23, జనవరి 2025, గురువారం

తాడ్ బండ -- శ్రీ హనుమాన్ దేవాలయం

 🎻🌹🙏 స్వయంభూగా  వెలసిన 

తాడ్ బండ  -- శ్రీ హనుమాన్ దేవాలయం...!!


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌸 ఆంజనేయుడు మహా పరాక్రమవంతుడు, అపజయమే ఎరుగనివాడు. శత్రువులను సంహరించడంలోను భక్తులకు అభయమివ్వడంలోను ఆయన ఎంత మాత్రం వెనుకాడడు. 


🌿ఆయన పేరు వింటేనే భూత.. ప్రేత.. పిశాచాలు కంటికి కనిపించనంత దూరం పారిపోతాయి. అంతటి శక్తిమంతుడైన ఆంజనేయుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు. 

       

🌸ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమ ఉంటారు..హనుమ ఉన్న చోట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది..హనుమ అంటే కాషాయం.. ఇంటింటి పైన కాషాయ జెండా ఉన్నంత వరకు మనకు,మన కుటుంబానికి,మన సమాజానికి,మన దేశానికి,మన ధర్మానికి ఎటువంటి డోఖా లేదు..ఏ దుష్ట శక్తులు ఏమి చేయలేవు..అదే సనాతన ధర్మం చెబుతుంది.


🌿 సనాతన ధర్మం లో భాగంగా  ఆవిర్భవించిన ఆలయమే శ్రీ తాడుబందు వీరాంజనేయ ఆలయం.

భాగ్యనగరం లోని సైనిక్పురి సమీపంలోని  సిఖ్ విల్లెజ్  దగ్గర పూర్వం తాడ్బంద్  గ్రామం ఉండేది. అక్కడ వెలసిన వీరంజనేయుడే తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి దేవాలయంగ వెలుగొందుతున్నది . 


🌸 ఈ గ్రామంలో ఎనబై సంవత్సరాల క్రితం పొదల్లో ఒక పెద్ద బండ రాయి బయటపడింది బండరాయి పైన వీరంజనేయుడూ  సుందర రూపం లో చెక్కబడి ధర్శనం ఇచ్చాడు.


🌿ఇక్కడే స్వామి వారి కోసం ఆలయాన్ని నిర్మించారు. రామాయణ కాలం లో జాబిలి మహర్షి ప్రతిష్టించిన మూడు ఆంజనేయ విగ్రహాలలో ఇది ఒకటి అని  స్థల పురాణం


 🌸త్రేతాయుగంలోనే ఇక్కడ స్వామి స్వయంభువుగా అవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతున్నది. 

జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు. మరి ఈ ఆలయ విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం..


🌹 స్థలపురాణం:🌹


🌿 శ్రీ తాడుబందు వీరాంజనేయ ఆలయం వాడుకలో ఈ ప్రాంతాన్ని తాడ్‌బండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. తాడ్ బండ్ ప్రాంతంలో నెలకొన్న

 శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం స్వయంభువుడని ప్రతీతి. 


🌸 మొగలులు, రాజపుత్రులు, కుతుబ్ షాహీలు ఈ దేవాలయం కోసం కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెబుతుంటారు.


🌿 త్రేతాయుగంలో జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేయగా ఆంజనేయుడు ప్రత్యక్షమైనట్లు చెబుతారు. అందుకే జాబాలి మహర్షి ఇక్కడ వీరాంజనేయస్వామిని ప్రతిష్ఠించినట్టు చెబుతారు. 


🌸తన తపస్సుకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూడమని మహర్షి వినాయకుడిని ప్రార్థించాడట. అందువల్ల ఇక్కడ ఆంజనేయుడితో సహా వినాయకుడు కూడా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.


🌿శ్రీ తాడుబందు వీరాంజనేయుడిని పూజిస్తే ఆపదలు, అనారోగ్యాలు తొలగిపోతాయి


🌸 జాబాలి మహర్షి ఇక్కడ వీరాంజనేయస్వామిని ప్రతిష్ఠించినట్టు తెలిసి శ్రీ రాముడు హర్షాన్ని వ్యక్తం చేసినట్టు స్థలపురాణంలో వుంది. 

ఆ తరువాత ఎందరో మహనీయుల రాకతో మరింత పవిత్రమైన ఈ క్షేత్రం, కాలక్రమంలో కనుమరుగైపోయింది.


🌿ఆ తరువాత 19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేశాడు. అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయ సహకారాలతో, నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు. ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి. 


🌹ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే...🌹


🌸 హనుమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలు శిలాఫలకంపై ఉన్నాయి. నవ వ్యాకరణంలో చివరి నాలుగు అంకాలను పూర్తి చేయాలంటే ఖచ్ఛితంగా గృహస్తుడై ఉండాలని, ఇందుకోసం తన కమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని స్వామివారికి గురువైన సూర్యుడు సూచిస్తాడు.


🌿ఇందుకు అంగీకరించిన ఆంజనేయుడు ఆమెను వివాహమాడతాడు. కానీ, ఆపై బ్రహ్మచారిగానే కొనసాగాడు. ఇక సువర్చల స్వామివారి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపేస్తుంది. వీరిద్దరి ప్రతిమలు ఇక్కడ మనకు గోచరిస్తాయి. 

       

 🌸ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా మంగళ - శని వారాల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. 


🌿ఇదే ప్రాంగణంలో సీతారాములు ... శివుడు దర్శనమిస్తూ వుంటారు. హనుమజ్జయంతి శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతుంటాయి. 


🌸40 రోజులపాటు జరిగే మండల దీక్షలు, మండల ప్రదక్షిణాలు, మండల అభిషేకాల కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు. మండల ప్రదక్షిణలు, పూజల కోసం ప్రత్యేకంగా నలభై రోజులపాటు ఇక్కడే ఉండాలని కోరుకుంటారు.


🌹 హనుమాన్ జయంతి వేడుకలు :


🌿భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు తాడ్‌బంద్ వరకు నిర్వహించే శోభాయాత్రతో ఘనంగా ముగుస్తాయి.


🌸 ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్‌మాన్ (చిన్నజయంతి), వైశాఖ బహుళ దశమినాడు (పెద్ద హను మాన్) జయంతిని ఘనంగా నిర్వహిస్తారు.


🌿 లక్షలాది దీక్షాపరులు, భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ముఖ్యంగా పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మూడురోజుల పాటు హోమం, యాగాదులు నిర్వహిస్తారు... స్వస్తి....🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: