17, డిసెంబర్ 2020, గురువారం

ప్రసవించిన స్త్రీకి చేయవలసిన

 ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు  - 


 

 *  బాలింతలకు ప్రసవించిన 8 వ దినము నుండి క్రమక్రమంగా శరీరమునకు బలము చేకూర్చు ఔషధములు , ఆహారములు వాడుట మంచిది. బాలింతలకు 12 దినములు గడుచునంత వరకు మాంసం పెట్టకూడదు. 


 *  గర్భం నందు శిశువు తల్లి ఆహారం పంచుకొని పెరుగుట చేత ప్రసవవేదన అనుభవించుట చేత , ప్రసవకాలమున అధిక రక్తస్రావం జరుగుటవలన బాగా అలిసిపోవడం వలన బాలింతరాలుకు  వ్యాధులు తొందరగా వచ్చును.అందుకొరకు తొందరగా బలం చేకూర్చుటకు ప్రత్యేక ఔషదాలు ఇవ్వవలెను. దశమూలారిష్టం టానిక్ గాని ద్రాక్షరిష్టం టానిక్ గాని , సౌభాగ్యశొంటి అను లేహ్యం కాని భోజనమును తరువాత వాడవలెను. దీనివలన మంచి జీర్ణశక్తి కలుగును. 


 *  బాలింతలకు పథ్యమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వవలెను . దేహశ్రమ , పురుషసంపర్కం , కోపం చల్లనిపదార్ధాలు వీటిని విడిచిపెట్టవలెను. అన్నివిధముల పరిశుభ్రముగా ఉండవలెను . నెయ్యి వంటి పదార్థం కలిసిన పథ్యమైన ఆహారం మితముగా భుజించవలెను. ప్రతిదినము తలంటుస్నానం చేయవలెను . ఈ నియమాలు బాలింత శ్రద్దగా ఒక నెలరోజుల పాటు అనుసరించవలెను. 


 *  బాలింతరాలు తలంటు స్నానం నందు మూడుమాసముల వరకు బలాధన్వంతర తైలం వాడుట మంచిది. దీనివలన నరములకు బలం కలుగును. 


 *  స్త్రీకి గర్భధారణ నిల్చిపోయి 6 సంవత్సరములు అయిన పిదప మరలా గర్భదారణ జరిగి ప్రసవం ఏర్పడినట్లైతే ఆ శిశువుకు ఆయుర్ధాయం తక్కువ ఉండునని శుశ్రుతుడు చెప్పెను. 


 *  బాగా పాతబడిన బియ్యాన్నే ఆహారముగా ఇవ్వవలెను. 


 *  కందికట్టు , ధనియాలపొడి , శొంఠిపొడి , వెల్లుల్లి పాయ కారం , నువ్వులనూనె , నువ్వులపొడి , ఇంగువ , పాతబెల్లం , తాంబూలం పాత ఉశిరిక పచ్చడి , పాతనిమ్మ పచ్చడి , పొట్లకాయ , మునగకూర , బీరకాయ , కందకూర 

ఆవుపాలు , వేడినీటి స్నానం , ఎక్కువ విశ్రాంతి ఇవన్ని తప్పకుండా ఆచరించాలి . 


 *  ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటిపూట భొజనం చేయాలి . బొప్పాయిపండు తినవచ్చు. రొట్టె , కాఫీ పుచ్చుకోవచ్చు. కాచి గోరువెచ్చగా ఉన్న చల్లార్చిన నీటిని తాగవచ్చు . 


 *  మాంసాహారం తీసుకునేవారు ఎండుచేపలు , కాల్చిన మాంసం , ఆవునెయ్యిలొ వేయించిన మాంసం , ఎండబెట్టిన మేకమాంసం , మేకమాంసానికి అల్లం , ఉప్పు , కొద్దిగా గరం మసాలా రాసి ఎండించి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఆవునెయ్యిలొ వేయించి తినవచ్చు . 


  బాలింతలు తినకూడని ఆహార పదార్దాలు  -


 

 *  ఎట్టి పరిస్థితులలో కొత్తబియ్యం అన్నం తినకూడదు. 


 *  చద్దిఅన్నం , పలుకుగా ఉన్న అన్నం తినరాదు.


 *  పచ్చి చేపలు , కొత్త చింతపండు , పులుసుకూరలు , మజ్జిగ , పెరుగు ముట్టుకోకూడదు. 


 *  చల్లటి పదార్దాలు ముట్టరాదు. 


    పైన చెప్పిన నియమాలు పాటించని బాలింతలకు సూతికా వ్యాధులు సంభవిస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులుగా మారి ప్రాణాలు హరిస్తాయి 

  


  

  గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

గీత. తృతీయా ధ్యా యాఫలము.

 గీత. తృతీయా ధ్యా యాఫలము.

            పూర్వము జనస్తానము అను నగరమున జడుడు అను బ్రాహ్మణుడు వుండెను .అతడు తన జాటికితగిన ఆచారములను పరిత్యజించి విషయా లో లుడై దనాసాపరుడై వ్యాపార నిమిత్తము వుత్తర దిశకు వెళ్లి అచట నుండి తీ రీ గీ  వచ్చు చుండగా

మార్గమ ధ్యమున. వొక. వృక్షము క్రింద చోరులు  అతనిని చంపివైచిరి.

           పాపాత్ముడ గుటచే మరణా నంతరము

అతడు పిశాచ రూపము ను పోం దెను.

  కొంతకాలము. గడచినతరువాత ధర్మాత్ముడయిన

అతని కుమారుడు తండ్రికి ఉత్తర  క్రియలు జరుపుట కోసము కాసినగరము నకు పోవుచు. మార్గమధ్యం లో తన తండ్రి. వదించబడిన వృక్షము క్రింద కూర్చుని

శ్రీ భగవదగీత  లోని మూడవ  అధ్యాయము ను

పారాయణ చేసెను.(తత్రధ్యాయం స గీతీ యా

      స్తృతీ యం సంజజా ప హా.)

            వెంటనే ఆకాశమున తనతండ్రి భయంకరమైన ప్రే తదేహము  ను. వీడి దివ్య విమానారూ డు డై యుండుట చూచి--''   తండ్రీ! ప్రేతత్వము పోయి నీకు దేవత్వము  లభించుట

కు కారణమేమి "  అని అతనిని అడుగగా

         "నాయనా! నీచే  ఫటించబడిన భగ వత్ గీత

తృతీయా థ్యా యమును వినుట వలన నాకు యిటువంటి దివ్యస్తితి చేకూరినది..

               యిక నీవు కాశీకి వెళ్ళవలసిన అవసరము

లేదు.యింటికి వెళ్లి యిదే ఉపాయము చే అనగా

గీత మూడవ అధ్యాయాన్ని  పారాయణము చేయుచూ  తద్వారా. లభించిన పుణ్యము దారబోసి

మన వంశజులంద రినీ  నరకలోకము నుండి ఉద్ధరింపుము"  అని పలికెను.   కుమారుడు అట్లే చేసెను.


అప్పుడు విష్ణుభవానుడు. యమ ధర్మరాజు వద్దకు

దేవదూతలు ను బంపి నరకలోకవాసులను  యముని కూడా వైకుంఠము నకు పిలిపించు కొనెను. అప్పుడు యమధర్మరాజు. విష్ణువును  స్త్రోత్రము. చేసి  అతని

ఆజ్ఞను పొంది. నిజలోకము నకు వెల్లేను


       యీ ప్రకారము గ  భగవద్గీత  తృతీయాధ్యాయమును పారాయణము చేయటము వల్ల మనుజుడు. పాపరహిత దివ్యాన్ని బొందు చున్నాడు

         


         యిది గీత తృతీయాధ్యాయ ఫలము.

పాప రాహిత్యం., ప్రేత త్వ విముక్తి.

(శ్రీ శుక బ్రహ్మా శ్రమము నుం�

పంతులు గారి మెస్"🙏

 తిరుపతి నుండి వస్తూ ఒంగోలు లో భోజనం కోసం ఆగాము.మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందా?? అని విచారించగా ఒక ఆపద్బాంధవుడు "పంతులు గారి మెస్" కి వెళ్ళండి అని సలహా ఇచ్చాడు. ఒంగోలు అంటే "అల్లూరయ్య మైసూర్ పాక్ " తెలుసుకాని పంతులు గారి మెస్ గురించి వినడం ఇదే మొదటిసారి.


నిజముగా సలహా ఇచ్చిన ఆ పెద్దమనిషికి కృతజ్నతలు చెప్పాలి. భోజనము ఆమోఘంగా ఉంది. విపరీతమైన రద్ధి.కూచోటానికి ఖాళీ ఒకపట్టాన దొరకలేదు.

అది ఒక పాతకాలం ఇల్లు. అయినా విశాలమైన గదులుతో సౌకర్యంగా ఉంది. షడ్రసోపేతమైనభోజనం. రోటి పచ్చడి అంటే రోటి పచ్చడే.. మిక్సిలు అసలు వాడరుట. కారప్పొడి దగ్గరనుండి ప్రతి పదార్ధము రుచిగా ఉంది. ఇక నెయ్యి వేస్తున్నారా ....పోస్తున్నారా??!! అన్నది సందేహమే. అసలే నేతి ప్రియుడి నైన నేను ఈ 

"నేతి పాతాన్ని " చూసి పులకించిపోయా. ఆ నెయ్యి పడేటప్పటికి " ఝటరాగ్ని" రాజుకుంది.

పప్పులో కానీ పులుసు లో కానీ తిరగమాత సరైన మోతాదులో ఉంది. వడ్డించేవాళ్ళు కొసరి కొసరి వేసేవాళ్లే కానీ కసిరి కసిరి వెయ్యడం లేదు.సుమారు 30 ఏళ్ళు నుండి ఇదే తంతట. 


మాంఛిఆకలి మీద విరుచుకు పడి తిన్నానేమో భుక్తాయాసం తో వెంటనే కార్ నడపడం కష్టం అనిపించినా మంచి భోజనం చేసామన్న తృప్తి ఆ కష్టాన్ని కప్పి పుచ్చింది.

ఇక నుండీ ఇటుగా వెళ్ళేటప్పుడు ఇక్కడే భోజనం చెయ్యాలని తీర్మానం ప్రవేశపెట్టగా మిత్రబృందం యావత్తూ ఆమోదించారు.  

మీరు కూడా ఒంగోలు వెళ్తే

"డోంట్ మిస్...పంతులు గారి మెస్"🙏🌷

మూడవ పాశురము*

 🌹💐🌷🌾🥀🌸💐

*తిరుప్పావై మూడవ పాశురము*


ఓంగియులగళన్డ వుత్తమన్ పేర్పాడి నాజ్ఞళ్ నమ్పావైక్కు చ్చాత్తి నీరాడినాల్ 

తీంగిన్రి నాడెల్లాం తిజ్ఞళ్ ముమ్మారి పెయ్దు. ఓంగి పెరుఇ్బన్న లూడు కయలుగళ పూంగువళై ప్పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప తేజ్గాదే పుక్కిరిన్దు శీర్ త్తములై పట్రివాంగ

కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుమ్పశుక్కల్ నీఙ్గాద శెల్వం నిరైన్దేలో రెమ్బావాయ్



పెరిగి లోకాలు కొలిచిన పురుషోత్తముని కీర్తించి

నోము పేరున కలసి మేము నీరాడితే, దేశమంతా నెల మూడు వానలు కురిసీ ఈతిబాధలు తొలుగు

పెరిగిన ఎఱ్ఱని వరిచేల పైకెగురు చేపలు నీరజముల మెరసి నిదురించు తుమ్మెదలు

స్థిరముగ కూర్చుండి సిరములను లాగ కలశములను నింపు కామధేనువులు

నిత్య సంపదలతో నిండుగా నుండు

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము


               M.s.s.k

హేమంత మిలతరింప

 తే.గీ. 

మంచుదుప్పటి దాల్చి చేమంతి నెంచి 

బంతి సీమంతమాడంగ పంతమాడి 

చెలులకౌగిళ్ళముర్మురశ్రీలనొసగి 

హొయలువోయెనో హేమంత మిలతరింప 

                                    ✍️శ్రీశర్మద.

ధార్మికగీత - 112*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 112*

                                     *****

          *శ్లో:- సత్సంగత్వే నిస్సంగత్వం ౹*

                 *నిస్సంగత్వే  నిర్మోహత్వం ౹*

                 *నిర్మోహత్వే  నిశ్చలతత్త్వం ౹*

                 *నిశ్చలతత్త్వే   జీవన్ముక్తిః ౹౹*

                                     *****

*భా:- మానవ జీవిత లక్ష్యం మోక్షసాధనయే. సత్పురుష సమాశ్రయమే దానికి సులభోపాయము. 1."సత్సంగత్వము":-  సజ్జన సంగతి వలన ప్రాపంచిక విషయ వాసనలు, మనో వాక్కాయ మాలిన్యము క్రమంగా వైదొలగి, సద్భావాలు, సద్భాషణ, సదాచరణ అలవడతాయి.ఇదే నిస్సంగత్వము. 2."నిస్సంగత్వము":- ప్రాపంచిక విషయ వాసనా నిర్మూలన వలన కామాదులు, మదాదులు,తాపాలు,ఈషణలు ఇత్యాదులపై దట్టంగా పేరుకు పోయిన బలీయమైన వ్యామోహము అణగారి పోతుంది. ఇదే నిర్మోహత్వము.3."నిర్మోహత్వము":- మోహ క్షయము వలన  మన మనస్సు నందు తిష్ట వేసుకున్న చాంచల్యము,అస్థిరత ,వ్యాకులత పూర్తిగా సమసిపోతాయి. తద్వారా ప్రశాంతత,నిశ్చలత, నిర్భరత యేర్పడి, బుద్ధి నిర్మల మౌతుంది. ఇదే నిశ్చల తత్త్వము.   4. "నిశ్చలతత్త్వము":-  నిర్మలమైన  బుద్ధి వలన ఏకాగ్రత, నైష్ఠికత, నిమగ్నతలతో పూతాత్ముడై, భగవద్రతిలో పునీతుడై, ఆత్మ సాక్షాత్కారమును పొంది, సంసార బంధములనుండి విముక్తుడు అవుతాడు. ఇదే జీవన్ముక్తి. సత్పురుషుని యొక్క  దర్శన, స్పర్శన, భాషణ, భావనల మహత్తర ప్రభావమే మానవుని మోక్ష సాధనకు ప్రధానమైన ఆలంబనమని సారాంశము. "త్రిజగతి సజ్జన సంగతి రేకా - భవతి భవార్ణవ తరణే నౌకా" అన్నారు శంకరాచార్యులు." సాధు సంగంబు సకలార్థ సాధనంబు"అని; "పాపం,తాపం చ, దైన్యం చ - హన్తి సజ్జన దర్శనమ్" అని నీతిజ్ఞులు సజ్జన సాంగత్యము వలన కలిగే  అర్థమును ,పరమార్థమును తేటతెల్లము చేశారు.*

                                 *****

                 *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

S





 

Tune










 

Pravachanam





 

Pasaralu








 

శ్రీమద్భగవద్గీత

 🙏శ్రీమద్భగవద్గీత🙏

6వ అధ్యాయము 

ధ్యాన యోగము


శ్రీ భగవానువాచ ।

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।

స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః ।। 1 ।।


శ్రీ భగవానువాచ — భగవంతుడు పలికెను; అనాశ్రితః — ఆశించకుండా; కర్మఫలం — పనుల యొక్క ఫలితములు; కార్యం — చేయవలసిన; కర్మ — పని; కరోతి — నిర్వర్తించుట; యః — ఎవరైతే; స: — ఆ మనిషి; సంన్యాసీ — సన్యసించిన; చ — మరియు; యోగీ — యోగి; చ — మరియు; న — కాదు; ని: — లేకుండా; అగ్ని — అగ్ని; న — కాదు; చ — మరియు; అక్రియః — క్రియా రహితంగా.


భావము 6.1: భగవంతుడు పలికెను: ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను (చేయవలసిన విధులను), చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని, కేవలం అగ్ని హోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరిక క్రియలు త్యజించిన వారు కాదు.


వివరణ: 

వేదాలలో అగ్ని హోత్ర యజ్ఞముల వంటి కర్మ కాండలు చెప్పబడినవి. సన్యాసాశ్రమంలో ప్రవేశించిన వారు కర్మ కాండలు చేయకూడదనే నియమాలు ఉన్నాయి, నిజానికి వారు అగ్నిని తాకరాదు, వంట కోసంకూడా తాకరాదు. భిక్ష అన్నాన్ని మాత్రమే స్వీకరించాలి. కానీ, కేవలం అగ్నిని విడిచిపెట్టినంత మాత్రాన, వ్యక్తి సన్యాసి అయిపోడు.


నిజమైన యోగులు ఎవరు? నిజమైన సన్యాసులు ఎవరు? ఈ విషయంపై చాలా అయోమయం ఉంది. జనులు అనుకుంటారు, "ఈ స్వామీజీ ఫలాహారి (అంటే పండ్లు తప్ప ఇంకా ఏమీ తిననివాడు), కాబట్టి ఈయన ఒక ఉన్నతమైన యోగి." "ఈ బాబాజీ దూధాహారి (పాల మీదనే బ్రతుకుతాడు), కాబట్టి ఇంకా ఉన్నతమైన యోగి." "ఈ గురూజీ పవనాహారి (ఏమీ తినరు, కేవలం శ్వాస మీదనే జీవిస్తాడు), కాబట్టి తప్పకుండా భగవత్ ప్రాప్తి నొంది ఉండాలి." "ఈ సాధువు నాగా బాబా (వస్త్రములు కట్టుకోని సాధువు), కాబట్టి సంపూర్ణంగా సన్యాసం స్వీకరించినట్టే." కానీ, శ్రీ కృష్ణుడు ఈ అన్ని ద్రుక్పథాలని ఖండిస్తున్నాడు. కేవలం బాహ్యమైన సన్యాస శకలు ఎవరినీ సన్యాసిని కానీ యోగిని కానీ చేయవు. ఎవరైతే తమ కర్మ ఫలములను భగవంతుకే అర్పిస్తారో వారే నిజమైన సన్యాసులు, యోగులు.


ఈ మధ్య కాలంలో, 'యోగా' అనేది పాశ్చ్యాత్య దేశాల్లో చాలా ప్రాచుర్యం లోకి వచ్చింది. ఎన్నెన్నో యోగా స్టూడియోస్ ప్రతి దేశంలో, ప్రతి ఊర్లో వచ్చేసాయి. గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రతి పది మందిలో ఒకరు యోగాభ్యాసము చేయుచున్నారు. కానీ, ఈ 'యోగా' అన్న పదం సంస్కృత వాజ్మయంలో లేదు. అసలైన పదం ఏమిటంటే అది 'యోగ్', అంటే ఏక మవ్వటం. ఇది జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వటాన్ని సూచిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, యోగి అంటే మనస్సు పూర్తిగా భగవంతునితో ఏకమయినవాడు అని అర్థం. అంటే, అటువంటి యోగి మనస్సు సహజంగానే ఈ ప్రపంచం నుండి ఉపసంహరించబడి ఉంటుంది. కాబట్టి, ఒక నిజమైన యోగి ఒక నిజమైన సన్యాసి కూడా.


కర్మ యోగమును పాటించే వారు తమ అన్ని కార్యములను, ఫలాపేక్ష లేకుండా, భగవంతుని పట్ల వినయ విధేయ సేవా దృక్పథం లోనే చేస్తారు. వారు గృహస్థులైనా అటువంటి వ్యక్తులు నిజమైన యోగులు మరియు అసలైన సన్యాసులు.

శ్రీమద్భగవద్గీత

 🙏శ్రీమద్భగవద్గీత🙏

6వ అధ్యాయము 

ధ్యాన యోగము


యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ ।

న హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ।। 2 ।।


యం — ఏమిటి; సన్న్యాసం — సన్యాసము; ఇతి — ఈ విధంగా; ప్రాహుః — అంటారు; యోగం — యోగము; తం — అది; విద్ధి — తెలుసుకొనుము; పాండవ — అర్జునా, పాండు పుత్రుడా; న — కాదు; హి — నిజముగా; అసన్న్యస్త — త్యజించకుండా; సంకల్పః — కోరిక; యోగీ — ఒక యోగి; భవతి — అగుట; కశ్చన — ఎవరైనా.


భావము 6.2: సన్యాసము అని అందరూ అనుకునేది, యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే, ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు.


వివరణ:

సన్యాసి అంటే మనో-ఇంద్రియముల సుఖాలను త్యజించిన వాడు అని. కానీ కేవలం సన్యసించటమే లక్ష్యం కాదు, ఇంకా, సన్యసించటం మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవటానికి సరిపోదు. సన్యాసమంటే మనం తప్పు దిశలో పరిగెత్తటం ఆగినట్టు. మనం ఒకప్పుడు ఈ ప్రపంచంలో ఆనందాన్ని వెతుకుతూ ఉండే వాళ్ళం, కానీ భౌతిక సుఖాలలో ఆనందం లేదని అర్థం చేసుకున్నాము, కాబట్టి మనం ప్రపంచం దిశగా పరిగెత్తటం ఆపివేసాము. కానీ, ఆగిపోయినంత మాత్రాన లక్ష్యం చేరుకోలేము. ఆత్మ పొందవలసిన లక్ష్యం భగవత్-ప్రాప్తి. భగవంతుని దిశగా వెళ్ళటం - మనస్సుని ఆయన దిశగా తీసుకెళ్లటం - యోగ మార్గము. జీవిత లక్ష్యం యొక్క అసంపూర్ణ జ్ఞానం కలవారు, సన్యాసం తీసుకోవటమే అత్యున్నత లక్ష్యంగా అనుకుంటారు. నిజమైన జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకున్నవారు, భగవత్ ప్రాప్తియే తమ ఆధ్యాత్మిక ప్రయాణ అంతిమ లక్ష్యం గా తెలుసుకుంటారు.


5.4వ శ్లోకం యొక్క వివరణలో, రెండు రకాల సన్యాసం ఉంటాయి అని చెప్పబడింది - ఫాల్గు వైరాగ్యం మరియు యుక్త వైగాగ్యం అని. ఫాల్గు వైరాగ్యం అంటే ప్రాపంచిక వస్తువులను మాయకు చెందిన (భౌతిక శక్తి) వస్తువులగా పరిగణించి, ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా ఉంటాయి కాబట్టి వాటిని త్యజించటం. యుక్త వైరాగ్యం అంటే సర్వమూ భగవంతునికి చెందినవనే భావించి, కాబట్టి అవన్నీ భగవత్ సేవకి ఉపయోగించబడేవే అని అనుకోవటం. మొదటి రకం సన్యాసంలో, ఇలా అంటారు, "డబ్బు ని విడిచిపెట్టు. దానిని ముట్టుకోవద్దు. అదొక మాయా స్వరూపము, మరియు అది ఆధ్యాత్మిక పథానికి అవరోధం కలిగిస్తుంది." రెండవ రకం సన్యాసంలో, ఇలా అంటారు, "డబ్బు కూడా ఆ భగవత్ శక్తి స్వరూపమే, దానిని వృధా చేయవద్దు లేదా పారేయొద్దు; నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే దాన్ని భగవత్ సేవ లో ఉపయోగించుము” అని.


ఫాల్గు వైరాగ్యమనేది అస్థిర మైనది, మరల ఈ ప్రపంచంతో మమకారం ఏర్పరుచుకోవటానికి సులభంగా మారిపోతుంది. 'ఫాల్గు' అన్న పదం, బీహార్ రాష్ట్రం లోని గయ పట్టణం లో ఉన్న ఒక నది నుండి వచ్చింది. ఫాల్గు నది భూమి క్రింది పొరల్లో ప్రవహిస్తుంది. పై నుండి చూస్తే అక్కడేమీ నది ఉన్నట్టు ఉండదు, కానీ కొన్ని అడుగులు తవ్వితే, క్రింద ప్రవాహం కనపడుతుంది. ఇదే విధంగా ఏంతో మంది జనులు ప్రపంచాన్ని వదిలి ఆశ్రమంలో జీవించటానికి వెళ్తుంటారు, కానీ కొద్ది సంవత్సరాల్లోనే వైరాగ్యం మాయమై మనస్సు తిరిగి ప్రపంచం యందే అనుబంధాన్ని ఏర్పరుచుకుంటుంది. వారి వైరాగ్యం ఫాల్గు వైరాగ్యం. ఈ ప్రపంచం కఠినమైనది, కష్టాలతో కూడుకున్నది అని తెలుసుకొని, దాని నుండి తప్పించుకోవటానికి ఆశ్రమంలో ఉంటారు. కానీ, ఆధ్యాత్మిక జీవితం కూడా కష్టతరమైనది మరియు భారమైనది అని గ్రహించిన తరువాత వారు ఆధ్యాత్మికత నుండి కూడా విడిపోయారు. కానీ, మరికొందరుంటారు, వారు భగవంతునితో ప్రేమ పూర్వక సంభంధం ఎర్పరుచుకుంటారు. ఆయనకు సేవ చేయాలనే ప్రేరణ తోనే, ఆశ్రమంలో చేరుకోవటానికి, ప్రపంచాన్ని త్యజిస్తారు. వారి సన్యాసం యుక్త వైరాగ్యము. వారు సాధారణంగా, ఎటువంటి కష్టాలు ఎదురైనా, తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు.


ఈ శ్లోకం యొక్క మొదటి పాదంలో, నిజమైన సన్యాసి అంటే ఒక యోగి అని- మనస్సుని ప్రేమ పూర్వక సేవలో భగవంతునితో ఏకం చేసేవాడు - అని , శ్రీ కృష్ణుడు చెప్పాడు. రెండవ పాదం లో, ప్రాపంచిక కోరికలను త్యజించకుండా వ్యక్తి యోగి కాలేడు అని శ్రీ కృష్ణుడు చెప్పాడు. మనస్సులో భౌతిక ప్రాపంచిక కోరికలు ఉన్నప్పుడు అది సహజంగానే ప్రపంచం వైపు పరుగులు తీస్తుంది. భగవంతునితో ఏకమవ్వాల్సింది మనస్సే కాబట్టి, మనస్సులో ఎటువంటి ప్రాపంచిక కోరికలు లేనప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఓ వ్యక్తి, యోగి కావాలంటే అంతర్గతంగా సన్యాసి అవ్వాలి; మరియు యోగిగా ఉంటేనే, సన్యాసి అవ్వగలడు.

అదృష్ట సంఖ్యలు

 అదృష్ట సంఖ్యలు - మంచి రోజులు


మానవుడికి కలిసి వచ్చే సంఖ్యలు కూడా ఉంటాయి. వివిధ రాశుల్లో జన్మించిన జాతకులు అదృష్ట సంఖ్యలు, మంచి రోజులను బట్టి కార్యాచరణ చేయడం ఉత్తమమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అదృష్ట సంఖ్యల్లో వాహనాలు కొనడం, రాశికి అనుగుణమైన రోజున శుభకార్యాన్ని మొదలు పెట్టడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి.


సంఖ్యా జ్యోతిష శాస్త్రములో ఫలితములు తెలుసుకొనుట రెండు విధములు. అందులో ఒకటి.. వారివారి జన్మ తేదీని బట్టి ఫలితములు తెలుసుకొనుట. రెండవది జన్మ తేదీ లేకపోతే వారి పేరులోని అక్షరముల సంఖ్యల ప్రకారం తెలుసుకోవడం.


సంఖ్యలకు గ్రహాల నిర్ణయం

1 రవి 4 రాహువు 7 కేతువు 2 చంద్రుడు 5 బుధుడు 8 శని 3 గురుడు 6 శుక్రుడు 9 కుజ


ఇంగ్లీషు అక్షరములకు అంకెలు

A   B   C   D  E  F  G   H  I  J  K  L  M  N  O  P   Q  R  S  T   U  V W  X  Y  Z

1   2   3  4  9  8  7  6  5 1 1  2   3  5  7  8  1  2  3  4  6  6  6  5  1  7

దీనిని బట్టి ప్రతివారి పేర్లు ఫలితాలను, మిగిలిన విషయములో సులభంగా తెలిసుకొవచ్చు. ఏ సంఖ్యకు ఏ గ్రహమో తెలుసుకోవాలి. వాటి కారకత్వమును కూడా తెలిసికొనుట యుక్తము.

ఉదా:  RAJU

         2116

2+1+1+6=10, (1+0) = 1 (అంటే రాజు అనే వ్యక్తికి 1 వస్తుంది. 1వ సంఖ్య వారు 1 సంఖ్య అధిపతి రవి. ఏ మాసములోనైనా 1, 10, 19, 28 తేదీలలో జన్మించినచో జన్మ సంఖ్య 1 అగును. వీరికి ఒకటి అదృష్ట సంఖ్య అగును. ఆది, సోమవారములు అదృష్ట రోజులు అవి.. 1, 10, 19, 28 తేది అయినచో విశేష అదృష్ట దినములగును. వీరికి 2, 4, 7 సంఖ్యలు తేదీలు అదృష్ట రోజులు. వీరికి ఏక సంఖ్య 2, 4, 7, ఇంకా.. 11, 13, 16, 20, 22, 25, 29, 31 తేదీలు ఇంకా.. ఆ సంఖ్యలు గలవి అనుకూలములైనవి అగును. వీరు కెంపును ధరించాలి. 2వ సంఖ్య వారు ఏ మాసంలో నైనను 2,11,20, 29 తేదీలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 2 అగును. అధిపతి చంద్రుడు. వీరికి 1, 4, 7 తేదీలు. ఇంకా రెండు అంకెలు సంఖ్యలు వచ్చు 10, 13, 16, 22, 25, 31 తేదీలు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి.


వీరికి ఆది, సోమ, శుక్రవారములు అనుకూలమైనవి. ఆ వారములు 2, 11 20, 29 అయినచో విశేష అదృష్టము. వీరు ముత్యము ధరించాలి. 3వ సంఖ్య వారు ఏ మాసములో నైనను 3, 12, 21 30 తేదీలలో జన్మించినచో అదృష్ట సంఖ్య 3 అగును. వీరికి 3,6,9 తేదీలు ఆ సంఖ్యగల వాహనములు, లాటరీ టిక్కట్లు అనుకూల ఫలితాలనిస్తాయి. వీరికి మంగళ, గురు, శుక్రవారములు అనుకూలమైనవి. ఆ వారములు 3, 12, 21, 30 తేదీలు అయితే ఇంకాను విశేష అదృష్ట ప్రదములైనవి. ఆసంఖ్యకు అధిపతి గురుడు. 6, 9, 15, 18, 24, 27 తేదీలు మరియు ఆ సంఖ్యలు కూడా అనుకూలమైనవి. మీరు కనకపుష్యరాగము ధరించాలి. 4వ సంఖ్య వారు ఈ సంఖ్యకు అధిపతి రాహువు. ఏ మాసములోనైనను 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారికి జన్మసంఖ్య అనగా.. అదృష్ట సంఖ్య 4 అవుతుంది. వీరికి సోమ, ఆది, శనివారములు అనుకూలము. ఆ వారములు 4, 13, 22, 31 తేది అయితే ఇంకను విశేష శుభ ప్రదములు. వీరికి 1, 2, 7, 10, 11, 16,19, 20, 25, 28, 29 తేదీలు కూడా శుభప్రదములు.


వీరికి 1,2,7,10,11,16,19,20,25,28,29 తేదీలు కూడా అనుకూలమైనవి. వీరు ఉంగరములో గోమేధికము అనే రత్నము ధరించాలి. 5వ సంఖ్య వారు ఏ మాసంలోనైనను 5, 14, 23 తేదీలలో జన్మించిన వారి అదృష్ట సంఖ్య 5 అగును. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. వీరికి బుధ, శుక్రవారములు అదృష్ట రోజులు. ఆది, బుధ, శుక్రవారములు 5, 14, 23 తేదిలు అయినచో ఆ రోజుల విశేష అదృష్ట దినములగును. వీరు ఉంగరములో పచ్చ ధరించడం మంచిది. ఈ అంకెలు గల లాటరీ టిక్కెట్లు బుధ, శుక్రవారములలో కొనుట మంచిది.


6వ సంఖ్య వారు ఏ మాసములో నైనను 6, 15, 24 తేదీలలో జన్మించిన వారికి అదృష్టసంఖ్య 6 అగును. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. వీరు యితరుల అభిమానమును సులభముగా పొందగలరు. వీరు నలుపురంగు వస్త్రములు ధరించుట మంచిదికాదు. మంగళ, గురు, శుక్రవారములు అయినప్పుడు అట్టి తేదీలు గల దినములు విశేష అదృష్ట దినములగును. వీరు వజ్రం ధరించడం మంచిది.


7వ సంఖ్యవారు ఏ మాసంలోనైనను 7, 16, 25 తేదీలలో జన్మించిన వారికి జన్మ సంఖ్య 7 అగును. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. ఈ సంఖ్య గల వారికి 2వ సంఖ్య గల వారితో సర్వవిషయములందును పొత్తుగా కుదురును. వీరికి ఆదివారము, సోమవారము 7, 16, 25, 29 తేదీలతో కూడి ఉన్నచో వ్యాపారము చేసి ధన సంపాదన చేయడంలో శక్తి యుక్తుల గలవారై ఉంటారు. వీరికి 1, 2, 4, 10, 11, 13, 19, 22, 28, 29, 31 తేదీలు సామాన్యంగా ఉండును వీరు ఉంగరములలో వైఢూర్యం ధరించడం మంచిది.


8వ సంఖ్య వారు ఏ మాసంలోనైనను 8, 17, 26 తేదీలలో జన్మించినవారి అదృష్ట సంఖ్య 8 అగును. దీనికి అధిపతి శని అందువల్ల ఉంగరములో ఇంద్రనీలం అనే రాయి ధరించుట శుభకరం. అదృష్ట తేదీలు 8, 17, 26. వీరికి శనివారము, సోమవారము, ఆదివారము కూడా అనుకూలమైన దినములు. వీరు ఏ కార్యమునైననూ 8, 17, 26 తేదీలలో ప్రారంభించడం మంచిది. నూతన వ్యాపారము కూడా ఈ తేదీలలో ప్రారంభించుట మంచిది.8, 17, 26 తేదీలు అదృష్ట సంఖ్యలు 9వ సంఖ్య వారు ఏ మాసంలోనైనను 9, 18, 27 తేదీలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 9 అగును. దీనికి అధిపతి కుజుడు. వీరు కుజ వ్యక్తులు. వీరు తరచుగా సైనికులుగా వ్యవహరిస్తారు. జీవితంలో 30సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కష్టములుగయున్నను. తరువాత స్వయంకృషితో ఉన్నతస్థాయికి చేరుకొంటారు. వీరికి మంగళ, గురు, శుక్రవారములు 3, 6, 12,15, 18, 21, 24, 27, 30, తేదీలు అనుకూలము. వీరు ఉంగరములో పగడం ధరించుట మంచిది. ఏ సంఖ్యనైనను 9తో గుణించగా వచ్చిన సంఖ్యలు గల అంకెలన్నింటిని కలుపగా మళ్లీ 9 వచ్చును. 12x9 = 108 మళ్లీ ఈ మూడు సంఖ్యలు కలిపి ఒక సంఖ్య చేస్తే 9 వచ్చును.


రాశులను బట్టి అదృష్ట సంఖ్యలు - శుభ దినాలు


మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3. ఆది, సోమ, గురు శుక్రవారాలు మంచి రోజులు. ఈ రోజుల్లో ఏ పనినైనా ప్రారంభించినా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.


వృషభరాశి వారి అదృష్ట సంఖ్యలు 6, 5, 8, 9. మంగళ, శుక్రవారాలు వీరికి మంచివి.


మిధునరాశి వారి అదృష్ట సంఖ్యలు 5, 1, 6, 7, 8. ఆది, శుక్ర, శని వారాలు వీరికి అదృష్టాన్నిచ్చే రోజులు.


కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్యలు 2 మాత్రమే. మంగళ, శుక్రవారములు మంచివి.


సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 5, 9. ఆది, మంగళ, గురువారములు వీరికి అనుకూలం.


కన్యారాశి వారి అదృష్ట సంఖ్యలు 5, 1, 3, 4, 6. ఆది, శుక్ర, సోమ వారాల్లో శుభకార్యాలు తలపెట్టడం మంచిది.


తులారాశి వారి అదృష్ట సంఖ్యలు 6, 2, 7, 9. సోమ, శుక్ర, శని వారాలు వీరికి అనుకూలిస్తాయి.


వృశ్చికరాశి వారి అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3. ఆది, సోమ, గురు వారాలు యోగప్రదాలు.


ధనుస్సురాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 2, 4, 5. ఆది, బుధ, గురు వారాలు వీరికి కలసివస్తాయి.


మకరరాశి వారి అదృష్ట సంఖ్యలు 8, 3, 4, 5, 9. సోమ, మంగళ, శుక్రవారములు మంచివి.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

దీర్ఘాయుష్మాన్

 దీర్ఘాయుష్మాన్ భవ అంటే?


చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శనానికి నలుగురైదుగురు పండితులు వచ్చారు. స్వామి వారికి సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామి వారు భక్తులతో మట్లాడుతూ, ఆ కూర్చున్న పండితులనుద్దేశించి ఇలా అడిగారు. 


“భక్తులు నాకు నమస్కరిస్తే, నేను వారిని “నారాయణ నారాయణ” అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్తులు ఏమని అశీర్వదిస్తారు?”


మేము ‘దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య’ అని అశీర్వదిస్తాము అదే సంప్రదాయము” అని అన్నారు. 


”అంటే ఏమిటి?” అని మహాస్వామి వారు ప్రశ్నించారు. 


”చాలాకాలం సౌఖ్యంగా ఉండు” అని దీని అర్థం. 


మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్న వేసారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామి వారు కొద్ది సేపు మౌనంగా ఉండి, “మీరందరూ చెప్పిన అర్థం తప్పు” అన్నారు. 


పండితులు ప్రశ్నార్థకంగా చూసారు. వాళ్ళందరూ పెద్ద విధ్వాంసులు. సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు. మంచి విద్వత్ కలిగిన వారు.


సంస్కృత వాక్యం “దీర్ఘాయుష్మాన్ భవ” అనునది చాలా సామాన్యము. సంస్కృత పరిజ్ఞానము ఏమి లేకపోయిననూ అర్థమగును. కానీ  మహాస్వామి వారు ఆ అర్థము తప్పు అంటున్నారు అని పండితులు ఒకరి మొహాలు ఒకరు చూసుకునుచున్నారు.


వారి పరిస్థితి చూసి మహాస్వామి వారు ”నేను చెప్పనా దాని అర్థం” అని అన్నారు. పండితులంతా చెవులు రిక్కించారు. 


”పంచాంగములోని (తిథి వార నక్షత్ర యోగ కరణ) పంచ అంగములలో ఉన్న 27 యోగములలో ఒకటి ఆయుష్మాన్ యోగము, 11 కరణములలో ఒకటి భవకరణము, వారములలో సౌమ్య వాసరము అంటే బుధవారము అని అర్థం. ఎప్పుడైతే ఇవి మూడు అంటే ‘ఆయుష్మాన్-యోగము’, ‘భవ-కరణము’, ‘సౌమ్యవాసరము-బుధవారము’ కలిసి వస్తాయో అది శ్లాగ్యము - అంటే చాలా శుభప్రదము మరియు యోగ కారకము. కావున ఇవి మూడు కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు సంభవమగునో అవి నీకు ప్రాప్తించుగాక” అని అర్థం. 


ఈ మాటలు విన్న వెంటనే ఆ పండితులు ఆశ్చర్యపోయి, అందరూ మహాస్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించారు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

గత జన్మ పాపాలు

 గత జన్మ పాపాలు - నేటి ఖర్మలు


ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరుగదు. ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, ఖర్మకు పూర్వకర్మయే కారణం. ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం.. ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం. పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్ధంతమే హిందూ మతానికి పునాది కూడా.


కర్మ సిద్దాంతము ప్రకారం.. జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.


మొత్తానికి పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం. పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టేయే మన జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపములోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.


మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటీ..? వాటిని ఎలా నివారించుకోవాలి అనే  విషయాలను వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి.


గతజన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు. ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు. కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడమూ ఉన్నదని స్పష్టమవుతోంది.


సాధారణ జ్యోతిష్యంవల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. నాడీగ్రంధాల నుంచి కూడా తెలుసుకోవచ్చు. కాని నాడీ గ్రంధాలు ఈ విషయాలలో స్పెషలైజుడ్ రీసెర్చి చేసినవి గనుక వాటి నుంచి ఈ వివరాలు బాగా తెలుస్తాయి. పూర్వ జన్మలో మానవులు చేసే పాపాలు, ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో కొన్నింటిని పరిశీలిద్దాం.


గత జన్మలో ఓ వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికొదిలేశాడు. ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి, పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నాడు.


గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు. ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలూ విషాద పరిస్థితుల్లో మరణించారు. వయసు అయిపోతోంది. చేతిలో డబ్బులేదు. ముసలి వయసులో ఫుట్ పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది.


గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిల పెళ్ళి సంబంధాలు చెడగొట్టేది. ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్ గా కనిపిస్తున్నది. ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళిసంబంధాలు వచ్చినా ఒక్కటీ కుదరటం లేదు. గట్టిరెమెడీలు చేస్తే గాని ఈ దోషం తొలగదు.


ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వ జన్మ ప్రభావం ఎదుర్కొంటున్నారు కనిపిస్తారు. వీరందరూ సరియైన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు  ఆగిపోతాయి. అయితే, సరియైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించాల్సి ఉంటుంది.


గత జన్మ పాపాలకు ప్రస్తుతం పూజలెందుకు?


పూర్వ జన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం పూర్వ జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని అనుకుంటారు. అయితే, పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ వ్యాధి వస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.


అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి. దోషాలు పోతాయి....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

పూర్ణమిందం

 పూర్ణాత్ పూర్ణమిందం. పూర్ణం ౦ సున్న. సున్న విలువ లేనిదా విలువ కలదా. దీనికి పరిమాణం కలదా ? కలిగిన  యిది పూర్ణ సంఖ్య యని కాని దాని పరిధి వృత్తాకారంలో. దీని విలువ విశ్వ వ్యాప్తమైనది కాల స్వరూపం. ఎందుకనగా కాలం చక్రమునకు దీని వునికి మూలం. కాల చక్రము జ్యోతి ఉష శాస్త్రం. అనగా కాంతి యే కాలమని కాల మనుగడకు మూలం పురుషునితో పోల్చుట. కాల లక్షణము ప్రకృతి. యముడు కూడా కాల యముడు అని పిలుచుట. అనగా జీవ చైతన్యం దేహమునుండి విడిపించువాడు కాలుడుయని కూడా. జీవ లక్షణము పూర్ణముగా అనగా విశ్వ లో యుండి విశ్వంలో ప్రవేశం అండాశయం విశ్వ మని అండము యెక్క ప్రకృతి జీవుని దేహములో విశ్వ మునుండి రాక విశ్వంలో కి పోక. దీనికి పూర్ణ మని యిది 360 డిగ్రీలు వ్యాప్తి చెందుతుంది లక్షణము అనగా విశ్వ వ్యాప్తి కలదని తెలియుచున్నది. యిక పూర్ణ మునకు అన్న చేర్చిన అన్నపూర్ణ అన్నము యెక్క లక్షణము పూర్ణ మని అన్న సూక్తం. ఙ్ణానంతో వైరాగ్యం మెూక్షమని అందుకు బిక్ష రూపంలో గల తల్లి మాత్రమే మెూక్షమివ్వగలదు. మెూక్షమునకు తల్లియే అడ్డు కూడా. ఎందుకనగా మాటతో జీవుడు వచ్చినాడు కనుక. అన్న సూక్తం ప్రకారం ప్రాణ మనుగడకు అన్నం అన్నం వలన పూర్ణము పూర్ణమనగా  పునరావృత్తిలేకపోవుట కాలమునకు అతీతంగా యుండుట అనే పదం జీవులలో తప్ప అనగా పంచభూతాత్మకమైన జగత్తు నకే తప్ప తత్ జగత్తుకు మూల కారణమైన శక్తికి కాదని శక్తి యే ఆత్మ తత్వ మని దానికే మెూక్షం తప్ప దేహమునకు మెూక్షం కాదు. అది ధాతు పర మైనది కావున లయ మగుట ఏదేహమైనా.

Sreesailum





 

Equity









 

Sea









 

దివ్యోపన్యాసం

 *"1962లో స్వామి తన దివ్యోపన్యాసంలో పలికిన అమృత వాక్కు"* 


*శరీర పోషణకు ఏ విధంగా ఆహారం ఇస్తారో, అదే విధంగా మనసు, చిత్తము, బుద్దికి కూడా చక్కని ఆహారం ఇవ్వండి. ఉదయం కాఫీ త్రాగకపోతే మీకు తలనొప్పి వస్తుంది. ఉదయం జపం కుదరకపోతే మీకు ఏమి వస్తుంది? ఏమి రావటం లేదంటే మీరు దానిని ఒక అలవాటుగా చేసుకోలేదన్నమాట. ఉదయం ఆకలి మిమ్మల్ని వంటింటిలోకి లాక్కొని వెళుతుంది. కానీ మిమ్మల్ని పూజ గదిలోకి లాక్కొని వెళ్లగలిగేది ఏమి లేదు కదా! మీ ఇంట్లో పూజ గది ప్రత్యేకంగా లేక పోవచ్చు. కానీ, ఇంట్లో ఒక మూల ధ్యానానికి, జపానికి, పూజకు కొంత జాగా ఏర్పాటు చేసుకోండీ. అక్కడ రోజుకు కనీసం రెండు సార్లు విశ్రాంతిగా కూర్చోండి. అది ఆత్మకు ఆహారం ఇచ్చే సమయం అవుతుంది. అలసిపోయిన మనస్సనే పక్షి తిరిగి శక్తిని పొందాలంటే, భగవంతుని వైభవం అనే చెట్టు మీద కూర్చొని, సర్వేశ్వర చింతన అనే విశ్రాంతిని తీసుకోవాలి. సత్సంగం కూడా ఒక బలవర్ధకమైన ఔషదం వలె పనికి వస్తుంది. మనసు, బుద్ధి, చిత్తములను ఆకలితో ఉంచకండి. వాటికి సరైన ఆహారం పెట్టక పోతే అవి హీనమైన ఆహారం వైపు వెళ్ళే ప్రమాదం ఉంది. వాటికి సరైన ఆహారం అందిస్తే, వాటి కర్తవ్యాలను అవి చక్కగా నిర్వర్తిస్తాయి. లోపల ఉన్న ఆత్మను ప్రకాశింప చేయటమే వాటి పని. సమస్తము ఆత్మయే అని మీరు గ్రహించటానికి అవి మీకు సహాయపడతాయి. నేను చెప్పిన విషయాలు మీరు ఆచరించి చూడండి. ఫలితాన్ని మీరు ఎంతో ఆనందిస్తారు.*

శివానందశలహారీ

 🙏శివానందశలహారీ🙏



నతి నుతి తోడను   సతతమౌ ధ్యానాన

           భవ పూజ సేయగా పట్టదాయె !

యెటువంటి పూజల నేర్పడన్ జేయంగ

           సంతుష్టి పడుదువు  సర్పభూష !

ఫల్గుణు డానాడు బాహుబలంబుతో

           ముసలంబుతో గొట్టె విసరె రాళ్లు

ధనువుతో మోదెను దారుణ రీతిగా

           నీతోడ తలపడి నీలకంఠ !

నాటి పార్ధ ప్రహారముల్ నచ్చె నేని

ఇందు నీకేమి యిష్టమో యెఱుక సేయ

నటులె సేతును నేనును నిటలనేత్ర ! 

భక్త వత్సల ! శంకరా ! పాహి పాహి !      89 #



ఉన్నతంబైన యధ్యాత్మ యోగవిద్య

తెలియనందున శంకరా ! తేటగాను

వాక్కు తోడనె నీ భవ్య వరచరిత్ర

పలుకుచుందును నిరతంబు భక్తిమీర

          మనసుతోడనె నీదగు మహిత రూపు

          ధ్యాన మొనరించు చుంటి దివ్యాగ్ని నేత్ర 

          చిత్త మానందమొందగా శిరసు వంచి

          ప్రణతు లర్పించుచుంటిని పార్వతీశ ! 90 #



     ✍️గోపాలుని మధుసూదన రావు 🙏

. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 40 /

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 40  / Sri Devi Mahatyam - Durga Saptasati - 40 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 11*

*🌻. నారాయణీ స్తుతి - 4 🌻*


28. ఓ చండికా ! నీకు ప్రణమిల్లుతున్నాము, రాక్షసుల వసా (క్రొవ్వు) రక్తరూపమైన బురదతో పూయబడి ఉండేది, కిరణాలతో మెరుస్తుండేదీ అయిన నీ ఖడ్గం మాకు శుభంకర మగుగాక!


29. నీవు తృప్తి చెందితే రోగాల నన్నింటినీ పోగొడతావు. కినుక పూనితే, కోరబడిన అభీష్టాల నన్నింటిని (విఘ్నం చేస్తావు). నిన్ను ఆయించిన నరులకు ఆపదలు కలుగవు. అంతేకాక నిన్ను ఆశ్రయించిన వారు ఇతరులకు కూడా ఆశ్రయం ఇవ్వగలుగుతారు.


30. ఓ అంబికా! నీవిప్పుడు ఈ యుద్ధంలో నీ రూపాన్ని అనేక రూపాలుగా చేసి, ధర్మమార్గ విరోధులైన మహారాక్షసులను సంహరించిన ఈ విధంగా ఏ ఇతర దేవత చేయగలదు ?


31. ఏవేకదీపాన్ని వెలిగించే విద్యలలో, శాస్త్రాలలో, వేదవాక్యాలలో నీవు తప్ప మరెవ్వరు ఉన్నారు? (కాని) ఈ విశ్వం మమత్వరూపమైన గుంటలో ఘోరాంధకారంలో పడి మాటిమాటికి పరిభ్రమిచేటట్లు (చుట్టి చుట్టి తిరిగేటట్లు) నీవే చేస్తావు.


32. రాక్షసులు, ఉగ్రవిష సర్పాములు, శత్రువులు, దొంగల గుంపులు, కార్చిచ్చులు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడక్కడ, సముద్ర మధ్యలో నీవు నిలిచి లోకాన్ని రక్షిస్తుంటావు.


33. లోకాలను ఏలే రాణీ! నీవు లోకాలను రక్షిస్తావు. లోకం యొక్క ఆత్మవైన నీవు లోకాన్ని భరిస్తావు. విశ్వేశ్వరుని చేత (కూడా) నీవు ఆరాధింపదగిన దానవు. భక్తితో నీకు వినమ్రులై యొక్కేవారు లోకానికి ఆశ్రయం ఇవ్వగలవారవుతారు.


34. ఓ దేవీ! రాక్షసులను వధించి నీవు ఇప్పుడు మమ్మల్ని ఎలా కాపాడావో అలాగే మమ్మల్ని ఎల్లప్పుడూ శత్రుభీతి నుండి కాపాడుతుండేటట్లు అనుగ్రహించు. సర్వలోకాలలోని పాపాలను, ఉత్పాతాలచే సూచించబడి, అత్యంతఘోరాలుగా పరిణమించిన, విపత్తులను త్వరితంగా శమింపచేయి. 


35. ప్రపంచకేశాలను అణచే ఓ దేవీ! నీకు మ్రొక్కుతున్న మా మీద ప్రసన్నత చూపు. ముల్లోకాలందూ ఉండే వారి పొగడ్తలకు పాత్రమవగు తల్లీ! లోకాలకు వరాలిచ్చే దానవగుము.


36–37. దేవి పలికెను : దేవగణములారా ! నేను వరాన్ని ఇస్తాను, మీరు మనస్సులలో వాంఛించే ఏ వరాన్నెనా, లోకోపకారకమైన దానిని, కోరుకోండి, అది నేను ఇస్తాను.


సశేషం....

🌹 🌹 🌹

సమస్యకు సమాధానం

 *సమస్యకు సమాధానం* 🙏ఏదైనా గ్రామంలోకి వెళ్లి ఒక రైతుని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటని అడగండి. వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు. పట్టణంలోకి వెళ్లి ఒక హోటల్ యజమానిని అడగండి. కుక్స్, వెయిటర్స్, ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు...


"అసలు ఈశాన్య భారతదేశం వారు ఉండబట్టి సరిపోయింది. లేకపొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది" అని ఒక హోటల్ యజమాని అంటున్నాడు. భవన నిర్మాణ దారుణ్ని అడగండి ప్లంబర్లు, ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు అంటారు. మారిషస్ వాళ్ళకు అక్కడ పురోహితుడు, కుక్ కావాలి దొరకడం లేదు సాయం చెయ్యండి అని వారు అడుగుతున్నారు..


ఒక పక్క దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు. మరోపక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడంలేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి...


హోటల్స్ లో దోస మాస్టర్ కు ఇరవై ముప్పై వేలు ప్రారంభ జీతం వుంది. అదే ఇంజనీర్ లు పది వేల జీతానికి కూడా క్యు లో నిల్చుంటున్నారు... 


సమస్య ఎక్కడ వుంది అంటే అందరికి వైట్ కాలర్ జాబ్ లే కావాలి. జీతం ఎక్కువ వస్తుంది అని కాదు. చాల సెమి స్కిల్ల్డ్ జాబ్స్ కు రెండు మూడు రెట్లు ఎక్కువ జీతం వస్తుంది. ఈరోజు ప్రభుత్వ టీచర్ ప్రారంభ జీతం దాదాపు 50 వేలు. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్ { సర్జన్} జీతం నలభై వేలు. మన వారు ఒక్కో జాబ్ కు ఒక్కో సోషల్ స్టేటస్ అంటగట్టేసారు. ఇంజనీర్ డాక్టర్ అంటే గొప్ప అని టీచర్ అంటే ఏదో పనికి రాని జాబ్ అని. ప్లంబర్, ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నాను అంటే అమ్మాయి కూడా దొరకని పరిస్థితి. అంతెందుకు పురోహిత్యం చేసే వారికి విదేశాల్లో చాల డిమాండ్ వుంది. అయినా పురోహిత్యం అంటే పెళ్ళికి అమ్మాయిలు ముందుకు రాని స్థితి.  అదేవిధంగా సోంత వ్యాపారాలు చెసుకునే వారికి  అమ్మాయిలు ఇవ్వటం లేదు.కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకొంటూ ఆరు నెలలుగా జీతాలు ఇవ్వక పోయినా కేవలం ప్రెస్టేజ్ కోసం పని చేసేవారు వున్నారు. అదే హోటల్ లో కుక్ గా వెయిటర్ గా చెయ్యమంటే నామోషీ. తలతీసినట్టు ఫీల్ అవుతారు. ఇదే మనవారు అమెరికాకు వెళితే అక్కడ హోటల్ లో పనిచెయ్యడానికి సిద్ధపడుతారు...


అంటే ఇక్కడ మారాల్సింది సామజిక దృక్పధం. దొంగతనం, అడుక్కోవడం తప్ప ఏ పని చేసినా తప్పులేదు. అన్ని పనులు గొప్పవే.


మీ మనసుకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి. అతిచిన్న ఉద్యోగమైనా పరవాలేదు. చేతినిండా పని ఉండాలి, . work is worship.

అన్నం పరబ్రహ్మ స్వరూపం ...

 అన్నం పరబ్రహ్మ స్వరూపం ...


🍁🍁🍁🍁


ఆకాశంలో వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథ్వి. పంచభూతాల సృష్టి క్రమమిది. పృథ్వి నుండి ఔషధులు, ఓషధుల నుండి అన్నం, అన్నం నుండి ప్రాణం ఉద్భవించాయి. 


అన్నమే ప్రాణం. 


అందుకే అన్నాన్ని పరబ్రహ్మంగా భావించాలి. 


అన్నం లేకుండా ఎక్కువ కాలం ప్రాణం నిలబడదు. అన్నాన్ని పారవేయకూడదు, ప్రశంసించాలి. అన్నాన్ని వృద్ధి చేసుకోవాలని తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది


. అన్నం వల్లనే ప్రాణ రక్షణ, శరీర రక్షణ. ప్రాణ, శరీరాల రక్షణ జరిగితేనే మానవుడు సాధకుడు కాగలుగుతాడు. 


అన్నమును నిషేధింపరాదు. అన్నం ఉండీ కూడా లేదని చెప్పడాన్ని నిషేధం అంటారు. ఇంటికి వచ్చిన అతిథికి భోజనం లేదనక సిద్ధంగా ఉన్న అన్నాన్ని అతిథికిచ్చుట గృహస్థుల ధర్మం.


 నీరు భోజ్యవస్తువులలోనిది కాబట్టి నీరు కూడా అన్నమే. నీరు జీవనాధారం. అన్నాన్ని తినేది అగ్ని. అది మనలోని జఠరాగ్ని. జలాగ్నులు పరస్పరాశ్రితాలు. 


అంటే.. 


నీటిలోన అగ్ని, అగ్ని యందు నీరు ఉన్నాయి. అన్నార్తుల ఆకలి తీర్చడానికి అన్నమును ఎక్కువగా సమకూర్చుకోవాలి, పోగు చేసి పెట్టుకోవాలి. అన్నాన్ని ఎక్కువగా దానం చేయాలి. దానం చేసే గుణం ఉన్న వారికే సకలైశ్వర్యాలు లభిస్తాయంటుంది యుజుర్వేదం. ‘


కేవలాఘో భవతి కేవలాదీ’ (ఋగ్వేదం).. తన పొట్ట మాత్రమే నింపుకొనేవాడు పాపాన్నే ఒడిగట్టుకుంటాడు.


 ఎవడు కేవలం తన కోసమే అన్నం వండుకుంటాడో వాడు నరకం పొందుతాడని శుక్ర నీతిసారం చెబుతోంది


. అతిథి లేకుండా భోజనం చేయడం కేవలం పాపాన్ని భుజించినట్లే అంటుంది విష్ణుపురాణం. 


ఒకానొకప్పుడు శునక పుత్రుడైన శౌనకుడు, కక్షసేనుని కుమారుడు అభిప్రతారి భోజనం చేయడానికి కూర్చుంటారు. 


వారికి భోజనం పెట్టే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి అన్నం కోసం యాచిస్తాడు. వారు తనకు భిక్ష వేయకపోవడంతో.. ‘‘ఈ బ్రహ్మాండంలో గొప్పవి నాలుగున్నాయి. అవి అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలం. ఈ నాలుగింటిని వాయువు తనలో ఇముడ్చుకొంటుంది. అట్లే పిండమున, శరీరమున వాక్కు, నేత్రం, శ్రోత్రం, మనసు అనే నాలుగు ఇంద్రియాలు ముఖ్యమైనవి. ఈ నాలుగింటినీ ప్రాణం తనలో ఇముడ్చుకొంటుంది. వాయువు, ప్రాణం మిగిలిన వాటిన తమలో కలుపుకోనుటకు చూస్తుంటాయి. సచ్చిదానంద స్వరూపుడైన పరమేశ్వరుడు అఖిల భువానాన్ని ఏలుతూ తానే రక్షకుడు, భక్షకుడు అవుతున్నాడు. అట్టి దేవుని మహిమ చేతనే పిండమున ప్రాణము, బ్రహ్మాండమున వాయువు తమ స్వీయ కర్మలను చేస్తున్నాయి. అంతటా ఉండి వెలుగుతూ, అన్నింటినీ అందజేస్తున్న ఆ పరమ పురుషుని ఈ మనుష్యులు గుర్తించరు.  ఈ అన్నం ఆ దేవత కొరకే. ఆ ప్రాణరూప బ్రహ్మము కొరకే నేను అన్నము అర్థించాను. కానీ మీరు ఇవ్వలేదు. మీరు అన్నం ఇవ్వనిది నాకు కాదు.. ఆ ప్రాణరూప బ్రహ్మానికే అన్నం ఇవ్వకుండా తిరస్కరించారు’’ అని చెప్పాడా బ్రహ్మచారి.


 దీంతో వారికి జ్ఞానోదయం కలిగి అతడికి భిక్ష పెట్టారు.


 అందరిలోనూ ఉండే జీవాత్మే ఆ పరమాత్మ అని.. ఆ పరమాత్మే అన్ని దిక్కులకూ వ్యాపించి అన్నాన్ని గ్రహిస్తున్నాడని, 


కాబట్టి అన్నార్తులకు లేదనకుండా అన్నం పెట్టాలని తెలిపే కథ ఇది.


🍁🍁🍁🍁

రవివర్ణనమ్

 .

             ॥ రవివర్ణనమ్ ‌॥


-98- శ్లోకము :


వ్యగ్రై రగ్ర్యగ్రహోడు గ్రసనగురు 

భరైర్నో సమగ్రైరుదగ్రైః


ప్రత్యగ్రై రీషదుగ్రై రుదయగిరిగతో గోగణైర్గౌరయన్‌ గాం


ఉద్గాఢార్చి ర్విలీనామరనగర 

నగగ్రావ గర్భామివాహ్నా-


మగ్రేయోఽగ్రే విధత్తే గ్లపయతు 

గహనం స గ్రహగ్రామణీర్వః ॥



-98- చంపకమాల :


మునుౘను చంద్రుఁ గ్రమ్ముచు

నపూర్ణములై నులివెౘ్చనొంది బ


ల్పును గని క్రొత్తవైతగు వెలుంగుల

వేల్పుల వీటికొండఱా


లెనసినదానిఁ జేసి భువి హెచ్చగు

పొన్జిగిమేల్దినాదినం


చినుఁడుదయాద్రి భాసిలు గ్రహేశుడు 

మీ యఘముల్‌ దొలంచుతన్‌ ✋️🤚



టీకా : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని గ్రహాధిపతిగా

   చెప్పుచున్నారు..]


(పగటికి ఆరంభమైన ఉదయకాలమున భాస్కరుని కిరణములు వచ్చుచున్నవనగనే పాఱి..)

మును = ముందు , ౘను = వెళ్లుచున్న ,  చంద్రుఁ(..ని) ,  (గ్ర)క్రమ్ముచున్‌ = ఆవరించ పూనుచు , 

+ అ పూర్ణములై = సంపూర్ణ కాంతిని పొందని లేత కిరణములై , (అటుపై ..)

నులివెౘ్చనొంది = కొద్ది వెౘ్చదనమును

పొంది ,  బల్పు ను గని = క్రమేణా అధికమగుచు , క్రొత్తవై , తగు వెలుంగుల(..తో) , 

< వేల్పుల = దేవతల , వీటి = స్థావరపు , కొండ > =మేరు పర్వత(..ము)పు , 

ఱా(..ళ్లు)ల్ = మణులను , + ఎనసిన దానిఁ = పోలినదానినిగా , 

దిన + ఆదిన్ = ప్రొద్దు పొడుపున , 

పొన్ = బంగార(..ము)పు , జిగిమేల్ = శ్రేష్ఠమైన కాంతిని(..పొందినదిగా)

భువి = భూమిని , జేసి , 

[ పొన్ = బంగారు , జిగిమేల్ = శ్రేష్ఠమైన కాంతిని ] , [ దిన + ఆదిన్ = ప్రొద్దు పొడుపున ],  హెచ్చగు = అతిశయించును ..+ అంచు = అని  ,

+ [ఇనుఁడు = రవి] ,  + ఉదయ + అద్రి = ఉదయించు (తూర్పు)కొండ పై ,

భాసిలు = ప్రకాశించు , గ్రహ(..ములకు) , + ఈశుడు = అధిపతి - రవి , 

మీ , (య)అఘముల్‌ = పాపములను , (దొ)తొలంచుతన్‌ = తొలగించును గాక ..

✋️🤚



భావము : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని గ్రహాధిపతిగా

   చెప్పుచున్నారు..]


ఉదయకాలమున భాస్కరుని కిరణములు వచ్చుచున్నవనగనే 

పాఱి ముందు వెళ్లుచున్న చంద్రుని ఆవరించ పూనుచు 

సంపూర్ణ కాంతిని పొందని 

లేత కిరణములై -

అటుపై కొద్ది వెౘ్చదనమును

పొంది - క్రమేణా అధికమగుచు - క్రొత్తవైన వెలుగులతో మేరు పర్వతపు మణులను పోలి - ప్రొద్దు పొడుపున బంగారపు శ్రేష్ఠమైన కాంతిని పొందినదిగా భూమిని జేసి అతిశయించును .. అని  

ఉదయాద్రి (తూర్పు కొండ) పై 

ప్రకాశించు గ్రహాధిపతి - రవి 

మీ పాపములను  తొలగించును గాక ..

✋️🤚

మొగిలిచెర్ల

 *వీడిపోయిన పీడ..*


"ఒక నెల రోజులపాటు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాము..మాకు ఉండటానికి ప్రత్యేకంగా ఏదైనా గదిని కేటాయించి ఇస్తారా?.." అని ఆ దంపతులు మా సిబ్బందిని అడుగుతున్నారు.."ప్రత్యేకంగా ఇవ్వడానికి గదులేవీ లేవు..అందరితోపాటు మీరు కూడా ఆ షెడ్ లోనే ఉండాలి..ఓ ప్రక్కగా వంట చేసుకోండి..రాత్రిపూట అందరూ స్వామివారి మందిర మంటపం లోనే పడుకుంటారు..మీరు కూడా అక్కడే పడుకోవచ్చు..శని ఆదివారాల్లో ఇక్కడ అన్నదానం చేస్తారు..ఆ రెండురోజులు మీరు భోజనం చెయ్యొచ్చు.." అని మా వాళ్ళు వాళ్లకు నచ్చచెపుతున్నారు..ఈ సంఘటన జరిగింది 2007 వ సంవత్సరం లో..ఆ సంవత్సరమే మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద శని ఆదివారాల్లో అన్నదానం చేయడం మొదలుపెట్టింది..


ఆ వచ్చిన దంపతులకు అరవై ఏళ్ల పైబడిన వయసు ఉంటుంది..ఇద్దరు పిల్లలు కూడా..ఇద్దరూ ఆడపిల్లలే..పెళ్ళిళ్ళు చేసి పంపించేశారు..భార్యా భర్తా ఇద్దరూ తమ పొలాన్ని చూసుకుంటూ..జీవితాన్ని లాక్కోస్తున్నారు..కానీ గత రెండు మూడు నెలల నుంచీ భార్య ప్రవర్తన లో మార్పు వచ్చింది..ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కేకలు పెడుతుంది..చేతిలో ఉన్న వస్తువులను విసిరి కొట్టడం..క్రిందపడి దొర్లడం చేస్తోంది..పాపం ఆ భర్తకేమీ పాలుపోవడం లేదు..కూతుళ్ల ను రమ్మని చెప్పిపంపాడు..వాళ్ళూ వచ్చారు..రోజులో ఒకటి రెండు సార్లు ఈ విధంగా ప్రవర్తిస్తోంది..ఒంగోలు , గుంటూరు విజయవాడ తదితర పట్టణాల్లోని మానసిక వైద్యులకు చూపారు..ఏవో మందులు ఇచ్చారు కానీ..గుణం కనబడలేదు..


"నాన్నా..మొగలిచెర్ల గ్రామం లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం దగ్గర కొన్నాళ్ళు పాటు నిద్ర చేస్తే..లోపలేవన్నా గాలి చేష్టలు ఉంటే వెంటనే వదిలిపోతాయని చెప్పుకుంటున్నారు..అమ్మను అక్కడికి తీసుకెళదాము.."అని చిన్నకూతురు సలహా ఇచ్చింది..ఆ తండ్రి కి ఈ మాట మీద గురి కుదిరింది.."అమ్మను తీసుకొని నువ్వు దత్తాత్రేయ స్వామి వద్దకు వెళ్ళు..మేము మా ఇళ్లకు వెళ్లి, అన్నీ సర్దుకొని..రెండు మూడు రోజుల్లో అక్కడికి వచ్చి నీకు చేదోడుగా ఉంటాము .." అని కూతుళ్ళిద్దరూ చెప్పారు..ఆ విధంగా ఆ దంపతులు మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..


ప్రతిరోజూ ఉదయాన్నే తలారా స్నానం చేసి..ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరం లో 108 ప్రదక్షిణాలు చేయసాగారు..మొదటి మూడురోజుల్లో ఆమెలో పెద్దగా మార్పు రాలేదు..నాలుగోరోజు మధ్యాహ్నం.."దత్తాత్రేయా..నన్ను పంపడం నీ తరం కాదు..ఈ మనిషిని వదిలిపెట్టి పోనూ.." అంటూ ఆమె కేకలు వేస్తూ మంటపం లో క్రిందపడి పొర్లుతూ కేకలు వేయసాగింది..ఈ రకంగా సుమారు ఒక గంటపాటు అరచి..ఆమె అలాగే పడుకొని నిద్ర పోయింది..


సాయంత్రం నాలుగు గంటల వేళ, ఆమె లేచి మెల్లిగా బావి వద్దకు వెళ్లి, స్నానం చేసి..ఆ తడిబట్టల తోనే మందిరం లోకి వచ్చి, బోర్లా పడుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది..పాపం ఆమె భర్తకు ఏమీ పాలుపోవడం లేదు..రోజూ కన్నా ఈరోజు ఆమె ప్రవర్తన విపరీతంగా ఉంది..రెండు చేతులెత్తి స్వామికి నమస్కారం చేసుకుంటున్నాడు..ఇంతలో వాళ్ళ కూతుళ్లు కూడా సాయంత్రం బస్ కు వచ్చారు..


మరో రెండు గంటలు గడిచింది.."దత్తాత్రేయా నాకు సెలవిప్పించు తండ్రీ..నేను వెళ్లిపోతాను..ఈ బాధ పడలేను..ఈ మనిషిని వదిలి పోతాను నాయనా.." అంటూ ఏడుస్తూ చెప్పసాగింది..అలా ఒక అరగంట ఏడ్చి, ఏడ్చి..సొమ్మసిల్లి పడి నిద్రపోయింది..ఆరాత్రి ఆమె ఎటువంటి గలభా చేయలేదు..


తెల్లవారుజామున నిద్రలేచి..ఆమెనే కనిపెట్టుకొని ఉన్న భర్త, పిల్లల వద్దకు వచ్చి..తన తలమీద పెద్ద బరువు దిగిపోయినట్లుగా ఉన్నదనీ..రాత్రంతా బాగా నిద్రపోయాననీ చెప్పుకున్నది..ఆతరువాత ఆమె లో ఆ విపరీతపు ధోరణి కనబడలేదు..రెండురోజుల పాటు ఆమెను జాగ్రత్తగా గమనించిన భర్తా పిల్లలకు తమ ఇంటి మనిషి పూర్తిగా కోలుకున్నదని అర్థమై పోయింది..


"నాన్నా..ఈ దత్తాత్రేయ స్వామి దయవల్ల అమ్మ మామూలుగా మారిపోయింది..మనం త్వరగా ఇక్కడికి వచ్చి మంచి పని చేసాము..ఆ స్వామి దయవల్ల బాగుపడ్డాము..మనం కూడా ఈ ఆదివారం ఇక్కడ అన్నదానము చేద్దాము.." అని చిన్నకూతురు చెప్పింది..అందరూ సరే అన్నారు..తాము వచ్చే ఆదివారం నాడు అన్నదానం చేసి, తమ ఊరికి వెళతామని మాతో రెండురోజుల ముందు చెప్పారు..ఈ వారం రోజులూ ఆ సంసారాన్ని దగ్గరుండి చూస్తున్న మాకు..ఇది  శ్రీ స్వామివారు చూపిన మరో లీల అని అనుకున్నాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ద్రాక్షారామం

   ద్రాక్షారామం ఆలయం గురించి :-ఈ ద్రాక్షారామం దివ్యక్షేత్రం నకు క్చేత్రపాలకుడు లక్ష్మీనారాయణుడు. ఈ దివ్య క్చేత్రము ఐదు ప్రాకారాలతో, నాలుగు వైపులా రాజగోపురములతో శిల్పకళావైభవము కలిగి విలసిల్లుతున్నది. ఆలయ ప్రధాన ద్వారం నకు కుడి ఎడమ వైపున నాట్యగణపతి, డుండి గణపతి ముందుగా దర్శనము ఇస్తారు. ప్రధాన ప్రాకారము లో తూర్పున నందీశ్వరుడు, అశ్వద్దవ్రుక్చము, ధ్వజస్తంభం కలవు. దక్షిణ భాగంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుని ఆలయము, దక్చిణామూర్తి ఆలయము, నైరుతి భాగం లో మంగళవార మండపం, వాయువ్యమునందుడెభై స్తంభములతో చక్కని శిల్పకళానైపుణ్యముతో నిర్మితమైన సోమవార మండపం కలవు. ఈ లింగము పరమేశ్వరుని మామగారు అయిన హిమవంతుడుగా తలుస్తారు. ఈశాన్య భాగంలో రుద్రతీర్ధము, అష్ట భైరవ లింగాలను దర్శించ వచ్చును. ఇక్కడ ఉన్న కాలభైరవ మందిరం ఉన్న విగ్రహం సిద్ధభైరవస్వామి. ఈ సిద్ధభైరవస్వామి కి దంతాలు ఉంటాయి. ఈ ప్రాకారము లో లక్ష్మి నారాయణుడు శ్రీకృష్ణ దేవరాయలుచే ప్రతిష్టుతుడైన విరూపాక్చుడు, బాల భీమేశ్వరుడు, నటరాజస్వామి, చతుర్ముఖబ్రహ్మ, సప్తమాత్రుకలు, మహిషాషురమర్దిని, వీరభద్రేశ్వరుడు, లక్ష్మీ గణపతి, వటుకభైరవుడు మనకు దర్శనము ఇస్తారు. వటుకభైరవుడు సమీపంలో జపముచేసిన త్వరగా మంత్రసిద్ధి లభిస్తుంది అని చెబుతారు. నవగ్రహ మండపములు, అష్టదిక్పాలకుల మండపములు కలవు. అష్ట దిక్పాలక మండపము ఉండుట ఇచ్చట ప్రత్యేకత. ప్రధాన గర్భాలయం మూడు ప్రాకారములు కలిగి ఉంటుంది. మొదటి ప్రాకారములో మూల విరాట్టుకు ప్రదక్షిణ మార్గములో మోక్షద్వారముగా చెప్పబడుచున్న శంఖుస్థాపన స్తంభముకానవచ్చును. ఆ స్తంభముపై ఆదిశేషుని విగ్రహాన్ని దర్శించవచ్చును. ఈ స్తంభమునకు ఎడమద్వారము మోక్షద్వారముగానూ, కుడివైపు యమ ద్వారము గా చెప్పబడుచున్నది.

ఈ ప్రాకారము చీకటి కోణముగా పిలుస్తారు. ఇక్కడ గోడలలో బిగించిన రాళ్లు ఇదివరలో వెలుతురు వెదజల్లుతూ ఉండేవట. తర్వాత ప్రాకారము లో ప్రదక్షిణ దిశగా దిగువ అంతస్తులో ఉన్న మూలవిరాట్టును దర్శించాలి. ఈ భీమేశ్వర లింగము యొక్క ఎత్తు సుమారు 14అడుగులు కలిగి పై అంతస్తు వరకూ వ్యాపించి ఉంటాడు. పానపట్టము కోణములు కలిగి ఉండుటవలన ఈ లింగము భోగలింగముగా చెప్పబడినది. ఈ పరమేశ్వరుని దర్శనము అపర కైలాస దర్శనము తో సమానము. ఈ స్వామి దర్శనం అనంతరం దక్షిణ ప్రాకార మెట్ల ద్వారా నంది మంటపము లో ప్రవేశిస్తాము. నంది మంటప ప్రాకారము ఇరవై స్తంభాలతో నెలకొని ఉన్నది. ఈ మండపంలో నైరుతి భాగాన కల స్తంభమును వ్యాస స్తంభము అంటారు.

          ఈ ప్రదేశము వద్ద దేవతలు నిర్మింస్తుండగా సూర్యోదయం అగుటచే దేవాలయ కట్టడం ఆగిపోయిందట.ఈ ఆగ్నేయదిశలో గోడభాగము ఎన్ని సార్లు కట్టిననూ కూలిపోయేదట. ఒకసారి కంచి పరమాచార్య వారు 108రోజులు మహాయఙ్ఞము చేసిన తర్వాత ఆ గోడ నిలబడిందట. ఈ వ్రుక్చం చాయలోనే యఙ్ఞశాల నిర్మించబడినది.

స్నేహితం

 దుమ్ము గాలితో స్నేహం చేస్తే ఆకాశానికి ఎగురుతుంది. అదే దుమ్ము నీటితో స్నేహం చేస్తే,  అడుగుకు చేరి పోతుంది.

 

ఇనుము మట్టితో స్నేహంచేస్తే తుప్పు పట్టి పోతుంది. అదే అగ్నితో స్నేహం చేస్తే శుద్ధమై నిర్మలమవుతుంది.


మన జీవితంలో "స్నేహితం" ప్రభావం అద్భుతమైనది. 


మంచి స్నేహితులనే ఎంపిక చేసుకోవాలి. కనుక మనం ఎవ్వరితో కలుస్తున్నామో చూసుకోవాలి.


దుష్టులు, మోసకారులు, ఈర్ష్యపరులకు, ముఖస్తుతి చేసేవారికి దూరంగా ఉండాలి.


ఎంపిక యిక మన చేతుల్లో.