25, ఏప్రిల్ 2021, ఆదివారం

కరోనా వ్యాధి లో CT స్కాన్

 కరోనా వ్యాధి లో CT  స్కాన్ (సిటీ స్కాన్) గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి 👇


ఇవాళ  చాలామందికి కరోనా ఉన్నదా ? లేదా ? అని తెలుసుకోవడానికి మరియు 

కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది , ఎంత తీవ్రత వుంది అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్  చేస్తున్నారు.


ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.


ఒకటి  CORADS

రెండు CT severity index


CORADS : దీనిలో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు ఉంటవి


CORADS ... 

అనేది సిటీ స్కాన్ ప్రకారము కరోనా ఉండే అవకాశాలు ఎంత ? అని మాత్రమే తెలుసుకోవడానికి వీలుంటుంది .


అంటే స్టేజ్ 1 నుంచి 6 వరకు పెరిగేకొద్దీ కరోనా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నది అని మాత్రమే చెబుతుంది ,  స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని మాత్రం కాదు.


CORADS 1... ఏమి ఇబ్బంది లేదు.

CORADS 2... సిటీ స్కాన్ లో కొంచెం తేడా ఉంది కానీ అది కరోనా వల్ల అయి ఉండకపోవచ్చు.

CORADS 3.. సిటీ స్కాన్ లో కొంచెం తేడా ఉంది లేదా నెమ్ము లక్షణాలు ఉన్నది కానీ అది కరోనా వల్ల లేదా వేరే జబ్బు వల్ల వచ్చిందా అని  తెలియడం లేదు.

CORADS 4.  సిటి స్కాన్ బాగాలేదు, సిటి స్కాన్ లో కనిపిస్తున్న ఈ లక్షణాలు చాలావరకు కరోనా వల్లనే అనిపిస్తుంది.

CORADS 5... ఇది ఖచ్చితంగా కరోనా అని సీటీస్కాన్ చెప్తుంది.

CORADS 6 ... సిటీ స్కాన్ లో నెమ్ము లక్షణాలు కనిపిస్తూ RTPCR లేక Rapid antigen test పాజిటివ్ ఉంటే అది stage 6 అవుతుంది.


So, ఈ CORADS క్లాసిఫికేషన్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు వరకు సిటీ స్కాన్ చూసి కరోనానా? లేదా? అని చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది , స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని  ఏమాత్రం కాదు.


2 : CT severity index


మనకి రెండు ఊపిరితిత్తులు ఉంటవి. ఒకటి కుడిపక్క ,  రెండవది ఎడం పక్క. ఈ కుడి పక్కన ఊపిరితిత్తిలో మూడు లోబులు ( మూడు భాగాలు ) ఉంటాయి అంటే మూడుగా విభజించబడి వుంటుంది, ఎడమ పక్క ఊపిరితిత్తిలో రెండు లోబ్స్ ఉంటాయి అంటే రెండు గా విభజించబడి ఉంటుంది.... మొత్తం రెండు ఊపిరితితతుల్లో  మనకు 5 భాగాలు గా ఉంటాయి.


ఈ సిటి సివియారిటి ఇండెక్స్ ( CT severity index ) 0 నుంచి 25 వరకు ఉంటుంది .అంటే ఒక్కొక్క లోబ్ లో 0 నుంచి 5 పాయింట్లు ఇస్తారు. 5 x 5... మొత్తం పాయింట్లు 25 అవుతుంది.


ఈ జీరో నుంచి ఐదు పాయింట్లు అనేది ఊపిరితిత్తులు ఎంత చెడిపోయింది అన్న దానిని బట్టి ఈ పాయింట్లు పెరుగుతాయి.


*0 : ఏమీ ఇన్ఫెక్షన్ లేదు

1 : 5% కన్నా తక్కువ గా ఉంది 

2 : 5 - 25  పర్సెంట్ 

3  :25 - 50% 

4 : 50-  75%

5 : 75 పర్సెంట్ కన్నా ఎక్కువగా దెబ్బతిన్నది*


సో ,  ఒక్కొక్క లోబ్ లో జీరో నుంచి ఐదు స్టేజి వరకు తీసుకొని 5 x 5 = 25 స్కోర్ అవుతుంది .

ఈ స్కోర్

8 కన్నా తక్కువ అయితే ...mild ( తక్కువగా వుంది )

 8 నుంచి 15 అయితే Modarate ( ఒకమొస్తరిగా)

15 కన్నా ఎక్కువ అయితే Severe ( ఎక్కవగా)


  ఊపిరితిత్తులు ఎంత దెబ్బతిన్నది అని తెలుసుకోవడానికి ఈ స్కోర్ ఉపయోగపడుతుంది .


కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అది ఆ రోజు సిటీ స్కాన్ చేయించిన రోజు ఎంత దెబ్బ తిన్నవి అని మాత్రమే తెలియజేసినది.

 వ్యాధి పెరుగుతున్నకొద్దీ ఈ స్కోరు  పెరుగుతుంది. 


అంటే డాక్టర్లు ఈ సిటీ స్కాన్ ని వ్యాధి పెరుగుతుందా లేదా అని మరియు ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి మళ్ళీ చేయవలసి వస్తుంది.


కాని పెరుగుతుందా లేదా తెలుసుకోవడానికి డాక్టర్ని మాత్రమే సంప్రదించవలెను. సొంతంగా వెళ్లి సిటీ స్కాన్ చేయించుకున్న ఎడల డబ్బులు వృధా అవుతాయి , అనవసరంగా ఎక్కువసార్లు సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల రేడియేషన్ కూడా వస్తుంది.


 అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ pulse oximeter  చెక్ చేసుకుంటే మనం కూడా గమనించవచ్చు .


ఈ పల్స్ ఆక్సిమీటర్ లో SPO2 అనేది 93 కన్నా ఎక్కువ ఉండాలి, 


 93 శాతం కన్నా తక్కువ ఉంటే మన ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదని అర్థం.


  సో , ఈ CORADS  క్లాసిఫికేషన్ స్టేజ్ 1 - 6   అనేది  కరోనా ఉండే అవకాశాలు ఎంత అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అది వ్యాధి తీవ్రత తెలియజేయదు.


 CT Severity index ఊపిరితిత్తులు ఎంత దెబ్బ తిన్నవి వ్యాధి తీవ్రత ఎంత ఉంది అని తెలియజేస్తుంది.


ఈ సిటీ స్కాన్ లో  వ్యాది ఎలా వుంది ఎంత తీవ్రత వుంది అని చెప్పడానికి మరో నాలుగు పదాలు వాడుతూ ఉంటారు .


  ground glass appearance


   Crazy paving pattern


     Consolidation


      Gradual resolution 


  ఈ ground glass అనగా ఒక ఐదు రోజుల లోపు కరోనా అటాక్  అయివుంటుంది


 5 రోజుల నుంచి 10 రోజుల్లో ఈ క్రేజీ పేవింగ్ పేటరన్ కనిపిస్తుంది


 10 నుంచి 13 రోజులు లో కన్సాలిడేషన్ లాగా అనిపిస్తుంది 


14 రోజుల తర్వాత అయితే గ్రాడ్యువల్ రిజల్యూషన్ లా  CT స్కాన్ లో కనిపిస్తుంది.


ఇవన్నీ మనము కొంచెం సిటిస్కాన్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే ,పూర్తిగా అవగాహన కోసం డాక్టర్ ని సంప్రదించాలి.


copy post from whats app

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...  


*ఆశ్రమవాసం..ఆధ్యాత్మిక శిక్షణ..*


*(ఎనిమిదవ రోజు)*


వ్యాసాశ్రమం లో అడుగుపెట్టిన శ్రీ స్వామివారికి అక్కడి క్రమశిక్షణాయుత వాతావరణం నచ్చింది..తెల్లగా..సన్నగా ..తేజస్సు ఉట్టిపడుతున్న ముఖం తో ఉన్న ఆ బాల యోగి అందరినీ ఇట్టే ఆకర్షించాడు.. నియమిత ఆహారం..యోగ సాధన..నిరంతర భజనలు..భగవన్నామ సంకీర్తనమూ..సాధు సత్పురుషుల ఉపదేశాలూ..ఎటు చూసినా ఒకరకమైన భక్తి భావం తొణికిసలాడే ఆ ఆశ్రమం..శ్రీ స్వామివారికి అనువైన ప్రదేశం గా తోచడం లో ఆశ్చర్యం లేదు..


శ్రీ స్వామివారికి గురువులు బోధించే ఏ అంశమైనా క్షణాల్లో అవగతమైపోయేది..దానికి తోడు ఆయనకే స్వంతమైన ధారణ శక్తి తో అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చే నేర్పు అలవడింది..శ్రోతలు మంత్ర ముగ్ధుల్లా వినేవారు..తనకు సందేహం వస్తే..గురువు దగ్గర వినయపూర్వకంగా అడిగి తెలుసుకునేవారు..చెరగని చిరునవ్వు తో ఉండటం..ఎటువంటి ప్రశ్నకైనా తడుముకోకుండా జవాబు చెప్పటం..గురువుల వద్ద వినయం తో ప్రవర్తించడం..తాను తెలుసుకున్న జ్ఞానాన్ని తోటి మిత్రులకు సులభ శైలిలో వివరించడం..మొదలైన గుణాల వలన అనతికాలంలోనే ఆశ్రమంలో ఒక ముఖ్య శిష్యుడిగా మారిపోయారు..


సరిగ్గా ఆ సమయం లోనే..కొంతమంది ఆశ్రమవాసులు తదుపరి శ్రీ స్వామివారిని బోధగురువు గా నియమిస్తే బాగుంటుందని తలపోయసాగారు..ఆశ్రమానికి కూడా ఈ యువకయోగి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని ఆలోచన చేయ సాగారు..ఈ ఆలోచన వారి మదిలో ఎందుకు కలిగిందో తెలీదు కానీ..ఆనాటి నుంచి, శ్రీ స్వామివారిని ఒక ప్రత్యేక వ్యక్తిగా పరిగణించసాగారు..ఈ మార్పు శ్రీ స్వామివారి మనసుకు తోచింది..మూలకారణం ఏమిటో అని ఆరా తీశారు..ఆశ్రమవాసుల్లో కొందరు శ్రీ స్వామివారికి అసలు విషయం చెప్పారు..


శ్రీ స్వామివారు ఎంతో పరిణితి తో ఆలోచన చేశారు..తన జీవిత లక్ష్యం మోక్ష సాధన..అంతేకానీ ఆశ్రమ నిర్వహణ కాదు..మానవుని ఆధ్యాత్మిక పయనంలో అనేక బంధాలు అడ్డుపడతాయి..కీర్తి తో వచ్చే బంధాలు ("ఆయన లాంటి గురువు దొరకడం కష్టం అండీ..అంటూ ఆకాశానికి ఎత్తేసే రకం..)  కొన్ని..పదవుల తో (ఆశ్రమ నిర్వహణ, గురు పీఠం ఇత్యాదులు) వచ్చే బంధాలు కొన్ని..ఇలా వీటిలో చిక్కుకొని తన మార్గాన్ని తానే తప్పడం సుతరామూ ఆయనకు ఇష్టం లేకుండా పోయింది..క్రమంగా ఆశ్రమ వాసుల లో శ్రీ స్వామివారి మీద బాధ్యతలు మోపాలనే ఆలోచన బలపడసాగింది..ఈ ధోరణి శ్రీ స్వామివారి ధ్యానానికి అవరోధంగా మారింది..ఇక ఇక్కడ వుంటే..తనమీద ఏదో ఒక బాధ్యత పడక తప్పదు అని శ్రీ స్వామివారికి తేటతెల్లంగా తెలిసిపోయింది..


శ్రీ స్వామివారు ఆలోచన చేశారు..ముందుగా కొన్నాళ్ల పాటు వేరే ప్రదేశాలకు వెళ్లి వస్తానని ఆశ్రమవాసులకు చెప్పుకుని, గురువుల అనుమతి తీసుకొని బైటకు వచ్చారు..అలా చిత్తూరు జిల్లాలో "పాపానాయుడుపేట" అనే గ్రామానికి చేరారు..ఆగ్రామంలో "బాలబ్రహ్మం" అనే సాధువు శ్రీ స్వామివారిని చూసి.."ఈతడు సామాన్యమానవుడు కాదే..ఇలా తిరుగుతున్నాడేమిటి?.." అని తనలో తానే తర్కించుకుని, శ్రీ స్వామివారిని చేరదీసి..వాకబు చేశారు..బాలబ్రహ్మం ఏ నిమిషంలో శ్రీ స్వామివారిని కలిసాడో..శ్రీ స్వామివారికి అంతర్వాణి "ఇతడే నీ గురువు.." అని ప్రబోధించింది..శ్రీ స్వామివారు సాష్టాంగ నమస్కారం చేసారు..


"లే నాయనా!..దారితప్పి, దిక్కుతోచక అల్లాడుతున్నావా?..ఇక నీకు భయం లేదు..నిత్యమూ, సత్యమూ అయిన సచ్చిదానంద స్వరూపాన్ని కనుక్కోవడానికి సాధన అవసరం..ముక్తి మార్గాన్ని తెలుసుకోవాలంటే ముందుగా నిన్ను నీవు శోధించుకోవాలి..పరమాత్మ తత్వాన్ని గ్రహించాలనే నీ తపన అర్ధమయింది..ఆత్మ ను గ్రహిస్తే..పరమాత్మ వశం అవుతాడు.." అని చెప్పి, తపస్సాధన చేయాల్సిన విధం చెప్పి..గురూపదేశం చేశారు..భగవన్నామ జపం చేసేటప్పుడు ప్రకృతి కల్పించే ఆటంకాలు, మాయా పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో వివరంగా తెలియచేసారు..


బాలబ్రహ్మం గారు చేసిన ఉపదేశం, శ్రీ స్వామివారిలో కొండంత మానసిక స్తైర్యాన్ని నింపింది..కొన్నాళ్ల పాటు ఆయనకు శుశ్రూష చేసి..తిరిగి ఎర్రబల్లె చేరారు..ఇక తపోసాధనకు అనువైన ప్రదేశం కావాలి..మోక్ష సాధన..మోక్ష సాధన..ఇదొక్కటే ఆయన మదిలో సుడులు తిరుగుతున్న ఆలోచన!..ఇదే తపన!..


భక్తుడు ఆర్తిగా తపిస్తుంటే..భగవంతుడు చూస్తూ ఊరుకోడు.. తన దగ్గరకు పిలిపించుకుంటాడు..మాలకొండ లో వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనారసింహుడు,  శ్రీ స్వామి వారి మొర ఆలకించాడు..శ్రీ స్వామివారికి అంతర్వాణి రూపంలో ఆదేశం వచ్చింది..ఒక్కక్షణం ఆలస్యం చేయలేదు.. పరుగు పరుగున మాలకొండ చేరారు..


మాలకొండలో తపోసాధన..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

Paata