*జీవితంలో గురుభక్తి అత్యావశ్యకం*
భగవత్పాదులే స్వయంగా చెప్పారు, ‘‘జీవితంలో ఎంత ముందుకు వచ్చినా, గురుభక్తి అనేది లేకపోతే జీవితం వ్యర్థమే. కాబట్టి మనం ఎంత గొప్పవారమైనా, ఎంత విద్యావంతులమైనా, ఎంత ధనవంతులమైనా గురుభక్తి తప్పనిసరి.
“ *సంప్రదాయ పరిపాలన బుధ్య”*
శంకరులు తమ గురువైన గోవిందభగవత్పాదులను ఆత్యంత శ్రద్ధతో సేవించారని చెప్పినప్పుడు, గురుభక్తి మనకు కూడా అత్యంత అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ గురుభక్తియే మనకు అన్ని రకాల గంభీరతలను కలిగిస్తుంది.
పరమేష్ఠి గురునాధులు శ్రీ నృసింహ భారతి మహాస్వామివారు ఒక చోట ఇలా అన్నారు, “గురువు అనుగ్రహం లేకపోతే, ప్రపంచంలో ఎవరు కోరికలు పొందగలరు? కావున సకల సౌభాగ్యాలకు, మూలకారణుడైన గురుపాదుని ఆరాధించు.” అని. మహానుభావులందరూ మనకు బోధిస్తారు, తద్వారా మనం మనకు ఎదురయ్యే తీవ్రతలనుంచి తప్పించుకుని మంచి గమ్యాన్ని చేరుకోవచ్చు. వారి బోధనల ప్రకారం మనం మన జీవితాన్ని నడిపిస్తే, అది మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. వాటిని పాటించకపోతే మనకే నష్టం! గురువులకు ఏమీ నష్టం లేదు కదా !
-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి