ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు -
* బాలింతలకు ప్రసవించిన 8 వ దినము నుండి క్రమక్రమంగా శరీరమునకు బలము చేకూర్చు ఔషధములు , ఆహారములు వాడుట మంచిది. బాలింతలకు 12 దినములు గడుచునంత వరకు మాంసం పెట్టకూడదు.
* గర్భం నందు శిశువు తల్లి ఆహారం పంచుకొని పెరుగుట చేత ప్రసవవేదన అనుభవించుట చేత , ప్రసవకాలమున అధిక రక్తస్రావం జరుగుటవలన బాగా అలిసిపోవడం వలన బాలింతరాలుకు వ్యాధులు తొందరగా వచ్చును.అందుకొరకు తొందరగా బలం చేకూర్చుటకు ప్రత్యేక ఔషదాలు ఇవ్వవలెను. దశమూలారిష్టం టానిక్ గాని ద్రాక్షరిష్టం టానిక్ గాని , సౌభాగ్యశొంటి అను లేహ్యం కాని భోజనమును తరువాత వాడవలెను. దీనివలన మంచి జీర్ణశక్తి కలుగును.
* బాలింతలకు పథ్యమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వవలెను . దేహశ్రమ , పురుషసంపర్కం , కోపం చల్లనిపదార్ధాలు వీటిని విడిచిపెట్టవలెను. అన్నివిధముల పరిశుభ్రముగా ఉండవలెను . నెయ్యి వంటి పదార్థం కలిసిన పథ్యమైన ఆహారం మితముగా భుజించవలెను. ప్రతిదినము తలంటుస్నానం చేయవలెను . ఈ నియమాలు బాలింత శ్రద్దగా ఒక నెలరోజుల పాటు అనుసరించవలెను.
* బాలింతరాలు తలంటు స్నానం నందు మూడుమాసముల వరకు బలాధన్వంతర తైలం వాడుట మంచిది. దీనివలన నరములకు బలం కలుగును.
* స్త్రీకి గర్భధారణ నిల్చిపోయి 6 సంవత్సరములు అయిన పిదప మరలా గర్భదారణ జరిగి ప్రసవం ఏర్పడినట్లైతే ఆ శిశువుకు ఆయుర్ధాయం తక్కువ ఉండునని శుశ్రుతుడు చెప్పెను.
* బాగా పాతబడిన బియ్యాన్నే ఆహారముగా ఇవ్వవలెను.
* కందికట్టు , ధనియాలపొడి , శొంఠిపొడి , వెల్లుల్లి పాయ కారం , నువ్వులనూనె , నువ్వులపొడి , ఇంగువ , పాతబెల్లం , తాంబూలం పాత ఉశిరిక పచ్చడి , పాతనిమ్మ పచ్చడి , పొట్లకాయ , మునగకూర , బీరకాయ , కందకూర
ఆవుపాలు , వేడినీటి స్నానం , ఎక్కువ విశ్రాంతి ఇవన్ని తప్పకుండా ఆచరించాలి .
* ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటిపూట భొజనం చేయాలి . బొప్పాయిపండు తినవచ్చు. రొట్టె , కాఫీ పుచ్చుకోవచ్చు. కాచి గోరువెచ్చగా ఉన్న చల్లార్చిన నీటిని తాగవచ్చు .
* మాంసాహారం తీసుకునేవారు ఎండుచేపలు , కాల్చిన మాంసం , ఆవునెయ్యిలొ వేయించిన మాంసం , ఎండబెట్టిన మేకమాంసం , మేకమాంసానికి అల్లం , ఉప్పు , కొద్దిగా గరం మసాలా రాసి ఎండించి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఆవునెయ్యిలొ వేయించి తినవచ్చు .
బాలింతలు తినకూడని ఆహార పదార్దాలు -
* ఎట్టి పరిస్థితులలో కొత్తబియ్యం అన్నం తినకూడదు.
* చద్దిఅన్నం , పలుకుగా ఉన్న అన్నం తినరాదు.
* పచ్చి చేపలు , కొత్త చింతపండు , పులుసుకూరలు , మజ్జిగ , పెరుగు ముట్టుకోకూడదు.
* చల్లటి పదార్దాలు ముట్టరాదు.
పైన చెప్పిన నియమాలు పాటించని బాలింతలకు సూతికా వ్యాధులు సంభవిస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులుగా మారి ప్రాణాలు హరిస్తాయి
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి