27, డిసెంబర్ 2024, శుక్రవారం

*స్త్రీ జన్మ.

 2812d5.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



                  *స్త్రీ జన్మ....??*

                  ➖➖➖✍️


ధర్మరాజుకొక ధర్మసందేహం వచ్చింది. ‘స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం వుంటుంది’ అని. 

ఇదే విషయం భీష్ముడిని అడిగాడు.


దానికి భీష్ముడు నవ్వి “నీకొక కథ చెబుతాను. అందులో 

 సమాధానం దొరకవచ్చు” అని చెప్పడం ప్రారంభించాడు…


పూర్వము భంగస్వనుడు అనే రాజు వుండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్య సంధుడు. ప్రజలను కన్న బిడ్డల కన్న మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు  సంతానము కలుగ లేదు. 


‘అపుత్రస్య గతిర్నాస్తి’ట అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడయినా లేడే అనే బాధతో  అగ్ని దేవుడిని ప్రార్ధించి అగ్నిస్తుత యజ్ఞం చేసాడు. అగ్ని దేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు.


విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజయిన తన అనుమతి లేకుండా భంగస్వనుడు యజ్ఞము చేసి నూరుగురు కుమారులను కన్నందుకు  ఆగ్రహం తెప్పించింది. 


అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలనుకున్నాడు. తగిన సమయం కోసం వేచివున్నాడు.


 ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్లాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేసాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది. 


ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది. 

వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. స్పటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు.


మునిగి పైకి లేచే సరికి ఆ రాజు  ఆశ్చర్య కరంగా స్త్రీ గా మారిపోయాడు. అయాచితం గా ప్రాప్తించిన స్త్రీత్వానికి  చాలా చింతించాడు. 


“ఈ రూపముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లలకు, పుర జనులకు ఎలా ముఖము చూపించగలను !? " అని విచారించి...


“అయినా ఇలా అడవిలో ఉండలేను కదా !" అనుకుని చివరకురాజధానికి వెళ్ళాడు.

      

ఓ5మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కొడుక్కి రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించ సాగాడు.


కాలక్రమంలో, ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి  మోహించి వివాహమాడారు.  స్త్రీగా ఆ మునివలన అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు.


వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో....

        

"కుమారులారా ! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము  కుమారులుగా పొందాను. స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను. కనుక వీరు కూడా  మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి" అంది. 


స్త్రీ గా మారినా ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృ వాక్య పాలకులుగా తండ్రిమాట పాటించి వారు రాజ్యాన్ని

పంచుకుని పాలించసాగారు.


ఇది చూసిన ఇంద్రుడు ‘నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది

అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య బేధము కల్పించాలని’ సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి.... "రాజకుమారులారా ! ఏమిటీ వెర్రి ఎవరో ఎవరినో తీసుకు వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా!? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు?" అని వారిలో కలతలు రేపాడు. 


అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నపుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేని పోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు. 


అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చని పోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగింది.


ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రహ్మణ రూపుడై...“అమ్మా నీవు ఎవరవు?ఎందుకిలా రోదిస్తున్నావు?" అని అడిగాడు. 


అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడము కుమారులను కనడము అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము మునిద్వారా కుమారులను కనడము పూసగ్రుచ్చినట్లు చెప్పింది. 


అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై .. "రాజా ! నేను ఇంద్రుడను. నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను" అని చెప్పాడు. 


దానికి  ఆమె "దేవా ! అజ్ఞానంతో

తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు అధిపతి వైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వ్యక్తినా ! కనుక నన్ను దయతో రక్షించు" అని వేడుకోగా....


ఆ మాటలకు కరిగి పోయిన ఇంద్రుడు "రాజా ! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రుల నైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను ఎవరు కావాలో నీవే ఎంచుకో " అన్నాడు.


ఆమె (భంగస్వనుడు) సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది.


 "అదేమిటి రాజా ! మిగిలిన వారు నీ కుమారులు కాదా !?" అని అడిగాడు. 


భంగస్వనుడు "వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా !” అని చెప్పింది. 


ఇంద్రుడు సంతోషంతో  "రాజా ! నీ సత్యనిష్టకు సంతోషించాను. నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను" అని... “రాజా ! నీకు ఇంకొక వరము ఇస్తాను నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగిఇస్తాను"  అన్నా దానికి ఆమె "మహేంద్రా ! నా కుమారులను బ్రతికించావు అదే చాలు స్త్రీగానే ఉంటాను" అంది. 


ఇంద్రుడు ఆశ్చర్యంతో  "అదేమిటి రాజా ! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి ? " అని అడిగాడు. 


స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గు పడి  "మహేంద్రా ! నేను స్త్రీగా ఉండడంలో ఆనంద పడుతున్నాను. ఇందులో వున్న తృప్తి నాకు పుంసత్వములో కనబడలేదు కనుక ఇలాగే ఉండి పోతాను" అంది.


దేవేంద్రుడు నవ్వి “అలాగే అగుగాక”అని ఆశీర్వదించాడు.

అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు.. “యుధిష్టిరా! ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం !” అని అడిగాడు.


స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమయిన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు.  

“ఒకతెకు జగములు వణకున్ అగడితమై

ఇద్దరు కూడిన అంబులు ఇగురున్।  ఓముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరాపట్టపగలె చుక్కలు రాలున్ ..!”


[ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. 

అంటే స్త్రీ చాలా శక్తివంతురాలని భావము]✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


నేను

 _కన్నతల్లి కడుపులోంచి బయట పడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే  'నేను '_* 


*_ఈ 'నేను ' ప్రాణశక్తి అయిన "ఊపిరి "కి మారుపేరు. ఊపిరి ఉన్నంతదాకా 'నేను' అనే భావన కొనసాగుతూనే ఉంటుంది._* 


*_జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ 'నేను 'ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలు చేస్తుంది. ఈ 'నేను ' లోంచే 'నాది ' అనే భావన పుడుతుంది.!_* 


*_ఈ 'నాది 'లోంచి నావాళ్ళు, నాభార్య, నాపిల్లలు, నాకుటుంబం, నాఆస్తి, నాప్రతిభ, నాప్రజ్ఞ, నాగొప్ప... అనేవీ పుట్టుకొచ్చి..._*


*_చివరికి ఈ 'నేను ' అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి, ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి 'అహం 'గా ప్రజ్వరిల్లుతుంది._* 


*_'అహం ' అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ 'నేను '  నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలు పలుకుతుంది._* 


*_పంతాలతో, పట్టింపులతో, పగలతో, ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతుంది._* 


*_బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన 'నేను ' అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది._* 


*_వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది. మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది._* 


*_సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన 'నేను ' చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది._* 


*_కడసారి చూపుల కోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది. మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంని విముక్తి కలుగుతుంది._* 


*_మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది._* 


*_'నేనే ' శాసన కర్తను, 'నేనే ' ఈ భూమండలానికి అధిపతిని, 'నేనే ' జగజ్జేతను అని మహోన్నతంగా భావించిన 'నేను ' లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. రోజు మారుతుంది._* 


*_ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన 'నేను ' కథ అలా... సమాప్తమవుతుంది._* 


*_అందుకే ఊపిరి ఆగకముందే 'నేను ' గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత._* 


*_చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది 'శ్మశానవైరాగ్యం ' మాత్రమే. అది శాశ్వతం కానే కాదు._* 


*_'నేను ' గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన వైరాగ్యస్థితి సాధ్యమవుతుంది._* 


*_'వైరాగ్యం ' అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. దేనిమీద మోహాన్ని కలిగి ఉండకపోవడం. తామరాకు మీద నీటి బొట్టులా జీవించగలగడం..._* 


*_స్వర్గనరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి. మనిషికి, ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే నరకం._* 


*_అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమ్ స్వర్గం._* 


*_ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం. నిజాయతీగా, నిస్వార్థంగా, సద్వర్తనతో, సచ్ఛీలతతో భగవత్‌ ధ్యానంతో జీవించమనేదే వేదాంతసారం._* 


*_అహం బ్రహ్మాస్మి అంటే 'అన్నీ నేనే ' అనే స్థితి నుంచి 'త్వమేవాహమ్‌ ' అంటే, 'నువ్వేనేను ' అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్యస్థితిని చేరుకోగలిగితేనే మానవజన్మకు సార్థకత మరియు ఆ తండ్రి పరమాత్మ పాదాలచెంత కాసింత చోటుకు మార్గం.☝️_*

తెలుగు లో తప్పక చదువవలసిన కొన్ని #పుస్తకాలు

 

#తెలుగు లో తప్పక చదువవలసిన కొన్ని #పుస్తకాలు

వ్యాసకర్త - పి.టి.ఎస్.కె రాజన్ గారు 

(Rajan Ptsk)


#లోకోభిన్నరుచిః” అన్నారు కదా మన పెద్దలు. కనుక, ఏవో కొన్ని పుస్తకాలను ఉదహరిస్తూ, ఇంతకు మించిన ఉత్తమ సాహిత్యం లేదు అని చెప్పడం వివేకమనిపించుకోదు. కానీ, మనం చదివిన పుస్తకాలలో గొప్పగా అనిపించిన వాటికోసం మాత్రం, బలంగా బల్లగుద్ది గట్టిగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే పుస్తకాలు అటువంటి వాటిలో కొన్ని. 

 

“మంచినీళ్ళు త్రాగుతారా అనకూడదు, పుచ్చుకుంటారా అనాలి” వంటి మన తెలుగువారి భాష, అలవాట్ల గురించి తెలుసుకోవాలన్నా, వడ్లగింజలు, కలుపు మెక్కలు, మార్గదర్శి వంటి అద్భుతమైన కథలను మనకు అందించిన ఓ అసలు సిసలు తెలుగు రచయిత జీవితాన్ని చూడాలన్నా, అచ్చ తెలుగు అందాలను చదివి ఆనందించాలన్నా... శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆత్మకథ… “అనుభవాలూ - జ్ఞాపకాలూనూ” చదవాలి.

 

తెలుగుభాషకు చెప్పలేనంత సేవ చేసి కూడా, ఏమాత్రం ప్రచారం ఆశించని మహానుభావుడొకాయన ఉన్నారు. అసాధారణ పాండిత్యం, అబ్బురపరిచే రచనా సామర్ధ్యం ఉన్నా అత్యంత వినయసంపన్నుడుగా మెలగిన సాహితీమూర్తి ఆయన. ఏ పుస్తకానికైనా ముందుమాట రాయాల్సి వస్తే... వినయం ఉట్టి పడేలా “మనవి మాటలు” అని శీర్షిక పెట్టేవారు. ఆ పరిచయ వాక్యాల చివరిలో “భాషా సేవకుడు” అని మాత్రమే తనని తాను సంబోధించుకునేవారు. ఉత్తమ స్థాయి పాత్రికేయునిగా వాసికెక్కిన ఆ తిరుమల రామచంద్రగారి ఆత్మకథే “హంపీ నుంచి హరప్పా దాకా”. గత శతాబ్దంలో వచ్చిన ఆత్మకథలలో అత్యున్నతమైనదిగా పరిగణింపబడే ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి. 

 

ఈ శతాబ్దంలో జీవించిన వారిలో “మహాత్మా గాంధీయే అత్యున్నతుడు” అని యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 1999 లో ఒక మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో గాంధీగారిపై తన ఆరాధనా భావాన్ని చాటుకున్నాడు. విఖ్యాత రచయిత “జార్జ్ బెర్నార్డ్ షా” గాంధీతో పోల్చడానికి హిమాలయా పర్వతం ఒకటే సరిపోతుందన్నాడు. “దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య సాధనలో గాంధీజీ ఆదర్శాలకీ భాగముంద”ని నెల్సన్ మండేలా ఆ మహాత్మునకు నమస్కరించాడు. దలైలామా, అంగ్ సాన్ సూకీ, మార్టిన్ టూథర్ కింగ్‌లకు ఆయనే స్ఫూర్తి. 

వకీలు అయ్యుండి కోర్టు హాలులో మాట్లాడలేక నాలుక పిడచకట్టుకుపోతుంటే, చుట్టూ ఉన్నవారు నవ్వుతుంటే తల దించుకున్న ఒక సాధారణ మనిషాయన. ఆ తరువాత కాలంలో ఆయన నోటి వెంట మాట రావడమే ఆలస్యం 30 కోట్లమంది మారుమాట్లాడక ఆ మాటను అనుసరించే స్థాయికి చేరుకున్నాడు. ఆ గాంధీ మహాత్ముని జీవితంలో మూడొంతులు భాగం తెలుసుకోవాలంటే ఆయన ఆత్మకథ “సత్యశోధన” చదవాలి.

 

“తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి”, “ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చింది”, “డామిట్ కథ అడ్డం తిరిగింది” ఇలా తెలుగువారి నోళ్ళలో నానే ఎన్నో నానుడులకు వెనకనున్న కథాకమామిషులను, గిరీశం లెక్చర్లు, మధురవాణి నవ్వు, రామప్ప పంతులు కోతలు, ఆడవేషంలో చుట్టకాల్చే శిష్యుడు, చీపిరికట్ట తిరగేసి కొట్టే పూటకూళ్ళమ్మ, సజ్జనుడైన సౌజన్యారావు పంతులు గారు, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష ” అనే అగ్నిహోత్రావధాన్లు ఇలా అందరినీ, అన్నిటినీ ఒక చుట్టు చుట్టి రావాలంటే “కన్యాశుల్కం” నాటకాన్ని చదవాలి.

 

ఒక చిన్న తండా నాయకుని కొడుకు జగజ్జేతగా మారిన వైనాన్నీ, ఆ జగజ్జేత జీవితాన్నీ, మనస్సుని తెలుసుకోవాలంటే తెన్నేటి సూరి గారి “చెంఘీజ్ ఖాన్” నవల చదవాలి.

 

తెలుగువారి మహాభారతంగా కీర్తించబడేది, కవిసమ్రాట్ విశ్వనాథ వారి మహోన్నత సృష్టి, అరుంధతీ ధర్మారావుల జీవితం చుట్టూ అల్లిన మనిషి చరిత్ర, ముళ్ళపూడి వెంకటరమణ గారు “నా తల్లీ, తండ్రీ గురువు దైవం ఈ పుస్తకమే” అని చెప్పుకున్న “వేయిపడగలు”ను తెలుగు వచ్చినవారంతా చదవాలి. ఆ మాటకొస్తే విశ్వనాథ వారి ప్రతీ పుస్తకాన్నీ తెలుగువాడన్న ప్రతీవాడూ వదలకుండా చదవాలి.

 

ఎక్కడికో మండుటెండలో వెళ్ళాల్సిన పనిబడితే, బస్సు ప్రయాణానికి డబ్బుల్లేక, ఆ ఎండ బాధ తెలియకుండా ఉండటానికి పుస్తకం చదువుకుంటూ నడిచిన ఘట్టాన్ని... ”నాకు అలవాటైన 11వ నెంబరు బస్సెక్కాను”, “ఎర్రని ఎండలో 58 పేజీలు నడిచాను” అంటూ సరదా మాటలతో నడిపించిన వారు ముళ్ళపూడి వారు. విషాదకరమైన విషయం చెబుతున్నా, చదివేవారిని బాధపడనివ్వకుండా దానికి హాస్యపు ముసుగు కప్పేస్తాడాయన. కొన్ని వందల సరదా విసుర్లు, సినిమా కబుర్లు కలగలసిన రచనే... ఆయన బాపూ గారితో కలిసి ఆడిన “కోతికొమ్మచ్చి”. ఈ పుస్తకం మూడు భాగాలనూ చదవాలి.


రెండు జెడల సీత... ఒక జడ ముందుకి, ఇంకొక జడ వెనక్కీ వేసుకుని నడుస్తుంటే... తను వెళుతుందో, వస్తుందో తెలియడం లేదంటాడు బుడుగు. ఇక జాటర్ ఢమాల్, పక్కింటి లావుపాటి పిన్నిగారు, సీగానపెసూనాంబా, రాచ్చసుడూ పదమూడో ఎక్కం ఇలా ఒకటని చెప్పడానికి లేదు, పుస్తకం నిండా నవ్వులే. ముళ్ళపూడి వారి మాటలు, బాపూ గారి గీతలు కలిపి తెలుగు హాస్య సాహిత్యంలో త్రివిక్రముడంతగా ఎదిగిన రచన బుడుగు. 


రాజు మరణించె నొక తార రాలిపోయె

కవియు మరణించె నొక తార గగన మెక్కె

రాజు జీవించె రాతివిగ్రహము లందు

సుకవి జీవించె ప్రజల నాలుకల యందు సురేష్ కుమార్ రెడ్డి, [Dec 25, 2024 at 5:28 AM]

అంటూ ఈ భూమి మీద ఉన్న సుకవులందరికీ తన ఒక్క పద్యంతో వెలకట్టలేని గౌరవాన్ని, శాశ్వతమైన కీర్తిని కట్టబెట్టిన “నవయుగ కవిచక్రవర్తి” శ్రీ గుఱ్ఱం జాషువా గారు. 


నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క

గడన సేయుట కాశపడను నేను 

ఆలు బిడ్డలకునై యాస్తి పాస్తులు గూర్ప

పెడత్రోవలో పాదమిడను నేను

నేనాచరింపని నీతులు బోధించి

రానిరాగము తీయలేను నేను

సంసార యాత్రకు చాలినంతకు మించి

గ్రుడ్డి గవ్వయు కోరుకొనను నేను

 “కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి

పంజరాన గట్టు వడను నేను

నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు

తరుగు లేదు విశ్వనరుడ నేను” 

అంటూ తానొక విశ్వనరుడనని ఎలుగెత్తి చాటారు జాషువా గారు. ఈ కవికోకిల కవితా విశ్వరూపం చూడాలంటే వారి సర్వలభ్యరచనలు ఒక్క పుస్తకంలో దొరికే సంకలనాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కోవాలి.

 

“అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల…” అంటూ ఉమర్ ఖయ్యాం రుబాయితులను తేనెతో కలిపి తెలుగువారితో త్రాగించిన మరో కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారు. వారి “పానశాల”లో పద్యాలను మనం కూడా తాగి మత్తెక్కిపోవాలి.

 

ఏ దేశచరిత్ర చూచినా

ఏమున్నది గర్వకారణం

నరజాతి చరిత్ర సమస్తం

పరపీడన పరాయణత్వం

 

ప్రపంచ మొక పద్మవ్యూహం!

కవిత్వ మొక తీరని దాహం!

 

నిప్పులు చిమ్ముకుంటూ

నింగికి నే నెగిరిపోతే,

నిబిడాశ్చర్యంతో వీరు-

 

నెత్తురు కక్కుకుంటూ

నేలకు నే రాలిపోతే

నిర్దాక్షిణ్యంగా వీరే...

 

నేను సైతం

ప్రపంచాగ్నికి

సమిధనొక్కటి ఆహుతిచ్చాను!

 

నేను సైతం

విశ్వవృష్టికి

అశ్రువొక్కటి ధారపోశాను!

 

నేనొక దుర్గం!

నాదొక స్వర్గం!

అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం!

ఇలా ఒకటా రెండా ఆ పుస్తకం నిండా మహోత్కృష్టమైన కవితలే. ఎందరో కవులను పుట్టించిన ఆ మహాకవి శ్రీశ్రీ గారి పుస్తకం… మహాప్రస్థానాన్ని చదివి తీరాలి.

 

హిందూమతాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఏ సందేహాలున్నా అవన్నీ పటాపంచలు అయిపోవడానికీ, ఇక ఇంతకుమించిన ప్రామాణికమైన బోధలు లేవని పూర్తి విశ్వాసం కలిగించగల కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వాముల వారి “జగద్గురు బోధలు” పది పుస్తకాల సెట్టును పట్టుకునే ఇంటికి వెళ్ళాలి. అసలు వేదములలో ఏముంది. వేదాంగములంటే ఏమిటి? ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి. ఇవన్నీ సంక్షిప్తంగా సాధికారికంగా తెలుసుకోవాలంటే పరమాచార్య గారి ఉపన్యాసాల సంకలనం వేదములు చదవాలి.

 

ఒక ఆంగ్లేయుడు సత్యాన్వేషణ కోసం చేసిన పయనాన్ని, చివరికి తన గమ్యమైన అరుణాచలాన్ని చేరుకున్న వైనాన్నీ తెలుసుకోవాలంటే పాల్ బ్రంటన్ రచనకు తెలుగుసేత అయిన “రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ”ను తప్పక చదవాలి.

 

సంఘజీవన విధానం మీద, మన అలవాట్ల మీద సెటైర్ ఎలా వెయ్యాలో తెలుసుకోవాలన్నా, సరదా కథనంతో వెళుతూనే చెంపలు ఛెళ్ళుమనిపించే చమక్కులు కురిపించాలన్నా, ఆ జంఘాలశాస్త్రిని పుట్టించిన పానుగంటి లక్ష్మీనరసింహరావు గారి “సాక్షి” వ్యాసాలను మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి.

 

రెండేళ్ళుగా వర్షాలు లేక తిరుమలలో నీటికి కటకట ఏర్పడితే… వరుణ యాగం చేసి కుండపోత వర్షం కురిపించిన పద్మభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి గురించీ, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థను ఓ IAS అధికారి పట్టాలెక్కించిన విధానం గురించీ, అపర చాణక్యుడిగా పేరుగాంచిన పి.వి. నరసింహారావు మనస్తత్వం గురించీ, తెలుగు వారి ఆరాధ్య కథా, ప్రజా నాయకుడు ఎన్టీయార్ పరిపాలనా విధానాల గురించీ, ఇలా ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే ఇంకెన్నో విషయాలున్న పి.వి.ఆర్.కె ప్రసాద్ గారి “నాహం కర్తా, హరిః కర్తా”, “అసలేం జరిగిందంటే” పుస్తకాలు కనబడగానే కొనేసుకోవాలి.

 

ఇంకా…

ఆది శంకరుల నుండి జిడ్డు కృష్ణమూర్తి వరకూ ఉన్న భారతీయ తత్వవేత్తల గురించి, కార్ల్‌మార్క్, ఫ్రెడరిక్ నీషే, ఆర్ధర్ షోపనార్ వంటి పాశ్చాత్య తత్వవేత్తల గురించి, వాళ్ళ తత్వసారాల గురించి సులభంగా తెలుసుకోవాలంటే త్రిపురనేని గోపీచంద్ “తత్వవేత్తలు” పుస్తకాన్ని చదవాలి.

 

భగవద్గీత చదవాలి అనుకునే వారికి అమృత తుల్యమయినది, ప్రతిపదార్థ, తాత్పర్య, వ్యాఖ్యలతో కూడినది అయిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానంద స్వాములవారి “గీతామకరంద” గ్రంథాన్ని పారాయణ చేయాలి.

 

కృష్ణలో మునకలేస్తూ, కాస్త ఆశ్చర్యం, ఇంకాస్త ఆనందంతో అమరావతి పట్నంలో తిరుగుతున్న అనుభూతి కావాలంటే, సత్యం శంకరమంచి గారి “అమరావతి కథలు”ను తోడు తీసుకెళ్ళాలి,

 

ఆధ్యాత్మిక భావనలు ఉన్నవారెవరికైనా సరే, ఉన్నత స్థాయి ఆనందాన్ని కలిగించే ఉత్తమ స్థాయి పుస్తకం... పరమహంస యోగానంద గారి “ఒక యోగి ఆత్మకథ”. మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, యుక్తేశ్వర్ గిరి వంటి యోగి పుంగవుల గురించి, మరెందరో మహిమాన్వితుల యోగ సాధనల గురించి మనకు తెలియజేసే ఆధ్యాత్మిక ఆత్మకథ ఈ “ఒక యోగి ఆత్మకథ”.

 

కథలు రాయాలి అనే కోరిక ఉన్నవాళ్ళు, కథ రాయడానికి ఏమేం సరంజామా కావాలో తెలుసుకోవాలనుకునేవాళ్ళు, భారతీయ పాశ్చాత్య కథకుల కథన రీతుల వివరాలు గ్రహించాలనుకునేవాళ్ళు కచ్చితంగా చదవవలసిన పుస్తకం వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి “కథాశిల్పం”. సురేష్ కుమార్ రెడ్డి, [Dec 25, 2024 at 5:28 AM]

“రచన అన్నది అరటిపండులా ఒలిచి చదువరి చేతుల్లో పెడితే అతని మెదడుకు పనే ఉండదు. అందులో కవిత్వమూ ఉండదు. అతడు కాసేపు ఆలోచించి అర్థం చేసుకోవడమే మంచిది” అని సముద్రాల గారితో మల్లాది వారన్నారట, ఒకానొక సందర్భంలో. మల్లాది వారి రచనలన్నింటిలోనూ ఇదే అంతస్సూత్రంగా ఉన్నట్టు ఉంటుంది. 80 యేళ్ళ క్రితమే పేరొందిన అన్ని పత్రికలలో వారి రచనలు, వ్యాసాలు అచ్చయ్యేవి. స్వయానా సరస్వతీదేవే కొన్ని విషయాల మీద మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ వ్యాసాలు చదువుతుంటే. నా కవి మిత్రులు, మన కథకులు, చలవ మిరియాలు మొదలైన శీర్షికలతో వారు వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తక రూపమే... “చలవ మిరియాలు”.

 

మాయాబజార్, మిస్సమ్మ, పాతాళభైరవి ఇలా తెలుగులో ఎన్నటికీ నిలచిపోయే చిత్రాలకు మాటలు పాటలూ రాసినవారు, గుండమ్మకథ, అప్పు చేసి పప్పుకూడు వంటి సినిమాలకు గీతకర్త పింగళి నాగేంద్రరావు గారు. వారు సినిమాలలోకి రాక పూర్వం నాటక రచన కూడా చేశారు. అందులో తొమ్మిది నాటకాలు రెండు సంపుటాలుగా వచ్చాయి. 

“తెలుగు వారల మాట 

భళియనగ చెల్లాలి

తెలుగుజెండా గగన 

గగనాల యెగరాలి

తెలుగుతల్లీ నీకు జోహార్

 

తెలుగువారల కీర్తి

తళతళల మెరవాలి

తెలుగువారే దేశదేశల నేలాలి

తెలుగుతల్లీ నీకు జోహార్”

 

అని పింగళివారు తను రాసిన నారాజు అనే నాటకంలో ఒక పాత్రచేత చెప్పిస్తారు. తన మాతృ భాషమీద మమకారాన్ని చాటుకుంటారు.

 

తెలుగు సినీ కవిసార్వభౌముడైన వేటూరి సుందరరామమూర్తి గారు సినిమారంగంలోకి రాకపూర్వం చేసిన రచన సిరికాకొలను చిన్నది అనే సంగీత రూపకం. సుమారు యాభై ఏళ్ళ క్రితం ఆకాశవాణిలో ప్రసారమయ్యి శ్రోతలను విపరీతంగా ఆనందపరచిన ఈ వేటూరి రచన తరువాత కాలంలో పుస్తకంగా అచ్చయ్యింది. అలానే ఎందరో సినీ ప్రముఖుల గురించి వేటూరిగారు హాసంపత్రికలో వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తకరూపం కొమ్మకొమ్మకో సన్నాయి. ఈ రెండూ చదివితే కవిత్వంతో ఈ వేటూరి ఎంత ఎత్తుకు వెళ్ళాడో వచనంలోనూ అంతెత్తుకు వెళ్ళాడన్న విషయం అర్థమవుతుంది.

 

కవి అంటే కృష్ణశాస్త్రేనేమో అన్నంతగా తెలుగువారిని సమ్మోహ పరచిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. 

 “సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?

చంద్రికల నేల వెదజల్లు చందమామ?

ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?” 

 

“నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు - నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?” వంటి ఆయన కవిత్వ పంక్తులు నోటికి రాని నిరక్షరాస్యులు కూడా ఆరోజులలో ఉండేవారు కారట. ఆయన కవితా సంపుటులన్నీ కొనుక్కొని చదువుకొవాలి. కుదరని పక్షంలో కనీసం కృష్ణపక్షం అయినా చదువుకోవాలి,

 

తెలుగులో హాస్యం అంటే గుర్తుకువచ్చే మొదటి పేరు భమిడిపాటి కామేశ్వరరావు గారిది. మన వేష భాషల మీద, అలవాట్ల మీద, మనస్తత్వం మీద వారు వేసినన్ని హాస్యోక్తులు మరే హాస్య రచయితకూ సాధ్య పడలేదు. ‘‘మన లిపిలోనే మన అనైక్యత తెలుస్తుంది. క-చ-ట-త-ప ఈ అక్షరాలు చూడండి. విడివిడిగా దేని తలకట్టు దానిదే. హిందీలో అయితే ఈ అక్షరాలకు పైన ఓ గీత పెట్టి కలుపుతారు. మనం? అబ్బే! కచట తపల గాళ్లం. మన అక్షరాల్లాగా ఎవడి పిలక వాడిదే. ఇంకోడితో కలిసే ప్రసక్తే లేదు.’’ ఇలా సాగుతుంది వారి వరస. అన్నీ తగాదాలే, మన తెలుగు, లోకో భిన్న రుచిః మొదలైన పుస్తకాలు చదువుతున్నంత సేపూ పెదాలు విచ్చుకునే ఉంటాయి.  

 

చందమామ పత్రికకు సంపాదకునిగా దశాబ్దాల పాటూ పనిచేసి ఈనాటి ఎందరో సాహితీకారులకు పరోక్షంగా ప్రేరణగా నిలచినవారు... కొడవటిగంటి కుటుంబరావు గారు. సమాజం గురించి తెలుసుకోవాలంటే కుటుంబరావు గారి కథలు, నవలలు చదవాలి. సాహిత్యం కోసం తెలుసుకోవాలంటే వారి సాహిత్య వ్యాసాలు చదవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కొడవటిగంటి కుటుంబరావు గారి పుస్తకాలన్నీ చదవాలి.

 

కవిగా ఆరుద్రని అందరికీ చేరువ చేసిన రచన “త్వమేవా౽హమ్”. 1948లో రజాకార్లచే చెరచబడ్డ స్త్రీకథనం కృష్ణాపత్రికలో చదివి “త్వమేవాహం” మొదలుపెట్టారు ఆరుద్ర. ఈ కావ్యం చదివిన శ్రీశ్రీ “ఇక నే పద్యాలు రాయనవసరంలేదు” అని ప్రశంసించారు ఆరుద్రని. 

“నువ్వు ఎక్కదలచుకొన్న రైలు

ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు” అనే ప్రసిద్ధ కవితా వాక్యం ఈ పుస్తకంలోనిదే.

 

చలంగారి హృదయం తెలుసున్నవాళ్ళకి, ఆయన ఆరాటం దేనిగురించో ఎరిగున్నవాళ్ళకే చలం రచనలు అర్థమవుతాయి. స్త్రీ స్వేచ్ఛ కోసం పరితపించినవాడు చలం. తన మైదానం నవలతో తెలుగునేలపై ఒక పెద్ద అలజడి సృష్టించిన రచయిత ఇతను. ఈయన పుస్తకాలన్నీ చదువవలసినవే అయినా, ప్రేమలేఖలు మాత్రం ముందుగా చదవవలసిన పుస్తకం.

 

నేను పుట్టకముందే 

నెత్తిమీద నీలితెర

కాళ్ళకింద ధూళిపొర

ఇవి తెలుగువారిని రెండో మారు జ్ఞానపీఠం ఎక్కించిన విశ్వంభర కావ్యానికి ఆరంభాక్షరాలు.

మానవుడే నాయకునిగా, విశాల విశ్వంభరే రంగస్థలంగా, ప్రకృతి నేపథ్యంగా, తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యంలేని మనిషి కథకు వచన కవితారూపమే ఈ విశ్వంభర అని కృతికర్త నారాయణ రెడ్డి గారు కవితా వస్తువేమిటో చెప్పుకొచ్చారు. సురేష్ కుమార్ రెడ్డి, [Dec 25, 2024 at 5:28 AM]

మూడోమారు తెలుగువారికి జ్ఞానపీఠం తీసుకువచ్చిన వారు రావూరి భరద్వాజ గారు. మంగమ్మ అనే నాటకాల కంపెనీలో పనిచేసే స్త్రీ తన తెలివి తేటలతో, అందచందాలతో తెలుగు సినిమా పరిశ్రమలో మంజరి అనే ప్రఖ్యాత కథానాయకురాలిగా ఎదిగి, తిరిగి అథః పాతాళానికి పడిపోయిన కథే... పాకుడు రాళ్ళు.

 

పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై

పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి

కలికి వెన్నెల లూరు చలువ దోసిళ్ళతో

లతలకు మారాకు లతికి యతికి

పూల కంచాలలో రోలంబములకు రే

పటి భోజనము సిద్ధ పరచి పరచి

తెలవారకుండ మొగ్గలలోన జొరబడి

వింత వింతల రంగు వేసి వేసి

తీరికే లేని విశ్వ సంసారమందు

అలసి పోయితివేమొ దేవాధిదేవ!

ఒక నిమేషమ్ము కన్నుమూయుదువు గాని

రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు!!

 అంటూ సృష్టికార్యంలో అలసిపోయావా స్వామీ అంటూ భగవంతుడి మీదే కరుణ చూపించిన కవి కరుణశ్రీ గారు. 

“ఊలుదారాలతో గొంతు కురి బిగించి

గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి

ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము

అకట! దయలేనివారు మీ యాడువారు.” అంటూ విలపించే పువ్వుల బాధని మన మనస్సులకు గుచ్చుకునేలా చేసిన కవితా ఖండిక పుష్పవిలాపం. తెలుగు పద్యం సొగసు తెలియాలంటే కరుణశ్రీ గారి ఉదయశ్రీ చదవాల్సిందే. 

 

పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 14 భాషలలో ప్రవీణులు. ఎంత ప్రావీణ్యం అంటే..ఆ 14 భాషలలో ఆశు కవిత్వం చెప్పగలిగినంత. వారు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలలోని కావ్యాలను తెలుగులోకి అనువదించారు. విశ్వనాథ వారి ఏకవీరను మళయాళంలోకి అనువాదం చేసారు. పుట్టపర్తి వారి జీవితంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే...ఆయన రాసిన పుస్తకాన్ని ఆయనే పాఠ్యాంశంగా చదువుకోవాల్సి రావడం!

శివతాండవం చదువుతుంటే మనకు తెలియకుండానే అక్షరాలన్నీ సంగీతంతో కలిసి పరిగెడుతుంటాయి. అందుకేనేమో ఆ శివతాండవం కవిసమ్రాట్ విశ్వనాథుని ఆనంద పరవశుని చేసింది. కవికోకిల జాషువా చేత పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు? అనిపించింది.

 

“ఓ నిజాము పిశాచమా! కానరాడు

నిన్ను బోలిన రాజు మా కెన్నడేని;

తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు

నా తెలంగాణ, కోటి రత్నాలవీణ”

అని నినదించిన మహాకవి దాశరథి. “దాశరథి వ్రాసిన పద్యాలు బోలెడు -అందులో నోటు చేయదగినవి కోకొల్లలు” అని ‘ఆరుద్ర’చే కొనియాడబడిన కవితావన పారిజాతం మన దాశరథి. నిజాం చెరనుండి తెలంగాణా విముక్తికై పోరాడిన కవనయోధుడతడు. “మహాంధ్రోదయం” కోసం తన కవిత్వంతో “అగ్నిధార”లు కురిపించి “రుద్రవీణ”లు మ్రోగించినవాడు. లక్ష్యం నెరవేరాక, చల్లబడ్డ మనస్సుతో సినిమా పాటలలో వేయి వేణువులు మ్రోగించి, ముత్యాల జల్లులు కురిపించినవాడు. ఆ కవితాగ్ని కాంతిలో దాశరథి విశ్వరూపాన్ని చూడాలంటే ఆయన సాహిత్యాన్ని చదవాల్సిందే.

 

"నేనింతా ఓ పిడికెడు మట్టే కావచ్చు - కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది!" అంటూ నినదించిన మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ.

"శేషేన్

నీ పోయెమ్సు చూసేన్

పసందు చేసేన్

నీది పద్యమా లేక ఫ్రెంచి మద్యమా" 

అంటూ ఆయనను కవితాత్మకంగా పొగిడి మురిసిపోయారు "శ్రీశ్రీ".

 

ఈ షోడశి పుస్తకంలో... సుందరకాండ కుండలినీ యోగమని, లంకానగరం మూలాధారమని, సీతాదేవియే కుండలినీశక్తి అని, స్వామి హనుమే కుండలినీ యోగము అనుష్ఠించు యోగి అని వేదోపనిషత్తులనుండి మంత్రశ్లోకాలను ఉదహరిస్తూ నిరూపిస్తారు రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ గారు. 

 

అనువాద హనుమంతుడంటూ బాపూరమణలు పిలుచుకునే నండూరి రామ్మోహనరావు గారి రచనా శైలి చాలా సరళంగా ఉంటుంది. మార్క్‌ట్వైన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెరీఫిన్ మొదలైన వాటికి నండూరి వారి అనువాదాలు అనువాదపు వాసన తగలకుండా గుబాళిస్తుంటాయి. ఇవి కాక ఇంకొన్ని అనువాదాలయిన రాజూ-పేద, విచిత్ర వ్యక్తి, కాంచనద్వీపం వంటి పుస్తకాలు పిల్లలతో చదివిస్తే వాళ్ళ ఊహాశక్తి, భాషా పటిమ రెంటినీ పెంచినవాళ్ళమవుతాం.

 

ఆరు సారా కథలు, రత్తాలు రాంబాబు, రాజు-మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త వంటి రచనలతో తెలుగు సాహిత్యంలో స్థిర నివాసం ఏర్పరచుకొన్న రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. రావి శాస్త్రిగా సుప్రసిద్ధులు. ఈనాటి రచయితలు ఎందరికో స్ఫూర్తి. ఆయన రచనాశైలి కూడా వేరెవ్వరీ అందనంత విశిష్టమైనది. కేవలం మళ్ళా మళ్ళా చదువుతూ ఆనందించ వలసినది.

 

ఇంకొక సుప్రసిద్ధ కథా రచయిత చాసోగా పిలవబడే చాగంటి సోమయాజులు గారు. ఎందుకు పారేస్తాను నాన్నా, ఎంపు, జంక్షన్‌లో బడ్డీ వంటి ఆయన కథలు… కథను ఎలా నడిపించాలి అన్న విషయంలో ఔత్సాహిక కథకులకు మార్గదర్శనం చేస్తాయి.

 

అందరికీ అర్థం కాని కథలు, అర్థం అయినా తిరిగి ఇదీ ఆ కథ అని చెప్పలేని కథలు, మనసు పొరల్లోకి తవ్వుకుంటూ వెళ్ళే కథలు... త్రిపుర కథలు. పాము, భగవంతం కోసం వంటి కథలు చదివిన తరువాత మరలా ఈ వాస్తవిక ప్రపంచంలోకి రావడానికి చాలా సమయం పడుతుంది. త్రిపుర పేరుతో రచనలు చేసిన రచయిత అసలు పేరు రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు గారు. సురేష్ కుమార్ రెడ్డి, [Dec 25, 2024 at 5:28 AM]

ఇంకా తెలుగు అందాన్ని అక్షరాలలో పెట్టి పరుగులు పెట్టించిన వేలూరి శివరామశాస్త్రి గారి కథలు,

 

తన "గాలివాన" కథతో తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన పాలగుమ్మి పద్మరాజు గారి కథలు,

 

"చివరకు మిగిలేది" అనే నవలతో తెలుగు సాహిత్యం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉండిపోయే స్థాయిని సంపాదించుకున్న బుచ్చిబాబు గారు రాసిన కథలు

 

ఆనందాన్ని, హాయిని కలిగించే భానుమతి గారి “అత్తగారి కథలు”, 

 

ఇలా వీరందరి కథలూ చదివి తీరాల్సిందే.

ఇప్పటివరకూ చెప్పుకున్న పుస్తకాల రచయితలెవ్వరూ ఇప్పుడు భూమి మీద లేరు. ఇప్పుడు ఉన్న రచయితల్లో కూడా తారాపథాన్ని అందుకున్నవాళ్ళు ఇద్దరు ఉన్నారు. అప్పట్లో లక్షలాది తెలుగు పాఠకులకు వాళ్ళిద్దరి పుస్తకాలే తెలుగు సాహిత్యానికి ప్రవేశద్వారాలుగా ఉండేవి. వారిలో ఒకరు… 

 

యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఒక తరం నవలా సామ్రాజ్యానికి ఆయనే చక్రవర్తి. వెన్నెల్లో ఆడపిల్ల, అంతర్ముఖం వంటి నవలలు ఎప్పటికీ క్లాసిక్సే. ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, అభిలాష, ఒక రాధ ఇద్దరు కృష్ణులు మొదలైన తెలుగు సినిమాలన్నీ యండమూరి నవలలకు వెండితెర రూపాలే. “విజయానికి అయిదు మెట్లు” తెలుగులో వచ్చిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలలోకెల్లా అత్యంత విజయవంతమైన పుస్తకం.

 

ఇంకొక ప్రసిద్ధ రచయిత... షాడో సృష్టికర్త అయిన మధుబాబు గారు. డిటెక్టివ్ సాహిత్యంలో ఎందరో రచయితలు ప్రఖ్యాతులైనా అగ్రస్థానం మాత్రం మధుబాబు గారిదే. షాడో గంగారాంతో కలసి దేశవిదేశాల్లో చేసిన విన్యాసాలు చదివి ఆనందించవలసిందే కానీ ఇలా చెప్పుకుంటే తనివితీరేది కాదు. డిటెక్టివ్ నవలలే కాదు కాళికాలయం, వీరభద్రారెడ్డి వంటి ఎన్నో జానపద నవలలు కూడా మధుబాబు గారి మార్క్‌తో తెలుగు సాహిత్యంలో నిలబడిపోయాయి. 

 

ఇంకా…

 

ప్రజాకవి కాళోజీ గారి “నా గొడవ”, డైరక్టర్ వంశీ గారి “పసలపూడి కథలు”, యద్దనపూడి సులోచనారాణి గారి “జీవన తరంగాలు”, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి “నత్తలొస్తున్నాయి జగ్రత్త”, మాదిరెడ్డి సులోచన గారి “పూల మనసులు”, రంగనాయకమ్మ గారి “బలిపీఠం”, పొత్తూరి విజయలక్ష్మి గారి “హాస్య కథలు”, కె.ఎన్.వై. పతంజలి గారి “కథలు- పతంజలి భాష్యం”, శ్రీరమణ గారి “మిథునం”, “బంగారుమురుగు” కథలు, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి “అమృతం కురిసిన రాత్రి” రాసిన ఇలా చదవ వలసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి.

 

రామాయణం 24 వేల శ్లోకాలూ టీకా తాత్పర్యాలతో సహా కావాలనుకునేవాళ్ళకు పుల్లెల శ్రీరామచంద్రుడు గారి రామాయణం, టి.టి.డి వాళ్ళు ప్రచురించిన ఆంధ్రమహాభారతం పదిహేను పుస్తకాల సెట్టు, వారి ప్రచురణే అయిన పోతన భాగవతం, రామకృష్ణమఠం వారు సులభశైలిలో అర్థమయ్యేలా ప్రచురించిన ఉపనిషత్తుల పుస్తకాలు, శృంగేరీ పీఠాధిపతుల సూచన మేరకు కాకతీయ సిమెంట్స్ వారు ప్రచురించిన పురాణ అనువాదాలు ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.

 

ఇప్పటికి కొందరు రచయితలను, కవులను తలుచుకుంటూ కొన్ని పుస్తకాలను మాత్రమే ప్రస్తావించాను. ఇలాంటి ఇంకొక పది వ్యాసాలు వ్రాసినా ఇంకా గుర్తుచేసుకోవలసిన, చదవ వలసిన మంచి పుస్తకాలు మిగిలే ఉంటాయి. అంత గొప్ప సాహిత్యం ఉంది మన భాషలో.


ఇప్పటికి మాత్రం ఈ పుస్తకాలతో సరిపెడుతూ, నా ఉత్సాహానికి అడ్డుకట్ట వేసుకుంటున్నాను. https://t.me/teluguvelugu01/23512

⚜ శ్రీ కృష్ణస్వామి దేవాలయం

 🕉 *మన గుడి*


⚜ *కేరళ  : తోడుపుజ - ఇడుక్కి*


⚜ శ్రీ  కృష్ణస్వామి దేవాలయం



💠 శ్రీ కృష్ణస్వామి ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని తొడుపుజా పట్టణం నడిబొడ్డున ఉన్న ఒక హిందూ దేవాలయం . 

ఇది మువట్టుపుజా నదికి ఉపనది అయిన తోడుపుజయార్ ఒడ్డున ఉంది . 


💠 శ్రీకృష్ణుడు తన కుడి చేతిలో  వెన్నను పట్టుకున్న నవనీత కృష్ణుడి రూపంలో అక్కడ ఉన్నాడు.

శ్రీ కృష్ణ స్వామి ఆలయం 5000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది.


💠 ఎడవెట్టిలో శ్రీకృష్ణుడు ధన్వంతరి రూపంలో దర్శనము ఇస్తాడు.

ధన్వంతరి కృష్ణ" లేదా "ఔషధ కృష్ణ" , "నివారణ కృష్ణ " అనే పేరు కూడా కలదు.


🔆 స్థల పురాణం 


💠 మహాభారతంలో, పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అశ్వినీదేవుని ఆశీస్సులతో నకులుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. 

అశ్వినీ  దేవతల వైద్యులు మరియు ఆయుర్వేద మాస్టర్స్ అని నమ్ముతారు.


💠 ఈ ఆలయం చుట్టూ ఔషధ మొక్కలు మరియు ఇతర పాండవులు (మలయాళంలో అంచంబలం అని పిలుస్తారు) నిర్మించిన నాలుగు ఇతర శ్రీకృష్ణ దేవాలయాలు ఉన్నాయి . అత్యంత దట్టమైన ఈ అడవికి వన దుర్గ కాపలాగా ఉంటుందని నమ్ముతారు.


💠 ఒకప్పుడు వివిధ దేవాలయాలకు తీర్థయాత్రలు చేస్తూ సంచరిస్తున్న బ్రాహ్మణుడు ఇక్కడికి చేరుకుని శ్రీకృష్ణుని దివ్య దర్శనం పొందాడని ప్రముఖ పురాణాలు చెబుతున్నాయి .


💠 అతని చిన్న వయస్సులోనే అతను సన్యాసం పొందాడు. అతను సన్యాసిగా ప్రపంచమంతా తిరుగుతున్నప్పుడు ఆలయం ఉన్న ప్రదేశంలో శ్రీకృష్ణుని గురించి ధ్యానం చేసాడు మరియు ధ్యానం సమయంలో తనను మింగడానికి ప్రయత్నించిన గుడ్లగూబ యొక్క కొమ్మును చీల్చివేస్తున్న కృష్ణుడి దర్శనం అతనికి లభించింది. 


💠 శ్రీకృష్ణుని ఈ దర్శనం తరువాత, సన్యాసి ఒక దీపాన్ని వెలిగించి, భగవంతుడు గుడ్లగూబ యొక్క కొమ్మును చీల్చివేస్తున్న దృశ్యాన్ని ధ్యానించాడు, అక్కడ అతను భగవంతుడిని చూసి నైవేద్యాలు సిద్ధం చేసి భగవంతుడికి గొప్ప భక్తితో సమర్పించాడు. 

ఈ సంఘటన మలయాళ మాసం మీనంలో ఒక చోతి నక్షత్రం రోజున జరిగింది కాబట్టి ఈ రోజును పాత రోజుల్లో పవిత్రోత్సవ దినంగా పరిగణించేవారు. 

తరువాత, కీజ్మలనాడు రాజు దేవత కోసం ఒక మందిరాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించారు. 


💠 చాలా దేవాలయాలలో సాధారణ పద్ధతిగా, గర్భాలయం తెరవగానే, స్వామివారి దండలు తొలగించి, అభిషేకం మరియు మలర్ నైవేద్యం (వేపుడు ధాన్యం) చేసి, ఆ తర్వాత ఉష పూజ చేస్తారు.

 ఇక్కడ అది భిన్నంగా ఉంటుంది, తెల్లవారుజామున బలిపీఠం తెరిచిన వెంటనే ఉషపూజ చేసి, ఆ పూజ పూర్తయిన తర్వాత, అభిషేకం మరియు మలార్ నైవేద్యాలు చేస్తారు. 


💠 హిందూ పురాణాలలోని దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు మరియు కుడ్యచిత్రాలతో ఈ ఆలయం ప్రత్యేకమైన కేరళ-శైలి శిల్పకళకు ప్రసిద్ధి చెందింది.


💠 ఆలయ సముదాయం గర్భగుడి (శ్రీకోవిల్)ను కలిగి ఉంది, ఇక్కడ ప్రధాన దేవత శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించబడ్డాడు, అనేక ఇతర దేవి దేవతలకు అంకితం చేయబడిన అనేక ఇతర చిన్న దేవాలయాలు ఉన్నాయి. 


🔅 అధీన దేవతలు


💠 ఈ ఆలయంలో భగవతి , శివుడు , గణపతి , అయ్యప్ప మరియు నాగులు అధీన దేవతలుగా ఉన్నారు. 


💠 ఈ ఆలయం మతపరమైన మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది, వివిధ ఆచారాలు, పండుగలు మరియు సంఘటనలు ఏడాది పొడవునా జరుగుతాయి.


💠 "తొడుపుజా పుతువర్షం" అని పిలువబడే ఆలయం యొక్క వార్షిక ఉత్సవం (పండుగ) గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు మరియు కేరళలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.

 ఈ పండుగ సాధారణంగా మలయాళ నెల మేడం (ఏప్రిల్-మే)లో వస్తుంది మరియు రంగురంగుల ఊరేగింపులు, సాంప్రదాయ సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇతర ఉత్సవాలు ఉంటాయి.


🔆 పూజలు


💠 ఉదయం విభాగంలో 'ఉషా పూజ' తర్వాత 'అభిషేకం' ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే ముందురోజు పూల దండలు తీసేస్తారు. 'నిలపడుతారా' లేదా పవిత్ర వేదిక ఆలయం ముందు ఉంది, ఇక్కడ సాధువు దేవతా విగ్రహాన్ని స్వీకరించాడు. 

విగ్రహాన్ని పండుగ సందర్భాలలో గర్భగుడి నుండి ఈ వేదికపైకి తీసుకెళ్లి పూర్తిగా అలంకరించి తిరిగి తీసుకువెళతారు.

 దేవతకు ప్రధాన వాహనాలు గుడ్లగూబ మరియు పావురం.


💠 నానయప్పర - 

నానయప్పర సేవ కోరికలను నెరవేర్చడానికి మరియు ప్రతి గురువారం ఆలయంలో సమర్పించవచ్చు. 

భక్తులు నాణేలను భగవాన్ (దైవం) ముందు ఉంచిన "పరా" (డ్రమ్)లో నింపుతారు మరియు వారి కోరికలను నెరవేర్చడానికి భగవాన్ నుండి దీవెనలు కోరుకుంటారు. 

పారా (డ్రమ్) నింపిన తర్వాత భక్తులకు తమలో తాము ఉంచుకోవడానికి పట్టుతో చుట్టబడిన నాణెం ఇవ్వబడుతుంది. 

వచ్చే ఓషధ సేవలోపు కోరికలు నెరవేరుతాయని నమ్మకం. 

కోరిక నెరవేరిన తర్వాత నాణేన్ని ఆలయానికి తిరిగి ఇవ్వాలి.


💠 వార్షిక పండుగ మలయాళ నెల మీనం (మార్చి/ఏప్రిల్)లో నిర్వహించబడుతుంది. 

ఉత్సవ్ బలి, వేలాది మంది భక్తుల సమక్షంలో ఉత్సవాల తొమ్మిదవ రోజున పవిత్రమైన కార్యక్రమం నిర్వహిస్తారు. 



💠 కొట్టాయం రైల్వే స్టేషన్, ఇది సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.