*🙏జై శ్రీమన్నారాయణ🙏*
23.01.2025,గురువారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం - హేమంత ఋతువు
పుష్య మాసం - బహుళ పక్షం
తిథి : నవమి మ3.18 వరకు
వారం : బృహస్పతివాసరే (గురువారం)
నక్షత్రం : విశాఖ తె3.22 వరకు
యోగం : గండం తె3.52 వరకు
కరణం : గరజి మ3.18 వరకు
తదుపరి వణిజ తె4.11 వరకు
వర్జ్యం : ఉ7.09 - 8.54
దుర్ముహూర్తము : ఉ10.20 - 11.05
మరల మ2.47 - 3.32
అమృతకాలం : సా5.42 - 7.27
రాహుకాలం : మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం :
ఉ6.00 - 7.30
సూర్యరాశి: మకరం
చంద్రరాశి: తుల
సూర్యోదయం: 6.38
సూర్యాస్తమయం: 5.46
*శ్రీ గోదా తాయారు రంగనాథ స్వామి దేవాలయము & శ్రీరామానుజ సేవా ట్రస్ట్, శ్రీరంగగిరి, క్రిష్ణానగర్, హెచ్.బి.కాలనీ,మౌలాలీ.*
ఛైర్మన్. డా.ధనుంజయ. *7702417779.*
మీ రక్తాన్ని ధారపోయండి - నేను స్వాతంత్రం సాధించి పెడతానని ఉర్రూతలూగించిన సుభాష్ చంద్రబోస్ మాటలు ఆనాటి యువతరాన్ని స్వాతంత్ర్య సమరంలో ఉవ్వెత్తున పాల్గొనేటట్లు చేశాయి. స్వామి వివేకానంద, భగత్ సింగ్ తరువాత దేశ యువతపై అత్యంత ప్రభావం, చైతన్యం కలిగించిన వ్యక్తిగా, దేశభక్తికి మారుపేరుగా నిలిచిన ధీశాలి సుభాష్ చంద్రబోస్. ఈయననే మనం నేతాజీ అని పిలుచుకుంటాం...
ప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు "నేతాజీ"గా పేరుపొందిన సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897న ప్రస్తుత ఒడిషాలోని కటక్ నగరంలో జన్మించాడు. మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసావాదంతో స్వరాజ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో ఆయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి దాన్ని ఆచరణలో పెట్టి ప్రసిద్ధి చెందాడు. మొత్తంపై అతివాద భావాలతో ఈయన చేసిన స్వాతంత్ర్యపోరాటం శ్లాఘనీయమైనది. మరణం కూడా వివాదాస్పదమైంది. ఆగస్టు 18, 1945న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. 1992లో బోస్‌కు "మరణానంతరం" అని ప్రకటించిన భారతరత్న పురస్కారం కూడా ఇదే కారణంతో ఆయన కుటుంబీకులు స్వీకరించనందును ఆయనకు ప్రకటించిన భారతరత్నను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
నేతాజీ జన్మదినాన్ని ‘పరాక్రమ దివస్'గా జరుపుకుంటున్న నేటి సమయంలో, భవిష్యత్తులో ‘వికసిత్ భారత్' సాధనలో నేటి యువత అన్ని రకాల సామర్థ్యలతో, నైపుణ్యాలతో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుటలో ప్రధాన భూమిక పోషించాలని ఆశిద్దాం. 'అన్యాయం, తప్పుతో రాజీపడటమే అత్యంత ఘోరమైన నేరమని మర్చిపోవద్దు' అని నేతాజీ తెలిపిన మాటలు నిత్య జీవితంలో మనం అందరం ఆచరించడమే నేతాజీకి మనం ఇచ్చే ఘన నివాళి...
డా.ధనుంజయ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి