ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
3, సెప్టెంబర్ 2023, ఆదివారం
⚜ శ్రీ త్రయంబకేశ్వర ఆలయం
🕉 మన గుడి : నెం 167
⚜ ఛత్తీస్‌గఢ్ : ఓనా-కొనా (బలోద్ జిల్లా)
⚜ శ్రీ త్రయంబకేశ్వర ఆలయం
💠 దేవాలయం అనేది మానవులను మరియు దేవతలను ఒకచోట చేర్చడానికి రూపొందించబడిన నిర్మాణం.
దేవాలయం కళల సంశ్లేషణ, ధర్మం యొక్క ఆదర్శాలు, నమ్మకాలు, విలువలు మరియు హిందూమతంలో ప్రతిష్టించబడిన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
💠 ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన కళాఖండం.
ఒనకోన శివ మందిరం ఇటీవల నిర్మించిన ఆలయం.
నిజానికి ఇది ఇంకా పూర్తి కాలేదు.
నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
💠 ఇది గాంగ్రెల్ డ్యామ్ ఒడ్డున ఉంది.
ధామ్తరీకి చెందిన ఒక వ్యాపారవేత్త ఆలయాన్ని నిర్మించాడు.
ప్రారంభించి 17 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అసంపూర్తిగానే ఉన్నా, అసంపూర్ణతలోనే దాని అందం ఉంది.
ఈ ప్రదేశం ఇప్పటికే పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆలయానికి వెళ్లే రహదారి ఇంకా సిద్ధంగా లేదు, పర్యాటకులకు ఆదుకునేందుకు మౌలిక సదుపాయాలు సిద్ధంగా లేవు.
💠 ఈ ఆలయ స్థాపకుడు తీర్థరాజ్ ఫుటాన్ గారిచే ఈ ఆలయం మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న శ్రీ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ధామ్ లాగా నిర్మించబడుతోంది.
నాసిక్‌లో కనిపించిన దృశ్యాన్ని అదే విధంగా నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీనిని తామ్రకేశ్వర్ ఆలయం అని కూడా పిలుస్తారు.
ఇక్కడి శిల్పకళ చాలా అందంగా ఉంటుంది.
💠 నాసిక్‌కు తీర్థయాత్రలకు వెళ్లలేని వారి ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నందున, ఇక్కడికి ఒనకోనకు వచ్చి దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
💠 ఈ దేవాలయంలో కిరణాలు లేకుండా నిర్మించబడిన అద్భుతమైన వాస్తుశిల్పం ఉంది. ఆలయ ముఖద్వారం మొత్తం మీద ఉన్న శిల్పాలు దోషరహితంగా ఉండటమే కాకుండా చాలా అందంగా ఉన్నాయి.
💠 ఈ గ్రామం కొండ కింద ఉంది.
ఇక్కడికి రావాలంటే కఠినమైన రోడ్లు దాటాలి.
ఈ ప్రదేశం సహజంగా చాలా అందంగా ఉన్నప్పటికీ, గ్యాంగ్రెల్ డ్యామ్ ప్రాంతం కారణంగా , ఈ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది.
ఇటీవల కొన్నేళ్లుగా ఇక్కడికి వచ్చే ప్రజలకు స్థానిక మత్స్యకారులు బోటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
💠 NH-30 రాయ్‌పూర్ - బస్తర్ రహదారిలో, ధామ్‌తరి నుండి 35 కి.మీ మరియు రాజధాని రాయ్‌పూర్ నుండి 90 కి.మీ దూరంలో ఓన కోనా ఆలయం ఉంది.
చమత్కార పద్యం
చమత్కార పద్యం
ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన కంద పద్యం
*అంచిత చతుర్ధ జాతుడు*
*పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్*
*గాంచి, తృతీయం బక్కడ*
*నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!*
*భావం:*
గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను....
ఏమీ అర్థం కాలేదు కదా!?
ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు
1) భూమి
2) నీరు
3) అగ్ని
4) వాయువు
5) ఆకాశం.
ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి.
చతుర్థ జాతుడు అంటే *వాయు నందనుడు,*
పంచమ మార్గము అంటే *ఆకాశ మార్గము,*
ప్రధమ తనూజ అంటే *భూమిపుత్రి సీత,*
తృతీయము అంటే *అగ్ని ,*
ద్వితీయము దాటి అంటే *సముద్రం దాటి* ఇప్పుడు భావం చూడండి....
*హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని... భావం*
*ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. వ్రాసిన కవి గారికి నమస్సుమాంజలి.!!!* 🙏
పెద్ద మనసు
*1872*
*కం*
పెద్ద మనసు లేనప్పుడు
పెద్దలు గా నెంచరెవరు పెద్దగ నెపుడున్.
పెద్ద వయసు తో పిన్న ల
పెద్ద గ వేధించువారు పెద్దల సుజనా!!??
*భావం*:-- ఓ సుజనా! పెద్ద మనస్సు లేని వారి ని ఎవరైనా పెద్దలు గా పెద్ద గా గుర్తించరు. పెద్ద వయసు తో పిల్లల నది వేధించే వారు పెద్దలు ఎలా అవుతారు!!??
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
సన్యాసిని చూసిన
🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*_దృష్టా యతిర్యతిం సద్యో*
*వైద్యో వైద్యం నటం నటః।_*
*_యాచకో యాచకం దృష్ట్వా*
*శ్వానవద్ గుర్గురాయతే।।_*
*- _తాత్పర్యము_-*
*ఒక సన్యాసిని చూసిన మరో సన్యాసి, ఒక వైద్యుడిని చూసిన మరో వైద్యుడు, ఒక నటుడు మరొక నటుడిని చూసినప్పుడు, ఒక యాచకుడిని చూసిన మరో యాచకుడు*
[ *ఒక పండితుణ్ణి చూసిన మరో పండితుడు* ]
*వెంటనే కుక్కలా గర్జిస్తాడు*.....
🧘♂️🙏🪷 ✍️🙏
బసవ పురాణం - 21 వ భాగము...!!
🎻🌹🙏 బసవ పురాణం - 21 వ భాగము...!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿జగదేవుడు ఇంటికివెళ్లి షడ్రసోపేతమైన భోజనాదులు సిద్ధం చేశాడు. పురోహితులను పిలిచి అర్ఘ్య పాద్యాదులిచ్చి పూజించి తర్వాత బసవన్నకు రావచ్చునని కబురు పెట్టాడు. ఇది తెలిసి బసవడు కోపించి విందుకు వెళ్ళడం మానుకున్నాడు.
🌸జగదేవుడు పరుగు పరుగున వెళ్లి బసవన్నను కలిసి రమ్మని ప్రార్థింపగా బసవన్న ‘‘జగదేవయ్యా! నీవు చాలా తప్పు చేశావు. మనం కర్మ సంహారులం. ఆగమ ప్రోక్తమైన ధర్మం. అటువంటి కర్మబద్ధులను అర్చించడం తప్పు. శివునికెత్తిన కేలు శివద్వేషికి ఎత్తరాదు. వారితో ‘దర్శనాదీః పాపదా’ అనే వాక్యాన్ని బట్టి దర్శనాలప సంస్పర్శన శయన సంపర్క భోజనాసన దానాదులు నిషిద్ధాలు’’.
అని చెప్పి బసవన్న కొందరు భక్తులు కథలు చెప్పాడు.
🌿అది విని జగదేవుడు తన తప్పును మన్నింపుమని బసవన్నను ప్రార్థించాడు. ‘నేను చేసింది తప్పే. ఈ దోషానికి ప్రాయశ్చిత్తంగా ప్రాణాలు విడుస్తాను’ అన్నాడు జగదేవుడు. ‘వద్దు జగదేవా! నేను చెప్పిన మాట విను. త్వరలో ఈ నగరంలో శివద్రోహం జరుగబోతున్నది.
🌸అప్పుడే శివాపచారిని అణచివేయవలసిన బాధ్యత నీది. అదే నీ కర్తవ్యం’’ అని ఉపదేశించాడు బసవన్న. జగదేవుడు సరేనని వీరతాంబూలం తీసుకున్నాడు. ఆ తర్వాత బసవన్న అసంఖ్యక భక్తగణంతో జగదేవుని ఇంటికి వెళ్ల విందు ఆరగించాడు.
🌿అల్లయ్య మధుపయ్యల కథ
కల్యాణ నగరంలో అల్లయ్య మధుపయ్య అనే పరమ మహేశ్వరులు ఇద్దరున్నారు. బసవనితో కలిసి వారు శివార్చనాపరులై శివానందాన్ని అనుభవిస్తూ ఉండేవారు. ఇలా వుండగా నిష్కారణంగా బిజ్జలునికి వారిమీద కోపం వచ్చింది. బిజ్జలునికి యమపురి రమ్మని ఆహ్వానం వచ్చిందా అన్నట్లు, బసవని మహిమ, భక్తి అన్నీ తెలిసి కూడా తెలియని అజ్ఞానివలె ప్రవర్తించాడు.
🌸దుర్మార్గమని తెలిసి కూడా మధించి బిజ్జలుడు అల్లయ్య మధుపయ్యగార్లను పిలిచి వాళ్ల కళ్లు పీకించాడు.
‘ఓహో! ఎంతటి ఘోరమిది. శివభక్తులాగ్రహిస్తే చెడిపోడా బిజ్జలుడు! ఇంకేమి జీవనమిది’ అని భక్తగణమూ బసవన్నా కోపోద్దీపితులైనారు. బసవడు అల్లయ్యను మధుపయ్యను పిలిచి వాళ్ల కళ్లు మళ్లీ వాళ్లకు ప్రసాదించాడు. అయితే ‘శివద్రోహం జరిగిన నగరంలో ఇంక ఉండరాదని’ శివభక్తులు నిశ్చయించుకొని జగదేవ మంత్రిని పిలిచి ‘నీ బాస నెరవేర్చుకునే సమయం వచ్చిం’దని చెప్పారు.
🌿‘‘బిజ్జలుడు చేసిన అన్యాయానికి కల్యాణ నగరం పాడగుగాక’’ అని శపించారు భక్తులు. మాచయ్యగారు చౌడరాయుడు, ఏకాంత రామయ్య, కిన్నర బ్రహ్మయ్య, కాశిరాజు, కన్నద బ్రహ్మయ్య, కక్కయ్య, మాది రాజయ్య, మసణయ్య మొదలైన భక్తగణమంతా కదలి రాగా కల్యాణనగరం వదలి బసవన్న కప్పడి సంగమేశ్వరానికి వెళ్లిపోయాడు.
🌸ఇంతలో కల్యాణ నగరంలో ఉత్పాతాలు పుట్టాయి. భూకంపం వచ్చి భూమి అటూ ఇటూ ఊగింది. అర్థరాత్రి కాకులు అరవసాగాయి. వంటలు చేసి మూతలు పెడితే పురుగులు పడ్డాయి. తోక చుక్కలు రాలాయి. రాళ్ల వాన కురిసింది. సూర్యచంద్రుల చుట్టూ పరిమేషం వచ్చింది.
🌿వేసవిలో మంచు కురిసింది. మధ్యాహ్నం యముడు భయంకరంగా వీధులలో తిరుగుతున్నట్లు కన్పడ్డాడు. రాజుకు తల లేని నీడ కన్పడింది. సూర్యుడుదయించే సమయానికి ఆకాశంలో ఎందరో సూర్యులు ఉదయించినట్లు కన్పడింది. ఇవన్నీ చూచి ప్రజలు భీతిల్లిపోయారు.
ఇలా ఉండగా జగదేవయ్య తన ఇంటికి వెళ్లాడు.
🌸అతణ్ణి తల్లి చూచి ఇలా అన్నది. ‘‘శివద్రోహం చెవిని పడ్డప్పుడే వారిని సంహరించాలి. అలాంటిది విని కూడా విననట్లు ఊరుకున్న నీచునికి మోక్షమేమిటి? అతనిది భక్తి ఏమిటి? లోగడ నీకు తాంబూలమిచ్చి ఆ భక్తులుంతా ఏ పని చెప్పారో గుర్తుందా? వారంతా భయస్థులై నీకా పని అప్పగించలేదు.
🌿అందులో ఏ ఒక్క భక్తుడలిగినా సమస్త బ్రహ్మాండములూ తల్లకిందులవుతాయి. దక్ష యజ్ఞగాధ నీకు తెలిసిందే కదా! నీకీ అవకాశం ఇచ్చేందుకే భక్తులు నీకు తాంబూలం ఇచ్చారు. అలాంటిది శివభక్త గణనింద విని కూడా ఊరుకొని తిండికోసం ఇంటికి వచ్చావు. ఛీ! కుక్కా’’ అని చిప్పలో ఇంత అన్నం దొడ్డివాకిట పెట్టి ‘జూజూజూ’ అని కొడుకను పిలిచింది. జగదేవుడు కూడా సిగ్గుపడకుండా కుక్కలాగే వచ్చి అన్నాన్ని మూతితో కతికి తిన్నాడు.
🌸ఈ వార్త మల్లయ్య, బ్రహ్మయ్య అన్న భక్తులు విన్నారు. అర్థరాత్రి వేళ వారు వచ్చి జగదేవునితో కలిశారు. ముగ్గురూ కలిసి బిజ్జలుని భవనానికి వెళ్లారు. కత్తులు తీసి బిజ్జలుని పొడిచారు. అతడి తలను కోసి కడుపులో పెట్టారు.
ఆ తర్వాత జగదేవుడు, మల్లయ్య, బ్రహ్మయ్య ముగ్గురూ రాజనగరు వదలి తమ నివాస స్థానాలకు వచ్చారు. జగదేవుడు తల్లి పాదాలకు మొక్కాడు. ఆమె దీవించి ప్రసాదమిచ్చింది.
🌿అది స్వీకరించి ‘‘తల్లీ! శివద్రోహిని హతమార్చాను. కాని శివద్రోహం విన్న వెంటనే ఈ పని చేయనందుకు నాకు నేను విధించుకోవలసిన శిక్ష ఇంకా వుంది’’ అని జగదేవుడు తన తలను తాను నరుక్కొని బంధు, మిత్ర పుత్ర కళత్ర పరివారంతో విమానంలో కైలాసం చేరాడు... సశేషం..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం భాగం 8/12
ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం
భాగం 8/12
(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన,
"శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం"
అనే పత్రంలోని ఒక అంశం)
-----------------------
7. భౌతిక శాస్త్రాలు
ఐన్ స్టీన్, రూథర్ ఫర్డ్ వంటి శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేసి కొత్తకొత్త విషయాలు కనుగొన్నారు.
తద్వారా తరువాతి తరాలు పరిశోధనలు కొనసాగించే విధంగా మార్గం చూపారు.
అనేకమంది శాస్త్రవేత్తలు నిరంతరమూ పరిశోధిస్తూ, క్షిపణులవంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని నిరంతరమూ అభివృద్ధి చేస్తున్నారు.
శ్రీమద్వాల్మీకి రామాయణంలో అభివృద్ధి చెందిన భౌతిక విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం
అబ్బురపరచేదిగా దర్శించగల్గుతాం.
శస్త్ర - అస్త్ర పరిజ్ఞానం
విశ్వామిత్రుడు శ్రీరామునికి శస్త్రపరిజ్ఞానం అంతా అందించాడు.
ధర్మచక్ర,
కాలచక్ర,
విష్ణుచక్ర వంటి చక్రాలనీ,
శివుని శ్రేష్ఠమైన శూలాన్నీ,
మోదకి,శిఖరి అనే ప్రజ్జ్వరిల్లే రెండు గదలనీ,
శుష్కము - ఆర్ద్రము అనే రెండు పిడుగులనీ, రెండు శక్తులనీ,
కంకణమనే ముసలాన్నీ గ్రహింపమని
- విశ్వామిత్రుడు శ్రీరామునికి శస్త్రాలని అందించాడు.
(గమనిక : శస్త్రము - పదునైన ఆయుధము)
ఐంద్ర, బ్రహ్మాస్త్రాల వంటి మంత్రపూరితంగా విడిచే అస్త్రాలనీ కూడా విశ్వామిత్రుడు శ్రీరామునికి ఉపదేశించాడు.
(గమనిక: అస్త్రము - మంత్రపూరితమైనది)
అస్త్ర ఉపసంహారం
రెండవ ప్రపంచ యుద్ధంలో, హిరోషిమా నాగసాకి నగరాలపై అమెరికా ప్రయోగించిన అణుబాంబుల ప్రయోగ విషఫలితాలు అందఱికీ తెలిసినవే కదా!
అస్త్రాన్ని ప్రయోగిస్తే, దాన్ని తిరిగి ఉపసంహరించడం అనేది ఇప్పటివరకూ ఎవరూ కనుగొనలేక పోవడం గమనించవలసిన విషయం.
కానీ పైన పేర్కొన్న అస్త్రశస్త్రాలని స్వీకరించిన శ్రీరాముడు, వాటి ఉపసంహారం కూడా విశ్వామిత్రుని నుండి అడిగి తెలుసుకున్నాడు.
శ్రీరాముడు వాటి ప్రయోగాన్నీ, ఉపసంహారాన్నీ రెంటినీ అనేక సందర్భాలలో ధర్మబద్ధంగా ఉపయోగించాడు.
కాకాసురుని పై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దాని ప్రాణాలు పోకుండా - అవయవలోపంతో సరిపెట్టి కాపాడడం ప్రయోగ - ఉపసంహారాలకి గొప్ప ఉదాహరణ.
ఆయుధాల ప్రయోగం - విరుగుడు
అస్త్ర శస్త్రాలలో, ఒకరిచేత ప్రయోగింపబడినదానిని నిర్వీర్యంచేస్తూ, విరుగుడుగా ప్రత్యర్థిచేత మరొకటి విజయవంతంగా ప్రయోగించబడడం శ్రీమద్రామాయణంలో మనకి అనేకసార్లు కనిపిస్తుంది.
శక్తి అనే ఆయుధాన్ని రావణుడు ప్రయోగిస్తే, ఒక్కొక్కసారి
- దానంతటదే వెనుదిరగడం,
- విభీషణునిపై పడడాన్ని లక్ష్మణుడు ఎదుర్కొని నిర్వీర్యం చేయడం,
- లక్ష్మణుని శరీరంలోకి దిగి మూర్ఛిల్లితే,
రాముడు దానిని భౌతికంగా తొలగించగా,
సుషేణుని ఓషధి చికిత్సతో లక్ష్మణుడు పూర్తి స్వస్థత పొందడం కూడా గమనార్హం.
అస్త్ర - శస్త్రాల ద్వారా గొప్ప ఫలితాలు పొందడం, ఆనాటి భౌతిక శాస్త్ర విజ్ఞానం ఎంత ఆదర్శంగా నిలచిందో తెలుస్తుంది కదా!
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
నిజమైన గుర్తింపు సాధనం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*✍నేటి కధ✍🏽*
*నిజమైన గుర్తింపు సాధనం*
ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు.
రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు.
కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు.
అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు.
రాజు చాలా ఆశ్చర్యపోయాడు.
అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు - “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది.
దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.
రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు.
రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది.
అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు.
అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు.
కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు... అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..
రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు.
అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము.
రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది.
ఒక రాణి స్తాయి వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు....
*రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు
*కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు.
ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు.
రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.
రాజుకు చాలా కోపం వచ్చింది.
కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు.
తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు.
మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని.
*రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు.
*అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు.
ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు...
*మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే!
*మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే.*
సేకరణ:- వాట్సాప్ పోస్ట్.
సంకటహర చతుర్థి
*సంకటహర చతుర్థి ఎందుకు చేసుకుంటారు?*🍃
సంకటహర చతుర్థి
🍀సంకటహర చతుర్థి, దక్షిణ భారత రాష్ట్రాల్లో సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది హిందువులకు పవిత్రమైన పండుగ, ఇది గణేశుని గౌరవార్థం జరుపుకుంటారు.
🍀ఇది ప్రతి హిందూ క్యాలెండర్ నెలలో కృష్ణ పక్షం (చంద్రుని క్షీణత దశ) 'చతుర్థి' (నాల్గవ రోజు) నాడు గమనించబడుతుంది. ఈ పండుగ వేడుకలు భారతదేశంలోని ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాలలో ప్రబలంగా ఉన్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలో, ఉత్సవాలు మరింత విస్తృతంగా మరియు వైభవంగా ఉంటాయి. 'సంకష్టి' అనే పదానికి సంస్కృత మూలం ఉంది మరియు ఇది 'కష్ట సమయాల్లో విముక్తి' అని సూచిస్తుంది, అయితే 'చతుర్థి' అంటే 'నాల్గవ రోజు లేదా గణేశుడి రోజు'. కాబట్టి, ఈ శుభప్రదమైన రోజున, భక్తులు జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించడానికి మరియు ప్రతి క్లిష్ట పరిస్థితిలో విజయం సాధించడంలో సహాయపడటానికి గణేశుడిని పూజిస్తారు.
సంకష్టి చతుర్థి ఆచారాలు:
🍀సంకటహర చతుర్థి రోజున, భక్తులు తెల్లవారుజామున లేచి గణేశుడిని పూజిస్తూ ఆ రోజును అంకితం చేస్తారు. వారు తమ దేవత గౌరవార్థం కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. కొందరు వ్యక్తులు పాక్షిక ఉపవాసాన్ని కూడా ఉంచవచ్చు.
🍀సంకష్ఠి పూజ సాయంత్రం చంద్రుని దర్శనం తర్వాత జరుగుతుంది. గణేశుడి విగ్రహం దూర్వా గడ్డి మరియు తాజా పూలతో అలంకరించబడింది. ఈ సమయంలో దీపం కూడా వెలిగిస్తారు. ధూపం వెలిగించడం మరియు వేద మంత్రాలను చదవడం వంటి ఇతర సాధారణ పూజా ఆచారాలు కూడా నిర్వహిస్తారు. దీని తరువాత భక్తులు మాసానికి సంబంధించిన 'వ్రత కథ'ని చదువుతారు. సాయంత్రం పూట వినాయకుడిని పూజించి చంద్రుని దర్శనం చేసుకున్న తర్వాతే ఉపవాసం విరమిస్తారు.
🍀మోదకాలు మరియు వినాయకునికి ఇష్టమైన ఇతర తినుబండారాలతో కూడిన ప్రత్యేక 'నైవేద్యం' నైవేద్యంగా తయారు చేయబడింది. దీని తరువాత 'ఆరతి' నిర్వహించబడుతుంది మరియు తరువాత భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.
🍀సంకష్టి చతుర్థి రోజున, ప్రత్యేక పూజ ఆచారాలు కూడా చంద్రుడు లేదా చంద్ర దేవునికి అంకితం చేయబడతాయి. ఇందులో చంద్రుని దిశలో నీరు, చందనం (గంధం) పేస్ట్, పవిత్ర బియ్యం మరియు పువ్వులు చల్లడం ఉంటుంది.
🍀ఈ రోజున 'గణేశ అష్టోత్రం', 'సంకష్టనాశన స్తోత్రం' మరియు 'వక్రతుండ మహాకాయ' కొన్నింటిని పఠించడం శ్రేయస్కరం. వాస్తవానికి గణేశుడికి అంకితం చేయబడిన ఇతర వేద మంత్రాలను జపించవచ్చు.
సంకష్టి చతుర్థి ప్రాముఖ్యత:
🍀సంకష్ఠి చతుర్థి నాడు చంద్రుని దర్శనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా అంగార్కి చతుర్థి రోజున అంకితభావంతో తమ దేవతను ప్రార్థించడం ద్వారా తమ కోరికలన్నీ నెరవేరి, సుఖశాంతులతో జీవనం సాగిస్తారని గణేశుడి అమితమైన భక్తులు విశ్వసిస్తారు. సంతానం లేని జంటలు కూడా సంతానం పొందేందుకు సంకష్టి చతుర్థి వ్రతాన్ని పాటిస్తారు.
🍀ప్రతి చాంద్రమానంలో సంకష్టీ చతుర్థి జరుపుకుంటారు కాబట్టి, ప్రతి నెలలో గణేశుడిని వేర్వేరు పీటలతో (తామరపువ్వులు) మరియు పేర్లతో పూజిస్తారు. మొత్తం 13 వ్రతాలు ఉన్నాయి, ప్రతి వ్రతానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు కథ ఉంటుంది, దీనిని 'వ్రత కథ' అంటారు. అందువల్ల మొత్తం 13 'వ్రత కథలు' ఉన్నాయి, ప్రతి నెలకు ఒకటి మరియు చివరి కథ 'ఆదికా' అంటే హిందూ క్యాలెండర్లో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక అదనపు నెల వస్తుంది.
ధర్మంగా
🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*న హయనైర్న పలితైః న విత్తేన న బంధుభిః౹*
*రుషయశ్చక్రిరే ధర్మం యోయనూచానః స నో మహాన్॥*
𝕝𝕝తా𝕝𝕝
వృద్ధులు, తెల్లజుట్టు ఉన్నవారు, ధనవంతులు లేదా మీ బంధువులు ఇలా చెప్పినంత మాత్రాన అది ధర్మంగా పరిగణించబడదు. ఋషులు యుగయుగాల నుండి నైతికంగా భావించే వాటిని గమనించి ధర్మం అని చెప్పారు. మేము దానికే ఎక్కువ విలువ ఇస్తున్నాము.
వెన్నెల వెలుగులు
వెన్నెల వెలుగులు
----------------------------
చ : వడిగొని ఱేకు లుప్పతిల వాలిన కేసరముల్ దలిర్పఁ ,బు
ప్పొడిఁ దలమెక్కి, తేనియలు పొంగి తఱంగలుఁ గాఁ జెలంగి పైఁ
బడు నెలదేఁటిదాఁటులకుఁ బండువులై నవసౌరభంబు లు
గ్గడువుగ నుల్ల సిల్లె ఘన కైరవ షండము నిండు వెన్నెలన్ ;
ఆవెన్నెలలో సరోవరాలలో కానవచ్చే ప్రకృతి విలాసాన్ని కవి వర్ణిస్తున్నాడు. సరోవరాలలో చంద్రుని కిరణాలు
ప్రసారం కాగానే కలువలు రేకులు విప్పుతున్నాయి. ఆరేకుల వెనుకే కింజల్కాలు ప్రక్కలకు వ్రాలుతున్నాయి. ఆకింజల్కాలనుండి పుప్పొడి రాలుతోంది. ఆపుప్పొడి ప్రక్కనుండి మకరందం జారులు వారుతోంది.. అపుప్పొడి పీకవరకూ మెక్కి, తేనెత్రాగి తుమ్మెదలు
అటూ ఇటూ పరిభ్రమిస్తున్నాయి. ఆవాతా వరణానికి పండుగ శోభను కలిగిస్తూ కలువలనుండి గమ్మత్తుగా మత్తుగా , పరిమళాలు నలువైపుల నలుముకుంటున్నాయి .
ఇదీ ప్రకృతిలోని పరిణామము!
దీనినే కవి తన భాషలో భావనాత్మకముగా వర్ణించినాడు. వడిగొని రేకులుప్పతిల-గబగబా రేకులు విచ్చు కున్నాయట. వెంటనే కేసరములు వాలాయట,కలువలు, రేకులు విప్పగానే తుమ్మెదలు సిధ్ధంగా ఉన్నాయి ఆహారంకోసం ఆనందంకోసం. పుప్పొడిఁ దలమెక్కాయట.పీకల వరకూ మెక్కాయన్నమాట. తేనెకెరటాలుగా వస్తోంది తప్పించుకుంటానికి అటునిటు గెంతుతున్నాయి. వాటికి 'పండుగులవలె' కలువల నుండి సువాసనలు వ్యాపిస్తున్నాయట; ఇదంతా జరుగ టానికి ప్రధానమైనవి కైరవ షండములు.( కలువల సముదాయము. )
కలువకు 'కుముద' మని మరోపేరు. కు- అంటే భూమి , భూమికి ఆనందాన్ని కలిగించేవి అనియర్ధం.
కలువకు కువలయము అనేది పర్యాయపదం. దానికి భూమి యని యర్ధం!
కలువకూ చంద్రునకూ ప్రకృతిగత సంబంధం. భూమికీ కలువకూ సామ్యం. అందువలన కలువలు వికసించాయీ అంటే భూలోక మంతా ఆనందంగా ఉన్నదని వ్యగ్యం! చంద్రుని రాకతో మనస్సుకు ప్రశాంతత కల్గుతుంది." చంద్రమా మనసోజాతః"-అనివేదం! ఆఆనందమయ జగత్తునే కవి యిక్కడ ఆవిష్కరించాడు.
కలువలు, తుమ్మెదలు,పుప్పొడి, తేనె, పరిమళాలు, ఇత్యాదులన్నీ ' రసమయ' జగదా విష్కరణలోని భాగాలు.
ఇదంతా ప్రకృతి సౌందర్య స్వరూపం!
మొత్తంమీద సంధ్యాకాలం -సూర్యస్తమయం- చంద్రోదయం- వెన్నెల వెలుగులు. వీనియన్నింటి యందు ఎఱ్ఱన కవి
త్రిగుణాత్మక మైన ప్రకృతి దర్శనముతో బాటు త్రిగుణాత్మక స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి కూడా దర్శించినాడని మొన్ననే విన్న వించాను.
సాంధ్య వర్ణనలోని చీకటి తమోగుణం. సంధ్యాకాంతి.(ఎఱుపు) రజోగుణం. వెన్నెలలోని తెల్లదనం సత్వగుణం. యీమాదిరిగా నున్నప్రకృతిలో పరమాత్మ దర్శన మన్నమాట!
స్వస్తి!🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
దీపం ఉండగానే...
👌దీపం ఉండగానే....*
ఒక చనిపోయిన శవాన్ని పెట్టుకుని...
చావబోయే శవాలు విచిత్రంగా ఏడుస్తుంటాయి.!
అంతకన్నా అశ్చర్యం ఉండదు.*
ప్రతివారికీ పుట్టినవాడు చనిపోతాడని తెలిసికూడా
ఏడుస్తారు. జీవుడు కాలంలో ఎక్కడో తిరిగి తిరిగి,
ఎక్కడ నుండి వచ్చాడో అక్కడకు వెళ్ళిపోవడం నైజం.
ఆ మాయ నుండి ఎలా మారాలో,
శంకర భగవత్పాదులు దాని పరిశీలనానికి
మార్గాన్ని చెప్పారు.
*కాతే కాంతా కస్తే పుత్రః*
*సంసారో౬య మతీయ విచిత్రః*
*కస్య త్వం కః కుత ఆయాతః*
*తత్త్వం చింతయ తదిద భ్రాతః ॥* (భజగోవిందం)
*కాతే కాంతా*
భార్య ఎవరు? ఎక్కడ నుండి వచ్చింది?
అది తెలియదు.
*కస్తే పుత్రః*
నీ పుత్రులు ఎక్కడనుండి వచ్చారు? అదీ తెలియదు.
*సంసారొ౬య మతీవ విచిత్రః*
భార్యాబిడ్డలే సంసారం. ఎప్పటికి జీవయాత్ర అవుతుంది? ఎన్నాళ్ళీ ప్రయాణం?
*కస్యత్వం?*
నువ్వు ఎవరు?
*కః కుత ఆయాతః*
ఎక్కడనుంచి వచ్చావు?
మా అమ్మగారి కడుపులో నుండి వచ్చాను
అంటే... కడుపులోకి రావడానికి ముందు ఎక్కడున్నావు, అంతకు ముందు ఎక్కడ తిరుగుతున్నావు? ఎప్పటికి ఈ జీవయాత్ర ఆగేది? ఎన్నాళ్ళీ ప్రయాణం అని విసుగు లేదా?
*పునరపిజననం పునరపి మరణం*
*పునరపి జననీ జఠరే శయనం |*
ఇన్నేళ్ళు అయింది,
ఇంక *ఎవ్వారి రక్షించెదన్* అంటాడు ధూర్జటి. అందువలన నా కోసం నేను చేసుకున్నది లేదు
కాబట్టి ఈశ్వరా, నాకు జ్ఞానమియ్యి చాలు.
రామకృష్ణ పరమహంస
ఒక అద్భుతమైన ఉపమానం చెపుతుండేవారు.
ఒక త్రాచుపాము ఒక కప్పని పట్టుకుని మింగుతూంది, సగం కప్పని మింగింది.
కప్ప వెనకభాగం పాము నోట్లో ఉంది,
ముందు భాగం బయటికి ఉంది.
కప్ప నోటి భాగం ముందు ఒక ఈగ ఎగురుతున్నది.
ఆ ఈగని పట్టుకోవడానికి కప్ప నాలిక చాపుతున్నది.
ఏమి ఆశ్చర్యం? పరమసత్యం. ఎవరెంతకాలం
ఉంటారో తెలియదు.
శరీరంతో ఈశ్వరుణ్ణి పొందాలన్న ఒక్క ఆలోచన లేక, అన్ని విషయాలలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. ఆత్మద్రోహం చేసుకుంటున్నాం. ఇంత గొప్ప ఉపాధి వచ్చినా ఏ పుణ్యకార్యమూ చెయ్యలేదు,
ఏ నామమూ చెప్పలేదు. మిగిలినవాటి మీద పరమశ్రద్ధ.
ఒక్కసారి ఊపిరి ఆగిపోతే
కొత్త చాపలో చుట్టి తీసుకుని వెళ్ళి కాల్చేస్తారు.
11 రోజులు దాటిపోతే ఎవరూ గుర్తుకూడా ఉంచుకోరు
అంత మాత్రానికి వెంపర్లాడటమెందుకు?
జీవుడు మళ్ళీ జన్మకు జాగ్రత్త పడాలి కదా!
దానికేమీ చెయ్యడం లేదు.
ఈశ్వరుడి గురించిన చింతే లేదు.
ఎప్పుడో అంటావెందుకు?
జీవుడు కూడా వచ్చే జన్మకు జాగ్రత్త పడాలి కదా! దానికి చేసింది లేదు. ఎప్పుడు చేస్తావు అంటే,
*దంతంబుల్ పడనప్పుడే తనువునం దారూఢి యున్నప్పుడే*
*కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే*
*వింతల్‌మేన జరించనప్పుడే కురుల్ వెల్వెల్ల గానప్పుడే*
*చింతింపన్‌వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!*
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.
కాలం అనుల్లంఘనీయం. బహుధా పరాకు చెపుతుంది, ఉండని ఉపాధిని ఆధారం చేసుకుని ఉపాసన ద్వారా ఎప్పుడూ ఉండే సత్యంలోకి వెళితే, శరీరం పడిపోతున్నా బెంగ ఉండదు.
సత్యం ఎరుకలోనికి తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెడితే, ఈ జన్మలో కాకపోయినా, ఎప్పటికైనా ఈశ్వరుని దగ్గరకు నడుస్తాం. వెళ్ళిపోయిన ఒక్క క్షణాన్ని వెనకకు తెచ్చేవారు లేరు. ఈశ్వర శాసనానికి నడిచే కాలంలో జాగ్రత్త పడకపోతే ఇబ్బందిపడతాం. శరీరంతో తెచ్చిపెట్టుకున్నవన్నీ దానితోనే వెళ్ళిపోతాయి.
కాలానికి ఉన్న గొప్ప లక్షణం గ్రసించటమే.
కాలానికి శంకరాచార్యులు చెప్పిన పర్యాయపదం - *జగద్భక్షకః కాలం* - *జగత్తుని పుట్టించి జగత్తుని తింటుంది.* దాని ముందు ఎవరైనా పడిపోవలసిందే. ఎంత గొప్పవారైనా నిలబడగలిగినవారు లేరు. ఎంత గొప్పవాడైనా, భగవాన్ రమణులైనా, పరమాచార్యస్వామి అయినా శరీరాలు పడిపోవలసిందే. ఉండిపోతుందన్న భ్రాంతితో తెచ్చిపెట్డుకున్నవన్నీ శరీరంతో వెళ్ళిపోతాయి.
శంకరభగవత్పాదులు కాలం గురించి చేసిన *భజగోవింద శ్లోకాలు* చదివితే.... బాదం పప్పుని, కాయని గూటం పెట్టి కొట్టి తీసినట్లు ఉంటాయి. పట్టిన పిచ్చిని బూజుకర్ర పెట్టి దులిపినట్లు దులుపుతాయి
ఆ శ్లోకాలు. మోహవిచ్ఛేదం జరుగుంది. అందువల్లనే దానికి *మోహముద్గరం* అని పేరు. అందులో.....
*మా కురు ధనజన యౌవనగర్వం*
*హరతి నిమేషాత్కాలః సర్వం*
*మాయామయ మిద మఖిలం హిత్వా*
*బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ॥*
నేను అన్న భావన, అహంకారం, ధనం, జనం, గర్వం అన్నీఊపిరి ఆగడంతో పోతాయి. తనవారు అనుకున్నవాళ్ళందరూ పోతారు. ఏం మిగిలింది? ఏమీ మిగలలేదు. చేసిన పుణ్యం ఉంటే వస్తుంది, లేకపోతే ఏమీ రాదు. ఇవన్నీ తియ్యడానికి ఎంతో సమయం పడుతుంది అనుకుంటారేమో......!
ఒక నిమిషంలో అన్నీ తీసెయ్యగలదు. కాలానికి లొంగక శరీరం ఉండగా బ్రహ్మపదం పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. కాలాన్ని గెలిచినవారు లేరు. ఒంట్లో ఓపిక ఉండగా చేసుకోవాలి. కాలం ఈశ్వరస్వరూపమై హెచ్చరిక చేస్తుంది.
జాగరూకతతో మెలగాలి.
రామాయణమ్ 313
రామాయణమ్ 313
...
నేను ఇంద్రుడి గూఢచారిని కాను!
విష్ణువు దూతనూ కాను.
నేను వానరుడను,
వనచరుడను.
.
రాజదర్శనము లభించవలెనన్న కోరికతో మాత్రమే వనభంగము చేసినాను.
ఆత్మరక్షణ కొరకు మాత్రమే రాక్షసులను సంహరించినాను.
.
ఏ అస్త్రములు నన్ను బంధించలేవు కేవలము రాజదర్శన కాంక్షవలన మాత్రమే నేను కట్టుబడినాను.
.
అని రాక్షసేశ్వరుని చూసిపలుకుతూ హనుమంతుడు ...
.
మహారాజా! నేను శ్రీరామచంద్రుని కార్యము నిమిత్తమై నీ వద్దకు వచ్చితిని.ఆయన దూతను నేను.
.
సోదరుడైన సుగ్రీవుడు నీ కుశలమడిగి తన సందేశము నీకు చెప్పమనినాడు.
.
పరమ ధర్మమూర్తి రామచంద్రుడు తన భార్యతో దండకారణ్యములో నుండగా ఒక రోజు ఆయనకు తన భార్య కనిపించలేదు.
.
తమ్మునితో కూడి తన భార్యను వెతుకుతూ ఋష్యమూకము చేరినాడు .అక్కడ సుగ్రీవునితో ఆయనకు సఖ్యమేర్పడినది.
.
వాలిని సంహరించి సుగ్రీవుని దుఃఖము పోగొట్టి ఆయనను రాజ్యాభిషిక్తునిగావించినాడు
రామచంద్రుడు.
.
నీవెరుగుదువు కదా వాలిని !
అట్టి వాలిని ఒక్కబాణముతోనే నేలకూల్చినాడు రాముడు .
.
రాముడి కొరకై సుగ్రీవుడు తన వానర సైన్యమునంతా సన్నద్ధము చేసినాడు.వానర వీరులందరినీ నలుదెసలా పంపినాడు ,సీత జాడ తెలుసుకొని రమ్మని .
.
నేను వాయుపుత్రుడను హనుమంతుడను ! దక్షిణదిక్కుగా సీతమ్మను వెతుకుతూ వచ్చి ఇట లంకలో అశోకవనములో ఆమె జాడ కనుగొంటిని.....ఇంకా ఇలా అంటున్నాడు హనుమస్వామి.
.
NB.
ప్రశ్నించినది ప్రహస్తుడు కానీ వాడి వైపు కూడ చూడకుండ రావణుడికే సరాసరి చెప్పడంమొదలు పెట్టారు స్వామి.
.
అంతటి వాలికే ఒక్కబాణం సరిపోయింది ,నీ గతి ఏమిటో ఆలోచించుకో అని బెదిరించడం కూడా అయ్యింది....రామ దాసుడిని నేనే ఏ అస్త్రానికీ కట్టు బడను ,ఇక నా రాముడి శక్తి నీకేం తెలుస్తుంది ?
.
ఇదీ స్వామి సంభాషణా చాతుర్యం !
.
వూటుకూరు జానకిరామారావు
సాంఖ్య యోగః 🌸*
🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం, 16 వ శ్లోకం*
*నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |*
*ఉభయోరపి దృష్టోoతః త్వనయోస్తత్త్వదర్శిభిః || 16*
*ప్రతిపదార్ధం.*
అసతః = అసద్వస్తువునకు ( లేనిదానికి ); భావః = ఉనికి ; నవిద్యతే = లేదు; తు = అయితే ; సతః = సద్వన్ను వునకు (ఉన్న దానికి );అభావః = లేమి ( లేకుండుట );న, విద్యతే = లేదు. ; అనయోః ఉభయోః, అపి = ఈ రెండింటి యొక్కయు; అంతః =తత్త్వము;తత్త్వ దర్శి భిః = తత్త్వజ్ఞానులచేత ( తెలిసికొనబడినది);
*తాత్పర్యము*
అసత్తు అనుదానికి ( అనిత్యమైనదానికి ) ఉనికియే లేదు.. సత్తు అనుదానికి తేమి లేదు. ఈ విధముగ ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరాపములను తత్త్వ జ్ఞానియైనవాడే ఎరుంగును .
*సర్వేజనా సుఖినోభవంతు*
*హరిః ఓం🙏🙏*
ధైర్యంగా ఉంటే
శ్లోకం:☝️
*దరిద్రతా ధీరతయా విరాజతే*
*కువస్త్రతా స్వచ్ఛతయా విరాజతే |*
*కదన్నతా చోష్ణతయా విరాజతే*
*కురూపతా శీలతయా విరాజతే ||*
- చాణక్యనీతి
భావం: ధైర్యంగా ఉంటే పేదరికం బాధించదు. చింకిపోయిన పాత వస్త్రాలైనా శుభ్రంగా ఉంచుకుంటే ధరించవచ్చు. వృధా ఆహారం కూడా వేడిగా ఉన్నప్పుడు రుచిగా ఉంటుంది. వినయం సంపన్నుడైన వ్యక్తి కురుపి అయినా అందంగా కనిపిస్తాడు.
పంచాంగం 03.09.2023 Sunday,
ఈ రోజు పంచాంగం 03.09.2023 Sunday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస కృష్ణ పక్ష: చతుర్ధి తిధి భాను వాసర: రేవతి నక్షత్రం వృద్ది యోగ: బవ తదుపరి బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.
చవితి సాయంత్రం 06:30 వరకు.
రేవతి పగలు 10:41 వరకు.
సూర్యోదయం : 06:06
సూర్యాస్తమయం : 06:25
వర్జ్యం : ఈ రోజు లేదు.
దుర్ముహూర్తం: సాయంత్రం 04:46 నుండి 05:36 వరకు.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం : మద్యాహ్నము 12:00 నుండి 01:30 వరకు.
శుభోదయ:, నమస్కార: