన కర్మలకు_పద్దెనిమిది 18మందిసాక్షులు...........!!

చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత . 

కానీ ..... 


‘నేను ఒక్కడినే కదా ఉన్నాను, 

నన్ను ఎవరూ గమనించడం లేదు’ 

అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు . 


మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి 

నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి . 


వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి . 


ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, 

వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .

దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు . 


ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి . 


అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి . 


ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి . 


అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు . 

ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .

 

అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు . 

అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .


 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .


 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం . 

కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .

 

నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .


 అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం . 


ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .


 ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు .

కాళిదాసు 🙏 రెండవ భాగం

 🙏కాళిదాసు 🙏

                రెండవ భాగం 

కాళిదాసు భారతీయ కవితకి ఆత్మ వంటివాడు. కవిత ఏ రూపాన్నైనా పొంది ఉండవచ్చు. కావ్యం కావచ్చు నాటకం కావచ్చు.కవితాత్మ పాలు కొంతైనా దానిలో ఉంటుంది. ఇలా కాళిదాసప్రభావం తరువాత తరాల కవుల్లో ఉంటూనే వచ్చింది. కాళిదాసు భారతసంతతికి కేవలం కవిత్వాన్నే ఇవ్వలేదు. ఇంకా కొన్ని మౌలిమైన, మేధాపరమైన, సాంస్కృతిక పరమైన ఉపాధుల్ని సమకూర్చాడు. అవేమిటి? కాళిదాసు కవికులగురువు ఎందుకయ్యాడు? 


కవితాత్మలో కొన్ని భాగాల్ని కాళిదాసు ఎలా పండించి పోషించాడు? ఏ విధంగా అతడు మనకి అధ్యాపకుడు? అన్నది స్థూలంగా చర్చించడమే మిగిలిన వ్యాసం యొక్క ముఖ్యోద్దేశ్యం. కాళిదాసు కవిత్వంలో రసజ్ఞత గురించి వేరే చెప్పక్కర్లేదు. అది అన్నివేళలా తొణికిసలాడుతూనే ఉంటుంది. ఇక మిగిలిన విషయాలకొస్తే, ఇంత చిన్న వ్యాసంలో అన్నీ కూలంకషంగా చర్చించడం సాధ్యం కాదు కాబట్టి, కొన్నింటిని కాస్త విశదంగా, కొన్నింటిని స్థాలీపులాకంగా, కొన్నింటి గురించి సూక్ష్మం గానూ చెప్పి ముగిస్తాను.


1. భాష

భాషని నాదయోగంగా భావించినవాడు కాళిదాసు. పలికే మాట (శబ్దం), దానికున్న అర్ధం, వీటి మధ్యనున్న విడదీయరాని అర్థనాదేశ్వరబంధం అర్ధనారీశ్వరబంధంలాంటిదని పూర్తిగా తెలిసినవాడు. కాబట్టే రఘువంశాన్ని,


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ  


అని మొదలు పెట్టాడు. పైగా వాగర్థప్రతిపత్తి (శబ్దం, అర్థం రెండింటికీ సంబధించిన జ్ఞానం అబ్బడం) కోసమే జగత్తుకి తల్లిదండ్రులైన (పితరౌ) పార్వతిని, పరమేశ్వరుణ్ణీ ప్రార్థిస్తున్నానన్నాడు. పార్వతీపరమేశ్వరౌ = పార్వతీప + రమేశ్వరౌ అని విడదీస్తే శివుడు, విష్ణువు అనే అర్థం వస్తుంది. సంస్కృతభాషలో పితరౌ అంటే ఇద్దరు తండ్రులు అని కూడా అర్థం ఉంది. అందువల్ల ప్రపంచానికి తండ్రులైన శివవిష్ణువులను కూడా ప్రార్థిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. మొదటి శ్లోకంలోనే, వాగర్థప్రతిపత్తికోసం ప్రార్థిస్తున్నా (వందే) అనగానే అది పుష్కలంగా దొరికేసినట్టుంది, వెంటనే పార్వతీపరమేశ్వరౌ అనే గొప్ప శ్లేష చూపాడు.


రమ్యమైన పదాల్తో పూలజల్లులు కురిపించడం, కోమలమైన పదబంధాల్తో కట్టిపారెయ్యడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. సంస్కృతభాషతో పరిచయం తక్కువ ఉన్న (లేదా అసలు లేని) వాళ్ళకి కూడా హృద్యంగా తోచే విధంగా కూడా వ్రాశాడు. కేవలం పదనాదం ద్వారా రమ్యతను సృష్టించాడు. ఋతుసంహార కావ్యంలో కాళిదాసు ఆరు ఋతువుల్నీ ఆరు సర్గల్లో వర్ణించాడు. మచ్చుకి ఋతుసంహారం లోని మూడు శ్లోకాలు చూడండి.


సదా మనోఙ్ఞం స్వనదుత్సవోత్సుకం వికీర్ణ విస్తీర్ణ కలాపి శోభితం

ససంభ్రమాలింగనచుంబనాకులం ప్రవృత్తనృత్యం కులమద్యబర్హిణామ్ – (వర్ష ఋతువు)


(ఎప్పుడూ మనోజ్ఞంగా, శబ్దాలతో కూడిన మహోత్సవంలో తేలియాడుతూ, విస్తరించి విసరబడిన పింఛంతో శోభిస్తూ ఉన్న నెమళ్ళ గుంపులు ఇప్పుడు ముప్పిరిగొన్న ఆనందంలో ఒకదాన్నొకటి కౌగిలించుకుంటూ, ముద్దులాడుకుంటూ నాట్యం చెయ్యడం మొదలుపెట్టాయి. పైన చెప్పిన శబ్దాలు నెమళ్ళ కేకలు కావచ్చు లేదా మేఘాల గర్జనలు కావచ్చు.)


నితాంత లాక్షారసరాగరంజితైః నితంబినీనాం చరణైః సనూపురైః

పదే పదే హంసరుతానుకారిభిః జనస్య చిత్తం క్రియతే సమన్మథమ్ – (గ్రీష్మ ఋతువు)


(దట్టంగా పూసిన లాక్షారసం రంగు వల్ల ఎర్రబడి, అందెలతో కూడిన స్త్రీల పాదాలు అవి వేసే ప్రతీ అడుగులోనూ హంసల ధ్వనులను అనుకరిస్తున్నట్టుగా ఉన్నాయి. అది విన్న జనులందరి మనస్సులూ మన్మథప్రభావాన్ని పొందుతున్నాయి.)


ఆమ్రీ మంజులమంజరీ వరశరః సత్కింశుకం యద్ధనుః

జ్యా యస్యాలికులం కలంకరహితం ఛత్రం సితాంశుః సితం

మత్తేభో మలయానిలః పరభృతా యద్ద్వందినో లోకజిత్

సోఽయం వో వితరీతరీతు వితనుర్భద్రం వసంతాన్వితః – (వసంత ఋతువు)


(ఎవడి గొప్ప బాణాలు అందమైన ఆకర్షణీయమైన మామిడిపూల గుత్తులో, ఎవడి విల్లు మోదుగపువ్వో, ఎవడి వింటినారి తుమ్మెదల బారో, ఎవడి మచ్చలేని తెల్లని గొడుగు తెల్లని కిరణాల్తో కూడిన చందమామో, ఎవడి మదపుటేనుగు గంధపుచెట్లున్న మలయపర్వతపు వాయువో, ఎవడి వంది జనం (స్తోత్రపాఠాలు చేసేవాళ్ళు) కోకిలలో, అటువంటి లోకాల్ని జయించే మన్మథుడు, తన స్నేహితుడైన వసంతుడితో కలిసివచ్చి (అంటే వసంతకాలంలో) మీ అందరిమీదా సుఖభాగ్యాల్ని వెదజల్లుగాక! )


ఋతుసంహారం కాళిదాసు తొలిరోజుల్లో వ్రాసినది. రాను రాను, పదలాలిత్యానికి గాఢమైన భావాల్ని కూడా జోడించి తన భాషకీ, పదనాదానికీ కొత్త రంగులు దిద్దాడు. తరువాత వ్రాసిన రఘువంశ, కుమారసంభవ, మేఘదూత కావ్యాల్లో ఇది బాగా కనిపిస్తుంది. ఆ కావ్యాలు చదివి ఆనందించాలంటే సంస్కృతభాష నేర్చుకోవాలి. శ్రీమద్రామాయణం చదవాలంటే కొద్దిగా భాష తెలిస్తే చాలు. ఒక విధంగా చెప్పాలంటే, ఏ భాషవాళ్ళకి, ఆ భాషలో వాల్మీకి మహర్షి వ్రాసిన పాటలా ఉంటుంది. శ్లోకంలో ఉన్న పదాల్ని గద్యక్రమంలో (కర్త-కర్మ-క్రియ వరసలో) పేర్చుకుని అర్థం చేసుకోవడం చాలా సులువు. కాళిదాసు కావ్యాలకొస్తే, ఋతుసంహారంలో తప్ప మిగిలిన కావ్యాల్లో శ్లోకాల్ని గద్యక్రమంలో పేర్చుకోవడం, కొన్ని పదబంధాలకి అర్థాన్ని తెలుసుకోవడం అంత సులువు కాదు. భాషను ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి. ఆ పరిణామాన్ని పై మూడు శ్లోకాల్లోనే చూడవచ్చు. వీటిలో మూడవ శ్లోకం ఋతుసంహారంలో ఆఖరి సర్గ అయిన వసంతర్తువులో ఆఖరి శ్లోకం.


ఇలా భాషను నేర్వగా, నేర్వగా ఈ క్రింద చెప్పిన లాంటి శ్లోకాల్లో, గీతరచయిత వేటూరి చెప్పినట్టుగా ‘ఆరు ఋతువులూ ఆహార్యములై’ కనిపిస్తూంటే, భావాల విందు, నాదాల పసందు రెండింటినీ అనుభవిస్తాం.


అది కుబేరుడి అలకానగరం అవడం వల్ల అన్ని ఋతువులూ అన్ని వేళలా ఉంటాయి. అందువల్ల అక్కడి వనితలు అన్ని ఋతువుల పువ్వుల్నీ అన్ని వేళలా దేహమంతా ధరిస్తారని మేఘుడికి (మబ్బుకి) యక్షుడు చెప్తున్నాడు.


హస్తే లీలాకమల మలకే బాలకుందానువిద్ధం

నీతా లోధ్రప్రసవరజసా పాండుతామాననే శ్రీః

చూడాపాశే నవకురువకం చారు కర్ణే శిరీషం

సీమంతే చ త్వదుపగమజం యత్ర నీపం వధూనామ్ – (మేఘసందేశః 2-2)


[యత్ర= ఏ (అనగా ఆ కుబేరుని అలకానగరంలో); వధూనామ్ = స్త్రీల యొక్క; హస్తే = చేతిలో; లీలా కమలమ్ = విలాసం కోసం పట్టుకున్న తామరపువ్వు (ఇది శరదృతువులో లభిస్తుంది); అలకే = ముంగురుల్లో; బాలకుందానువిద్ధమ్ = తురుముకోబడ్డ అప్పుడే విరిసిన మల్లెలు (ఇది హేమంత ఋతువులో లభిస్తుంది); ఆననే = ముఖం మీద; లోధ్రప్రసవరజసా = లొద్దుగ పువ్వుల పుప్పొడిచేత  నీతా= ఇవ్వబడిన; పాండుతామ్ శ్రీః= గౌరవర్ణపు శోభ (లొద్దుగ శిశిర ఋతువులో లభిస్తుంది); చూడాపాశే = కొప్పు ముడిలో; నవకురువకం = ఎర్ర గోరింట పువ్వు (ఇది వసంత ఋతువులో లభిస్తుంది); కర్ణే = చెవియందు; చారు శిరీషం = అందమైన దిరిసెన పువ్వు (ఇది గ్రీష్మ ఋతువులో లభిస్తుంది); సీమంతే = పాపటలో; త్వత్ =నీ; ఉపగమజం = రాక వల్ల పుట్టిన (వర్షాకాలం లో లభించే); నీపం చ = నీపకుసుమమూ ఉంటాయి


ఈ విధమైన భాషావికాసమే కాళిదాసుని కవికులగురువుగా మాత్రమే కాదు, సంస్కృతగురువుగా కూడా నిలబెట్టింది. సంస్కృతం నేర్చుకోవడంలో మొదటి భాగం పంచకావ్యాలు గురువు దగ్గర కూర్చుని చదివి అర్థం చేసుకోవడం. పంచకావ్యాలంటే రఘువంశం (కాళిదాసు), కుమారసంభవం (కాళిదాసు), కిరాతార్జునీయం (భారవి), శిశుపాలవధం (మాఘుడు), నైషధీయ చరితం (శ్రీహర్షుడు). దాక్షిణాత్యులు కొందరు నైషధీయ చరితం బదులు మేఘసందేశం (కాళిదాసు) అని అంటారు. ఏ లెక్కన చూసినా, అధ్యయనం విషయానికొస్తే, కాళిదాస గ్రంథాలకే పెద్దపీట. భాష నేర్వాలన్నా, భాషాసౌందర్యాన్ని అనుభవించాలన్నా కాళిదాసే.


ఆ కావ్యాల్ని చదవడం కూడా పైన చెప్పిన వరస లోనే చదవాలి. అప్పుడే భాషని సవ్యంగా నేర్చుకోగలుగుతాం. రఘువంశంలో భాష సరళంగా ప్రారంభమై, ఒక కావ్యాన్నుండి మరో కావ్యానికి వెడుతూంటే సంక్లిష్టంగా మారుతూ విద్యార్థుల మెదడుకి పరీక్షలు పెడుతుంది. అందుకే, నైషధం విద్వదౌషధం అనే సామెత. ఈ పాఠ్యప్రణాళికలో, కాళిదాసు విద్యార్ధులకిచ్చిన గొప్ప బహుమతి రఘువంశం నుంచీ కూడా కవితాసువాసనల్ని వెదజల్లడం. ఒకప్రక్క భాషని నేర్చుకుంటూండగానే, అద్భుతమైన భావసంపదలో చదువుకునే వాళ్ళని ముంచి తేల్చడం. భాషావిషయమైన అంతరార్ధాల్ని తెలియజెప్పడం. (రఘువంశం మొదటి శ్లోకంలోనే చూడండి. పదానికీ, దానికుండే అర్థానికీ గల సంబంధంతో మొదలు పెట్టాడు కావ్యాన్ని.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

గురువారం🌷* *🌹23, జనవరి, 2025🌹* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌷గురువారం🌷*

*🌹23, జనవరి, 2025🌹*  

     *ధృగ్గణిత పంచాంగం*


  *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - కృష్ణపక్షం*

*తిథి      : నవమి* సా 05.37 వరకు ఉపరి *దశమి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే )

*నక్షత్రం  : విశాఖ* (24) తె 05.08 వరకు ఉపరి *అనూరాధ*

*యోగం  : గండ* (24) తె 05.07 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం  : గరజి* సా 05.37 *వణజి* (24) తె 06.38 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు* 

      *ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *రా 07.24 - 09.10*

అభిజిత్ కాలం  :  *ప 11.57 - 12.42*

 

*వర్జ్యం             :  ఉ 08.46 - 10.32*

*దుర్ముహూర్తం  : ఉ 10.26 - 11.11 మ 02.58 - 03.43*

*రాహు కాలం   : మ 01.44 - 03.09*

గుళికకాళం       : *ఉ 09.29 - 10.54*

యమగండం     : *ఉ 06.40 - 08.05*

సూర్యరాశి : *మకరం*  

చంద్రరాశి : *తుల/వృశ్చికం* 

సూర్యోదయం :*ఉ 06.40*

సూర్యాస్తమయం :*సా 05.59*

*ప్రయాణశూల  : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం          :  *ఉ 06.40 - 08.55*

సంగవ కాలం         :      *08.55 - 11.11*

మధ్యాహ్న కాలం    :      *11.11 - 01.27*

అపరాహ్న కాలం    : *మ 01.27 - 03.43*

*ఆబ్ధికం తిధి         : పుష్య బహుళ నవమి*

సాయంకాలం        :  *సా 03.43 - 05.59*

ప్రదోష కాలం         :  *సా 05.59 - 08.31*

రాత్రి కాలం            :  *రా 08.31 - 11.54*

నిశీధి కాలం          :*రా 11.54 - 12.45*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.58 - 05.49*

________________________________

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


      *#సమస్యలు #తీర్చే* 

 *#దత్తాత్రేయ #మంత్రాలు*


*🌹సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం.🙏*


*"దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం||*

*యో భూదభీష్టదః పాతు సనః సంతాన వృద్ధికృత్||*


*🌹ఓం శ్రీ దత్తాత్రేయ నమః🌹*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

      🌹🌷🪔🪔🌷🌹

23.01.2025,గురువారం

 


*🙏జై శ్రీమన్నారాయణ🙏*

23.01.2025,గురువారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - బహుళ పక్షం

తిథి   : నవమి  మ3.18 వరకు

వారం   : బృహస్పతివాసరే  (గురువారం)

నక్షత్రం : విశాఖ తె3.22 వరకు

యోగం : గండం తె3.52 వరకు

కరణం  : గరజి మ3.18 వరకు

తదుపరి వణిజ తె4.11 వరకు

వర్జ్యం   : ఉ7.09 - 8.54

దుర్ముహూర్తము : ఉ10.20 - 11.05

మరల మ2.47 - 3.32

అమృతకాలం : సా5.42 - 7.27

రాహుకాలం     : మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం :

ఉ6.00 - 7.30

సూర్యరాశి: మకరం

చంద్రరాశి: తుల

సూర్యోదయం: 6.38 

సూర్యాస్తమయం: 5.46


*శ్రీ గోదా తాయారు రంగనాథ స్వామి దేవాలయము & శ్రీరామానుజ సేవా ట్రస్ట్, శ్రీరంగగిరి, క్రిష్ణానగర్, హెచ్.బి.కాలనీ,మౌలాలీ.* 

ఛైర్మన్. డా.ధనుంజయ. *7702417779.*


మీ రక్తాన్ని ధారపోయండి - నేను స్వాతంత్రం సాధించి పెడతానని ఉర్రూతలూగించిన సుభాష్ చంద్రబోస్ మాటలు ఆనాటి యువతరాన్ని స్వాతంత్ర్య సమరంలో ఉవ్వెత్తున పాల్గొనేటట్లు చేశాయి. స్వామి వివేకానంద, భగత్ సింగ్ తరువాత దేశ యువతపై అత్యంత ప్రభావం, చైతన్యం కలిగించిన వ్యక్తిగా, దేశభక్తికి మారుపేరుగా నిలిచిన ధీశాలి సుభాష్ చంద్రబోస్. ఈయననే మనం నేతాజీ అని పిలుచుకుంటాం...


ప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు "నేతాజీ"గా పేరుపొందిన సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897న ప్రస్తుత ఒడిషాలోని కటక్ నగరంలో జన్మించాడు. మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసావాదంతో స్వరాజ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో ఆయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి దాన్ని ఆచరణలో పెట్టి ప్రసిద్ధి చెందాడు. మొత్తంపై అతివాద భావాలతో ఈయన చేసిన స్వాతంత్ర్యపోరాటం శ్లాఘనీయమైనది. మరణం కూడా వివాదాస్పదమైంది. ఆగస్టు 18, 1945న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. 1992లో బోస్‌కు "మరణానంతరం" అని ప్రకటించిన భారతరత్న పురస్కారం కూడా ఇదే కారణంతో ఆయన కుటుంబీకులు స్వీకరించనందును ఆయనకు ప్రకటించిన భారతరత్నను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.


నేతాజీ జన్మదినాన్ని ‘పరాక్రమ దివస్'గా జరుపుకుంటున్న నేటి సమయంలో, భవిష్యత్తులో ‘వికసిత్ భారత్' సాధనలో నేటి యువత అన్ని రకాల సామర్థ్యలతో, నైపుణ్యాలతో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుటలో ప్రధాన భూమిక పోషించాలని ఆశిద్దాం. 'అన్యాయం, తప్పుతో రాజీపడటమే అత్యంత ఘోరమైన నేరమని మర్చిపోవద్దు' అని నేతాజీ తెలిపిన మాటలు నిత్య జీవితంలో మనం అందరం ఆచరించడమే నేతాజీకి మనం ఇచ్చే ఘన నివాళి...


డా.ధనుంజయ...

గణిత మేధావి గొప్పతనం*

 *రాయలసీమకు చెందిన గణిత మేధావి గొప్పతనం* 


ఓ తెలుగు వ్యక్తి గొప్పదనం.

 *కడప జిల్లా ప్రొద్దటూరు* కు గర్వకారణం. కాని ఆయన విగ్రహం లేదు 🤷‍♀️🤷‍♀️


టిప్పు సుల్తాన్ కు గౌరవం ఇచ్చారు ప్రొద్దటూరు నాయకులు 🤗


*గణితబ్రహ్మగా* పేరొందిన *లక్కోజు సంజీవరాయ* (నవంబర్ 22, 1907 - డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. సంజీవరాయ 1907 నవంబర్ 27 న *కడపజిల్లా ప్రొద్దుటూరు* మండలంలోని కల్లూరులో జన్మించాడు.


జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి విని గుర్తు  పెట్టుకుని గణితంలో అపార విజ్ఞానం సాధించాడు.


తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించే వారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నారు.


శ్రీ సంజీవరాయ తొలిసారి *1928 లో గణితావధానం నిర్వహించారు.* అప్పటినుంచి 1995వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదులలోను పలు ప్రదర్శనలను ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు ప్రధాన ఆకర్షణ శ్రీ సంజీవరాయ గణితావధానమే.


సాధారణంగా గణితావధానంలో, పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం-కాని, ఈ విషయంలో శ్రీ సంజీవరాయకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడా చెప్పి, కొంత వరకు జాతకం కూడా చెప్పేవారు.


ఈ ప్రత్యేకతను (మానవ గణన యంత్రంగా [Human Computer] పేరొందిన శకుంతలా దేవితో సహా) మరెవరూ చూపలేక పోయారు. ఆవిధంగా, ఇది అనితర సాధ్యమైన ప్రత్యేకత. 1966 డిసెంబరు ఏడో తేదీ.. అది హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక 2 power 103 ఎంత? 


దానికి సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని. 

'క' నుంచి 'క్ష' వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, 'స, రి, గ, మ, ప, ద, ని'' అక్షరాల లబ్దం ఎంత? ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు... 


కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు! ఆయనేమన్నా విద్యావంతుడా?... కాదు. 


పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన వారా ?... కాదు. పుట్టుగుడ్డి! 

పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం కావలసి వచ్చింది.

ఆయనే గణిత బ్రహ్మడా. లక్కోజు సంజీవరాయ "అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!"  


శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా... 

 *మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది...* ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ.. అందరూ తలలు పట్టుకుంటారు!


దానికి సంజీవరాయ చెప్పిన సమాధానం... *ఒక కోటి 84 లక్షల 46 వేల 74 కోట్ల 40 లక్షల 73 వేల 70 కోట్ల 95 లక్షల 51 వేల 615 వడ్ల గింజలన్నమాట* (1,84,46,74,40,73,70,95,51,615!)

ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే...


అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల.. ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు *వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు!


అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు!  ఇదంతా అబ్బురమని పించవచ్చు. కానీ సంజీవరాయ గణితావధాన వివరణ మహిమ అదంతా!  ఒకటి, రెండు, మూడు.... ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు!


సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షత్రాలు, వారాలు, పక్షాలు... గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు.. తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించిన అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుల్లోను  పలు ప్రదర్శనలు నిర్వహించారు.. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి *రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్* ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం! 


అప్పట్లో అనీబ్‌సెంట్, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్‌లతో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా గణితావధాన.. ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్ల కీర్తించారు.


పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలుబిగ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు.

అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు.

ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేథావి ఇల్లు కదలలేక పోయారు.


వివిధ విశ్వవిద్యాలయాలు... ఆయన్ని సత్కరించాయి. కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి. దురదృష్టమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు.


ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు.. మంచి శిక్షణ పొందారు. 


కానీ సంజీవరాయ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే... ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు


ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ *''ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు.. చేసేవాళ్లం''* అని అయన్నుద్దేశించి అన్నారు.


శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే సంజీవరాయని రక్షించుకోలేక పోయింది. 1997 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయ అస్తమించారు. 'అంక విద్యాసాగర విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన తన చివరి" రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు!


నిజానికి... *ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు, జ్ఞాన్‌పీఠ్‌లు...* ఆయన ప్రతిభ ముందు ఎంత చిన్నవో!


సేకరణ :  (చరిత్రలో  తెలుగు వాడు)


🍎🍎🍎🍇🍇🍇☀️☀️☀️