6, ఆగస్టు 2026, గురువారం

దీపారాధన

 🔔 *ఆరాధన* 🔔


_*దీపారాధన- పూజా సమయం నియమ నిబంధనలు ?*_


దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపారాధన చేయకుండా దేవతారాధన చేకూడదు. సాధారణంగా పూజసమయంలో రెండు దీపపు కుందెలు వాడాలి. ఒకటికూడా వాడవచ్చు. ప్రతి కుందెలో రెండేసి వత్తులు ఉండాలి. ప్రతిరోజూ కాలినవత్తులు, మిగిలిన నూనె తీసివేస్తూ ఉండాలి. కొంతమంది ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నూనె వాడాలని అనుకుంటారు. కానీ ఇది సరైనది కాదు. పూజామందిరంలో దీపారాధనకు ఒకేనూనెను వాడాలి. ఆవునెయ్యి అన్నింటికంటే శ్రేష్ఠమైనది. ఇది రోజూ వాడడానికి వీలుకాకపోవచ్చు. నువ్వులనూనె అందరు దేవుళ్ళకూ మంచిది. మంగళకరమైనది, ఆరోగ్యకరమైనది, వేరుశనగ, రిఫైన్డ్యిల్, డాల్డాల వంటివి దీపారాధనకు పనికి రావు. పూజ మధ్యాహ్నం లోపున భోజనానికి ముందు ఎప్పుడైనా చేయవచ్చు. ఉదయం వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పూజకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. సూర్యోదయంలోపు యోగాసనాలు, స్నానం, జపం, ధ్యానం, స్తోత్రపాఠం, సూర్యోదయంవేళ సంధ్య, ఆదిత్య హృదయంపటనం, సూర్యోదయం తర్వాత పూజ, నివేదన, మంగళహారతి ముగించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు తీర్థప్రసాదాలు ఇవ్వాలి.




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

సింహం – నక్కలు

 🦁 సింహం – నక్కలు : ఒక నీతి కథ


ఒక దట్టమైన అడవిలో ఒక మహాసింహం జీవిస్తూ ఉండేది. అదే అడవిలో కొన్ని నక్కలు కూడా ఉండేవి.


సింహం ప్రతిరోజూ వేటాడి తన ఆకలి తీర్చుకున్న తర్వాత మిగిలిన మాంసాన్ని అక్కడే వదిలేసేది. ఆ మిగిలిన ఆహారాన్ని నక్కలు తింటూ హాయిగా జీవించేవి.


కానీ వాటికి ఒక విషయం అర్థం కాలేదు.

తాము తింటున్న ఆహారం వెనుక సింహం శ్రమ ఉందనే విషయాన్ని అవి గుర్తించలేదు.


పైగా నక్కలు ఇలా అనుకునేవి:


“ఈ సింహం లేకపోతే ఎంత బాగుంటుంది! అడవిలో మనకు ఎదురే ఉండదు. ఈ ఆహారమంతా మనదే అవుతుంది.”


కాలం గడిచింది. ఒకరోజు ఆ మహాసింహం కాలగర్భంలో కలిసిపోయింది.


మొదట నక్కలు ఎంతో సంతోషించాయి.

“ఇక మనకు అడ్డెవరు?” అనుకున్నాయి.


కానీ కొద్ది రోజులకే అసలు విషయం అర్థమైంది.


సింహం లేదు...

వేట లేదు...

మిగిలిన మాంసమూ లేదు!


స్వయంగా వేటాడే శక్తి, సామర్థ్యం లేని నక్కలు ఆకలితో అలమటించసాగాయి.


అప్పుడు వాటికి జ్ఞానోదయమైంది:


“సింహం ఉన్నప్పుడు దాని గొప్పతనాన్ని గుర్తించలేకపోయాం. అది మనకు ప్రత్యక్షంగా ఆహారం పెట్టకపోయినా, దాని శ్రమ వల్లనే మన కడుపు నిండేది. సింహం పోవాలని కోరుకున్నాం; కానీ సింహంతోపాటే మన జీవనాధారం కూడా పోతుందని తెలుసుకోలేకపోయాం.”


🌿 నీతి


మన జీవితంలోనూ, సమాజంలోనూ కొన్ని గొప్ప వ్యక్తుల విలువ వారు ఉన్నప్పుడు మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. వారి నిర్ణయాలను విమర్శించడం, వారి స్థానాన్ని చూసి అసూయపడటం సులభం. కానీ వారు చేస్తున్న శ్రమ వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎంతోమంది జీవిస్తున్నారనే విషయం వారు లేనప్పుడే తెలిసివస్తుంది.


సింహాన్ని చూసి అసూయపడే ముందు,

ఆ సింహం చేసే వేటను కూడా చూడాలి.


స్థానం కనిపిస్తుంది...

కానీ ఆ స్థానం వెనుక ఉన్న శ్రమ కనిపించదు.


అందుకే—

ఉన్నప్పుడు విలువ తెలుసుకోవాలి;

లేనప్పుడు బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు.

శరీరంలో వాతపిత్తకఫాలను వృద్ధిచేసే ఆహారాలు

 శరీరంలో వాతపిత్తకఫాలను వృద్ధిచేసే ఆహారాలు     


          మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఆయా ఆహారాలు మనశరీరతత్వానికి అనుగుణంగా ఉన్నాయో లేవో చూసుకొని తీసుకున్నచో మనకి అనారోగ్య సమస్యలు దరిచేరవు . రోగం వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం కన్నా ఆ రోగం రావడానికి గల కారణాలు గుర్తించి సరైన జాగ్రత్తలు పాటించడం 

చాలా మంచిది .


           ఇప్పుడు నేను మీకు వివరించబోయే ఆహార విషయాలు ఆయా శరీరతత్వాల వారు పాటించి పడని ఆహారపదార్థాలుకు దూరంగా అయినా ఉండటం లేదా అతితక్కువ మోతాదులో ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వలన ఆనారోగ్యానికి గురికాకుండా ఉంటారు.


 * శరీరంలో వాతాన్ని కలిగించు ఆహారాలు -


      అతిగా వ్యాయామం చేయడం , అతిగా ఉపవాసాలు , ఎత్తు నుంచి దూకుట , కాళ్లు చేతులు విరుగుట, ధాతుక్షయం, రాత్రిజాగారం, మలమూత్రాలు బంధించుట లేదా బలవంతంగా విసర్జించుట, అతిగా వాంతులు మరియు విరేచనాల వలన, కషాయాలు మరియు చేదు వస్తువులను అతిగా వాడుట, అతిగా భాధపడుట, భయం , అతిగా ఏడవటం వంటివాటివలన సంధ్యాసమయాలలో, వర్షాకాలంలోనూ, భోజన ముందు సమయాలలోను వాతం వృద్ధిచెందును.


 * శరీరంలో పిత్తాన్ని కలిగించు పదార్థాలు -


        అతి పులుపు , అతికారం , ఉప్పు వంటి తీక్షణ పదార్థాలు తీసుకోవడం , అతిగా కోపగించుకొనుట, ఎండలో ఎక్కువ తిరుగుట, నువ్వులు , పెరుగు , తరవాణి వంటివాటిని అతిగా సేవించుట వలన , మద్యసేవన వలన , అన్నం జీర్ణం అయ్యే సమయంలోను ,శరత్,గ్రీష్మ ఋతువుల్లోనూ , మధ్యాన్న , మధ్యరాత్రి సమయాల్లోనూ శరీరంలో పిత్తం వృద్ది చెందును .


 * శరీరంలో కఫం వృద్ధి కలిగించు పదార్దాలు -


          చిక్కని మధుర పదార్దాలు అతిగా సేవించుట , పెరుగు , బెల్లం, వెన్న, నెయ్యితో చేయబడిన మధురపదార్ధాల వలన , పగటినిద్ర వలన, హేమంత, వసంత ఋతువులలోను , భోజనం అయినవెంటనే పగలు , రాత్రుల ప్రారంభ సమయాలలో కఫవృద్ధి జరుగును.


     ఇప్పుడు శరీరంలో వాత,పిత్త,కఫాన్ని తగ్గించు ఆహారవిహారాల గురించి తెలియచేస్తాను .


 * శరీరంలో వాతాన్ని తగ్గించు ఆహారవిహారాలు -


        తియ్యని,పుల్లని , లవణ రసాలు కలిగిన మృదువు కలిగి ఉండి కొంచం ఉష్ణం కలిగించు ఆహారపదార్థాలు .


 * శరీరంలో పిత్తాన్ని తగ్గించు ఆహారవిహారాలు -


         కషాయ , చేదు రుచులు కలిగిన చల్లని మధురమైన మృదువు, సాంద్రత కలిగిన ఆహారవిహారాలు .


 * శరీరంలో కఫాన్ని తగ్గించు ఆహారవిహారాలు -


          వగరు,కారం,చేదు కలిగిన ఆహార పానీయాలు , తీక్షణత, వేడి కలిగిన ఆహారవిహారాలు కఫాన్ని నాశనం చేస్తాయి.


         కావున పైన చెప్పినవిధంగా ఆయా దోషాలు కలిగినవారు వాటికి తగ్గ ఆహారపదార్థాలు సేవించడం , విడిచిపెట్టడం ద్వారా మీయొక్క ఆరోగ్యాలు కాపాడుకొనవలెను .


  

         

  

 

గురువారం, ఆగష్టు 6, 2026

 🕉️🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏🕉️

గురువారం, ఆగష్టు 6, 2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం      

దక్షిణాయనం- గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం - బహుళ పక్షం

తిథి : *అష్టమి* మ3.46 వరకు

వారం : *గురువారం* (బృహస్పతి వాసరే)

నక్షత్రం : *భరణి* సా6.17 వరకు

యోగం : *గండం* మ2.08 వరకు

కరణం : *కౌలువ* మ3.46 వరకు

తదుపరి *తైతుల* రా2.41 వరకు

వర్జ్యం : *ఉ.శే.వ 6.06 వరకు*

మరల *తె.వ.5.35 నుండి*

దుర్ముహూర్తము : *ఉ9.58 - 10.48*

మరల *మ3.04 - 3.55*

అమృతకాలం : *మ1.43 - 3.14*

రాహుకాలం : *మ1.30 - 3.00* 

యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30*

సూర్యరాశి: కర్కాటకం || చంద్రరాశి: మేషం 

సూర్యోదయం: 5.43 

సూర్యాస్తమయం: 6.29 

సర్వేజనా సుఖినో భవంతు 

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

*************************************************************************************

🙏ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹