14, ఏప్రిల్ 2024, ఆదివారం

సామాన్యుడి ఆవేదన 😓

 ✍️

_*అయినా నేను ఇంకా పన్ను చెల్లించాలా?ఎందుకు.?*_


*నేను 30 రోజులు పనిచేశాను. జీతం ఇచ్చారు*


_జీతం ఇచ్చారు., ఆదాయపు పన్ను అన్నారు._

_ఇచ్చాను._

_ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు,_

_ఇచ్చాను_


  _మొబైల్ కొనుగోలు పై పన్ను అన్నారు_

_ఇచ్చాను._

_రీఛార్జ్ చేశా_ 

_పన్ను ఇచ్చా_

_డేటా పన్ను ఇచ్చా_

_విద్యుత్తు పన్ను ఇచ్చా_

_ఇంటి పన్ను ఇచ్చా_

_టీవీ బిల్లు పై పన్ను_

_పిల్లల ఫీజుల పై పన్ను.._

_అన్నీ ఇచ్చాను._


_కారుకి పన్ను అన్నారు._

_ఇచ్చాను._

_పెట్రోలు పై పన్ను అన్నారు. చెల్లించా_

_‘సేవ’ అన్నారు_

_పన్ను ఇచ్చాను._


_రోడ్డుపై పన్ను అన్నారు_

_‘టోల్‌ పై’ పన్ను_

_ఆపై లైసెన్స్ మేడ్ ‘ట్యాక్స్’ వచ్చింది._

_ఇచ్చాను._

_కిక్కురుమనకుండా అన్నీ ఇచ్చాను._


_తప్పు చేస్తే పన్ను- చెల్లించా,_

_రెస్టారెంట్‌లో తిన్నా_

_పన్ను చెల్లించా_

 

_పార్కింగ్ పన్ను చెల్లించా_

_నీరు తీసుకున్నా_

_పన్ను చెల్లించా_

_ఇంట్లో కసువు బయట వేసేందుకు పన్ను చెల్లించా_

_టాయ్లెట్ నుండి వేస్ట్ sewage అన్నారు_

_దానికి పన్ను చెల్లించా_

_తినేందుకని కార్డుమీద సామానులు కొనుక్కున్నా_

_పన్ను చెల్లించా_

_రేషన్ కొనుగోలు చేశా_

_పన్ను చెల్లించా_

_బట్టలు కొనుగోలు చేశా_

_పన్ను చెల్లించా_

_పుస్తకాలు తీసుకున్నా_

_పన్ను ఇచ్చా_

_మరుగుదొడ్డికి వెళ్లా_

_పన్ను చెల్లించా_

 

_మందులు తీసుకున్నా_

_పన్ను చెల్లించా_

_గ్యాస్ ఇచ్చారు_

_పన్ను చెల్లించా._


_వందల కొద్దీ వస్తువులు తీసుకుని పన్ను కట్టి, ఫీజులు, బిల్లులు, వడ్డీలు కట్టి, ఎక్కడో ఫైన్లు, లంచాల పేరుతో డబ్బులు చెల్లించి, పొరపాటున ఏ డ్రామా నో ఆడి, ఇంతా అంతా ‘ఆదా’ చేసి మరీ మీకు పన్ను కట్టా._


      

_కానీ ఆ జీతం నుండి ఎన్నిసార్లు పన్ను చెల్లించాలి.?_ _*ఎవరయినా జవాబు చెప్తారా?*_

 

          

_*మేము జీవితాంతం పని చేసి, పన్నులు కట్టిన తర్వాతకూడా..*_

_*మాకు సామాజిక భద్రత లేదు. ఉచిత వైద్య సౌకర్యం లేదు, అధ్వాన్నమైన రోడ్లు, వీధి దీపాలు వెలగవు, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, పండ్లు, కూరగాయలు.. ఇలా అన్నీ విషపూరితమైనవి, ఆసుపత్రుల చికిత్సలు అందనంత ఖరీదైనవి,*_ 

_*ముసలి వాడినయేంతవరకు పన్ను కట్టి పన్ను మీదపన్నులు కట్టి చేసిన సర్వీసు లో ఆదా చేసుకుని పింఛను తీసుకుంటే దానిమీద కూడా పన్ను అన్నారు అది కడ్తున్నా.*_

*_నా శవాన్ని తగలబెట్టేందుకూ పన్నా?_*

           

_*ప్రతి సంవత్సరం పెరిగే ద్రవ్యోల్బణం కూడా మమ్మల్ని దెబ్బతీస్తుంది, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, ప్రమాదవశాత్తు ఊహించని విపత్తులు, వాటిల్లో ప్రతిచోటా కూడా మీకు పన్నులు మాకు అప్పులు.*_


_*కానీ..*_

_*ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి?*_


*_అవినీతిలోకి, ఎన్నికల్లోకి, ఉచితాలకి, ధనవంతుల సబ్సిడీల్లోకి, మాల్యా లాంటివారు దోచుకొని పారిపోవటానికి, ధనికుల ప్రకటించే మోసపూరిత ‘దివాలాలు’ పూడ్చటానికి, స్విస్ బ్యాంకుల్లోకి, నాయకుల బంగ్లాలు, కార్లు, జీతాలు సౌకర్యాలకి, ఎమ్మెల్యేలను కొనడంలోకి, మాకు కథలు చెప్పి జండూ బామ్ రాయడానికి ఖర్చు పెట్టారు._*

 

*_ఇప్పుటికైనా చెప్పండి, దొంగ ఎవరో.?_*


*_మనమంతా కూడా ఈ దేశస్థులమే అయినాసరే, ఎంతకాలం అయినా ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాము. కదా.!_*


_ఇది_

_ఓక సామాన్యుడిగా.._

_నా ఆవేదన 😓

కామెంట్‌లు లేవు: