9, డిసెంబర్ 2024, సోమవారం

గర్భాశయం పుండు

 40 రోజుల్లో  గర్భాశయం పుండు హరించుటకు రహస్య యోగం  - 


     కలబంద రసం , పాలు మరియు నీరు సమానంగా తీసుకుని కలిపి ఉదయం పరగడుపున సాయంత్రం ఆహారానికి 2 గంటల ముందు సేవిస్తున్నచో 40 రోజుల్లొ  గర్భాశయం పుండు హరించును . కడుపులో పుండు అనగా అల్సర్ ని కూడా నివారించును.


          కాఫీ , టీ లు , మసాలా , కారం , పులుపు , పాత పచ్చళ్లు నిషిద్దం . 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

Panchang


 

వేదాలు

 వేదాలు:


1) రుగ్వేదం


2) యజుర్వేదం


3) సామవేదం


4) అధర్వణ వేదం


ఉపవేదాలు:


1) ధనుర్వేదం


2) ఆయుర్వేదం


3) శిల్పవేదం


4) గాంధార వేదం


వేదాంగాలు:


1) శిక్ష


2) కల్పం


3) జ్యోతిషం


4) వ్యాకరణం


5) నిరుక్తం


6) చంధస్సు


దర్శనాలు – అందులో ప్రసిద్ధులు:


1) సంఖ్య - కపిలుడు


2) వైశేషికం - కణాదుడు


3) న్యాయం - గౌతముడు


4) యోగ - పతంజలి


5) మీమాంస - జెమిని


6) ఉత్తర మీమాంస - బాదరాయణుడు

కాలం చక్రం తిరుగుతొంది !

 కాలం చక్రం తిరుగుతొంది !! 


కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర మరియు కలి యుగాలు) ఉంటాయి.

దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు

త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు

ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు

కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు

మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

కాలమానము సౌర (మానవ) సంవత్సరాలు దివ్య సంవత్సరాలు

ఒక చతుర్యుగము 43,20,000 12,000

71 చతుర్యుగములు 30,67,20,000 8,52,000

ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య 17,28,000 4,800

14 సంధ్యా కాలములు 2,41,92,000 67,200

ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరము 30,84,48,000 8,56,800

14 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరములు 4,31,82,72,000 1,19,95,200

14 మన్వంతరములు + కల్పాది సంధ్య = ఒక కల్పము

= బ్రహ్మకు ఒక పగలు 4,32,00,00,000 1,20,00,000

కల్పముల పేర్లు

మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో "శ్వేతవరాహ కల్పం" నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి

శ్వేత కల్పము

నీలలోహిత కల్పము

వామదేవ కల్పము

రత్నాంతర కల్పము

రౌరవ కల్పము

దేవ కల్పము

బృహత్ కల్పము

కందర్ప కల్పము

సద్యః కల్పము

ఈశాన కల్పము

తమో కల్పము

సారస్వత కల్పము

ఉదాన కల్పము

గరుడ కల్పము

కౌర కల్పము

నారసింహ కల్పము

సమాన కల్పము

ఆగ్నేయ కల్పము

సోమ కల్పము

మానవ కల్పము

తత్పుమాన కల్పము

వైకుంఠ కల్పము

లక్ష్మీ కల్పము

సావిత్రీ కల్పము

అఘోర కల్పము

వరాహ కల్పము

వైరాజ కల్పము

గౌరీ కల్పము

మహేశ్వర కల్పము

పితృ కల్పము

వాయు పురాణం 21వ అధ్యాయంలో 28 కల్పాల పేర్లున్నాయి. తరువాతి అధ్యాయంలో మరో ఐదు కల్పాలపేర్లున్నాయి.చతుర్యుగాలు

హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని సంవత్సరములు కలిపి ఒక యుగము గా కాలమానము లెక్కింపబడుతున్నది. అలా నాలుగు యుగాలు చెప్పబడ్డాయి.

1 యుగాలు, మహా యుగము

2 యుగాదులు

3 యుగాల మధ్య జరిగిన ఒక కథ

యుగాలు, మహా యుగము

దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును

కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు

త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు

ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు

కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)

మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో రెండు పాదాలపైన, కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.

యుగాదులు

కృత యుగాది - కార్తీక శుద్ధ నవమి

త్రేతా యుగాది - వైశాఖ శుద్ధ తదియ

ద్వాపర యుగాది - మాఘ బహుళ అమావాస్య

యుగాల మధ్య జరిగిన ఒక కథ

భాగవతం ఏకాదశ స్కందము నుండి : ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో - సూర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరుని గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన షుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, "నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు శ్రీకృష్ణభగవానుని అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న బలరామునితో వివాహం జరిపించు అని చెప్పాడు. అతడు అలాగే తెరిగి వెళ్ళి తన కుమార్తె రేవతి ని బలరామునకిచ్చి పెళ్ళి చేసాడు.

(ఒక మహాయుగము = బ్రహ్మకు 43.2 సెకనులు)

సృష్టిని పాలించేది మనువులు. ఒక్కో మనువు 71 మహా యుగాలు పాలిస్తాడు. అలాంటి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకుఒక పగలు. రాత్రి కాలం కూడ అంటె అవుతుంది. ఉదయ కల్పం; క్షయ కల్పం. ఇంత వరకు ఆరు ఉదయ కల్పములు, బ్రంహకు జరిగాయి. ఈ ఆరు ఉదయ కల్పములను పాలించిన మనువులు 1.స్వయంబువు, 2 స్వారీచ, 3. ఉత్తమ, 4. తామన, 5, రైవత 6 చాక్షువ. ఇప్పుడు ఏడవ మనువు వైవస్వతుడు పాలిస్తున్నాడు. 71 మహా యుగములలో 28 వ మహా యుగములోని కలియుగము నడుస్తున్నది.

బ్రహ్మ:: బ్రహ్మ ఒక్కడు కాదు. బ్రహ్మ ఆయుష్షు 100 సంవత్సరాలు. ఇప్పటివరకు మానవ బ్రహ్మ, చాక్షువ బ్రహ్మ, వాచిక బ్రహ్మ, శ్రావణ బ్రహ్మ, జన్మ బ్రహ్మ, నాసిక జన్మ బ్రహ్మ అండ జన్మ బ్రంహ అనబడే ఆరుగురు బ్రహ్మలు పుట్టి గతించారు. ప్రస్థుతం విష్ణువు నాభీ కమలంలో పుట్టిన బ్రహ్మ కాలలో 50 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో మొదటి దినం గడుస్తున్నది. బ్రహ్మ సవత్సరం అంటే 360 రోజులు అనగా, 3,091,76,00,00,000 సంవత్సరాలు. 100 సంఅత్సరాలు అంటే 3,09,17,376 కోట్ల సంవత్సరాలు. అలాంటి ఆరుగురి బ్రహ్మల జీవిత కాలం 18,55,04,256 కోట్ల సంవత్సరాలు గడిచి పోయాయి. 7 వ బ్రహ్మ కాలం 2009,62,944,00,000 సంవత్సరాలయితే అందులో 27మహా యుగాలు అనగా11,66,40,000 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో 27 మహా యుగాలు గడచి పోగా ఇప్పుడు 28 వ మహా యుగం లో కృత, త్రేత, ద్వాపర యుగాలు అనగా 38,88,000 సంవత్సరాలు గడిచి పోయాయి. కనుక పంచాంగ కర్థల అంచనా ప్రకారం సృష్టి వయస్సు 200,96,29,56 కోట్ల 5 లక్షల, 33 వేల ఒక వంద సంవత్సరాలు.

వల్లీ సుబ్రహ్మణ్యుల కళ్యాణం

 *వల్లీ సుబ్రహ్మణ్యుల కళ్యాణం*




ఒకానొక సమయంలో నారదమహర్షి కైలాసపర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్న సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు. లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలు పెట్టాడు. నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజయై ఒకపిల్ల అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక భిల్లు నాయకునికి దొరికింది ఆ పిల్లను తీసుకు వచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల పేరు వల్లి. ఆమె రాశీభూతమయిన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక. ఎప్పుడూ ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి. నువ్వు చూసి భయపడకూడదు సుమా! ఎవరు ఆ పిల్ల వొంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు. ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు భిల్లపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడికి భిల్లరాజు ఎదురువచ్చాడు. మంచి మంచి పువ్వులు, తేనే, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు భిల్లరాజుతో “నీకొక శుభవార్త చెప్తాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్ళి చేసుకో బోయేవాడు లోకంలో యౌవనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, జగదంబ అందాలు పోసుకున్నవాడు, పరమ సౌందర్యరాశియైన శంకరుని తేజమును పొందిన వాడు, గొప్ప వీరుడు, మహాజ్ఞాని, దేవసేనాధిపతి అయినటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టం అన్నాడు. భిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు


కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీ దేవి వంక చూసి బహుశః బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. ‘లతాంగీ నన్ను చేపట్టవా?” అని అడిగాడు. ఆవిడ ఈయన వంక చూసి ‘అబ్బో ఇతడు ఎంత అందగాడో’ అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు.


ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనస్సు నందు పాపపంకిలమయిన భావం కలుగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందినదానను అనుకుని ‘ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదయినా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడిందని చెప్పింది. ఆమె అలా చెప్పగానే సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనస్సులో ఎక్కడ ఆ మహానుభావుడు? నేను ఒక్కమాట నోరు తెరిచి చెప్పలేదని ఏడుస్తోంది. చెలికత్తె ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు. ఒక ఆకుమీద ఉత్తరం రాసి ఇవ్వు. నేను పట్టుకుని వెళ్లి ఆయనకు ఇస్తాను అన్నది.


సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తె వెళ్లి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదామని అన్నాడు. చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తానని చెప్పి వెళ్లి వల్లీదేవిని తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది. పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు. భిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు. సుబ్రహ్మణ్యుడు హేలగా నవ్వుతూ వాటినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అందరూ క్రిందపడి స్పృహ తప్పిపోయారు. వల్లీ దేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది. స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ స్పృహ వచ్చి లేచారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలివాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ భిల్లులందరూ నేలమీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు.


నారదుడు దేవసేనతో, పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు. నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో, దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామివారు తిరుత్తణియందు వెలసి ఉన్నారు. సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమయిపోతాయి. వంశాభివృద్ధి జరుగుతుంది.

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*


*ఆచారవ్యవహారాల పై వివరణ..*


*(ముప్పై మూడవ రోజు)*


శ్రీధరరావు దంపతులకు శ్రీ స్వామివారితో విపరీతమైన అనుబంధం ఏర్పడింది..ఆ దంపతుల ఇంట్లో రమారమి 21 రోజుల పాటు శ్రీ స్వామివారు బస చేశారు..ఎన్నో బోధలు చేశారు..అలాగే శ్రీధరరావు గారి తల్లిగారు సత్యనారాయణమ్మ గారికి కూడా శ్రీ స్వామివారి పై అచంచల విశ్వాసం కుదిరింది..రోజూ శ్రీ స్వామివారు చెపుతున్న విషయాలకు ఆవిడగారు విపరీతంగా ఆనందపడేవారు.."నాయనా!..నువ్వు ఇక్కడికి రాకపోతే..నాకెవరు ఇన్ని సంగతులు చెపుతారు?.." అనేవారు వాత్సల్యంతో..


"అమ్మా..మృత్యువు పెద్దపులిలా పొంచివుంది..ఎప్పుడూ రామనామం జపిస్తూ వుండు!.." అని చెప్పారు శ్రీ స్వామివారు..శ్రీధరరావు దంపతులతో కూడా అదే మాట చెప్పారు ఆవిడ గురించి..ఎక్కువ సమయం లేదని కూడా అన్నారు..


ఈలోపల ప్రభావతి గారు బహిష్టు అయ్యారు..ఇప్పుడు ఆ ఇంట్లో సమస్య వచ్చి పడింది..శ్రీ స్వామివారికి ఏర్పాట్లు, వంట ఎలా జరగాలి?..ఆయన యోగి..సిద్ధ పురుషుడు..అలాంటి వారికి మైల తో కూడిన ఆహారం పంపకూడదు..శ్రీధరరావు గారు కూడా మధనపడుతూ.. నేరుగా శ్రీ స్వామివారిని కలిసి..సమస్య చెప్పి.."మీకు అపవిత్రత జరుగుతుందేమో..మిమ్మల్ని ఈ నాలుగు రోజులూ మాలకొండలో ఉండేవిధంగా ఏర్పాటు చేస్తాను..ఐదవ రోజు ప్రభావతి స్నానం అయ్యాక..మిమ్మల్ని మరలా ఇక్కడికి పిలిపిస్తాను..కొద్దిగా సహకరించండి.." అన్నారు ప్రాధేయపూర్వకంగా..


శ్రీ స్వామివారు ఫక్కున నవ్వారు.."అమ్మ ఎక్కడుంది?.." అన్నారు..


"పెరట్లో కూర్చుని ఉంది..అక్కడే భోజనం చేస్తుంది..అక్కడే పడుకుంటుంది..మీకేమీ ఇబ్బంది ఉండదు..ఈపూటకు మీ స్నానానికి నీళ్లు అవీ పని వాళ్ళ చేత నేను పెట్టిస్తాను.." అన్నారు..


"అమ్మ దగ్గరకు పోదాం పదండి.." అంటూ శ్రీధరరావు గారిని వెంటపెట్టుకుని..ప్రభావతి గారున్న చోటికి వచ్చారు..కూర్చుని ఉన్న ప్రభావతి గారు ఒక్కసారి అదిరిపడ్డట్టు లేచి నిలుచున్నారు..


"అమ్మా!..నెలసరి అయితే..మీ పనులు మీరు చేసుకోకుండా..నాకేదో అపవిత్రం జరుగుతుందని..చాటుగా వెళ్లి కూర్చున్నావా?..ఎంత వెఱ్ఱి తల్లివమ్మా!..నీవు స్వయంగా నా పనులు చేయవద్దు..ఈ సమయంలో అది మంచి నిర్ణయం..కానీ నీవు నాకుఎదురుపడినా..నీవు సహజంగా చేసుకునే ఇంటిపనులు చేసుకుంటున్నా..నాకు అపవిత్రం అని ఎవరన్నారు?..నీకెవరు చెప్పారు?..ముందు ఇంట్లోకి వెళ్లి..నీవు చేసుకునే అన్ని పనులూ చేసుకో..ముందుగా మీకు ఈ అజ్ఞానం వదిలించాలి.."అన్నారు నవ్వుతూనే..


శ్రీధరరావు గారు..ఆయన వెనుకాల ప్రభావతి గారూ..వారిద్దరి కంటే ముందు శ్రీ స్వామివారు..ఇంట్లోకి వచ్చారు..అక్కడ మంచం మీద సత్యనారాయణమ్మ గారు కూర్చుని వున్నారు..ఆవిడ కూడా శ్రీ స్వామివారికి అపవిత్రం జరుగుతుందేమో నని భయపడుతూ వున్నారు..


ముందుగా వస్తున్న శ్రీ స్వామివారిని చూసి.."అమ్మాయి దూరంగా వుంది నాయనా!.." అని చెప్పబోతున్నారు..శ్రీ స్వామివారు చేయెత్తి ఆవిడను వారించి.."అమ్మా!..ఆ విషయాలే చెబుదామని వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని ఇక్కడకు వచ్చానమ్మా.." అన్నారు..


శ్రీ స్వామివారు నేరుగా హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుని..కొద్దిసేపు కళ్ళు మూసుకున్నారు..కళ్ళు తెరచి..ఆ ముగ్గురిని నిశితంగా చూసారు..ఆయన దృష్టి అలౌకికంగా మారిపోయింది..ఆ కుర్చీలోనే పద్మాసనం వేసుకున్నారు..ధ్యానముద్రలో ఉన్న పరమశివుడిలా నిటారుగా కూర్చున్నారు..


"అమ్మా!..అందరూ శ్రద్ధగా వినండి.." అంటూ..మొదలుపెట్టారు..


ఋతుక్రమం..ఊర్ధ్వ అధో లోకాలు..అజ్ఞాన నివృత్తి..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

శ్రీ దత్త ప్రసాదం -3

 శ్రీ దత్త ప్రసాదం -3- శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు


శ్రీ స్వామివారు మొగలిచెర్ల సమీపం లోని ఫకీరు మాన్యం భూమిని తన ఆశ్రమం కోసం ఎంపిక చేసుకోవటం..అందుకు శ్రీధరరావు, నిర్మలప్రభావతి గార్లు సంతోషంగా సమ్మతి తెలపడం..ఆ భూమిని శ్రీ స్వామివారి పేరిట రిజిస్ట్రేషన్ చేయటం చక చకా జరిగిపోయాయి..ఇక ఆశ్రమ నిర్మాణం జరగాలి..

"శ్రీధరరావు గారూ..మీరు గృహస్థులు..మీకూ బాధ్యతలున్నాయి..ఆశ్రమనిర్మాణానికి మీమీద భారం పడదు.. అందుకు వేరేవాళ్ళు వస్తారు.." అని శ్రీ స్వామివారు చెప్పారు..


నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొట్టిగుండాల గ్రామ వాస్తవ్యులు శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు ఆ బాధ్యత నెత్తిమీద తీసుకున్నారు..శ్రీ స్వామివారి మీద అచంచల విశ్వాసం మీరాశెట్టి దంపతుల స్వంతం..తమ గ్రామం నుంచి నడుచుకుంటూ ఆశ్రమ నిర్మాణ స్థలానికి వచ్చేవారు..మీరాశెట్టి గారికి సంతానం లేదు..శ్రీ స్వామివారు ఆ విషయంలో చాలా స్పష్టంగా "మీరాశెట్టీ మీకు సంతాన యోగం లేదు..నాకు ఆశ్రమం కట్టిస్తే మీకు పిల్లలు పడతారని అపోహ పడొద్దు.." అని ముందుగానే చెప్పారు..మీరాశెట్టి గారు కూడా తాను ఆశ్రమాన్ని నిర్మించి ఇవ్వదల్చుకొన్నాననీ..మరేవిధమైన కోరికా లేదని తేల్చి చెప్పేసారు..

ఆశ్రమం నిర్మాణం పూర్తయిన తరువాత కూడా..మీరా శెట్టి దంపతులు శ్రీ స్వామివారి దర్శనార్ధం తరచూ వచ్చేవారు..ఒక్కొక్కసారి తమతో పాటు కొంతమంది వ్యక్తుల ను కూడా తీసుకొచ్చేవారు..అలా వచ్చినవారి ప్రాప్తాన్ని బట్టి శ్రీ స్వామివారి దర్శనం జరిగేది..శ్రీ స్వామివారు తనకు నచ్చినప్పుడే మనసు విప్పి మాట్లాడేవారు..అందుకు ఒక నిర్దిష్ట సమయమంటూ లేదు..తన దగ్గరకు ఎవరు ఏ కోరికతో వస్తున్నారో ముందుగానే శ్రీ స్వామివారికి ముందుగానే తెలుసు..అందుకు తగ్గట్టు గానే మాట్లాడేవారు..ఈ విషయం లో శ్రీధరరావు దంపతులకు(మా తల్లిదండ్రులు) మీరాశెట్టి దంపతులకు చాలా అనుభవాలు కలిగాయి..


శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత కూడా మీరాశెట్టి గారు ఆశ్రమానికి వస్తూ వుండేవారు..వారి ప్రోద్బలం, కృషి తోనే..శ్రీ చెక్కా కేశవులు గారు, శ్రీ మెంటా మస్తానరావు గారు, శ్రీ గోనుగుంట పెద్దిశెట్టి గారు..అందరూ కలిసి..శ్రీ స్వామివారి మందిర వెనుకవైపు స్థలంలో..మందిరానికి అతి సమీపంలో "ఆర్యవైశ్య అన్నదాన సత్రాన్ని" కట్టించారు..ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి, మహాశివరాత్రి పర్వదినానికి.. ఆర్యవైశ్య అన్నదాన సత్రం తరఫున అందరికీ అన్నదానం చేసేవారు..ప్రస్తుతం వారెవ్వరూ జీవించి లేకపోయినా..వారిచ్చిన స్ఫూర్తి తో ఆ సత్రం తరఫున యధావిధిగా సేవలు జరుగుతున్నాయి..శ్రీ స్వామివారిని దర్శించడానికి వచ్చే ఆర్యవైశ్య భక్తులకు ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నారు..

మీరాశెట్టి గారు జీవించి ఉన్నంత కాలమూ..తనకు తెలిసిన వాళ్ళెవరికి ఏ సమస్య వచ్చినా..వారి సమస్య పరిష్కారం కోసం శ్రీ స్వామివారి సమాధిని దర్శించి, మ్రొక్కుకోమని చెప్పేవారు..అలా ఎంతోమంది స్వాంతన పొందేవారు..మీరాశెట్టి గారికి సంతానం లేకపోయినా..సంతానం లేని వారికి మాత్రం..శ్రీ స్వామివారి సమాధి వద్ద మ్రొక్కుకుంటే చాలు సంతానం కలుగుతుందని గట్టిగా చెప్పేవారు..చిత్రంగా ఆయన నమ్మకం ఏనాడూ వమ్ము కాలేదు..అలా సంతానం పొందిన వారి వద్ద ముందుగానే శ్రీ స్వామివారి మందిర అభివృద్ధికి సహాయం చేయాలని ఒప్పించేవారు..అలా మీరాశెట్టి గారి ద్వారా శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించి, సంతానం పొందిన అనేక మంది భక్తులలో..వింజమూరు గ్రామానికి చెందిన కామేశ్వర రావు గారొకరు..శ్రీ కామేశ్వర రావు గారు మీరాశెట్టి గారికి దగ్గర బంధువు కూడా..మీరాశెట్టి గారిని "పెదనాయనా" అని పిలిచేవారు..


ఆ కామేశ్వర రావు గారు ఈమధ్య తన కూతురి వివాహం కుదిరందనీ..ఆ వివాహానికి మందిరం లో ఉన్న మమ్మల్ని అందరినీ రమ్మని పిలువడానికి వచ్చినప్పుడు, తనకు సంతానం కలగడానికి శ్రీ స్వామివారి ఆశీర్వాదమే కారణమని..అందుకు శ్రీ మీరాశెట్టి గారి ప్రోద్బలమే కారణమని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు..

మీరాశెట్టి గారి సలహాతో శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించి తరించిన భక్తుల అనుభవాలను..మీరాశెట్టి గారి ద్వారా స్వయంగా నేను విన్నవీ..భక్తుల ద్వారా సేకరించినవీ..కొన్నింటిని..రేపటి నుంచి కొంతకాలం పాటు ఈ సోషల్ మీడియా వేదికగా చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!

రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్


(మందిర వివరముల కొరకు :

పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)


----

మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : 


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ

-----


*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :


Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632


--

శివ నామ మహిమ - విశిష్టత

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శివ నామ మహిమ - విశిష్టత*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*పార్వతిదేవి:~*


*స్వామి!కలియుగంలో అధర్మం పెరుగుతుంది ఆచారాలు నశిస్తాయి.అప్పుడు మీ మీ భక్తుడు ఏ ఉపాయము చేత ముక్తిని పొందగలడు?*


*పరమేశ్వరుడు:~*


*దేవీ! కలికాలంలో మానవులు నా పంచాక్షర (నమఃశివాయ) విద్యను భక్తితో ఆశ్రయించిన సంసారబంధము నుండి ముక్తులవుతారు.*


*తపస్సు చేయువారు, వ్రతములు చేయువారు కూడా నా లోకమును పొందలేరు, కాని భక్తితో..పంచాక్షర మంత్రంతో..నన్ను ఒకసారి పూజించినవాడు ఈ మంత్ర ప్రభావమును నన్ను చేరుకుంటాడు.*


*అందువలన.. తపస్సు, యజ్ఞము, వ్రతములు, నియమాలు అన్నీ పంచాక్షర మంత్రము ద్వారా జరుగు నా పూజకు కోటివంతు కూడ సరిసమానము కాదు.*

                             

*దేవీ! ఈశానుడు మొదలుగా గల పంచబ్రహ్మలు ఆ మంత్రమునకు అంగములు.*


*షడక్షర (ఓం నమఃశివాయ) లేక 

పంచాక్షర (నమఃశివాయ) మంత్రము ద్వారా నన్ను భక్తిభావంతో పూజించువాడు ముక్తి పోందును.*

            

*నా భక్తుడు పంచాక్షర మంత్ర దీక్షను.. గురువు నుండి స్వికరించిన, తీసుకొనకపోయిన.. క్రోధమును జయించి.. ఈ మంత్రము ద్వారా నన్ను పూజించాలి.*


*మంత్ర దీక్షను పొందని వారికంటే. గురువు ద్వారా మంత్ర దీక్షను పోందిన వారు కోట్లరెట్లు అధికుడని భావించవలెను.*


*అందువలన దేవి.! దీక్షను తీసుకొని ఈ మంత్రముతో నన్ను పూజించాలి, ఈ మంత్ర దీక్షను తీసుకుని. స్నేహంభావము, కరుణ, ఉపేక్ష మొదలైన గుణములతో కూడి బ్రహ్మచర్య పరాయుణుడై భక్తి భావంతో నన్ను పూజించినవాడు నాతో సమానుడగును.*


*నా పంచాక్షర మంత్రమునందు నా భక్తులందరికి అధికారము కలదు . ఇది మిక్కిలి శ్రేష్టమైన మంత్రము.*


*ఈ మంత్ర ప్రభావము చేతనే.. వేదము, మహర్షులు, సనాతన ధర్మము, దేవతలు, ఈ సంపూర్ణ జగత్తు నిలిచిఉన్నది.*


*ఇదీ పంచాక్షర (నమఃశివాయ) మంత్ర మహిమ. భగవంతుడి నామాన్ని జపించడమే జపయజ్ఞం.*


*వాగర్థావివ సంపృక్తౌ*

*వాగర్థః ప్రతిపత్తయే।*

*జగతః పితరౌ వందే*

*పార్వతి పరమేశ్వరౌ..॥*                                                               


*ఓం నమః శివాయ..!*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

సగటు మనిషి పడక గది

 *సగటు మనిషి పడక గది దాంపత్య సన్నివేశాలు.*----//-

( *పెళ్లి అయిన రోజు నుండి  75 సంవత్సరాల అంతిమ నిద్ర వచ్చే వరకు క్లుప్తంగా*)


*1 మొదటి అంకం...*


*సమయం : రాత్రి 10 గంటలు*

*ప్రదేశం      :  మధ్యతరగతి పడక గది*

*వయసు.   :  భర్త : 27 ఏళ్ళు,  భార్య 25ఏళ్ళు.* 


*భర్త : అబ్బా రాత్రి 10 అవుతుంది, ఇంకా ఎంత సేపు ఎదురు చూడాలి నీకోసం , తొందరగా రావచ్చుగా గదిలోకి, ఒక్కడినే ఉండి ఏంచేయాలో తోచక చేతులు, దిండు నలుపుతున్నా....* 


*భార్య : నాకూ రావాలనే ఉంది...కానీ, మీ అమ్మ వదిలితేగా, ఏదో ఒక పనో, మాటలో చెప్తూ ఉంది, అవన్నీ అయ్యేటప్పటికి ఈసమయం అయింది.* 

               

*2) రెండవ అంకం...*


*వయసు:  37, 35*

*సమయం  : రాత్రి 10*

*ప్రదేశం : అదే పడకగది*


*భర్త :  పెద్దోడితోటి బాధ లేదు, వాడు మా అమ్మ పక్కన పడుకుంటున్నాడు, బాధ అంతా ఈ చిన్నోడి తోటే, నాయనమ్మ పక్కన పడుకోమంటే పడుకోడు, మనం మంచి మూడ్ లో ఉన్నప్పుడు లేచి నాకు బాత్రూం వస్తుంది, మంచి నీళ్ళు కావాలి, ఆకలి ఐతుంది అంటాడు....*


*భార్య : ఏం చేస్తాం మనమే సర్దుకుపోవాలి, వాడు చిన్నోడు కదా అంతే మరి...*


*3) మూడవ అంకం...*


              *వయసు : 47,45*

*సమయం : రాత్రి 10 గంటలు*

*ప్రదేశం : అదే పడక గది*


*భర్త : గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేశావా, పాలు తోడు పెట్టావా..*


*భార్య :ఆ ఆ అన్నీ చేశా, మీరు కళ్ళజోడు, ఫోన్తె చ్చుకున్నారా?* 


*భర్త : ఇక పడుకో అని కుడి పక్కకు తిరిగి పడుకున్నాడు.* 

*భార్య : సరే అని ఎడమ పక్కకు తిరిగి పడుకుంది.*


*4) నాలుగవ అంకం...*


*వయసు. : 57, 55*

*సమయం : రాత్రి 10* *ఎప్పటి లాగే*

*ప్రదేశము :  అదే పాత పడక గది*


*భర్త : బి.పి, షుగరు టాబ్లెట్ లు వేసుకున్నవా, పిల్లలు పండగకి వస్తామన్నారా?*


*భార్య : నేను, వేసుకున్నా, మీరు వేసుకున్నారా, పెద్దోడికి సెలవు దొరకలేదట, చిన్నోడు ఆఫీసులో తీరిక లేకుండా ఉన్నాడట కుదరదన్నాడు.* 


*భర్త : సరే ఏం చేస్తాం , పడుకో, అన్నట్టు పాలు తోడు పెట్టావా?*


*భార్య : తోడు పెట్టాను, మీరు ఫోను, కళ్లజోడు దగ్గర పెట్టుకున్నారా?*

*ఇద్దరు చెరో వైపు తిరిగి పడుకున్నారు*


*5) అయిదవ అంకం...*


   *వయసు : 67, 65*

*సమయం : రాత్రి 10 గంటలు*

*ప్రదేశం   : అదే పాత పడకగది*


*భర్త : బి.పి, షుగరు తో పాటు మోకాళ్ళ నొప్పుల మందు కూడా వేసుకున్నవా....*


*భార్య : నేను వేసుకున్నా, మీవి కూడా పట్టుకొచ్చా వేసుకోండి...*


*భర్త : సరే ఇటియ్యి, వేసుకుంటా, అవునూ, అమెరికా నుండి మనవళ్లు, మనవరాళ్లు ఫోన్ చేసారా ఈమధ్య , ఎప్పుడయినా వస్తామంటున్నార, పుట్టి పదేళ్లు  వస్తున్నా  ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు, ఫోన్లో వీడియో కాల్ లో చూడటమే తప్ప నిజంగా ఒక్కసారి చూసింది లేదు.*


*భార్య : నిన్న చిన్నవాడు, పెద్దవాడు ఇద్దరి కుటుంబాలు ఎదో హోటల్ లో కలుసుకొని అక్కడినుండి ఇద్దరు వాళ్ళ , వాళ్ళ పిల్లలతో ఫోన్ లో మాట్లాడించారు. మంచి డాక్టర్ కి చూపించుకోండి, మందులు వాడండి ఎన్ని డబ్బులు అయినా ఫరవాలేదు పంపిస్తాము అన్నారు, వాళ్ళకి ఇంకో 2 ఏళ్ల దాకా రావటానికి కుదరదట, సరే పొద్దు పోయింది పడుకోండి..*


*భర్త : వాళ్ళు రారు, మనం వాళ్ళని, వాళ్ళ పిల్లలని చూడలేము, ఇక మన పరిస్థితి ఇంతే,*

*పడుకుందామంటే మోకాళ్ళ నొప్పులు,* *అరికాళ్ళ మంటలతో రాత్రి ఒంటిగంట దాకా నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే పిల్లలు గుర్తొచ్చి మనసంతా దిగులుగా ఉంటుంది, అసలు వాళ్ళని ఇద్దరిని అమెరికా పంపి తప్పు చేసామేమో,* *ఒక్కడినన్న ఇక్కడ ఉండమనాల్సింది, సరే లే ఇప్పుడు అనుకోని ఏంచేస్తాం, నీకన్నా నిద్ర పడుతున్నదా?*


*భార్య : నాది మీ పరిస్థితే నాకూ ఒంటిగంట తరువాతే నిద్ర, కళ్ళు తెరిచినా, మూసినా పిల్లలే కళ్ళలో మెదులుతున్నారు, ఏంచేస్తాం అంతా మన ఖర్మ ,* 

*సరే నిద్ర రాకపోయినా అట్లాగే కళ్ళు మూసుకొని పడుకుందాం ఎప్పటికో నిద్ర పట్టక పోదు.*

*ఇద్దరూ బలవంతాన కళ్ళు మూసుకున్నారు.*


*6) చివరి అంకం...*


*వయసు : 75*

*సమయం : రాత్రి 11 గంటలు*

*ప్రదేశం : ముసలి కంపు కొట్టే పాత పడక గదిలో, కాళ్ళు సరిగా లేని కుంటి మంచం.* 


*భార్య : ఆయన పోయి నెల రోజులు అయింది, ఇంతవరకు ఒక్క కొడుకు కానీ, ఒక్క కోడలు కానీ, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ వచ్చిన పాపాన లేదు, కన్నతండ్రి చనిపోతే అంతిమ సంస్కారాలు కూడా చేయలేని, తీరిక లేని కొడుకులు,* *సమయానికి మా తమ్ముడు, వాడి కొడుకు రాబట్టి కనీసం స్మశాన కార్యక్రమాలు అయినా పూర్తి అయినయి.* 

*ఇక నా పరిస్థితి ఏమి కానుందో....*

*ఎప్పటికయినా నా  పిల్లలు వస్తారో..రారో అనుకుంటూ కళ్ళు మూసుకుంది, అంతే ఆ కళ్ళు మళ్ళీ తెరుచుకోలేదు,* 


*జీవితంలో ఆఖరు పడకగది సన్నివేశం ముగిసింది*


*మర్నాడు పనిమనిషి వచ్చి తలుపు ఎంత సేపు కొట్టినా తలుపు తెరుచుకోలేదు, అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తలుపు పగలగొట్టి చూస్తే "భార్య" శాశ్వత నిద్రలోకి పోయింది...*


*చుట్టుపక్కల వాళ్ళు ఆమె తమ్ముడి నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆయన వచ్చి అంతిమ సంస్కారం చేసి వెళ్ళిపోయాడు.*


*మధ్యతరగతి జీవిత నాటకరంగంలో సగటు మనిషి పడక గది సన్నివేశాలు... మధ్య తరగతి దాంపత్య ప్రతిఫలాల నిలువుటద్దాలు...

అరాళ కుంతలా

 🌷అరాళ కుంతలా🌷


ఒక రోజు నేను శ్రీ కృష్ణ తులాభారం సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్ టీ రామారావు, జమున కాళ్ళు పట్టుకుంటే ఆవిడ తన్నిన సన్నివేశం లో ఘంటసాల గారు ఒక పద్యం పాడారు..


నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్‌కబూని తాచిన అది నాకు మన్ననయా


చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చుననుచు నేనయిద


అల్క మానవు కదా ఇకనైన అరాళ కుంతలా ...........


పద్యం అంతా బానే అర్ధం అయ్యింది కానీ .... అరాళ కుంతలా ... అంటే ఏంటో అర్ధం కాలేదు. మా పితృ పాదుల వారు పక్కనే ఉన్నారు కదా అని ఆయన్ని అడిగాను. నేను చదువుకోకుండా సినిమా చూస్తున్నానన్న కోపం లో ఆయన పక్కనే ఎప్పుడూ రెడీ గా ఉంచుకునే కమండలం లో కాసిని నీళ్ళు తీసి "నీకు ఆ పదానికి అర్ధం తెలియకుండు గాక" అని శపించారు. యధా విధి గా నేను శాపవిమోచన మార్గం అడిగాను. అప్పుడు ఆయన "ఆ పదానికి అర్ధం వేరొకరి ద్వారా నువ్వు తెలుసుకుంటావు." అని సెలవిచ్చారు.


పితృపాదుల వారి శాపం కారణం గా నా అంతట నేను దానికి అర్ధం తెలుసుకోలేకపోయాను. సరే అప్పటినుండీ చాలమంది ని అడిగి చూసాను. ఎవరూ అంత స్పష్టమైన సమాధానం చెప్పలేదు. మా పవన్ గాడ్నీ అడిగాను. వాడు "సంస్కృతం లో అరాళా అంటే అరటిపళ్ళు, కుంతలా అంటే ఎంతకిస్తావు?" అని అర్ధం అన్నాడు. ఆహా "అజ్ఞానీ సుఖీ" అని ఎందుకు అన్నారో అర్ధం అయ్యింది.


పోనీ ఎవరైనా అమ్మాయిని అడిగితే (లేదా అలా పిలిస్తే) ఎమైనా తెలుస్తుందేమొ అని మా క్లాస్ మేట్ కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ దగ్గరకి వెళ్ళి "అరాళ కుంతలా" అని పిలిచాను.


"ఒహ్ మై గాడ్!!! నువ్వు మలయాళం ఎప్పుడు నేర్చుకున్నావ్? ఐ టూ లవ్ యూ." అని సిగ్గు పడుతూ చేప్పింది. నేను అవాక్కయ్యాను.


ఇలా లాభం లేదని పేపర్లొ ప్రకటన ఇచ్చాను. "అరాళ కుంతలా ఎవరికైనా తెలుసా? (మధ్యలో "అంటే" అన్న పదం ఆ పేపర్ వాడు ప్రింట్ చెయ్యలేదు) తెలిస్తే నాకు ఫోన్ చేసిన వారికి నా అర్ధ రాజ్యం తో పాటు కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ ని ఇచ్చి వివాహం చేస్తాను" అని ప్రకటించాను.


ఒకడు ఫోన్ చేసి " సార్!!!!! నాపేరే అరాళ కుంతలా. మాది ఒరిస్సా. అర్ధ రాజ్యానికి దస్తావేజులు ఎప్పుడు ఇస్తారు? పెళ్ళి మాత్రం గ్రాండ్ గా చెయ్యాలి" అన్నాడు. ఫోన్ తీసి నేలమీద కొట్టాను.


ఈ విషయం గురించే చాల రోజులు ఆలోచించాను. పోనీ ఎవరైనా తెలుగు మాస్టారు కి తెలుస్తుందేమో అని మా ఇంటి పక్కనే ఉన్న స్కూల్ కి వెళ్ళి ఒక పిల్లని ఆపి తెలుగు మాస్టారు కోసం అడిగాను. ఆ పిల్ల "తెలుగు????? మీన్స్ వాట్?" అంది. మన భాష కి పట్టిన దౌర్భాగ్యానికి ఆ రోజు నేను అన్నం తిన లేదు. ఆ మాట విన్నందుకు ప్రాయశ్చిత్తం ఏంటని మా పితృపాదుల వారిని అడిగాను. రెండు వారాలు ఉపవాసం చేస్తూ, చెట్టు కొమ్మకి తలకిందులు గా వ్రేళ్ళాడుతూ తపస్సు చేయమన్నారు. అది నావల్ల కాక, ఆల్రెడీ అలా తపస్సు చేసిన మా నాన్న గారిని ముట్టు కుని "మమ" అన్నాను.


ఎన్ని రోజులైనా నాకు ఆ పదానికి అర్ధం తెలియ లేదు. ఒక రోజు గుళ్ళో కి వెళ్ళి అష్టోత్రం చేయించుకుంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఏదైనా ఉంటే అది నశించి నాకు అర్ధం తెలుస్తుందని పక్కనే ఉన్న అయ్యప్ప గుళ్ళో కి వెళ్ళాను. పూజారి గారు వచ్చి


"నీ పేరు" అన్నారు.


-అప్పారావు -


"గోత్రం"


-అరాళ కుంతల-


పూజారి నన్ను అదోలా చూసి "అయ్యా మీ స్వగ్రామం అండమాన్ దీవులా? అన్నారు.


నా జీవితం మీద నాకే విరక్తి వచ్చింది. ఇంక నావల్ల కాక ఆ పదం గురించి మర్చి పోయాను.


ఈ మధ్య మళ్ళీ ఆ శ్రీకృష్ణ తులాభారం సినిమా చూడటం అనుకోకుండా జరిగింది. మళ్ళీ చెద పురుగు బుర్ర తొలిచెయ్యటం మొదలు పెట్టింది. నా అవస్థ చూసి మా రూం మేట్ సీరియస్ గా "గూగుల్ ఇట్ మ్యాన్" అన్నాడు.


"వార్నీ!!!!!! ఇన్ని రోజులు గా ఈ పని చెయ్యలేదు కదా అని అనుకున్నాను. కానీ మా పితృపాదుల వారి శాపం నాకు ఆ ఆలోచన రాకుండా చేసిందని నా ప్రగాఢ విశ్వాసం. సరే అని గూగుల్ చేసా. ఒక్క పేజీ లో మూడు లింకులు వచ్చాయి. ఒక లింకు తెరవగా అందులో "అరాళ కుంతలా అంటే పొడవైన నల్లని జుట్టు కలది" అని ఉంది.


కళ్లెమ్మట నీళ్ళు వచ్చాయి. శాపవిమోచనం అయ్యింది. మా రూం మేట్ స్వయం గా అర్ధం చెప్పక పోయినా ఆ ఐడియా ఇచ్చింది తనే కనుక ఆ శాపం వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. ఒక వేళ ఆ అర్ధం కనక తప్పు ఐతే దయాద్ర హృదయం కలిగిన మారాజులు కాని మారాణులు కాని నాకు చెప్పవలసిందిగా నా ఆర్ద్రత తో కూడిన ప్రార్ధన..

.

చంద్రకిరణ్

సమస్య పూరణ

 *శస్త్రమె శాంతి చిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్*


ఈ సమస్యకు నాపూరణ 


*ఆంగ్లేయుడు స్వరాజ్యోద్యమ సమయంలో* 


వస్త్రము నేసి, సీమదగు వస్తు బహిష్కరణమ్ము చేసిరే 


అస్త్రము లన్ని నిష్ఫలమె యాయువు పట్టు స్వదేశి మంత్రమే 


శాస్త్రము లందు రూఢియట శాసన మొల్లనిదే యహింసయన్ 


శస్త్రమె శాంతి చిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్. 



అల్వాల లక్ష్మణ మూర్తి.


*తలcపరు గండపెండెరముc దాల్పcగ సత్కవు-లెన్నcడేనియున్*

ఈ సమస్యకు నాపూరణ. 


*శ్రీకృష్ణ దేవరాయలు*

పిలిచిన పల్కు వాణి గద పెద్దన తిమ్మన  రామకృష్ణులున్


పలుకులు మాని చూచెదరె పద్యకవిత్వము లాశువెక్కడన్


తలcపరు గండపెండెరముc దాల్పcగ సత్కవు-లెన్నcడేనియున్


అలసిరె కైతలల్లుటకు నబ్బురపాటె సభాంతరమ్మునన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


                    𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


   *జీర్యన్తే జీర్యతః కేశా దన్తా జీర్యన్తి జీర్యతఃl*

   *చక్షుఃశ్రోత్రే చ జీర్యన్తే తృష్ణైకా తరుణాయతేll*


           !!!!!!!!! *తాత్పర్యం* !!!!!!!!


"*మానవుడు వృద్ధుడు కాగానే కేశాలు తెల్లబడుతున్నాయి. రాలిపోతున్నాయి. దంతములు ఊగుతున్నాయి. ఊడిపోతున్నాయి. దృష్టి మందగిస్తున్నది. చెవులు సరిగా వినబడవు.*

అయినా *ఆశ ఒక్కటి మాత్రం యౌవనంలోనే మిగిలి ఉంటుంది. అనగా సర్వేంద్రియాలూ బలం తప్పినా కోరికలు మాత్రం చావవు అని భావం".*


✍️🌺💐🌹🙏

వాళ్ళిద్దరికీ పెళ్ళయి అరవై ఏళ్ళయింది.

 వాళ్ళిద్దరికీ పెళ్ళయి అరవై ఏళ్ళయింది. 

పెళ్లి రోజుని చక్కగా జరుపుకోవాలనుకున్నారు. ఇద్దరూ పొద్దున్నే లేచారు. తలంటుకున్నారు. 

పట్టుబట్టలు కట్టుకున్నారు. ముద్ద మందారం తురుముకుందామె. 

" ఈ మధ్యనే" అయిదారేళ్ళ క్రితం కొన్న అత్తరుని రాసుకున్నాడతను. 


కధ లోకి వస్తే.. మందారం తురుముకున్న ఆమె, అత్తరు రాసుకున్న అతను కలిసి గుడికి వెళ్ళారు. దేమునికి దండం పెట్టుకున్నారు. మరో పద్ధెనిమిది పెళ్ళి రోజులు జరుపుకోవాలని కోరుకున్నాడతను. అప్పటికి అతనికి నూరేళ్ళు వస్తాయి. ఆమె మరో ఇరవైరెండు పెళ్ళి రోజులు జరుపుకోవాలని కోరుకుంది. అప్పటికి ఆమెకి నూరేళ్ళు వస్తాయి.  

ఇద్దరూ నిండునూరేళ్ళు బతకాలని కోరుకున్నారు. 


దేమునికి కొట్టిన కొబ్బరికాయని ప్రసాదముగా అతని చేతిలో పెడదామని ఇలా నేలకేసి కొట్టిందో లేదో అలా కుప్పకూలిపోయింది.


అయ్యయ్యో అనుకుని ఆందోళనతో ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేసాడతను. ఇంక

బతికి ఉన్న నాలుగు రోజులూ హాయిగా బతకనీయండి. ఇంటికి తీసుకుపొమ్మని డాక్టర్ అంటే .. ఇంటికి తీసుకువచ్చాడు. వీలయిన మేరకు ఆమెకు సపర్యలు చేయసాగాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ దాపరికం లేని కళ్ళు అని ఆనందించాడు. గర్వపడ్డాడు. నిజంగా కూడా అంతే.

పెళ్లి అయిన దగ్గర నుంచి ఆమె అతని దగ్గర ఏదీ దాచిపెట్టలేదు. అన్నీ అతనితో పంచుకునే బతికింది. ఒకే ఒక్కటి మాత్రం దాచిపెట్టింది. అది ట్రంకు పెట్టె. అటక మీద వుంది. దాని విషయం అడగకండి! అందులో ఏమున్నదీ చూడకండి అని ఆమె ఆంక్ష విధించడంతో అతను ఎన్నడూ ఆ పెట్టెను తెరవనూ లేదు, అందులో ఏమున్నదీ చూడనూ లేదు. చూడాలని చాలా సార్లు అనుకున్నా ఆ కోరికని అణచుకున్నాడు. ఇక ఇప్పుడు తప్పదు. చూడాల్సిందే.. అనుకున్నాడు. ఆ మాటే చెప్పాడామెకి. అవునవును చూడండి.... అందామె.


అటక మీద నుంచి ఆ పెట్టెని దించి జాగ్రత్తగా తెరిచి చూసాడు. ఏమున్నాయి అందులో?

రెండు ఊలు స్వెట్టర్ లు వున్నాయి. అంతేనా? 

ఓ మూడులక్షల రూపాయలు కూడా వున్నాయి. పెద్ద మొత్తమే!

ఈ స్వెట్టర్ లు ఏంటి? అని అడిగాడు. దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగిందామె. పెళ్ళయి మీతో పాటుగా నేనిక్కడికి బయలుదేరి వస్తునపుడు మా నాయనమ్మ నన్ను చాటుగా పిలిచి ఓ సంగతి చెప్పింది. ఏంటో అది? ఆత్రపడ్డాడతను.


భర్తతో ఎన్నడూ పోట్లాడకు. ఒకవేళ అతని మాటలకీ, చేష్టలుకీ పోట్లాడాలన్నంత కోపం వస్తే, ఎంచక్కా స్వెట్టర్లు అల్లుతూ కూర్చో.. కోపం దానంతట అదే పోతుంది అని చెప్పింది. నాయనమ్మ చెప్పినట్లుగానే ఇన్నాళ్లూ చేసాను అన్నదామె. 

ఆ మాటలకి అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. చేతిలోని రెండు స్వెట్టర్ లనూ ప్రేమగా గుండెకు హత్తుకున్నాడు. 


అరవైసంవత్సరాల వైవాహిక జీవితంలో ఆమె తనతో పోట్లాడాలనుకున్నది రెండంటే రెండే సార్లన్నమాట! చాలు! ఐయామ్ గ్రేట్ అనుకున్నాడతను.


మరి ఈ మూడులక్షలు? ఇంత డబ్బు ఎక్కడది? అని అడిగాడు.

అదీ.. అదీ.. ఈ అరవైఏళ్ళలో నేను స్వెట్టర్లు అమ్మగా వచ్చిన డబ్బు అది అన్నదామె.


*అతను కళ్ళు తేలేసాడు.😜😜😄😄🤣🤣

సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:*

 *సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:* 

1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 

2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 

3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 

4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 

5. మొగిలీశ్వర్.

6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.

7.సూర్యనారాయణ దేవాలయం జోగుళాంబ అలంపూరు గద్వాల జిల్లా 


*నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు:* 

1. మహానంది

2. జంబుకేశ్వర్ 

3. బుగ్గరామలింగేశ్వర్

4. కర్ణాటక కమండల గణపతి.

5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.

6. బెంగళూర్ మల్లేశ్వర్ 

7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం

8. సిద్ధగంగా

9.అలంపురం


*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 

2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  

3. మంజునాథ్.


*శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్


*సముద్రమే వెనక్కివెళ్లే* 

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.


*స్త్రీవలె నెలసరి* అయ్యే 

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  

2. కేరళ దుర్గామాత.


*బహ్మ పేరు తో ఏకైక శివాలయాలు*

అలంపూరులో నవఁబహ్మేశ్వర ఆలయాలు

9 రూపాలలో శివలింగాలు ఉంటాయి   


*రంగులు మారే ఆలయం.* 

1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే  శివాలయం పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం సోమేశ్వర స్వామి వారి ఆలయం.

పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.


*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 

 1. కాణిపాకం,  

2. యాగంటి బసవన్న,  

3. కాశీ తిలభండేశ్వర్,  

4. బెంగుళూరు బసవేశ్వర్

5. బిక్కవోలు లక్ష్మీగణపతి


*స్వయంభువుగా* 

సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.

*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 

1. బదరీనాథ్,  

2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)

3. గుహ్యకాళీమందిరం. 


*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 

హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.


*12 ఏళ్లకు ఒకసారి*

పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.


*స్వయంగా ప్రసాదం తినే* 

1.  కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.

2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం


*ఒంటి స్తంభంతో*

యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.


*రూపాలు మారే*

ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.


*నీటితో దీపం వెలిగించే* ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,  మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.


*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 

1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి


*మనిషి వలె గుటకలు*  

వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.


*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 


*ఛాయా విశేషం* 

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం


*నీటిలో తేలే* విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్


*పూరీ* 

పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే  పూరి ప్రసాదం.


ఇవి  తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. *ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు నిర్మాణం చేశారు (సృష్టి చేశారు)విశ్వకర్మ  🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️హర హర మహాదేవ శంభో శంకర

సాహచర్యమే మనిషి ఉన్నతికి

 శు భో ద యం🙏


సాహచర్యమే మనిషి ఉన్నతికి,  పతనానికి, కారణం .

                                                     తస్మాత్  జాగ్రత! 


                యెక్కడైనా  యెప్పుడైనా  యెవరితోనయినా సాహచర్యం  ( స్నేహం,- కలిసి యుండటం)  చేసేటప్పుడు 

బాగా ఆలోచించుకోవాలి. ముందుముందు  దానివల్ల కలిగే పరిణామాలు ,వాటి మంచిచెడ్డలు. ఆలోచించకుండా అడుగేస్తే,             

  అది ఊహింపలేని  యనర్ధాలకు దారితీయవచ్చు. అందునా ఆడవారి సాంగత్యం మనిషినెలా పతనం చేస్తుందో,  సారంగు 

  తమ్మయ్య  వైజయంతీ విలాసంలో (  విప్ర నారాయణ చరితము)  సూచించాడు. చిత్తగించండి మరి! 


      

          మ: ఆవిప్రోత్తము  వజ్రపంజర  నిభంబై  నిశ్చలంబైన  స 

                 ద్భావం బంగన  సాహచర్య  గుణసంపర్కంబునన్ 

                 గ్రావమై,లోహంబై, దృఢదారువై, తరుణ వృక్షంబై, ఫలప్రాయమై, 

                 పూవై,   తన్మకరందమై, కరగె, పోబోన్నీళ్ళకున్   పల్చనై;! 


                       విప్రనారాయణుని బ్హహ్మ చర్యమును చెరుప పంతము నూని దేవదాసి  దేవదేవి యతని యాశ్రమమున జేరినది. మొదలే పొమ్మన్న యాపద తప్పెడిది. కానీ దయాస్వభావియై యాస్వామి యామె కాశ్రయ మిచ్చినాడు. దినదిన మాటపాటలతో నామె యాతని హృదయమును వనితా సాంగత్యము వయిపు దిప్పినది. చివర కేమయినాడో చూడండి!! 


                     " వజ్ర పంజరమువంటి (పగులగొట్టలేనిది) యతని యుత్తమ హృదయము, వనితా సాంగత్యమువలన ,క్రమముగా  శిలగామారి, పిమ్మట లోహముగామారినది, అటుపిమ్మట గట్టి చెట్టుగా మారి, యాపై లేత మొక్కయైనదట,, తదుపరి ఫలప్రాయముగామారినదట, ఆపిమ్మట పూవైనదట. ఆపై మకరంద మైనదట. చివరకు  నీళ్ళకన్నా పలచనగా మారిపోయింది. 

                           

                          వజ్రం, రాయి ,చేవదీరినకర్ర, చిరుతరువు, ఫలము, పూవు,,, మకరందము, నీరు, ఇలా వివిధ దశలలో తగ్గుతూ చివరకు నీళ్ళ కన్నా పలచ బడినాడు. అంటున్నాడు కవి. 

         

                              ఇది మనకు మంచి సందేశం కదూ!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పాపము పుణ్యమేదొ తెలుపన్

 ఉ.పాపము పుణ్యమేదొ తెలుపన్ మది ధార్మిక చిత్త వృత్తితో

చూపిన మార్గముం జనులు శుధ్ధ మనస్కత నాదరించి తా

మే పొరపాటు చేసిన సహింపగ నొల్లరు గాన విజ్ఞులే

దాపరికమ్ములేని మతి ధర్మ నిబధ్ధత నుండగా దగున్౹౹ 63


ఉ.ఏ పలుకేది యైన మదికింపును గూర్చెడు రీతి నీతితో

నోపి వచింప యోగ్యమగు నుక్తిని యుక్తిగఁ బల్కగా వలెన్

తాపము గల్గ జేయని హితమ్మగు మాటల నెంచుకొన్నచో

నేపగిదిన్ వచింప నవి యిష్టములై వెలుగొందు వేడ్కమై౹౹ 64

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


                    𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


   *జీర్యన్తే జీర్యతః కేశా దన్తా జీర్యన్తి జీర్యతఃl*

   *చక్షుఃశ్రోత్రే చ జీర్యన్తే తృష్ణైకా తరుణాయతేll*


           !!!!!!!!! *తాత్పర్యం* !!!!!!!!


"*మానవుడు వృద్ధుడు కాగానే కేశాలు తెల్లబడుతున్నాయి. రాలిపోతున్నాయి. దంతములు ఊగుతున్నాయి. ఊడిపోతున్నాయి. దృష్టి మందగిస్తున్నది. చెవులు సరిగా వినబడవు.*

అయినా *ఆశ ఒక్కటి మాత్రం యౌవనంలోనే మిగిలి ఉంటుంది. అనగా సర్వేంద్రియాలూ బలం తప్పినా కోరికలు మాత్రం చావవు అని భావం".*


✍️🌺💐🌹🙏

⚜ శ్రీ చక్కలతుకవు భగవతి ఆలయం

 🕉 మన గుడి : నెం 954


⚜ కేరళ : నీరాటుపురం  : అలెప్పి


⚜ శ్రీ చక్కలతుకవు భగవతి  ఆలయం 



💠 చక్కలతుకవు ఒక హిందూ దేవాలయం, ఇది దుర్గాదేవికి అంకితం చేయబడింది.  

ఈ ఆలయం కేరళలోని అలప్పుజా జిల్లా నీరట్టుపురంలో ఉంది


💠 ఈ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధ దేవతలలో ఒకటిగా, దక్షిణ భారతదేశం నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షిస్తుంది.


💠 దక్షిణ భారతదేశం నలుమూలల నుండి యాత్రికులు దేవిని సందర్శిస్తారు మరియు పూజిస్తారు. ఈ ఆలయం స్థానిక నివాసితులకు కూడా అంతగా తెలియదు మరియు స్థానిక నివాసి యొక్క కుటుంబ దేవాలయంగా ఉంది.  ఇది కొన్ని దశాబ్దాల క్రితం పునరుద్ధరించబడే వరకు అలాగే ఉంది.


💠 వృశ్చికం (నవంబర్/డిసెంబర్) నెలలో ఆలయంలో జరిగే ప్రధాన పండుగ పొంగళ.

 ఈ సమయంలో అమ్మవారి మహిమ ఉచ్ఛస్థితిలో ఉంటుంది.  

ఈ కార్యక్రమానికి వారం రోజుల ముందు నుంచే లక్షలాది మంది మహిళా భక్తులు ఆలయం చుట్టూ చేరతారు.  

ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతుంది మరియు భక్తులు ప్రధాన వీధుల్లో ఇరువైపులా పొంగళాలు సమర్పించడానికి స్థలాలను ఏర్పాటు చేస్తారు.  క్యూ సాధారణంగా 20 కిమీ పొడవు వరకు విస్తరించి ఉంటుంది.  అన్నం, కొబ్బరి, బెల్లం వంటివి మహిళా భక్తులు వంట కోసం గుండ్రని మట్టి కుండలతో తీసుకువస్తారు.  


💠 ప్రధాన పూజారి గర్భగుడి లోపల దైవిక అగ్ని నుండి ప్రధాన పొయ్యిని వెలిగిస్తారు. 

 ఈ అగ్ని ఒక పొయ్యి నుండి మరొక పొయ్యికి మార్పిడి చేయబడుతుంది.


💠 పంత్రాండు నోయంపు అనేది ఆలయంలో జరుపుకునే మరొక పండుగ.  

ఈ రకమైన ఉపవాసం మరియు ప్రార్థన చక్కలతమ్మ యొక్క శాశ్వతమైన ఆశీర్వాదం కోసం భక్తుడిని అర్హత కలిగిస్తుంది. 

 ఈ ఉపవాసం ప్రతి సంవత్సరం మలయాళ మాసం ధను మొదటి రోజు నుండి పన్నెండవ తేదీ వరకు ప్రారంభమవుతుంది.

ఇతర పండుగలు నారీ పూజ, త్రికర్తక.


💠 ఇది తిరువల్ల రైల్వే స్టేషన్, KSRTC మరియు తిరువల్ల సిటీ సెంటర్ నుండి కేవలం 9 కి.మీ దూరంలో ఉంది. KSRTC బస్సులు తిరువల్ల నుండి చక్కలతుకావు మీదుగా అలప్పుజకు ప్రతి 7 నిమిషాలకు నడుస్తాయి.


రచన

©️ Santosh Kumar

శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 21*

 **తిరుమల సర్వస్వం -82* 

*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 21*

భారతదేశంలో ఉన్న ఎనిమిది స్వయంవ్యక్త క్షేత్రాలలో తలమానికమైనది తిరుమల క్షేత్రం. *జీవితంలో ఎనిమిదిసార్లు తిరుమల క్షేత్రాన్ని దర్శించుకుంటే, మిగతా ఏడు స్వయంవ్యక్త క్షేత్రాల్లో ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి దర్శించినంత ఫలం లభిస్తుంది.* 

*తిరుమల క్షేత్రంలో, ఆదివరాహస్వామి ఆలయ ప్రాంగణం నందు విరాజిల్లుతున్న స్వామిపుష్కరిణిలో స్నానమాచరించటం ఎన్నో జన్మల సుకృతం. ఈ పుష్కరిణిలో సంవత్సరానికి నాలుగు సార్లు చక్రస్నానం జరుగుతుంది.* భాద్రపదశుద్ధచతుర్దశి – అనంతపద్మనాభ వ్రతం నాడు. 

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తొమ్మిది రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో చివరిరోజు 

వైకుంఠ ద్వాదశి ఉదయం 

రథసప్తమినాటి మధ్యాహ్నం 

స్వామివారి పరివారదేవతలైన గరుత్మంతుడు, హనుమంతుడు, జయవిజయులు, సుదర్శనుడు మొదలగు వారిని దర్శిస్తే స్వామివారు పరమానందభరితుడవుతారు. అలాగే, బ్రహ్మోత్సవాల్లో ఆయన పరివార సదస్యుడైన సుదర్శనచక్రాన్ని సందర్శించుకొని వారితో బాటు చక్రస్నానం గావిస్తే స్వామివారు మరింత సంతృప్తి చెందుతారు. *చక్రమా హరి చక్రమా వక్రమన దనుజుల వక్కలించవో ||* 

*చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని* 

*చట్టలు చీరిన వో చక్రమా* 

*పట్టిన శ్రీహరిచేత పాయక ఈ జగములు*

 *ఒట్టుకొని కావగదవొ ఓ చక్రమా ||* 

*అలంకార తిరుమంజనం* 

ఇది వాహనోత్సవం కాదు. 

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవ - ఊరేగింపు కార్యక్రమాలయందు స్వామివారికి ఏదైనా తెలియని శ్రమ కలిగితే దానిని పోగొట్టి, నూతనత్వాన్ని, కాంతిమత్వాన్ని ఆపాదింపచేయటమే *


"స్నపనతిరుమంజన ఉత్సవం"* లేదా *"అలంకార తిరుమంజనం"* యొక్క లక్ష్యం. ఈ సాంప్రదాయం అనాదిగా వస్తోంది. 


రంగనాయక మండపాన్ని శోభాయమానంగా అలంకరించి, మొదటగా ఉత్సవర్లను స్వర్ణపీఠంపై వేంచేపు చేస్తారు. తరువాత తీర్థం (కుంకుమపువ్వు, యాలకలు, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం కలిపిన జలం) తో తిరుమంజనం లేక అభిషేకం చేస్తారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో, ఒకదాని తరువాత ఒకటిగా, జియ్యంగార్లు శంఖనిధి-పద్మనిధి బంగారు పాత్రలలో అందిస్తుండగా, కంకణభట్టాచార్యులైన అర్చకులు, ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. చివరగా సహస్రధారపాత్రతో అభిషేకం గావిస్తారు. ఒక్కో ద్రవ్యంతో అభిషేకం జరిగిన తర్వాత, ఉత్సవమూర్తులకు ఒక్కో రకం మొత్తం తొమ్మిది రకాల మాలలు, కిరీటాలు, జడలను - స్వామివారు, అమ్మవార్లకు అలంకరిస్తారు. వీటిని యాలకులు, ఎండుద్రాక్ష, వట్టివేళ్ళు, గులాబీ రేకులతో; వీటితో పాటుగా, కొన్నిసార్లు విలక్షణంగా శనగఫలాలు, చిక్కుడుకాయలు, చెర్రీ ఫలాలు, పొగడపూలు తులసీపత్రాలతో ఆకర్షణీయంగా తయారుచేస్తారు. ప్రత్యేకంగా తయారు చేయబడిన విసనకర్ర, అద్దం, ఛత్రం వీటిని కూడా అందుబాటులో ఉంచుతారు. పోయిన సంవత్సరం విసనకర్రను ముత్యాలతో, నెమలిపింఛాలతో తయారు చేశారు. అలాగే, అద్దాన్ని ముత్యాలు-తామరపువ్వుల గింజలతో, గొడుగును మంచిముత్యాలతో రూపొందించారు. 

స్నపనతిరుమంజనం జరుగుతున్నంతసేపు, మధ్యమధ్యలో ఉత్సవమూర్తులకు నివేదనలు సమర్పిస్తారు. ఒక సంవత్సరం జరిగిన స్నపనతిరుమంజనంలో ఆస్ట్రేలియా, సింగపూర్ భక్తులు సమర్పించిన నారింజ, కివి; జపాన్, థాయిలాండ్, అమెరికాకు చెందిన ప్లమ్ ఫలాలు; న్యూజిలాండ్ నుంచి తెచ్చిన గోల్డెన్ యాపిల్ ఫలాలు; భారతదేశంలోని సుదూరప్రాంతాల నుంచి వచ్చిన స్ట్రాబెర్రీ, దానిమ్మ ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. 

స్నపనతిరుమంజన కార్యక్రమం జరుపబడే రంగనాయకమండపాన్ని థాయిలాండ్, ఇండోనేషియా దేశాల నుండి తెప్పించిన ఆర్కిడ్స్, గ్లాడియోలస్, ఓరియంటల్ తులిప్స్ తో కన్నుల పండువగా అలంకరించారు. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

10-36-గీతా మకరందము

 10-36-గీతా మకరందము

          విభూతియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ | 

జయోఽస్మి వ్యవసాయోఽస్మి 

సత్త్వం సత్త్వవతామహమ్ || 


తా:- వంచక వ్యాపారములలో నేను జూదమును అయియున్నాను. మఱియు నేను తేజోవంతులయొక్క తేజస్సును (ప్రభావమును), (జయించువారలయొక్క) జయమును, (ప్రయత్నశీలురయొక్క) ప్రయత్నమును , (సాత్త్వికులయొక్క) సత్త్వగుణమును అయియున్నాను. 


వ్యాఖ్య:- ప్రపంచములోగల సమస్తపదార్థములందును, మంచివానియందుగాని, చెడ్డవానియందుగాని, భగవానుని అస్తిత్వము కలదు. వారి సాన్నిధ్యమే ప్రపంచములోని సమస్తపదార్థములకు, క్రియలకు శక్తిని ప్రసాదించుచున్నది. ఈ సత్యమును నిరూపించుటకు భగవాను డీ విభూతియోగమున కొందఱు దేవతలను, దానవులను, జంతువులను, జడపదార్థములను, కొన్ని క్రియలనుగూడ పేర్కొనెను. సంక్షేపించి చెప్పుటవలన ఒక్కొక్క తరగతికి ఒక్కొక్కటి చెప్పుకొనుచుపోయిరి. ఏ వస్తువును జూచినను, ఏ క్రియను పరికించినను అచ్చోట సాక్షాత్ భగవానునియొక్క అస్తిత్వమును భావనచేయవలెను. ఈ ఉద్దేశ్యముచేతనే జూదవిషయ మిచట ప్రస్తావింపబడినది కాని, దానిని ప్రోత్సహించవలెననిగాని, అనుసరించవలెననిగాని, అది ఉపాదేయమనిగాని అభిప్రాయము గాదు. ‘నేను మృగములలో సింహమును’ అని చెప్పినంతమాత్రమున సింహముతో ఆటలాడుకొనుమని అర్థముకాదుగదా! అట్లే ఈ జూదవిషయమున్ను - అని గ్రహించుకొనవలయును. 

      ‘వ్యవసాయము’ అనగా ప్రయత్నము తానని భగవానుడే పేర్కొనుటవలన మోక్షవిషయమున ప్రయత్నరహితులుగ, సోమరులుగనుండక సత్ప్రయత్నమాచరించుచుండుట శ్రేయస్కరమని తేలుచున్నది. ఎచట తేజము (ఉత్సాహము , ధైర్యము మున్నగునవి) ఉండునో, ఎచట దయయుండునో, ఎచట సత్ప్రయత్నముండునో, ఎచట సత్త్వగుణముండునో అచట తానుండునని భగవానుడు పలికిరి. కావున ఆ యా సద్గుణములను చక్కగ అలవఱచుకొనవలెను.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము*


*220 వ రోజు*

*సభలో సంజయుని సంధి ప్రస్తావన*


మరునాడు ధృతరాష్ట్రుడు సభ తీర్చాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, సోమదత్తుడు, శల్యుడు, దుర్యోధనాదులు సభా ప్రాంగణంలో వున్నారు. సంజయుడు సభను ఉద్దేశించి దృతరాష్ట్రునితో " రాజా! మీరు ఆదేశించినట్లు ఉపప్లావ్యం వెళ్ళి ధర్మరాజును చూసాను ధర్మరాజు పేరు పేరున మిమ్మలి యోగక్షేమాలు అడిగాడు. నేను వివరించాను. అలాగే కృష్ణార్జునులను కలిసాను. శ్రీకృష్ణుడు నాతో ఇలా అన్నాడు " సంజయా! అజాత శత్రువైన ధర్మరాజుకు కోపం వస్తే నీటిలో నిప్పు పుట్టిన చందాన ఉంటుంది. దానిని ఆర్పడం ఎవరి తరం కాదు. యుద్ధం అనివార్యం అయితే మీరు మీ సమస్త సంపదలు యోగ్యులకు పంచి బంధు మిత్రులతో భోగములను అనుభవించి యుద్ధ భూమికి రండి. నాడు సభలో ద్రౌపది గోవిందా రక్షించు అని నన్ను వేడుకున్నది ఇంకా చెవిలో వినిపిస్తుంది. తీర్చలేని ఆ అప్పు తీర్చకనే నేను సారథ్యం వహిస్తున్నను. అర్జునుని గాండీవానికి కౌరవ సేన దగ్ధం కాక తప్పదు " అన్నాడు. అప్పుడు అర్జునుడు " సంజయా! ధర్మరాజు అడిగినట్లు రాజ్య భాగం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు భీముడు నేను దుర్యోధనుని అకృత్యాలకు బదులు చెప్పక వదలము. దుర్యోధనుని యుద్ధ భూమిలో అంపశయ్య మీద పరుండ చేయకుంటే ధర్మరాజు భూశయనం చేసిన దానికి అర్ధము లేదు. భీముడు గద తీసుకుని యుద్ధ భూమిలో వీర విహారం చేస్తుంటే దుర్యోధనుడు రాజ్యం ఇవ్వక ఏమి చేస్తాడు. కౌరవులు మాటలతో సంధి చేయరు. కేవలం యుద్ధము తోనే మాట వింటారు. నకుల సహదేవులు, అభిమన్యుడు, సాత్యకి యుద్ధ భూమిలో వీర విహారం చేస్తున్నప్పుడు సుయోధనుడు సంధి చేస్తాడులే. శిఖండి శత్రురధికులను ఏరిఏరి చంపుతూ, చితకగొట్టుతూ భీష్ముని మీదకు ఉరికి యుద్ధ భూమిలో పడగోట్టినప్పుడు సుయోధనుడు యుద్ధాన్ని గురించి పశ్చాత్తాప బడతాడులే. దృష్టద్యుమ్నుడు ద్రోణుని మీదికి యుద్ధానికి దిగినప్పుడైనా సంధి చేయక తప్పుతుందా? సంజయా! పట్టుకోకుండానే గాండీవం గంతులేస్తోంది. మీట కుండానే నారి కంపిస్తోంది. నా అమ్ముల పొందిలోంచి బాణాలు మాటిమాటికి పైకి ఎగిరెగిరి దూకుతున్నాయి. యుద్ధంలో నేను వింటి నారి లాగి పిడుగుల వంటి బాణాలను గాండీవానికి సంధించి శత్రువుల శిరస్సులను ఛేదిస్తూ వుంటే దుర్యోధనుడి సేన చెల్లా చెదరుగా పారిపోతూ వుంటే దుర్యోధనుడు యుద్ధం గురుంచి పరితపిస్తాడులే. . ఇంద్రాది దేవతలు కూడా ఎవరిని జయించ లేరో వారిని జయించ గలనని మోహపడుతున్నాడు. కంస, నరక, మురులను సంహరించిన మహాత్ముడైన శ్రీకృష్ణుని కూడా దుర్యోధనుడు లక్ష్య పెట్టక అతడిని కూడా తను జయిస్తానను కుంటున్నాడు.. మేము భీష్మ, ద్రోణ, కృప అశ్వధామలతో నమస్కరించి రాజ్యం కోరి యుద్ధం చేస్తాము. మా రాజ్యాన్ని అధర్మంగా అపహరించి, నియమభంగం చేసి, తిరిగి మా రాజ్యాన్ని మాకు ఇవ్వని కౌరవులను సంహరించి మా రాజ్యాన్ని తీసుకుంటే ధర్మం గెలిచినట్లే కాని ఇందు అధర్మం ఏమీ లేదు. యుద్ధం జరిగిందా ఇక ధార్తరాష్ట్రు లేనట్లే. ఇలా నిండు సభలో ధ్రుతరాష్ట్రునికి నా మాటగా చెప్పు. భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వథామ, శల్యులు నిర్ణయించినది జరుగుతుంది. యుద్ధాన్ని నివారిస్తే సుయోధనుడు ఆయుష్మంతు డౌతాడు " అని చెప్పారని చెప్పాడు.

.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మనిషి జీవితం

 🙏🕉️శ్రీ మాత్రేనమః శుభోదయం 🕉️🙏                 🔥మనిషి జీవితం మొదట సంపాదన కోసం పోరాటం.. ఆ తరువాత పొదుపు కోసం పోరాటం.. పొదుపు తర్వాత  శాంతి కోసం వెతుకులాట.. చివరికి సంపాదించినదంతా వదలి రిక్తహాస్తాలతో 4 మంది భుజాలపై మట్టిలో కలసి పోవడంతో ముగుస్తుంది🔥మన గురించి నలుగురు ఏమనుకుంటుంన్నారో అని ఆలోచించే కంటే..మన గురించి మనం ఏం అనుకుంటున్నామన్నదే ముఖ్యం.. ఎందుకంటే మన జీవితం మనదే.. మానకొచ్చే కష్టానష్టాలు మనమే భరించాలి.. గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు.. కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది 🔥జీవితంలో అవసరాలు అందరికి వస్తాయి.. నేను ఎదుగుతున్నాను.. సంపాదిస్తున్నాను.. నాకు ఎవరితోను అవసరం రాదు లేదు అనుకోకు.. ఏ సమయం ఏరోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు🔥కాలానికి కర్మకూ జ్ఞాపకశక్తి  ఎక్కువ.. ఎంత కాలం తర్వాత అయినా సరే.. మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదలిపెట్టవు.. మంచిగా ఆలోచించు..మంచిగా మాట్లాడు..మంచి పని చేయి ఎందుకంటే ఏమిచేస్తామో అదే తిరిగి మన దగ్గరకి వస్తుంది🔥 మీఅల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజ మoడ్రి* 🙏🙏🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - హెమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం - అష్టమి & నవమి - పూర్వాభాద్ర -‌‌ ఇందు వాసరే* (09.12.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*