15, ఆగస్టు 2022, సోమవారం

నాలుగు ప్రశ్నలు

 శ్లోకం:☝️

*సముద్యతే కుత్ర న యాతి పాంశులా*

*సముద్యతే కుత్ర భయం భవేజ్జలాత్ l*

*సముద్యతే కుత్ర తవాపయాత్యారి:*

*ప్రహేణ సంబోధన వాచికం పదం ll*


భావం: ఈ శ్లోకంలో నాలుగు ప్రశ్నలున్నాయి. మొదటి సమాధానం నుండి ఒక అక్షరం తగ్గిస్తే రెండో సమాధానం వస్తుంది. రెండోదాన్ని నుండి ఒక అక్షరం తగ్గిస్తే మూడో సమాధానం వస్తుంది. మూడో సమాధానం నుండి ఒక అక్షరం తగ్గిస్తే నాల్గవ ప్రశ్నకు సమాధానం వస్తుంది.

ఒకటవ ప్రశ్న: ఎవరు ఉదయిస్తే వ్యభిచారులు తిరగడం మానేస్తారు? సమాధానం 'హిమకరః' అంటే (చంద్రుడు), ఈ శ్లోకం లోని ప్రశ్నలన్నీ సతి సప్తమిలో (సప్తమీ విభక్తిిిి లో) వున్నాయి. కనుక సమాధానాలు కూడా సతి సప్తమిలోనే ఉండాలి. కనుక సమాధానం *హిమకరే*

రెండవ ప్రశ్న: ఏ జంతువు నీటినుండి బయటకు వస్తే భయం కలుగుతుంది? మొసలి. సంస్కృతంలో మొసలిని 'మకరః' అంటారు. సప్తమీ విభక్తి కనుక *మకరే* సమాధానం.

మూడవ ప్రశ్న: నీవు ఏది ఎత్తితే నీ శత్రువులు పారిపోతారు? 'కరః' అంటే చేయి. సతి సప్తమి కనుక *కరే* నీవు చేయి ఎత్తితే శత్రువులు పారిపోతారు.

నాలుగవ ప్రశ్న: హీన కర్మల నాచరించే వాడిని ఏమని పిలుస్తారు? 'ఒరే' అని గౌరవం లేకుండా పిలుస్తారు. దీన్ని సంస్కృతములో *రే* అంటారు.

కామెంట్‌లు లేవు: