🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*శివ నామ మహిమ - విశిష్టత*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*పార్వతిదేవి:~*
*స్వామి!కలియుగంలో అధర్మం పెరుగుతుంది ఆచారాలు నశిస్తాయి.అప్పుడు మీ మీ భక్తుడు ఏ ఉపాయము చేత ముక్తిని పొందగలడు?*
*పరమేశ్వరుడు:~*
*దేవీ! కలికాలంలో మానవులు నా పంచాక్షర (నమఃశివాయ) విద్యను భక్తితో ఆశ్రయించిన సంసారబంధము నుండి ముక్తులవుతారు.*
*తపస్సు చేయువారు, వ్రతములు చేయువారు కూడా నా లోకమును పొందలేరు, కాని భక్తితో..పంచాక్షర మంత్రంతో..నన్ను ఒకసారి పూజించినవాడు ఈ మంత్ర ప్రభావమును నన్ను చేరుకుంటాడు.*
*అందువలన.. తపస్సు, యజ్ఞము, వ్రతములు, నియమాలు అన్నీ పంచాక్షర మంత్రము ద్వారా జరుగు నా పూజకు కోటివంతు కూడ సరిసమానము కాదు.*
*దేవీ! ఈశానుడు మొదలుగా గల పంచబ్రహ్మలు ఆ మంత్రమునకు అంగములు.*
*షడక్షర (ఓం నమఃశివాయ) లేక
పంచాక్షర (నమఃశివాయ) మంత్రము ద్వారా నన్ను భక్తిభావంతో పూజించువాడు ముక్తి పోందును.*
*నా భక్తుడు పంచాక్షర మంత్ర దీక్షను.. గురువు నుండి స్వికరించిన, తీసుకొనకపోయిన.. క్రోధమును జయించి.. ఈ మంత్రము ద్వారా నన్ను పూజించాలి.*
*మంత్ర దీక్షను పొందని వారికంటే. గురువు ద్వారా మంత్ర దీక్షను పోందిన వారు కోట్లరెట్లు అధికుడని భావించవలెను.*
*అందువలన దేవి.! దీక్షను తీసుకొని ఈ మంత్రముతో నన్ను పూజించాలి, ఈ మంత్ర దీక్షను తీసుకుని. స్నేహంభావము, కరుణ, ఉపేక్ష మొదలైన గుణములతో కూడి బ్రహ్మచర్య పరాయుణుడై భక్తి భావంతో నన్ను పూజించినవాడు నాతో సమానుడగును.*
*నా పంచాక్షర మంత్రమునందు నా భక్తులందరికి అధికారము కలదు . ఇది మిక్కిలి శ్రేష్టమైన మంత్రము.*
*ఈ మంత్ర ప్రభావము చేతనే.. వేదము, మహర్షులు, సనాతన ధర్మము, దేవతలు, ఈ సంపూర్ణ జగత్తు నిలిచిఉన్నది.*
*ఇదీ పంచాక్షర (నమఃశివాయ) మంత్ర మహిమ. భగవంతుడి నామాన్ని జపించడమే జపయజ్ఞం.*
*వాగర్థావివ సంపృక్తౌ*
*వాగర్థః ప్రతిపత్తయే।*
*జగతః పితరౌ వందే*
*పార్వతి పరమేశ్వరౌ..॥*
*ఓం నమః శివాయ..!*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి