23, జనవరి 2025, గురువారం

శ్రీనాధుని శివభక్తివైభవము!!

 శు భో ద యం🙏


శ్రీనాధుని శివభక్తివైభవము!!

"పంచబ్రహ్మ షడంగ బీజసహిత ప్రాసాద

పంచాక్షరీ,

చంచన్మత్రపరంపరాపరమనిష్ఠాతత్ప

రత్వంబునన్

మంచుంగొండ యనుంగు బెండ్లికొడుకున్, మధ్యాహ్నకాలంబుబూ

జించుంనిర్జర రాజసూనుడు మనోవీధీ

సదా ధ్యాసితన్";-హరవిలాసం -శ్రీనాధుడు.7ఆ-33ప;


      కవిసార్వభౌముడు శ్రీనాధకృత మహాకావ్యాలలో "హరవిలాసం కడపటికావ్యం.శివపారమ్యమైన ఈమహాకావ్యం శివపరత్వంబున తల్లీలలను వివరించేకావ్యం.ఆశ్వాసానికొక యితివృత్తంవంతున ఈకావ్యం వివిధ శివకథా కలితమైన కావ్యం.ఆనాటి వణిక్ప్రముఖుడు అవచితిప్పయసెట్టికీకావ్యం అంకిత మొనర్పబడినది

        ఇందలి చతుర్ధాశ్వసము వీరాద్భుత రసములకు కాణాచి పాశుపతాస్త్రసంసిధ్ధికై అర్జనుడు

పరమేశ్వరునిమెప్పింప, హిమశిఖరమున ఘోరతపమొనరించుట ఇందలి యితివృత్తము.

      పార్ధుని తపశ్చర్య వర్ణనా సందర్భములోనిది పైపద్యము.

           తత్పురుషాది పంచబ్రహ్మాత్మకమై,అంగన్యాస కరన్యాసాదియుక్తమై ఓంకారాది (పంచాక్షరీ) షడంగసహితమై  యొప్పు శివమంత్ర జపనిష్ఠా తత్పరత్వమున మనోవీధీనిరంతరనివాసియగు (హిమాలయుని ప్రియజామాతను) పరమేశ్వరుని మధ్యాహ్న సమయమున అర్జనుడు పూజించుట ఇందలిభావము.

      పద్యము పటువైనది శివదీక్షావిధాన నిధానమైనది.


    :కఠినవిషయముల వివరణము:


పంచబ్రహ్మలు;


1తత్పురుష,2 అఘోర 3 వామదేవ,

,4సద్యోజాత,5ఈశానాదులు

పరమేశ్వరునకుఅయిదు మఖములు వీనిని పంచబ్రహ్మలని యందురు.


షడంగబీజసహితము!

       నమశివాయ మంత్రము ఓంకారమునుగూడి షడక్షరపరిమితమగును. అదియే షడంగయుక్తము.


నిర్జరరాజ సూనుడు-దేవతలప్రభువైన

ఇంద్రుని కుమారుడు  పార్ధుడు.


మనోవీధీ సదాధ్యాసితన్-మనోవిధియందు నిరంతరము ధ్యానించు అభ్యాస వశమున,


                          స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: