ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
14, ఏప్రిల్ 2024, ఆదివారం
శ్రీ శృంగగిరి షణ్ముఖ ఆలయం
🕉 మన గుడి :నెం286
⚜ *కర్నాటక : రాజరాజేశ్వరి నగర్, బెంగళూరు*
⚜ శ్రీ శృంగగిరి షణ్ముఖ ఆలయం
💠 శివుడు మరియు పార్వతి యొక్క ఇద్దరు కుమారులలో, షణ్ముఖుడు వివిధ రూపాలలో పూజించబడతాడు.
షణ్ముఖ హిందూ పురాణాలలో గొప్ప యోధుడిగా కనిపిస్తాడు మరియు వివిధ పేర్లతో పిలుస్తారు. అతన్ని కన్నడిగులు సుబ్రహ్మణ్యస్వామి అని పిలుస్తారు మరియు తమిళులకు అతను మురుగన్ అని పిలుస్తారు.
💠 "షణ్ముఖ" అంటే ఆరు ముఖములు కలవాడు అని అర్థం. అతన్ని సుబ్రమణ్య, కార్తికేయ, మురుగన్ మరియు స్కంద అని కూడా పిలుస్తారు.
💠 రాజరాజేశ్వరి నగర్‌లోని ఆరు ముఖాల మురుగన్ ఆలయం బెంగళూరులోని ఒక ప్రత్యేకమైన ఆలయం.
శృంగగిరి కొండలోని షణ్ముఖ ఆలయ గోపురం షణ్ముఖ భగవానుని ఆరు ముఖాలు కలిగి ఉంటుంది.
💠 ఈ అందమైన ఆలయాన్ని డా. ఆర్. అరుణాచలం రూపొందించారు మరియు ఇది బెంగుళూరులోని ప్రముఖ దేవాలయాలలో ఒకటి అనడంలో సందేహం లేదు.
💠 బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌లో ఉన్న షణ్ముఖ దేవాలయం "శృంగగిరి" అని పిలువబడే కొండపై ఉంది, ఇది ప్రత్యేకమైనది, ఆధునికమైనది మరియు మొదటిది.
ఆలయం 240 అడుగుల ఎత్తులో ఉంది.
💠 ఈ ఆలయం శృంగేరిలోని శ్రీ శారదా పీఠానికి చెందినది. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది మరియు ఆలయ నిర్మాణం నిజంగా మంత్రముగ్ధులను చేస్తుంది.
💠 ఈ ఆలయం నేల మట్టం నుండి దాదాపు 250 అడుగుల ఎత్తులో ఉంది.
ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 1,30,000 చ.అడుగుల భూమిని శృంగేరి మఠానికి ఇచ్చారు.
🔆 ఆలయ చరిత్ర 🔆
💠 శృంగేరి శ్రీ శారదా పీఠం పీఠాధిపతి మరియు 36వ జగద్గురువులు అయిన శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ ఆలయానికి శంకుస్థాపన చేశారు.
స్వామిజీ తన కలలో షణ్ముఖ స్వామిని దర్శనం చేసుకుని బంజరు కొండను స్వామివారి నివాసంగా ఎంచుకున్నారు.
కొండ పైభాగంలో, షణ్ముఖ భగవానుడికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని డా. ఆర్. అరుణాచలం మార్గదర్శకత్వంలో రూపొందించబడింది.
ఈ ఆలయం 14 సంవత్సరాలకు పైగా ఉంది మరియు ఇప్పటికీ తన శక్తితో భక్తులను ఆకర్షిస్తుంది.
సూర్యుడు తన దిశను ఏ విధంగా మార్చుకున్నా సుబ్రహ్మణ్య విగ్రహం కనిపించేలా దీన్ని రూపొందించారు.
💠 శృంగేరి శ్రీ భారతీ తీర్థ స్వామీజీ మాట్లాడుతూ, మురుగన్ తన కలలో ఈ స్థలంలో శ్రీ మురుగన్ ఆలయాన్ని నిర్మించమని చెప్పాడని, ఈ ఆలయాన్ని నిర్మించమని డా.ఆర్.అరుణాచలం సార్‌కు చెప్పారని, స్వామీజీ తనను ఆశీర్వదించి భవిష్యత్తులో ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందనుంది అని దీవించారు.
💠 ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ షణ్ముఖ భగవానుడి ఆరు ముఖాలను కలిగి ఉన్న గోపురం. షణ్ముఖ భగవాన్ యొక్క ఆరు ముఖాలు దట్టమైన కాంక్రీట్ అచ్చు నిర్మాణాలు. ఈ గోపురం చాలా దూరం నుండి కనిపిస్తుంది.
💠 మందిరం 123 అడుగులు మరియు ఆలయ గోపురం సుమారు 62 అడుగులు.
గర్భగుడి సంప్రదాయ వాస్తుశిల్పాన్ని ప్రతిబింబిస్తుండగా, అదనపు డిజైన్ ఆధునిక స్పర్శను కలిగి ఉంది!
💠 ప్రధాన మందిరానికి దారితీసే మెట్లు ఉన్నాయి మరియు ప్రధాన దేవత చుట్టూ మీరు వివిధ రూపాలు, పరిమాణాలు మరియు ఆకారాలలో గణపతికి అంకితం చేసిన మ్యూజియాన్ని కూడా చూడవచ్చు.
మీరు ఆలయాన్ని సందర్శించినప్పుడు ఇది తప్పక చూడాలి. గుడిలో ప్రసాదం - రుచికరమైన పొంగల్‌ను మిస్ చేయవద్దు.
💠 గర్భగుడిలో పార్వతీ దేవి విగ్రహం కూడా ఉంది. శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి ఆలయ గోపురం చేరుకున్న తర్వాత భక్తులు షణ్ముక్ స్వామికి అంకితం చేసిన ప్రధాన గర్భగుడిని చూడవచ్చు. షణ్ముఖుడు మరియు అతని ఇద్దరు భార్యలు దేవసేన మరియు వల్లి ఇక్కడ నుండి వారి భక్తులను ఆశీర్వదిస్తారు.
💠 ఆలయ మ్యూజియంలో 1,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన గణేశ విగ్రహాలు ప్రదర్శించబడ్డాయి.
💠 శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి ఆలయంలో శుక్ల పక్షం రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ స్కంద షష్ఠి వ్రతం.
స్కంద షష్ఠి రోజు సూర్యోదయంతో ప్రారంభమై మరుసటి రోజు సూర్యోదయంతో ముగుస్తుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున, ఉపవాసం సూర్యోదయంతో ప్రారంభించి, మరుసటి రోజు సూర్యభగవానుని పూజించిన తర్వాత ముగుస్తుంది.
ఈ రోజున లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.
💠 శృంగగిరి శ్రీ షణ్ముఖ ఆలయంలో పూజలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు :
ఇక్కడ షణ్ముఖుడిని ఆరాధించడం ద్వారా, యోధుడైన షణ్ముఖుడు తన భక్తులకు విజయాన్ని ప్రసాదిస్తాడు.
ఆలయాన్ని సందర్శించడం మరియు ఆలయంలో అతని మంత్రాలను పఠించడం అన్ని రకాల వైఫల్యాలు మరియు చింతలను దూరం చేస్తుంది.
మరియు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా ఆరోగ్యం, శాంతి మరియు అదృష్టం పొందుతారు.
సామాన్యుడి ఆవేదన 😓
✍️
_*అయినా నేను ఇంకా పన్ను చెల్లించాలా?ఎందుకు.?*_
*నేను 30 రోజులు పనిచేశాను. జీతం ఇచ్చారు*
_జీతం ఇచ్చారు., ఆదాయపు పన్ను అన్నారు._
_ఇచ్చాను._
_ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు,_
_ఇచ్చాను_
_మొబైల్ కొనుగోలు పై పన్ను అన్నారు_
_ఇచ్చాను._
_రీఛార్జ్ చేశా_
_పన్ను ఇచ్చా_
_డేటా పన్ను ఇచ్చా_
_విద్యుత్తు పన్ను ఇచ్చా_
_ఇంటి పన్ను ఇచ్చా_
_టీవీ బిల్లు పై పన్ను_
_పిల్లల ఫీజుల పై పన్ను.._
_అన్నీ ఇచ్చాను._
_కారుకి పన్ను అన్నారు._
_ఇచ్చాను._
_పెట్రోలు పై పన్ను అన్నారు. చెల్లించా_
_‘సేవ’ అన్నారు_
_పన్ను ఇచ్చాను._
_రోడ్డుపై పన్ను అన్నారు_
_‘టోల్ పై’ పన్ను_
_ఆపై లైసెన్స్ మేడ్ ‘ట్యాక్స్’ వచ్చింది._
_ఇచ్చాను._
_కిక్కురుమనకుండా అన్నీ ఇచ్చాను._
_తప్పు చేస్తే పన్ను- చెల్లించా,_
_రెస్టారెంట్‌లో తిన్నా_
_పన్ను చెల్లించా_
_పార్కింగ్ పన్ను చెల్లించా_
_నీరు తీసుకున్నా_
_పన్ను చెల్లించా_
_ఇంట్లో కసువు బయట వేసేందుకు పన్ను చెల్లించా_
_టాయ్లెట్ నుండి వేస్ట్ sewage అన్నారు_
_దానికి పన్ను చెల్లించా_
_తినేందుకని కార్డుమీద సామానులు కొనుక్కున్నా_
_పన్ను చెల్లించా_
_రేషన్ కొనుగోలు చేశా_
_పన్ను చెల్లించా_
_బట్టలు కొనుగోలు చేశా_
_పన్ను చెల్లించా_
_పుస్తకాలు తీసుకున్నా_
_పన్ను ఇచ్చా_
_మరుగుదొడ్డికి వెళ్లా_
_పన్ను చెల్లించా_
_మందులు తీసుకున్నా_
_పన్ను చెల్లించా_
_గ్యాస్ ఇచ్చారు_
_పన్ను చెల్లించా._
_వందల కొద్దీ వస్తువులు తీసుకుని పన్ను కట్టి, ఫీజులు, బిల్లులు, వడ్డీలు కట్టి, ఎక్కడో ఫైన్లు, లంచాల పేరుతో డబ్బులు చెల్లించి, పొరపాటున ఏ డ్రామా నో ఆడి, ఇంతా అంతా ‘ఆదా’ చేసి మరీ మీకు పన్ను కట్టా._
_కానీ ఆ జీతం నుండి ఎన్నిసార్లు పన్ను చెల్లించాలి.?_ _*ఎవరయినా జవాబు చెప్తారా?*_
_*మేము జీవితాంతం పని చేసి, పన్నులు కట్టిన తర్వాతకూడా..*_
_*మాకు సామాజిక భద్రత లేదు. ఉచిత వైద్య సౌకర్యం లేదు, అధ్వాన్నమైన రోడ్లు, వీధి దీపాలు వెలగవు, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, పండ్లు, కూరగాయలు.. ఇలా అన్నీ విషపూరితమైనవి, ఆసుపత్రుల చికిత్సలు అందనంత ఖరీదైనవి,*_
_*ముసలి వాడినయేంతవరకు పన్ను కట్టి పన్ను మీదపన్నులు కట్టి చేసిన సర్వీసు లో ఆదా చేసుకుని పింఛను తీసుకుంటే దానిమీద కూడా పన్ను అన్నారు అది కడ్తున్నా.*_
*_నా శవాన్ని తగలబెట్టేందుకూ పన్నా?_*
_*ప్రతి సంవత్సరం పెరిగే ద్రవ్యోల్బణం కూడా మమ్మల్ని దెబ్బతీస్తుంది, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, ప్రమాదవశాత్తు ఊహించని విపత్తులు, వాటిల్లో ప్రతిచోటా కూడా మీకు పన్నులు మాకు అప్పులు.*_
_*కానీ..*_
_*ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి?*_
*_అవినీతిలోకి, ఎన్నికల్లోకి, ఉచితాలకి, ధనవంతుల సబ్సిడీల్లోకి, మాల్యా లాంటివారు దోచుకొని పారిపోవటానికి, ధనికుల ప్రకటించే మోసపూరిత ‘దివాలాలు’ పూడ్చటానికి, స్విస్ బ్యాంకుల్లోకి, నాయకుల బంగ్లాలు, కార్లు, జీతాలు సౌకర్యాలకి, ఎమ్మెల్యేలను కొనడంలోకి, మాకు కథలు చెప్పి జండూ బామ్ రాయడానికి ఖర్చు పెట్టారు._*
*_ఇప్పుటికైనా చెప్పండి, దొంగ ఎవరో.?_*
*_మనమంతా కూడా ఈ దేశస్థులమే అయినాసరే, ఎంతకాలం అయినా ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాము. కదా.!_*
_ఇది_
_ఓక సామాన్యుడిగా.._
_నా ఆవేదన 😓
గుండె నొప్పి మరియు గుండెబలమునకు
గుండె నొప్పి మరియు గుండెబలమునకు సిద్ధఔషధ యోగాలు -
* తమలపాకు జీర్ణాశయమునకు మరియు హృదయమునకు బలాన్ని కలిగించును.
* మునగచెక్క రసము నందు కొంచం ఇంగువ చేర్చి ఇచ్చిన గుండెనొప్పి తగ్గును.
* గులాబీల నుండి తయారుచేసిన పన్నీరు గుండెదడ , గుండెపోటు , ఆయాసములను తగ్గించును .
* అంజూర పండ్ల రసమును రోజుకు ఒకసారి తీసుకున్నచో గుండెకి , ఊపిరితిత్తులకు బలాన్ని కలుగచేయును .
* ద్రాక్షపండ్ల రసము గుండెకు , మూత్రపిండాలకు బలాన్ని కలుగచేయును .
* ఒక ఔన్స్ సొంపు కషాయంలో రెండు చెంచాల పంచదార కలిపి రోజుకు రెండుసార్లు పుచ్చుకున్న ఛాతినొప్పి , ఉపిరి తీసుకునేప్పుడు నొప్పి , గుండెనొప్పి తగ్గును.
* ఖర్జుర పండు గుండె , ఊపిరితిత్తులు , మూత్రపిండములు , లివర్ మొదలగు శరీరావయములకు మిక్కిలి ఉత్తేజాన్ని కలిగించి బలమును , పుష్టిని ఇచ్చును .
* ప్రతినిత్యం ఉదయాన్నే ఒక అంజూరపండు తినుచున్న గుండెదడ , ఆయాసం తగ్గును.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
మానవ సంబంధాలు
*కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి...*
*అందుకు గల కారణాలు:*
1. *అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం.*
2. *చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం. ఓర్పు లేకపోవడం.*
3. *పిల్లలు, పెద్దలు కూర్చొని మనస్పూర్తిగా మాట్లాడుకోలేకపోవడం .*
4. *ఎక్కువ సమయం TV, ఫోన్లు, ఇతర net program లలో మునిగిపోవడం. (ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు)*
5. *చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.*
6. *ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం.*
7. *ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం*
8. *భార్యాభర్తలు, తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు...*
9. *మనిషికి మరో మనిషంటే గిట్టనితనం... పెత్తనం కోసం పోరాటం. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.*
10. *మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారన్నారు. మంచి చెప్పినా నచ్చటం లేదు.*
11. *కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ. అది తెలియక పోవడం మరో కారణం.*
12. *మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. "నేను", "నేనే", " నేను చెపితే చేయాలి" అనే ధోరణి ప్రబలిపోయింది.*
13. *social media లో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.*
14. *ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు... ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు.*
*ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు... ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప, ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి.*
*ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదేమో...*
🤔😊🤔 😊🤔😊 🤔😊🤔
అష్టావధానం
శ్రీభారత్ వీక్షకులకు శ్రీక్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు 🌹 అవధాన విద్య మన తెలుగు సంపద. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, బృహత్ సహస్రావధానం వంటి ఎంతో వైవిధ్యంతో, విభిన్న రూపాలలో అలరారే ఈ విద్యను సాక్షాత్తు సరస్వతీ రూపంగా చెబుతారు. నాలుగైదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అవధాన విద్య ను, దానిలో ఆరితేరిన ఎందరో అవధానుల గురించి శ్రీభారత్ వీక్షకులకు సీరియల్ గా పరిచయం చేస్తున్నారు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏