31, మే 2024, శుక్రవారం

శ్వేతార్కలో హనుమత్ జయంతి

 *శ్వేతార్కలో హనుమత్ జయంతి వేడుకలు* 


*జాతక దోషాలు తొలిగించే యోగాంజనేయస్వామివారు*


జూన్ 1 శనివారము రోజున 29 దేవతామూర్తులతో కొలువుదీరి ఉన్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువై ఉన్న శ్రీయోగాంజనేయస్వామి సన్నిధిలో హనుమత్ జయంతి వేడుకలు...


హనుమజ్జయంతి పూజలను పురస్కరించుకొని ఉదయం 7గం శ్రీయోగాంజనేయస్వామివారికి  పంచామృతములతో, సింధూర లేపనంతో మరియు పానకంతో శ్రీస్వామివారికి విశేష అభిషేకం చేయడం జరుగుతుంది. 


 ఉదయం 9 గంటలకు వడమాల పూజ తమలపాకుల అలంకరణ, కదలీఫల పూజ,  మన్యుసూక్త కల్ప పారాయణ సహిత అష్టోత్తర సహస్రనామార్చన పూజలు జరుగును. 


ఉదయం 11గం. గణపతి, నవగ్రహ, ఏకాదశ మన్యుసూక్త హోమము జరుగును. 

ఈ హోమం చేయడం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు విద్యావృద్ది, వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి, బుద్ధిర్బలం యశో ధైర్యం, కార్యసాధన, శృంఖల బంధ విమోచనం, కార్య రక్షణ, మన సంకల్పాలు, నవగ్రహ దోషాలు పోయి అన్ని కార్యలలో యోగాన్ని పొందగలరు. 

సాయంత్రం 7.30 నిమిషాలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణము, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణములు జరుగును..


కావున భక్తులు తప్పనిసరిగా ఈ హనుమజ్జయంతి రోజున ఏదో ఒక వేళ తప్పనిసరిగా యోగాంజనేయస్వామి యొక్క దర్శనం చేసుకొని మీయొక్క జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి పొంది హనుమంతుని యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ పరమేశ్వరుడు శ్రీరామచంద్రులవారి యొక్క అనుగ్రహానికి ప్రీతి పాత్రులు కాగలరు. మరిన్ని వివరాలకై 8686146308,9347080055 నెంబర్నకు ఫోన్ చేయగలరు.


 శ్రీస్వామివారి సన్నిధిలో జరుగు హనుమజ్జయంతి పూజలకై భక్తులు కేవలం 551 రూపాయలు చెల్లించి అన్ని పూజలలో గోత్రనామాలు చదివించుకోనవచ్చును. ఇట్టి విషయాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా అన్ని గ్రూపులకు పేజీలకు share చేయగలరు.


వివరాలకు సంప్రదించండి  

పూల్యాల అరుణ్ రెడ్డి

యోగాంజనేయ స్వామి ఆలయ ఇంఛార్జి (+9173965 50169)...

కామెంట్‌లు లేవు: