10, జూన్ 2021, గురువారం

*⛳హిందూ మతస్థాపకులు ఎవరు..⁉️*

 *⛳హిందూ మతస్థాపకులు ఎవరు..⁉️* 

🕉️🌞🌎🏵️🌼🚩


*విదేశీయుడు: స్వామి క్రిస్టియానిటీ స్థాపకులు ఎవరు?* 


 *స్వామి_చిన్మయానంద: జీసస్*


 *విదేశీయుడు: ఇస్లాం స్థాపకుడు ఎవరు?* 


 *స్వామి_చిన్మయానంద: మహమ్మద్* 


 *విదేశీయుడు: హిందూ మత స్థాపకులు ఎవరు?* 


 *స్వామి_చిన్మయానంద: సమాధానం ఇవ్వలేదు. మౌనంగా వుండిపోయారు.* 


 *విదేశీయుడు: అదేమిటి స్వామి మీ మతానికి స్థాపకులంటూ ఎవ్వరూ లేరా?* 


 *స్వామి_చిన్మయానంద: హిందూ ధర్మానికి ప్రత్యేకించి ఒక్క స్థాపకుడు అంటూ* *ఎవరూ వుండరు. అందుకే ఇది మతం కాదు #జీవన_విధానం, ధర్మం., ఎందుకంటే ఇది* *వ్యక్తుల నుండి వచ్చిన జ్ఞానం కాదు. నీవు అడిగినటువంటిదే నేను అడుగుతాను.* *సమాధానం చెప్పగలవా. కెమిస్ట్రీ_స్థాపకులు ఎవరు..,?? జువాలజీ_స్థాపకులు ఎవరు..?* 

 *దీనికి నీ వద్ద ఖచ్చితమైన సమాధానం వుందా..? వుండదు. అలాగే ఈ* *#సనాతన_హిందూ_ధర్మం కూడా ఎంతో మంది సైంటిస్టుల పరిశోధనల ఫలితమే. ఆ పరిశోధకులే మన ఋషులు, మునులు.* 


 *విదేశీయుడు:* *అపరాధభావంతో మిన్నకుండిపోయాడు.* 


 *స్వామి_చిన్మయానంద: నువ్వు ఒక క్రిస్టియన్ ని అడిగితే బైబిల్ ఇస్తాడు. ఒక ముసల్మాను సోదరున్ని అడిగితే ఖురాన్ ఇస్తాడు. అదే హిందువుని అడిగితే తన గ్రంధాలయానికి ఆహ్వానిస్తాడు.* 


 *ఎందుకంటే ఇక్కడ వున్నది మతం కాదు…🙏 అనంతం* 


 *#హిందూ_ఒక_మతం_కాదు ....* *#భారతీయుల_జీవన_విధానం* 

 *#హిందూ_ధర్మం_సనాతనమైనది* 


 * 🕉️🚩🙏*


 🕉️🌞🌎🏵️🌼🚩

తెలివి మనోడిది

 తెల్లోడి తెలివి అంటారు.


మరి తెల్లోడిని మించిన తెలివి మనోడిది .


Its a true story in USA 


Lets read .....


ఒక భారతీయుడు లోను కోసం అమెరికన్ బ్యాంకు

లోకి వెళతాడు.... 


తనకు చాలా అత్యవసరంగా ఐదు వేల డాలర్లు అవసరముందని తాను అన్ని ప్రదేశాలలో

మిత్రుల దగ్గరా అడిగానని ఫలితం లేకుండా పోయిందనీ.... 


తన కోటి రూపాయల "ఫెరారీ " కారును తాకట్టు పెట్టుకుని

తనకు ఆ

అయిదు వేలు ఇప్పించవలసిందిగా కేవలం వారం

రోజుల్లో తిరిగి తీరుస్తానని హామీ ఇచ్చాడు...


I am going to other state 


I will return after 5 days 

Then

Immediatly I will pay


ఈ బ్యాంకు వారికి చాలా ఆశ్చర్యం వేసింది

అస్సలు వీడికేమైనా పిచ్చి లేసిందా.. 


కోటి రూపాయల

కారును అంత ఛీప్ గా మరీ

ఐదువేలకు తకట్టు పెడుతున్నాడేంటి అని చాలా

సార్లు తర్జనభర్జనలు పడ్డారంట. సరే ఏమైతే అదైందిలే...


వీడు తీర్చలేకపొతే కారు మనదవుతుంది కదా అనుకుని...


మేనేజర్ కార్ తాళాలు తీసుకుని జాగ్రత్తగా పార్కింగ్ చేసి


సార్

మీరప్పుడైనా వచ్చి డబ్బు కట్టి మీకారు

తీసుకుపోవచ్చని

చెపుతాడు....


ఒక వారం గడుస్తుంది... ఆ భారతీయుడు తిరిగి

బ్యాంకుకు వచ్చి ఐదువేల డాలర్లకు వడ్డి $15.41

డాలర్లు కట్టి కారును తీసుకువెళ్ళేందు

కు సిద్ధమవుతాడు... 


ఇంతలో ఆ యువ బ్యాంకు

మేనేజర్

ఆసక్తి చంపుకోలేక “ సార్! మీరు కోటి యాభైలక్షల

కారు ను తాకట్టు పెట్టి కేవలం ఐదువేల డాలర్లు అప్పు తీసుకున్నారు...  


మీరు గట్టిగా

ప్రయత్నిస్తే తప్పక దొరికేవి కదా.. దీనిలో మర్మమేంటి" అని

అడిగాడు...


అప్పుడు మన భారతీయుడు... 


"సార్! విమానాశ్రయంలో

పార్కింగ్ కు దాదాపు ఈ వారం రోజులకు

ఐదువందల

డాలర్లు కట్టవలసి వచ్చేది.. ..


But


నేను ఇక్కడ

మీకు కేవలం $15.41 డాలర్లు మాత్రమే చెల్లించి

వారం రోజులు కారును చాలా జాగ్రత్తగా

ఉంచుకున్నాను...


విమానాశ్రయంలొ అయితే కొంచెం భద్రత/శుభ్రత

కూడా తక్కువ... 


ఇక్కడ మీరు చాలా బాగా చూసు

కున్నారు..

ధన్యవాదములు".. 

అని చెప్పాడు...


బ్యాంకు మేనేజర్ కు నోట మాటరాలేదు..


ఈ విషయం తెలిసిన ఒబామా మన భారతీయుల తెలివి

తేటలకు హతాశుడయ్యాడట...


ఇది అమెరికాలో జరిగిన ఒక యథార్థ సంఘటన.


🇮🇳. Great INDIA 

GREAT INDIAN.  🇮🇳


Inidans always rocks 👍👍

తిరుమల సమాచారం*

 *తిరుమల సమాచారం*


#ab6news *UPDATES*


*జూన్ 12వ తేదీ నుండి భ‌క్తుల‌కు మ‌రింత సుల‌భంగా వ‌స‌తి గ‌దుల కేటాయింపు*


తిరుమల భ‌క్తుల సౌక‌ర్యార్థం జూన్ 12వ తేదీ శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల నుండి తిరుమ‌ల‌లోని ఆరు ప్రాంతాల్లో నూత‌నంగా టిటిడి ఏర్పాటు చేసిన కౌంట‌ర్ల‌లో వ‌స‌తి గ‌దుల కొర‌కు పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకునే అవ‌కాశాన్ని టిటిడి క‌ల్పిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌లోని వ‌స‌తి కొర‌కు సిఆర్‌వో వ‌ద్ద పేర్లు రిజిస్ట్రేష‌న్ మ‌రియు గ‌దులు కేటాయిస్తున్న విష‌యం విదిత‌మే.


శ‌నివారం నుండి జిఎన్‌సి టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న ల‌గేజి కౌంట‌ర్ నందు రెండు కౌంట‌ర్లు, బాలాజి మెయిన్ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, కౌస్తుభం అతిథి భ‌వ‌నం వ‌ద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంట‌ర్లు, రాంభ‌గిచ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, ఎమ్‌బిసి ప్రాంతంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, సిఆర్‌వో వ‌ద్ద రెండు కౌంట‌ర్ల‌లో భ‌క్తులు వ‌స‌తి కోర‌కు పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.


     *#Subscribe ab6news*


పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకున్న భ‌క్తుల‌కు ఎస్ ఎమ్ ఎస్ ద్వారా వారికి కేటాయించిన గ‌దుల స‌మాచారం తెలియ‌జేయ‌బ‌డుతుంది. అనంత‌రం వారికి గ‌దులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచార‌ణ కార్యాల‌యాల వ‌ద్ద రుసుం చెల్లించి గ‌దులు పొంద‌వ‌చ్చు. ఈ అవ‌కాశాన్ని భ‌క్తులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

   *@ab6news*

పురుషుడు ఎలా ఉండాలో

 స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...🚶🏿‍♀

పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది📚


కానీ ఎందుచేతో ఈ పద్యం జన

బాహుళ్యం లో వ్యాప్తి చెందలేదు.


కార్యేషు యోగీ, కరణేషు దక్షః

రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,

సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు

ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)📚⚖


1. *కార్యేషు యోగీ* 💰:

పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి🏹


2. *కరణేషు దక్షః* 🤺:-

కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.🏌🏾


3. *రూపేచ కృష్ణః*🙏:-

రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,

సంతోషంగా ఉండాలి.👌


4. *క్షమయా తు రామః*🏹:-

ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి

పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.


5. *భోజ్యేషు తృప్తః*🍲🥘🍛

భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.


6. *సుఖ దుఃఖ మిత్రం*🤼‍♂:-

సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.⛹🏼🎻


ఈ షట్కర్మలు (ఈ ఆరు పనులు) సక్రమంగా చేసే పురుషుడు 🏇🏼ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడుతారు...

🙋‍♂️👏🏻🙏🏼

చరిత్ర దాచిన నిజాన్ని

 చైనా1959లో అకస్మాత్తుగా టిబెట్ ను ఆక్రమించడంతో అక్కడి బౌద్ధగురువు ఇండియాకు శరణార్ధిగా వచ్చారు. ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో భారత్ పై శతృత్వం పెంచుకుంది చైనా.


1962లో చైనా భారత్ భూభాగాలపై దాడిచేయడం ప్రారంభించినది. భారత్ దగ్గర సరైన ఆయుధసామగ్రిలేదు. నాసిరకం ఆయుధాలతో ,సరైన వ్యూహలు కరువైనందున చైనా సైనికులను భారతీయసైనికులు ఎదురుకోలేరని తవాంగ్ ప్రాంతం నుండి సైనికులను వెనుకకు తిరిగిరావలసిందిగా  నెహ్రు గారూ,రక్షణశాఖామంత్రి కృష్ణమీనన్ గారు ఆజ్ఞాపించారు.


అయితే నూర్ నాంగ్ (అరుణాచల్ ప్రదేశ్ )దగ్గర కాపలాకాస్తున్న గర్వాల్ రైపిల్ ఆర్మీ డివిజన్  లోని ముగ్గురు యువకులు శత్రువులకు వెన్నుచూపడం ఇష్టంలేక అక్కడే ఎత్తైనకనుములో దాక్కుకొని శత్రువులపై ఏదురుదాడికి దిగారు. కేవలం ముగ్గురు మూడువందలపైగా వున్న చైనాసైనికులను నిలువరించసాగారు.


1962 ,నవంబర్ -15 ..నూర్నాంగ్ ఫోష్టుపై చైనా జవాన్స్ కాల్పులు ప్రారంభించారు. మన ముగ్గురు జవాన్స్ ధైర్యంగా ఎదురుకున్నారు.అందులో 21 సంవత్సరాల యువకుడు చాలా చురుకుగా కదులుతున్నాడు. అతని గురితప్పడంలేదు.ప్రత్యర్థులలో చాలామందికి రైపిల్ తూటాలు దిగాయి.ఒక అరగంట తరువాత వారి నుండి కాల్పులు ఆగిపోయాయి. అంతే ఇద్దరు యువజవాన్స్ మెరుపువేగంగా వారివైపు కదిలారు..భారతజవాన్ తూటాలకు బలైపోయిన చైనా జవాన్స్ దగ్గరనుండి ఆయుధాలను తీసుకొని మళ్ళీ తిరిగివచ్చేసారు. మళ్ళీ కొన్ని గంటల తరువాత మళ్ళీ చైనాజవాన్స్ నుండి కాల్పులు ప్రారంభమయినాయి. మళ్ళీ మనజవాన్ ఎదురుకాల్పులకు దిగారు. మళ్ళీ కొంతసేపటి తరువాత కాల్పులు ఆగిపోయాయి. మళ్ళీ మన జవాన్స్ వారివద్దకు కదిలారు..ఆయుధాలను తస్కరించి మళ్ళీ తిరిగి వస్తున్న మన జవాన్స్ ను గమనించి శత్రుసైనికులు కాల్పులు జరపడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.తన కళ్ళముందే తన సహచరులు నేలకూలడం చూస్తూ నిస్సహాయంగా చూస్తుండిపోయాడు 21యేండ్ల గర్వార్ రైఫిల్ మాన్ .

1962 నవంబరు 16 ..నూరనాంగ్ కనుమ .భారతజవాన్ ఒక్కడే యుద్దానికి సిద్దమవుతున్నాడు. తన దగ్గర వున్న ఆయుధాలను కొన్ని అడుగులకు ఒకటి చొప్పున అమర్చుకుంటున్నాడు. అతని పోరాటం గమనిస్తున్న సెరా,నూరా అనే గిరిజన యువతులు అతనికి సహాయంగా వచ్చారు. వారికి రైఫిల్స్ ఎలా మందుగుండ్లు పెట్టాలో నేర్పించాడాయువకుడు. మళ్ళీ చైనా కాల్పులు ప్రారంభించినది. అంతే యువ జవాన్ మెరుపువేగంతో కదిలాడు. ఒక్కొక్క రైఫిల్ దగ్గరకు వెళ్ళడం కాల్పులు జరగడం,మళ్ళీ మరొక ఫోష్టుదగ్గరకు పరిగెత్తడం కాల్పులు జరపడం..మెరుపువేగంగా కదులుతూ అతను నలువైపుల నుండి జరిపే కాల్పులకు తికమకపడిపోయిన చైనాజవాన్స్ ,భారతసైనికులు చాలామంది వున్నట్లు భావించి మళ్ళీ వెనుదిరిగారు.

భారతసైనికుల వ్యూహం అర్థంకాలేదువారికి. అప్పటికే వందకు పైగా తమ సహచరులు మరణించారు. నూరనాంగ్ కనుమలో భారీగా భారతసైనికులున్నట్లు పైఅధికారులకు సందేశం పంపారు.


1962 నవంబరు-17. మళ్ళీ చైనా జవాన్స్ పై అటాక్ మొదలుపెట్టాడా 21 యేండ్ల యువజవాన్ .సెరా,నూరా సహాయంతో శత్రుశిబిరంలోని జవాన్స్ ను ఒక్కొక్కరిగా నేలకూలుస్తున్నాడావీరుడు. అతని ధాటికి మళ్ళీ వెనుదిరిగారు చైనా జవాన్స్ .చాలామంది ప్రాణాలొదిలారప్పటికే. 


ఇంతలో ఎవరో అపరిచితుడు ఏదో తీసుకొని కొండపైకి వెళుతుండటం చైనా జవాన్స్   చైనా గమనించారు. వెంటనే అతనిని చుట్టుముట్టి అదుపులో తీసుకొని చిత్రహింసలు పెట్టగా,తాను కొండపైన వున్న జవాన్ కు భోజనం తీసుకెళుతున్నట్లు చెప్పేసాడావ్యక్తి. అది విని హతాసులైపోయారు వాళ్ళు.


కేవలం ఒక్కడు,ఒకే ఒక్కడు మూడురోజులనుండి వారిని ఎదురుకోవడం,వందమందిపైగా తమ జవానులప్రాణాలు తీయడం భరించలేకపోయారు.కోపంతో ఊగిపోతూ భారత జవాన్ ను చుట్టు ముట్టారు. అయినా జంకలేదా యువజవాన్ .చివరిదాకా పోరాడాడు.సాయంత్రం సూర్యడస్తమిస్తుండగా శత్రువుల తూటా గొంతులో ది


గగా జైహింద్ అంటూ ప్రాణాలొదిలేసాడాయువకుడు. సెరా శత్రువులనుండి తప్పించుకొనేందుకు కొండపై నుండి లోయలోకి దూకి ఆత్మహత్యచేసుకుంది.నూరా ను చిత్రహింసలు చేసి చంపారు చైనీయులు. మన జవాన్ గొంతుగోసి తలను తీసుకెళ్ళారు.


ఇంతకీ ఆ 21ఏళ్ళ యువ జవాన్ పేరేమిటో తెలుసా?? "జస్వంత్ సింగ్ రావత్ " కేవలం ఒక్కడే దాదాపు 72 గంటలు శత్రుసైన్యాన్ని అడుగుముందుకు వేయకుండా ఆపిన వీరుడు.150 మందికి పైగా చైనా జవానులను అంతమొందించిన వీరజవాన్ . శాంతిచర్చలలో భాగంగా అతని తలను భారత్ కు అప్పగించారు చైనా అధికారులు.అతని పోరాటానికి ఫిదా అయినట్లు చెప్పారు.


జస్వంత్ సింగ్ రావత్ కు తవాంగ్ ప్రాంతంలో మందిరం కట్టి అతనిని దేవునిగా పూజిస్తున్నారిప్పటికీ అక్కడ ప్రజలు. సెరా,నూరాలకూ ఘాట్లు కట్టారు. ప్రతిరోజూ డ్యూటీలకు వెళ్ళే జవాన్స్ అతనికి దండం పెట్టుకొని వెళుతారు. జస్వంత్ సింగ్ ప్రత్యేకత ఏమిటంటే చనిపోయినా ఇప్పటికీ వివిధ అవార్డులు గెలుచుకోవడం. ఇంత గొప్ప స్థానం మరే సైనికుడికీ దక్కలేదు!!!!


ఇటువంటి మహా వీరుల జీవిత కథ లు మన చరిత్ర లో భాగం అవ్వాలని ,విద్యార్థులకి పాఠ్యంశాలు గా చేర్చి ,,దేశ భక్తి ,విధి పట్ల నిబద్దత పెంపొందించాలని మనసారా కోరుకుంటున్నా


 పరమ వీర చక్ర శ్రీ జస్వంత్ సింగ్ రావత్ జీ కి ఘన నివాళి ................

 

 మీ వాల్ మీద ,గ్రూప్స్ లో షేర్ చేసుకొని ,వీలైనంత మందికి చరిత్ర దాచిన నిజాన్ని తెలియ చెయ్యండి ,మన తరం కి భావి తరాలకి చరిత్ర వాస్తవాలు చెప్పటం మన బాధ్యత!

🌹🌹🙏🌹🌹

మిత్రాయనమః

 *మిత్రాయనమః* 


*"అరే, ఒరే, ఒసే, ఏమే, ఏరా, /*

*అనెడి మిత్రుండొకడుండిన చాలు/*

*వృద్ధాప్యంబున, అదెనొసంగునారోగ్యంబు/*

*మిత్రాయనమః/(1)*


*స్నేహితుండులేని జీవితంబు/*

*తైలంబు లేని దీపంబు, దినకరుండు లేని/*

*దినంబు, ఉప్పులేని పప్పు వ్యర్ధంబు/*

*మిత్రాయనమః!/(2)*


*"ఔషధంబుకానౌషధౌంబు/*

*మనంబునకు శాంతినొసంగు/*

*తెలతెలవారంగ 'ఏరా, ఏమే' అని వినంగ/*

*మిత్రాయనమః/(3)*


*"దేశంబులనున్న, దేవళంబుననున్న/*

*సంతలోననున్న, సభలలోననున్న/*

*'ఏరా'యని వినంగ తృళ్ళిపడు తేటపడు/*

*మానసంబు, మిత్రుని పలుకు చెవిని పడ/*

*మిత్రాయనమః/(4)*


*"పూర్వజనమ పుణ్యంబున దొరకు/*

*ఏరాయను బాల్యమిత్రుండు,/*

*వృద్ధాప్యంబున పలుకరించ/*

*అమృతము చిలకరించు పలుకు/*

*అదిలేని జనమంబు దరిద్రమ్ము/*

*మిత్రాయనమః/(5)॥*


*"నిదుర లేవంగ 'ఏరా' లేనిచో/*

*సగము ప్రాణంబులు పోవు/*

*తీపి గురుతులే మిగులు/*

*దిగులు చెంద దినంబులు భారంబుగ/*

*మిత్రాయనమః!"(6).*


  *ప్రియ మితృలందరికీ అంకితం!* 🙏k.

50 మంది కాళికల పేర్లు

 మహా కాల సంహితలో 50 మంది కాళికల పేర్లు :-


⭕ దూమకాళీ,
⭕జయకాళి,
⭕ఉగ్రకాళి,
⭕ ఘోరకాళి,
⭕నాదకాళి,
⭕ ధనకాళి,
⭕ కల్పాంతకాళి,
⭕ భేతాళకాళి
⭕ కంకాళకాళి,
⭕ నగ్నకాళి,
⭕జ్వాలాకాళి,
⭕ ఘోర ఘోరతరాకాళి,
⭕దుర్జయకాళి,
⭕ మంథానకాళి,.
⭕ సంహరకాళి,
⭕ ఆజ్ఞాకాళి,
⭕ రౌద్రకాళి.
⭕ తిగ్మకాళీ.
⭕ కృతాంతకాళి.
⭕ మహరాత్రికాళి.
⭕ సంగ్రామకాళి.
⭕ భీమకాళి.
⭕ శవకాళి.
⭕చండకాళి.
⭕ రుథిరకాళి.
⭕ఘోరకాళి.
⭕భయంకరకాళి.
⭕సంత్రాస కాళి.
⭕కరళకాళి.
⭕వికరాళ కాళి.
⭕విభూతికాళి.
⭕ భోగకాళి.
⭕కాలకాళి.
⭕వజ్రకాళి.
⭕వికటకాళి.
⭕విద్యాకాళీ.
⭕కామకళాకాళి.
⭕ దక్షిణ కాళి.
⭕మాయాకాళి.
⭕ భద్రకాళి.
⭕ శ్మశానకాళి.
⭕కులకాళి.
⭕నాదకాళి.
⭕ముండకాళి.
⭕సిద్దికాళి.
⭕ఉదారకాళి.
⭕ఉన్మత్తకాళి.
⭕సంతాపకాళి.
⭕కపాలకాళి.
⭕నిర్వాణకాళి.

వీటి మంత్రాలు ఉన్నాయి... సాధనా పద్ధతులు కూడా ఉన్నాయి 

తొలి అర్ఘ్య

 అస్సలు సంధ్యావందన సమయాన అర్ఘ్యం చిమ్మడంలో ఆంతర్యమేమిటి. 


తొలి అర్ఘ్య చిమ్ము సమయంలో 'ఇదమర్ఘ్యం సూర్యగతి నిరోధక  మందేహ రాక్షస ఆయుధ నాశాయ భవతు' (అంటే సూర్య గమనమును అడ్డపెట్టుచున్న మందేహ రాక్షసుల ఆయుధాలు నాశనము కావయునని) అనియు రెండ అర్ఘ్య సమయంలో 'ఇదమర్ఘ్యం సూర్యగతి నిరోధక  మందేహ రాక్షస హయ నాశాయ భవతు'(అంటే సూర్య గమనమును అడ్డపెట్టుచున్న మందేహ రాక్షసుల గుఱ్ఱాలు నాశనము కావయునని) మరియు మూడవ అర్ఘ్య చిమ్ము సమయంలో  'ఇదమర్ఘ్యం సూర్యగతి నిరోధక సర్వ  మందేహ రాక్షస నాశాయ భవతు'(అంటే సూర్య గమనమును అడ్డపెట్టుచున్న మందేహ రాక్షసుల నందరిని నాశనము కావయునని) అని అనుకుంటూ అర్ఘ్యం చిమ్మినయెడల అర్ఘ్య చిమ్ముటయందు ముందుకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలు కలుగగలదు. 


ఏలన సంధ్యాకాలమున అర్ఘ్యములను విడువనివాడు మరు జన్మలో గుడ్లగూబగా పుట్టునని శాస్త్రము చెప్పుచున్నది.

మనస్సే

 🇲🇰ఓంశాంతి🇲🇰

అన్ని రోగాలకూ కారణమూ... "మనస్సే", విరుగుడూ... "మనస్సే"

“జపాన్ శాస్త్ర వేత్తలు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్య కర విషయాలు వెలుగు చూశాయి.              ఇంత కాలం మనం "గుడ్డి"గా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారం లో లేవని,*


     "మనం జీవించే

      విధానం లోనే

      ఉన్నాయని", 

*మనసును హాయిగా ఉంచు కున్న వారికి     ఏ రోగాలు రావని వారు తేల్చి చెబు తున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసు బాగున్న వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు.          మనసు కలత బారితే లేని పోని ఆలోచనలు చోటు చేసుకుని వాటి నుంచి బైటపడ డానికి "బలహీనతలు" పెంచు కోవడం, వాటికి బానిసలై "దురలవాట్ల" పాలై పోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు.           ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, "జీవన శైలి"ని సరి దిద్దే పనిలో పడ్డారు.*


      _అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌ మెంట్ ఇచ్చే పద్ధతి మార్చు కున్నారు._

    

*ఇది వరకు తిన కూడదు*

     *అన్న అన్ని రకాల*

     *ఆహారాన్ని నిరభ్యంతరంగా*

    *తిన మంటున్నారు.*


_పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందు కోసం నచ్చిన పాటలు విన మంటున్నారు._


*ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయ మంటున్నారు. కొందరు "వాకింగ్" ఇష్టపడితే మరి కొందరు జిమ్‌కు వెళ్ళాలను కుంటారు. ఇంకొందరు "బ్రిస్క్‌వాక్" చేయాలనుకుంటే, ఇంకొందరు "స్టెయిర్ కేస్  వాక్"  చేయాలను కుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచి పెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయ మని సూచిస్తున్నారు.*


      ఒక్క సారిగా వీరి వైఖరి

      ఇలా మారి పోడానికి

      కారణం సరికొత్త

      అధ్యయనాలలో

      వెలుగు చూస్తున్న అంశాలే

      కారణం. 

*ఇలా వెల్లడైన అనేక పరి శోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది.          దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబు తున్నారో చూద్దాం.*  


*➢    "మానసిక ఒత్తిడి" వల్ల గ్యాస్ ::*

       కడుపులో  గ్యాస్ సమస్యను వాయువు అంటారు.                ఇది రావ డానికి, ముదర డానికి కారణం  ఆహార లోపాల వల్ల కాదట.  

"మానసిక ఒత్తిడి" వల్ల ఎక్కువ వస్తుందట !


*➢  "ఆవేశ కావేశాల" వల్లే అధిక రక్తపోటు ::*


     ఉప్పు ఎక్కువగా తినే వారి కంటే 

"ఆవేశ కావేశాలను" అదుపులో పెట్టుకోని వారిలోనే  "అధిక రక్తపోటు" ఎక్కువట !


*➢   "అతి బద్ధకం" వల్ల చెడు కోలెస్టరాల్ ::*


        కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే  అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కోలెస్టరాల్ ఎక్కువట!


*➢   "మధుమేహం" సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినే వారిలో కంటే,*

       "అధిక స్వార్ధం", 

       "మొండితనం"

*ఉన్నవారి లోనే ఎక్కువట !*


*➢  "అతి విచారం" వల్ల ఆస్త్మా  ::*


    ఊపిరి తిత్తులకు గాలి అందక పోవడం కంటే, 

అతివిచారం వల్లనే ఊపిరి తిత్తులలో మార్పులు వచ్చి ఆస్త్మా వస్తుందట... 


*➢   "ప్రశాంతత" లేక గుండె జబ్బులు ::*


ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టు కోవడంలో మార్పులు వస్తున్నాయట.


అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట. 


*మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు "మూల కారణాలు" తరచి చూస్తే "ఆహార అలవాట్ల" వల్లకాదని లైఫ్‌ స్టయిల్ సంబంధ మైన వేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు.         వారి అధ్యయనం ప్రకారం-* 


  *  50% ఆధ్యాత్మికత

      లోపంవల్ల

  *  25% మానసిక కారణాల

      వల్ల

  *  15% సామాజిక,

      స్నేహబాంధవ్యాల లోపం

      వల్ల

  *  10% శారీరక కారణాల

       వల్ల...

*రోగాలు వస్తున్నాయి. అందువల్ల "కడుపు మాడ్చుకుని" ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా, "జీవన శైలి"ని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు.* 


*వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండా లంటే* 


       -  స్వార్ధం, 

       -  కోపం, 

       -  ద్వేషం, 

       -  శత్రుత్వం, 

       -  ఆవేశం, 

       -  అసూయ,

       -  మొండితనం, 

       -  బద్ధకం, 

       -  విచారం, 


*వంటి "వ్యతిరేక భావాల"ను వదిలించు కోవాలి.*


       -  కారుణ్యం, 

       -  త్యాగం, 

       -  శాంతం, 

       -  క్షమ, 

       -  నిస్వార్ధం, 

       -  స్నేహభావం,

       -  సేవాభావం, 

       -  కృతజ్ఞత, 

       -  హాస్య ప్రియత్వం,

       -  సంతోషం , 

       -  సానుకూల దృక్పథం

పెంచు కోవాలి.

ఓంశాంతి🙏🇲🇰🕉️🚗

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర..


*అనారోగ్యం..అసహనం..*


*(యాభై నాలుగవ రోజు)*


శ్రీ స్వామివారు అడిగినట్లుగా జీవసమాధి చేయడం తమవల్ల కాదని ఖరాఖండిగా తేల్చేసిన శ్రీధరరావు దంపతులు తిరిగి తమ ఇంటికొచ్చేసరికి.. సత్యనారాయణమ్మ గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు..ఆయాసం ఎక్కువగా ఉండి.. ఊపిరి తీసుకోవడమే కష్టంగా వుందావిడగారికి..


సత్యనారాయణమ్మ గారిని చూసుకుంటాను అని చెప్పిన బంధువులావిడ..ఈ దంపతులను చూడగానే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి..

"మీరసలు మనుషులేనా?..పెద్దావిడ కు ఆరోగ్యం బాగాలేదని తెలిసికూడా స్వాములు..పూజలు అంటూ తిరుగుతారా?..మీరు ఈవిడను నిర్లక్ష్యం చేయబట్టే..ఈరోజు ఈ ఉపద్రవం వచ్చిపడింది..ఇక ఒక్కనిమిషం కూడా ఈవిడను ఈ ఊళ్ళో ఉంచొద్దు..కనిగిరి కి తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించండి.." అంటూ చిందులు తొక్కసాగారు..


"అది కాదమ్మా..మేము వెళ్లేముందు మిమ్మల్ని అడిగే కదా మేము స్వామివారి దగ్గరకు వెళ్ళింది..మీరు కూడా సమ్మతించారు..ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు..ఇంతకాలం మేము జాగ్రత్తగానే వున్నాము.." అంటూ సర్దిచెప్పబోయారు శ్రీధరరావు గారు..కానీ ఆ వచ్చిన బంధువులావిడ వింటేనా?..తన ధోరణిలో ఈ దంపతులిద్దరికీ శాపనార్ధాలు పెట్టి..సత్యనారాయణమ్మ గారిని కూడా కనిగిరి వెళ్ళడానికి సమాయత్తం చేయసాగారు..


ప్రభావతి గారికి దుఃఖం ముంచుకొచ్చింది..దాదాపు పాతికేళ్ల పాటు అత్తగారు తానూ కలిసి వున్నారు..సంసారమన్నాక చిన్న చిన్న కోపాలు మాటలు సహజం..అవి ఎప్పుడన్నా తలెత్తినా ఎవరో ఒకళ్ళు సర్దుకుని పోయేవాళ్ళు....ఇద్దరూ కలిసి మెలిసే వున్నారు..ఈరోజు ఎందుకిలా జరిగిందో అర్ధం కాక బాగా బాధపడ్డారు..పైగా అంత బాధలోనూ సత్యనారాయణమ్మ గారు కూడా తాను కనిగిరి కి వెళ్లి అక్కడ ఉంటానని చెప్పడం ఇంకా హృదయాన్ని కలచివేసింది..ఆ వచ్చిన బంధువు తానెంత గొప్పగా అత్తగారికి సేవ చేసిందీ చెపుతూ..స్వాములను నమ్ముకుంటే చివరకు దక్కేది మన్నే అని చులకనగా మాట్లాడటం మొదలుపెట్టింది..శ్రీధరరావు ప్రభావతి గార్లు తిరిగి ఒక్క ముక్క అనలేదు..


"అమ్మా..ఇంతకాలం మాతోనే ఉన్నావు..నీకంతగా కష్టంగా వుంటే..ప్రభావతి నీ దగ్గరే ఉంటుంది..స్వామివారి వద్దకు నేనొక్కడినే వెళ్ళొస్తాను.." అని శ్రీధరరావు గారు ఎంతో దూరం నచ్చచెప్పబోయారు..సత్యనారాయణమ్మ గారు అంతా విని .."శ్రీధరా రేపుదయం కారు తెప్పించు..నేను కనిగిరి వెళ్లి అక్కడ వుంటాను.." అన్నారు..


"మీరు చప్పున ఇంటికి వెళ్ళండి" అని స్వామివారు ఎందుకు చెప్పారో అప్పుడు బోధపడిందా దంపతులకు..ఇక చేసేదేమీలేక ప్రక్కరోజు ఉదయాన్నే కందుకూరు నుంచి కారు తెప్పించి..శ్రీధరరావు గారే దగ్గరుండి తన తల్లిగారిని కనిగిరి లో వదిలిపెట్టి బరువెక్కిన గుండెతో తిరిగి రాత్రికి మొగలిచెర్ల చేరారు..అప్పటి దాకా ప్రభావతి గారు భోజనం చేయకుండా ఎదురుచూస్తున్నారు..ఆవిడ మనసులో ఒక మూల అత్తగారు మనసు మార్చుకొని తిరిగి వస్తారని ఒక ఆశ!..కానీ అలా జరగలేదు..ఆరాత్రి ఆ దంపతులిద్దరూ నిద్రపోలేదు..ఏదో బలమైన దుష్టశక్తి ఆ బంధువు రూపంలో వచ్చి సత్యనారాయణమ్మ గారి మనసు మార్చి..తమకు ఆమెను దూరం చేసిందని అనుకున్నారు..


తెల్లవారగానే..శ్రీ స్వామివారి ఆశ్రమానికి బండి కట్టుకొని వెళ్లారు..చిత్రంగా శ్రీ స్వామివారు ఆశ్రమం బైట నిలబడి వున్నారు..వీళ్ళను చూడగానే..పెద్దగా నవ్వుతూ.."రండి!..రండి!..మీ కోసమే ఇక్కడ వున్నాను..మీరొస్తారని ముందే తెలుసు!.." అన్నారు..ఆశ్చర్యపోవడం ఈ దంపతుల వంతు అయింది..


ప్రభావతి గారు పూసగుచ్చినట్టు అంతా వివరంగా చెప్పి.."నాయనా!..మనసంతా బాధగా ఉంది..మా బంధువులావిడ రాకున్నా బాగుండు..అత్తగారు మా దగ్గరే వుండేవారు.." అన్నారు ముగింపుగా..


శ్రీ స్వామివారు మళ్లీ పెద్దగా నవ్వి.."అమ్మా..మీకొక విషయం చెప్పాలి..రండి లోపల కూర్చుని మాట్లాడుకుందాము.." అంటూ ఆశ్రమం లోపలికి దారి తీసారు..


శ్రీ స్వామివారి బోధ..ఊరట చెందటం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699.)