4, నవంబర్ 2023, శనివారం

మొదటి ముఖ్యమైన వర్షాలు

 ఈశాన్య రుతుపవనల మొదటి ముఖ్యమైన వర్షాలు. నవంబర్ 5 నుంచి దక్షిణ కోస్తాంధ్రలో పెరగనున్న వర్షాల జోరు. నవంబర్ 9  వరకు Helping

==


======

రైరులకు, నాకు పరిచయం ఉన్న రైతు మిత్రులకు శుభ వార్త​. చాలా కాలంగా మనం ఎదురు చూస్తున్న నవంబర్ 5 వర్షాలు ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తోంది. జిల్లాలైన తిరుపతి, నెల్లూరు అత్యథిక వర్షాలుంటాయి. అలాగే తిరుపతి నగరంతో పాటుగా నెల్లూరులో కూడ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలుంటాయి. కోస్తా ప్రాంతం (అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో) అత్యథిక వర్షాలుంటాయి. ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు, బాపట్ల జిల్లాలోని కోస్తా ప్రాంతానికి దగ్గరగా ఉన్న భాగాలు, కృష్ణా జిల్లాలోని కొన్ని కోస్తా భాగాల్లో మోస్తరు ఉంచి భారీగా వర్షాలుంటుంది. మీరు మ్యాప్ ని చూస్తే వివరాలు భాగా అర్ధం అవుతుంది. మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటిగా వర్షాలుంటాయి. సముద్రం నుంచి ఎంత దూరం లోపలికి వెళ్తారో అంత తక్కువగా వర్షాలుంటాయి. ఎలా అంటే అమలాపురంలో కొంచం గట్టిగా పడే వర్షాలు, రాజమండ్రిలో తేలికపాటిగా ఉంటుంది. అదే తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో వర్షాలుండవు లేదా తుంపర పడి ఆగిపోతుంది.


విశాఖ నగరంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లలలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు ఈ నవంబర్ 5 నుంచి 9 మధ్యలో చూడగలము. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా తుంపర్ల వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. అన్నమయ్య జిల్లా పశ్చిమ భాగాలు, చిత్తూరు పశ్చిమ భాగాల్లో కూడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. మరో వైపున కర్నూలు, నంధ్యాలలో అత్యల్పంగా కొన్ని చోట్లల్లో మాత్రమే తేలికపాటి తుంపర్ల వర్షాలు ఉండనుంది.


Due to a very strong trough placed along our South AP and adjoining Tamil Nadu coast, Heavy rains ahead for districts like Tirupati, Nellore, East Chittoor and Prakasam. Coastal areas will get very heavy rains while cities like Tirupati and Nellore will see Heavy downpour during these dates. Coastal areas of Prakasam, Bapatla and Krishna can see Heavy showers, On and Off showers for Rajahmundry, Vijayawada, Vizag and Kakinada.

కామెంట్‌లు లేవు: