*🚩🕉హిందువులు అల్పసంఖ్యాకులే!!🕉🚩*
*సామవేదం షణ్ముఖశర్మ*
...............
*భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కానీ మరో కోణంలో అల్ప సంఖ్యాకులు. మనం మైనారిటీ అనుకుంటున్న వారే అధికసంఖ్యాకులనడం సత్యదూరం కాదు. ఒక్కసారి పరిశీలిస్తే ఈ వాస్తవాన్ని అంగీకరించుదాం.* *హిందువులు పేరుకి ఎక్కువ సంఖ్యలో ఉన్నా, అందులో కొందరు కేటాయింపుల కోసం హిందువులుగా చెలామణి అవుతూ, ఇతరుల మతాల్లోకి మారిన వారు.*
*మరికొందరు - ఇందులో ఉన్నా ఈ మతం పట్ల శ్రద్ధ, హిందువులుగా జీవించాలనే ఆసక్తి, ఈ మతాన్ని కాపాడుకోవాలనే భక్తి ఏ మాత్రం లేనివారు. ఏదో పండక్కో, పబ్బానికో, పురుటికో, చావుకో కాసింత హిందూ పద్దతి అవలంబిస్తారు. మొక్కులు తీర్చుకోడానికి గుళ్ళోకి వెళతారు. అంతేకానీ హైందవ ధర్మానికీ, ఆలయాలకీ ప్రమాదం వాటిల్లుతున్నా స్పందించరు. నాయకులు వివక్ష చూపిస్తున్నా చలించరు. పైగా ‘ఏ మతమైతే ఏం పోయింది?’ అని ఉదాసీనంగా ఉంటారు.*
*ఇంకొందరు - నాస్తికులై హిందూ గ్రంథాలను, దైవాలను, సంప్రదాయాలను, ఆలయాలను దుయ్యపడుతుంటారు. పుస్తకాలు రాస్తుంటారు.*
*ఇలా హిందువుల్లో మూడు రకాల వారిని మినహాయిస్తే - శ్రద్ధగా ధర్మాన్ని అవలంబిస్తున్నవారు అల్ప సంఖ్యాకులే. నిజమైన హిందువులు వీరే. దీనికి వ్యతిరేకంగా-ఇతర మతాల్లో వారు నూటికి నూరు పాళ్ళు ఒకే రకంగా ఉంటారు. కుటుంబా లన్నీ తమ మతాన్ని మించిన మతం లేదనే తీవ్ర అభినివేశంలో ఉంటారు. తమ మత గ్రంథాలపై, శ్రద్ధా కేంద్రాలపై, అలవాట్లపై వ్యతిరేకంగా మాట్లాడరు. ఇతర మతాలను అణచివేయడంలో, దూషించడంలో వెనుకాడనంత ఉగ్రాభిమానం కూడా ఉంటుంది.* *పిల్లా, పెద్దా, ఆడా, మగా ఖచ్చితంగా మత పద్దతులు అధ్యయనం చేస్తారు, అవలంబిస్తారు. తమ మత నాయకుడు అవినీతిపరుడైనా, హింసా స్వభావి అయినా కిమ్మనరు. పైగా ఒకే తాటిపై నిలబడి అతడిని విజయుడ్ని చేస్తారు. తమ మతాల పేరున తీవ్రవాదం ఉగ్రవాదాలతో ఉత్పాతాలు సృష్టిస్తున్న సంస్థల్ని కూడా పల్లెత్తు మాట అనరు.*
*ఇలా అన్య మతాలు రెండూ చక్కని అనుష్ఠాన నిష్ఠతో ఉంటారు. వారిలో రెండో రకం లేదు. అందుకే వాళ్ళు సంఖ్యలోనూ, అనుష్ఠానంలోనూ, దృఢంగా ఉంటారు. వాళ్ళిద్దరి అభిలాష, తమ మతం ఈ దేశాన్ని ఏలాలి. వాళ్ళ లక్ష్యం హిందూమతం అణచివేయబడాలి.*
*వీరి తపన ఆ దిశగా కృషి చేయడమే. వీరిలో ఉన్న ఈ ఏకతాటి లక్షణాన్ని గమనించిన హిందూ(పుట్టుకతో) నాయకులు కూడా వీళ్ళని మురిపిస్తూ, మెప్పిస్తూ, బుజ్జగిస్తూ, జాతి సంపద పంచిపెడుతుంటారు. వాళ్ళ పండుగల్లో వెళ్ళి వాళ్ళ వేషాలు వేసుకొని విందులారగిస్తుంటారు. కానీ ఆ మతాలకి చెందిన ఒక్క నాయకుడు కూడా హిందూ పండగల్లో కనపడరు. వీలైతే ఆంక్షలు పెట్టేలా గొడవలు చేస్తారు.*
*ఈ హిందూ నాయకులకు తెలుసు. నాలుగు రకాల హిందువుల్లో మళ్ళీ ‘మా కులం వాడే రావాలి - కావాలి’ అనే గోల చేసే నలభై రకాలున్నారని. వీరు ఏనాడూ హిందువులను సంఘటిత పరచలేరని.*
*భారతదేశంలో గతంలో జరిగిన ఎన్నికల ఫలంగా పేట్రేగిపోయిన కొందరు క్రికెట్ లో పాకిస్థాన్ గేలిస్తే దౌర్జన్యంగా ఆకుపచ్చ జండాలతో దాడులు చేసి ‘పాకిస్తాన్‍కీ జై .....’ అంటూ బిగ్గరగా నినాదాలు చేసినా - ఏ రక్షణ వ్యవస్థా, ఏ నాయకమ్మన్యుడూ నోరెత్తలేదు. చర్య తీసుకోలేదు. దేశ భద్రతకి, వ్యవస్థకీ పెనుప్రమాదం పొంచి ఉందని తెలిసినా స్పందన లేదు. మతం మారడం లేదనే అక్కసుతో కర్ణాటక రాష్ట్రంలో ఒక దేవీ మందిర ఉత్సవ సమయంలో ఆలయంలో చొరబడి ప్రసాదంలో విషం కలిపి అనేకమంది అమాయకుల మరణానికి కారకులయ్యారు.*
*ఇటువంటివి హిందూ మనుగడకి మాత్రమే కాదు, దేశ క్షేమానికీ, శాంతి సామరస్యాలకు ప్రమాదకరమైన పరిస్థితి. అల్పసంఖ్యాకులైన హిందువులు ఏం చేయగలరు? అన్ని మతాలవారితో సహా అందరం హాయిగా ఉండాలి - అని కోరుకునే స్వభావం సహజంగా కలిగిన హిందువులు బలంగా ఉండకపోతే, ఈ దేశంలో ఉనికి కూడా అసాధ్యమౌతుంది. ఇప్పుడు, వేల ఏళ్ళ క్రితం ఉన్న పరాయి పాలనకు భిన్నంగా ఏమీ లేదు.* *కేరళ, పశ్చిమబెంగాల్, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హిందువులు మనుగడ సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో నేటికీ కొన్ని ప్రాంతాలలో (అన్యుల ప్రాధాన్యం ఉన్నవి) . హిందువులు అనుక్షణం అభద్రతతో, భయాందోళన ల్లోనే బిక్కు బిక్కుమంటున్నారు.*
*కొందరు మేధావులు గణాంక వివరాలతో సహా వాస్తవాల్ని చెబుతుంటే అవి ఫేస్‍బుక్కుల్లో, వాట్సాప్‍లలో, యూ ట్యూబ్‍లలో లైకింగ్‍లు, షేరింగ్‍లతో సరిపోతున్నాయి. సరియైన ప్రతిచర్య లేదు.*
*ప్రధాన మాధ్యమాలన్నీ వాస్తవాల్ని కప్పిపెడుతున్నాయి. తమ కుల నాయకులకు భజనలు చేస్తూ, పల్లకీలు మోయడంతోనే కాలక్షేపం చేస్తున్నాయి.*
*గతచరిత్రలో భారతీయతపై, హిందూధర్మంపై జరిగిన అన్యుల దాడులు, దౌర్జన్యాలు గానీ, నేడు జరుగుతున్న కిరాతకాలు గానీ నేడు హిందూ యువతకి తెలియవు తేలియనీయట్లేదు సేక్యూలర్ మీడీయా ఎందుకంటే పేంచి పోషిస్తున్నది వారే కాబట్టి. కోందరూ వారు ‘నోటా’వర్గంలో ఉంటారు. బాధ్యతతో దేశ ధర్మాలను కాపాడుకునే ప్రయత్నం చేయరు. ఈ నేపథ్యంలో ఈ దేశాన్నీ, ధర్మాన్నీ పరిరక్షించమని పరమేశ్వరుని ప్రార్థించడం కన్నా ఏమి చేయగలం స్పందన లేని స్వార్ధజాతిని మేల్కొల్పమని వేడుకోవడం కన్నా ఏమి సాధించగలం??*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి