23, జనవరి 2025, గురువారం

భాగవత సప్తాహం యొక్క విశిష్టత

 *భాగవత సప్తాహం యొక్క విశిష్టత*

       ---చాగంటి వారి ప్రవచనం నుండి...


     భాగవతమును శుకబ్రహ్మ పరీక్షిత్తు మహారాజుకు 7 రోజులు చెప్పారు. 

ఎందుకు 7 రోజులు చెప్పవలసి వచ్చింది... 

   భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది. 


     ఒక మనిషి ఎన్ని సంవత్స రములు బ్రటకనివ్వం డి.. 70 కానీ 90 కానీ నూరు సంవత్సరములు కానీ పూర్ణంగా బ్రతకనివ్వండి. ... కానీ ఎన్నిరోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడు రోజులే అని మనం తెలుసుకోవాలి.


   *ఎందుచేత???..* ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని... ఇంత కన్నా ఇంకా రోజులు లేవు.  

ఎనిమిదవ రోజు ఇంక లేదు... ఎప్పుడు మరణిస్తాడు.... ఎంత గొప్పవాడని వాడు పోవడానికి 8 వ రోజు ఉండదు,  ఆ ఏడు రోజులలోనే ఎవ్వరైనా వెళ్లిపోవాలి. 

ఆ ఏడు రోజులలోనే పుట్టాలి, ఆ ఏడు రోజులలోనే ఉండాలి, ఆ ఏడు రోజులలోనే తిరగాలి, కాబట్టి భాగవత సప్తాహము అంటే నీవు ఏరోజు న భగవంతుడిని స్మరించడం మానివేసావో ఆరోజు పరమ అమంగళ కరమైన రోజు.

 ఆరోజు భగవంతుని యెడల విస్మృతి కలిగింది కాబట్టి తను భగవన్నామమును పలుకలేదు. 


ఈశ్వరునికి నమస్కరించలేదు, ఈశ్వరుని గురించి తలంపు లేదు, ఆ రోజున తను ఉండి మరణించిన వానితో సమానం. 

     

    కాబట్టి ఆరోజున ఇంటి ఏమి తిరిగింది... నడయాడిన పీఠము ఒకటి తిరిగింది. 

ఒక శవం ఆ ఇంట్లో నడిచింది, కాబట్టి ఆరోజు ఆ ఇల్లు అమంగళము అయింది. 


    *కాబట్టి ఏది బ్రతుకు, నిజమైన బ్రతుకు ఏది.. నిజమైన బ్రతుకు ఈశ్వరుని నామ స్మరణమే. 

భగవంతుని నామమును ఎవరు స్మరిస్తా రో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు. 


అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్ఫురణకు వస్తుందా... 

ఆ వస్తువు నందు నీకు ప్రీతి ఏర్పడితే నీ మనస్సు భగవన్నామస్మరణం చేయడానికి అవరోధం ఉండదు. 

మీరు ఎక్కడ కూర్చున్నా మీ మనస్సు మీకు ఇష్టమైన వస్తువును గురించి స్మరిస్తూ ఉంటుంది. 

మనస్సు ఆ వస్తువు నందు ప్రీతి చెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. 

    

మీ మనస్సు ఈశ్వరుని యందు ప్రీతి చెందక పోతే ఈశ్వరుని నామమును స్మరించదు. 

ఇపుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాస భగవానుడు భాగవతము నందు ప్రతిపాదన చేస్తున్నారు. 

     

అందుకే భాగవతమును ఎవరు వింటారు వారి మనస్సు తెలిసో, తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది.


🙏🌸జై శ్రీమన్నారాయణ🌸🙏

కామెంట్‌లు లేవు: