6, ఫిబ్రవరి 2025, గురువారం

మాఘ పురాణం - 7 వ*_

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷బుధవారం 5 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 7 వ*_ 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము*


☘☘☘☘☘☘☘☘☘


వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు యిట్లు తెలియజేసెను. పార్వతీ ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అనంత వాడయను నామముగల పెద్దనగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది , కాని , అతడు ఇంకనూ ధనాశకలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ శ్రీహరిని ధ్యానించుటగాని , దానధర్మాలు చేయుటగాని యెరుగడు. అంతేకాక బీదప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు ఋణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి , వారి ఆస్తులు సైతము స్వాధీన పరచుకొనేవాడు. ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను , ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి , *"తల్లీ ! నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది , ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను , సదాచారవ్రతుడను ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెదను"* అని బ్రతిమలాడెను.


తాయారమ్మకు జాలికలిగెను వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి , అందొక తుంగచాపవేసి , కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె  దయార్ద హృదయమునకు ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి , *"ఆర్యా మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా ! ఆ మాఘస్నానమేమి ?* *సెలవిండు వినుటకు కుతూహలముగా నున్నది"* అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని , *"అమ్మా మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు , ఈ మాఘమాసములో నది యందు గాని , తటాకమందు గాని లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణుమందిరానికి వెళ్ళి తులసి దళముతోను , పూలతోను పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను , తరువాత మాఘపురాణము పఠించవలెను.* ఇట్లు ప్రతిదినము విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన , దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. *ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేనివారూ , వృద్దులూ , రోగులు ఒక్కరోజయినను అనగా ఏకాదశినాడు గాని , ద్వాదశినాడు గాని లేక పౌర్ణమినాడు గాని పై ప్రకారము చేసినచో సకలపాపములు తొలగి సిరిసంపదలు , పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను"* అని చెప్పగా , ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడ ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో బాటు నదికిపోయి స్నానము జేయుటకు నిశ్చయించుకొనెను.


అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపమువచ్చి , వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటాకొరికి *"ఓసీ వెర్రిదానా ! ఎవరు చెప్పినారే నీకీ సంగతి ? మాఘమాసమేమిటి ? స్నానమేమిటి ? వ్రతము , దానములేమిటి ? నీకేమైనా పిచ్చి పట్టినదా ? చాలు చాలు అధిక ప్రసంగముచేసినచో నోరునొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్కపైసాకూడా వదలకుండా వడ్డీలు వసూలుచేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా ? చలిలో చన్నీళ్ళు స్నానముచేసి , పూజలుచేసి , దానములుచేస్తే వళ్ళూ యిల్లూ గుల్లయి , నెత్తి పైన చెంగు వేసుకొని 'భిక్షాందేహీ' అని అనవలసినదే జాగ్రత్త ! వెళ్ళి పడుకో"*, అని కోపంగా కసిరాడు.


ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి , మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానముచేయుచున్నది. ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి  ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా , ఆ యిద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి యింటికి తీసుకువచ్చినాడు.


కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై ఎక్కించుకొని తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.


*"ఓ యమభటులారా ! ఏమిటీ అన్యాయము ? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి ? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట  ఏమిటి ? ఇద్దరమూ సమానమేగదా"* అని వారి నుద్దేశించి అడుగగా , ఓ అమ్మా ! నీవు మాఘమాసములో ఒక దినమున నదీస్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ , నీ భర్త అనేకులను హింసించి , అన్యాయముగా ధనార్జన చేసి అనేకులవద్ద అసత్త్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తిలేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి.


ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. *"నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్తకూడా నీటమునిగినాడు కదా ! శిక్షించుటలో యింత వ్యత్యాసమేలకలుగెను ?"* అని అనగా  ఆ యమభటులకు సంశయము కలిగి , యేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని , ఆమె వేసిన ప్రశ్ననూ తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికచూడగా , ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా , బంగారుశెట్టిని పుష్పకవిమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతోషమందిరి. రాజా ! వింటివా ! భార్యవలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్యా యధాలాపముగా ఒక్కరోజు మాఘమాసస్నానము చేసినందున యిద్దరికిని వైకుంఠప్రాప్తి కలిగినదిగా ! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుటలో సందేహములేదు.


*మాఘపురాణం  ఏడవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

పోతన --భాగవతము 🙏

 🙏పోతన --భాగవతము 🙏

                మొదటి భాగం 

ముందుగా పోతన పోతపోసిన పద్యరాజములు చూద్దాము. గజేంద్ర మోక్షం నుండి తీసుకున్నాను.

కొన్ని పద్యాలలో సగుణాన్ని, కొన్ని పద్యాలలో నిరాకార నిర్గుణాన్ని వర్ణించారు.శివ కేశవులకు అభేదం పాటించారు. భాగవతన్ని మోక్ష విద్య అని పేర్కొన్నారు. బీజాక్షర శక్తిని పద్యాలలో సమకూర్చారు. 

భక్త పోతన తన తపస్సుశక్తిని ధార పోసి, తెలుగు భాషలోని అక్షరాలలో ఉన్న అమృతాన్ని పిండి, తన రామ భక్తిని రంగరించి , భాగవత పద్యాలలోకి మంత్ర శక్తిని ఆవహింపచేసిన మహా గ్రంథం- భాగవతం

బతుకుతెరువు కోసమో లేదా రాజులిచ్చే అగ్రహారాల కోసమో కవులు కావ్యాలు రాస్తారన్న అపవాదు భాగవతానికి రాకూడదని, తనకున్న కాసింత పొలాన్ని పండించుకుని ఎంతో నిరాడంబరంగా జీవించిన మహా ఋషి, మహా యోగి రాసిన మహా గ్రంథం - భాగవతం

భగవంతుడు అను భద్ర శబ్దమునకు అర్థము, ఆకృతి గా అతిశయించి నిలబడగలిగిన రామభద్రుడు, శ్రీరామనారాయణుడే స్వయంగా పోతనచే రాయించుకున్న మహా కావ్యం - భాగవతం

సాక్షాత్తూ శ్రీకృష్ణుడే స్వయంగా భాగవతం నా అక్షర స్వరూపంగా ఉంటుందని వెల్లడి చేసిన మహా గ్రంథం - భాగవతం

భక్తి వైభవాన్ని, గొప్పతనాన్ని పతాకస్థాయిలో మేరు పర్వత శిఖరాలు దాటించి, వైకుంఠం అంచుల దాకా తీసుకెళ్ళి వివరించిన మహా కావ్యం- భాగవతం

లక్ష్మీ దేవి కౌగిటిలో ఉన్నా కూడా, పరమాత్మున్ని తన భక్తుల రక్షణకై పరుగులు పెట్టించిన లీలలు తెలిపే గ్రంథం (గజేంద్ర మోక్షం) - భాగవతం

ఏ శ్రీమన్నారాయణుని పాద పద్మములచే పునీతమైన భూమాత రోమాంచితమైనపుడు నిక్కబొడుచుకున్న రోమాలే, ఈ పచ్చదనమంతా అని అప్పుడు మోహపరవశయై రంజిల్లగా, ఆనంద పరవశయైన భూమాత రాల్చిన ఆనంద భాష్పధారలే ఈ సెలయేరులన్నీ అని అట్టి శ్రీహరి పాదారవిందముల శుభ చిహ్నముల వైభవాన్ని కీర్తించే మహా కావ్యం - భాగవతం

పోతన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 

పోతన బ్రహ్మ ,పోతన విష్ణువు, పోతన శివుడు పోతన శక్తి.సాక్షాత్తు పోతన గారే పరబ్రహ్మ స్వరూపము.

పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరాడి, సం

శిథిలంబై, తన లావు వైరిబలముం జింతించి, మిథ్యామనో

రథమిం కేటికి? దీని గెల్వ సరి పోరంజాలరా దంచు స

వ్యథమై యిట్లనుఁ బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్..

భావము:- గజరాజు గొప్పబలంతో అనేక సంవత్సరాలు యుద్ధం జేసి చేసి చివరికి చితికిపోయాడు. తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకొన్నాడు “అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు. దీనిని జయించటం, సరిసమంగా పోరాడటం రెండు నాకు సాధ్యంకాదు.” అని దుఃఖించాడు. పూర్వజన్మల పుణ్య ఫలం వలన కలిగిన మేలైన ఙ్ఞానం వల్ల అతడు ఈ విధంగా అనుకోసాగేడు.

"ఏరూపంబున దీని గెల్తు? నిటమీఁ దేవేల్పుఁ జింతింతు? నె

వ్వారింజీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్

వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్

లేరే?మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్ 

- ఏ = ఏ; రక్షిస్తారు? ఈ మహామొసలిని ఆపేశక్తి కలవారు ఎవరు? సర్వకార్యాలలో దిట్టలు గొప్పపుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా. అట్టి వారికిమొరపెట్టుకుంటాను.


నానానేకపయూధముల్ వనములోనంబెద్దకాలంబు స

న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ

ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే

కీనీరాశ నిటేల వచ్చితి? భయం బెట్లోకదే యీశ్వరా!


భావము:- చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతు ఉన్నాను. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండ, నీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చాను. భగవంతుడా! చాలా భయం వేస్తోంది. ఎలానో ఏమిటో.

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ;డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ

డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

భావము:- ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.


ఒకపరి జగములు వెలి నిడి

యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై

సకలార్థ సాక్షి యగు న

య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.

భావము:- ఒకసారి లోకాలను సృష్టి చేసి, ఇంకొకసారి తనలో లయం చేసుకుంటు, ఆ లోకాలు రెండు తానే అయ్యి, అన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూ, ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను.


లోకంబులు లోకేశులు

లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం

జీకటి కవ్వల నెవ్వం

డేకాకృతి వెలుఁగు నతని నేసేవింతున్.


భావము:- లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం; ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను.


నర్తకుని భంగిఁ బెక్కగు

మూర్తులతో నెవ్వఁ డాడు? మునులు దివిజులుం

గీర్తింప నేర? రెవ్వని

వర్తన మొరు లెఱుఁగ? రట్టివాని నుతింతున్.

భావము:- అనేక వేషాలు వేసే నటుడి లాగ పెక్కు రూపాలతో ఎవరు క్రీడిస్తుంటాడో? ఋషులు దేవతలు ఎవరి గొప్పదనాన్ని వర్ణించ లేరో? ఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో? అట్టి ఆ మహాదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను.


ముక్తసంగులైన మునులు దిదృక్షులు

సర్వభూత హితులు సాధుచిత్తు

లసదృశవ్రతాఢ్యులైకొల్తు రెవ్వని

దివ్యపదము వాఁడు దిక్కు నాకు..


భావము:- ప్రపంచంతో సర్వ సంబంధాలు వదలివేసిన మునులు, భగవద్దర్శనం కోరేవారు, సమస్తమైన జీవుల మేలు కోరేవారు, మంచి మనసు కలవారు సాటిలేని వ్రతాలు ధరించి ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కు అగు గాక.

                       సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

తల్లిదండ్రులకు

 


*తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా*

                 ********


క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు.  ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.


తల్లిదండ్రులకు  తమ పిల్లలపై  శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.


క్రమశిక్షణ మాటలతో రాదు.  కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.


పిల్లలకి బడిలో భయంలేదు.

ఇంట్లో భయం లేదు.

అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది.

వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. 

అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.

ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు.


*గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.*

ఇది నిజం.


*గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది*?


*కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు!  చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు*! 


*5వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని వచ్చే వారిని కామెంట్స్ చేయడం.  అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి*.


*దరిద్రం ఏంటంటే,  కొంతమంది తల్లి  దండ్రులే మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు*.


*ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు*. 


పెన్ను ఉంటే పుస్తకం ఉండదు,

పుస్తకం వుంటే పెన్ను వుండదు.  కొనరు, తెచ్చుకోరు. 

భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం. 

ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.


కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా...?


*భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట!*

*అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం*.


స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్ట కూడదు, కనీసం మందలించ కూడదు ప్రేమతో చెప్పాలట.

ఇదెలా సాధ్యమ్?


మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?


మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు.  ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం.  వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.


తల్లిదండ్రులకు నా మనవి. పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల తోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు.


 90 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. 

ఇది యదార్ధం.  


ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.

       

మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు.


అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. 

మా బాగు కోసమే అని అనుకునేవారు.

        

ముందుగా తల్లి దండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.


తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..


*పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60 % , కానీ 40% మాత్రం తల్లి దండ్రులే..!🙏*


*పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..  పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢ నమ్మకాలు, స్వార్థం, అతి  ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు.*


*ఇప్పుటి తరం 70% పిల్లలు..*


👉తల్లిదండ్రులు కారు, బండి శుభ్రం మంటే తుడవరు.


👉మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.


👉లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.


👉కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.


👉రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు.


👉గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు.


👉తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు.


👉 మైనర్ పిల్లలకి బైక్లు ఇవ్వడం 

వారు ఆక్సిడెంట్లకు చేయడం 

కేసులలో ఇరుక్కోవడం


👉ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.


👉ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి.


👉అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు.


👉20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు.


👉బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి.


👉కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు.


👉వారిస్తే వెర్రి పనులు.


👉మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు.


పై వాటికి  కారణం మనమే. ఎందుకంటే మనకు అహం,పరువు మరియు  ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.


చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.


గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..


*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి.*


*కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు.*


*ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత 15 ఏళ్లకే ప్రేమ - దోమ అనటం,సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.*


మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు..


అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లి దండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..


భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..


మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.


👉కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు.


గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..


03వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు.


05వ తరగతి వారికి అల్సర్, బీపీలు.


10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి..


వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచక పోవడమే. అందుకే తల్లి దండ్రులు మారాలి.


రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?


కేవలం గుడికి , దర్గా లకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు.


సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..👇

👉  బాధ్యత

👉  మర్యాద

👉  గౌరవం

👉  కష్టం

👉  నష్టం

👉  ఓర్పు

👉  సహనం

👉  దాతృత్వం

👉  ప్రేమ

👉  అనురాగం

👉  సహాయం

👉  సహకారం

👉  నాయకత్వం

👉  మానసిక ద్రృఢత్వం

👉  కుటుంబ బంధాలు

👉  అనుబంధాలు  

👉  దైవ భక్తి

👉  దేశ భక్తి


కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..


మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, మన ఆనందం కోసం బ్రతుకుదాం.


ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..


భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.


 🙏చదివిన వారందరి విన్నపం...

దయచేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి


*ఈ మేసేజ్ చదివి అందరూ మారిపోతారు అని నేను అనుకోవడం లేదు....*


*కనీసం ఒక్కరు అయిన మారుతారని ఉద్దేశంతో ఈ మేసేజ్ పెడుతున్నాను*

ఇట్లు 

*మీ శ్రీనివాస నాయక్

 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్.           ఆలమూరు🙏🙏🙏*

మధ్వాచార్యులు

 శ్రీ శంకరాచార్యులు మరియు శ్రీ రామానుజాచార్యుల తరువాత మూడవ గొప్ప తత్వవేత్త అయిన మధ్వాచార్యులు నిర్వాణం పొందిన రోజు ఈ రోజు. క్రీ.శ. 1317లో మాఘ మాసం 9వ రోజున, శ్రీ అనంతేశ్వర ఆలయంలో తన శిష్యులకు ఐతరేయ ఉపనిషత్ భాష్యాన్ని బోధిస్తున్నప్పుడు, మధ్వాచార్యులు అకస్మాత్తుగా పూల కుప్పలో అదృశ్యమయ్యారు, ఇది ఆయన బదరీకాశ్రమంలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుందని నమ్ముతారు. హనుమంతుడు మరియు భీముడి తర్వాత వాయుదేవుని మూడవ అవతారంగా ఆయనను గౌరవిస్తారు మరియు ఆయన ద్వైత లేదా ద్వైత తత్వాన్ని స్థాపించారు. పుట్టుకతో సంబంధం లేకుండా మోక్షం అందరికీ అందుబాటులో ఉంటుందని మధ్వాచార్యులు వాదించారు మరియు ఆయన బోధనలు కర్ణాటకలో భక్తి సంప్రదాయాలను పునరుద్ధరించాయి. మధ్వాచార్యుల వారసత్వం ఉడిపి ప్రాంతం వరకు విస్తరించింది, ఇక్కడ ఆయన కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. కృష్ణుడి ఆలయానికి ప్రసిద్ధి చెందిన ఉడిపి ప్రాంతం వరకు మాధవాచార్యుల వారసత్వం విస్తరించింది. పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ ఆయన రాసిన పన్నెండు భాగాల ద్వాదశ స్తోత్రాన్ని రాస్తున్నప్పుడు, ఆయన బీచ్‌లో కష్టాల్లో ఉన్న నావికులను రక్షించి, కృతజ్ఞతా చిహ్నంగా ఓడ కెప్టెన్ నుండి గోపి-చందన మట్టి ముద్దను అందుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయేలా, ఆ ముద్ద విరిగి, మధ్వాచార్యుడు మాల్పే బీచ్‌లో ప్రతిష్టించిన బాలకృష్ణుడి విగ్రహాన్ని, ఆయన ఉడిపికి తీసుకువచ్చి తన మఠంలో ప్రతిష్టించిన కృష్ణుడిని బహిర్గతం చేసింది. ఆయన శిష్యులు ప్రయత్నించినప్పటికీ, మధ్వాచార్యుడు మాత్రమే దైవిక ఆమోదాన్ని సూచిస్తూ దేవతను తరలించగలిగాడు. పరమానందభరితమైన భక్తితో, ఆయన భగవంతుడిని ఉడిపికి తీసుకువెళ్లాడు, అక్కడ ఆయన స్నానం చేసి శ్రీకృష్ణ మఠంలో ప్రతిష్టించాడు, నేటికీ గౌరవించబడుతున్న ఆలయాన్ని ప్రారంభించాడు. మధ్వాచార్య తత్వశాస్త్రం యొక్క ముఖ్య సిద్ధాంతాలలో అజ్ఞానం కారణంగా ఆత్మ ప్రపంచానికి బానిస కావడం, శ్రీ హరి అనుగ్రహాన్ని కోరుకోవడం ద్వారా దాని విముక్తి మరియు శ్రీ హరిని చేరుకోవడానికి ఏకైక మార్గంగా భక్తి యొక్క ఆవశ్యకత ఉన్నాయి, దీనిని ధ్యానం, పవిత్ర గ్రంథాల అధ్యయనం మరియు గురువు నుండి మార్గదర్శకత్వం ద్వారా సాధించవచ్చు.

మూత్రపిండములలో నొప్పి

 5 నిమిషములలో మూత్రపిండములలో నొప్పి తగ్గుటకు నేను ప్రయోగించిన సిద్ద ఔషధం - 


    మూత్రపిండములలో రాళ్లు ఉన్నట్టు చాలమందికి తెలియదు. వారికి ఒక్కసారిగా వీపు భాగంలో విపరీతమైన నొప్పి మొదలై విలవిలలాడిపోతారు . చాలా భయంకరంగా నొప్పి వస్తుంది . ఈ విధమైన నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తి కి నేను 5 నిమిషములలో నొప్పి తగ్గించాను. 


      మూసామ్బరం ని కంది గింజ అంత పరిమాణం లో తీసుకుని ఒక ద్రాక్ష పండు తీసుకుని దానిలో గింజలు తీసివేసి లొపల మూసామ్బరం పెట్టి మింగించి నీటిని త్రాగించాను. కేవలం 5 నిమిషములలో నొప్పి నుంచి విముక్తి లభించినది. 


          బొడ్డుకింద బాగంలో నొప్పి వచ్చినను ఇదే యోగం ఉపయోగపడుతుంది 


 గమనిక - 


      మూసామ్బరం మీకు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అగును. కలబంద ఆకులోని గుజ్జుని ఎండించి తయారుచేస్తారు. చంటిపిల్లలకు పాలు మాన్పించడానికి తల్లి యొక్క చనుమొనలు కు రాస్తారు. దీనిని కలబంద గుజ్జు ఎండించి తయారుచేస్తారు. 


 మూసాంబరం లభ్యం కానీ సమయంలో కలబంద మట్ట తీసుకొని పైన ఉన్న పచ్చ భాగం తీసివేసి లోపల ఉన్న గుజ్జుని బాగా కడిగి ఒక కప్పు 

మోతాదు తీసుకొని దానిలో మీ మూడు వేళ్ళకు వచ్చినంత జీలకర్ర,  అదే మూడు వేళ్ళకు వచ్చినంత పసుపు ఆ గుజ్జులో బాగా కలిపి రెండు గంటలకు ఒక మోతాదుగా లోపలికి తీసుకోవలెను. 


  

మరిన్ని అనుభవపూర్వక, రహస్య ఆయుర్వేద ఔషధ యోగాలు గురించి మరింత వివరణాత్మక సమాచారం నా గ్రంధాల యందు వివరించాను. వాటిని క్షుణ్ణముగా చదవగలరు.


గమనిక  ~ 


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

గుండె జబ్బులు

 గుండె జబ్బులు  -  ఆహార నియమాలు - ఔషధాలు 


 గుండెజబ్బు రావడానికి గల కారణాలు -


 *  అతిగా ఆవేశపడటం.

 

 *  ఎక్కువుగా ఉన్న వేడి పదార్దాలు తినడం.

 

 *  పులుసు , వగరు ఉన్న రుచులు ఎక్కువ ఉన్న పదార్దాలు తినడం.


 *  విచ్చలవిడిగా కామకలాపాలు సాగించడం .


 *  అతిసారం 


 *  జీర్ణకోశం లో  వ్రణాలు .

 

 *  విషపదార్దాల సేవనం .

 

 *  మానసిక ఆందోళన .


 *  రక్తపోటు .


 *  కొవ్వు పేరుకొని పోవడం.


 *  అధికంగా గోంగూర వాడటం.


   మొదలైన వాటివల్ల గుండె జబ్బులు వస్తాయి.


   గుండె రోగులు పాటించవలసిన నియమాలు -


 *  ఎప్పుడు పాత బియ్యమే ఆహారంగా ఉపయోగించాలి. దంపుడు బియ్యమే శ్రేష్టం .


 *  మేక మాంసం , అడివి పక్షుల మాంసం , అడివి మృగాల మాంసం తో తయారైన మాంస రసాలు త్రాగవచ్చు. 


 *  అల్లం, ఉప్పు, కొద్ది కారం , కొద్దిగా యాలుక్కాయలు , లవంగాలు , దాల్చిన చెక్క, ఇవన్ని కలిపి నూరి ఆ మిశ్రమాన్ని మాంసం ముక్కలకు రాసి ఎండబెట్టాలి. ఎండిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆవునేయ్యిలో వేయించుకొని తినవచ్చు.


 *  పులుపు, వగరు రుచులు బాగా తగ్గించాలి.


 *  కందికట్టు, పెసరు కట్టు, ఉలవ కట్టు వాడవచ్చు.


 *  బీర, కాకర, క్యాబేజీ , టమాటో , లేత ముల్లంగి పొట్లకాయ , లేత అరటికాయ , పొన్నగంటి కూర , పెరుగుతోట కూర , మెంతి కూర , సొరకాయ , దోసకాయ తినాలి .


 *  మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు , బత్తాయి రసం ( కలకండ రసం కలిపింది.) నారింజ రసం , ద్రాక్ష రసం వాడవచ్చు.


 *  ఆవుపాలు, ఆవునెయ్యి , ఆవుమజ్జిగ , పాతబెల్లం , తేనె , ద్రాక్షారిష్ట, అర్జునారిష్ట , వెల్లుల్లి , అల్లం వాడవచ్చు. 


   గుండె రోగులు మానుకోవలసినవి   - 


 *  కొత్తబియ్యం అన్నం తినకూడదు .


 *  పెరుగు వాడరాదు . మజ్జిగ వాడవలెను.


 *  పులుపు, వగరు రుచులు బాగా తగ్గించాలి.


 *  ఎప్పుడు దాహం , వాంతి రాకుండా చూసుకోవాలి .


 *  మలమూత్రాలు ఎక్కువసేపు ఆపకుండా వచ్చినవెంటనే విసర్జించాలి.


 *  దగ్గు, తేన్పులు , అపానవాయువు వీటిని ఆపకూడదు .


 *  పుల్లలతో పండ్లు తోముకోకుడదు.


 *  పొగత్రాగటం పూర్తిగా మానుకోవాలి.


 *  మద్యం, గేదపాలు అసలు పనికిరావు.


 *  తాంబూలం వేసుకొకుడదు .


 *  ఆవకాయ తినడం అత్యంత ప్రమాదకరం .


       పైన చెప్పిన ఆకుకూరలు తప్ప మిగిలనవి బాగా తగ్గించడం శ్రేయష్కరం .


గుండె నొప్పి మరియు గుండెబలమునకు సిద్ధఔషధ యోగాలు  - 


 *  తమలపాకు జీర్ణాశయమునకు మరియు హృదయమునకు బలాన్ని కలిగించును. 


 *  మునగచెక్క రసము నందు కొంచం ఇంగువ చేర్చి ఇచ్చిన గుండెనొప్పి తగ్గును. 


 *  గులాబీల నుండి తయారుచేసిన పన్నీరు గుండెదడ , గుండెపోటు , ఆయాసములను తగ్గించును . 


 *  అంజూర పండ్ల రసమును రోజుకు ఒకసారి తీసుకున్నచో గుండెకి , ఊపిరితిత్తులకు బలాన్ని కలుగచేయును . 


 *  ద్రాక్షపండ్ల రసము గుండెకు , మూత్రపిండాలకు బలాన్ని కలుగచేయును . 


 *  ఒక ఔన్స్ సొంపు కషాయంలో రెండు చెంచాల పంచదార కలిపి రోజుకు రెండుసార్లు పుచ్చుకున్న ఛాతినొప్పి , ఉపిరి తీసుకునేప్పుడు నొప్పి , గుండెనొప్పి తగ్గును. 


 *  ఖర్జుర పండు గుండె , ఊపిరితిత్తులు , మూత్రపిండములు , లివర్ మొదలగు శరీరావయములకు మిక్కిలి ఉత్తేజాన్ని కలిగించి బలమును , పుష్టిని ఇచ్చును . 


 * ప్రతినిత్యం ఉదయాన్నే ఒక అంజూరపండు తినుచున్న గుండెదడ , ఆయాసం తగ్గును. 


మరిన్ని అనుభవపూర్వక, రహస్య ఆయుర్వేద ఔషధ యోగాలు గురించి మరింత వివరణాత్మక సమాచారం నా గ్రంధాల యందు వివరించాను. వాటిని క్షుణ్ణముగా చదవగలరు.


గమనిక  ~ 


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034