ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
10, డిసెంబర్ 2024, మంగళవారం
భగవద్గీత - నేటి ఆవశ్యకత*
*భగవద్గీత - నేటి ఆవశ్యకత*
మన దేశంలో ఈ మధ్యకాలంలో కొన్ని వింత ప్రచారాలు చూస్తున్నాం. భారతీయులకు ప్రత్యేకంగా హిందువులకు నీతి మార్గం, సర్వమత సహనం నేర్పుతామని ప్రగల్భాలు పలికేవారు, దానికి వంత పాడే పనికిమాలిన లౌకికవాదులను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్ధం కావట్లేదు. అటువంటి వారు హిందూ ధర్మ విచ్చిన్నానికి కృషి చేస్తూ మతాంతికరణలపై దృష్టి సారించినవారు అని గ్రహించాలి. అటువంటి వారు ఎంతటి దృష్టాత్ములో ఊహించుకోండి. ఉత్కృష్టమైన సనాతన ధర్మాన్ని వీడి పర ధర్మాన్ని స్వీకరించేవారు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆచరణలో ఏదైనా లోపాలు ఉన్నా కూడా స్వధర్మం శ్రేయస్కరమైనది. స్వధర్మంలో మరణించడమైనా మంచిది కాని పర ధర్మం భయహేతువు అన్న విషయాన్ని గ్రహించాలి. భగవద్గీత మనకి ఏమి చెబుతోంది, స్వభావం చేత సంప్రాప్తమైన ధర్మాన్ని ఆచరించేవాడు ఉన్నతుడు అని. ఎవరు ఎవరిని స్వధర్మపరిత్యాగం చేసేటట్లు చేయకూడదని, ఏ కారణం చేతనైనా తాము గాని తమ పుర్వీకులు గాని స్వధర్మాన్ని పరిత్యజిస్తే దానిని పునః పరిగ్రహించడానికి మనం ప్రయత్నించాలని సూచిస్తోంది.
ఇక అసలు విషయానికి వద్దాం.
హిందువులకి సర్వమత సహనాన్ని నేర్పుతామనేవారు ముందుగా వారి జాతి చరిత్ర పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటే మంచిది. ప్రపంచంలో అన్ని జాతుల వారు ముక్తకంఠంగా అంగీకరించే గ్రంథము ఏదైనా ఉంది అంటే అది ఒక భగవద్గీత మాత్రమే. భగవద్గీత ఆధ్యాత్మిక మార్గాన్నే కాదు శాంతియుతమైన లౌకిక జీవన విధానాన్ని కూడా బోధిస్తుంది. అందుకే ప్రపంచంలో ఏ మతం వారైనా నిర్దిష్టమైన ప్రమాణాలతో ఆలోచించేవారు అందరూ కూడా భగవద్గీత స్థానాన్ని అద్వితీయంగా భావిస్తారు.
ఇతర మతాల సిద్ధాంతం one man's god is another devil, అంటే ఒకరి దేవత మరొకరికి దయ్యమని. సనాతన హిందూ ధర్మం దానిని నిరాకరిస్తుంది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు "ఏ భక్తుడైనా సరే తాను నమ్మిన స్వరూపాన్ని శ్రద్ధాపూర్వకంగా ఆరాధిస్తాడో వానికి ఆ ఆరాధన ఫలితాన్ని నేను అందజేస్తాను అని చెప్తాడు. ఇంతకన్నా లౌకికవాదం ఏం కావాలి? ఇంతకన్నా సర్వమత సమానం ఏం కావాలి?.
*యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి ।*
*తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్||*
భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో, ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను. అలాగే
*స తయా శ్రద్ధయా యుక్తః*
*తస్యారాధనమీహతే ।*
*లభతే చ తతః కామాన్మయైవ*
*విహితాన్హి తాన్ ।।*
.. అతని భక్తి యొక్క ప్రయోజనాలను సమకూర్చేది నేనే అని చేబుతాడు.
భక్తులు ఏ మార్గాన్ని ఎన్నుకున్నా వారి ప్రయాణం చివరికి చేరేది నా మార్గాన్నే అంటూ అన్ని ధర్మాలు ఒకటే అని స్పష్టంగా తెలియజేశారు. ఇంతటి విశాల దృక్పథం కల సనాతన ధర్మం ఇంత గొప్పదో తెలుసుకోండి. దానిని ఆచరిస్తున్న భారతీయుల హృదయాలు ఎంతటి పవిత్రమైనవో ఆలోచించండి. అటువంటి భారతీయులకు సర్వమత సమానత్వాన్ని బోధిస్తామనేవారు ఎంతటి దుస్సాహసానికి పాల్పడుతున్నారో తెలుస్తోంది. అటువంటి వారికి అడ్డుకట్ట వెయ్యాలి, లేకుంటే వారి అబద్ధాలే నిజం అని నమ్మే స్థితిలోకి ప్రజలు వెళతారు. అలా చేయాలి అంటే మనకి మన సనాతన ధర్మం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. దాని కొరకు మనందరం భగవద్గీతను తప్పక చదవాలి. అందరితో చదివించాలి. కంచి పరమాచార్య గారు చెప్పినట్టు మానవుని ప్రతీ సమస్యకి పరిష్కారం భగవద్గీతలో కనిపిస్తుంది.
స్వధర్మాన్ని ఆచరించడమంటే ధర్మాన్ని కాపాడుతున్నట్టే.
సర్వేజనా సుఖినోభవంతు.
మృశి
10.12.2024
తులసి మొక్కలను ప్రతి ఇంటిలో
మానవాళికి ఎక్కువ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి....!!
స్కంద పురాణంలో ఒక చక్కని శ్లోకం ఉంది.
అశ్వత్థమేకం పిచుమందమేకం
న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|
కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ
పంచామ్రవాపీ నరకన్ న పశ్యేత్||
అశ్వత్థ = రావి
(100% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)
పిచుమందా = నిమ్మ
(80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)
న్యగ్రోధ = మర్రి చెట్టు
(80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)
తింత్రిణి = చింత
(80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)
కపిత్థ = వెలగ
(80% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది)
బిల్వ = మారేడు
(85% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది)
అమలకా = ఉసిరి
(74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది)
ఆమ్రాహ్ = మామిడి
(70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది)
వాపి - నుయ్యి
ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు. (ప్రస్తుత కలుషిత వాతావరణం)
ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం.
రావి, మోదుగ, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది.
ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్‌ను పెంచుతాయి.
అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.
ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని
మూఢ నమ్మకాలుగా భావించి, ఈ చెట్లను దూరం చేసుకుని రహదార్లకు ఇరువైపులా గుల్మోహర్, యూకలిప్టస్ (నీలగిరి) చెట్లను నాటడం ప్రారంభించాం.
యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది,
కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి.
ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది.
గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది.
గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు.
పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||
మూలంలో బ్రహ్మ,
కాండములో విష్ణువు,
శాఖలలో శంకరుడు,
ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావికి నమస్కారాలు అని చెప్పబడినది.
తులసి మొక్కలను ప్రతి ఇంటిలో నాటాలి.
భవిష్యత్తులో మనకు సహజ ప్రాణవాయువు సమృద్ధిగా అందేలా ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
రావి, మఱ్ఱి, మారేడు, వేప, ఉసిరి మరియు మామిడి మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం.
భవభూతి మహాకవి
🙏భవభూతి మహాకవి🙏
భవభూతి పేరు తలచుకుంటే చాలు ఒళ్ళు పులకరిస్తుంది. విలక్షణము విశేష ప్రజ్ఞ కలిగిన కవి.
నాటకాలలో లక్షణ శాస్త్ర ప్రకారం ప్రధాన రసం శృంగారరసం గాని వీర రసం ఉండాలి మిగిలిన రసాలు అంగ రసాలు గానే ఉండాలి ప్రధాన రసంగా ఉండకూడదు. కానీ భవభూతి కరుణ రసాన్ని ప్రధానం చేసి ఉత్తరరామ చరిత్ర నాటకం వ్రాశాడు. లాక్షణికులు విమర్శించినా లెక్కచేయలేదు. అయితే నాటక ప్రపంచంలో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు గడించింది. నూతన ప్రయోగం చేసి విజయం సాధించిన ఘనుడు భవభూతి.
సంస్కృత మహాకవుల ఘనసంప్రదాయ పరంపరలో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, బాణుడు, దండి, భాసుడు, మొదలైన అద్భుత శారదా సంతతిలో ఒక దివ్యకర్పూరకళిక భవభూతి మహాకవి ఒకరు.
ఈ ఉత్తర రామాయణాన్ని భవభూతి ఆయన ఒక చోట కరుణ రసం ఒక్కటే రసం అని చెప్పాడు.
శ్లోకం. ఏకో రస కరుణ ఏవ నివర్తి ఖేదా
భిన్న పృథగ్ పృథగి వాశ్రయతే వివర్తా
ఆవర్త బుద్బుద తరంగ మాయాన్ వికారాస్
అంభో యధా సలిల మే వహి తత్సమస్తం
కరుణకు భావస్థాయి శోకం. ఎందుకంటే వాల్మీకి మొదటి శ్లోకం
“మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః|
యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం||”
ఓ కిరాతుడా! కామమోహితమైన క్రౌంచమిథునం లోని ఒక పక్షిని చంపి, నీవు శాశ్వతమైన అపకీర్తిని పొందావు, అంటూ శోకతప్త హృదయుడైన వాల్మీకి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. కాని తన మనస్సును కరుణరస పూరితమైన దృశ్యంనుండి మరల్చుకోలేక మథనపడసాగాడు. అతని మానసికస్థితిని గమనించిన బ్రహ్మ, వాల్మీకితో ‘నీవు శోకంతో ఉచ్చరించినది ఛందోబద్ధమైన శ్లోకమైంది. నీవు రామచరితమును రచింపుము. అది పర్వతాలు, నదులు ఉన్నంతవరకు శాశ్వతకీర్తిని సంపాదిస్తుంది’ అన్నాడు
వాల్మీకి మొదటి శ్లోకం కరుణ నుంచే ఉద్భవించింది. దాశరధీ కరుణా పయోనిధీ అని జనులు రాముడ్ని ప్రార్ధించడం అందుకే. ఈ ఉత్తర రామాయణంలో సీతా రాముల వియోగం, నిర్యాణం కారణంగా కరుణ రసం పతాక స్థాయిలో ఉంది. తిక్కన సోమయాజి నిర్వచనోత్తమ రామాయణం ( వచనం లేని, కేవలం పద్యకావ్యం) రచించాడు. తరువాత కంకంటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని చంపూ కావ్యంగా రాసాడు. నిజంగానే కవి అనేవాడు రాముడి మాట తలవకుండా ఉండలేడు. అంత శక్తి ఆకర్షణ ఉన్నవాడు రాముడు.
భవభూతి పేరు నుంచి ఆయన కాలం నిర్ణయంవరకు అన్నీ నిర్వివాదంగా చెప్పడం కష్టమనేచెప్పాలి. వీరు దక్షిణ భారతదేశంలోని పద్మపురంలో, వైదిక అనుష్ఠానపరులైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టేరు. వాజపేయయాగం చేసిన ఒక మహాకవి వీరి వంశపరంపరకి చెందినవారని చరిత్ర చెపుతోంది. ఈ వాజపేయ యాజివర్యుల తరంనుంచి లెక్కిస్తే భవభూతి ఐదవతరానికి చెందినవాడు. ఆ పరంపరలో భట్టగోపాలురవారు జన్మించేరు. వీరు వైదిక, లౌకిక విద్యలలో ఆరితేరి,అఖండఖ్యాతిని ఆర్జించేరు. వీరి పుత్రుడు నీలకంఠుడు కూడా తండ్రి అడుగుజాడలలో నడిచి అంతగానూ గణుతికెక్కేడు. నీలకంఠుడి కుమారుడే భవభూతి. ఐతే భవభూతి అసలుపేరు శ్రీకంఠుడు అనే వాదంవుంది. కొన్నిచాటూక్తులవల్ల ఇది నిజమేమోననిపిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం:—
“తపస్వీ కాం గతోsవస్థాం
ఇతి స్మేరాననావివ |
గిరిజాయాః స్తనౌ వన్దే
భవభూతి సితాననౌ” ||
“భవాత్ శంకరాద్వా భూతిః కావ్యనిర్మాణ దక్షతా విభూతిః ప్రజ్ఞా వా
సంప్రాప్తత్వేన భవభూతిరితి” |
“భవుడు అంటే శంకరునినుంచి, కావ్యనిర్మాణదక్షత అనే ఐశ్వర్యం లేక ప్రజ్ఞని పొందడంచేత భవభూతి అనే (పేరు వచ్చింది).” అని కొందరు నిర్వచించేరు.
భవభూతి తనరూపకాలు కాలప్రియానాథదేవ మహోత్సవాలలో భాగంగా ప్రదర్శితమైనట్లు చెప్పేడు. ఈ దేవుడు యమునాతీరంలోని “కాల్పి” లేక ‘కాలప్రియ’ లోవున్న సూర్యదేవుడని చరిత్ర నిర్ణయం.
సంస్కృతకవి ఐన భవభూతి, ప్రాకృత కవి ఐన వాక్పతిరాజు సమకాలికులే కాక వీరిద్దరూ యశోవర్మమహారాజు పాలించిన కనోజురాజ్యంలో ఆస్థానకవులుగా ప్రశస్తి పొందేరని చరిత్ర చెపుతోంది. వాక్పతిరాజు, భవభూతి రచనలగురించి ఇలాగ అన్నాడు:—
“సాగరసదృశాలైన భవభూతి రచనలు ఆఖ్యానరచనకు మార్గదర్శకాలు“. భవభూతి గురువు “జ్ఞాననిధిపరమహంస” అని తెలుస్తూంది. భవభూతి సాహిత్యంలోనేకాక వేద, వేదాంగాలలోను, వివిధశాస్త్రాలలోను అపారజ్ఞానం కలవాడు. ఆయన సాహిత్యంలో అనేకగ్రంథాలు రచించడమేకాక, అనేకశాస్త్రగ్రంథాలుకూడా వ్రాసిన దాఖలాలువున్నా,
1. “మహావీరచరితమ్ ” |
2. “మాలతీమాధవమ్ ” |
3. “ఉత్తరరామచరితమ్ ” |
అనే ఈ మూడు గ్రంథాలు మాత్రమే మనకి మిగిలేయి. మిగిలిన గ్రంథాలలోని శ్లోకాదులు అనేక ఇతర రచయితల రచనలలో ప్రాస్తావికంగానో లేక ఉదాహరణప్రాయంగానో మనలని పలకరిస్తాయి. వారి “మహావీరచరితమ్ ” రాముడి కథనే ఉత్తరకాణ్డ ముందు జరిగినది నాటకంగా మలచి మనముందుంచింది. “ఉత్తరరామచరితమ్ “లో వాల్మీకి ఉత్తరకాండలోని కథనే దృశ్యకావ్యరూపంలోపరమరమణీయంగా భవభూతి మనకి అందించేడు. కాళిదాసు, భవభూతి, భాసుడు,శూద్రకుడు వంటి నాటకకర్తలు సంస్కృత సాహిత్యంలో విశేష ఖ్యాతి గడించారు.. సోమదేవుడు, ధనంజయుడు, కుంతకుడు, క్షేమేంద్రుడు, మమ్మటుడు, మహిమభట్టు మొదలైనవారెందరో కవులు, లాక్షణికులు భవభూతిని శ్లాఘించి, వారి రచనలలోని అనేక శ్లోకాలని తమ-తమ గ్రంథాలలో ఉదాహరణాత్మకంగా వినియోగించుకున్నారు. వీటి అన్నింటిని అనుసరించి చూస్తే భవభూతి రచనాకాలం క్రీ.శ.700—730 ప్రాంతంగా చరిత్ర నిర్ణయం చేసింది. కవి,లాక్షణికుడు ఐన రాజశేఖరుడు తాను భవభూతికి అపరావతారంగా వర్ణించుకునేస్థాయికి, ఆయనకి భవభూతి పట్ల ఆరాధనాభావం వుంది.
తన తరవాత కాలంలో ఎంతో కీర్తి, ప్రతిష్ఠలు పొందిన భవభూతి, తన జీవితకాలంలో జనబాహుళ్యంలోను, రాజాస్థానాలలోను, సమకాలీన కవులలోను కూడా పేరు -ప్రఖ్యాతులు సంపాదించేడు. కాని కొందరు విమర్శకులు లేక రంధ్రాన్వేషకుల కాఠిన్యానికికూడా ఆయన గురి ఐనట్లు ఆయన రచనలలోని వారి ప్రతిస్పందనలు నిరూపిస్తున్నాయి. కవులకి, కళాకారులకి చరిత్రలో ఇవి క్రొత్త అంశాలు ఏమాత్రమూకాదు. మహాకవి భవభూతి మహామృదుహృదయుడు కావడంవల్ల వాటికి అంతగా నొచ్చుకున్నాడు. ఆయన బోధ, సందేశము మాత్రం అనితర సాధ్యమైన పని.
వాల్మీకి రామాయణంలోని ఉత్తర రామాయణ కథను ఇతివృత్తంగా గ్రహించిన భవభూతి ఆ మూలకథలో అనేక మార్పులు ప్రవేశపెడుతూ, కొత్త పాత్రలను కల్పిస్తూ, కొత్త కల్పనలను చేరుస్తూ ఉత్తరరామచరిత్ర నాటకాన్ని అద్వితీయంగా రచించాడు. మూలకథకు భిన్నంగా ఉత్తరరామచరిత్ర నాటకంలో సృష్టించిబడిన ప్రధాన మార్పులు, కల్పనలు చూద్దాము.
వాల్మీకి ఉత్తరరామాయణ కథ సీతా మరణంతో విషాదాంతం కాగా భవభూతి 'ఉత్తరరామచరిత్ర' సీతారాముల పునఃకలయికతో సుఖాంతం అవుతుంది.
వాల్మీకి ఉత్తరరామాయణ కథ సీతా ప్రాధాన్యంతో సీతా చరిత్రగా కొనసాగితే, భవభూతి 'ఉత్తరరామచరిత్ర' రాముడు ప్రధానంగా రామచరిత్రగా కొనసాగుతుంది.
మూలకథలో లేని ఆత్రేయి, తరళ, వాసంతి, తమస వంటి కొత్త పాత్రలు నాటకీయత కొరకు ఉత్తరరామచరిత్రలో కల్పించబడ్డాయి.
మూలకథకు భిన్నంగా కొత్త సన్నివేశాలను కల్పించబడ్డాయి: ఉదాహరణకు
వాల్మీకి ఆశ్రమంలో విదిచిపెట్టబడిన సీత గంగానదిలో దూకడం, గంగానదిలోనే ప్రసవించడం,
పాతాళలోకంలో సీత ఎవరికీ కనబడకుండా వుండటం,
పాతాళలోకంలో సీత భూదేవి, గంగలతో కలసి వుండటం,
రాముని విరహవేదనను, సీతావియోగ విలాపాన్ని అత్యంత కరుణరసభరితంగా వర్ణించడం
బాలుడైన చంద్రకేతువును యాగాశ్వానికి రక్షణగా పంపడం
సీతారాముల కలయిక సన్నివేశం మొదలైనవి
.
నభూతో నభవిష్యతిగా కరుణరసానికి పట్టం కట్టిన ఈ నాటకంలో చిత్రితమైన మహోన్నత పాత్రలు, ఉదాతమైన విలువలు, కళాత్మకత, అత్యంత కరుణరస ప్లావితమైన కథా సంవిధానం మొదలైనవి ఈ నాటకాన్ని మహత్తర నాటక కావ్యంగా, సంస్కృత సాహిత్యంలో అత్యధిక నాణ్యత సరసన సమున్నతంగా నిలబెట్టాయి. ఈ సంస్కృత నాటకం అన్ని భారతీయ భాషలలోనే కాకుండా ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ తదితర యూరోపియన్ భాషలలో సైతం అనువదించబడింది. ఈ నాటక రచనలో భవభూతి చూపిన ఒరవడి ఇతర నాటక కర్తలకు ప్రేరణ కలిగించింది.
భవభూతి రచించిన ఉత్తరారామచరిత్ర నాటకాన్ని ఆదర్శంగా తీసుకొన్న తరువాత తరం కవులు భవభూతి వలె మూల రామాయణంలో మార్పులు చేరుస్తూ, కొత్త సన్నివేశాలను సృష్టిస్తూ, మూలకథకు భిన్నంగా సరికొత్త రూపాలలో సంస్కృత రామాయణ నాటకాలను రాయడం ప్రారంభించారు. వీరిలో శక్తి భద్రుడు (ఆశ్చర్యచూడామణి), మాయురాజు (ఉదాత్త రాఘవం), రాజశేఖరుడు (బాల రామాయణం), దిజ్ఞాగుడు (కుందమాల) మొదలైనవారు ముఖ్యులు. అయితే భవభూతి పెట్టిన ఒరవడిలో అనుకరిస్తూ వచ్చిన తదనంతర రామాయణ నాటకాలలో దిజ్ఞాగుని "కుందమాల" లాంటివి కొన్ని తప్ప మిగిలినవి అంతగా ప్రజాదరణను పొందలేకపోయాయి.
కుందమాల గురించి వేరే వ్యాసం వ్రాస్తాను.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
గాడిద బ్రతుకు
*గాడిద బ్రతుకు*
ఆ నాలుగు కూడలిలో ఎప్పుడూ ట్రాఫిక్ రద్ధీగానే ఉంటుంది. ఆ కానిస్టేబుల్ వాహనలను అదుపుచేయడానికి వీలుకాక సతమతమవుడం నేను ఎన్నో సార్లు చూసాను. ఆ ట్రాఫిక్కుకు తోడు ఈ రోజు మధ్యాహ్నం గుంపు గుంపుగా జనం అక్కడ గుమిగూడుతున్నారు. ఏమయిందని ఓ సారి దగ్గరికెళ్ళి చూసాను.
ఊరేగింపులా కనబడింది. ఓ గాడిదను కుంకుమ పుష్పాలు పసుపుచందనాలతో సింగారించి ఏదో దేవుని ఛాయాచిత్రాన్ని పుష్పాలతో అలంకరించి ఊరేగింపుగా తీసుకొని వెళుతున్నారు. గాడిద పై భగవంతుడి ప్రతిమ ఏంటని ఆరా తీయకండి. ఏదో మొక్కుబడి కాబోలు. ఊరి వెలుపుల ఉన్న చెరువు దగ్గర పూజలున్నాయని అందువలనే ఈ ఊరేగింపని ఆ జనసమూహంలో అంటూండగా విన్నాను.
ఆ గాడిదను భగవంతుడిని జనసమూహం మ్రొక్కుకొంటున్నారు. హారతి దీపాలు ప్రసాదాలు సమర్పించుకొంటున్నారు. సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. భక్తుల ఆరాధన నిమిత్తం అక్కడక్కడ ఊరేగింపును నిలిపి అందరికి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలా చెరువు దాకు రెండు కిలోమీటర్ల దూరం అధిగమించడానికి వారికి రెండు గంటల సమయం పట్టింది.
నేను కొంతసేపు వీక్షించి నా గృహం వైపు మరలాను. సాయంత్రం మళ్ళీ అటు ఆ నాలుగు రోడ్ల కూడలి వైపు ఏదో పనిమీద వెళ్ళాను. అప్పటికే చెరువు దగ్గర పూజ ముగిసినట్టుంది. జనమంతా వెనుదిరిగి వస్తున్నారు. ఆ గాడిద కూడా ఉంది. కాని ఈ సారి గాడిదపై దేవుడి ప్రతిమ లేదు, అలంకరణ కూడా లేదు. ఇందాకా చూసిన గాడిదేనా ఇది అన్నట్టు కనబడింది. జనమెవ్వరు ఆ గాడిదను పట్టించుకోలేదు. గాడిద కూడా ఏదో చిన్నబోయినట్టు కనిపించింది. వారందరి దృష్టిని తన వైపు మరల్చి మధ్యాహ్నం లాగా అందరితో మ్రొక్కించుకోవాలని ప్రయత్నించడం మొదలెట్టింది. ఓండ్ర పెట్టింది. ఎవరైనా అటువైపు చూస్తే కదా, వారందరూ చూసినా ఈ సారి మ్రొక్కకుండా దాని అరుపులను భరించుకోలేక గాడిదను రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు. ఆ ధాటికి తట్టుకోలేక గాడిద పలాయనం చిత్తగించింది.
మన అంటే విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అలాగే మరి. ఉద్యోగాల్లో ఉన్నంత దాకా ఎంతో వైభవాలను అనుభవించాం. దీపావళి వస్తుందంటే ఓ వారం ముందు నుండి ఖాతాదారులు, సరఫరాదారులు, తోటి ఉద్యోగులు ఇలా ఎందరో దీపావళీ శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లనీ, డ్రైఫ్రూట్సనీ, తాజాపండ్లనీ బహుకరించేవారు. చాలామటుకు ఇలాంటి బహుమతులను తోటి ఉద్యోగస్తులకు పంచి మిగిలింది ఇంటికి తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఇక ఇంట్లో స్వీట్లు సేవరీలని చేయడం దండగ. వీటితోనే సరిపుచ్చుకొనేవాళ్ళం.
కాని ఇప్పుడు పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. పదవీ విరమణ గావించిన తర్వాత ఇదే మొదటి దీపావళి. ఎవరైనా మన పాత పరిచయాలు, స్నేహితులు, ఉద్యోగులు వస్తారా అని ఎదురుచూడడంతోనే కన్నులు కాయలు కాచాయి. ఒక్కరైనా మన ఇంటివైపు వారి దృష్టిని మరల్చిన పాపానికి పోలేదు. మధ్యాహ్నం దాకా ఇలాగే గడిచిపోయింది. దీపావళి ఎలాగైనా జరుపుకోవాలిగా మరి. ఏదో వీలయినకాడికి స్వీట్లు హాట్లు అని స్వతహాగా చేసుకొన్నాం.
మన విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి ఆ గాడిద పరిస్థితి లాంటిదే. దేవుడి ప్రతిమ తనపై ఉన్నంతకాలం అలంకరణలు, మొక్కుబడులు, నైవేద్యాలు, నమస్కారాలు అన్నీ కొనసాగాయి. ఒక్కసారి భగవంతుని విగ్రహం తన వీపు నుండి తొలగిన తర్వాత దానిని ప్రజలు ఛీ కొట్టిన వాళ్ళే కాని ఎవ్వరు ముట్టుకున్న పాపానికి కూడా పోలేదు.
గాడిద బ్రతుకు అంటే ఇదేనేమో.
కుతూహలం
ఇండియా లో సందుకో గుడి ఉంటుంది. భక్తులు డబ్బులు, కానుకలు తెగ వేస్తారు అసలు ఆ డబ్బంతా ఏం చేస్తారు అని పాశ్చాత్య దేశం లో ఓ మేధావికి కుతూహలం పుట్టి.దీనిమీద
డాక్యుమెంటరీ వ్రాయాలి అనుకుని వెంటనే మన రాష్ట్రానికి వచ్చాడు. ఆరోజు రెస్ట్ తీసుకుని ఏ దేవాలయానికి వెళ్తే ఇన్ఫర్మేషన్ సరిగా వస్తుందో తర్జన భర్జనలు పడి హోటల్ ఓనర్ కి
విషయం చెప్పి అడిగితే మామూలు రోజుల్లో ఎక్కువ గా రద్దీ వుండని. ఈ మేధావికి కావలసిన సరైన సమాచారం ఇచ్చే జ్ఞాని అయిన పూజారి వుండే శివాలయానికి వెళ్ళమని చెప్పాడు.
మర్నాడు తీరికగా హోటల్ ఓనర్ చెప్పిన శివాలాయనికి ఆ మేధావి డాక్యుమెంటరీ కోసం వచ్చాడు.. అక్కడ పూజారి గారు ఎర్ర పట్టువస్త్రం లాటిది కట్టుకుని వున్నారు.. ఆ ప్రక్కన మరో భారీకాయం టేబుల్ దగ్గర కుర్చీ లో కూర్చుని ఉన్నాడు. ఆ ప్రక్కన రెండు చేతులకి 10 ఉంగరాలు పెట్టుకుని మరో భారీ కాయం ఉంది.. భక్తులు వస్తున్నారు ఆ రెండో భారీ కాయం అప్పుడప్పుడు వచ్చే భక్తులపై ఏవేవో అరుస్తున్నాడు..
భక్తుల రద్దీ అయిన తర్వాత మన మేధావి పూజారి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్ళాడు.. ఇంగ్లీష్ భాష లో మీతో చిన్న ఇంటర్వ్యూ కావాలి అన్నాడు...పూజారి గారు యం ఏ చదువుకున్నారు. ఒంటి గంటకి ఫ్రీ అవుతాను వీళ్లిద్దరూ కూడా వెళ్ళిపోతారు వైట్ చెయ్యండి అని ఇంగ్లీష్ భాష లో చెప్పి దర్శనం చేయించి తీర్థం ఇచ్చి శఠగోపం పెట్టేసారు..
అది మొదటి భారీ కాయానికి అర్ధం కాలేదు..రెండో భారీ కాయం హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాట్సాప్ లో ఎదో చూస్తున్నాడు ..మొదటి భారీ కాయం ఏంటట అని గర్జించాడు. అబ్బే ఏమీ లేదు చిన్న ఇంటర్వ్యూ కావాలట అని పూజారిగారు చెప్పారు, దానికి ఆ భారీ కాయం ఇక్కడ ఇంటర్ చదివే వాళ్ళు ఎవరూ లేరని చెప్పండి. ఈ లోపల ఒంటి గంట అయ్యింది ఆ రెండు భారీ కాయాలు సాయంత్రం 5 గంటలకు వస్తాం అని చెప్పి తమ స్వంత కార్లలో
వెళ్లిపోయారు.. పూజారి గారు గర్భ గుడికి తాళం వేసి గుడి ఆవరణ ల్ ఓ చల్లని చెట్టు క్రింద బెంచి పై ఆ మేధావిని కూర్చోబెట్టి తాను కూర్చుని ఇప్పుడు అడగండి మీకు ఏం కావాలో అన్నారు.. అప్పుడు మేధావి సార్ మీకు భక్తులు డబ్బు, కానుకలు చాలా ఇస్తారు అవి దేముడు మీరు ఎలా పంచుకుంటారు అని అడిగుతూ పూజారి గారిని నిశితంగా పరిశీలించాడు. పూజారి గారు బాగా బక్కగా ఉన్నా మంచి ఆరోగ్యం తో వున్నాడు..
భక్తులు డబ్బులు, కానుకలు తెగ వేస్తారు. అసలు ఆడబ్బంతా ఏమి చేస్తారు? అని అడిగాడు మేధావి పూజారిగారిని.
పూజారి గారు డబ్బు, కానుకలు అని పేలవంగా ఓ నవ్వు నవ్వాడు.. అది పూర్వ వైభవం నాయనా గుళ్ళకి మాన్యాలు ఉండేవి రాజులు పూజారులకి ఎకరాలు పొలాలు ఇచ్చేవారట. ఇప్పుడు చాలామంది పూజారులకి రోజు గడవడం కష్టంగా ఉంది నాయనా అన్నారు.
ఇంటరెస్టింగ్ గా ఉంది విపులం గా చెప్పండి అన్నాడు మేధావి. డబ్బు, కానుకలు ఒకప్పటి మాట నాయనా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు..నేను ఎం ఏ చదివాను ఉద్యోగం కూడా వచ్చింది ఈ అర్చకత్వం అనువంశికం గా వస్తోంది మా నాన్నగారు ఓ 40 ఏళ్ల క్రితం చనిపోవడం వల్ల నాన్నగారి భాద్యత ఉద్యోగం వదిలి నేను తీసుకున్నాను.. ప్రస్తుత పరిస్థితి లో ప్రతీ గుడి కి పాలక మండలి ఉంటుంది ఈ గుళ్లు పై వచ్చే ఆదాయ పర్యవేక్షణ కి ఓ ప్రభుత్వ శాఖ ఒకటి ఉంటుంది. ఆదాయం ఉన్న ఏ గుడి అయినా ఆ ప్రభుత్వ శాఖ ఆధీనం లో కి వచ్చేస్తుంది. ఇందాక గుడిలో పది ఉంగరాలు పెట్టుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాఁట్సప్ చూస్తున్నవాడు ఆ ప్రభుత్వ శాఖ ఉద్యోగి. వచ్చిన భక్తులని డబ్బులు కానుకలు హుండీ లో వెయ్యండి అని గదమాయిస్తూ ఉంటాడు. ఇప్పటి దాకా ఎంత మింగాడో వాడికే తెలియదు. ఉద్యోగం లో చేరిన క్రొత్తలో వాడికి సైకిల్ కూడా లేదు ఈ రోజు ఓ కారు మూడు ఫ్లాట్ లు ఉన్నాయి. రూల్ ప్రకారం భక్తులు పళ్ళెము లో వేసినవి మాకు చెందుతాయి హుండీ లో వేసినవి మాకు చెందవు. ప్రతీ భక్తుడు హుండీ లో నే కానుకలు వేసేలా చూడడమే వాడి కర్తవ్యం.దేవాలయాల ఆస్తులు వాటి పై వచ్చే రాబడి అవి ఇవి చూస్తుంటాడు ఇక భక్తులు పెద్దనోట్లు హుండీ లో వేసి చిల్లర,దొంగ నోట్లు చిరిగి అతికించబడిన నోట్లు మా పళ్లెం లో వేస్తారు..ఓ అరవై మంది పేర్లు చెప్పి అర్చన చేయిస్తారు కానీ సర్వే జనాః సుఖినో భవంతు అని ఒక్కడూ అడగడు. ఒకవేళ ఎవరైనా దైర్యం గా పెద్ద నోటు పళ్లెం లో వేస్తే అది వీరు చూస్తే ఆ రోజు మాకు నరకమే… ఇక ఎవరైనా భక్తులు అమ్మవారికి ఖరీదైన చీర పెడితే ఆ ప్రభుత్వం నియమించిన ఉద్యోగి తన కర్తవ్యం మర్చిపోయి ఆ చీరని లటుక్కుమని మాయం చేస్తాడు.. ఇక మొదటి భారీకాయం పాలక మండలి చైర్మన్,, సారా కాంట్రాక్టర్.. భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలు ఈయన ఇంట్లో నే ఉంటాయి. ఏదో ఉత్సవాలకు మాత్రామే బయటకు వస్తాయి..
ఇక అన్నీ వేలం పాట లే. గుడిముందు కొబ్బరి కాయల దుకాణం నించి ప్రతీది వేలం వేస్తారు.. టిక్కట్లు అమ్మకం లో కుంభకోణాలు, ప్రసాదం కౌంటర్ లో కుంభకోణాలు. అమవారికి భక్తులు పెట్టే చీరలు జాకెట్ ముక్కలు కూడ వేలం వేస్తారు..
చివరికి భక్తులు కొట్టే కొబ్బరి కాయ కి కూడా వేలం పాటే. కాయలో క్రింద సగం భక్తుడు కి ఇవ్వాలి. పై భాగం ఎవరో హోటల్ వాళ్ళు వేలం పాడుకుంటారు. ఆ సగం చిప్ప కూడా మాకు దక్కదు.. చాలీ చాలని జీతం ఇస్తారు, అందులోనే నైవేద్యం మేమే వండాలి
ఈ పూజరిని ఎలా ఎప్పుడు పీకేయ్యాలా, మనకి అనుకూలం గా ఉండేవారిని ఎలా పెట్టుకోవాలా అని ఆలోచిస్తారు.. ఆ ప్రభుత్వ ఉద్యోగి మా చేత చెప్పులు కూడా మోయిస్తాడు. దొంగ తనాలు అంటకడతారు కొందరు పూజారులు వీళ్ల టార్చెర్ భరించలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.. నాయనా.
గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు పరాయి రాష్ట్ర దేముళ్లపై పడుతున్నారు.. చిన్న దేవాలయాల పరిస్థితి ఘోరం గా తయారయ్యింది.. రామాలయాలు వీళ్ళకి శ్రీరామనవమి నాడే గుర్తుకువస్తాయి. రామాలయం లో పని చేసే పూజారుల పరిస్థితి మరీ ఘోరం.. ఈ సందు చివరన ఉంది అక్కడికి కూడా ఓ సారి వెళ్లి చూడండి.
మధ్యలో మేధావి.. మరి ఎలా బ్రతుకుతున్నారు..
నమ్ముకున్న దేముడిని పూజారి వదిలే ప్రసక్తి లేదు.
కొంచెం ఆయుర్వేదం, హోమియోపతి, జాతకాలు, వాస్తు జ్ఞానం ఉంటుంది భక్తుల కు నమ్మకం ఎక్కువ.
పల్లెటూళ్ళలో ఎవరికైనా జ్వరం వస్తే ముందు గుడి పూజారి దగ్గర కే వెళ్లేవారు ఆయన నేర్చుకున్న వైద్య జ్ఞానం తో మందు ఇస్తారు.. కొందరు భక్తులు పూజారి కి ఇస్తే మంచిది అని భావించి మాకు గుప్తం గా సాయం చేస్తుంటారు..
దారుణం ఏమిటంటే 1983 నించి కంచె లా దేవాలయాలని కాపు కాయవలసిన ప్రభుత్వమే దేవాలయాల ఆస్తులపై పడుతోంది..
దేముడి సొమ్ము తినే ఎవరైనా సరే ఆఖరికి పొందేది అధోగతే..
మరి ఇవన్నీ చూసి మీ దేముడుకి కోపం రాదా ఆయన ఏమీ చెయ్యడా.. అని మేధావి అడిగారు..
మంచి ప్రశ్న వేశావు నాయనా.. నీకు కోట్ల ఆస్తి ఉంది లేక లేక నీకు ఓ కొడుకు పుట్టాడు. వాడికి నువ్వు వాడి ప్రధమ జన్మదినానికి ఓ 10 లక్షలు పెట్టి చైన్ చేయించి మెడలో వేస్తావు, ఓ 5 లక్షలు పెట్టి వజ్రాల ఉంగరం చేయించి వెలికి పెడతావు. ఓ 10 వేలు పెట్టి బట్టలు కొని వేస్తావు. బర్త్ డే పార్టీ కి పుర ప్రముఖుల్ని పిలుస్తావు సాయంత్రం పార్టీ పెడతావు..
అందరూ వస్తారు. బుగ్గలు నిమిరి ముద్దులు పెడుతుంటారు. కానీ వాడి కళ్ళు ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాయి.. నువ్వు చేయించిన బంగారం కానీ వజ్రాల ఉంగరాలు కానీ 10 వేలు పెట్టి కొన్న బట్టలని వాడు పట్టించుకోడు..
పార్టీ కి పెద్ద వాళ్ళు వస్తారు అని ఎక్కడో రూమ్ లో బంధించబడిన రోజూ తనతో ప్రేమగా ఉంటూ తనని ఆడించే లాలించే తాతా నానమ్మ, తోటమాలి ల కోసమే వాడి కళ్ళు వెతుకుతుంటాయి..
ఆ విధం గానే దేముడు కూడా తనే లోకం గా బ్రతికే భక్తుల కోసమే ఎదురు చూస్తుంటాడు. ఈ మాన్యాలు, ఆస్తులు ఆభరణాలు ఆయన పట్టించుకోడు.. నీ ఆనందానికి నువ్వు నగలు గట్రా చేయిస్తున్నావు, ఆయన ఏన్నడూ నాకు ఫలానా ది కావాలి అని అడగడు.. ఆయన సృష్టించిన వాటిని ఆయనకే ఇవ్వడం ఏమిటి.. మీ దేముడు ఏమీ చెయ్యడా అని ఆడిగావు మా అమ్మవారు ఊరికి కాపలా కాస్తూ ఉంటుంది. అయ్యవారు స్మశానం లో కూర్చుంటాడు.
ఎవరు పోయినా బంధు, మిత్ర జనం స్మశానం వరకే వస్తారు అక్కడ నించి అయ్యవారు చూసుకుంటారు..అని చెప్పారు.. ఈ లోపల పూజారి గారు పులిహోర చక్రపొంగలి ఆ మేధావికి పెట్టి మంచినీళ్ళు ఇచ్చారు.
మేధావి మస్తిష్కాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన మేఘం ఆవరించింది..
మరి మీ దేముడికి వీళ్ళు మంచివాళ్ళు కాదు నా సొమ్ము తినేస్తారు అని ముందే తెలియదా అని అడిగాడు..
చూడు నాయనా దైవ వాసన లేనిదే ఆయన ప్రమేయం లేకుండా ఆయన సన్నిధి లో ఉండటం ఎవరికీ సాధ్యం కాదు.. పైగా దేముడు ఎవరి ఋణమూ ఉంచుకొడు.. వీరు గత జన్మలలో ఉత్సవాలలో పల్లకీ లు మోసే వాళ్ళో, త్యాగరాజు అన్నమాచారి కీర్తనల కచేరీ లో వెనక నించి చిడతలు, సన్నాయి, తాళాలు వేసే వారో రకరకాలైన దైవ సేవలలో పాలు పంచుకున్నవారో అయ్యివుంటారు వారు సేవ చేశారు, దానికి ఫలం ఈ విధం గా ఇచ్చాడు. ఈ సదవకాశాన్ని ఇప్పుడు వారు దుర్వినియోగం చేసుకుంటున్నారు..
మరి ఉత్తమ మార్గం లో కి పోవాలంటే ఏమి చెయ్యాలి అని మేధావి అడిగాడు..
బాబూ ముందు తల్లి తండ్రులకి సేవ చెయ్యాలి..
మానవసేవ ని మించింది లేదు.. ప్రతిఫలం మీద కోరిక లేకుండా, తిండి లేనివాడికి అన్నదానం, చదువుకునే స్తోమత లేనివారికి విద్యాదానం లాటివి చేస్తే ఉత్తమ మార్గం లో కి వెళ్లడం సాధ్యం అని చెప్పారు పూజారి గారు.
మేధావి లేచి బ్యాగ్ లోంచి పూజారిగారికి ఇవ్వడానికి చాలా డబ్బు తీశాడు.. పూజారిగారు అది నాకు వద్దు. మా అబ్బాయి బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నాడు నాకు డబ్బు.పంపిస్తున్నాడు. ఈ సందు చివర రామాలయం ఉంటుంది ఆ ప్రక్కనే పాక లో పూజారిగారు వుంటారు.
రామాలయ పూజారుల పరిస్థితి అంతగా బాగోలేదు. ఆయన చాలా ఆర్ధిక ఇబ్బందులతో వున్నారు. ఆయనకి ఇమ్మని చెప్పారు.
ఆయన చెప్పిన విధంగా నే ఆ సందు చివర రామాలయం ప్రక్కన ఉన్న పాకలోకి మేధావి వెళ్ళాడు. అక్కడ ఇంట్లో పరిస్థితి చూసి నేను చాలా పోరబాటుగా ఆలోచించాను అనుకుని వృద్ధ పూజారి గారిని కలిసి జరిగినది అంతా చెప్పి నాకు ఇంకా జ్ఞానం కావాలి అని మేధావి అడిగాడు.
ఆయనకు ఆయన ఆర్ధిక సమస్యలు అన్నీ తీరిపోయి సుఖం గా బ్రతకడానికి సరిపోయే డబ్బు ఆయన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఆతిధ్యం స్వీకరించాడు. పూజారిగారు నా కష్టాలు చూసి రాముడే ఈయనని ఈ విధం గా పంపాడు అనుకున్నాడు.. మేధావి గారు పూజారి గారిని కదిలిస్తే ఆధ్యాత్మిక విషయాల మీద చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది.
నువ్వు కాశీ ఒక్కసారి వెళ్ళు అక్కడ నీకు అంతా తెలుస్తుంది అని చెప్పారు రామాలయం పూజారిగారు.
ఒక్క రోజులో ఒక చిన్న సంభాషణ ఒక పెను మార్పు తెచ్చింది. ఇంతమంది జ్ఞానులు చుట్టూ వున్నారు వివిధ రకాలైన మాధ్యమాలద్వారా జ్ఞానం మనచుట్టూ పారుతూనే ఉంటుంది.. అయినా మన జనాలలో మార్పు ఎందుకు రాదో ఎవరికీ అర్థం కాని ప్రశ్న…..
ఇది మన పూజారుల పరిస్థితి .
నువ్వు కాశీ ఒక్కసారి వెళ్ళు అక్కడ నీకు అంతా తెలుస్తుంది అని చెప్పారు రామాలయం పూజారిగారు.
సత్యాన్వేషణ కోసం మేధావి కాశీ వెళ్ళిపోయాడు.. (శంకరకృప ఆధ్యాత్మిక పత్రికనుంచి సేకరణ )
మద్యం నశించాలి*
*మద్యం నశించాలి*
****** *******
*తాల్లల్ల చూడండి హిందువులే*
*ఈదులల్ల చూడండి హిందువులే*
*గుడుంబా అడ్డాలో చూడండి హిందువులే*
*వైన్ షాపు ముందు చూడండి హిందువులే*
*బెల్టుషాపు దగ్గర చూడండి హిందువులే*
*పబ్బుల్లో చూడండి హిందువులే.*
*ఇతర మతస్థులందరూ వారి వారి పనులు ప్రార్థనలు చేసుకొంటూ ఐకమత్యంతో ఆనందంగా ఉంటున్నారు.*
*👉ఒక్క హిందువు మాత్రం మత్తుకు బానిసై హైందవ ధర్మానికి దూరమై, పనిని చులకనగా చూస్తూ,మత్తును మజా చేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు.*
*ఇతర మతస్థులు మాత్రం చిన్నపని పెద్దపని అనే చిన్నచూపు లేకుండా దొరికిన ప్రతి పనినీ సంతోషంగా చేస్తూ,ఇంటిల్లిపాది ఆనందంగా జీవనం సాగిస్తున్నారు.*
*కానీ...*
హిందువులు మాత్రం
*🍷పొద్దున్న లేస్తే మద్యం, పొద్దు గూకితే మద్యం*
*🥂పుడితే మద్యం చస్తే మద్యం.*
*🥃బాధ కలిగితే మద్యం, ఆనందం అనిపిస్తే మద్యం.*
*🍺పండగైనా మద్యమే,పావుకిలో చికెన్ వండుకున్నా మద్యమే*
*🍻పెళ్లి జరిగినా మద్యమే,చావు జరిగినా మద్యమే*
*🍾మిత్రుడు కలిసినా మద్యమే,శత్రువు కలిసినా మద్యమే*
*అడుగడుగునా మద్యం.అనుక్షణం మద్యం.*
*👉పూర్వం పెద్దలు పెత్రమావాస్యకో,దసరాకో ఏదో కొంత మొక్కుబడిగా మద్యం ఆరగింపు చేసి తాగేవారు.నేడు పండుగ లేదు.పబ్బం లేదు. వారం లేదు. దినం లేదు. ఎనీటైం మద్యం మద్యం మద్యం.*
*👉ఈ మద్యం మహమ్మారి అత్యధికంగా మన హిందులనే ఆవహించింది.*
*👉ఈ మద్యం ప్రమాదం ఎంతగా పెచ్చుమీరిందంటే, తాగకండి అని చెబితేనే నేరం అనే అంతగా తయారయ్యింది. తాగి తాగి మీ జీవితాలను నాశనం చేసుకోకండని ఎవరైనా చెబితే వారు ఉరుమిరిమి చూస్తున్నారు. తాగడానికి డబ్బులు దొరకకపోతే ఇంట్లో గొడవలు. వైన్స్ లో ఉద్దెర మద్యం ఇవ్వకపోతే ఇక్కడ గొడవలు. మొత్తానికి ఈ మద్యంతో పెద్ద చిక్కు వచ్చిపడింది. ఈ మద్యం మనుషుల జీవితాలను సర్వనాశనం చేస్తున్నా,ఈ ప్రభుత్వాలు మాత్రం తాగేవారిని ప్రోత్సహిస్తూ బుజ్జగిస్తూ పెగ్గు మీద పెగ్గు తాగిస్తూ ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది. సమాజం మత్తుతో చిత్తవుతున్నా ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తోంది.*
*🙏🏻ప్రజలారా! ప్రభుత్వం మత్తుతో వ్యాపారం చేస్తోంది. మనకు చెడు అలవాట్లను అంటగట్టి,మన డబ్బులు లాక్కొని మనల్ని బలహీనులుగా చేస్తోంది. మద్యం మత్తు నుండి మనల్ని ఏ ప్రభుత్వం దూరం చేయదు.మనకు మనమే కళ్లు తెరవాలి. మనది మనకే జ్ఞానోదయం కావాలి. మద్యం మహమ్మారికి దూరంగా ఉండండి🙏🏻*
*మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి🙏🏻🙏🏻*
సమస్య పూరణ.
*జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్*
ఈ సమస్యకు నాపూరణ.
జాతికి సేవజేయుదును సారెకు సారెకు నాకు దీవనల్
ప్రీతిగ నిచ్చి నేతగను పీఠము నందున నుంచగా వలెన్
వేతనమేల రూకొకటి పేరుకు చాలును స్వార్థమేదిటన్
జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్.
అల్వాల లక్ష్మణ మూర్తి.
త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయం*
🕉 *మన గుడి : నెం 526*
⚜ *కేరళ : త్రిస్సుర్*
⚜ *త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయం*
💠 త్రిప్రయార్ శ్రీ రామస్వామి దేవాలయం కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలోని త్రిప్రయార్‌లో ఉన్న హిందూ దేవాలయం.
విష్ణువు యొక్క 7వ అవతారమైన రాముడు, నాలుగు చేతులతో శంఖం, చక్రం, విల్లు మరియు దండoను కలిగి ఉంటాడు.
💠 ఈ ఆలయం కరువన్నూర్ నది ఒడ్డున ఉంది, దీనిని త్రిప్రయార్ గుండా ప్రవహిస్తున్నప్పుడు తీవ్రా నది అని పిలుస్తారు
🔅 *నలంబలం*
💠 నలంబలములుగా ప్రసిద్ధి చెందిన దశరథ మహారాజు యొక్క నలుగురు కుమారులు ఉన్న నాలుగు దేవాలయాలలో ఇది మొదటిది , మిగిలినవి ఇరింజలకుడలోని కూడల్మాణిక్యం దేవాలయం భరతుడు , తిరుముజికూలం ఆలయం లక్ష్మణుడు మరియు పాయమ్మాళ్ శత్రుఘ్నల ఆలయాలు.
మలయాళ మాసం కర్కడకంలో ఒకేరోజు ఈ ఆలయాలను పూజించడం శుభప్రదమని, అందువల్ల చాలా మంది భక్తులు ఈ ఆలయాలను సందర్శిస్తారని నమ్ముతారు .
పై ఆలయాలను కేరళలోని నలంబలం (నాలుగు దేవాలయాలు) అని పిలుస్తారు.
నలు అంటే "నాలుగు" మరియు అంబలం అంటే "ఆలయం".
రాముడు , భరతుడు , లక్ష్మణుడు , శత్రుఘ్నుడు వరుసగా నాలుగు ఆలయాలను సందర్శించడం ఆనవాయితీ.
🔆 *స్థల పురాణం*
💠 త్రిప్రయార్ దేవాలయంలోని రాముడిని త్రిప్రయార్ తేవర్ లేదా త్రిప్రయారప్పన్ అని పిలుస్తారు. శ్రీరాముని మూల దైవాన్ని ద్వారకలో శ్రీకృష్ణుడు పూజించాడు.
శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టి, తిరిగి వైకుంఠంకు వెళ్లినప్పుడు, ఈ రాముడు విగ్రహం సముద్రంలో మునిగిపోయింది.
💠 కేరళలోని చెట్టువ ప్రాంతానికి సమీపంలో కొంతమంది మత్స్యకారులు దీనిని కనుగొన్నారు మరియు ఆ సమయంలో స్థానిక పాలకుడిగా ఉన్న వక్కయిల్ కైమల్ త్రిప్రయార్ వద్ద అతను నిర్మించిన ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించాడు.
💠 కాలక్రమేణా, శ్రీరాముని విగ్రహం అరిగిపోయింది మరియు అతను విగ్రహాన్ని మార్చడం ఇష్టం లేనందున, పంచలోహ వస్త్రం తయారు చేయబడింది మరియు అసలు రాతి ప్రతిమను దానితో కప్పారు.
💠 ఈ ఆలయం తీవ్రా నది ఒడ్డున ఉంది, దీనిని పురాయార్ అని కూడా పిలుస్తారు, ఈ ప్రదేశానికి తిరుపురాయర్ అని పేరు వచ్చింది మరియు తరువాత త్రిప్రయార్ అని పిలువబడింది.
💠 ఈ పవిత్ర నది యొక్క మూలం గురించి స్థానిక ప్రజలు ఒక ఆసక్తికరమైన పురాణాన్ని చెబుతారు. శ్రీమహావిష్ణువు వామన అవతారంలో వచ్చినప్పుడు, అతను త్రిక్కక్కరకు ప్రయాణిస్తూ, మార్గమధ్యంలో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు.
ఆ ప్రాంతమంతా పొడిగా ఉండడంతో మురికి కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు దొరకడం లేదు.
అతను తన కమండలులోని నీటిని వాడి కాళ్ళు కడుక్కొన్నాడు.
అప్పటి నుండి, నీటి వనరు ఎండిపోలేదు మరియు ప్రవహిస్తూనే ఉంది. దీనిని ఇప్పుడు త్రిప్రయార్ లేదా తిరు పురాయార్ అని పిలుస్తారు.
💠 ఉత్సవాలు :
పూరం మరియు ఏకాదశి వరుసగా మార్చి-ఏప్రిల్ మరియు నవంబర్-డిసెంబర్లలో జరుపుకుంటారు, ఇవి రామ స్వామి ఆలయంలో ఏటా జరుపుకునే రెండు పండుగలు.
ఏకాదశి పండుగ సందర్భంగా 21 ఏనుగులతో ఊరేగిస్తారు.
ఈ వేడుకలో పాల్గొనేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.
🔅 త్రిప్రయార్ ఏకాదశి
💠 త్రిప్రయార్ ఏకాదశి మధ్య కేరళలో ప్రసిద్ధి చెందిన పండుగ.
ఇది "వృశ్చికం" (నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు), పౌర్ణమి తర్వాత 11వ రోజు "ఏకాదశి" నాడు జరుపుకుంటారు.
దీనినే "కరుత పక్ష ఏకాదశి" అని కూడా అంటారు.
అయితే, గురువాయూర్ లో అమావాస్య తర్వాత ఏకాదశికి ప్రాధాన్యత ఇస్తారు.
ఏనుగులు మరియు డోలు కచేరీ "మేళం" పండుగకు ప్రసిద్ధి చెందాయి.
💠 రాముడితో పాటు, శివునికి దక్షిణామూర్తి, గణేశుడు, శాస్త మరియు కృష్ణుడు వంటి ఆలయాలు ఉన్నాయి మరియు హనుమంతుడు మరియు చాతన్‌లకు కూడా పూజలు ఉన్నాయి.
🔅 మీన్ ఊట్టు
💠 గుడి ముందు ప్రవహించే పురాయర్ ఆలయంలో అనేక చేపలు ఉన్నాయి. ఈ చేపలను భగవంతుని పెంపుడు జంతువులు అని ప్రజలు విశ్వసిస్తారు మరియు వాటికి తిండి తినిపిస్తే భగవంతుడు సంతోషిస్తాడు కాబట్టి ఇది ఇక్కడ ప్రధాన నైవేద్యం.
ఆస్తమాతో బాధపడుతున్న చాలా మంది రోగులు మీన్ ఊట్టును అందించినప్పుడు వారి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
💠 కేరళలోని దాదాపు అన్ని దేవాలయాలలో వలె, ఈ ఆలయంలో కూడా ఐదు పూజలు నిర్వహిస్తారు. ఉష పూజ, ఉచ పూజ, పంతిరాది పూజ, ఈతీర్థ పూజ, అథజ పూజ. శ్రీరాముని దేవతను ప్రతిరోజూ మూడుసార్లు షీవేలీలలో ( ఉష శీవేలీ, అథాజ శీవేలి) ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు.
అథజా పూజ మరియు నిర్మాల్య దర్శనం అన్నింటికంటే అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు.
💠 త్రిస్సూర్ పట్టణం నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.
మురి *పాలు* లేనిగృహమున
మురి *పాలు* లేనిగృహమున
చిరాకులు *పెరుగు* నిజంబుచింతలుపెరుగున్
సరదాలికరా *వెన్న* డు
స్థిరమౌ *నేయి* డుములైనజీవితమందున్
తపస్వివిజయవాడ