31, మే 2024, శుక్రవారం

వైశాఖ పురాణం - 23.

 వైశాఖ పురాణం - 23.


23వ అధ్యాయము - దంతిల కోహల శాపవిముక్తి


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు యిట్లు అడిగెను. మహామునీ యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణుకథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా యింటికి వచ్చితివి. నీవు చెప్పిన యీ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి యింకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను.


శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి యిట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము.


పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీనదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు యెండకు బాధితుడై మధ్యాహ్న సమయమున నలసి యొక వృక్షము నీడలో కూర్చుండెను.


అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యునివలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును, పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను.


శంఖుడును అచటినుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు, చెట్లనీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను. వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి యిచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను.


శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున యిట్టి బుద్ధికలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని యాశీర్వదించెను.


కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్నదానిని నీకు తిరిగి యిచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించుననియనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకాశ్చర్యపడెను. లోభముగల యీ కిరాతుడు నీవిట్లు నానుండి దొంగలించిన పాదుకలను తిరిగి యిచ్చి యిట్లు వైశాఖమహిమ నడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను. దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను యెండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను యిట్లు యిచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా! పాపాత్ముడవైనను, కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయకారణములు సుమా. శ్రీహరికిష్టమైనవి, నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి యిష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు. తపస్సులు, యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత యిష్టములు కావు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. వైశాఖధర్మముల నాచరించినచో గయకు, గంగానదికి ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యెచటికిని యేపుణ్యక్షేత్రమునకు పవిత్రనదికి యెచటికిని పోనక్కరలేదు. వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటె పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసినవారికి యీ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను యెన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే యీ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను.


ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగ బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై బడెను. సింహమునకు, గజమునకు భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పుమాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖమహిమను వినుట చేతను గజసింహరూపములను విడిచి దివ్యరూపముల నందిరి. వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.


కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్యరూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి.అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు, కోహలుడునని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న మా యిద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి 'నాయనలారా! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసనకఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను యేర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి యలసటను పోగొట్టుడు. ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరికథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్షమునకు కోపించెను. ధర్మవిముఖుడైన పుత్రుని, వ్యతిరేకమున బలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన, ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకముననుందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను, కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి, ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి.


వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ జూచితివి గదా! వైశాఖమహిమను వినుటవలననే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి యిట్లనెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను.


వైశాఖ పురాణం 23వ అధ్యాయం సమాప్తం.

ఈ పద్యం జ్ఞ్యాపకముందా

 అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల

మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోదియగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి , పాహి ‘” యన గుయ్యాలించి సంరంభియై

 ఈ పద్యం జ్ఞ్యాపకముందా దీని రచయిత యెవరని మీరనుకుంటున్నారు. 

Panchaag

 


ఆత్మగౌరవం

 1983 లో శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీకి కర్టసీ కోసం ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ని కలవడానికి వెళితే అధికారులు తమిళనాడు భవన్ లో బస ఏరాటు చేశారట.

  అదేంటీ మనకు  ఆంధ్రప్రదేశ్ భవన్ లేదా అని రామారావుగారు అడిగేరట.

ఉంది.

అది ఉత్తరప్రదేశ్ ,బీహార్ కాంగ్రెస్ నాయకులు

రౌడీలు ఆక్యుపై చేశారు అని చెప్పారట.

ఐతే వాళ్ళను కాళీ చేయించండీ

 అన్నారట రామారావు గారు.

అది అంత ఈజీ కాదు.

కరుడు కట్టిన నేరస్తులు వాళ్ళు.

అని అధికారులు చెప్పారట.

  అపుడు ప్రధానమంత్రి ఆఫీసు కు ఫోను కలపండీ 

అని రామారావు గారు అన్నారట.

  అధికారులు భయపడ్డారట.

నో..వెంటనే కలపండీ అని హుకుం జారీ చేశారట.

అపుడు రామారావు గారు 48 గంటలు టైము ఇస్తున్నాం

ఆంధ్రప్రదేశ్ భవన్ ను కాళీ చేయించి

 మాకు అప్పజెప్పమని

వార్నింగ్ ఇచ్చారట.

 ప్రధానమంత్రి ఆఫీసు విస్తు పోయింది అట.

ఓ  దక్షిణాది ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీలో ఇలా 

మాట్లాడటం ఇదే మొదటిసారి అని

ఆశ్చర్య పోయారట.

  వెంటనే ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తో

మాట్లాడి మిలటరీ సహాయంతో

ఆంధ్రప్రదేశ్ భవన్ ను కాళీ చేయించి

48 గంటల లో అప్పజెప్పారట.

 తొలిసారిగా ముఖ్యమంత్రి గా 

ప్రధానమంత్రి ని కలవక ముందే

జరిగిన సంఘటన ఇది.

అది NTR అంటే.


అది ఆత్మగౌరవం అంటే.

ఢిల్లీలో

భారత దేశానికి ఆంధ్రప్రదేశ్ లో 

తెలుగు వారు అని ఒకరు ఉన్నారు 

అని తెలియ జేసిన మహాను భావుడు

శ్రీ నందమూరి తారకరామారావు గారు.


అలాంటి మహాను భావులను తలుచుకోవడం

మన అధ్రృష్టం.    KKM

మాయం

 ♦️       *మాయం.*      ♦️👇:

▪️గుమస్తాలు మాయం.

▪️కూలీలు మాయం.

▪️కోడళ్ళ పనితనం మాయం.

▪️అత్తమామల మాటసాయం మాయం.

▪️అల్లుళ్ళ గౌరవహోదా మాయం.

▪️పోస్టుమాన్ మాయం.

▪️ఆసాంతం వినే వైద్యుడు మాయం.

▪️చీర, రవిక మాయం.

▪️పుస్తక పఠనం మాయం.

▪️రేడియోకి శ్రోతలు మాయం.

▪️పెరడు బావి మాయం.

▪️సైకిలు మాయం. 

▪️ఎండావకాయ మాయం.

▪️కుంపటిపై దిబ్బరొట్టి మాయం.

▪️మట్టి వాసన మాయం.

▪️పిడతకింద పప్పు బండి మాయం.

▪️వందరోజులాడే సినిమాలు మాయం.

▪️అర్ధరాత్రయినా నిశ్శబ్దం లేని నిశిరాత్రులు మాయం.

▪️ఉపాధ్యాయుడు మాయం కొంత వరకు.

▪️కుంకుడుకాయ, సీకాకాయ మాయం.

▪️వాకిట పూల మొక్కలు మాయం.

▪️పిచ్చుకలు, సీతాకోకచిలుకలు మాయం. 

▪️సత్తు గిన్నె చారు మాయం.

▪️స్కూల్లో మైదానం మాయం.

▪️సంఘంలో నిదానం మాయం.

▪️వానపాము మాయం.

▪️చెరువుల్లో ఆటలు మాయం.

▪️కోతికొమ్మచ్చి , కబడ్డీ మాయం.

▪️గోడిం బిళ్ల / కర్ర - బిళ్ల మాయం

▪️అవ్వ గోచీ కూడా మాయం.

▪️థూళి లేని గాలి మాయం.

▪️పాళీ ఉన్న పెన్ను మాయం.

▪️ఖాళీ ఉన్న స్నేహితుడు మాయం.

▪️నిలకడగా కురిసే వాన మాయం.

▪️నిర్మానుష్యమైన ఏకాంతం మాయం.

▪️కంటికి నిద్ర మాయం.

▪️వెన్నెల చూడాలనే కన్నులు మాయం.

▪️పట్టుమని పదినిమిషాల ఏకాగ్రత మాయం.

▪️హారన్ కూత లేని వీధి మాయం.

దోమలు లేని పార్కులు మాయం.

▪️తోటమాలి కొలువే మాయం.

▪️దాచుకుందామంటే వడ్డీరేటు మాయం.

▪️'ఒక అల్లం పెసరె' అని కేక వేసే పాక హోటల్ మాయం.

▪️సగం సగం పంచుకునే తేనీరు మాయం.

▪️నిఖార్సయిన చేగోడీ, వడియం, అప్పడం మాయం.

▪️ప్రేమ ప్రకటించే పొందిక ప్రేమ లేఖలు మాయం.

▪️సాయంకాలం మల్లెపువ్వులు పెట్టుకుని కాటన్ చీరతో స్వాగతించే ధర్మపత్ని మాయం.

▪️ఆఫీసు నుండి రాగానే నాన్నా నాకేమి తెచ్చావు అని ఎదురుపడే‌సంతానం మాయం.

▪️ఏమండీ రాత్రికి ఏమి చేయమంటారు అని అడిగే ధర్మపత్ని మాయం.

▪️ఎంతసేపు జొమేటో ప్రత్యక్షం.

▪️ఎవరి చరవాణి లోకి వాళ్ళు మాయం.

▪️ *అంతా సాంకేతిక మయం.*

▪️ *మనదైన సమయం కూడా మాయం.*

▪️ *అంతా అయోమాయం.

*************************

👌చివరగా, ఇవన్నీ చదివి పాత జ్ఞాపకాలు తలుచుకొంటే *మనం కూడా మాయం*.....😀

వివిధ దేశాలకు సంకల్పం

 ✍️📚📿🌹

వివిధ దేశాలకు సంకల్పం 



Sankalpam for US / U


క్రౌంచ ద్వీపే , రమణక వర్షే, ఐన్ద్ర ఖండే. ప్రశాంత సాగరే, పుష్కర క్షేత్రే ,  రాకీ మిక్కిలిని పర్వతయోర్ మధ్యే , మిస్సిసిప్పీ మిస్సోరి ఇత్యాది షోడశ జీవ నదీనాం మధ్యే ఇండియానా రాష్ట్రే , మిన్నిసోటా జీవ నది తీరే ,  బ్లూమింగ్టన్నగరే, వసతి గృహే .....,

( Above is for Bloomington city in Indiana state . pla make required changes to your city) 



Australia 


శాల్మాలి ద్వీపే, ఐల వర్షే, నవ ఖండే, మేరో:  దక్షిణ దిగ్భాగే, అస్త్రాలయ దేశే,  భరతదేశే ఆగ్నేయ దిగ్గబాగే  హిందూ మహా సముద్ర తీరే సిద్ధిపుర్యామ్


UK region.


విన్ధ్యస్య  పశ్చిమ దీక్భాగే, శాల్మలీ ద్వీపే, సముద్రమధ్యస్థిత బృహదారణ్య క్షేత్రే , ఐరోపా వ్యవహార నామ ఖండే, థేమ్స్  నదీ తీరే , లండన్   నగరేౌ


Africa 


ప్లక్ష ద్వీపె , వింధ్యస్య నైరుతి దిక్భాగె , తామ్ర ఖండె , కెన్య దెసె ...... నగరె ....... లక్ష్మి నివాస గ్రుహె 


SINGAPORE 


మేరొ: ఆగ్నేయ దిక్భాగే,

మలయ ద్వీపస్య దక్షిణ భాగెఁ,

పూర్వ సముద్ర తీరే,

సింహపురి మహా ద్వీపే,

సెరంగూన్ నదీ పరివాహక ప్రదేశే,

వసతి గృహే/ 

లక్ష్మీ నివాస గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నీధౌ...And so on.....




Middle East 


జంబూ ద్వీపె భరత వర్షె భరత ఖండే వింధ్యస్య  పస్చిమ  దిక్భాగె , అరబీ మహాసాగర పస్చిమ తటె , కతార్ దెసె , దొహా నగరె .......... గ్రుహె 


South Korea


జంబూ ద్వీపె, అఖండ భరత వర్షె , మేరొ: పూర్వ దిక్భాగే, హరిద్రా సాగర తటె , కొరియా నామ ద్వీపె వసతి గృహే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ


Mumbai 


వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , సహయాద్రి పర్వత ప్రాంతె, అరబీ మహా సాగర తీరె , ముంబాయి నగరె ....   లక్ష్మి నివస / స్వ     గ్రుహె 


Delhi 


మెరొహ్ దక్షిణ పార్స్వె , వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , ఆర్య వర్తైక ప్రదెశె , యమునా తటె , ధిల్లీ నగరె ... గ్రుహె  


VARANASI


వింధ్యస్య పశ్చిమ దిక్భాగె , అశీ వరుణయొర్ మధ్యె , మహాస్మశానె , ఆనందవనె , త్రికంటక విరాజితె , అవిముక్త వారణాశీ క్షెత్రె , ఉత్తరవాహిన్యా భాగీరధీ పశ్చిమ తటె , వసతి గ్రుహె , విశ్వెస్వర విశాలాక్షీ ఇత్యాది త్రయస్త్రిగిం శత్కొటి దెవత , గొ బ్రహ్మణ గురుచరణ సన్నిధౌ ,


Banglore


శ్రీసైలస్య నైరుతి ప్రదెశె , తుంగ భద్ర కావెరి మధ్య ప్రదెసె , శ్రీ శ్రుంగగిరి సమీప ప్రాంతె , ..... గ్రుహె ..... సమస్త దెవతా .....


Chennai


...శ్రీ శైలస్య ఆగ్నేయ ప్రదేసే కృష్ణ కావేరి మధ్య ప్రదేశ...


Vishakhapatnam 


శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్య ప్రదేశే.....   

  

*ఓం నమః శివాయ*🌺🙏🌺

వైశాఖ పురాణం - 23.

 వైశాఖ పురాణం - 23.


23వ అధ్యాయము - దంతిల కోహల శాపవిముక్తి


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు యిట్లు అడిగెను. మహామునీ యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణుకథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా యింటికి వచ్చితివి. నీవు చెప్పిన యీ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి యింకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను.


శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి యిట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము.


పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీనదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు యెండకు బాధితుడై మధ్యాహ్న సమయమున నలసి యొక వృక్షము నీడలో కూర్చుండెను.


అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యునివలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును, పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను.


శంఖుడును అచటినుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు, చెట్లనీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను. వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి యిచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను.


శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున యిట్టి బుద్ధికలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని యాశీర్వదించెను.


కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్నదానిని నీకు తిరిగి యిచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించుననియనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకాశ్చర్యపడెను. లోభముగల యీ కిరాతుడు నీవిట్లు నానుండి దొంగలించిన పాదుకలను తిరిగి యిచ్చి యిట్లు వైశాఖమహిమ నడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను. దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను యెండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను యిట్లు యిచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా! పాపాత్ముడవైనను, కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయకారణములు సుమా. శ్రీహరికిష్టమైనవి, నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి యిష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు. తపస్సులు, యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత యిష్టములు కావు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. వైశాఖధర్మముల నాచరించినచో గయకు, గంగానదికి ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యెచటికిని యేపుణ్యక్షేత్రమునకు పవిత్రనదికి యెచటికిని పోనక్కరలేదు. వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటె పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసినవారికి యీ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను యెన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే యీ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను.


ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగ బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై బడెను. సింహమునకు, గజమునకు భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పుమాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖమహిమను వినుట చేతను గజసింహరూపములను విడిచి దివ్యరూపముల నందిరి. వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.


కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్యరూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి.అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు, కోహలుడునని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న మా యిద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి 'నాయనలారా! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసనకఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను యేర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి యలసటను పోగొట్టుడు. ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరికథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్షమునకు కోపించెను. ధర్మవిముఖుడైన పుత్రుని, వ్యతిరేకమున బలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన, ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకముననుందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను, కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి, ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి.


వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ జూచితివి గదా! వైశాఖమహిమను వినుటవలననే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి యిట్లనెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను.


వైశాఖ పురాణం 23వ అధ్యాయం సమాప్తం.

శ్వేతార్కలో హనుమత్ జయంతి

 *శ్వేతార్కలో హనుమత్ జయంతి వేడుకలు* 


*జాతక దోషాలు తొలిగించే యోగాంజనేయస్వామివారు*


జూన్ 1 శనివారము రోజున 29 దేవతామూర్తులతో కొలువుదీరి ఉన్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువై ఉన్న శ్రీయోగాంజనేయస్వామి సన్నిధిలో హనుమత్ జయంతి వేడుకలు...


హనుమజ్జయంతి పూజలను పురస్కరించుకొని ఉదయం 7గం శ్రీయోగాంజనేయస్వామివారికి  పంచామృతములతో, సింధూర లేపనంతో మరియు పానకంతో శ్రీస్వామివారికి విశేష అభిషేకం చేయడం జరుగుతుంది. 


 ఉదయం 9 గంటలకు వడమాల పూజ తమలపాకుల అలంకరణ, కదలీఫల పూజ,  మన్యుసూక్త కల్ప పారాయణ సహిత అష్టోత్తర సహస్రనామార్చన పూజలు జరుగును. 


ఉదయం 11గం. గణపతి, నవగ్రహ, ఏకాదశ మన్యుసూక్త హోమము జరుగును. 

ఈ హోమం చేయడం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు విద్యావృద్ది, వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి, బుద్ధిర్బలం యశో ధైర్యం, కార్యసాధన, శృంఖల బంధ విమోచనం, కార్య రక్షణ, మన సంకల్పాలు, నవగ్రహ దోషాలు పోయి అన్ని కార్యలలో యోగాన్ని పొందగలరు. 

సాయంత్రం 7.30 నిమిషాలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణము, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణములు జరుగును..


కావున భక్తులు తప్పనిసరిగా ఈ హనుమజ్జయంతి రోజున ఏదో ఒక వేళ తప్పనిసరిగా యోగాంజనేయస్వామి యొక్క దర్శనం చేసుకొని మీయొక్క జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి పొంది హనుమంతుని యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ పరమేశ్వరుడు శ్రీరామచంద్రులవారి యొక్క అనుగ్రహానికి ప్రీతి పాత్రులు కాగలరు. మరిన్ని వివరాలకై 8686146308,9347080055 నెంబర్నకు ఫోన్ చేయగలరు.


 శ్రీస్వామివారి సన్నిధిలో జరుగు హనుమజ్జయంతి పూజలకై భక్తులు కేవలం 551 రూపాయలు చెల్లించి అన్ని పూజలలో గోత్రనామాలు చదివించుకోనవచ్చును. ఇట్టి విషయాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా అన్ని గ్రూపులకు పేజీలకు share చేయగలరు.


వివరాలకు సంప్రదించండి  

పూల్యాల అరుణ్ రెడ్డి

యోగాంజనేయ స్వామి ఆలయ ఇంఛార్జి (+9173965 50169)...

బ్రాహ్మణ క్యాటరింగ్

 విజయవాడ వారి బ్రాహ్మణ క్యాటరింగ్ 

మధువని క్యాటరింగ్& ఈవెంట్స్ విజయవాడ9182554800,

7396881404


మీ ఇంట జరిగే అన్ని రకాల శుభకార్యాలకి, గృహప్రవేశాలకి,పెళ్ళిళ్లకి, నోములకి, కిట్టీ పార్టీలకి,10 మంది నుంచి 500 మంది వరకు బ్రాహ్మణ భోజనం మీరు కోరిన విధంగా కేటరింగ్ పద్ధతిలో చేసి ఇస్తాం.                                                                                                     


మేము మీ ఇంట జరిగే శుభకార్యాలకి ఈవెంట్స్ కూడా చేస్తాము. మండపం డెకరేషన్, సన్నాయి మేళం, డిజె సౌండ్, యాంకర్, పురోహితులు, క్యాటరింగ్, రాయల్ ఎంట్రీ, మహేంది టాటూ స్టాల్స్, యాంకర్, అందుబాటు ధరలలో ఏర్పాటు చేయబడును


విజయవాడ మీదుగా (కారు, బస్సు) లేదా ఏ ఇతర వాహనాలపై ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉన్నవారు ఒకరోజు ముందుగా తెలియజేస్తే చక్కటి ఇంటి తరహా బ్రాహ్మణ భోజనం అందజేస్తాము 

                                        నలుగురికి ఉపయోగపడే పోస్ట్ దయచేసి మీ బంధువులకి,మిత్రులకి షేర్ చేయండి🙏🙏



NB. Private advertisement. Blogger is not responsible for the content

లలితా దేవి


 *చాలా మంది అడిగే ఒక ప్రశ్న.....*


*ప్ర: లలితా దేవిని ఒక చిత్రంలో ఒక సింహాసనం మీద శివునిపై కూర్చున్నట్లుగా ఆ ఆసనానికి నాలుగు కోళ్ళలో బ్రహ్మ, విష్ణువు, ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నట్లుగా ఉంది. ఇందులో అంతరార్థం ఏమిటి...*


*జ: లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ పటానికి అంతరార్ధం కనబడుతుంది.*


*'పంచ బ్రహ్మాసనాసీనా',*

*'పంచప్రేతమంచాధీశాయినీ', 'పంచకృత్యపరాయణా'...*


*అనే నామాలలో పై చిత్రం ఉంది.*


*1. సృష్టి,*

*2. స్థితి,*

*3. సంహార,*

*4. తిరోధాన,*

*5. అనుగ్రహం... అనేవి* *పంచకృత్యాలు.*


*ఇవి ఒకే పరబ్రహ్మ తత్త్వ శక్తి వలన సాగించే పంచకృత్యాలు. వాటి నిర్వహణకై ఆయన ధరించిన ఐదు బ్రహ్మల రూపాలు...*


*1. బ్రహ్మ ,*

*2. విష్ణు,*

*3. రుద్ర ,*

*4. మహేశ్వర,*

*5. సదాశివ.*


*వారిని అధిష్ఠించి ఉన్న శక్తి ఒక్కటే. ఆమె పరాశక్తి లలితాంబిక. "శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభావితుం" - శక్తి లేనప్పుడు శివుడూ అశక్తుడే. అని ఆచార్యుల మాట. ఇరువురూ అవిభాజ్యులు. ఈ పంచ కృత్యాలుగా పరబ్రహ్మశక్తి వ్యక్తమవుతుంది. అయిదు బ్రహ్మలుగానున్న పరబ్రహ్మ యొక్క అధిష్ఠాతృ శక్తి అని తెలియజేసే దేవీ నామాలకు ఇచ్చిన చిత్ర రూపమే మీరు చూసే పైన ఉన్న చిత్రం...*

హనుమంతుని తోకకథ*

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


*హనుమంతుని తోకకథ*


*జూన్ 1 శనివారం హనుమజ్జయంతి సందర్భంగా...*


శివపరమాత్మకు ఎప్పటినుండో శ్రీహరి పాదసేవ చెయ్యాలని కోరిక. కానీ హరి ఒప్పుకోడు. అందుకని గొప్ప ఉపాయం పన్నాడు శివుడు. ఒక రాక్షసుణ్ణి పుట్టించాడు. వాడు అచ్చు గాడిదలా అరుస్తాడు కనుక, 'గార్ధభ నిస్వనుడని పేరు. వాడు శివునికోసం తపం చేశాడు. స్వామి వరం కోరుకో అన్నాడు. వాడు, "నేను అరిస్తే ఎవరి చెవిలో పడి వింటారో వారు వెంటనే చని పోవాల"ని కోరాడు. అంత తపస్సు చేసి వాడు సంపాదించిన వరం అది. శివుడు చిరునవ్వుతో అలాగే అన్నాడు.


ఆ వరంతో వాడు పదిమంది కలిసిన చోటుకి వెళ్లి అరవడం మొదలు పెట్టాడు. అలా జనాలను వాడు ఖాళీ చేసేస్తున్నాడు. అందరూ బ్రహ్మతో కలిసి, హరి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అతడు, 'మనం ఏమి చేయకూడదు. వాడు శివభక్తుడు కదా! శివుడే పరిష్కరించాల'ని చెప్పాడు. అప్పుడు అందరూ కలిసి శివుని వద్దకు వెళ్లారు. శివుడు చిరునవ్వుతో ఎదురు వెళ్లి హరిని ఆలింగనం చేసుకొన్నాడు. అపుడు హరి అన్నాడు.


"మిత్రమా! నీ భక్తుడు గార్ధభ నిస్వనుడు అందరినీ చంపేస్తున్నాడు. నువ్వే వాణ్ణి శిక్షించాలి". అన్నాడు. దానికి శివుడు, "నా భక్తుడు అంటున్నారు కదా! నేనెలా చంపుతాను?" అన్నాడు. ఎంతగా ఎందరు చెప్పినా శివుడు వినలేదు. దానితో హరి కోపించి, "అలాగైతే. నేనే చంపవలసి వస్తుంది" అన్నాడు. హరుడు కోపంతో "అయితే ఇంకేం? వెళ్లి ఆ పని చూసుకోండి" అన్నాడు. దానికి హరి. “నీపట్ల గౌరవం కొద్దీ వచ్చాం. నేను చంపలేక కాదు" అన్నాడు. దానికి హరుడు మరింత కృతక కోపంతో, "నువ్వే కనుక నా భక్తుణ్ణి చంప గలిగితే నీకాళ్లు కడిగి నెత్తిపై జల్లుకొని నీకు దాస్యం చేస్తాను. నువ్వు చెయ్యలేక పోతే నా కాళ్ళు పట్టుకొంటావా?" అన్నాడు రెచ్చకొడుతూ. హరి 'సరే' అన్నాడు. హరి చంపగలడని శివునికి తెలుసు. హరి ఇన్నాళ్లకు శివ మాయలో పడ్డాడు. వెంటనే శివుడు, "ఇదిగో దేవతలారా। ఓ బ్రహ్మా! మీరంతా సాక్ష్యం సుమా!" అని ఆ ఒప్పందాన్ని బలపరిచాడు. అందరూ వెళ్లి పోయారు. ఏమైనా ఆరాక్షసుడు చావడం ఖాయమని అంతా సంతోషించారు. శ్రీహరి ఒక మంచి సమయం చూసుకొని తాను తోడేలుగా అవతరించి, ఆ రాక్షసుని వెనుకే వెళ్లి వాడి కంఠం కొరికేశాడు. ఎప్పుడైతే స్వరపేటిక పోయిందో... వాడు అరవలేక చనిపోయాడు. మరుక్షణం శివుడు కమండులువుతో సంతోషంగా హరిని చేరాడు. శివుని సంతోషం చూసేసరికి అర్థమైంది హరికి... అది శివమాయ అని. కాళ్లు కడగపోతే హరి దూరంగా జరిగాడు. వెంటనే శివుడు బ్రహ్మాదులని పిలిచి ఒప్పందం అమలు చేయించండి అన్నాడు. ఇక తప్పలేదు. హరికి. శివుడు సంతోషంగా హరి పాదాలు కడిగి నెత్తిపై చల్లుకొన్నాడు. నేటినుండి నీకు దాసుణ్ణి అన్నాడు. వెంటనే హరి, "ఇప్పుడు కాదు. శివా వచ్చే నా రామావతారంలో దాస్యం చేద్దువు" అని ఆ ఒక్క అవతారానికి మాత్రమే | పరిమితం చేశాడు. వెంటనే పార్వతి, "హరీ! నేను వారి అర్ధదేహాన్ని. కనుక నేనూ నీ దాసురాలిని అవుతాను" అంది. అపుడు హరి, "సోదరీ కాత్యాయనీ! నువ్వు పందెం వేయలేదు. శివుడు నిన్ను పందెంలో ఒడ్డలేదు. కనుక నువ్వు చెయ్యడానికి వీలు లేద"న్నాడు హరి. దానికి పార్వతి, "సోదరా! నేను ఆయన్ని వీడి ఉండను కదా!" అన్నది. అపుడు హరి, "సరే! నువ్వు శివస్వామికి తోకగా ఉండి భర్త దేహాన్ని వీడకు" అన్నాడు. కనుక పార్వతి కోసం శివుడు వాలం కల వానరంగా అవతరించాడు. హనుమ సర్వ శక్తులూ తోకలోనే ఉంటాయి. అది మహాశక్తి... పార్వతి


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

అవధూత సన్యాసి

 🙏⭐⭐⭐🙏

అవధూత అంటే ఎవరు ? సన్యాసి అంటే ఎవరు ?

.🙏🙏🙏🙏🙏

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు.


అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటు గా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు.


అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు సన్యాసం గురించి తెలుసుకుందాము.


*సన్యాసం నాలుగు రకాలు.*


*1. వైరాగ్య సన్యాసం :*

*వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది. ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు. అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది.*


*2. జ్ఞాన సన్యాసం :*

*సత్ సాంగత్యం ద్వారా, లౌకిక వాంచలు తగ్గిపోయి సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ, ఏది తనకు అంటకుండా వసిస్తూ ఉంటాడు .*


*౩. జ్ఞాన వైరాగ్య సన్యాసం :*

*సాధన ద్వారా , ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని నిత్య ఆనంద స్థితిలో జీవిస్తాడు.*


*4. కర్మ సన్యాసం :*

*బ్రహ్మచర్యము, గృహస్త, వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ, ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం.*


*ఈ సన్యాసులు ఆరు రకాలు :*


*1. కుటిచకుడు :*

*శిఖ, యఙ్ఞోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.*


*2. బహుదకుడు :*

*ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాధన చేస్తూ ఉంటారు.*


*౩. హంస :*

*ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.*


*4. పరమహంస :*

*వెదురు దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని, కౌపీనం మాత్రం ధరించి నిరంతర సాధనలో ఉంటారు.*


*5. తురియాతీతుడు :*

*దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .*


6. అవధూత :

*ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు. జగత్ మిధ్య నేను సత్యం అంటూ, నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు. నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు. గర్వము, మాత్సర్యము, డంభము, దర్పము, ద్వేషము, అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ, దొరకని రోజు ఏకాదశి, దొరికిన రోజు ద్వాదశి అంటూ రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు.


కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు.

సద్గురు రూపాలైన అవధూత లందరికీ సాష్టాంగ దండ ప్రణామములు

🙏🙏🙏🙏🙏

వివాదపడరాదు

 సుభాషిత రత్నం


శ్లో॥

ఋత్వి క్పురోహితాచార్యై ర్మాతు లాతిథి సంస్థితైః

బాల వృద్ధాతురై ర్వైద్యైః జ్ఞాతిసంబంధి బాంధవైః

మాతాపితృభ్యాం జామాతుర్భ్రాత్రా పుత్రేణ భార్యయా

దుహితా దాసవర్గేణ వివాదం న సమాచరేత్॥


తా!!ఎవరితోనూ వివాదపడరాదు. కానీ ముఖ్యముగా వివాదకారణ మున్నను ఈ క్రిందివారితో వివాదము పెట్టకొనరాదు.ఋత్విక్కు, పురోహితుడు,ఆచార్యుడు, మేనమామ,ఇంటికి వచ్చిన అతిథి,బాలుడు,వృద్ధుడు, రోగి,వైద్యుడు,జ్ఞాతి, వియ్యంకుడు,బంధువు, తల్లిదండ్రులు,అక్కచెల్లెళ్ళు , అన్నదమ్ములు,పుత్రుడు, కుమార్తె,భార్య,సేవకుడు.

గురుభక్తి

 *జీవితంలో గురుభక్తి అత్యావశ్యకం* 


భగవత్పాదులే స్వయంగా చెప్పారు, ‘‘జీవితంలో ఎంత ముందుకు వచ్చినా, గురుభక్తి అనేది లేకపోతే జీవితం వ్యర్థమే.  కాబట్టి మనం ఎంత గొప్పవారమైనా, ఎంత విద్యావంతులమైనా, ఎంత ధనవంతులమైనా గురుభక్తి తప్పనిసరి. 

 “ *సంప్రదాయ పరిపాలన బుధ్య”* 

 శంకరులు తమ గురువైన గోవిందభగవత్పాదులను ఆత్యంత శ్రద్ధతో సేవించారని చెప్పినప్పుడు, గురుభక్తి మనకు కూడా అత్యంత అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఆ గురుభక్తియే మనకు అన్ని రకాల గంభీరతలను కలిగిస్తుంది.  

పరమేష్ఠి గురునాధులు శ్రీ నృసింహ భారతి మహాస్వామివారు ఒక చోట ఇలా అన్నారు, “గురువు అనుగ్రహం లేకపోతే, ప్రపంచంలో ఎవరు కోరికలు పొందగలరు?  కావున సకల సౌభాగ్యాలకు, మూలకారణుడైన గురుపాదుని ఆరాధించు.”  అని. మహానుభావులందరూ మనకు బోధిస్తారు, తద్వారా మనం మనకు ఎదురయ్యే తీవ్రతలనుంచి తప్పించుకుని మంచి గమ్యాన్ని చేరుకోవచ్చు.  వారి బోధనల ప్రకారం మనం మన జీవితాన్ని నడిపిస్తే, అది మనకు ప్రయోజనం చేకూరుస్తుంది.  వాటిని పాటించకపోతే మనకే నష్టం!  గురువులకు ఏమీ నష్టం లేదు కదా !


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

విరాళాలు ఇవ్వగలరు

  విరాళాలు ఇవ్వగలరు 

రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.  మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము. 

 

ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని  మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే,, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 

+91 9848647145

పచ్చళ్లు

 🙏

శ్రీ శ్రీ శ్రీ


నా పేరు రమా దేవీ 

9392027215

విజయవాడ లో  ఇంటివద్ద తయారు చేస్తాము. ఇక్కడినుండి all over India మరియు Abroad countries కూడా పంపుతాము

Contact రమ దేవి 


🙏పచ్చళ్లు 🙏


క్రింది వన్నీ కిలో రేట్లు అండి 


😋😋

1.ఆవకాయ వెల్లుల్లి లేకుండా  Rs.500

2.ఆవకాయ వెల్లుల్లి తో Rs.550

3.ఆవకాయ నువ్వులతోRs.600

4.చింతకాయ Rs.400

5.పండుమిరప Rs.400

6.ఉసిరికాయ Rs.400

7.నిమ్మకాయ Rs.400

8.కాకరకాయ Rs.400

9.స్పెషల్ కాకరకాయ కూర Rs.700

10.అల్లం పచ్చడి Rs.400

11.టమాటో Rs.500

12.గోంగూర పచ్చడి Rs.400

13.కొత్తిమీర పచ్చడి Rs.500

14.మునక్కాయ పచ్చడి Rs.450

15.మాగాయ Rs.500

16.మామిడి అల్లం Rs.500

17.పనసపొట్టు పచ్చడి Rs.500

18.పుదీన పచ్చడి Rs.400

19.కరివేపాకు పచ్చడి Rs.400

20.Fresh ఆవకాయ Rs.700

21.నూపప్పు ఆవకాయ Rs.500

22.దబ్బకాయ             Rs.600

23.తీపి అల్లం పచ్చడి  Rs.600


🙏పొడులు 


1.  మునగాకు పొడి Rs.500

2.  కరివేపాకు పొడి  Rs.500

3.  పప్పుల పొడి Rs.400

4.  రసం పొడి  Rs.600

5.  పొడి చట్నీ Rs.600

6.  దోసె పొడి (మల్హపొడి) Rs600

7.  మెంతి పొడి (మెంతిట్టు)Rs.450

8.  సాంబార్ పొడి Rs.500

9.  పల్లీల పొడి Rs.600

10. నువ్వులపొడి Rs.500

11. కంది పొడి  Rs.600

12. అవిశె పొడి Rs.500

13. పేలపిండి Rs.400

14. పులిహోగిరె పౌడర్ Rs.500

15. పులిహోగిరె పేస్ట్ Rs.500

16. ఒబేసిటీ పౌడర్ Rs.800

17.వెల్లుల్లి పొడి      Rs.400

18.కాకరకాయ పొడి Rs.500

19.పుదీన పొడి    Rs.500

20.కొత్తిమీర పొడి Rs.500

21.ఉలవపొడి      Rs.400

22.గోంగూర పొడి  Rs.500

23.ఉసిరి కారంపొడిRs.500

24.కూరకారం Rs. 500

25.బిసిబేళ్ బాత్ పొడి Rs.500

26.గుత్తి వంకాయ పొడి  Rs.500

27. చియా గింజల పొడి Rs. 500

28.చట్నీ పొడి               Rs. 450

29.నల్లకారం                 Rs.500

30.కొండపిండిఆకు పొడిRs.500

31.పొన్నగంటి ఆకు పొడిRs.500

32.బిర్యానీ రైస్              Rs.300


                   🙏స్వీట్స్ 🙏

              సున్నుండలు Rs.600

.              రవ్వ లడ్డు Rs. 600

            బెల్లం గవ్వలు Rs.600

                  అరిసెలు  Rs.600

               కర్జికాయలు Rs.600

               అవిశ లడ్డు Rs.800(Omega3 fatty acid)

              🙏 స్నాక్స్ 🙏

      మురుకులు     Rs.  600

      పప్పుచెక్కలు  Rs.600

      చేగోడీ             Rs.600

               🙏వడియాలు 🙏

  గుమ్మడి వడియాలు    Rs.600    మినప్పప్పువడియాలు  Rs.600

 జీలకర్ర  అప్పడాలు       Rs.600

 పాలకూర అప్పడాలు    Rs.600 పండుమిర్చిఅప్పడాలు   Rs600

సగ్గుబియ్యం అప్పడాలు Rs.600

చల్ల మిరపకాయలు       Rs.600

మినప అప్పడాలు         Rs.600

గమనిక....కొరియర్ చార్జీలు అదనం

🙏🤝😁👏

దయచేసి మీకు తెలిసిన

బ్రాహ్మణ గ్రూపులలో

ఈ మెసేజ్ ని పంపవలసినదిగా

కోరుకుంటునను

🙏🙏🙏


NB. Private advertisement. Blogger is not responsible for the content


బ్రాహ్మిణ్‌లపై వాస్తవ తనిఖీ*

 *బ్రాహ్మిణ్‌లపై వాస్తవ తనిఖీ*


కాలక్రమేణా కల్పన ఎలా నిజం అవుతుందో చూడటం ఆశ్చర్యంగా ఉంది!


 వాస్తవాలు మరియు వాస్తవ చరిత్ర ఆధారంగా సత్యాన్ని పరిశీలిద్దాం.


 *1.* ముందుగా... హిందూ మతంలో ఒక్క బ్రాహ్మణ దేవుడు లేడు!


 *2.* దేవుళ్లందరూ వెనుకబడిన కులాలు, దళితులు మరియు గిరిజనుల నుండి వచ్చారు.


 *3*.  బ్రాహ్మణులు హిందూ మతంలో దేవుళ్ల భావనను సృష్టించలేదు.


 *4.* భారతదేశాన్ని పాలించిన బ్రాహ్మణ రాజు ఒక్కడు కూడా లేడు.


 *5.* ఇతరులను అణచివేయడానికి అధికార స్థానాలు అవసరం.  బ్రాహ్మణులు ఉపాధ్యాయులు, పండితులు, పూజారులు, సలహాదారులు కానీ పాలకులు కాదు.


 *6*.  బ్రాహ్మణుల సాంప్రదాయక వృత్తి ఆలయ పూజారి (పురోహిత్), మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం.  వారి ఏకైక ఆదాయం భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చిన _బిక్ష_ (భిక్ష).


 *7.* బ్రాహ్మణుల మరొక విభాగం ఉపాధ్యాయులు, అది కూడా జీతం లేకుండా.


 *8*.  వేద సాహిత్యం ఎక్కువగా బ్రాహ్మణేతరులచే వ్రాయబడింది.  బ్రాహ్మణులకు ఉన్నత హోదా ఇచ్చే ధర్మ శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనది, బ్రాహ్మణేతరుడైన మను వ్రాసిన మనుస్మృతి.  బ్రాహ్మణుడు అంటే అదొక వృత్తి (వర్ణ) - కులం కాదు.


 *9.* సంస్కృతం చదవడం మరియు రాయడం బ్రాహ్మణులకే పరిమితమైతే, మీరు గిరిజన వాల్మీకి రామాయణాన్ని ఎలా కంపోజ్ చేస్తారు?  నాలుగు వేదాలను వర్గీకరించి మహాభారతం రచించిన వేదవ్యాసుడు ఒక మత్స్యకారునికి జన్మించాడు.


 *10*.  సంస్కృతాన్ని బ్రాహ్మణేతర రచయితలు ఎక్కువగా ఉపయోగించారు - బ్రాహ్మణులు రచించిన సంస్కృతంలో చాలా తక్కువ గ్రంథాలు ఉన్నాయి.


 *11*.  వేదవ్యాసులు, వశిష్ట, వాల్మీకి, కృష్ణ, రాముడు, అగస్త్య, విశ్వామిత్ర, శృంగ, గౌతమ, బుద్ధ, మహావీర, తులసీదాస్, తిరువళ్లువర్, కబీర్, వివేకానంద, గాంధీ, నారాయణ గురు మొదలైన వారి బోధనలను అత్యంత విలువైనవిగా భావిస్తాం.


 *12*.  వారెవరూ బ్రాహ్మణులు కాకపోతే, "బ్రాహ్మణులు మిమ్మల్ని నేర్చుకోవడానికి అనుమతించలేదు" అని ఎందుకు గట్టిగా అరుస్తారు?  బ్రాహ్మణేతర భక్తి సాధువులచే భక్తిపై అనేక రచనలు ఉన్నాయి.


 *13.* బ్రాహ్మణులు ఇతరులను నేర్చుకోకుండా ఎప్పుడూ నిరోధించలేదు.


 *14*.  చరిత్రలో ఏ సమయంలోనూ బ్రాహ్మణులు ధనవంతులు లేదా శక్తివంతులు కాదు.  ఏదైనా పాత భారతీయ కథల పుస్తకాన్ని తీయండి, మీరు గరీబ్_ బ్రాహ్మణుడు (పేద బ్రాహ్మణుడు) ధర్మంగా పేర్కొనడాన్ని చూస్తారు.  (సుదామ-కృష్ణ కథ గుర్తుందా?)


 *15.* వారి వృత్తి సమాజంలో అత్యున్నత స్థాయిగా పరిగణించబడుతున్నప్పటికీ, బ్రాహ్మణ సన్యాసుల మనుగడకు ఏకైక మార్గం ప్రజలు ఇచ్చే భిక్ష.


 *16.* బ్రాహ్మణుల అతిపెద్ద సహకారం భూమిలో ఇప్పటివరకు మాట్లాడే అత్యుత్తమ భాష - సంస్కృతాన్ని నిలబెట్టుకోవడం.  మీరు ఇంగ్లీష్ లేదా అరబిక్ నేర్చుకుంటే, మీకు వాణిజ్య ప్రయోజనాలు ఉంటాయి.


 *17*.  సంస్కృతాన్ని ఎవరూ ప్రోత్సహించలేదు.

 ఎలాంటి ప్రయోజనాలు లేకుండా, బ్రాహ్మణులు సంస్కృతం నేర్చుకునే స్వచ్ఛంద పనిని చేపట్టారు.  ఇప్పుడు మీరు వాటిని సంస్కృతంలో గుత్తాధిపత్యంగా ఆరోపిస్తున్నారు!


 అంతే కాకుండా, బ్రాహ్మణులు రాజులు కాదు.  వారు అధికారాలను ఆస్వాదించలేదు లేదా సంపదను కలిగి లేరు.  వారు జ్ఞానాన్ని సంపాదించడానికి మరియు కష్టతరమైన జీవితాన్ని గడపడానికి చాలా కష్టపడ్డారు.  కాబట్టి బ్రాహ్మణుల దోపిడీ ప్రశ్న లేదు.


బ్రాహ్మణుల జనాభా తమిళనాడులో కేవలం 2% నుండి ఉత్తరాఖండ్‌లో 12% వరకు ఉన్నప్పుడు, వారు మెజారిటీలో ఎలా ఆధిపత్యం చెలాయించగలరు?


 ఇవన్నీ చదివిన తరువాత ఎవరైనా *బ్రాహ్మణులను* నిందించగలరా?


 *

ధర్మనందన బాలుడు

 యోగ్యమైన తిథి, వార నక్షత్ర లగ్నములతో కూడిన శుభ సమయంలో పరీక్షిత్తు దివ్య తేజంతో జన్మించాడు. ఆ సమయంలో గ్రహాలన్నీ ఉత్తమ స్థానాల్లో ఉన్నాయి. పరిక్షిత్తు జననము వృత్తాంతం విని ధర్మరాజు ఆనందంతో ధౌమ్య, కృపాచార్యాదులను పిలిపించి మంగళవాచనములు జాతకర్మ చేయించాడు.


 ప్రజాతీర్థ నామకమైన ఆ సమయంలో ధర్మరాజు గో భూ సువర్ణాలు ఏనుగులు గుర్రాలు మొదలైనవి ఉత్తములకు దానం చేసి అన్నదానం కూడా చేశారు.


సంతులిస్టులైన బ్రాహ్మణులు కృష్ణానుగ్రహం వల్ల పాండవ వంశం నిలిచిందని ఆనందం వెల్లడిస్తూ ఆనందించారు. వారిని చూచి విద్వాన్సులారా ఈ పాలకుడు దీర్ఘాయుర్దాయం కలవాడై పవిత్రమైన కీర్తిని ప్రతిష్టించి రాజఋషులను అనుసరిస్తాడా అని అడిగిన ధర్మరాజుకి ఆ బ్రాహ్మణులు ఇలా చెప్తున్నారు. 


ధర్మనందన ఈ బాలుడు ఇక్ష్వాకులతో సమంగా ప్రజలను పాలిస్తాడు. రామచంద్రునితో సమానంగా బ్రాహ్మణ భక్తి సత్య ప్రతిజ్ఞ కలవాడు అవుతాడు. శిబితో సమానమైన దాత భరతునితో సమానమైన యజ్వ, కార్తవీర్యార్జునితో సరియగు ధనుర్ధారి, అగ్ని వలె దుర్దర్షుడు, సముద్ర వలే దుస్తరుడు, సింహ పరాక్రముడు, హిమాచలం వలే ఆశ్రయుడు,  భూమితో సమానమైన తితిక్ష,  తల్లిదండ్రులతో సమానమైన సహనం, బ్రహ్మయందు ఉండే సమత్వం, శంకరుని యందు ఉండే కృప, రంతిదేవుని యందు ఉండే ఔదార్యం,  యయాతి యందున్న ధార్మికత్వం, ప్రహ్లాదుని వంటి దృఢనిష్ఠ కలిగి బలితో సమానమైన ధైర్యం గలవాడు కూడా కాగలడు. అనేక అశ్వమేధ యాగాలు చేసి వృద్ధులను సేవించి రాజర్షితుల్యుడైన కుమారుని కని దుష్టులను శిక్షిస్తూ కలియుగంలో కృతయుగ ధర్మాలను ప్రతిష్టిస్తాడు.

సభాయై నమః*

 *సభాయై నమః*


మీరందరూ పెక్కు చోట్ల పై సంబోధనలను వినే ఉంటారు. అంటే సభను గౌరవించడం అన్నమాట, అక్కడ సమీకరింపబడిన సమాజంలో గొప్ప హోదా కలిగిన వ్యక్తులకు సభాముఖంగా నమస్సులు అందించడం అన్నట్టు. ఈ లెక్కన అక్కడ - అంటే ఓ బహిరంగ సభ కావొచ్చు లేదా మనలాంటి వాట్సప్పు సమూహాలు కావొచ్చు - ప్రోగయిన వ్యక్తులందరూ గౌరవింపదగిన వారే. దీనిలో ఎంతమాత్రం సందేహం లేదు. వారు వ్యక్తిగతంగా ఎలాగైనా మసలుకొని ఉందురు గాక, కాని సభా ముఖంగా అందరూ గౌరవింపదగిన వారే. సభనుద్దేశించి అందరినీ గౌరవించవలసినదే. అందుకే పెద్ద పెద్ద వేద పండితుల దగ్గర నుండి ఎంతటి పండితులైనా *సభాయైనమః* అంటూ సభకు సమస్కరిస్తారు. 


సభ అంటే అది సరస్వతీ స్వరూపమని లోకవిదితము. సభలో విద్వాంసులు ఉంటారు. పామరులూ ఉంటారు. పెద్దలు, పిన్నలూ అందరూ ఉంటారు. ఎవరి గొప్పలు, ఎవరి హోదాలు, ఎవరి విద్యానైపుణ్యాలు, ఎవరి వృత్తి సాంకేతిక పరిజ్ఞానాలు వారివే. ఎవ్వరూ ఎవరికీ పోల్చదగినవారు కారు, కించపరచడం అంతకన్నా కాదు. 


ఏమో, కొందరికి అందులో కొందరు నమస్కారార్హులు కాకపోవచ్చునని అనిపించవచ్చు. కాని అది నిండు సభ.  ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదు. అది సంస్కారవంతుల లక్షణం కాదు. ఏమైనా లోటుపాట్లు ఉన్న యెడల ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి కాని సభాముఖంగా కాదు. ఈ అలవాటు ఓ గొప్ప సంస్కృతి. గొప్ప సంప్రదాయం. 


ఒకవేళ ఎవరైనా ఇతరులను కించపరచినట్లయితే వారి వంశావళిలో లోపమున్నట్టే. యథా రాజా తథా ప్రజా అనే నానుడి ప్రకారం వారి తల్లిదండ్రులు తాతముత్తాతలు ఇలాంటి సభా గౌరవాలను సన్నిహిత స్నేహ బంధుత్వాలతో అలాగే మెలిగారు కాబోలు. అలాంటి సంస్కారమే వారి సంతతులకు కూడా అబ్బడం అతిశయోక్తి కాదు. జన్యుపరమైన బాంధవ్యాలలో ఇలాంటి ఒకేలాంటి ప్రవృత్తులు కలిగియుండడం సమంజసమే. 


ఏది ఏమైనా సభను గౌరవించడం నేర్చుకోవాలి. అలా వీలుకాని పక్షంలో ఆ సభ నుండి నిష్క్రమించడం ఉత్తమం.

గురుభక్తి

 *జీవితంలో గురుభక్తి  అత్యావశ్యకం* 


భగవత్పాదులే స్వయంగా చెప్పారు, ‘‘జీవితంలో ఎంత ముందుకు వచ్చినా, గురుభక్తి అనేది లేకపోతే జీవితం వ్యర్థమే.   కాబట్టి మనం ఎంత గొప్పవారమైనా, ఎంత విద్యావంతులమైనా, ఎంత ధనవంతులమైనా గురుభక్తి తప్పనిసరి. 

 “ *సంప్రదాయ పరిపాలన బుధ్య”* 

 శంకరులు తమ గురువైన గోవిందభగవత్పాదులను ఆత్యంత శ్రద్ధతో సేవించారని చెప్పినప్పుడు, గురుభక్తి మనకు కూడా అత్యంత అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   ఆ గురుభక్తియే మనకు అన్ని రకాల గంభీరతలను కలిగిస్తుంది.  

పరమేష్ఠి గురునాధులు శ్రీ నృసింహ భారతి మహాస్వామివారు ఒక చోట ఇలా అన్నారు, “గురువు అనుగ్రహం లేకపోతే, ప్రపంచంలో ఎవరు కోరికలు పొందగలరు?   కావున సకల సౌభాగ్యాలకు, మూలకారణుడైన గురుపాదుని ఆరాధించు.”  అని. మహానుభావులందరూ మనకు బోధిస్తారు, తద్వారా మనం మనకు ఎదురయ్యే తీవ్రతలనుంచి తప్పించుకుని మంచి గమ్యాన్ని చేరుకోవచ్చు.   వారి బోధనల ప్రకారం మనం మన జీవితాన్ని నడిపిస్తే, అది మనకు ప్రయోజనం చేకూరుస్తుంది.   వాటిని పాటించకపోతే మనకే నష్టం!   గురువులకు ఏమీ నష్టం లేదు కదా !


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

చిట్టి చీమ

 *చిట్టి చీమ*

తనకేదైనా కనిపిస్తే 

పదిమందికి చెప్పి... 

పద్ధతిగా

అందరితో కలిసి 

తింటుంది *చిట్టిచీమ* ...

తనసొమ్మయినా...

*దాచుకుని* తిన మంటాడు 

తనది కానిదయతే

 *దోచుకొనితింటాడు* 

భయం భయంగా నరుడు,

అందరితో పంచుకుంటే 

అనoద ముందని

ధర్మమార్గoలోనే నిర్భయం ఉందని 

కలిసివుంటేనే కలదు సుఖం అని

చెప్పకనే చేసి చూపెడుతుంది

            *చిట్టి చీమ* 

ధీ మంతుడనంటు ఊరేగే

మానవుడు 

కుచించుకుని బుద్దిని

తాను, తనకు, తనదంటూ

తెగ ఆరాటపడుతూ  

బ్రతుకుతెల్లారే  వరకు తేరుకోడు...

తన వెంట వచ్చేదేదో...

చితికిపోయే వరకు తెలుసుకోడూ...

దీపముండగానే దిద్దుకో అన్నట్లు ...

దేహముండగానే 

తెలుసుకొని మసులుకో 

కూడా వచ్చేదాన్ని కూడబెట్టుకో ...

చిరునవ్వుకు చిరునామా వై

సంతృప్తిగా సాగిపో...

      డా౹౹మంగళ మక్కపాటి

        *శుభోదయం*

జీవిత రహస్యం

 310524-4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



                 *జీవిత రహస్యం*

                    ➖➖➖✍️



```

మానవుడు తాను ఖర్చు చేసే ధనములో తృణమో పణమో ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. 


ఈ శరీర నిర్మాణంలో  దానంచేసే సుగుణముంది. భగవంతుడు ఒకరికిచ్చే దాన పద్ధతిలోనే చేతిని నిర్మించాడు.


చేతులు కిందికి వాలి ఉన్నప్పుడు వాటి తీరు గమనిస్తే ఈ సత్యం బోధపడుతుంది. 


ఇమ్ము శ్రద్ధతో ఇమ్ము నిశ్చయముగా ఇమ్ము -ఇదే జీవిత రహస్యం అని నీతిశాస్త్ర కోవిదులను అంటున్నారు.


మనిషి దాన గుణంతోనే ధర్మాత్ముడు అవుతాడు ఇతరులకు ఆదర్శంగా జీవించగలుగుతాడు మంచి వారసత్వానికి వారసుడు అవుతాడు సమాజ క్షేమాన్ని కాంక్షించ గలుగుతాడు.

              

మన చేతికి అలంకారం దానం చేయడం. అది ఒక గొప్ప సౌశీల్యం. దానధర్మాలు విశేషంగా చేయాలి. తన కోసం తన ధనాన్ని ఎంత తక్కువ ఖర్చు చేసుకుంటే అంత గొప్పవాడు అవుతాడు మానవుడు. 


మనిషి జీవితం దానధర్మాలతోనే ముడిపడి ఉంది. అదే అతడు దాచుకునే సంపద. అదే సద్గతిని కలిగిస్తుంది. 


అనుకున్నప్పుడే వెంటనే దానం చేయాలని మహర్షులు చెబుతారు. 


జీవితం ఏ క్షణములో ఏమి జరుగుతుందో తెలియదు, అది గుర్తించిన వారు ఈ జీవన రహస్యాన్ని మర్చిపోరు.

               పిసినిగొట్టుతనము మహా ప్రమాదకరమైన అవలక్షణం. 


కొందర్ని మనం అంటూ ఉంటాం పిల్లికి కూడా బిచ్చం వేయడు....


‘కామక్రోధ,లోభాలు నరకానికి ద్వారాల’ని అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు.

               

అవి ఆత్మ వినాశనానికి దారులనీ వాటిని త్యాగం చేయలని మహాత్ములు అన్నారు. మనిషి త్యాగశీలిగ జీవించాలి. దానం అనేది మన కర్తవ్యంగా భావించాలి. 


లోకంలో ఎందరో దరిద్రులను చూస్తున్నాము. కూటికి గుడ్డకు విద్యకు నోచుకోని నానా బాధలు పడుతూ వీధుల్లో తిరుగుతున్నారు. ఈ దీన స్థితి నుంచి వీరిని ఉద్ధరించాలి.

           

మన సంపాదనలో, కనీసం 5 శాతం నుండి 10 శాతం వరకు ధనాన్ని ఇతరులకు దానం చేద్దాము. అది తిరిగి రెట్టింపు అయ్యి10 రెట్లు మనకు తిరిగి వస్తుంది. 


ఒక కేజీ ధాన్యం మనము పొలములో చల్లితే, దాదాపు రెండు మూడు బస్తాల ధాన్యం వస్తుంది, అసలు ఏమి చల్లకపోతే ఏమీ రాదు.

            

అదే విధముగా మనము ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకుంటే, మనకు అది తిరిగి ఏదో విధముగా  చేరుతుంది. 

ఇది అక్షర సత్యం...... 


మన చుట్టూ ఉన్న వారు ఆనందంగా ఉంటే, మనం ఆనందంగా ఉండగలుగుతాము. ఇది పకృతి రహస్యం. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మన వారే ఎవరూ పరాయి వారు కాదు ఎవరితోనూ విరోధం వద్దు.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కనకధారా స్తవం* _

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *విశ్వామరేంద్రపదవిభ్రమ దానదక్షం*

       *ఆనందహేతు రధికం మురవిద్విషోఽపి*

       *ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్థం*

      *ఇందీవరోదర సహోదర మిందిరాయాః* (03)


          { _/  *కనకధారా స్తవం* _/ } 


తాత్పర్యం: నల్లకలువ పూవు లోపలి భాగంవలె నల్లని కాంతితో విలసిల్లు శ్రీ మహాలక్ష్మి యొక్క క్రీగంటి చూపు సమస్త స్వర్గ సామ్రాజ్యాధిపత్యాన్ని తన భక్తులకు అనుగ్రహించడానికి శక్తి గలిగి ఉంది. ఆ చూపు మురాంతకుడైన శ్రీ మహావిష్ణువునకు సైతం మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుంది. అట్టి *ఇందిరాదేవి యొక్క అరవిరిసిన కనుచూపు నాయందు త్రుటికాలం ఒకింత నిల్చియుండుగాక*!

భూమిని మీకు తెలువకుండా

 *మీ భూమిని మీకు తెలువకుండా ఇతరుల పేరు మీదికి మారుస్తే విల్లేజ్ రెవిన్యూ ఆఫీసర్, మండల్ రెవిన్యూ ఇంస్పెక్టరు, మండల సర్వేయర్, తహసిల్దార్ సెక్షన్ 197 సీఆర్పీసి ప్రకారం నేరస్తులు అవుతారు*

*తప్పుచేసిన ప్రతి ప్రభుత్వ అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకొనవచ్చు*

*****

*మీ*

*కె విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB*

*న్యాయవాది*



******

*రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు విషయంలో ఒక్కరి భూమి మరొక్కరి 1బి ఆడంగల్ మంజూరు చేస్తే ఆడంగల్ మరియు 1బి కరెక్షన్ కోసం రైతులు ROR చట్టం కింద రెవిన్యూ డివిజనల్ అధికారి దగ్గర అప్పీల్ గాని, జాయింట్ కలెక్టర్ దగ్గరకు గాని అప్పీల్ వెళ్ళవలసిన అవసరం లేదు. సంబంధిత తహసిల్దార్ గారికి అర్జీ పెట్టుకోవాలి (మీ భూమి పత్రాలు చూపించి ఆ అర్జీకి జిరాక్స్ జతపరచాలి) మీతో విచారణ చేయకుండా మీ భూమిని ఇతరులకు ఆన్లైన్ నందు 1బి, ఆడంగల్, పట్టాదారు పసుపుస్తకం మంజూరు చేసినందుకు గాను విల్లేజ్ రెవిన్యూ ఆఫీసర్, మండల్ రెవిన్యూ ఇంస్పెక్టరు, మండల సర్వేయర్, తహసిల్దార్ సెక్షన్ 197 సీఆర్పీసి ప్రకారం నేరస్తులు అవుతారు వీరి మీద చర్యలు తీసుకోమని పై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు పై అధికారులు చర్యలు తీసుకొనకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్రిమిల్ అప్పీల్ నెం 1837/2019 కింద శిక్ష అర్హులు.*

*****

*మీ*

*కె విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB*

*న్యాయవాది *


*తప్పుచేసిన ప్రతి ప్రభుత్వ అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకొనవచ్చు పై అధికారుల అనుమతి అవసరం ఈ తీయర్ను ప్రతి ప్రభుత్వ అధికారికి వర్తిస్తుంది.*

మీ భూమి ఇతరుల పేరు మీదికి మారిందని.

ఎ ఒక్కరు 

టెంక్షన్ పడకూడదనే 



_మౌనం మనసుకు

 *🔔   _ధర్మధ్వజం🪷🕉️🪷శుభోదయం_   🔔*


      *_మౌనం మనసుకు సమాధానం ఇవ్వలేదు_*

      *_కానీ ఆలోచించుకోవడానికి తగిన వ్యవధినిస్తుంది._*


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞


 🌹  🌹  ॐ  卐  ॐ  🌹  🌹

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

      🌞 *_మే 31, 2024_*  🌝

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*వైశాఖ మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *అష్టమి* ఉ8.46

వారం: *భృగువాసరే*

(శుక్రవారం)

నక్షత్రం: *శతభిషం* ఉ5.48

&

మర్నాడు *పూర్వాభాద్ర*

తె4.10వరకు

యోగం: *విష్కంభం* సా5.52

కరణం: *కౌలువ* ఉ8.46

&

*తైతుల* రా7.34

వర్జ్యం: *ఉ11.45-1.15*

దుర్ముహూర్తము: *ఉ8.03-8.55*

&

*మ12.22-1.14*

అమృతకాలం: *రా8.42-10.12*

రాహుకాలం: *ఉ10.30-12.00*

యమగండం: *మ3.00-4.30*

సూర్యరాశి: *వృషభం*

చంద్రరాశి: *కుంభం*

సూర్యోదయం: *5.28*

సూర్యాస్తమయం:*6.26*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

    🪷🇮🇳🚩🙏🚩🇮🇳🪷

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

VAIBHAVA FOODS

 VAIBHAVA FOODS


If you take 250 Grams, then we will charge Rs. 175/- for each item.

If you take 500 Grams, then we will charge Rs. 325/- for each item.


Prices per Kg :


Dabbakaya... Rs. 600/-

Avakaya ........Rs.700/-

 Magaya.........Rs.700/-

Kaya Avakaya.Rs.700/- 

తొక్కుడు పచ్చడి. Rs. 800/-

Pulihora

Avakaya..........Rs.700/-

mukkala pacchadi........Rs.600/-

Lemon...........Rs.700/-

Pesara

Avakaya…......Rs.600/-

Jaggery magaya.. Rs. 800/-

Gongura.........Rs.600/-

Pallagongura..Rs.600/-

Pandumirchi.. .Rs.600/

Tomato.......... Rs.600/-

Tomato

Pandumirchi...Rs.600/-

Allam

Chutney. Rs.600/-

Mamidi Allam

Chutney. ... .Rs.600/-

Usiri Avakaya.Rs.600/-

Chinthakaaya.Rs.600/-

Dosa Avakaya Rs.600/-

Pacha

Avakaya 800/-

Usiri thokku

 pachadi. Rs.600/-

Allamvellulli

Avakaya. Rs. 800/

Munaga

Avakaya. Rs.600/_

Pesara

Avakaya, Rs.600/-

కరివేపాకు పచ్చడి Rs.600/-

కొత్తిమీర పచ్చడి.... Rs.,600/-

Kandipodi. Rs.600/-

Idlypodi. ...Rs.600/-

Karivepaku

podi. Rs.600/-

Sambarpodi....Rs.600/-

Charu podi.…. . Rs.600/-

Karapupodi.. Rs.600/-

Vellullikaram..Rs.600/-

Pallipappula

Podi.,..............Rs.600/-

Putnalapappu

Podi. Rs.600/-

Munagaaku

 podi. Rs.600/-

Kura karam. Rs.600/_

Dabbakaya Rs.600/-

Kondapindi Aaku podi..

Punarwa Aaku Podi..

Gummadi

Vadiyalu........Rs.1400/-

చిట్టి వడియాలు -Rs.800/-

Onion వడియాలు....Rs. 1000/-

to our members


Preparing with passion

No preservatives

No colours

Most trusted brand in the market in respect of taste, quality and delivery

No controversies

Affordable prices

Prompt delivery

Shipping charges are to be borne by the customer


We can deliver all the pickles within one day in Hyderabad


Apart from above, we can prepare different types of pickles and powders on order

Vaibhava Foods

102, Mithila APTS

VV NAGAR COLONY

KUKATPALLY

HYDERABAD


Contact if any needed to 7032752421



NB. Private advertisement. Blogger is not responsible for the content

యిపుడా శిల్పులు

 పెనుగొండ లక్ష్మి!


          సీ:  గండపెండేరంబు  ఘల్లు ఘల్లు మన  దాన


                                 ముల తోడ  దేశాక్షి  బలుకు నాఁడు ;


              సులతాను లెల్ల  దలలు వంచి కల్కి తు


                                 రాయీల  నిను  బూజ సేయునాఁడు ;


               ఆదివరాహ  ధ్వజాంతరంబులనీడ


                                  నీకీర్తి  సుఖముఁ బండించునాఁడు ;


             గుహల  లోపల దూరికొన్న  యాగజపతి


                                               తలపైని  నీకత్తి  గులుకు నాఁడు;


      గీ:   నీదు కన్నుల వెలిఁజూపు  నీడ లోన  


             చీమయును హాయిగా నిద్రఁ జెందునాఁడు;


             గలుగు నాంధ్రుల  భాగసాకల్య గరిమ


              బూడిదనుబడి  నీతోడ బోయె  దల్లి!


     


   మ:  ఉలిచే రాలకు  జక్కిలింతలిడి  యాయు ష్ప్రాణముల్వోయు  శి


               ల్పుల మాధుర్య  కళాప్రపంచన  లయంబున్ జెందె ,పాతాళమున్


                గలసెన్  బూర్వ కవిత్వ వాసనలు , నుగ్గైపోయె  నాంధ్రావనీ


                తల మంబా! యిక లేవ యాంధ్రులకు  రక్తంబందు  మాహాత్మ్యముల్;


                      పెనుగొండ లక్ష్మి--- సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు!


                               పాండిత్యం కవిత్వం కలిపి ఆపోసనంగొన్న అగస్త్యునిగా, డా సి నా రె ప్రశంసల నందుకొన్న నారాయణనాచార్య

రాయలసీమలోప్రభవించిన అనర్ఘకవితారత్నం! శతాధిక  గ్రంధకర్తలైన వీరికృతుల్లో  చిన్ననాట రచించిన పెనుగొండ లక్ష్మి, షాజీ , శివతాండవము  మొదలగు కృతులు  జగత్ప్రసిధ్ధములు. 


                               వీరు ద్వాదశ వర్షప్రాయులైయున్నప్పుడే  కవితారచనకు గడంగి  విజయ నగర రాజుల రాజ్యవైభవమును సూచించు పెనుగొండ లక్ష్మిని రచించినారు. పైపద్యములు రెండును ఆకావ్యములోనివియే! వేసవి విడిదిగా రాయలు పెనుగొండదుర్గమునకు వచ్చెడు వాడట. నాటివైభవమంతయు కనులకు గట్టునట్లుగా సీసపద్యమును ,నాటి శిల్పవైభవమునకు

దిక్సూచిగా  మత్తేభమును రచించినారు.


                        మత్తేభమున కవి తన నైపుణ్యమునంతను ప్రదర్శించినారు. " శిల్పులు ఉలిచే రాలకు చక్కిలిగింతలుపెట్టి , వాటికి  

ఆయువును ప్రాణమును బోసెడివారట. ఏరి యిపుడా శిల్పులు? .ఏవి ఆశిల్పములు? మధురాతిమధురమైన తమకవితలతో మహనీయమైన కావ్యములల్లిన ఆకవులేరీ? ఇపుడాకవిత్వమేది? బూడిదలోకలసినవి. ఇక నటువంటి వైభవమును చవిచూచు భాగ్యము ఆంధ్రులకు రాదా? యనివాపోవుచున్నారు.


                           1926 సం: ప్రాంతమున రచించిన యీకావ్యము , షాజీ యను వీరి మరోకావ్యము  ముద్రణకు నోచుకొన్నవి. అంతేగాదు,ప్రభుత్వముచే పాఠ్యగ్రంధములుగా నెన్నుకొన బడినవి. కాబట్టి వారిని గురించి యధికముగా జెప్పవలసినదేమున్నది?

కానీ యామహనీయునకు దక్కవలసినంత గౌరవము దక్కకపోయెను. అదియేమావంటివారికి విచారము. 


                


                   

                                                                   స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

హనుమాన్ జన్మోత్సవం

 🙏🙏🙏🙏🙏🙏🙏


రేపు హనుమాన్ జన్మోత్సవం


*అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కింవధ|*

*రామదూత కృప సింధో మత్కార్యం సాధ్యప్రభో||*


హిందూ సంప్రదాయంలో ఎన్నో పండుగలున్నాయి. ఇందులో హనుమాన్ (జన్మోత్సవం) జయంతి సైతం ముఖ్యమైన పండుగ. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. రేపు జూన్ 1 శనివారం ఊరూరా, వాడవాడనా యావత్ దేశవ్యాప్తంగా హనుమజ్జయంతి వేడుకలు నేత్రపర్వంగా సాగుతాయి.


హిందువులు ఆంజనేయుడిని ధైర్యానికి ప్రతీకగా కొలుస్తారు. శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపరంగా భావిస్తారు. సముద్ర లంఘించి లంకకు చేరి సీతమ్మవారి జాడ కనిపెట్టారు. సంజీవనీ పర్వతాన్నే పెలికించి తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడారు స్వామివారు.


హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు నిర్వహిస్తూ వస్తుంటారు.


ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటుండగా.. మరికొందరు వైశాఖమాసం దశమినాడు ( రేపు జూన్ 1) హనుమజ్జయంతిని జరుపుకుంటారు.


ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి నిర్వహిస్తారు.


నిజానికి పురాణాల ప్రకారం..


హనుమాన్ జీ ఇప్పటికీ భూమిపై భౌతికంగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు గంధమాదన్ పర్వతం మీద నివసిస్తున్నాడని నమ్ముతారు. అందుకే హనుమంతుడిని కలియుగ మేల్కొన్న దేవుడు అని పిలుస్తారు. మరణించిన వారి జన్మదినోత్సవం జరుపుకుంటారు.

కానీ హనుమంతుడు ఇప్పటికీ భూమిపై ఉన్నారు. కాబట్టి అతని పుట్టినరోజును జన్మోత్సవం అని పిలవడం సరైనది. అందుకే చాలా మంది హనుమాన్ జయంతిని హనుమాన్ జన్మోత్సవంగా పిలుస్తారు.

మీరు భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 

ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు.  మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ +91 9848647145 కు వాట్సాప్ చేయండి.  దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 

ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు+91 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   

ఇట్లు 

మీ బ్లాగరు


పంచాంగం 31.05.2024

 ఈ రోజు పంచాంగం 31.05.2024  Friday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస కృష్ణ    పక్ష: అష్టమి తిధి భృగు వాసర: శతభిషం తదుపరి పూర్వాభాధ్ర  నక్షత్రం నిష్కంభ యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి పగలు 09:37 వరకు.

శతభిషం ఉదయం 06:13 వరకు తదుపరి పూర్వాభాద్ర రా.తె 04:47 వరకు.

సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:43


వర్జ్యం : మధ్యాహ్నం 12:14 నుండి 01:44 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:21 నుండి 09:13 వరకు తిరిగి మధ్యాహ్నం 12:40 నుండి 01:32 వరకు.


అమృతఘడియలు : రాత్రి 09:16 నుండి 10:46 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

జ్ఞానం గొప్పది.

 👆శ్లోకం 

ధాన్యానాముత్తమం దాక్ష్యం

 ధనానాముత్తమం శ్రుతం

లాభానాం శ్రేయ ఆరోగ్యం

 సుఖానాం తుష్టిరుత్తమా


భావం

భౌతిక విషయాల కంటే నైపుణ్యం శ్రేష్ఠమైనది సంపద కంటే జ్ఞానం గొప్పది. లాభాల కంటే ఆరోగ్యం శ్రేష్ఠమైనది మరియు సంతృప్తి అనేది ఆనందానికి ఉత్తమ రూపం.

భగవదనుగ్రహం

 June 2వ తారీఖు న సుందర కాండ పారాయణ టీవీ లో ఎస్వీబీసీ ఛానల్ లో  ఉదయం నుండి రాత్రి వరకు వస్తుంది 5.30 కి మొదలు ఇంచుమించు 10.30 వరకు  మీరు chaydivina లేకున్నా టీవీ on చేసి వుంచండి ఇంట్లో పారాయణ జరిగినట్లే ఆ హనుమ అనుగ్రహము వుంటుంది వింటూ వుంటే మనకు చాలా ఆనందంగా భక్తి గా ఏదో తెలియని భక్తి భావం కలుగుతుంది వినండి భగవదనుగ్రహం పొందండి💐🙏🏻💐🌹🍓

_మే 31, 2024_* 🌝

 ॐ  卐  ॐ

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

      🌞 *_మే 31, 2024_*  🌝

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*వైశాఖ మాసం*

*కృష్ణ పక్షం*

🔔తిథి: *అష్టమి* ఉ8.46

🔯వారం: *భృగువాసరే*

(శుక్రవారం)

⭐నక్షత్రం: *శతభిషం* ఉ5.48

&

మర్నాడు *పూర్వాభాద్ర*

తె4.10వరకు

✳️యోగం: *విష్కంభం* సా5.52

🖐️కరణం: *కౌలువ* ఉ8.46

&

*తైతుల* రా7.34

😈వర్జ్యం: *ఉ11.45-1.15*

💀దుర్ముహూర్తము: *ఉ8.03-8.55*

*మ12.22-1.14*

🥛అమృతకాలం: *రా8.42-10.12*

👽రాహుకాలం: *ఉ10.30-12.00*

👺యమగండం: *మ3.00-4.30*

🌞సూర్యరాశి: *వృషభం*

🌝చంద్రరాశి: *కుంభం*

🌄సూర్యోదయం: *5.28*

🌅సూర్యాస్తమయం:*6.26*

 లోకాః సమస్తాః* *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు ఇరగవరపు రాధాకృష్ణ 🕉

హార్ట్ టచింగ్ మెసేజ్:*

 *హార్ట్ టచింగ్ మెసేజ్:*



 *ఒక వృద్ధ ఉపాధ్యాయుడిని ఒక యువ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు.  ప్రొఫెషనల్ ముందుగా అనుకున్న ప్రకారం ఉపాధ్యాయుడిని ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించాడు.*

 

 *యువ ప్రొఫెషనల్ - "సార్, మీ చివరి ఉపన్యాసంలో, మీరు దీని గురించి మాకు చెప్పారు*

     *"సంప్రదింపు" మరియు "కనెక్షన్."* 

 *ఇది నిజంగా గందరగోళంగా ఉంది.  మీరు వివరించగలరా?"* 🤔


 *వృద్ధ ఉపాధ్యాయుడు చిరునవ్వు నవ్వి, యువ వృత్తినిపుణుడిని అడిగిన ప్రశ్న నుండి స్పష్టంగా తప్పుకున్నాడు:* 


 *"మీరు ఈ నగరానికి చెందినవా?"*


 *ప్రొఫెషనల్ : "అవును..."*


 *టీచర్: "ఇంట్లో ఎవరున్నారు?"*


 *ఇది చాలా వ్యక్తిగతమైన మరియు అసమంజసమైన ప్రశ్న కాబట్టి ఉపాధ్యాయుడు తన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని ప్రొఫెషనల్ భావించాడు.  ఇంకా యువ నిపుణుడు ఇలా అన్నాడు: "తల్లి గడువు ముగిసింది. తండ్రి ఉన్నారు. ముగ్గురు సోదరులు మరియు ఒక సోదరి. అందరూ వివాహం చేసుకున్నారు..."*


 *ముసలి ఉపాధ్యాయుడు చిరునవ్వుతో మళ్లీ అడిగాడు: "మీరు మీ నాన్నతో మాట్లాడతారా?"*


 *యువ వృత్తి నిపుణుడు విసుగుగా కనిపించాడు...*


 *వృద్ధ ఉపాధ్యాయుడు: "మీరు అతనితో చివరిగా ఎప్పుడు మాట్లాడారు?"* 


 *ఆ యువ నిపుణుడు తన చికాకును అణచుకుంటూ ఇలా అన్నాడు: "ఒక నెల క్రితం కావచ్చు."*


 *వృద్ధ ఉపాధ్యాయుడు : "మీ అన్నదమ్ములు తరచుగా కలుస్తుంటారా? కుటుంబ సమేతంగా మీరు చివరిసారిగా ఎప్పుడు కలుసుకున్నారు?"*


 *ఈ సమయంలో, యువ వృత్తినిపుణుడి నుదిటిపై చెమట కనిపించింది.*


 *వృద్ధ ఉపాధ్యాయుడు యువ వృత్తినిపుణుని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు అనిపించింది.*


 *నిపుణులు ఇలా అన్నారు: "మేము రెండు సంవత్సరాల క్రితం పండుగలో చివరిగా కలుసుకున్నాము."*


 *వృద్ధ గురువు : "మీరందరూ కలిసి ఎన్ని రోజులు ఉన్నారు?"*


 *యువ వృత్తినిపుణుడు (నుదురు మీద చెమటను తుడుచుకుంటూ) ఇలా అన్నాడు: "మూడు రోజులు..."*


 *వృద్ధ ఉపాధ్యాయుడు: "మీరు మీ తండ్రి పక్కన కూర్చొని అతనితో ఎంత సమయం గడిపారు?"*


 *ఆ యువ నిపుణుడు కలవరపడి, ఇబ్బందిగా చూస్తూ కాగితంపై ఏదో రాయడం మొదలుపెట్టాడు...*


 *వృద్ధ ఉపాధ్యాయుడు : "మీరు కలిసి అల్పాహారం, భోజనం లేదా రాత్రి భోజనం చేసారా? అతను ఎలా ఉన్నాడని మీరు అడిగారా? మీ తల్లి చనిపోయిన తర్వాత అతని రోజులు ఎలా గడిచిపోతున్నాయి అని అడిగారా?"*


 *నిపుణుడి కళ్ల నుంచి కన్నీటి చుక్కలు కారడం ప్రారంభించాయి.*


 *వృద్ధ ఉపాధ్యాయుడు యువ నిపుణుడి చేతిని పట్టుకుని ఇలా అన్నాడు: "ఎబ్బెట్టుగా, కలత చెందకండి లేదా విచారంగా ఉండకండి. నేను తెలియకుండా మిమ్మల్ని బాధపెడితే క్షమించండి... కానీ ఇది ప్రాథమికంగా "సంప్రదింపు మరియు  కనెక్షన్ ." మీకు మీ నాన్నతో 'కాంటాక్ట్' ఉంది కానీ అతనితో మీకు 'కనెక్షన్' లేదు. మీరు అతనితో కనెక్ట్ కాలేదు. అనుబంధం హృదయానికి మరియు హృదయానికి మధ్య ఉంది...*

 *కలిసి కూర్చోవడం, భోజనం చేయడం మరియు ఒకరినొకరు చూసుకోవడం, తాకడం, కరచాలనం చేయడం, కంటిచూపు, కలిసి కొంత సమయం గడపడం... మీ అన్నదమ్ములందరికీ 'కాంటాక్ట్' ఉంది కానీ ఒకరితో ఒకరు 'కనెక్షన్' లేదు..."*  🤗


 *ఆ యంగ్ ప్రొఫెషనల్ కళ్ళు తుడుచుకుని ఇలా అన్నాడు: "నాకు మంచి & మరపురాని పాఠం నేర్పినందుకు ధన్యవాదాలు సర్."*


 *ఇది నేటి వాస్తవం.*

 *ఇంట్లో ఉన్నా, సమాజంలో ఉన్నా ప్రతి ఒక్కరికీ చాలా పరిచయాలు ఉంటాయి కానీ సంబంధం ఉండదు.  ప్రతి ఒక్కరూ తనదైన ప్రపంచంలో బిజీగా ఉంటారు...*


 *మనం కేవలం నిర్వహించవద్దు,*

           *"పరిచయాలు"*.

 *అయితే మనం*

 *"కనెక్ట్ చేయబడింది,"*

     *"సంరక్షణ, భాగస్వామ్యం"* 

                 *&*

      *సమయాన్ని గడపడం* 

 *మన దగ్గరి మరియు ప్రియమైన వారందరితో.* 


 దిల్ సే ...💞వాసు సుస్వరం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం  -‌ అష్టమి  - శతభిషం & పూర్వాభాద్ర -‌‌ భృగు వాసరే* (31.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సంస్కృతం లో రక్త సంబంధీకుల

 సంస్కృతం లో రక్త సంబంధీకుల పేర్లు...మీకోసం


👇 .👇

1. పితా (తండ్రి) 

2. పితామహా (తాత)

3. ప్ర పితామహా (ముత్తాత)

4. మాతా (తల్లి)

5. పితామహి (బామ్మ)

6. ప్రపితామహి (బామ్మ అత్తగారు)

7. సాపత్ని మాతా (సవతి తల్లి)

8. మాతామహ (తల్లి తండ్రి)

9. మాతా పితామహ (తల్లి తాత)

10. మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత)

11. మాతామహి (అమ్మమ్మ)

12. మాతుః పితామహి (అమ్మమ్మ అత్త)

13. మాతుః ప్రపితామహి (అమ్మమ్మ అత్తగారి అత్త)

14. ఆత్మపత్ని (తన భార్య)

15. సుతః (కుమారుడు)

16. భ్రాత (సోదరుడు)

17. జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి)

18. కనిష్ట పితృవ్యః (పిన తండ్రి)

19. మాతులః (మేనమామలు)

20. తత్పత్నిః (వారి భార్యలు)

21. దుహిత (కుమార్తె)

22. ఆత్మ భగినీ (తోబుట్టువులు)

23. దౌహిత్రః (కూతురు బిడ్డలు)

24. భాగినేయకః (మేనల్లుళ్లు)

25. పితృష్వసా (తండ్రి తోబుట్టువులు)

26. మాతృష్వసా (తల్లి తోబుట్టువులు)

27. జామాతా (అల్లుళ్లు)

28. భావుకః (తోబుట్టువు భర్త)

29. స్నుష (కోడలు)

30. శ్వశురః (మామగారు) 

31. తత్పత్నీః (వారి భర్యలు)

32. స్యాలకః (బావమరుదులు)

33. గురుః (కుల గురువు)

34. ఆర్ధినః (ఆశ్రితులు)