10, జూన్ 2021, గురువారం

తొలి అర్ఘ్య

 అస్సలు సంధ్యావందన సమయాన అర్ఘ్యం చిమ్మడంలో ఆంతర్యమేమిటి. 


తొలి అర్ఘ్య చిమ్ము సమయంలో 'ఇదమర్ఘ్యం సూర్యగతి నిరోధక  మందేహ రాక్షస ఆయుధ నాశాయ భవతు' (అంటే సూర్య గమనమును అడ్డపెట్టుచున్న మందేహ రాక్షసుల ఆయుధాలు నాశనము కావయునని) అనియు రెండ అర్ఘ్య సమయంలో 'ఇదమర్ఘ్యం సూర్యగతి నిరోధక  మందేహ రాక్షస హయ నాశాయ భవతు'(అంటే సూర్య గమనమును అడ్డపెట్టుచున్న మందేహ రాక్షసుల గుఱ్ఱాలు నాశనము కావయునని) మరియు మూడవ అర్ఘ్య చిమ్ము సమయంలో  'ఇదమర్ఘ్యం సూర్యగతి నిరోధక సర్వ  మందేహ రాక్షస నాశాయ భవతు'(అంటే సూర్య గమనమును అడ్డపెట్టుచున్న మందేహ రాక్షసుల నందరిని నాశనము కావయునని) అని అనుకుంటూ అర్ఘ్యం చిమ్మినయెడల అర్ఘ్య చిమ్ముటయందు ముందుకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలు కలుగగలదు. 


ఏలన సంధ్యాకాలమున అర్ఘ్యములను విడువనివాడు మరు జన్మలో గుడ్లగూబగా పుట్టునని శాస్త్రము చెప్పుచున్నది.

కామెంట్‌లు లేవు: