14, ఆగస్టు 2022, ఆదివారం

హిందువులు

 *🚩🕉హిందువులు అల్పసంఖ్యాకులే!!🕉🚩*


*సామవేదం షణ్ముఖశర్మ*

...............


    *భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కానీ మరో కోణంలో అల్ప సంఖ్యాకులు. మనం మైనారిటీ అనుకుంటున్న వారే అధికసంఖ్యాకులనడం సత్యదూరం కాదు.        ఒక్కసారి పరిశీలిస్తే ఈ వాస్తవాన్ని అంగీకరించుదాం.* *హిందువులు పేరుకి ఎక్కువ సంఖ్యలో ఉన్నా, అందులో కొందరు కేటాయింపుల కోసం హిందువులుగా చెలామణి అవుతూ, ఇతరుల మతాల్లోకి మారిన వారు.*


        *మరికొందరు - ఇందులో ఉన్నా ఈ మతం పట్ల శ్రద్ధ, హిందువులుగా జీవించాలనే ఆసక్తి, ఈ మతాన్ని కాపాడుకోవాలనే భక్తి ఏ మాత్రం లేనివారు. ఏదో పండక్కో, పబ్బానికో, పురుటికో, చావుకో కాసింత హిందూ పద్దతి అవలంబిస్తారు. మొక్కులు తీర్చుకోడానికి గుళ్ళోకి వెళతారు. అంతేకానీ హైందవ ధర్మానికీ, ఆలయాలకీ ప్రమాదం వాటిల్లుతున్నా స్పందించరు. నాయకులు వివక్ష చూపిస్తున్నా చలించరు. పైగా ‘ఏ మతమైతే ఏం పోయింది?’ అని ఉదాసీనంగా ఉంటారు.*


        *ఇంకొందరు - నాస్తికులై హిందూ గ్రంథాలను, దైవాలను, సంప్రదాయాలను, ఆలయాలను దుయ్యపడుతుంటారు. పుస్తకాలు రాస్తుంటారు.*


        *ఇలా హిందువుల్లో మూడు రకాల వారిని మినహాయిస్తే - శ్రద్ధగా ధర్మాన్ని అవలంబిస్తున్నవారు అల్ప సంఖ్యాకులే.       నిజమైన హిందువులు వీరే.  దీనికి వ్యతిరేకంగా-ఇతర మతాల్లో వారు నూటికి నూరు పాళ్ళు ఒకే రకంగా ఉంటారు. కుటుంబా లన్నీ తమ మతాన్ని మించిన మతం లేదనే తీవ్ర అభినివేశంలో ఉంటారు. తమ మత గ్రంథాలపై, శ్రద్ధా కేంద్రాలపై, అలవాట్లపై వ్యతిరేకంగా మాట్లాడరు. ఇతర మతాలను అణచివేయడంలో, దూషించడంలో వెనుకాడనంత ఉగ్రాభిమానం కూడా ఉంటుంది.* *పిల్లా, పెద్దా, ఆడా, మగా ఖచ్చితంగా మత పద్దతులు అధ్యయనం చేస్తారు, అవలంబిస్తారు. తమ మత నాయకుడు అవినీతిపరుడైనా, హింసా స్వభావి అయినా కిమ్మనరు. పైగా ఒకే తాటిపై నిలబడి అతడిని విజయుడ్ని చేస్తారు. తమ మతాల పేరున తీవ్రవాదం ఉగ్రవాదాలతో ఉత్పాతాలు సృష్టిస్తున్న సంస్థల్ని కూడా పల్లెత్తు మాట అనరు.*


        *ఇలా అన్య మతాలు రెండూ చక్కని అనుష్ఠాన నిష్ఠతో ఉంటారు. వారిలో రెండో రకం లేదు. అందుకే వాళ్ళు సంఖ్యలోనూ, అనుష్ఠానంలోనూ, దృఢంగా ఉంటారు. వాళ్ళిద్దరి అభిలాష, తమ మతం ఈ దేశాన్ని ఏలాలి. వాళ్ళ లక్ష్యం హిందూమతం అణచివేయబడాలి.*


        *వీరి తపన ఆ దిశగా కృషి చేయడమే.   వీరిలో ఉన్న ఈ ఏకతాటి లక్షణాన్ని గమనించిన హిందూ(పుట్టుకతో) నాయకులు కూడా వీళ్ళని మురిపిస్తూ, మెప్పిస్తూ, బుజ్జగిస్తూ, జాతి సంపద పంచిపెడుతుంటారు. వాళ్ళ పండుగల్లో వెళ్ళి వాళ్ళ వేషాలు వేసుకొని విందులారగిస్తుంటారు. కానీ ఆ మతాలకి చెందిన ఒక్క నాయకుడు కూడా హిందూ పండగల్లో కనపడరు. వీలైతే ఆంక్షలు పెట్టేలా గొడవలు చేస్తారు.*


        *ఈ హిందూ నాయకులకు తెలుసు. నాలుగు రకాల హిందువుల్లో మళ్ళీ ‘మా కులం వాడే రావాలి - కావాలి’ అనే గోల చేసే నలభై రకాలున్నారని. వీరు ఏనాడూ హిందువులను సంఘటిత పరచలేరని.*


        *భారతదేశంలో గతంలో జరిగిన ఎన్నికల ఫలంగా పేట్రేగిపోయిన కొందరు క్రికెట్ లో పాకిస్థాన్ గేలిస్తే దౌర్జన్యంగా ఆకుపచ్చ జండాలతో దాడులు చేసి ‘పాకిస్తాన్‍కీ జై .....’ అంటూ బిగ్గరగా నినాదాలు చేసినా - ఏ రక్షణ వ్యవస్థా, ఏ నాయకమ్మన్యుడూ నోరెత్తలేదు. చర్య తీసుకోలేదు. దేశ భద్రతకి, వ్యవస్థకీ పెనుప్రమాదం పొంచి ఉందని తెలిసినా స్పందన లేదు. మతం మారడం లేదనే అక్కసుతో కర్ణాటక రాష్ట్రంలో ఒక దేవీ మందిర ఉత్సవ సమయంలో ఆలయంలో చొరబడి ప్రసాదంలో విషం కలిపి అనేకమంది అమాయకుల మరణానికి కారకులయ్యారు.*


        *ఇటువంటివి హిందూ మనుగడకి మాత్రమే కాదు, దేశ క్షేమానికీ, శాంతి సామరస్యాలకు ప్రమాదకరమైన పరిస్థితి. అల్పసంఖ్యాకులైన హిందువులు ఏం చేయగలరు? అన్ని మతాలవారితో సహా అందరం హాయిగా ఉండాలి - అని కోరుకునే స్వభావం సహజంగా కలిగిన హిందువులు బలంగా ఉండకపోతే, ఈ దేశంలో ఉనికి కూడా అసాధ్యమౌతుంది. ఇప్పుడు, వేల ఏళ్ళ క్రితం ఉన్న  పరాయి పాలనకు భిన్నంగా ఏమీ లేదు.* *కేరళ, పశ్చిమబెంగాల్‍, కాశ్మీర్‍, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హిందువులు మనుగడ సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‍, మధ్యప్రదేశ్‍, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో నేటికీ కొన్ని ప్రాంతాలలో (అన్యుల ప్రాధాన్యం ఉన్నవి) . హిందువులు అనుక్షణం అభద్రతతో, భయాందోళన ల్లోనే బిక్కు బిక్కుమంటున్నారు.*


        *కొందరు మేధావులు గణాంక వివరాలతో సహా వాస్తవాల్ని చెబుతుంటే అవి ఫేస్‍బుక్కుల్లో, వాట్సాప్‍లలో, యూ ట్యూబ్‍లలో లైకింగ్‍లు, షేరింగ్‍లతో సరిపోతున్నాయి. సరియైన ప్రతిచర్య లేదు.*


        *ప్రధాన మాధ్యమాలన్నీ వాస్తవాల్ని కప్పిపెడుతున్నాయి. తమ కుల నాయకులకు భజనలు చేస్తూ, పల్లకీలు మోయడంతోనే కాలక్షేపం చేస్తున్నాయి.*


*గతచరిత్రలో భారతీయతపై, హిందూధర్మంపై జరిగిన అన్యుల దాడులు, దౌర్జన్యాలు గానీ, నేడు జరుగుతున్న కిరాతకాలు గానీ నేడు హిందూ యువతకి తెలియవు తేలియనీయట్లేదు సేక్యూలర్ మీడీయా ఎందుకంటే పేంచి పోషిస్తున్నది వారే కాబట్టి. కోందరూ వారు ‘నోటా’వర్గంలో ఉంటారు. బాధ్యతతో దేశ ధర్మాలను కాపాడుకునే ప్రయత్నం చేయరు. ఈ నేపథ్యంలో ఈ దేశాన్నీ, ధర్మాన్నీ పరిరక్షించమని పరమేశ్వరుని ప్రార్థించడం కన్నా ఏమి చేయగలం స్పందన లేని స్వార్ధజాతిని మేల్కొల్పమని  వేడుకోవడం కన్నా ఏమి సాధించగలం??*

తెలుగు వ్యక్తి గొప్పదనం.

 🤷‍♂️🤷‍♂️

ఓ తెలుగు వ్యక్తి గొప్పదనం.

కడప జిల్లా ప్రొద్దటూరు కు గర్వకారణం. కాని ఆయన విగ్రహం లేదు 🤷‍♀️🤷‍♀️టిప్పు సుల్తాన్ కు గౌరం ఇచ్చారు ప్రొద్దటూరు నాయకులు 🤗

గణితబ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయ శర్మ  (నవంబర్ 22, 1907 - డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. సంజీవరాయశర్మ 1907 నవంబర్ 27 న కడపజిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించాడు.


జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మ గారి అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి విని గుర్తు  పెట్టుకుని గణితంలో అపార విజ్ఞానం సాధించాడు.


తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించే వారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నారు.


శ్రీ సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించారు.yg అప్పటినుంచి 1995వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు లలోను పలు ప్రదర్శనలను ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు ప్రధాన ఆకర్షణ శ్రీ సంజీవరాయ శర్మ గారి గణితావధానమే.

సాధారణంగా గణితావధానంలో, పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం-కాని, ఈ విషయంలో శ్రీ సంజీవరాయ శర్మకు ఒక ప్రత్యేకత ఉంది. 

ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడా చెప్పి, కొంతవరకు జాతకం కూడా చెప్పేవారు.


ఈ ప్రత్యేకతను (మానవ గణన యంత్రంగా [Human Computer] పేరొందిన శకుంతలా దేవితో సహా) మరెవరూ చూపలేక పోయారు. ఆవిధంగా, 

ఇది అనితర సాధ్యమైన ప్రత్యేకత. 1966 డిసెంబరు ఏడో తేదీ.. అది హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక 2 power 103 ఎంత? 


దానికి సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని. 

'క' నుంచి 'క్ష' వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, 'స, రి, గ, మ, ప, ద, ని'' అక్షరాల లబ్దం ఎంత? ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు... 


కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు! ఆయనేమన్నా విద్యావంతుడా?... కాదు. 


*పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన* *వారా ?... కాదు. పుట్టుగుడ్డి!* 

*పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన* *చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం* *కావలసి వచ్చింది).*

*ఆయనే గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ "అంకెల ఆకాశంలో* *అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల* *గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!"  శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు* *బహుమానంగా...* 

*మొదటి గడిలో ఒక* వడ్లగింజ,*

*రెండో గడిలో రెండు* *గింజలు,*

*మూడో గడిలో* *నాలుగు, నాలుగో* *గడిలో ఎనిమిది...* *ఇలా అరవై నాలుగు గళ్లు నింపి* *ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి* *వచ్చేటప్పటికీ.. అందరూ తలలు పట్టుకుంటారు!*


*దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానం... *ఒక కోటి 84 లక్షల*

*46 వేల 74 కోట్ల 40 లక్షల,*

*73 వేల, 70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట... (1,84,46,74,40,73,70,95,51,615!)*

*ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే...*


*అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల.. ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు *వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు!*


*అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు!  ఇదంతా అబ్బురమని పించవచ్చు.* *కానీ సంజీవరాయశర్మ గణితావధాన వివరణ మహిమ అదంతా!  ఒకటి, రెండు, మూడు.... ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు!*


*సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షత్రాలు, వారాలు, పక్షాలు... గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు..* *తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించిన అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు.* *మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు,* *హైదరాబాదుల్లోను  పలు ప్రదర్శనలు నిర్వహించారు.. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ *ప్రముఖులు*

*ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి #రాష్ట్రపతి* *డా. #రాజేంద్రప్రసాద్ శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న* సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం! 

అప్పట్లో అనీబ్‌సెంట్, నెహ్రూ,*

*రాజేంద్రప్రసాద్‌లతో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు,* *పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మ గణితావధాన..* *ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్ల కీర్తించారు.*


*శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలు *గ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు.*

*అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు.*

*ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే* *1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేథావి ఇల్లు కదలలేక పోయారు.*


*వివిధ విశ్వవిద్యాలయాలు... ఆయన్ని సత్కరించాయి. *కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి. దురదృష్టమేమిటంటే* *1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు.*


*ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర *కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు.. మంచి శిక్షణ పొందారు.* 


*కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే... ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు*


*ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ''ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు.. చేసేవాళ్లం'' అని శర్మనుద్దేశించి అన్నారు.*


*శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు.** *శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే* *సంజీవరాయశర్మని రక్షించుకోలేక పోయింది. 1997 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయశర్మ అస్తమించారు. 'అంక విద్యాసాగర* *విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి* *గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి" రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ* *స్వామినర్చిస్తూ గడిపారు!*


*నిజానికి... ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు,* *జ్ఞాన్‌పీఠ్‌లు...*

*ఆయన ప్రతిభ ముందు ఎంత* *చిన్నవో!*

*సేకరణ    (చరిత్రలో  తెలుగు వాడు)*

🍎🍎🍎🍇🍇🍇☀️☀️☀️      ----------------------

ఉద్వేగం

 ఉద్వేగం తన్నుకొస్తోంది!

ఉత్సాహం అంతరిస్తోంది!

మారిన జగతి పొకడల్ని చూసి!

అంతరించిన మానవతా విలువలకు వగచి!

భారతీయతను మరిచాం!

ఆధునికత పేరుతో అన్నీ మార్చేస్తున్నాం!

కడకు వసుధనే ఏమార్చే స్థితికి

ఎదిగాం!

మనకు కావల్సింది ఎదురులేని స్వేచ్ఛ!

మనతరంగాల్లో దాగుంది!

సర్వమూ నా సొంతం కాకుంటే

పాదాక్రాంతం కావాలనే ఇచ్ఛ!

ఈ వింత ధోరణులన్నీ!

ప్రగతికి ప్రతిబంధకాలుగా మారుతున్న వేళ!

ఏ గీతా ప్రబోధం వీరిని మార్చాలి!

ఏ బైబిల్ వీరిలోని విజ్ఞానాన్ని

మేల్కొల్పాలి!

ఏ ఖురాను ఈ జనతకు సుగమ మార్గాన్ని ప్రబోధించాలి!

మత మౌఢ్యం తొలగిపోయి!

మిత వాదం పరిఢవిల్లి!

సమత మమత ల స్వర్ణయుగం!

సాకారం కావాలని!

ఆ ఆకారానికై!

ఇకనైనా, ఇపుడైనా!

పురోగమిస్తూ మనమంతా!

మానవత తో ఇమ్మహిపై!

మనమంతా పురోగమిద్దాం!

మళ్లీ భారతీయతా సంస్కృతీ

సంప్రదాయాల పరిరక్షణలో!

భారతీయ పురోభివృద్ధికి!

ఎందరో మహనీయుల,త్యాగధనుల

అడుగుజాడల్లో పయనిద్దాం!

గగన వీధుల్లో మన భారత కేతనాన్ని స్వేచ్ఛగా ఎగుర నిద్ధాం!

నిజంగా!..మనమంతా భారతమ్మ ముద్దుబిడ్డ లనీ

చాటుకుందాం!

దోస పాటి.సత్యనారాయణ మూర్తి

సామర్లకోట

9866631877

న్యస్తాక్షరి

 *** న్యస్తాక్షరి (పాదాదిగ) *** 

""""""""""""''''""'''"""'"""''"""''''""''""'" 

నం --- ద --- న --- ము.  


తే:గీ: 


నందనవనము చేసుకొనవలె బ్రతుకు  

దయయు ధైర్యము న్యాయము ధర్మగుణము 

నడతలోనున్న మనిషి ఘనముగనుండు  

ముత్యము వలె స్వఛ్ఛమగుచొ మోక్షమదియె. 




*** సమస్యా పూరణము *** 

"""""""""'''''''"""""""""""''"""""""""""" 

గుణము ముఖ్యము మనిషికి కులము కాదు. 


తే:గీ:  


భారతము భాగవతమును వ్రాసినట్టి  

వ్యాసునిది జాలరి కులము,భారతీయు 

లెల్ల గర్వించు రాజ్యాంగ మెల్ల వ్రాయు 

జ్ఞాని అంబేద్కరుడు శూద్ర జాతి రత్న  

గుణము ముఖ్యము మనిషికి కులము కాదు. 




                💐💐💐 


* యర్నాగుల వేంకట రమణా రావు *

Independence Day and Republic Day

 Many people get confused between Independence Day and Republic Day, but do you know there is also a difference in the way the flag is hoisted on 15th August and 26th January?


1) First difference:

On the occasion of 15th August — the Independence Day, the flag is pulled up by a rope from below, then it is opened and hoisted. This is done to honor the historical event of 15 August 1947. In the constitution, it is called Flag Hoisting. On the other hand, on the occasion of 26 January — Republic Day, the flag remains tied at the top, which is then opened and hoisted. In the constitution, it is called Flag Unfurling.


2) Second difference:

On August 15, the Prime Minister (who is the head of the Central Government) hoists the flag, because the Constitution of India did not come into force on the day India got independence. The President (who is the constitutional head of the nation), did not take office till then. On the other hand, on Republic Day the President addresses the nation. 26 January is celebrated to commemorate the implementation of the Constitution in the country. On this day, the constitutional head hoists or the President hoists the flag.


3) 3rd difference:

The flag hoisting is done from the Red Fort on Independence Day. At the same time, the flag is unflured on the Rajpath on Republic Day.


As we INDIANS gear up to celebrate the 75th anniversary of Independence, this information is for every INDIAN to know about FLAG HOISTING JAI HIND 🇮🇳😊👍💐

సాధకుడు - సద్గురువు

సాధకుడు - సద్గురువు 

ప్రతి సాధకుని మదిలో తొలిచేది ఏమిటంటే నాకు సద్గురువు దొరుకుతారా ఆయనను నేను ఎలా తెలుసుకోవాలి అన్నది ఒక ప్రశ్న ఎంతో మంది ముముక్షువులు తనను తరింపచేసే సద్గురువు కోసం వెతుకులాట చేస్తుంటారు. ముందుగా అసలు సాధకుడు ఎవరో తెలుసుకుందాము.  

సాధకుడంటే ఈ ద్వైత ప్రపంచాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకొని ఇక్కడ ప్రతిదీ రెండుగా వున్నది మరి దీనికి కారకుడు ఎవరు? నేను ఆ కారకుడిని తెలుసుకోవటం ఎలా అని పరితపించే ముముక్షువే సాధకుడు.  సాధకుడు తాను చూస్తున్నది ప్రతిదీ నశించేదని గ్రహించి ఇక్కడ నశించనిది, శాశ్వితమైనది ఏది అని వెతకటం మొదలిడుతాడు.  వాడు మరణాన్ని జయించటం ఎలా అని ఆలోచిస్తాడు. 

గురువు: గురువు అనగా అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞనాన్ని ప్రసాదించే వాడే గురువు.  అజ్ఞ్యానం చీకటిగా భావిస్తే జ్ఞ్యాన ప్రకాశాన్ని నిలిపే వాడే గురువు.  మనకు అనేక విషయాలను తెలియచేసే గురువులు వున్నారు.  కానీ బ్రహ్మ జ్ఞనాన్ని చెప్పే గురువే సద్గురువు.. జ్ఞ్యానం అంటే మనకు తెలియనిది తెలుసుకోవటం.  బ్రహ్మ జ్ఞ్యానం అంటే అన్నిటి కన్నా ఉత్తమమైన జ్ఞనం.  ఒక్క మాటలో చెప్పాలంటే ఏది తెలుసుకుంటే మరొకటి తెలుసుకోవలసిన పనిలేదో అదే బ్రహ్మ జ్ఞ్యానం.  అటువంటి జ్ఞనాన్ని ప్రసాదించే గురువే సద్గురువు. 

సద్గురువు లక్షణాలు: ఏ మహానుభావుడు అయితే ఈ భవసాగరాన్ని దాటి మోక్షాన్ని పొందాలనుకుంటాడో ఆయనే బ్రహ్మ జ్ఞ్యాని అటువంటి జ్ఞనే సద్గురువు . ముందుగా మనం పరిశీలిస్తే ఆ మహానుభావుడు అరిషడ్వార్గాన్ని జయించిన వాడైవుంటాడు. అనగా  కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు ఆయన వాటినుండి విముక్తి పొందినవాడై ఉంటాడు. అంటే 

1) కామ: ఆయనకు ఈ ప్రపంచంలో వేటి మీద కోరిక కలిగి ఉండడు ఏది అతనికి కావాలని ఉండదు అది స్త్రీ కానీ, ధన, వస్తు, వాహన కనకాలైన కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మహానుభావునికి తనదనేది ఏది ఉండదు, సమాజ అర్ధంలో చెప్పాలంటే పూర్తి దారిద్యపు జీవనం గడుపుతుంటాడు. నిరాడంబరగా ఉంటాడు.,

2) క్రోధ: క్రోధం అంటే కోపం ఆయన ఎల్లప్పుడూ కోపానికి లోనుకాకుండా సదా శాంత స్వభావంగా ఉంటాడు, మిత బాషి

3) మోహ: మొహం అంటే విషయ వాంఛనాలు నాకు ఇదికావాలి అది కావాలనే కోరిక అది అతనికి ఉండదు. 

4) లోభ: లోభం అంటే మన వాడుక భాషలో పిసినారితనం. అనగా తనదైన దానిని వదులుకోవటానికి ఇష్టపడని తత్త్వం.  ఆయనకు ఏమి ఉండదు కాబట్టి ఇక వదులుకోవడం అనేదే  ఆయనకు ఉండదు.

5) మద: మదం అనేది నా అంతవాడు లేడనే గర్వము, నేను గొప్పవాడిని అనే  భావం. ఆయనకు అవి వుండవు. 

6) మాత్సర్యం :మాత్సర్యం అనగా తనకున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండటం.  అది అతని మనస్సులోకూడా రాదు.

బ్రహ్మ జ్ఞ్యాని అయినవాడు పైన పేర్కొన్న ఆరు మానసిక స్థితులను అధిగమించి కేవలము సదా బ్రహ్మ్మములోనే చరిస్తూ ఉండి తనను తాను ఉద్దరించుకుంటాడు. అటువంటి మహానుభావుడు మాత్రమే సద్గురువుగా పరిగణించబడతాడు.  ఇప్పుడు చెప్పండి మనకు ఇటువంటి గొప్పవారు తారసపడతారా ? 

నేటి గురువులు: ప్రస్తుతం సమాజంలో మనం అనేక మందిని వారికి వారే సద్గురువులం అని చెప్పుకునే వారిని చూస్తున్నాము. మిత్రమా ఒక్కసారి వారిలో పైన తెలిపిన లక్షణాలు ఉన్నాయా అని పరిశీలించు.  ఒక్కటి అంటే ఒక్కటి కూడా వారిలో వుండవు. 

ఖరీదైన కాషాయ వస్త్రాలను ధరిస్తూ, ఖరీదయిన భవనాలలో నివసిస్తూ, విలువైన ఆసనాలఫై ఆసీనులు అవుతూ ప్రవచనాలు చేస్తున్నవారు మనకు కోకొల్లలుగా కనపడతారు.  మీకు కౌపీనం (గోచి) పెట్టుకున్న యోగి ఎక్కడైనా తారసపడ్డాడా? నేను చూడలేదు, మీరు చుస్తే తెలియచేయండి.

సాధకునికి గురువు ఆవశ్యకత: నేను కొన్ని ఉపమానాలతో సాధకునికి గురువు ఎంతవరకు అవసరమో తెలియచేయ ప్రయత్నిస్తాను. 

నీవు మీ ఊరుకు బస్సులో వెళ్లాలని అనుకోని దారి ఖర్చులకు తగు డబ్బులు సమకూర్చుకొని బస్స్టాండు చేరుకొని నీ బస్సు ఏదో తెలుసుకోలేక అక్కడ వున్న అక్కడి విషయాలు తెలిసిన ఒక వ్యక్తిని నీ ఉరుకు వెళ్లే బస్సు యెక్కడ ఆగుతుంది అని అడిగితె అతను నీకు ఫలానా ప్లాటుఫారమ్ లో దొరుకుతుంది అని చెప్పాడనుకో, ఇప్పుడు ఆతను నీకు ఏవిధంగా సహకరించాడు? కేవలం నీకు ఒక మాట సహాయం చేసాడు, గురువు కూడా అంతే. 

నీవు కారులో ఒక వూరు వెళ్లదలిచావు కొంత దూరం వెళ్లిన తరువాత రెండు రోడ్లు చీలాయి అక్కడ ఒక మార్గనిర్దేశం అంటే సైను బోర్డు కనపడినది అందులో రెండు రోడ్లు ఏ ఏ ఊర్లకు వెళతాయో తెలియపరచి వుంది దానిని అనుసరించి నీవు నీ గమ్యాన్ని  నిర్ధారించుకుంటావు. ఆ బోర్డు నీకు ఎలా ఉపయోగ పడింది? గురువు కూడా అలానే సహాయపడగలడు 

నీవు వెళ్లే మార్గంలో ఒక మురికి కాలువ అడ్డం వచ్చింది దానిని దాటటం ఎలా అని నీవు అనుకుంటుంటే అక్కడ ఒక వ్యక్తి దూరంలో వున్న ఒక రాయిని చూపి అది ఆ కాలువలో వేసి దానిమీద కాలు పెట్టి బురజ అంటకుండా దాటామని సలహా ఇచ్చాడు.  అలాగే నీవు ఆ కాలువను దాటావు .  ఇక్కడ మురికి కాలువ అనేది సంసారం అనేది. దానిని దాటాలి అని అనుకోవటం నీ ప్రయతనం. అక్కడ వేసిన రాయి నీవు చేయవలసిన సాధన ఆ రాయిని చూపినవాడు నీ గురువు. 

గురువు కేవలం నీవు ఎలా సాధన చేయాలో మార్గదర్శనం చేస్తాడు.  కానీ ప్రయత్నం, సాధన కృషి అన్నీ నీవే కలిగి ఉండాలి.  నీ ప్రయత్నం లేకుండా నీకు మోక్షం సిద్దించదు.  ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమిమీద నివసించే ఎవ్వరు కూడా నీకు మోక్షాన్ని ఇవ్వలేరు.  కేవలం సద్గురువు నీకు పైన తెలిపినట్లు మార్గదర్శనం చేయగలరు. 

గురువును వదిలి వేయాలి: ఓ సాధక మిత్రమా నీకు గురుత్వం వహించిన గురువును కేవలం కొద్దికాలం మాత్రమే సంబంధం కలిగి తరువాత గురువుని వదిలి వేయాలి.  కేవలం సాధనతోటె మోక్షాన్ని పొందాలి.  అంటే నీకు గురువుతో ఇప్పుడు  పనిలేదు. ఎలాగైతే పై సందర్భంలో రాయిని చూపిన వాడిని, అలాగే రాయిని వదిలి నీ మార్గంలో వెళ్ళావో అదే విధంగా గురువుని గురువు చూపిన సాధనను  వదలాలి. అంటే ఎప్పుడైతే నీవు సమాధి స్థితిని పొందుతావో అప్పుడు నీకు గురువు నేర్పిన ధ్యానం తో పనివుండదు. 

సమాజంలో ఈ రోజుల్లో అనేకమంది ధన సంపాదన అభిలాషులు నేనే గురువుని ఈ పద్దతి నేనే కనుక్కున్నాను అని పేర్కొంటూ వారి శిష్యగణాలను వృద్ధి చేసుకుంటూ వారి వద్దనుండి ధనాన్ని  సేకరిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొందరు గురువులు తాము నేర్పిన విద్య (యోగ పద్దతి) వేరే ఎవ్వరికీ చెప్పరాదని ప్రమాణం చేయించుకొని వారి శిష్యుల వద్ద ఎక్కువ మొత్తంలో ద్రవ్యాన్ని వసులు చేస్తున్నారు. అమాయకులైన ఆ శిష్యులు వారి గురువు గారి గొప్పతనాన్ని వారు నేర్చుకున్న యోగాన్ని ప్రచారం చేస్తూ గురువుగారి వ్యాపారాభివృద్ధి చేస్తున్నారు.  భార్గవ శర్మ అలాంటి ఒక శిష్యుడిని తమరు నేర్చుకున్న యోగం ఏమిటని ప్రశ్నించాడు.  తాము సుదర్శన క్రియ అనే యోగసాధన గురువుగారి వద్దనుండి నేర్చుకున్నామని.  దానిని ఎవ్వరికీ చెప్పకూడదని ప్రమాణం చేశామని చెప్పి మీరు అందులో చేరండి బాగుంటుంది అని సలహా ఇచ్చాడు.  మిత్రమా తెలిసిన విద్య పలువురికి చెప్పటానికి పనికిరానప్పుడు విద్య అభ్యసించటం ఎందుకు అంటే సమాధానం లేదు.   ఇక కొందరు వారి గురువు ఫోటోని పెన్నులకు పెట్టుకొని మేడలో వేసుకొని ప్రచారం చేస్తున్నారు.  అలాటి వారు తమ గురువుకి శిష్యులను చేర్చటమే తమ జీవిత పరమావధి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. 

బ్రహ్మకుమారి యోగ సంఘంలో పరిచయం అయిన ఒక మిత్రుడు భార్గవ శర్మతో నా వద్ద అమ్మా భగవాన్ పాసు ఒకటి వున్నది నాకు వెళ్ళటం కుదరటం లేదు దాని ఖరీదు ఐదు వేలు నేను మీకు ఉచితంగా ఇస్తాను మీరు ఆధ్యాత్మికత వైపు పయనిస్తున్నారు కదా మీరు వెళ్ళండి అని అనటం జరిగింది.  దానికి ఆయన మిత్రమా భగవంతుడు నిరాకారుడు అతడు ఈ జగత్తుకి కారకుడు అటువంటి భగవంతుని మనం సాధన చేసి తెలుసుకోవాలి కానీ నేనే దేముడు అని ప్రగల్బాలు పలికే వారిచుట్టూ తిరిగితే ఏమి లాభం ఉండదు.  మీరు ఇచ్చే పాసుతో పాటు ఇంకొక ఐదు వేలు దారిఖర్చులకు ఇచ్చినా నేను వెళ్ళాను.  మీరు కూడా అటువంటి ప్రలోభాలకు లోను కావద్దని చెప్పాడు 

కాకుండా సాధక మిత్రమా నీవే ఆలోచించు నీ గమ్యం మోక్షమా లేక గురువుల ప్రచారామా?  ఇలా తమ గురువులని ప్రచారం చేసే వారు సారా తాగుతున్నానని మెడలో కాళీ సీసాలు వేసుకొనే మూర్ఖులకన్నా అధములు. ఇటువంటి గురువులు మురికి కాలువ దాటించామని చెప్పుకొంటూ మురికి కాలువలో (సంసార బంధనాలలో) జలకాలాడుతూ నిన్నుకూడా ఆ మురికి కాలువలో నిర్బంధిస్తున్నట్లు తెలుసుకో. మిత్రమా నీ సాధన సిద్దించిన తరువాత నీ గురువుని విస్మరించి ముందుకు పో 

ఇటీవల ఒక మిత్రుడు తాను ఒక గురువును నమ్ముతున్నానని అయన చాలా మహిమాన్వితుడని అయన కొన్ని యోగ పద్ధతులు కనుకొన్నారని నాకు తెలిపితే అది విన్న తరువాత తట్టిన భావాలతో ఈ వ్యాసం. 

గమనిక: దయచేసి సాధక మిత్రులారా గమనించ గలరు, శ్రీ పరమేశ్వరుడు, శ్రీ కృష్ణ భగవానులు పతంజలి మహర్షి, ఆది శంకరాచార్యులు ఇంకా ఉపనిషత్తులలో పేర్కొనిన మహర్షులు మనకు మార్గదర్శకులు.  వారు చెప్పిందే కొందరు తెలుసుకొని అది వారి ప్రతిభ అన్నట్లు చెపుతూ అమాయక సాధకులను తప్పుత్రోవ పట్టిస్తున్నారు.  కాబట్టి మోసపోకండి.  మీకు నిజంగా మోక్ష ప్రాప్తి కావాలంటే నా దగ్గరకు (ఇక్కడ "నా" అంటే ఎవరి వద్దకు వారు అని అర్ధం) రండి మీకు తప్పకుండ మోక్షం సిద్ధిస్తుంది.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతిశాంతిహి 

మీ భార్గవ శర్మ