**తిరుమల సర్వస్వం -82*
*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 21*
భారతదేశంలో ఉన్న ఎనిమిది స్వయంవ్యక్త క్షేత్రాలలో తలమానికమైనది తిరుమల క్షేత్రం. *జీవితంలో ఎనిమిదిసార్లు తిరుమల క్షేత్రాన్ని దర్శించుకుంటే, మిగతా ఏడు స్వయంవ్యక్త క్షేత్రాల్లో ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి దర్శించినంత ఫలం లభిస్తుంది.*
*తిరుమల క్షేత్రంలో, ఆదివరాహస్వామి ఆలయ ప్రాంగణం నందు విరాజిల్లుతున్న స్వామిపుష్కరిణిలో స్నానమాచరించటం ఎన్నో జన్మల సుకృతం. ఈ పుష్కరిణిలో సంవత్సరానికి నాలుగు సార్లు చక్రస్నానం జరుగుతుంది.* భాద్రపదశుద్ధచతుర్దశి – అనంతపద్మనాభ వ్రతం నాడు.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తొమ్మిది రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో చివరిరోజు
వైకుంఠ ద్వాదశి ఉదయం
రథసప్తమినాటి మధ్యాహ్నం
స్వామివారి పరివారదేవతలైన గరుత్మంతుడు, హనుమంతుడు, జయవిజయులు, సుదర్శనుడు మొదలగు వారిని దర్శిస్తే స్వామివారు పరమానందభరితుడవుతారు. అలాగే, బ్రహ్మోత్సవాల్లో ఆయన పరివార సదస్యుడైన సుదర్శనచక్రాన్ని సందర్శించుకొని వారితో బాటు చక్రస్నానం గావిస్తే స్వామివారు మరింత సంతృప్తి చెందుతారు. *చక్రమా హరి చక్రమా వక్రమన దనుజుల వక్కలించవో ||*
*చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని*
*చట్టలు చీరిన వో చక్రమా*
*పట్టిన శ్రీహరిచేత పాయక ఈ జగములు*
*ఒట్టుకొని కావగదవొ ఓ చక్రమా ||*
*అలంకార తిరుమంజనం*
ఇది వాహనోత్సవం కాదు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవ - ఊరేగింపు కార్యక్రమాలయందు స్వామివారికి ఏదైనా తెలియని శ్రమ కలిగితే దానిని పోగొట్టి, నూతనత్వాన్ని, కాంతిమత్వాన్ని ఆపాదింపచేయటమే *
"స్నపనతిరుమంజన ఉత్సవం"* లేదా *"అలంకార తిరుమంజనం"* యొక్క లక్ష్యం. ఈ సాంప్రదాయం అనాదిగా వస్తోంది.
రంగనాయక మండపాన్ని శోభాయమానంగా అలంకరించి, మొదటగా ఉత్సవర్లను స్వర్ణపీఠంపై వేంచేపు చేస్తారు. తరువాత తీర్థం (కుంకుమపువ్వు, యాలకలు, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం కలిపిన జలం) తో తిరుమంజనం లేక అభిషేకం చేస్తారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో, ఒకదాని తరువాత ఒకటిగా, జియ్యంగార్లు శంఖనిధి-పద్మనిధి బంగారు పాత్రలలో అందిస్తుండగా, కంకణభట్టాచార్యులైన అర్చకులు, ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. చివరగా సహస్రధారపాత్రతో అభిషేకం గావిస్తారు. ఒక్కో ద్రవ్యంతో అభిషేకం జరిగిన తర్వాత, ఉత్సవమూర్తులకు ఒక్కో రకం మొత్తం తొమ్మిది రకాల మాలలు, కిరీటాలు, జడలను - స్వామివారు, అమ్మవార్లకు అలంకరిస్తారు. వీటిని యాలకులు, ఎండుద్రాక్ష, వట్టివేళ్ళు, గులాబీ రేకులతో; వీటితో పాటుగా, కొన్నిసార్లు విలక్షణంగా శనగఫలాలు, చిక్కుడుకాయలు, చెర్రీ ఫలాలు, పొగడపూలు తులసీపత్రాలతో ఆకర్షణీయంగా తయారుచేస్తారు. ప్రత్యేకంగా తయారు చేయబడిన విసనకర్ర, అద్దం, ఛత్రం వీటిని కూడా అందుబాటులో ఉంచుతారు. పోయిన సంవత్సరం విసనకర్రను ముత్యాలతో, నెమలిపింఛాలతో తయారు చేశారు. అలాగే, అద్దాన్ని ముత్యాలు-తామరపువ్వుల గింజలతో, గొడుగును మంచిముత్యాలతో రూపొందించారు.
స్నపనతిరుమంజనం జరుగుతున్నంతసేపు, మధ్యమధ్యలో ఉత్సవమూర్తులకు నివేదనలు సమర్పిస్తారు. ఒక సంవత్సరం జరిగిన స్నపనతిరుమంజనంలో ఆస్ట్రేలియా, సింగపూర్ భక్తులు సమర్పించిన నారింజ, కివి; జపాన్, థాయిలాండ్, అమెరికాకు చెందిన ప్లమ్ ఫలాలు; న్యూజిలాండ్ నుంచి తెచ్చిన గోల్డెన్ యాపిల్ ఫలాలు; భారతదేశంలోని సుదూరప్రాంతాల నుంచి వచ్చిన స్ట్రాబెర్రీ, దానిమ్మ ఫలాలను నైవేద్యంగా సమర్పించారు.
స్నపనతిరుమంజన కార్యక్రమం జరుపబడే రంగనాయకమండపాన్ని థాయిలాండ్, ఇండోనేషియా దేశాల నుండి తెప్పించిన ఆర్కిడ్స్, గ్లాడియోలస్, ఓరియంటల్ తులిప్స్ తో కన్నుల పండువగా అలంకరించారు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి