*చిట్టి చీమ*
తనకేదైనా కనిపిస్తే
పదిమందికి చెప్పి...
పద్ధతిగా
అందరితో కలిసి
తింటుంది *చిట్టిచీమ* ...
తనసొమ్మయినా...
*దాచుకుని* తిన మంటాడు
తనది కానిదయతే
*దోచుకొనితింటాడు*
భయం భయంగా నరుడు,
అందరితో పంచుకుంటే
అనoద ముందని
ధర్మమార్గoలోనే నిర్భయం ఉందని
కలిసివుంటేనే కలదు సుఖం అని
చెప్పకనే చేసి చూపెడుతుంది
*చిట్టి చీమ*
ధీ మంతుడనంటు ఊరేగే
మానవుడు
కుచించుకుని బుద్దిని
తాను, తనకు, తనదంటూ
తెగ ఆరాటపడుతూ
బ్రతుకుతెల్లారే వరకు తేరుకోడు...
తన వెంట వచ్చేదేదో...
చితికిపోయే వరకు తెలుసుకోడూ...
దీపముండగానే దిద్దుకో అన్నట్లు ...
దేహముండగానే
తెలుసుకొని మసులుకో
కూడా వచ్చేదాన్ని కూడబెట్టుకో ...
చిరునవ్వుకు చిరునామా వై
సంతృప్తిగా సాగిపో...
డా౹౹మంగళ మక్కపాటి
*శుభోదయం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి