ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
4, నవంబర్ 2023, శనివారం
లేబర్ ఇన్సూరెన్స్
**కేంద్రప్రభుత్వం* ప్రవేశపెట్టిన
లేబర్ ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోండి**
➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప.
➖ కూలీలతో పాటు అందరు అర్హలే.
➖ తెల్ల రేషన్ కార్డు తప్పని సరి.
➖ ఏడాదికి రూ 22 మాత్రమే.
5 స0 రాలు ఒకేసారి చెల్లించాలి,కేవలం 110/-రూ.. మాత్రమే.
➖ అవగాహన పెంచుకుందాం.
➖ అందరికీ చేరేలా చేయండి.
1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ,పురుషులు అర్హులు.
2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు.
3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి.
4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.
*ప్రయోజనాలు*
5) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్
6.అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/-
7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,,
8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,,చొప్పున వచ్చే అవకాశం ఉంది.
9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి
ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు,అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.
👉ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ.చెల్లిస్తే 5 సంవత్సరాలు వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,, అన్నమాట
👉 వెంటనే మీరు,మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు,బంధువు లందరిని చేర్పించండి.
👉 ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.
కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్)MPDO/MRO గార్లను సంప్రదించండి.
చివరగా ఒక్క మాట
ఈ పథకంలోకి చాలా మంది.....కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు.
అది కానే కాదు.తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే...
మీ అందరికీ విన్నపము జోక్స్,కార్టూన్లు పంపే బదులు ఈ Msg పంపితే జనం అందరూ తెలుసుకుంటారు.
మీకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయె వాటన్నిటికీ send చేయండి (or)ఈ Msg ని కనీసం 3 Groups కు పంపించండి.
ఎందుకంటే చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు.
50 నుండి 60 స0 లోపు చనిపోతున్నారు.🙏
సుప్రభాత ప్రాతకాల సమయాన
🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
🎻🌹🙏ప్రతి రోజూ సుప్రభాత ప్రాతకాల సమయాన
మాతా పితరులను తలుచుకుని గురువులని తలచుకుని
అరచేతిని కనుల కద్దుకుని
కరాగ్ర వసతే లక్ష్మీ... కరమధ్యే....సరస్వతి...
కరమూలేచ దుర్గే...లేదా గోవిందే....అని నమస్కారిస్తూ
ప్రార్థన చేసుకోవాలి...
మన ఆయురారోగ్యాల కోసం
మన మనోధైర్యం.... కోసం
మన మానసిక ఆందోళనలు భయాలు భాధలు నివారణ కోసం....
మన ఇష్ట దైవాన్ని.....స్మరిస్తూ.....
ప్రాణాయామం..ధ్యానం..యోగా....చేయగలిగితే...
సూర్య భగవానుడి....తొలి..
ఉషోదయ కిరణాల నుండి
వెలువడే....ఆరోగ్య ...కాంతి పుంజాలతో...
మనకి ఎంతో...అధ్భుతమైన
అమోఘమైన... వేగవంతమైన....
మహోన్నత.... శక్తి....
మనకు....
ఆ పరమాత్మ.... ప్రసాదిస్తారు....👌👌🙏
ఎంతటి కఠినమైన రుగ్మతలు
ఉన్నా.....అవి....నెమ్మది నెమ్మది గా...
.తగ్గిపోయి...
ఒక కాంతి వంతమైన....
దివ్య.... తేజస్సు....
మనలో ప్రసరిస్తాయి.....
అందరమూ.... భగవంతుని... అనుగ్రహముతో🙏🙏🙏
ఆచరిద్దాము....ఉల్లాసంగా ఆనందంగా.... సంతోషంగా
ఆరోగ్య వంతంగా.....
జీవిద్దాము....
ఓం శ్రీ ధన్వంతర్యైనమః
🙏సకల గురుభ్యోనమః🙏
🙏మాతా పిత్రృ చరణార విందభ్యోనమః🙏
🙏సకల దేవాతాభ్యోనమః
లోకాసమస్తా... సుఖినోభవంతుః..🚩🌞🙏🌹🎻
🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
హఠాత్తుగా ఎదురైన ఈ పరిస్థితికి రవ్వంత నివ్వెరపోయింది సుకన్యాదేవి. తడిబట్టలతో
పరపురుషుల కంటబడినందుకు సిగ్గుపడింది. అయినా తనని తాను నిబ్బరించుకుని బదులు పలికింది.
నేను శర్యాతితనయను. చ్యవనమహర్షి భార్యను. మాతండ్రిగారు నన్ను వారికిచ్చి వివాహం చేశారు. నాభర్త
అంధుడు, వృద్ధుడు, మహాతపస్వి. పతివ్రతనై చ్యవనమహర్షికి అహోరాత్రాలూ సేవలు చేస్తూ ఆనందిస్తున్నాను.
ఇంతకీ మీరిద్దరూ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? దగ్గరలోనే ఉంది మా ఆశ్రమం. నా పతిదేవుణ్ణి
దర్శించాలన్నారుగదా! రండి. మా ఆశ్రమానికి వెడదాం. పావనం చేద్దురుగాని. మహర్షిని చూద్దురుగాని
- అని ఆదరంగా ఆహ్వానించింది. దస్రులు (అశ్వినులు) తడబడ్డారు. కొంచెం తటపటాయించారు.
బింకంగా సంభాషణ సాగించారు.
అయ్యో! మీ నాన్న నిన్ను తపస్వికి ఇచ్చి చేశాడా? ఎంత కఠినాత్ముడు! నువ్వు చూస్తే ఈ
అడవిలో నేలమీద నడుస్తున్న మెరుపుతీగలా మెరిసిపోతున్నావు. దేవలోకంలోకూడా నీలాంటి సుందరాంగి
లేదంటే నమ్ము. ఈ నారచీరలు కాదు, నువ్వు దివ్యాంబరాలు కట్టుకోవాలి. వాటికే నువ్వు తగుదువు.
రత్నాభరణాలు అలంకరించుకుని, తుమ్మెదల్లాంటి ముంగురులు ముఖపద్మంమీద నాట్యంచేస్తుంటే
నీరూపం చూడాలి. రంభాద్యప్పరసలు తలదించుకోవాలి. ఆహా! బ్రహ్మదేవుడు ఎంత దుర్మార్గుడు! నీకు
ఇలా నట్టడవిలో కాపురం రాశాడా; అదీ ఒక జడధారికి, అంధుడికి, వృద్ధుడికి భార్యవైపడిఉండే అవస్థ
కల్పించాడా? దారుణం. భామినీ! ఇది మహాదారుణం. విశాలనయనా! నాట్యశాస్త్ర పండితురాలిలా
కనిపిస్తున్నావు. నువ్వు ఆ కన్నులులేని కబోదికి పరిచర్యలు చెయ్యడమా? మరి మన్మథుడి బాణాలు
ఎవరిమీద పడుతున్నట్టు, ఏమవుతున్నట్టు?
*1976*
*కం*
కష్టం బుల చవిచూడక
స్పష్టంబగు సుఖములెపుడు సమకూరవయా.
సుష్టుగ సుఖముల నుండిన
కష్టముదరి చేరుటెల్ల కర్మము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! కష్టాలు అనుభవించకుండా స్పష్టమైన సుఖములు సమకూరవు. చక్కగా సుఖములలో ఉన్నప్పుడు కష్టాలు మన చెంతకు రావడమనేది మన కర్మలయొక్క ఫలము.
*సందేశం*:-- కష్టాలను తప్పించుకుని సుఖములను పొందుచున్ననూ ఏనాటికైనా ఆ కష్టాలను అనుభవించకుండా సరైన సుఖములను పొందలేము.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
సౌభాగ్యం
*సుభాషితం*
---------------
🌺 *అధోsధః పశ్యతః కస్య*
*మహిమా నూపచీయతే ౹* *ఉపర్యుపరి పశ్యంతః*
*సర్వ ఏవదరిద్రతః ౹౹*
*(సంగ్రహము)*
*భా. తనకన్నా క్రిందవారిని చూస్తూ పోతుంటే,ఎవరికైనా సరే తనదగ్గరున్న సౌభాగ్యం పెద్దదిగా అనిపించదు.అలాగే,పైన ఉన్నవారితో తనని పోల్చుకుంటూ పోతే,ప్రతి ఒక్కడూ దరిద్రుడు అనిపిస్తుంది.*
🌺✍🏽
శకుంతలాదేవి జయంతి (
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
Remembering Sakuntala Devi ji on her birth anniversary. 🙏🏻
🌷ఈ రోజు "హ్యుమన్ కంప్యూటర్" గా పేరొందిన శకుంతలాదేవి జయంతి (నవంబరు 4). ఆమె గురించి క్లుప్తంగా ....
🔸‘‘గణితం లేకుండా మీరేమీ చేయలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే.’’🔸
- శకుంతలా దేవి
గణితమే తన లోకంగా జీవించిన మేధావి శకుంతలాదేవి. గణితంతో మూడేళ్ల వయసులో మొదలైన ఆమె ప్రయాణాన్ని, మరణం మాత్రమే విడదీయగలిగింది.
శకుంతలాదేవి 1929 నవంబర్ 4న బెంగళూరులోని ఒక సనాతన కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పూజారిగా ఉండటానికి ఇష్టపడక సర్కస్ కంపెనీలో చేరారు. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి పరిస్థితులు కూడా శకుంతలాదేవి ప్రతిభకు అడ్డుకట్ట వేయలేకపోయాయి.
ఆమె మూడేళ్ల చిన్నారిగా ఉన్నప్పుడు తండ్రితో పేకాడుతూ ప్రతి ఆటలోనూ గెలిచేది. అంత చిన్నపాప ప్రతీసారీ తనపై గెలవడం తండ్రికి ఆశ్చర్యం కలిగించింది. తన కూతురు మోసం చేస్తుందేమోనని అనుమానం కలిగించింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఆడినా ఆమెదే విజయం. చివరకు.. పేక ముక్కలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం వల్లనే శకుంతల గెలుస్తోందని గుర్తించాడు. ఆమె అద్భుత జ్ఞాపకశక్తిని తమకు జీవికగా ఉపయో గించుకున్నాడు.
ఆమెతో ప్రదర్శనలిప్పిం చాడు. అలా అలా ఆమె ప్రతిభ విశ్వ విద్యాలయాలకు చేరింది. ఆరేళ్ల వయసులో తొలిసారి యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌లో ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆ తర్వాత ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో బాల మేధావిగా ఆమె పేరు మారుమోగింది.
శకుంతలాదేవికి లెక్కలంటే ఏమాత్రం లెక్కలేదు. ఎంత పెద్ద సమస్యనైనా ఆమె చిటికలో పరిష్కరించేవారు.
తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఆమె 1944లో తండ్రి చేయి పట్టుకుని లండన్ చేరుకున్నారు.
అనేక విశ్వవిద్యాలయాల్లో, వివిధ సంస్థల్లో ప్రదర్శనలిచ్చారు. 1950 అక్టోబర్ 5న బీబీసీలో తన గణిత ప్రతిభను ప్రదర్శిం చారు. లెస్లీ మిషెల్ ఇచ్చిన సమస్యను సెకన్లలో పరిష్కరించారు. ఆ సమాధానం తప్పని మిషెల్ అన్నారు. కానీ శకుంతలా దేవి తాను సరైన సమాధానమే చెప్పానని, సరిచూసుకోమని దృఢంగా చెప్పారు. ఆవిడ తిరిగి చూసుకుంటే శకుంతలా దేవి సమాధానమే సరైనదని తేలింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆమెకు ‘హ్యూమన్ కంప్యూటర్’ అనే బిరుదు దక్కింది.
శకుంతలా దేవి ప్రతిభకు డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన మరింత అద్దం పడుతుంది. అమెరికాలోని ఈ యూనివర్సిటీవారు శకుంతలా దేవిని ఆహ్వానించారు. ఆమె ప్రతిభను పరీక్షించే పనిలో భాగంగా 201 అంకెలున్న సంఖ్యకు 23వ రూట్ చెప్పమన్నారు.
ఆవిడ 50 సెకన్లలో చెప్పేసింది. కానీ అది నిజమో కాదో తెలుసుకోవడానికి అమెరికన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ సంస్థలోని యూనివాక్-1101 అడ్వాన్స్‌డ్ కంప్యూటర్‌లో ప్రత్యేక ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చింది.
1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఆమె గిన్నిస్ రికార్డు సృష్టించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బెర్క్‌లీ) సైకాలజీ ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ 1988లో శకుంతలాదేవి ఇంటెలిజెన్స్‌ను అధ్యయనం చేశారు. అనేక క్లిష్ట సమస్యలను జెన్సన్ పేపర్‌పై రాసేకంటే అతి తక్కువ సమయంలో ఆమె పరిష్కరించి అతన్ని ఆశ్చర్యపరిచారు.
1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తోశకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ ను ఓడించేశారు.
ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు
76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు.
ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది.
యూనివర్సిటీ ఆఫ్
కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.
గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.
1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.
శకుంతలా దేవి కేవలం గణిత మేధావి మాత్రమే కాదు. మంచి రచయిత కూడా. స్వలింగ సంపర్కంపై భారత దేశంలో తొలి సమగ్ర రచన అయిన ‘ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువాలిటీ (1977)’ శకుంతలా దేవి రాసిందే. దీనితో పాటు గణితం, జ్యోతిషంపై అనేక పుస్తకాలు రాశారు. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు
యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్ 1969లో శకుంతలాదేవికి ‘మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇచ్చింది. వాషింగ్టన్ డీసీ 1988లో రామానుజన్ మేథమెటికల్ జీనియస్ అవార్డును ప్రదానం చేసింది.
శకుంతలా దేవి 1980లో మెదక్ నుంచి ఇందిరా గాంధీపై పోటీ చేశారు.
1980లో బెంగళూరుకు చేరి పిల్లల కోసం అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
☘️🌹☘️ MATHS 4 ALL ☘️🌹☘️
శనివారం, నవంబరు 4, 2023
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
శనివారం, నవంబరు 4, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం -బహుళ పక్షం
తిథి:సప్తమి రా1.33 వరకు
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:పునర్వసు ఉ9.41 వరకు
యోగం:సాధ్యం మ3.31 వరకు
కరణం:విష్ఠి మ12.50 వరకు తదుపరి బవ రా1.33 వరకు
వర్జ్యం:సా6.23 - 8.07
దుర్ముహూర్తము:ఉ6.03 - 7.34
అమృతకాలం:ఉ7.07 - 8.49 & తె4.48నుండి
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యోదయం:6.04
సూర్యాస్తమయం:5.26
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
మొదటి ముఖ్యమైన వర్షాలు
ఈశాన్య రుతుపవనల మొదటి ముఖ్యమైన వర్షాలు. నవంబర్ 5 నుంచి దక్షిణ కోస్తాంధ్రలో పెరగనున్న వర్షాల జోరు. నవంబర్ 9 వరకు Helping
==
======
రైరులకు, నాకు పరిచయం ఉన్న రైతు మిత్రులకు శుభ వార్త. చాలా కాలంగా మనం ఎదురు చూస్తున్న నవంబర్ 5 వర్షాలు ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తోంది. జిల్లాలైన తిరుపతి, నెల్లూరు అత్యథిక వర్షాలుంటాయి. అలాగే తిరుపతి నగరంతో పాటుగా నెల్లూరులో కూడ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలుంటాయి. కోస్తా ప్రాంతం (అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో) అత్యథిక వర్షాలుంటాయి. ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు, బాపట్ల జిల్లాలోని కోస్తా ప్రాంతానికి దగ్గరగా ఉన్న భాగాలు, కృష్ణా జిల్లాలోని కొన్ని కోస్తా భాగాల్లో మోస్తరు ఉంచి భారీగా వర్షాలుంటుంది. మీరు మ్యాప్ ని చూస్తే వివరాలు భాగా అర్ధం అవుతుంది. మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటిగా వర్షాలుంటాయి. సముద్రం నుంచి ఎంత దూరం లోపలికి వెళ్తారో అంత తక్కువగా వర్షాలుంటాయి. ఎలా అంటే అమలాపురంలో కొంచం గట్టిగా పడే వర్షాలు, రాజమండ్రిలో తేలికపాటిగా ఉంటుంది. అదే తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో వర్షాలుండవు లేదా తుంపర పడి ఆగిపోతుంది.
విశాఖ నగరంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లలలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు ఈ నవంబర్ 5 నుంచి 9 మధ్యలో చూడగలము. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా తుంపర్ల వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. అన్నమయ్య జిల్లా పశ్చిమ భాగాలు, చిత్తూరు పశ్చిమ భాగాల్లో కూడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. మరో వైపున కర్నూలు, నంధ్యాలలో అత్యల్పంగా కొన్ని చోట్లల్లో మాత్రమే తేలికపాటి తుంపర్ల వర్షాలు ఉండనుంది.
Due to a very strong trough placed along our South AP and adjoining Tamil Nadu coast, Heavy rains ahead for districts like Tirupati, Nellore, East Chittoor and Prakasam. Coastal areas will get very heavy rains while cities like Tirupati and Nellore will see Heavy downpour during these dates. Coastal areas of Prakasam, Bapatla and Krishna can see Heavy showers, On and Off showers for Rajahmundry, Vijayawada, Vizag and Kakinada.
ధౌమ్యుడు
పూర్వం ధౌమ్యుడు అనే ఒక మహర్షి గురుకు లాన్ని ఏర్పాటు చేసుకొని, తన వద్దకు వచ్చిన అనేక మందిని శాస్త్ర పారంగతులను చేసి పంపేవాడు. అలా ఆ గురుకులంలో ఉన్న శిష్యులలో ఉపమన్యుడు అనే శిష్యుడు ఒకడు. ఉపమన్యునకు గురు సంపద కాపాడే పని అప్పగించారు గురుకులంలో. ఆ రోజు లలో సంపద అంటే గోసంపద మాత్రమే. విద్యార్థు లలో సోమరితనం పోయి శ్రమానుభవం పొందడం కోసం, చురుకుగా ఉండటం కోసం కాలానుగు ణంగా పనులు చేయిస్తుండేవారు. అలాగే సామాజిక బాధ్యత పెరగడానికి, సమాజం పట్ల కృతజ్ఞతాభావం పెంపొందడానికి భిక్షాటన ద్వారా జీవించాలనే నియమం గురుకులాలలో ఉండేది. ఉపమన్యుడు ఆ నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు గురువుకు నమస్కరించి ఆశీస్సులు పొందుతుండేవాడు. ఒకరోజు అలా నమస్కరిస్తున్న ఉపమన్యుని పరీక్షగా చూసిన గురువు శిష్యుడు ధృఢకాయుడవటం గమనించాడు. వెంటనే ఉపమన్యూ! నీవు ఏ ఆహారం తీసుకుంటున్నావు? అనడిగాడు. భిక్షా పదార్థాన్ని మాత్రమే భుజిస్తున్నానని చెప్పాడు. ఓహో! అలాగా! నీకు వచ్చిన భిక్షాన్నమును పూర్తిగా గురువుకు సమర్పించి తర్వాత గురువు అనుమతించిన భాగాన్ని మాత్రమే ఆరగించు అని ఆదేశించాడు. ఉపమన్యుడు స్వీకరించాడు.
రోజలు గడుస్తున్నా ఉపమన్యుడు అలాగే ధృఢంగా ఉన్నాడు. గురువు పిలిచి ఏం భుజిస్తున్నావు అనడిగాడు. అప్పుడతడు మీరు పెట్టిన ఆహారం సరిపోవడం లేదు. మళ్లీ భిక్షాటన వెళ్లి ఆహారం తెచ్చు కొని భుజిస్తున్నానని చెప్పాడు. అలా అన్నిసార్లు భిక్షకు వెళ్లడం వల్ల గృహస్థులకు అసౌకర్యాన్ని కలిగించిన వాళ్లమవుతాము అంటూ రెండోపారి భిక్షాటన నిషే ధించాడు. సంతోషంగా స్వీకరించాడు ఉపమన్యుడు.
మళ్లీ రోజులు గడుస్తున్నాయి. నియమాన్ని పాటి స్తున్నా ఉపమన్యుడలాగే బలిష్ఠుడుగా ఉంటున్నాడు. ధౌమ్యులవారు చెంతకు పిలిచి ఆహారంగా ఏ పదా ర్థాలు తీసుకుంటున్నావు? అని అడిగారు. సత్యవచను డైన ఉపమన్యుడు గురువర్యా! పశువులను మేపేట ప్పుడు మధ్యాహ్న సమయంలో ఆవుపాలను తీసి తాగుతున్నానని చెప్పాడు. అప్పుడు గురువు శిష్యా! మధ్యాహ్న సమయంలో ఆవు పాలు పితకడం ధర్మం కాదు దాని వలన ఆవుదూడలకు, ఆశ్రమంలో జరిగే పూజలకు కావలసినన్ని పాలు లభించవు. కాబట్టి అలా పాలుతాగడం మానేసెయ్యి అని చెప్పాడు. చిత్తమని అంగీకరించాడు శిష్యుడు. అలాగే రోజులు గడిచాయి. శిష్యుని దారుఢ్యంలో మార్పు లేదు. రహస్యమేమిటని అడిగాడు ధౌమ్యుడు. దూడలు పాలు తాగు తున్నప్పుడు, పాలు పితుకుతున్న ప్పుడు సమీపానికి వెళ్లి కూర్చుం టున్నాను. గాలివాటున వస్తున్న పాల బిందువులను, నురగను తాగుతున్నానని వినయపూర్వ కంగా చెప్పాడు. అప్పుడు ధౌమ్యుడు శిష్యా! గాలిలోనూ, భూమిమీద కూడా కంటికి కని పించని అనేక జీవరాసులుం టాయి. అవి వాటికాహారం. నీవు ఆ విధంగా చేయడం వలన వాటికి అన్యాయం చేసిన వాడ వవుతావు. కాబట్టి వాటిని కూడా తాగవద్దని చెప్పాడు. గుర్వాజ్ఞను మనఃపూర్వకంగా అంగీకరించాడు ఉపమన్యుడు.
అలా ఉపమన్యుడు ఆహారం తీసుకోవడంలో అడుగడుగునా అనేక నియమాలు, నిషేధాలు అడ్డు తగిలాయి. అయితే అతడు మాత్రం ఆకలి బాధకు తట్టుకోలేకపోతున్నాడు. ఒకరోజు ఆకలితో నకనక లాడుతున్న ఉపమన్యుడు నీరస పడిపోయాడు. లేవడానికి కూడా ఓపిక లేదు. నీరసంతో సొమ్మసిల్లి పడిపోయే స్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిలో
ఆ అడవిలో తన చేతికి అందిన చెట్ల ఆకులు భక్షించాడు. అవి దళసరిగా ఉన్నాయి. పాలు చిమ్ము తున్నాయి. అవి చేదుగా, వగరుగా ఉన్నాయి. ఆకలి రుచి యెరుగదంటారు గదా! అవి తిన్న కొంతసేపటికి ఉపమన్యుడికి కంటిచూపు పూర్తిగా క్షీణించింది. చాలా ఆందోళన చెందాడు ఉపమన్యుడు.
ఆకలి బాధతో ఏమేమో తినేశాను, ఎంతటి ప్రమాదం తెచ్చుకున్నానో అని బాధపడ్డాడు. అలా కలవరపాటుతో చేతులతో, కాళ్లతో తడుముకుంటూ వెళుతూ అక్కడున్న ఒక పాడుపడిన బావిలో పడ్డాడు. అందులో నీళ్లు లేవు. శరీరమంతా దెబ్బలు తగిలి గాయాలై, రక్తం కారుతోంది. మరోవైపు కంటిచూపు లేదు. అటువంటి పరిస్థితుల్లో గురువు గారూ!
గురువు గారూ! అంటూ గురుస్మరణం చేయడం మొదలుపెట్టాడు.
అక్కడ ఆశ్రమంలో కూడా ప్రతి రోజు సాయంత్రం గురువుకు నమస్కరించి వెళ్లే ఉప మన్యుడు రాకపోయేసరికి గురువైన ధౌమ్యులవారు చింతించడం మొదలుపెట్టాడు. శిష్యవాత్సల్యం పొంగి పొరలింది. మనస్సు కీడును శంకించింది. వెంటనే శిష్యునికోసం అడవికి బయలుదేరిన గురువు ధౌమ్యుడు ఉపమన్యూ! అంటూ కేకలు పెడుతు న్నాడు. నూతిలో పడివున్న ఉపమన్యుడు కూడా బదులు పలికాడు. ఆ కేకను విని ఉపమన్యుని దగ్గరకు వచ్చాడు ధౌమ్యుడు. వెంటనే ఉపమన్యుడు జరిగిన విషయమంతా చెప్పాడు. ధౌమ్యుడు జరిగిన దానికి బాధపడుతూ, శిష్యుని నియమపాలనను లోలోన మెచ్చుకుంటూ శిష్యునికి కలిగిన కష్టాన్ని తొలగించడం కోసం శిష్యవాత్సల్యంతో ఉపమన్యుడికి అశ్వినీ దేవతలను స్తుతించే సూక్తులను ఉపదేశిం చాడు. అశ్వినులను గురూపదేశాన్ని శిరసావహించి స్తోత్రం చేశాడు. అశ్వినీ దేవతలు ప్రత్యక్షమై ఒక అపురూప పదార్థం ఇచ్చి దీనిని భక్షిస్తే నీకు దృష్టి కలుగుతుందని చెప్పారు. అప్పుడు ఉపమన్యుడు గుర్వాజ్ఞ లేనిదే భక్షించనని చెప్పాడు. అయినా అశ్వినీ దేవతలు గతంలో నీ గురువునకట్టి సంకటమే వచ్చి నప్పుడు అతడు ఇలాగే దాని నుండి విముక్తుడైనాడు. అప్పుడతను గురువు అనుమతి తీసుకోకుండానే తిన్నాడు. నీకు ఏదోషం కలగదు. కాబట్టి నీవు భక్షించ వచ్చు అని చెప్పారు. ఏమైనప్పటికి గురువు అనుమతి లేనిదే భక్షించనని నిష్కర్షగా చెప్పాడు ఉపమన్యుడు.
ఉపమన్యుని అచంచలమైన గురుభక్తిని మెచ్చు కొని, అశ్వినీ దేవతలు దృష్టిని ప్రసాదించారు. ఉపమన్యుడు నూతి నుండి బయటకు వచ్చి గురువు నకు నమస్కరించారు. ధౌమ్యుల వారు ఉపమన్యుని గురుభక్తిని, నియమపాలనను మెచ్చుకొని అతడు కోరకుండానే వేద విజ్ఞానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఉపమన్యుడికి జీవితంలో ఎన్ని కష్టాలు సంభవించినా అసత్యం పలకలేదు. గురు భక్తిని విడువలేదు. అశ్వినీదేవతలు ఎన్ని ఆశలు చూపినా ప్రలోభపడలేదు.
అరుణోదయ శోభలు
అరుణోదయ శోభలు
కవిసార్వభౌమ! శ్రీనాధమహాకవి !
సీ: చిఱుసానఁ బట్టించి చికిలి సేయించిన
గండ్ర గొడ్డలి నిశాగహన లతకు ;
గార్కొన్న నిబిడాంధకార ధారాఛ్ఛటా
సత్త్రవాటికి వీతిహోత్ర జిహ్వ :
నక్షత్ర కుముద కాననము గిల్లెడు పొంటె
ప్రాచి యెత్తిన హస్త పల్లవాగ్ర
మరసి మింటికి మంటికైక్య సందేహంబుఁ
బరిహరింపంగఁ బాల్పడ్డ యవధి ;
గీ: సృష్టి కట్టెఱ్ఱ తొలుసంజ చెలిమికాఁ డు
కుంటి వినతామహాదేవి కొడుకుఁ గుఱ్ఱ
సవితృ సారధికట్టెఱ్ఱ చాయ వేలుప
పరుణుఁ డుదయించెఁ బ్రాగ్దిశాభ్యంతరమున.
కాశీఖండము- 1 ఆ :121 పద్యము: కవిసార్వభౌముడు శ్రీనాధుడు!
ఇది శ్రీనాధమహాకవి వర్ణించిన అరుణోదయ వర్ణనము. అనూరుడే అరుణుడు. అతడే సూర్యుని రథసారధి.ప్రభాతంలో తూర్పున మసక చీకటులను చీల్చుకుంటూ ప్రభాతంలో మనకు తొలిసారిగా దర్శనమిచ్చేవాడే యరుణుడు.
ప్రత్యూషకాలంలో అతని దర్శనం యేతీరున నున్నదో శ్రీనాథుని మాటటలోనే వినండి!
భావము: ఆకాశంలో చిక్కటిచీకటి అడవి తీగవలె దట్టంగా అల్లుకు పోతే దాన్ని ముక్కలు గానరకేందుకు వస్తున్న పదునైన గండ్ర
గొడ్డలివలె నున్నదట.
ఆకాశమనే యజ్ఙశాలలో నేతిధారల వలన లేచిన ధూమ సముదాయాన్ని వెలికి ద్రోసే అగ్ని జ్వాల వలెనునన్నదట!
ఆకాశంలో నల్లని యాకాశంలో మిణుకు మిణుకు మనితారలు మెరుస్తున్నాయి. ఆదృశ్యం ఆకాశమనే సరోవరంలో పూచిన కలువ పూలవలెనున్నది. ఆకలువ పూలను కోసేందుకు ప్రాగ్దిశాంగన యెత్తిన హస్త పల్లవ సదృశంగా నున్నదట!
ఏది భూమో యేది యాకాశమో తెలిసి కోలేని రీతిగా భూ నభముల రెంటిని చీకటిక్రమ్మగా ఆరెంటికి హద్దులను
తెలుపుటకు ఏర్పడిన సరిహద్దు సిబిరమువలె అరుణోదయమున్నదట!
సృష్టిలో నన్నిటికన్న నెర్రని వాడు తొలిసంజకు చెలికాడు. కుంటి. వినతాప్రియనందనుడు. సూర్యరథసారథి అరుణుడు
తూరుపు కొండపై నుదయించు చున్నాడు.
ప్రాభాతంలో అరుణోదయమే ప్రొద్దు పొడుపు నకు గుర్తు!
స్వస్తి!🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
కాలభైరవుని
🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐
*శ్లోకం*
*_శూలటంకపాశదండపాణిమాదికారణం_*
*_శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్_*
*_భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం_*
*_కాశికాపురాధినాథకాలభైరవం భజే....._*
_ *_శ్రీ కాలభైరవాష్టకమ్ - 03_* _
*భా*:
శూలము, టంకము, పాశము, దండము మొదలగునవి ఆయుధములుగా ధరించిన వాడు, నల్లని మేను కలవాడు, సనాతనుడు, నాశనము లేనివాడు, మొదటి వాడు, రోగాతీతుడు, విక్రముడు, ప్రభువు, విచిత్రమైన నాట్యమంటే ఇష్టపడే వాడు, *కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను*
మానస సరోవరం
*ఇది 186008 ఎత్తులో ఉన్న కైలాష్ మానస సరోవరం దీన్ని వీక్షించి శివానుగ్రహం పొందండి ఇది టిబెట్ సరిహద్దులోని అందమైన దృశ్యం ఈ దృశ్యం అసలైనది మరియు ఈ దృశ్యం మధ్యాహ్నం 3:00 గంటలకు దయచేసి దీన్ని చూడండి మరియు దీన్ని తొలగించవద్దు మీ స్నేహితులకు పంపండి.*
రాశి ఫలితాలు 04-11-2023 స్థిర వాసరః శనివారం
రాశి ఫలితాలు
04-11-2023
స్థిర వాసరః శనివారం
******
మేషం
చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
---------------------------------------
వృషభం
ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. అవసరానికి రావలసిన సోమ్ము అందుతుంది. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
---------------------------------------
మిధునం
నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.
---------------------------------------
కర్కాటకం
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ధన సంబంధిత విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలొ హోదాలు పెరుగుతాయి.
--------------------------------------
సింహం
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
--------------------------------------
కన్య
ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలస్తాయి. బంధు మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.
---------------------------------------
తుల
కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది. ఉద్యోగమున సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
---------------------------------------
వృశ్చికం
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
---------------------------------------
ధనుస్సు
దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. విద్యార్దులు మరింత కష్టపడవలసి వస్తుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విసుగు కలిగిస్తాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.
---------------------------------------
మకరం
ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ముందుకు సాగడం మంచిది. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.
-------------------------------------
కుంభం
ధన పరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
---------------------------------------
మీనం
మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల బందువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.
---------------------------------------
పూజాకార్యక్రమాల సంకల్పము.
**********
*శుభోదయం*
*********
సంధ్యా వందన మరియు
ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ. 04.11..2023
శని వారం (స్ధిర వాసరే)
**************
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరదృతౌ
ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే సప్తమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
స్ధిర వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
ఇతర పూజలకు
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరత్ ఋతౌ ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే సప్తమ్యాం
స్ధిర వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.6.03
సూ.అ.5.26
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం
కృష్ణ పక్షం సప్తమి రా. 1.23 వరకు.
శని వారం.
నక్షత్రం పునర్వసు ప.9.42 వరకు.
అమృతం ఉ. 7.08 ల 8.50 వరకు.
పునరమృతం తె. 4.48 ల మరునాడు ఉ. 6.32 వరకు.
దుర్ముహూర్తం ఉ.6.03 7.34 వరకు.
వర్జ్యం రా. ల 10.34 వరకు .
యోగం సాధ్యం మ. 3.30 వరకు.
కరణం విష్ఠి ప.12.42 వరకు.
కరణం బవ రా.1.01 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.
రాహు కాలం ఉ.9.00 ల 10.30 వరకు.
గుళిక కాలం ఉ.6.00 ల 7.30 వరకు.
యమగండ కాలం మ.1.30 ల 3.00 వరకు.
.***********
పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ సప్తమి.
.**********
*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,
(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)
S2,/C92, 6 -3 -1599/92,బి
Sachivalayanagar,
Vanasthalipuram,
Rangareddy Dist, 500 070,
80195 66579.
.**********
*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*
వారి
*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*
*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును*
*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*
*సంప్రదించండి*
ఫోన్(చరవాణి) నెం లను
*9030293127/9959599505
*.**************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏
శోభాయమానం
శ్లోకం:☝️
*ఏకేనాపి సుపుత్రేణ*
*విద్యాయుక్తేన భాసతే ।*
*కులం పురుషసింహేన*
*చంద్రేణేవ హి శర్వరీ ॥*
భావం: ఒకే చంద్రుని వలన రాత్రి శోభాయమానం అయినట్లు, కేవలం ఒక్క విద్యావంతుడైన సుపుత్రుడి వలన మొత్తం వంశం శోభాయమానం అవుతుంది.
పంచాంగం 04.11.2023 Saturday
ఈ రోజు పంచాంగం 04.11.2023 Saturday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: సప్తమి తిధి స్థిర వాసర: పునర్వసు నక్షత్రం సాధ్య యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం.
సప్తమి రాత్రి 01:01 వరకు.
పునర్వసు ఉదయం 07:57 వరకు.
సూర్యోదయం : 06:19
సూర్యాస్తమయం : 05:39
వర్జ్యం : సాయంత్రం 04:48 నుండి 06:34 వరకు.
దుర్ముహూర్తం : ఉదయం 06:19 నుండి 07:56 వరకు.
రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు
యమగండం : మద్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.
శుభోదయ:, నమస్కార:
వేదాలు
*వేదాలు*
వేదం సృష్టితత్త్వాన్ని, సృష్టికి మానవుడికి ఉన్న సంబంధాన్ని, మానవుడికి సృష్టికర్తతో గల అనుబంధాన్ని వ్యక్తం చేసింది.
వేదం ఏ ఒక్కరో రచించిన గ్రంథం కాదు. సృష్టితత్త్వాన్ని, పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోవాలని ఆరాటపడిన మహర్షి సముదాయానికి అంతర్నేత్రానికి గోచరించిన ఒక దర్శనం. హృదయస్థానంలో వినిపించిన ఒక నాదం (శ్రుతి).
వేదం *అపౌరుషేయం* అని కూడా పెద్దలు గుర్తించారు. *అపౌరుషేయం* అంటే మానవ మాత్రుడి రచన కాదు అని అర్ధం.
అనాదిగా అలా దిగి వచ్చిన వేదం వ్యాసమహర్షి కాలానికి చిక్కువడిన దారాల రాశిగా ఉంటే, ఆ చిక్కును విడదీసి, వేదవిభాగ నిర్ణయంచేసి, వేదం మనకు అక్కరకు వచ్చేలా చేశాడు ఆ మహర్షి. ఆనాటి నుండి అతడికి *వేదవ్యాసుడు* అనే పేరు వచ్చింది. సకల వేదాల సారాన్ని 555 సూత్రాలుగా “బ్రహ్మసూత్రాలు” రచించాడు. అయినా, ఆ మహర్షికి తృప్తి కలుగలేదు.
వేదమనే విత్తనంలో నుంచి విశాలమైన పురాణ మహావృక్షాలను అంకురింప చేశాడు. అందుకే పురాణాలకు *వేదోపబృంహణాలు* అని పేరు. *ఉపబృంహణం* అంటే విత్తనాలు నుంచి మొలక రావడం. విత్తనంలో ఏమి ఉన్నదో మొలకలో, మొక్కలో, చెట్టులో అదే ఉంటుంది.
ఇలా వేదవాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురాణాలను రచించాడు వ్యాసమహర్షి.
- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
సుభాషితమ్
🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐
*శ్లోకం*
*_శూలటంకపాశదండపాణిమాదికారణం_*
*_శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్_*
*_భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం_*
*_కాశికాపురాధినాథకాలభైరవం భజే....._*
_ *_శ్రీ కాలభైరవాష్టకమ్ - 03_* _
*భా*:
శూలము, టంకము, పాశము, దండము మొదలగునవి ఆయుధములుగా ధరించిన వాడు, నల్లని మేను కలవాడు, సనాతనుడు, నాశనము లేనివాడు, మొదటి వాడు, రోగాతీతుడు, విక్రముడు, ప్రభువు, విచిత్రమైన నాట్యమంటే ఇష్టపడే వాడు, *కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను*
శరీర గంథం..*
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*మొగలిచెర్ల ప్రయాణం..శరీర గంథం..*
*(పదిహేడవ రోజు)*
శ్రీ స్వామివారు ఇంత హఠాత్తుగా మొగలిచెర్ల కు బైలుదేరుతారని ఊహించలేకపోయిన శ్రీధరరావు దంపతుల మనసులోని భావాలను పసికట్టినట్లు..శ్రీ స్వామివారు ప్రభావతి గారివైపు తిరిగి..
"అమ్మా!..నీ మనసులో అనేక సందేహాలున్నాయి..క్రమంగా అన్నీ తీరిపోతాయి..నన్ను మొదటి సారి చూసినప్పుడే "నాయనా" అని పిలిచావు..ఆ క్షణం లోనే నువ్వు నా దృష్టిలో నాకు తల్లిగా మారిపోయావు..ఆ పార్వతీదేవి తన ఒడిలో ఇంతకాలం నాకు చోటిచ్చి..కన్నబిడ్డలా కాపాడింది..ఇక ముందు ముందు రోజుల్లో..నువ్వే నాకు తల్లి స్థానం లో వుండబోతున్నావు..నేనూ నీకు బిడ్డనయ్యాను..నీ పెద్దకుమారుడిని అనుకో!..నీ బిడ్డ నీ ఇంటికి రావడానికి ముహూర్తాలు చూడాలా తల్లీ?.." అన్నారు..
"శ్రీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు!.." అన్న శ్రీమతి విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదం ప్రభావతి శ్రీధరరావు గార్ల చెవుల్లో ఘంటానాదం లా వినబడింది..ఆ మహాతల్లి దీవెన ఈ నిమిషంలో ఈ స్వామివారి రూపంలో సాక్షాత్కారం అయింది..మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయంలో ఈ ఉదయం..తమను తాకుతూ వెళ్లిన కాంతిపుంజం ఇదేనేమో.. ఎప్పుడూ లేనిది ఆ నరసింహుడు తృళ్లి తృళ్లి నవ్విన కారణమూ ఇదేనేమో?..అని ప్రభావతి గారు తలపోస్తున్నారు..సరే..కొండంత లక్ష్మీనారసింహుడి ఆదేశం ఇదే అయితే..తమ పూర్వజన్మ సుకృతం వలన ఈ యోగిపుంగవుడు తమకు ఈ వయసులో దొరికిన కుమారుడిగా భావించి తరిద్దామని ఆవిడ నిర్ణయించుకున్నారు..
"అదేమీలేదు నాయనా..యోగులకొరకు ఇప్పటికిప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో తెలీక సతమతం అవుతున్నాను.." అన్నారు ప్రభావతి గారు.
"దిగంబరిని..సర్వసంగపరిత్యాగిని..నాకు ఏర్పాట్లు ఏముంటాయి తల్లీ..మీ ఇంట్లో ఏ లోటు ఉండదని నాకు తెలుసు..అవధూత లక్షణాలు మీకు కొత్త కదా..అవసరం వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెపుతాను..శ్రీధరరావు గారూ కాలాతీతమవుతోంది..ఇక బైలుదేరుదాం.."అన్నారు..
శ్రీధరరావు గారి వెంట ఉన్న వారి పిన్నమ్మ కౌసల్యమ్మ గారు, రమణయ్య గార్లు జరుగుతున్న ఈ తతంగమంతా విస్తుబోయి చూస్తున్నారు..తమతో పాటు ఈ దిగంబర యోగి అదే బండిలో ఎలా కూర్చుని వస్తాడు?..తామెలా సర్దుకోవాలి?..ఈ భార్యాభర్తలు వెఱ్ఱి వెంగళప్పల్లా అన్నిటికీ తలూపుతూ వున్నారే.. తాము సరే..మొగలిచెర్ల గ్రామస్థులు వివిధ రకాలుగా అనుకోరా?..వీళ్ళిద్దరికీ ఆ ఆలోచనే లేదే!..భగవంతుడా..ఇదేం చోద్యం?..అని పరి పరి విధాల మనసులోనే మధనపడుతూ వున్నారు..
మరి, వారి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహించారో.. ఏమో..గబుక్కున పార్వతీదేవి మఠం లోపలికి వెళ్లి..ఒక వస్త్రాన్ని మొలచుట్టూ కట్టుకొని, మరొక వస్త్రాన్ని భుజాల మీదుగా చుట్టూరా వేసుకొని..బైటకు వచ్చి కౌసల్యమ్మ గారితో.."ఇప్పుడు సరిపోయిందా?" అన్నారు నవ్వుతూ..కౌసల్యమ్మ గారు నిర్ఘాంతపోయారు..తన మనసులో సందేహం..ఒక్కక్షణం లో పసిగట్టి పరిష్కరించిన శ్రీ స్వామివారి కి నమస్కారం చేశారు..
అందరికంటే ముందుగా శ్రీ స్వామివారే బండిలోకి ఎక్కి కూర్చున్నారు..వారి ప్రక్కన శ్రీధరరావు గారు, ఆయన ప్రక్కన ప్రభావతి గారు, ఇటు చివరన కౌసల్యమ్మ, రమణయ్య గార్లు కూర్చున్నారు..బండి మెల్లిగా మొగలిచెర్ల వైపు బయలుదేరింది..ప్రభావతి గారి మనసులో మరో సందేహం మొదలైంది..ఇంటిదగ్గర తన అత్తగారు..శ్రీధరరావు గారి తల్లి గారున్నారు..పెద్దావిడ వున్నారు..ఇంతకాలం తామిద్దరూ మాట్లాడుకుంటుంటే శ్రీ స్వామివారి గురించి కర్ణాకర్ణిగా వినీవున్నారు.. రెండు మూడు సార్లు తమతో "ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అందరినీ నమ్మకండి నాయనా!.."అని సున్నితంగా హెచ్చరించి వున్నారు..మరి ఇప్పుడు ఏకంగా శ్రీ స్వామివారిని ఇంటికే తీసుకొస్తే..ఆ పెద్దావిడ ఏమంటారో?..అని అనుకుంటూ కళ్ళుమూసుకున్నారు..
"అన్నీ సవ్యంగా జరుగుతాయమ్మా.." శ్రీ స్వామివారి కంఠం లోంచి వచ్చిందామాట..ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు ప్రభావతి గారు..శ్రీ స్వామివారు ఎటో చూస్తున్నారు.."అన్నీ సవ్యంగానే జరుగుతాయి.."మళ్లీ అదేమాట ఆయన నోటినుంచి వచ్చింది..
ఇంతలో ఒక గాలి తెర శ్రీ స్వామివారు కూర్చున్న వైపునుంచి మిగిలిన వాళ్ళందరినీ తాకుతూ వెళ్ళింది..ఒకరకమైన దుర్గంధం బండి అంతా వ్యాపించింది..అందరూ గబుక్కున తమ ముక్కు మూసుకున్నట్లు చేతులడ్డంపెట్టుకున్నారు..శ్రీధరరావు గారు శ్రీ స్వామివారి వైపు చూసారు.."ఎంత యోగి అయినా..ఈ వాసన ఏమిటి?..ఇలాటి కంపు ఎలా భరిస్తాం?." అని ప్రభావతి గారు అనుకున్నారు..
ఫక్కున నవ్వారు శ్రీ స్వామివారు.."అమ్మా!..వారం రోజులుగా సమాధి నిష్ఠలో వున్నాను..స్నానం కూడా చేయలేదు..అసలు ఆ ధ్యాసే కలగ లేదు..మరి నా శరీరం నుండి దుర్గంధం కాక మరేమోస్తుంది?.." అన్నారు..ఈ సారి దంపతులిద్దరే కాక మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు..తమ మనసులోని ప్రతి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహిస్తున్నారు..ఇంతలో మరో గాలి తెమ్మెర మళ్లీ వీచింది..ఈసారి అత్యంత సుగంధ పరిమళం చుట్టూ వ్యాపించింది.."ఎంత మంచి వాసన!..ఎక్కడిదో!.." అప్రయత్నంగా రమణయ్య గారు పైకి అనేశారు..శ్రీ స్వామివారు తన చేతి వ్రేళ్ళకు పెరిగిన గ్రోళ్లను చూసుకుంటున్నారు..
తమవెంట వస్తున్నది ఎవరో పిచ్చివాడు కాదనీ..సమస్తమూ తెలిసిన ఒకానొక సిద్ధపురుషుడే ఈ దిగంబర యోగి గా మారి, తమను, మొగలిచెర్ల గ్రామాన్ని పునీతం చేయడానికి సాధారణ మానవునిలా మారి తమవెంట వస్తున్నాడని..తమ జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన చేయడానికి తమ ఇంట అడుగుబెడుతున్నాడనీ.. ప్రభావతీ శ్రీధరరావు దంపతులకు స్పష్టంగా తెలిసివచ్చింది.."స్వామీ లక్ష్మీ నృసింహా!..నీదే భారం తండ్రీ!..శరణు!!.."అని అనుకున్నారు..
శ్రీ స్వామివారి తో సహా అందరూ మొగలిచెర్ల గ్రామం లోని శ్రీధరరావు గారి ఇంటికి చేరారు..
ఫకీరు మాన్యం..మన్నేరు నది..రేపు..
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4x
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5124*
*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం - సప్తమి - పుష్యమి - స్థిర వాసరే* (04.11.2023)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/nXwfd_QK8AA?si=RFX4dr5-GZaglJcZ
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*