శీర్షిక.. స్వాతంత్ర్య పతాకం
వందనం..వందనం..మన జాతీయ జెండాకు వందనం..అభివందనం
ఎగురుతోంది ఎగురుతోంది మన భారత జెండా గౌరవం నిండా
గ్రామ గ్రామంలో నగర నగరంలో
రాజధాని ఢిల్లీలో సగర్వంగా ఎగురుతోంది...భారత కీర్తి కిరీటమై శాశ్వత సౌర్యమై జాతికి స్పూర్తి యై ......వందనం వందనం
రూపకర్తలు పింగళి కృత మువ్వన్నె ల జండా..ముచ్చటగా గగనాన విజయవిహారం...మన జాతీయ జెండా...గౌరవం నిండా......
కాషాయం...త్యాగముగా..శ్వేతవర్ణం స్వచ్ఛంగా..హరితవర్ణం...సంపద అభివృద్ధి ల సంగమమై..
మధ్యనుండు అశోకచక్రం...ధైర్యం..పరాక్రమం సూచిస్తూ....ఎగురుతోంది...జాతీయ జెండా.....
ఎదురు లేని భారతికీ...అలుపెరుగని విజయానికి చిహ్నంగా...జాతీయ జెండా....జాతి గౌరవ కీర్తి మకుటమై.....
వందనం..వందనం...నీకిదే అభివందనం
దేశమంత జరుపుకునే ఉత్సవాలు....గణతంత్ర దినం..స్వాతంత్ర్యదినం..బాపూజీ జన్మదినం. అల్లూరి జన్మదినం ...
మురిపెముగా చూసుకునే మన జెండా నేర్పుతోంది...శాంతి..ధర్మం.....ధైర్యం సాహసం..స్పూర్తిగా...
వందనం...వందనం...నీకిదే అభివందనం
విప్లవ జ్యోతి అల్లూరి కలలు కన్న స్వాతంత్ర్య దేశం
హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులం
అందరమొకటై...హాయిగ కలసి.
చేసుకునే వేడుకే... ..
వందనం...వందనం..జాతీయ జెండాకు అభివందనం..మనసాభివందనం.
ఆజాదీ కా అమృతోత్సవ శుభ వేళ సమైక్య వందనం
సంతోష వందనం ..వందనం వందనం
.
...డాక్టర్ దేవులపల్లి పద్మజ
విశాఖపట్నం....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి