18, మార్చి 2024, సోమవారం

పదకొండు ఇంద్రియాలు

 హరిఓం , - - **సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది. అతడు పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు. అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు*


*పదకొండులో..._*

 *అయిదు జ్ఞానేంద్రియాలు,_*

 *అయిదు కర్మేంద్రియాలు, మనసు ఉన్నాయి._*

 *1. శ్రోత్రం (చెవి),_*

 *2.త్వక్‌ (చర్మం),_*

 *3. చక్షుషీ (కన్నులు),_*

 *4. జిహ్వా (నాలుక),_*

 *5. నాసికా (ముక్కు) అనేవి_* *జ్ఞానేంద్రియాలైతే.._*

 *1. పాయు (మలద్వారం),_*

 *2. ఉపస్థ (మూత్రద్వారం),_*

 *3. హస్త (చేతులు),_*

 *4. పాద (కాళ్లు),_*

 *5. వాక్‌ (మాట)*

 *~అనేవి కర్మేంద్రియాలు. ఈ పదింటికి చివర మనసు._*

 *ఇదీ ఇంద్రియ సమూహం._* - *ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి._*

 *ఇంద్రియనిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య._*

 *ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని, కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు._*

*1. మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.*

 *2. చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది.*

 *3. కళ్లు అశ్లీలాన్ని చూస్తాయి._*

 *4. నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది._*

 *5. ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది.*

 *6. మల, మూత్ర ద్వారాలు పనిచేయకుండా పోతాయి._*

 *7. కాళ్లూ, చేతులూ హింసను ఆచరిస్తాయి._*

 *8.మాట అదుపు తప్పుతుంది. ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే >_*

 *9.మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు._*

 *అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే.*

 *మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి._*

*అందుకే వాల్మీకి - ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు.*

 *చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం._*

 *ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానంలేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే._*

 *అది ఎవరిమీదనైనా పడవచ్చు. నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని, నిప్పును తాకడానికి సాహసించడు._*

 *ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు. కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం._*

 *లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి._*

 *ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్జ్వలంగా వెలిగిపోతాడు._*

 *ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపుతప్పినా, అన్ని ఇంద్రియాలూ క్రమంగా పట్టుతప్పిపోతాయి._*

 *పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది._*

 *ప్రకృష్టమైన (విశిష్టమైన) జ్ఞానమే ప్రజ్ఞ. అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం._*

*అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది.*

 *మెదడును చక్కగా ఉంచుకోవడానికి ’పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి. అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడంవల్ల ఇంద్రియాలన్నీ పటిష్ఠంగా ఉంటాయి. అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి వర్ధిల్లుతుంది’.*

 *ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.*

 *అందువల్ల జితేంద్రియుడు (ఇంద్రియాలను జయించినవాడు) కావాలో, ఇంద్రియజితుడు (ఇంద్రియాలతో ఓడిపోయినవాడు) కావాలో తేల్చుకోవలసింది మనిషే !_*

*సర్వేజనాసుఖినోభవంతు* ...................... - - సేకరణ ..... - 🙏🙏....... - వలిశెట్టి లక్ష్మీశేఖర్ ... - 98660 35557. - 🙏🙏🌄🙏🙏

కాశీ, అయోధ్య* , *గయ,ప్రయాగ దర్శనం*

 🙏🙏 ''ఓం తత్ సత్''🙏🙏

     

  * *కాశీ, అయోధ్య* , *గయ,ప్రయాగ దర్శనం** 


        *OM TOURS* :                     

HYDERABAD, VARANASI, HARIDWAR 

6309089942,8188809154

 హైదరాబాద్ నుండి కాశీ కి *Train* 🚂 3/AC లో *సెప్టెంబర్* *30th* ప్రయాణం 7రోజులు 

 *NonAC గదులు* , ట్రావెల్స్, ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, రాత్రి పూటకి అల్పాహారం. *కాశీ దర్శనం* 

తిరిగి హదరాబాద్ కి 8th *అక్టోబర్* జేరుకుoటాము.

ఒక్కరికీ Rs 23,500/- రిజర్వేషన్ కొరకు అడ్వాన్స్ బుకింగ్ Rs 5,000/- 

సంప్రదించండి  

 *OM TOURS* *

   6309089942,

   8188809154*

అదే బ్రహ్మానందం

 అదే బ్రహ్మానందం !


అనగనగా ఒక కుర్రాడు ! 

 రోహిత్ గుర్తున్నాడా ? 


జ్ఞాపకం రావడం లేదా ? 

ఫరవా లేదు ! 


పోనీ ... 

మంచి కాఫీ లాంటి సినిమా "ఆనంద్" హీరో ?

 గుర్తొచ్చాడు కదా ? 

పేరు గుర్తుందా ?

ఆయన్ని వెండితెరపై చూసి ఎన్నాళ్లయింది ?

ఇప్పుడేమి ఏమి చేస్తున్నాడో ? 

ఆలోచించారా ?


కొత్త బంగారు లోకం వరుణ్ సందేశ్ ; సూపర్ హిట్ "పెళ్లి "హీరో వడ్డే నవీన్ , గౌతం ఎస్ఎస్సి హీరో నవద్వీప్ ... 

... వీరందరూ ఇపుడు ఏమి చేస్తున్నారో ఆలోచించండి !


హీరో ల సంగతే కాదు .. నిన్న మొన్నటి దాక వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ లు ఇప్పుడు ఎక్కడ ?

 ఎక్కడ ఉన్నారు అనేది ముఖ్యం కాదు .

 వారు ఆనందంగా ఉన్నారా ?

 ఆలోచించండి . 


ఉవ్వెత్తున నింగికెగసి అటుపై కిందకు పడిపోతే ?

యుక్త వయసులోనే పేరు ప్రఖ్యాతులొచ్చి ముప్పై- ముప్పైఐదేళ్లకే ఫేడవుట్ అయిపోతే ? 

 జీవితం ఎలా ఉంటుంది ?


ఏముంది .. పేరు తో బాటు డబ్బు కూడా వచ్చి ఉంటుంది .. జీవితాంతం కాలుపై కాలేసుకుని హ్యాపీగా బతికేయొచ్చు అని అనుకుంటున్నారా ?


అయితే హీరో ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నట్టు ?

 బతకడానికి డబ్బులు లేకనా ?


అయన కొచ్చిన పేరుకు, జీవితాంతం ఒక్కో తెలుగు వారి ఇంట్లో గెస్ట్ గా వెళ్లి హ్యాపీగా బతికేసి ఉండొచ్చుగా? 


డబ్బుతోనే లైఫ్ లో సంతోషం వచ్చేటట్టయితే వేల కోట్ల సంపదకు వారసులుగా పుట్టిన అనేక మంది ఏదో గుర్తింపు పొందాలని ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు ? 


తాత అక్కినేని, తెలుగు సినిమా లెజెండ్ . 

తండ్రి నాగార్జున టాప్ హీరో .

 వారసత్వంగా వచ్చిన అన్నపూర్ణ స్టూడియో .. ఇంకా వేల కోట్ల ఆస్తులు .

దర్జాగా కాలు పై కాలు వేసుకొని బతికేయక .. అఖిల్ అక్కినేని హీరో గా నిలదొక్కుకోవాలని ఎందుకు అంత కష్టపడుతున్నట్టు ? సిక్స్ ప్యాక్ బాడీ .. నటన.. ఫైటింగ్.. డాన్స్ ల లో శిక్షణ ఎందుకు తీసుకొంటున్నట్టు ?

  ఆలోచించండి ! 


డబ్బు .. పేరు ప్రఖ్యాతులే జీవితం అయితే .. 


సిల్క్ స్మిత .. ఫటాఫట్ జయలక్ష్మి లాంటి ఎందరో నటీమణులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ?

 శ్రీదేవి దివ్య భారతి లాంటి టాప్ హీరోయిన్స్ అనుమానాస్పద మరణాలను ఎలా అర్థం చేసుకోవాలి ? 


ఒకప్పుడు టాప్ - 5 హీరో లలో ఒకడుగా వెలిగిన రాజశేఖర్, నేటి మానసిక స్థితి ఏంటి ?


 వేణు అయితే సొంత వ్యాపారాలు చూసుకొంటున్నాడు . 


కానీ తరుణ్ ? 

ఒకప్పటి లవర్ బాయ్ .. నేడు అతని జీవితం ఎలా ఉంది? ఫీలింగ్స్ ఎలా వున్నాయి ?

 ఏ మీడియా ఇంటర్వ్యూ చెయ్యదేమి?


అల్లరి నరేష్ ?

కామెడీ నటనలో రాజేంద్ర ప్రసాద్ ను మించిపోయాడు .

 పాపం నేడు ? 

ఏమి చేస్తున్నాడు ?

 దిన చర్య ఎలా ఉంది ?

 పొద్దున్న లేస్తే .. నాకు ఈ రోజు పెద్దగా పనేమీ లేదు అనే ఫీలింగ్ ఎలా ఉంటుంది ? 

ఒక్కసారి ఎవరూ అడగరేమి ? 


సినిమా వారి ఉదాహరణలు అయితే మీరు బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పాను. 


 డిజిపి... చీఫ్ సెక్రటరీ... ప్రిన్సిపాల్ సెక్రటరీ లాంటి అత్యున్నత పదవుల్లో రిటైర్ అయిన ఐఏఎస్.. ఐపీఎస్ ఆఫీసర్ లు .. అప్పటిదాకా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నవారు... రిటైర్ అయిన కొన్ని నెలలకే తీవ్ర అనారోగ్యం తో మరణించడం చూసాను . 


అప్పటిదాకా అనారోగ్యం తో ఉండి మంచి పదవి రాగానే ఆరోగ్యవంతులయిన రాజకీయ నాయకులున్నారు .

బాగా గుర్తుకు తెచ్చుకోండి .

 పదవి అయన లో వన్నె తెచ్చింది అంటారు .

కారణం పదవి .. కుర్చీ కాదు ..


 వీటికి అసలు కారణం తెలుసుకోవాలి . 

అప్పుడే లైఫ్ అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది .


జీవితం మనది .. దేహం మనది .. కానీ 


మనల్ని ఆడించేది .. పాడించేది .. ఉన్నత శిఖరాలు చేర్చేది .. అధః పాతాళంలోకి తోసేసేది .... మన ఆలోచనలు ..


అవును .. ఆలోచనలే ... భవిత .. జీవితం .


పెద్ద వారు... " నుదిటి రాత "అంటారు .

 "ఆడేది.. ఆడించేది .. అంతా పై వాడు .. మనం నిమిత్త మాత్రులం" అంటారు .


"యత్నం .. ప్రయత్నం .. దైవ యత్నం" అని కూడా అన్నారుగా .? 


"నీ పని నీవు చేయి ... ఫలితం గురించి ఆలోచన వద్దు " అన్నాడు గీత లో కృష్ణుడు .


 " నా చేతిలో ఏముంది ? దైవాధీనం" అనుకొంటే అది మెట్ట వేదాంతం అవుతుంది .


"అదృష్టం ధైర్యవంతులనే వరిస్తుంది" అని ఇంగ్లీష్ సామెత .


అందమే .. ఆనందం.. 

ఆనందమే జీవిత పరమార్థం .


అందం ఆంటే?... ఒడ్డు... పొడవు.. రంగు... రూపం .. 

ఆగండాగండి .

 నేను చెప్పేది దేహానికి సంబంధించి కాదు . మనసుకు సంబంధించి .


దేవుడు అనండి.. లేదా ప్రకృతి . 

అబ్బుర పరిచే ఏర్పాటును ప్రతి వ్యక్తి దేహం లో చేసి పెట్టాడు .


నిన్నటి కంటే .. ఈ రోజు బాగుండాలి .. 

ఈ రోజుకంటే రేపు బాగుండాలి .. 

నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే దాక చేతి నిండా పనుండాలి . 

ఛాలెంజ్ ఉండాలి . 

అప్పుడు... ప్రతి రోజూ... భలే మంచి రోజు .. పసందయిన .రోజూ ...


.అదే బతుకు మాధుర్యం .. 

ఆలా బతుకు మాధుర్యాన్ని చవి చూస్తేనే జీవితం లో వసంతాలు పూస్తాయి .

 లేక పొతే ఎడారి .


  పాజిటివ్ ఫీలింగ్స్.. పాజిటివ్ వాతారవరణం.. లైఫ్ లో ఉంటే ఆక్సిటోసిన్ , డోపమైన్ , ఎండార్ఫిన్ సెరిటోనిన్ అనే హాపీ హార్మోన్స్ మన శరీరం లో స్రవిస్తాయి . 

వాటి వల్ల ఆరోగ్యం .. ఆనందం .. అదే బ్రహ్మానందం ..


 పుణ్య దంపతులు నాగలింగా చారి , లక్ష్మి నర్సమ్మ ఏమి అలోచించి బ్రహ్మానందం అని పేరు పెట్టారో .. ఒక తరం తెలుగు వారికి బ్రహ్మానందం పంచాడు . తాను ప్రతి ప్రతి రోజూ బ్రహ్మ్మనందం పొందుతూ జీవించాడు .జీవిస్తున్నాడు .


అదీ లైఫ్ ఆంటే ..


ఎన్టీవోడిలా ముఖ వర్చస్సు లేదు . అక్కినేని లా డాన్స్ రాదు . ఎస్వీ రంగారావు లా నటన రాదు ప్రభాస్ లా కండలు లేవు . మహేష్ బాబులా గ్లామర్ లేదు .. అయినా ముప్పై ఏళ్ళు .. దినదినప్రవర్ధమానం ..

 అయన సమకాలికులు అయన తరువాత వచ్చిన వారు ఎంతో మంది ఫేడ్ అవుట్ అయిపోయారు . 

కానీ బ్రహ్మానందం ? 


ఏమిటి రహస్యం ? 


లైఫ్ కొంతమందిని అందలాలు ఎక్కిస్తుంది !

 కొంతమందిని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకొంటుంది .


రావు గోపాల్ రావు మాటల్లో చెప్పాలంటే .. దీని తస్సా దియ్య .. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి .టీవీ వారి మాటల్లో చెప్పాలంటే దీన్ని ఎలా చూడాలి ? 


మన ఆలోచనలే మన జీవితం . 


ఉన్నత లక్ష్యాలు ఉండాలి .

 కానీ నిలకడయైన వృద్ధి అంతకన్నా ముఖ్యం .

 మన పరిమితులు తెలుసుకోవాలి . ఎక్కడ తగ్గాలో తెల్సుకోవాలి . 

అగ్ర హీరో అయిపోవాలి అనుకోవడం గొప్ప ఆలోచనే .

 కానీ వాస్తవాన్ని గ్రహించకపోతే ?

 తెలుగు కామెడీ స్టార్ గుర్తొస్తున్నాడా ?  


 జీవితం ఎప్పుడు సవాళ్లు విసురుతూనే ఉంటుంది .

 సవాళ్లు లేని జీవితం పెద్ద బోర్ .

 కష్టాలు మనుషులుకు కాక రాళ్లకు రప్పలు వస్తాయా ?

ఒత్తడికి గురయితేనే బొగ్గు వజ్రం అవుతుంది . సాన పడితినే అది మెరుస్తుంది .

 శిల్పి ఉలి దెబ్బలను వొళ్ళంతా తగిలించుకున్న రాయి గుడిలో శిల్పమయ్యింది . పూజలందుకొంది . ఉలిదెబ్బలు తగలని రాళ్లు గండశిలలుగా మిగిలిపోయాయి .


 ప్రతి సంక్షోభం ఒక అవకాశం . నీ స్పందన ఏంటి అనేదే నీ జీవితం .

 అపజయానికి మించిన గురువు సంక్షోభానికి మించిన స్నేహితుడు లేదు.


జీవితాన్ని ఈ బాటలో సాగిస్తే బ్రహ్మ్మనందం .


ఈర్ష .. అసూయ .. ద్వేషం ... నిస్సహాయత.. కోపం... దుఃఖం .. ఇవన్నీ నెగటివ్ ఫీలింగ్స్ .


ప్రతి మనిషికి ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి . వాటిని ఎంత త్వరగా వదిలిచుకొంటాము అనేది ముఖ్యం . చేతిలో ఒక వాటర్ బాటిల్ ను వదలకుండా వారం రోజులు పట్టుకొంటే ? 

ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. కదా ?


 . ఒక చిన్న వాటర్ బాటిల్ కే ఇలా అయితే .. నెగటివ్ ఫీలింగ్స్ ను ఏళ్ళ తరబడి మోస్తూ తిరిగితే ?


కార్టిజాల్ అనే హార్మోన్ వస్తుంది . అది గుండెను కిడ్నీ లను .. ఇంకా శరీర భాగాలను దెబ్బ దెబ్బ తీస్తుంది .

 మనసు పాడై పోతుంది .

 మనసు గతి అంతే అయితే మనిషి బతుకు కూడా అంతే.. 


జీవితం లో బ్రహ్మానందం పొందాలి ఆంటే..

 పనిని ప్రేమించండి . 

ఇష్టమయిన పని చేస్తుంటే అలసట రాదు . ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం ఉంటుంది .

మీరు పని వెంట పడితే .. పేరు ప్రఖ్యాతులు డబ్బు ఆరోగ్యం ఆనందం మీ వెంట పడుతాయి .    


 మీరు ఎంత డబ్బు సంపాదించినా... ఎన్ని ఆస్తులు మీ వారసులకిచ్చినా వారి జీవితం హ్యాపీగా ఉంటుందని గ్యారెంటీ లేదు . మీకింకా అనుమానం ఉంటే ముంబై హైదరాబాద్ లలోని అగ్ర హీరోలనడగండి . 


మీ పిల్లలకు మంచి విద్య నందివ్వండి . 

మంచి విద్య ఆంటే మార్కులు ర్యాంకు లుకాదు .

 అవి ముఖ్యమే .


అందమయిన బతుకునిచ్చేదే విద్య . 

జీవితం ఆనందంగా సాగాలంటే వారి ఆలోచనలు సరిగా రూపు దిద్దుకోవాలి . 

మొక్కై వంగితేనే మాను దృడంగా పెరుగుతుంది .


షో ఆఫ్ .. బిల్డ్ అప్ లు కారాదు జీవితం .

నేలపై నడిస్తే.. ఎగరడం ప్రాక్టీస్ చెయ్యొచ్చు . ఎగరాలన్న పట్టుదల వస్తుంది . 

మీ డబ్బుతో పలుకుబడి తో వారిని గాలిలో తిప్పితే .. రేపు అధఃపాతాళానికి పడిపోవచ్చు .


ఎందరో మహానుభావులు . అందరికీ వందనములు . 


జీవితపు అందచందములను అనుభవించి బ్రహ్మనందము పొందిన వారు . ఎందరో మహానుభావులు 


నా మెస్సేజ్ లో ఎన్నో వైరల్ అయ్యాయి . వేటిలో నా పేరు పెట్టుకోలేదు .


కానీ ఈ మెసేజ్ స్పెషల్ . 


నా జన్మ దిన సందర్భంగా నేను పోస్ట్ చేసున్న ఈ మెసేజ్ సూపర్ వైరల్ కావాలని కోరుకుంటూ.. 

సర్వే జనా సుఖినోభవంతు ! 

  మీ వాసిరెడ్డి అమర్నాథ్ .

పరమేశ్వర స్వరూపంగా

 🙏 కాలాన్ని పరమేశ్వర స్వరూపంగా ఉపాసిస్తాం మనం.🙏


 మహాకాళీ, మహాకాల వంటి నామాలు కాల శక్తిని తెలియజేసే శబ్దాలు.


 పురాణాల్లో ఒక కథ కనిపిస్తుంది 


ఒకసారి బ్రహ్మ, విష్ణువు వారిలో ఎవరు అధికులు అనే వాదన పెరిగి, యుద్ధానికి సన్నద్ధులయ్యారు. వారిరువురూ పరస్పరం ప్రయోగించుకునే తీవ్రాస్త్రాల వల్ల అకాల ప్రళయం, బీభత్స పరిస్థితీ ఎదురయ్యేసరికి దేవతలంతా మహాదేవుడైన సదాశివుని శరణు వేడారు.


శివుడు వారిరువురి నడుమ మహాగ్ని స్తంభంగా ఆవిర్భవించాడు. ఆ తేజోమయాగ్నికి తుది మొదళ్ళు తెలియలేదు. దానితో హరి బ్రహ్మలు ఇరువురూ ఒకరు తుదినీ, ఒకరు మూలాన్నీ తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఎవరు తమ ప్రయత్నంలో సఫలీకృతులౌతారో వారే అధికులని ఒప్పుకోవాలని ఒప్పందం పెట్టుకొని తమ యత్నాలనారంభించారు.


ఇరువురూ కూడా ఆ తేజోమయలింగానికి ఆద్యంతాలు తెలుసుకోలేక పోయారు.


 బ్రహ్మ ఒక మొగలిపువ్వు సాక్ష్యంతో అసత్యమాడి తాను తుదిని తెలుసుకున్నానని ప్రకటించాడు. కానీ సర్వసాక్షి అయిన సర్వేశ్వరుడు బ్రహ్మ అసత్యానికి ఆగ్రహించి పూజార్హత లేకుండా శపించి శిక్షించాడు.


అసత్యానికి ఎన్నడూ పూజార్హత ఉండరాదని విశ్వ శాసనం.


ఈ కథలో అనేక సంకేతాలున్నాయి. ముగ్గురిలో ఎవరు ఎక్కువో తేల్చుకొనడం ఈ కథలో ప్రధానోద్దేశం కాదు. కాలస్వరూపాన్ని అవగతం చేయడమే దీని ఆంతర్యం.


 నిజానికి పరమేశ్వర చైతన్యం సృష్టి-స్థితి-లయాలలో మూడుగా వ్యక్తమవుతుంది. అదే బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపం. ఈ మూడూ ఏక ఈశ్వర చైతన్య స్వరూపాలే. ఈ ప్రాథమిక అవగాహన ఎప్పుడూ ఉండాలి.   


కాలాగ్ని స్తంభరూపుడైన పరమశివునికి తుది మొదళ్ళు తెలుసుకొనడానికి ప్రయత్నించడంలో బ్రహ్మ హంసరూపాన్నీ, విష్ణువు వరాహరూపాన్నీ ధరించారని కథ.


 వరాహం తవ్వుకుంటూ వెళుతుంది. హంస ఎగురుతూ విహరిస్తుంది•.


 ఈ రెండూ మన బుద్ధికున్న ప్రజ్ఞా స్థాయీ విశేషాలు. మనం గతాన్ని ‘తవ్వుకుంటూ’ వెళతాం. జ్ఞాపకాలుగా గత ఘటనల్ని తెచ్చుకుంటూ, కాలపు మొదళ్ల ఆనవాళ్ళను అందుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ, వాటి 'ఆది' మనకు చిక్కదు. గతం అనంతం. మనం వెళ్ళగలిగినంత వెళ్లినా దాని ఆదిని అందుకోలేం. ఈ తవ్వుకుంటూ వెళ్ళే లక్షణానికి వరాహం సంకేతం.


 అలాగే, భవిష్యత్తు కూడా అనంతం.


 ఇప్పటి వర్తమానపు బిందువుపై నిలబడి నేటిని విశ్లేషిస్తూ భవితను అంచనా వేస్తాం. కానీ మన అంచనాలకీ, ఊహలకీ కూడా అందనిదే భావికాలం. ఊహల రెక్కలతో భవిష్యత్తు వైపు ఎగిరే ఆలోచనలకు సంకేతమే హంస.


ఎప్పుడు మొదలయ్యిందీ, ఎప్పుడు పూర్తవుతుందీ ఎక్కడివరకు విస్తరించిందీ... అనేవి అంతుచిక్కని శాశ్వత ప్రశ్నలు. అనంత విశ్వం, అనంత కాలం... వీటిలో బిందువు వంటి మన ఉనికీ, మనికీ వాటి అంతునీ, ఆదినీ ఆవిష్కరించడం అసాధ్యం.


కాలాన్ని ఒక అనంత శక్తిగా అవగతం చేసుకొనడమే మన కర్తవ్యం. కాలంలో ఎన్నో మేధస్సులు, ఎన్నెన్నో ఆచరణలు, ఇంకెన్నో ఆవిష్కరణలు పెరిగిపోయాయి. ఎన్నింటినో కబళించిన భీషణ స్వరూపం కాలంలో గోచరిస్తుంది.


 ఆ భీషణత్వంలో దైవీయమైన శక్తి ఉంది. దానిని జగన్మాతగా దర్శిస్తే అందులోనూ కారుణ్యం గోచరిస్తుంది♪. ఈ తత్త్వాన్నే 'కాళీ' శక్తిగా మనం ఆరాధిస్తున్నాం. ఈ దైవీ లక్షణాన్ని అయ్యగా పిలిస్తే - మహాకాలుడు, కాలాగ్ని రుద్రుడు.


 ఈ అనంత కాలశక్తిని కరాళనృత్యాన్ని ఆపి, కళామయశాంత చైతన్యాన్ని ప్రదర్శించమని ప్రార్థించడమే మనం చేయగలిగేది.


 కాలరూపంగానున్న ఈశ్వర చైతన్యం ప్రతికూలతను విడచి, అనుకూల ప్రసన్నతను ప్రత్యక్షం చేయవలసిందిగా ప్రార్థిస్తూ -

శివుఁడు మన ఇంటికి వస్తాడు

 *🌴ఇలాచేస్తే శివుఁడు మన ఇంటికి వస్తాడు, ఇలా జీవిస్తేనే...! శివుఁడు మన ఇంటికి వస్తాడు🌴* 


*🌹సమస్త జీవుల పట్ల భూతదయతో మెలిగితే "వృషభ వాహనుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹తల్లీదండ్రులను పూజిస్తూ జీవనం సాగిస్తే అమ్మ పార్వతిని వెంట తీసుకొని "జగత్పితయై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹గురువులను గౌరవిస్తూ మసలుకుంటే బ్రహ్మజ్ఞాన ప్రదాతయైన "శ్రీ దక్షిణామూర్తిగా" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹విడదీయలేని అన్యోన్యతతో భార్యభర్తలు కాపురం చేస్తే శివుఁడు "అర్ధనారీశ్వరుడై" మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹మనసులో ఉన్న విషపూరిత భావనలను విసర్జిస్తూ నడుస్తుంటే "నాగాభరణభూషితుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹పిల్లలకు మానవత్వ విలువలను నేర్పుతూ జీవిస్తే జగజ్జననిని వెంటపెట్టుకొని "గౌరీశంకరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹ఆకలైనవారికి పట్టెడు మెతుకులను వడ్డిస్తూ ముందుకి సాగితే "శ్రీ అన్నపూర్ణాసమేతుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹దాహమైన వారికి దప్పికను తీరుస్తూ ప్రయాణిస్తే "గంగాధరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹బాహ్య సౌందర్యం మీద ధ్యాస తగ్గించి మనో సౌందర్యాన్ని ఉపాసిస్తూ జీవిస్తే "శ్రీ మీనాక్షి అమ్మను వెంటపెట్టుకొని సుందరేశ్వరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹ప్రకృతిని ప్రేమిస్తూ పచ్చదనాన్ని కాపాడుతూ జీవిస్తే "శ్రీ కామక్షి అమ్మను వెంటపెట్టుకొని ఏకామ్రేశ్వరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹పరమాత్ముడిచ్చిన కన్నులను పెద్దవిగా చేసుకుని ప్రపంచంలో ఉన్న మంచిని చూస్తూ జీవిస్తే "శ్రీ విశాలక్షి అమ్మను వెంటపెట్టుకొని విశ్వనాథుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹అసూయాద్వేషాలను వదిలి జీవిస్తే భళా అంటూ మెచ్చుకుని "భోళా శంకరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹తోటివారిపైన చల్లటి చూపులను వెదజల్లుతూ జీవిస్తే "కైలాస వాసుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹కాలం కలిసిరాకున్నా ఖచ్చితమైన ఆత్మ విశ్వాసంతో జీవీస్తే "కాలభారవుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*


*🌹ప్రపంచం మనల్ని చిరిగిన చీటీగా వల్లకాడులో వదిలివెళ్ళిన నాడు "రుద్రుఁడై" శివుఁడు తనలో కలుపుకుంటాడు...!!!*


*🌷అనంతాన్ని ఆవరించిన శివుఁడు అందరి మొరను వినగలడు...!!!*


*🌷శివుడంటే నాగరికత, శివుడంటే జీవన విధానం, శివుడంటే సర్వం, శివుడంటేనే పర్వం...!!!*


*🌷 సముద్రాన్ని ఆయనపై ఒలకబోయలేకున్నా, ఆయనపై సముద్రమంత నమ్మకాని పెట్టుకుని నాలుగు గంగనీటి తుంపరలు చల్లినా సరే సంతసిస్తాడు...!!!* 


*🌷శివుడు కేవలం విగ్రహంలో మాత్రమే కాదు , మన మనో నిగ్రహంలో ఉంటాడు...!!!*


*🌷 తాను సృష్టించిన వస్తువులను తనకివ్వడంతో శివారాధన పూర్తికాదు, మనది అనుకున్న తనదాన్ని (నేను అనే అహాన్ని) తనకివ్వడంతోనే శివారాధన పరిపూర్ణం...!!!*


*🌹 ఇలాచేస్తే శివుఁడు మన ఇంటికి వస్తాడు , ఇలా జీవిస్తేనే శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!! ఇంటికి రావడమేంటి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటాడు...!!!*


*అప్పుడు జన్మకో శివరాత్రి కాదు, జన్మమే శివరాత్రి...!!!* 


(Collection: munga ganganna)


*||సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు||*


           Thanks for Reading

             Sharing is Caring

         I am Wonderful being

🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

శాశ్వతం కాదు

 🌹శుభోదయం 🕉️Goodmorning🌹 *ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికే ఒక్కోసారి గ్రహణం పడుతుంది, వెలుగు రాకుండా చీకటి కమ్మేస్తుంది.. అలాంటిది మనుషులకు కష్టాలు రావడంలో వింతేముంది.. చీకటిని చీల్చుకుని సూర్యుడు ఎలా తేజోవంతంగా ప్రకాశిస్తాడో మనిషి కూడా కష్టాన్ని దాటుకుని అత్యున్నత స్థాయికి ఎదిగాలి..ఒకటి గుర్తుంచుకోవాలి ఆ చీకటి ఈ కష్టం రెండూ శాశ్వతం కాదు.*🤝💐

ప్రదక్షిణాలూ

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి లీలలు..


*ప్రదక్షిణాలూ..ప్రయోజకత్వమూ..*


అప్పుడే బస్సు దిగి వచ్చారా దంపతులు..ఇద్దరూ దాదాపు 45ఏళ్ళ వయసు పైబడిన వారే..వారి వెనకాలే ఓ ఇరవై, ఇరవైరెండేళ్ల యువకుడు..చూడగానే వాళ్ళ కుమారుడు అని తెలిసిపోతోంది..నేరుగా శ్రీ స్వామివారి మందిరం లోకి వచ్చి, మండపం లో నిలబడ్డారు..మండపం లోనుంచే, శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నారు..


"అయ్యా!..ఇక్కడ ఉండటానికి వసతి దొరుకుతుందా?..మేము కొన్నాళ్ళు శ్రీ స్వామివారి వద్ద ఉండాలని వచ్చాము.." అని ఆలయ సిబ్బందిని అడిగారు..ఆ దంపతులది కందుకూరు ప్రక్కన శాఖవరం అనే ఓ చిన్న పల్లెటూరు..ఆ యువకుడు వాళ్ళ కుమారుడే..చక్కని రూపం..మంచి ఒడ్డూ పొడుగూ.. చూడగానే ఆకట్టుకునే రూపం..వాళ్ళ వివరాలు అన్నీ సేకరించుకొని..వాళ్ళు ఉండటానికి ఒక గది కేటాయించారు..


ఇక వివరాలలోకి వెళితే..ఆ దంపతులకు వచ్చిన సమస్య కుమారుడితోనే..చక్కగా చదువుకున్నాడు..డిగ్రీ మంచి మార్కులతోనే పాసయ్యాడు..వినయానికి విధేయతకు మారు పేరు లాగా ప్రవర్తన ఉండేది..ఈ దంపతులూ అబ్బాయిని చూసి మురిసిపోయేవారు..మరి ఉన్నట్టుండి ఏమైందో తెలీదు..అబ్బాయి ప్రవర్తన మారిపోయింది..చిన్నపిల్లాడిలా మనస్తత్వం ఏర్పడింది..తనలో తానే నవ్వుకోవడం..మాట్లాడుకోవడం..చేయసాగాడు.. చదువు పూర్తిగా మానేశాడు..ఒక్కొక్కసారి మరీ పసి పిల్లాడిలాగా ఏడవడం చేయసాగాడు..చూసే వాళ్లకు కూడా గుండె తరుక్కు పోయేది..పాపం ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు..డాక్టర్ల వద్దకు పరుగెత్తారు..ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యా లేదు..ఏ టెస్టుకూ అంతుపట్టడం లేదు.. శారీరికంగా పుష్టిగా వున్నాడు..ఈ మానసిక రోగాన్ని నయం చేయడం ఎలానో తెలియడం లేదు..ఇద్దరు ముగ్గురు సైక్రియాటిస్ట్ లకు కూడా చూపారు..వాళ్ళు చెప్పిన సలహాలూ పాటించారు..ఏమీ మార్పు లేదు..రోజులు కాస్తా నెలల్లోకి..నెలలు సంవత్సరాల్లోకి మార్పు చెందాయి కానీ..తమ కుమారుడు మాత్రం ఏ మార్పు లేకుండా..మానసిక రోగంతో మిగిలిపోయాడు..


వైద్యులు వల్ల నయం కానీ జబ్బు వచ్చినప్పుడే..సహజంగా దైవం గుర్తుకువస్తాడు మానవులకు..అదే జరిగింది ఆ దంపతుల విషయం లోకూడా.."మీరు కొన్నాళ్ల పాటు మీ బిడ్డను తీసుకొని..మొగలిచెర్ల గ్రామం లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వద్ద వుండకూడదూ..ఆ స్వామి ని నమ్ముకుంటే ఫలితం ఉంటుంది.." అని ఎవరో సలహా ఇచ్చారు..ఎందుకనో ఆ తండ్రి మనసులో ఆ మాట నాటుకు పోయింది..భార్యతో తాను విన్న సలహా గురించి చెప్పాడు..ఆవిడ కూడా ఈ ప్రయత్నం చేద్దామని అన్నది..అదిగో..ఆరకంగా నిశ్చయం చేసుకొని..తమ కుమారుడితో సహా మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి చేరారు..


మొగలిచెర్ల చేరారు కానీ..ఇక్కడకూడా వెంటనే ఫలితం కనబడలేదు..ప్రతిరోజూ రెండుపూటలా శ్రీ స్వామివారి మందిరం లో 108 ప్రదక్షిణాలు కుమారుడిని వెంట బెట్టుకుని చేశారు..సుమారు మూడు నెలల తరువాత మాత్రమే ఆ యువకుడి ప్రవర్తన లో కొద్దిపాటి మార్పు కనబడింది..అలా మొదలై.. మరో మూడు నెలలు గడిచేసరికి..ఆ యువకుడు పూర్తిగా మనిషిలా మారాడు..వివేకవంతుడయ్యాడు..మొత్తం ఆరు నెలల పాటు శ్రీ స్వామివారి సన్నిధిలో ఆ దంపతులు చేసిన ప్రార్ధన ఫలితాన్ని ఇచ్చింది..తనలో వచ్చిన మార్పు శ్రీ దత్తాత్రేయుడి కరుణా కటాక్షణాల వల్లే సాధ్యమైందని ఆ యువకుడూ పూర్తిగా నమ్మాడు..తమ కుమారుడు పూర్వస్థితికి వచ్చేసాడన్న ఆనందంతో..శ్రీ స్వామివారి సమాధి వద్ద సాగిలబడి ప్రణామం చేసుకున్నారు..ముగ్గురూ సంతోషంగా తమ ఊరికి వెళ్లారు..


విజయేంద్ర వర్మ గా పిలువబడే ఆ యువకుడు ఇప్పుడో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. చక్కగా ఉద్యోగం చేస్తూ వున్నాడు..శ్రీ స్వామివారికి పరమ భక్తుడు..అతని తల్లిదండ్రులు ప్రస్తుతం కందుకూరు లో వుంటున్నారు..అప్పుడప్పుడూ శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి వస్తూ ఉంటాడు..శ్రీ స్వామివారి దర్శనం అయిన తరువాత ఆలయ సిబ్బందిని పేరు పేరు నా చక్కగా పలకరించుకొని వెళుతుంటాడు.. 


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా.. పిన్: 523114..సెల్..94402 66380& 99089 73699).

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం  -‌  నవమి - ఆర్ద్ర  -‌‌ ఇందు వాసరే* (18.03.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

రాశి ఫలితాలు

 18-03-2024

ఇందు వాసరః సోమవారం 

రాశి ఫలితాలు

********

మేషం 

సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

---------------------------------------

వృషభం

ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

---------------------------------------

మిధునం

పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి. 

---------------------------------------

కర్కాటకం 

దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

---------------------------------------

సింహం

ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి.

---------------------------------------

కన్య

ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. 

---------------------------------------

తుల

కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం

స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

---------------------------------------

ధనస్సు 

వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

---------------------------------------

మకరం

ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.

---------------------------------------

కుంభం

ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత ఋణాలు తీరుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారము భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. 

---------------------------------------

మీనం

నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2023(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.18.03.2024

సోమ వారం (ఇందు వాసరే) 

*************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

ఫాల్గుణ మాసే శుక్ల పక్షే నవమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

ఇందు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

ఫాల్గుణ మాసే 

శుక్లపక్షే నవమ్యాం

ఇందు వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.11

సూ.అ.6.06

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం 

శుక్ల పక్షం నవమి రా. 2.20 వరకు. 

సోమ వారం. 

నక్షత్రం ఆర్ద్ర రా. 9.47 వరకు.  

అమృతం ప.11.32 ల 1.10 వరకు. 

దుర్ముహూర్తం మ.12.32 ల 1.20 వరకు.

దుర్ముహూర్తం మ. 2.55 ల 3.43 వరకు. 

వర్జ్యం ఉ. 7.27 వరకు. 

యోగం సౌభాగ్య రా.8.10 వరకు. 

కరణం బాలవ మ.2.22 వరకు.  

కరణం కౌలవ రా. 2.20 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ. 7.30 ల 9.00 వరకు. 

గుళిక కాలం మ.1.30 ల 3.00 వరకు. 

యమగండ కాలం ఉ.10.30 ల 12.00 వరకు. 

*************

పుణ్యతిధి ఫాల్గుణ శుధ్ధ నవమి.

**************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2023(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

Joke














 

కృష్ణభక్తి

 *🙏\|/కృష్ణభక్తి - మాతృమూర్తి ఋణం\|/🙏* 

 *🙏🪷🌹🪷\|/🌹\|/🌹\|/🪷🌹🪷🙏* 

*కళ్యాణచక్రవర్తి జ్యోతిష్య - వాస్తునిలయం*

*బుచ్చిరెడ్డిపాళెం నెల్లూరుజిల్లా 9014612323*


*🙏\|/ ఆదిశంకరాచార్యులవారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధ పడింది.*


*🙏\|/ "శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు, ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు? నాకు దిక్కెవరు " అని దీనంగా ప్రశ్నించింది.*


*🙏\|/ "అమ్మా! ఏ సమయమైనా సరే, నీవు తల్చుకుంటే చాలు నీ ముందు వుంటాను." అన్నాడు శంకరుడు.*


*🙏\|/ భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు.*


*🙏\|/ "నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు" అని మనసులోనే తలుచుకుంటూ వున్నది ఆర్యాంబ. తల్లి తలచుకుంటున్నదన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు. వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు.* 


*🙏\|/ శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు. కురుపితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులవారు.*


*🙏\|/ అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా అంటూ , అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని, గట్టిగా హృదయానికి హత్తుకుంది.*


*🙏\|/ బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ‌, శంకరుడు సన్యాసి కదా ! యీ ఆభరణాలు ఎలావచ్చాయని అనుకున్నది. బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యాంబ.*


*🙏\|/ అక్కడ తను అను నిత్యం పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలచివుండడం గమనించింది.*


*🙏\|/ గురువాయూరప్పని చూసిన ఆర్యాంబ మహదానందంతో " అప్పా! నోరు తెరిచి, నీ నామజపం చేసే శక్తి కూడా లేని యీ దీనురాలి ఆఖరిక్షణాలలో నను చూసేందుకు వచ్చావా? కృష్ణా " అని మెల్లిగా గధ్గదకంఠంతో పలికింది.*


*🙏\|/ శ్రీకృష్ణుడు వెంటనే "నీ పుత్రుని ఆదేశం. రాకుండా వుండగలనా ? అమ్మను చూడకుండా వుండగలనా " అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.*


*🙏\|/ అదే సమయానికి శంకరాచార్యులవారు కూడా అక్కడికి వచ్చారు.* 


*🙏\|/ ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో " నాయనా ! నా భాగ్యమేమని చెప్పను? నిన్ను పుత్రుని గా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావుకదా, శంకరా!" అని కన్నీళ్ళు కార్చింది.*


*🙏\|/ గోపాలుని నేను నిలబెట్టడమేమిటి నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు , కష్టాలకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను. సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో పుట్టినా మాతృ ప్రేమకు సాటిగా , ఎంతటి సేవచేసినా కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు.*


*🙏\|/ నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒక్కటే "అని మాతృదేవత పాదాలముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యులవారు.*


*🙏\|/ మన తల్లి తండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తిచెంది వారి దివ్యాశీస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురుఆదిశంకరాచార్యులవారు ఈ లోకానికి సందేశమిచ్చారు.*


*కళ్యాణచక్రవర్తిజ్యోతిష్య-వాస్తునిలయం*

*బుచ్చిరెడ్డిపాళెం నెల్లూరుజిల్లా*  

*9014612323 * 9391087299*

ప్రతిరోజు పంచాంగం, రాశిఫలాలు, జాతకవిషయాలు,వాస్తు విషయాలు, మరియు ఆధ్యాత్మిక భక్తి కధలు తెలుసుకొనుటకు క్రింది లింక్ ను నొక్కండి.మీ స్నేహితులు బంధువులు వాట్సాప్ గ్రూప్ లో క్రింది లింక్ ద్వారా చేరుటకు ఈమెసేజ్ ను షేర్ చేయండి.

https://chat.whatsapp.com/LTQgDSttuND308f3enLZR4