1983 లో శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీకి కర్టసీ కోసం ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ని కలవడానికి వెళితే అధికారులు తమిళనాడు భవన్ లో బస ఏరాటు చేశారట.
అదేంటీ మనకు ఆంధ్రప్రదేశ్ భవన్ లేదా అని రామారావుగారు అడిగేరట.
ఉంది.
అది ఉత్తరప్రదేశ్ ,బీహార్ కాంగ్రెస్ నాయకులు
రౌడీలు ఆక్యుపై చేశారు అని చెప్పారట.
ఐతే వాళ్ళను కాళీ చేయించండీ
అన్నారట రామారావు గారు.
అది అంత ఈజీ కాదు.
కరుడు కట్టిన నేరస్తులు వాళ్ళు.
అని అధికారులు చెప్పారట.
అపుడు ప్రధానమంత్రి ఆఫీసు కు ఫోను కలపండీ
అని రామారావు గారు అన్నారట.
అధికారులు భయపడ్డారట.
నో..వెంటనే కలపండీ అని హుకుం జారీ చేశారట.
అపుడు రామారావు గారు 48 గంటలు టైము ఇస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ భవన్ ను కాళీ చేయించి
మాకు అప్పజెప్పమని
వార్నింగ్ ఇచ్చారట.
ప్రధానమంత్రి ఆఫీసు విస్తు పోయింది అట.
ఓ దక్షిణాది ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీలో ఇలా
మాట్లాడటం ఇదే మొదటిసారి అని
ఆశ్చర్య పోయారట.
వెంటనే ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తో
మాట్లాడి మిలటరీ సహాయంతో
ఆంధ్రప్రదేశ్ భవన్ ను కాళీ చేయించి
48 గంటల లో అప్పజెప్పారట.
తొలిసారిగా ముఖ్యమంత్రి గా
ప్రధానమంత్రి ని కలవక ముందే
జరిగిన సంఘటన ఇది.
అది NTR అంటే.
అది ఆత్మగౌరవం అంటే.
ఢిల్లీలో
భారత దేశానికి ఆంధ్రప్రదేశ్ లో
తెలుగు వారు అని ఒకరు ఉన్నారు
అని తెలియ జేసిన మహాను భావుడు
శ్రీ నందమూరి తారకరామారావు గారు.
అలాంటి మహాను భావులను తలుచుకోవడం
మన అధ్రృష్టం. KKM
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి