30, మార్చి 2022, బుధవారం

పండితుడు

 🕉️ *సుభాషితమ్* 🕉️

--------------------------------------------


శ్లోకం:

*అర్థం మహాన్తమాసాద్య*

*విద్యామైశ్వర్యమేవ వాl*

*విచరత్యసమున్నద్ధః*

*యః స పణ్డిత ఉచ్యతేll*

                    ~సుభాషితరత్నావళి


తాత్పర్యం:

"చాలా ధనాన్ని, చదువునూ, అధికారాన్ని పొందికూడా మిడిసిపాటు లేకుండా సంచరించేవాడు పండితుడు అనబడతాడు".

సుభాషితమ్

 🪔 *ॐ卐_ ॐ*💎

సుభాషితమ్

శ్లో|| ధనం తావదసులభం లుబ్ధం కృచ్ఛ్రేణ రక్ష్యతే।

లబ్ధానాశో తథా మృత్యుః తస్మాదేతన్న చిన్తయేత్॥


తా|| "ధనసంపాదన చాలా కష్టము. సంపాదించిన దానిని రక్షించుట మరీ కష్టము. లభించిన ధనము పోనూవచ్చు. లేదా తానే మృతినొందవచ్చు. కావునా *ధనముగూర్చి అంతగా వ్యసనపడుట మంచిది కాదు*."

చమత్కార పద్యం

 చమత్కార పద్యం


ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన కంద పద్యం


*అంచిత చతుర్ధ జాతుడు*

*పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్*

*గాంచి, తృతీయం బక్కడ*

*నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!*


*భావం:*

గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను.... 


ఏమీ అర్థం కాలేదు కదా!? ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు

1) భూమి

2) నీరు

3) అగ్ని

4) వాయువు

5) ఆకాశం. 


ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి. 

చతుర్థ జాతుడు అంటే *వాయు నందనుడు,*

 పంచమ మార్గము అంటే *ఆకాశ మార్గము,*

ప్రధమ తనూజ అంటే *భూమిపుత్రి సీత,*

 తృతీయము అంటే *అగ్ని ,*

 ద్వితీయము దాటి అంటే *సముద్రం దాటి* ఇప్పుడు భావం చూడండి.... 


*హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని భావం* 


ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. వ్రాసిన కవికి నమస్సుమాంజలి.!!! 🙏🙏🙏

ఓ కథ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

     *   ఓ కథ*               

పట్టుచీర కట్టించాడు తల్లికి. ‘చూశారా ఉద్యోగం వచ్చాక గాని, పెళ్ళికి గాని నాకు ఒక మంచి పట్టుచీర పెట్టనేలేదు నా కొడుకు’ అని మధనపడుతోంటే ‘పిచ్చిదానా నీకేం లోటు. నేనున్నానుగా. నీకు ఎంత ఖరీదైన చీర కావాలో చెప్పు. క్షణాల్లో తెస్తాను’ అనేవాడు మూర్తి చాలాసార్లు.


ముఖమంతా పసుపు పూసి నుదురులో నాలుగో వంతు కుంకుమ బొట్టు పెట్టారు. కళ్ళకు కాటుక పెట్టారు. పట్టుచీర అలంకరణలో దేవకి ముఖం వెలిగిపోతోంది. సుమంగళిగా వెళ్ళిపోవడం హైందవ స్త్రీలు ఎప్పుడూ కోరుకుంటూంటారు ఇందుకేనేమో. 


దేవకి ఒక్కసారి కళ్ళు తెరిస్తే చూడాలని మూర్తి మనసు ఉవ్విళ్ళూరింది.


పెద్ద పూల మండపం తయారు చేయించారు. ఘనంగా మేళం పెట్టి ఊరేగింపుతో మరుభూమికి తీసుకెళ్ళారు. 


సువాసిని పూజలో ముత్తయిదువులు అందరికీ ఇత్తడి చేటలు, వెండి కుంకుమ భరిణెలు తాంబూలాల్లో పెట్టిచ్చారు. ఘనంగా భోజనాలు ఏర్పాటు చేశారు. భోక్తలకు పంచెల చాపులు, పెద్ద రాగి చెంబులు, కర్మకాండలకు వచ్చిన వారందరికీ పెద్ద స్టీలు పళ్ళాలు ఇచ్చారు.


పత్రికల్లో సగం పేజీలలో రంగులలో అశ్రునివాళి ప్రకటనలు ప్రచురించారు. మునిసిపాలిటీలో పర్మిషన్ తీసుకొని పాలరాతి సమాధి కట్టించారు. ఈ అతి ఖరీదైన సమాధి దేవకి చూసుకుంటుందా?    ఏమిటో!


ఈ తతంగమంతా కొడుకు, కోడలు కలిసే చేశారు. మూర్తి కూతురు కనీసం ఒక్క చెయ్యి కూడా వెయ్యలేదు. మరి అది తన పని కాదని భావించిందేమో!


చివరగా ఆశీర్వచనాలలో పురోహితులు ‘నాయనా ! ఇన్నాళ్ళూ మీ అమ్మ గారు, నాన్నగారు పార్వతీ, పరమేశ్వరుల లాగా కలిసిమెలిసి ఒకరి యోగక్షేమాలు మరొకరు చూసుకున్నారు. కాని ప్రస్తుత పరిస్థితి అలా కాదు. మీ నాన్నగారు ఒంటరి వారైపోయారు. మీరు ఆయన్ను తన శ్రీమతి లేదనే దిగులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇక నుండి కంటికి రెప్పలాగా చూస్తామని పెద్దల ఎదుట ప్రమాణం చెయ్యండి’ అనగానే ‘అలాగే’ అన్నాడు కొడుకు.


అశుభ కార్యక్రమం కాబట్టి వచ్చిన వారందరూ చెప్పకుండానే ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.


దిగాలుగా కూర్చున్న మూర్తి దగ్గరకు కూతురు వచ్చింది. ఒక క్షణం ఆగి ‘నాన్నగారు ఉన్నపళంగా ఏమిటి ఇలా అయిపోయింది మన ఇల్లు నిశ్శబ్దంగా’ అంటూ తండ్రిని ప్రేమగా దగ్గరకు పొదువుకుంది. 


కూతురి ఆప్యాయతతో నిండిన ఓదార్పు మూర్తి మనసును ఎంతగానో ఉపశమింపచేసింది. ఆ మరు క్షణంలోనే ‘నాన్నగారూ ఈ విచార సమయంలో నేను ఈ మాట మాట్లాడకూడదు. కాని ఎప్పుడు మాట్లడాల్సింది అప్పుడు మాట్లాడకపోతే సమయం మించి పోతుంది’ అంటూ ఆమె వెనకాడుతోంటే ‘చెప్పు తల్లీ’ అని అడిగాడు మూర్తి.


‘ఈ ఇల్లంటే, అమ్మ తిరిగిన ఈ పరిసరాలంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. అన్నయ్యకు ఏమిస్తారో నాకు తెలీదు గాని, నాకు మాత్రం ఈ ఇల్లు బహుమానంగా ఇవ్వండి నాన్నగారు’ అంది గోముగా.


మూర్తి హృదయంలో ధమనులు, సిరలు ఒక్కసారిగా చిట్లిపోయి రక్తం ముఖంలోకి చిమ్మింది. ఇంకా తను బ్రతికే ఉన్నాడుగా అప్పుడే ఆస్తులు అడిగేస్తున్నారా? 


ఒక్కక్షణం తేరుకుని మూర్తి ‘పిచ్చి తల్లీ నువ్వంటే మాకు ఎంతో ఇష్టం. నువ్వు ఈ మాట అడగకుండా ఉంటే ఎంతో బావుండేదిరా. కాని అడిగేశావ్. మీ అమ్మ కోరిక ఏమిటంటే మా తదనంతరం ఈ ఇంటిని ఒక వద్ధాశ్రమానికి ఇచ్చేద్దామని. అది పక్కన పెట్టేసెయ్. కాని అమ్మ అంతిమ సంస్కారాలు, తదితర కార్యక్రమాలు అన్నయ్య, వదిన ఎంతో డబ్బు ఖర్చు చేసి క్షణం విశ్రాంతి తీసుకోకుండా ఒళ్ళు గుల్ల చేసుకుని నిర్వహిస్తోంటే కనీసం కొంత డబ్బు ఖర్చు చేస్తానని గాని, ఏదో ఒక పని సాయం చేస్తానని గాని ఎందుకు నువ్వు ముందుకు రాలేదు ? ఇలా అంటున్నందుకు క్షమించు తల్లీ’ అంటూ భుజం మీదున్న కండువాను ముఖం మీద కప్పుకుని భోరుమన్నాడు మూర్తి. 


కూతురు నింగి, నేల చూస్తోంది అయోమయంగా. చిటికెలో తండ్రి చూపులకు అందకుండా మాయమైపోవాలనుంది ఆమెకు.


దాదాపు యాభై సంవత్సరాల అన్యోన్య దాంపత్యంలో తనను అన్ని విధాలుగా ఆదుకుని, చేదోడువాదోడుగా ఉండి, తన తలపుల నిండా కమ్ముకున్న భార్య దేవకి ఉన్నపళంగా మాయమై పోయిందే ! ఆమె లేకుండా ఎలా జీవితం కొనసాగించడమా అని ఏడుస్తూ ఉంటే కూతురు ఇల్లు కావాలంటోంది. 


మనిషి తన సుఖం కోసం సంపాదించుకున్నవి తిరిగి అతన్నే వేధిస్తాయన్న మాట. ఇప్పటికే అబ్బాయికి రెండిళ్లు, అల్లుడికి ఒక మేడ, ఖాళీ స్థలం ఉన్నాయి మరి!


రెండు, మూడు రోజుల్లో పిల్లలు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు. సామాన్లు సర్దుకుంటున్నారు. తాను మోజు పడిన దేవకి చీరలు కొన్ని కూతురికి ఇచ్చేశాడు. వాటిని చూస్తోంటే మరింత వేదన కలుగుతుందనే ఆలోచనతో.


తరువాత కోడలికి ఇవ్వాలి. వీళ్ళేం చేస్తున్నారోనని కొడుకు గది వైపు వెళ్ళబోతుంటే గట్టిగా కేకలు, అరుపులు వినిపించసాగాయి మూర్తికి. 


తలుపు దగ్గరే చాటుగా నిలబడి ఉండిపోయాడు.


‘ఏమిటి పిచ్చి వేషాలు వేస్తున్నావ్ ? నాన్నగారిని ఇల్లు అడిగేస్తున్నావేం?’ అంటున్నాడు చెల్లితో చాలా కోపంగా. 


‘ఏం నేను అడగకూడదా ? నాకూ హక్కు ఉంది’ అంటోంది కూతురు అంతే కోపంతో.


‘లక్షలు ఖర్చుపెట్టి అమ్మకు సంస్కారాలన్నీ చేసి నాన్నగారిని సంతోషపెట్టాను. ఇంకా నాతో కూడా తీసుకెళ్ళి నాతో పాటే ఉంచుకుని ఆయన యోగక్షేమాలన్నీ చూసుకుని ఈ ఆస్తంతా నా పేరున రాయించుకుందామనుకుంటున్నాను ఆయన బ్రతికుండగానే. అర్థమైందా ? ‘ఇక్కడ్నించి వెంటనే నీ మొగుణ్ణి, పిల్లలను తీసుకుని వెళ్లిపో. పిచ్చి వేషాలు వెయ్యకుండా’ కోపంతో అరుస్తున్నాడు. 


ఆమె వెంటనే ఆ గదిలోంచి బయటకు వెళ్ళకపోతే చేయి చేసుకుంటాడేమో.


కూతురు వెక్కి వెక్కి ఏడుస్తోంది. మూర్తికి ఈ సంభాషణంతా విన్నాక గుండెల్లో మందుపాతరలు పేలినట్లుగా, ప్రాణం కడతేరుతున్నట్లుగా ఉంది.


‘దేవకీ నీ ముద్దుల కొడుకు, కూతురంటే ప్రేమతో పడి చచ్చేదానివి. నువ్వు బ్రతికుండగా ఈ మాటలు వినుంటే చచ్చిపోయేదానివి. కాని చచ్చిపోయి బ్రతికిపోయావ్. అదష్టవంతురాలివి. అయినా నువ్వు బ్రతికుండగా ఈ మాటలు అనే అగత్యం లేదుగా. ఇప్పుడు నేనేం చెయ్యాలి?’ అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ తమ పడకగదిలో చేరి కర్మకాండల కోసం చేయించిన దేవకి ఫొటో ఎదురుగా నిలబడ్డాడు కళ్ళ నిండా నీటి చెలమతో.


విరక్తిగా నవ్వుతోంది దేవకి ఫొటోలో ఎప్పటి లాగే. కంట్లో నీరు నిండిపోయి కనురెప్పలు మూసి తెరిచేటప్పటికి ‘ఇవన్నీ మనకెందుకండి నా దగ్గరకు వచ్చేయండి’ అన్నట్లుగా రెండు చేతులు చాపి పిలుస్తున్నట్లుగా భ్రమ చెందాడు మూర్తి. 


కళ్లు నులుముకుని మళ్ళీ చూశాడు. ఎప్పటిలాగే చిద్విలాసంగా నవ్వుతోంది దేవకి. తదేకంగా చూస్తూనే ఉన్నాడు మూర్తి భార్య ఫొటోను ‘ఎప్పుడు రాగలను నీ వద్దకు’ అన్నట్లుగా.


‘ఎందరో తల్లుల ప్రేమ కలిపితే దైవం. ఎందరో దైవాల ప్రేమ కలిపితే అమ్మ’ అన్నారు ఓ కవి. 


కాని అప్పుడే ఆ తల్లిని మర్చిపోయి తండ్రి బ్రతికుండగానే సంపదలపై మోహాలు కలుగుతున్నాయి సంతానానికి.


‘నాన్నగారూ మీరు ఒంటరిగా ఎలా ఉంటారు. మా దగ్గరకు వచ్చి ఉండండి’ అని అబ్బాయి గాని, అమ్మాయి గాని అన్నారా?


ఇల్లు కావాలని ఒకరు. మొత్తం అస్తి కావాలని మరొకరు. అసలు ఆస్తులు సంపాదించడం ఎందుకో? ఏమిటో?


‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. అంతా ఒక నాటకం. ఎవరు తండ్రి ? ఎవరు కొడుకు ?’ టెలివిజన్లో డాక్టర్ సి. నారాయణరెడ్డి గారికి నివాళి సమర్పిస్తున్నారు ఆయన రచించిన పాటలతో.


‘అవును ఈ జీవితమంతా ఒక నాటకం. అయితే మానవ జీవితంలో తమ పాత్రలలో కడదాకా జీవించేవారు భార్యాభర్తలు మాత్రమే అని ఎంత మందికి తెలుసు ? ఇంకా ఎన్నాళ్ళు జీవించాలి ఈ ఒంటరి జీవితం?’ మూర్తి ఆలోచనలు అవధులు దాటి ఎటో పయనిస్తున్నాయి.✍️

             – కాకరపర్తి భగవాన్ కృష్ణ.


             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

అరుంధతి నక్షత్రం*.

 . అరుంధతి నక్షత్రం*.🌟


*అరుంధతి*


🌟వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. 


⭐ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వసిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు.


⭐పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలపడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది.


⭐వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వడింది. ఇసుక అన్నంగా మారింది.

వశిష్టుడికి కుండలోని అన్నం చూపించింది.


⭐ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు ఆమెనే అరుంధతి. తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు.


🌟ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది.ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉంటుంది. చాలా ఏళ్లు గడిచినా వశిష్టుడు రాడు.


⭐అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది. పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత. అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు అమ్మా అరుంధతి మీ ఆయన ఇన్నేళ్లు అయినా తిరిగిరాలేదు. కాస్త ఇటు చూడమ్మా అంటారు.


అయినా ఆమె చూపు మరల్చదు. కొన్ని ఏళ్ల తర్వాత వశిష్టుడు వచ్చి అరుంధతీ.. అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది.


🌟తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి.


🌟ఒకసారి అగ్ని దేవుడి ఎదుట సప్త ఋషులు యజ్ఞం చేపడుతారు.ఆ. ఋషుల భార్యలపై అగ్ని దేవుడు మోజు పడతాడు. ఈ విషయాన్ని అగ్ని దేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది. ఆ ఏడుగురి భార్యల మాదిరిగా తానే రోజు కొక రూపం ధరించాలనుకుంటుంది. రోజు కొక ఋషి భార్య రూపం లోకి మారి తన భర్త అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది.


⭐ఇక చివరి రోజు తాను అరుంధతిని అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోకి మారలేదు. అరుంధతి పెద్ద పతివ్రత కావడమే ఇందుకు కారణం.


🌟అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆందర్శంగా నిలిచింది. అరుంధతికి శక్తి అనే కుమారుడున్నాడు. శక్తి కుమారుడే పరాశరుడు. పరాశరుడి కుమారుడే వ్యాసుడు.


⭐అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం. అందుకే నూతన వధూవరులకు అరుంధతి  నక్షత్రం చూపించి అంతటి మహా పతివ్రతగా జీవించమని ఆశీర్వదిస్తారు...


🌟🌟🌟🌟🌟🌟

మర్కటం - మాటలు

 మర్కటం - మాటలు


వేసవి కాలంలోని ఒక సాయింత్రం. పరమాచార్య స్వామివారు మేనాలో కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తున్నారు. స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. భక్తులు సమర్పించిన పళ్ళబుట్టలు, ఎండుద్రాక్ష, కలకండ, తేనె సీసాలు మొదలైనవన్నీ మేనా ముందు నేలపైన ఉన్నాయి. 


హఠాత్తుగా కోతుల దండు ఒకటి దాడికి దిగింది. పళ్ళని తిని మొత్తం చిందరవందర చేసి తేనెసీసాలను తోసి కిష్కింద చేస్తున్నాయి. అవి మహాస్వామి వద్దకు వెళ్ళి వారికి హాని చేస్తాయి అని శిష్యులు భయపడ్డారు. 


కాని మహాస్వామివారి ముఖపద్మంలో రేఖామాత్రమైనా విరక్తి లేదు. వాటిని ఏమీ చెయ్యవద్దని చేతి సైగలద్వారా ఆజ్ఞాపించారు. స్వామివారిని కాపాడుకోవాలని చేతులలో కర్రలు పట్టుకుని వస్తున్నవారల్లా ఆ కర్రల్లాగే స్థాణువులై నిలబడిపోయారు. 


కొద్దిసేపటి తరువాత ఆ కోతులన్నీ వచ్చిన పని ముగించుకుని రామకార్యార్థమై వెళ్ళిపోయాయి. అవి వెళ్ళగానే స్వామివారు భక్తులకి ఒక సంఘటనను చెప్పారు. 


తంజావూరు జిల్లాలో ఒక గ్రామంలోని ప్రజలు ఈ కోతుల బాధ భరించలేకపోయేవారు. అనుకోకుండా దొరికిన ఒక కోతిని ఒకతను కర్రతో కొట్టాడు. దానికి తగిలిన దెబ్బలవల్ల అది కొన్ని రోజులకి మరణించింది. తరువాత తనకి కలిగిన ఆడపిల్లకి మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. ఆ పిల్లకి వివాహం చెయ్యవలసిన వయసు వచ్చింది. అతను మహాస్వామివారి వద్దకు వచ్చి అతను చేసిన పాపాన్ని చెప్పుకుని బాధపడ్డాడు.


“మట్టితో కోతిబొమ్మను తయారుచేసి మీ ఊరి గ్రామదేవత గుళ్ళో ఇవ్వు. మనఃస్పూర్తిగా ఒప్పుకున్నవాడికే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యి” అని చెప్పారు. స్వామివారు చెప్పినట్లే జరిగింది. తరువాత ఆ అమ్మాయికి చక్కగా మాట్లాడగలిగే పిల్లలు పుట్టారు.


కోతులను ఎప్పుడు కొట్టరాదు. వాటి మీద జాలి చూపించాలి. అవి రామణ్ణి సేవించుకున్న కోతుల పరంపరలో నుండి వచ్చాయి. అవి మనకు ఇబ్బంది కలిగించినా ‘ఆంజనేయుడు’ అని తలచి వాటిని వదిలిపెట్టాలి.


ఈ కథనంతా విని భక్తులు కరిగిపోయారు. పరమాచార్య స్వామివారే బోధించినందుకు ఆనందపడ్డారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కథ

 *ఒక కథ!* 


*Amma Katha*


కొన్ని నెలల క్రితం, కొత్తగా ఒక పనిమనిషి చేరింది, నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు, మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా, ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఊయోగించను. ఆవిడ పేరు.......


మూడు నాలుగు రోజుల తరువాత అడిగా.. 

అమ్మా! ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు అని.

ముగ్గురు అమ్మాయిలు అండి, 


పెళ్లిళ్లు అయ్యాయా, లేదండి ఇంకా చదువుకుంటున్నారు. 


O.K, ఏం చదువు కుంటున్నారు అని క్యాజువల్ గా అడిగా, పెద్ద అమ్మాయి M.Sc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తోంది, 

ఆ అంటూ నోరు తెరిచా, 


రెండో అమ్మాయి M.Sc Computers మొదటి సంవత్సరం, 


మూడో అమ్మాయి ఎంబీబీస్ రెండో సంవత్సరం. 


ఆ అని నోరు వెళ్ల బెట్టా. నర్సింగా అన్నా, 

కాదు సార్ M.B.B.S అంది. 


నాకు అర్థం కావటం లేదు, ఈవిడ ఏమంటోంది, 

ఏం మాట్లాడుతోంది. ఈవిడకు ఏం మాట్లాడుతోందో అర్థం అవుతోందా? 


మళ్ళీ అడిగా, అవే సమాధానాలు, 


M.B.B.S ఫ్రీ సీటా అని అడిగా, అవును సార్, 

ఫ్రీ సీట్ యే, 

అదేదో బిల్డింగ్ ఫీజ్ అంటా, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి.


ఏ స్కూలులో చదువుకున్నారు అమ్మా మీ పిల్లలు అని అడిగా?


ఇక్కడే, మన  ఊరి బడి లొనే  10 వ తరగతి వరకు. 


లాంగ్ టర్మ్ గట్రా వెళ్లిందా ఎంబీబీస్ అమ్మాయి అని అడిగా, ఏం లేదయ్యా, మన ఊరి  కాలేజ్ యే, నాకు ఈ చదువుల గోల ఏం తెలీదయ్యా, ఇప్పుడు ఇప్పుడే కాస్త నోరు తిరుగుతోంది. 


ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు అని అడిగా,

రెండులో మానేశానయ్యా, నాకు కూడికలు, తీసి వేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకు రావటానికి.


మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా,


ఆయనా అందరి లాగే, ఇంటి విషయాలు ఏం పట్టవు. 


ఆయన త్రాగుతాడు, 

100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడు ఇప్పుడు కొంచం మారుతున్నడు, పాప డాక్టర్ కోర్స్ లో చేరిన తరువాత.


మా పెద్ద అమ్మాయిని ఏడో తరగతిలో చదువు మానిపించేసా, కానీ వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి, నన్ను మందలించి, మంచి తెలివి గల అమ్మాయి, చక్కగా చదువు కొంటోంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థం అయ్యింది నాకు, నా పిల్లలు తెలివి గల వాళ్ళు అని, నా పిల్లల చదువులు ఆగ కూడదు అని ఇంకో రెండు ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలు పెట్టా. 


ఇంట్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు, మూడు మూడు నెలలు బిల్ కట్టలేక పోయే దాన్ని, పిల్లలు ఆలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు. 


ఇప్పుడు కాస్త పర్వాలేదు, పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కిందా మీదా పడుతున్నాను అంది. 


నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ,

భర్త త్రాగుబోతు, ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా. 


లక్షలు, లక్షలు ఫీజులు పోస్తుంటే నాపిల్లలు అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా. 


అంతే, నాకు అర్జంట్ గా వీళ్ళ ముగ్గురు పిల్లలని కలవాలి అనిపించింది.

నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయ్యాలి అని అడిగా, అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అన్నా. 


నేను ఆడిగినట్లే, ముగ్గురిని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది ........ 


ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంతగానో బ్రతిమాలితే  గాని, కుర్చీలపై కూర్చో లేదు. 


ఆమె  నేల పైనే. నాకు అలవాటే సారూ అంది, 


నా పిల్లలు నాలా మిగిలి పోకూడదు అనే ఈ నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు, అంది కళ్ళ నీళ్లతో..... 


నేను కాదు,  వీళ్లు కాదు, 

నువ్వూ ... గొప్ప దానివి అన్నా. 


మొదటి పది నిమిషాలు ముగ్గరు ముడుచుకు కూర్చున్నారు, తరువాత కొంచం కొంచం మాట్లాడ్డం మొదలు పెట్టారు. 

తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకొంది, ఎంతో కొంత స్కాలర్షిప్ లు రావటం, అవి సహాయ పడ్డం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు.


వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా. 

ఏం కావాలి అని అడిగా, 

ఎంత అనుకువగా ఉన్నారో, అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా, ఆహా వద్దు అనే సమాధానం. 


నేను, నా అర్ధాంగి అడగంగా, అడగంగా,  ఒక Two వీలర్ ఇప్పించండి, ముగ్గరము కలిసి ఊయోగించు కుంటాం, మీకు నెల నెలా ఇస్తాం, మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. Two వీలర్ ఉంటే, కాస్త సౌలభ్యoగా ఉంటుంది, సగం డబ్బులు ఆటోలకు అయి పోతున్నాయి, మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు, దొరికే స్టాప్ వరకు నడచి అలిసిపోవటం, సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి. Two వీలర్ ఉంటే అలిసిపోము, మిగిలిన సమయాన్ని చదువు కునేందుకు ఉపయోగించు కుంటాము అన్నారు. 


Two వీలర్  ఇప్పించా డబ్బులు కట్టి, 


ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు, ఒక పది వేలు ఉంచుకోండి అని అన్నా వినకుండా. 


పెద్ద అమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తరువాత తన కాలేజ్ కు వెళ్లి పోతుంది. మళ్ళీ ఇద్దరని పికప్.

పెద్ద అమ్మాయి J.L పోస్టులకు సన్నద్ధం అవుతోంది. రెండో అమ్మాయి Software ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని.


చెప్పటం మరిచా ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతి రోజు రెండు గంటలు.

 

ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో, మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాళ్లు ఎందరో..


ఒకసారి  ఆమె తో  అన్నా, ఇంకో రెండు సంవత్సరాలు కష్టం మీకు, తరువాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని, 


ఏం సారూ నన్ను పనిలో నుంచి తీసేయ్యాలి అనుకుంటున్నారా, నా ఒంట్లో శక్తి ఉన్నoత వరకు నేను నా పని మానను.


ఆమెను  అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని, 


లేదు అన్నది, పిల్లలకు ఉంది, అయినా వీళ్లు  తమ చదువులు అయిపోయి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లి పోతే తను నేనే కదండి, కోపాలు, తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడి పోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం.


ఒక సారి పెద్ద అమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురుంచి గొప్పగా చెబుతుంటాడు, అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టం అని......


ఎందరో అమ్మల నిజమైన కథ..!!!


🌼🌺🏵️🌻🌸🥀💐🌹🌷🏵️🌺


అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకు .


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి.  కనీసం చదువు కున్న వాళ్లకు అర్థం అవుతుంది. Copy

నేను, నాది, నాకు

 నేను, నాది, నాకు అనే ఈ మూడు పదాలు మనం సర్వసాధారణంగా ప్రతి రోజు అనేక సందర్భాలలో ఉపయోగిస్తున్నాము. ఈ పదాలు వాడేటప్పుడు కొన్ని సార్లు సంతోషం, ఆనందం,కలుగుతుంది అలాగే కొన్ని సందర్భాలలో విచారం, దుఃఖం కూడా కలగటం కద్దు. ఈ వాడుకల గూర్చి ఒక చిన్న పరిశీలన చేద్దాం. 

నేను: ఇంతమంచి ఇల్లు ఎవరు కట్టించారండి.  నేను కట్టించానండి ఆ జవాబు చెప్పేటప్పుడు ఒక రకపు గర్వం  తొణికిసలాడుతుంది . అంతటితో ఆగి పోడు మా అన్నదమ్ములల్లో ఇంతపెద్ద ఇల్లు నా ఒక్కడికే వుంది.  మా అన్నయ్య రెవెన్యూ డిపార్టుమెంటులో పెద్ద ఉద్యోగం చేసాడు కానీ ఇప్పటివరకు ఒక గుడిశ కూడా కొనలేక పోయాడు, ఇక మా తమ్ముడు ఇటీవలే ఒక చిన్న ఇల్లు కొన్నాడు. నిజానికి నీవు అతని అన్నదమ్ముగూర్చి ఏమి అడగలేదు కానీ చెప్పాడు ఎందుకంటె ఆలా చెప్పటంలో తన ఉన్నతస్థితిని చెప్పటానికి. నిజానికి అతని అన్నగారు నిజాయితిగా యుద్యోగం చేయటం వలన ఎక్కువగా సంపాదించలేక పోయాడు అందుకే ఇల్లు సమకూర్చుకోలేక పోయాడు. మరి తాను అడ్డమైన గడ్డి తిని అందరిని ముంచి బాగా సంపాదించి ఇంతపెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ప్రజలకి నీవు ఎలా జీవిస్తున్నావు అన్నది అవసరంలేదు నీవు యెంత సంపాదించావు అన్నది ఉంటే చాలు. తమ్ముడు పొదుపుగా జీవనం చేస్తూ తన ఆర్జనకు తగినట్లుగా అప్పులు లేకుండా చిన్న ఇల్లు కట్టుకున్నాడు.  ఇప్పుడు సమాజంలో నీతి, నిజాయితీకి విలువలు రోజు రోజుకు సన్నగిలుతున్నాయి. 

నాది: సమాజంలో పలుకుబడి, ఉన్నత స్తానం నాది అని ప్రతివారు ఏంటో సంతోషంగా చెప్పుకోవటం మనం చూస్తున్నాం. 

నాకు: ఎక్కడ ఎది వున్న కూడా అది నాకే దక్కాలి అనే ఆలోచనలు ప్రతివారిలో ఉంటున్నాయి. 

ఇలా మనం రోజు వాడే ఈ పదాలే కాక వీటికి అనుబంధంగా మాకు, మనం, మాది లాంటివికూడా వీటి కోవకే చందుతాయి. ఇంతకూ ఈ నేను, నాది, నాకు అనే పాదాలను ఎవరికి ఉపయోగిస్తున్నాము అంటే వెంటనే నాకే ఉపయోగిస్తున్నాం అని సమాధానం చెపుతాము. ఇంతకూ ఆ నేను ఎవరు అంటే అది నా దేహం అని మనం అందరమూ ముక్తకంట్టంగా చెపుతాము అందులో సందేహం లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దేహం అని చెప్పే నా దేహం నిజంగా నాదేనా లేక వేరే ఎవరిదైనన. దీనికి .వివరణ క్రింద చుడండి. 

దేహః కిమన్నదాతుః స్వం నిషేక్తుర్మాతురేవ చ మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేః శునోపి వా. ఏవం సాధారణం దేహమవ్యక్త ప్రభవాప్యయమ్ కో విద్వానాత్మసాత్ కృత్వా హన్తి జన్తూనృతే సతః. 

(భాగవతము 10-10-11,12)

ఈ దేహము ఎవరిది? అన్నము పెట్టి పోషించువానిదా? పుట్టించిన తండ్రిదా? తొమ్మిది నెలలు మోసిన తల్లిదా? తల్లిని కనినట్టి తాత అమ్ముమ్మలదా? దీనిచేత పనిచేయించు బలవంతునిదా? శ్మశానములో దీనిని కాల్చివేయు అగ్నిదా? రుధ్ర భూమియందు దీనిని కొరికి కొరికి తినివేయు కుక్కలదా? అని భాగవత కారుడు నిలదీసి ప్రశ్నించెను. భాగవతము దశమస్కంధములో నారదుడు నలికూబర, మణిగ్రీవులను దేవపుత్రులకు గావించిన హితోపదేశ సందర్భమున ఈప్రశ్న గావింపబడెను. ఆ ప్రశ్నకు నారదులే ఈ ప్రకారముగ సమాధానము ఒసంగివైచిరి –

'నాయనలారా! ఈ దేహము ఎవరిదీ కాదు. ఇది యొక సామాన్యమైన జడవస్తువు. మృత్తికానిర్మిత మగు ఘటమువంటిది. ప్రకృతి నుండి పుట్టి ప్రకృతిలో లయమైపోవుచున్నది. ఇట్టి అల్పవస్తువును 'నేను' అని తలంచి ఇతరులకు కీడు చేయదలంచువారు ఎంత అవివేకులు?' కావున నశ్వరమై, పాంచభౌతిక మైనట్టి ఈ శరీరము తాను కాదనియు, శాశ్వతమగు చిన్మయ ఆత్మయే తాననియు బాగుగ నిశ్చయించుకొని, సర్వప్రాణులు తన స్వరూపమే యని భావించు కొని, ఎవరికిని అపకారము చేయక జీవితమును గడుపవలయును.

మానవునికి కలుగుచున్న దుఃఖమంతటికిని కారణము ఈ దేహాభిమానమే. దేహముపైనను, దేహమునకు బయట గల పదార్థములపైనను గల మమత్వమే దుఃఖమునకు హేతువు. జీవుడు ఉపాధిని ధరించి లోకమున వ్యవహరించు ఉపాధి వస్తువుగా మాత్రమే ఈ దేహమును తెలుసుకొనవలెను. అంతేకాని నశ్వరము, అనిశ్చితము క్షయము అగునట్టి ఈ దేహము మీద వ్యామోహము కల్పించుకొన వలదు.. ప్రతి మానవుడు నిత్యమూ దేహసౌందర్యముకొరకు, దేహాభిమానము కొరకు, దేహవృద్ది కొరకు మాత్రమే తమ అమూల్య మైన కాలాన్ని వెచ్చిస్తున్నాడు. నిజానికి కాలప్రవాహంలో పుట్టి కాలప్రవాహంలో కలిసిపోయే ఈ దేహము నాది కాదని కేవలము సాధకుడు మాత్రమే తెలుసుకొనగలడు. ఈ దేహము జరామరణాలకు లోబడి వున్నది కాబట్టి శరీరములో సత్తువ ఉన్నపుడే శరీరాన్ని అంటిపెట్టుకొన్న ఆ జీవుడిని (ఆత్మ) ఉద్ధరింపచేయ వలెను నిత్యము తప్పసును చేసి మోక్ష ప్రాప్తిని పొందవలెను. సమయము నీచేతిలో లేదు ఈ క్షణమే మేలుకో జీవన్ముక్తికి సాధన ఆరంభించు. 

ప్రపంచం: ఈ ప్రపంచము చాలా విచిత్రమైనది ప్రతివారు ఈ ప్రపంచము తనగూర్చి తలచిస్తుందని అనుకుంటారు.  నిజానికి ప్రపంచానికి నీవు ఎలా వున్నావు అనేది సంబంధము కలిగి ఉండదు. ఎప్పుడు ప్రపంచం కోసం బ్రతకకు నీకోసం మాత్రమే బ్రతకటం అలవాటు చేసుకో. 

ధర్మం: ధర్మ బద్దంగా జీవిస్తూ భగవంతుడు నీకిచ్చిన దానితో తృప్తి చెంది దినములో అధిక కాలము భగవంతుని చింతన చేయటమే సాధకుని పని. మానవులుగా మనం కేవలము సాధన చేయటము మాత్రమే ఫలితాన్ని ఇవ్వటం భగవదానుగ్రహం. 

దేహము మీద యెంత మమకారము పెంచుకొనినను ఇది ఏదో ఒక రోజున రాలిపోక  తప్పదు. కాబట్టి దేహాన్ని సరైన పద్దతిలో వాడుకొని మోక్ష ప్రాప్తి పొందటమే మానవుని కర్తవ్యము. 

దీపమున్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకో: 

దేహమనే ఇంట్లో జీవుడు అనే దీపం ఉన్నప్పుడే నీ ఇంటిని చక్కదిద్దుకో ఎప్పుడైతే దీపం ఆరి పోతుందే అప్పుడు దేహమనే నీ ఇల్లు దేనికి పనికి రాదు కేవలం కట్టెలలో కాల్చి బూడిద అవ్వటం తప్ప.  ఎవరో నన్ను చూసి ఏమనుకుంటారో అనే భావనను విడనాడి ఇప్పుడే మన మహర్షులు నిర్దేశించిన ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించు. 

ఓం తత్సత్

శాంతి శాంతి శాంతిః 

జ్ఞానయోగసాధన

 18వ అధ్యా.)


జ్ఞానయోగసాధన


453


1


దేహః కిమన్నదాతుః స్వం నిషేక్తుర్మాతురేవ చ మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేః శునోపి వా. ఏవం సాధారణం దేహమవ్యక్త ప్రభవాప్యయమ్ కో విద్వానాత్మసాత్ కృత్వా హన్తి జన్తూనృతే సతః.


2


(భాగవతము 10-10-11,12)


ఈ దేహము ఎవరిది? అన్నము పెట్టి పోషించువానిదా? పుట్టించిన తండ్రిదా? తొమ్మిది నెలలు మోసిన తల్లిదా? తల్లిని కనినట్టి తాతదా? దీనిచేత పనిచేయించు బలవంతునిదా? శ్మశానములో దీనిని కాల్చివేయు అగ్నిదా? రుధ్ర భూమియందు దీనిని కొటికి కొటికి తినివేయు కుక్కలదా? అని భాగవత కారుడు నిలదీసి ప్రశ్నించెను. భాగవతము దశమస్కంధములో నారదుడు నలికూబర, మణిగ్రీవులను దేవపుత్రులకు గావించిన హితోపదేశ సందర్భమున ఈప్రశ్న గావింపబడెను. ఆ ప్రశ్నకు నారదులే ఈ ప్రకారముగ సమాధానము ఒసంగివైచిరి –


'నాయనలారా! ఈ దేహము ఎవరిదీ కాదు. ఇది యొక సామాన్యమైన జడవస్తువు. మృత్తి కానిర్మిమగు ఘటమువంటిది. ప్రకృతి నుండి పుట్టి ప్రకృతిలో లయమైపోవుచున్నది. ఇట్టి అల్పవస్తువును 'నేను' అని తలంచి ఇతరులకు కీడు చేయదలంచువారు ఎంత అవివేకులు?' కావున నశ్వరమై, పాంచభౌతిక మైనట్టి ఈ శరీరము తాను కాదనియు, శాశ్వతమగు చిన్మయ ఆత్మయే తాననియు బాగుగ నిశ్చయించుకొని, సర్వప్రాణులు తన స్వరూపమే యని భావించు కొని, ఎవరికిని అపకారము చేయక జీవితమును గడుపవలయును.


మానవునికి కలుగుచున్న దుఃఖమంతటికిని కారణము ఈ దేహాభిమానమే. దేహముపైనను, దేహమునకు బయట గల పదార్థములపైనను గల మమత్వమే దుఃఖమునకు హేతువు. జీవుడు ఉపాధిని ధరించి లోకమున వ్యవహరించు

నీటిలో ఉప్పు

 శ్లోకం:☝️

*సలిలే సైంధవం యద్వత్‌*

 *సామ్యం భవతి యోగతః |*

*తదాత్మమనసోరైక్యం*

    *సమాధి రభిధీయతే ||*


భావం: నీటిలో ఉప్పు కరిగిపోయి తన రూపాన్ని పోగొట్టుకున్నట్లే, యోగి ధ్యానమందు మనోవృత్తులు నశించి బ్రహ్మాకారమై యుండు స్థితియే సమాధి యనబడును.

🙏 *యోగస్చిత్తవృత్తి నిరోధః* 🙏

భాషా చమత్కారాలు

 భాషా చమత్కారాలు

    *********

నక్షత్రము గల చిన్నది

నక్షత్రము చేతబట్టి నక్షత్రప్రభున్

నక్షత్రమునకు రమ్మని

నక్షత్రము పైనవేసి నాథుని పిలిచెన్


ఇందులో నాలుగు నక్షత్రాలు దాగి ఉన్నాయి. పదే పదే చదివితేనే కానీ అంతసులువుగా అర్థమయేవికావు. 


ఇటువంటి ప్రహేళికలను'ప్రముషితా' ప్రహేళికలని అంటారని కవి దండి తన'కావ్యాదర్శం' లో చెప్పాడు.


ఇప్పుడు వివరణ చూద్దాం!

మహాభారతంలో విరాటపర్వం చదువనివారుండరు. విరాటరాజు కుమార్తె "ఉత్తర" (నక్షత్రం పేరు ) ఆమె అభిమన్యుని భార్య.

నక్షత్రము చేతబట్టి అంటే కుంకుమ పాత్ర "భరణిని" ( నక్షత్రం పేరు ) చేతిలో పట్టుకొని ; నక్షత్రప్రభున్ నక్షత్రాలకు ప్రభువైన చంద్రుని వంశపు ( చంద్రవంశము ) అభిమన్యుని; నక్షత్రమునకు రమ్మని అంటే ఒక "మూల" ( నక్షత్రం పేరు ) కు రమ్మని పిలిచి;

నక్షత్రము పైనవేసి అంటే "హస్త" (నక్షత్రం పేరు ) మును అతని మీదవేసి; నాథుని పిలిచెన్ అంటే పతియైన అభిమన్యుని ప్రేమగా పిలిచిందట.


అమ్మో! ఈ పద్యం అర్థంకాకుంటే మీకు నిజంగానే నక్షత్రాలు కనిపించేవి కదూ! అదీ మరి కవి చమత్కారమంటే!

తెలుగు భాషాభిమానులందరికి...