31, మే 2024, శుక్రవారం

ధర్మనందన బాలుడు

 యోగ్యమైన తిథి, వార నక్షత్ర లగ్నములతో కూడిన శుభ సమయంలో పరీక్షిత్తు దివ్య తేజంతో జన్మించాడు. ఆ సమయంలో గ్రహాలన్నీ ఉత్తమ స్థానాల్లో ఉన్నాయి. పరిక్షిత్తు జననము వృత్తాంతం విని ధర్మరాజు ఆనందంతో ధౌమ్య, కృపాచార్యాదులను పిలిపించి మంగళవాచనములు జాతకర్మ చేయించాడు.


 ప్రజాతీర్థ నామకమైన ఆ సమయంలో ధర్మరాజు గో భూ సువర్ణాలు ఏనుగులు గుర్రాలు మొదలైనవి ఉత్తములకు దానం చేసి అన్నదానం కూడా చేశారు.


సంతులిస్టులైన బ్రాహ్మణులు కృష్ణానుగ్రహం వల్ల పాండవ వంశం నిలిచిందని ఆనందం వెల్లడిస్తూ ఆనందించారు. వారిని చూచి విద్వాన్సులారా ఈ పాలకుడు దీర్ఘాయుర్దాయం కలవాడై పవిత్రమైన కీర్తిని ప్రతిష్టించి రాజఋషులను అనుసరిస్తాడా అని అడిగిన ధర్మరాజుకి ఆ బ్రాహ్మణులు ఇలా చెప్తున్నారు. 


ధర్మనందన ఈ బాలుడు ఇక్ష్వాకులతో సమంగా ప్రజలను పాలిస్తాడు. రామచంద్రునితో సమానంగా బ్రాహ్మణ భక్తి సత్య ప్రతిజ్ఞ కలవాడు అవుతాడు. శిబితో సమానమైన దాత భరతునితో సమానమైన యజ్వ, కార్తవీర్యార్జునితో సరియగు ధనుర్ధారి, అగ్ని వలె దుర్దర్షుడు, సముద్ర వలే దుస్తరుడు, సింహ పరాక్రముడు, హిమాచలం వలే ఆశ్రయుడు,  భూమితో సమానమైన తితిక్ష,  తల్లిదండ్రులతో సమానమైన సహనం, బ్రహ్మయందు ఉండే సమత్వం, శంకరుని యందు ఉండే కృప, రంతిదేవుని యందు ఉండే ఔదార్యం,  యయాతి యందున్న ధార్మికత్వం, ప్రహ్లాదుని వంటి దృఢనిష్ఠ కలిగి బలితో సమానమైన ధైర్యం గలవాడు కూడా కాగలడు. అనేక అశ్వమేధ యాగాలు చేసి వృద్ధులను సేవించి రాజర్షితుల్యుడైన కుమారుని కని దుష్టులను శిక్షిస్తూ కలియుగంలో కృతయుగ ధర్మాలను ప్రతిష్టిస్తాడు.

కామెంట్‌లు లేవు: