18, డిసెంబర్ 2020, శుక్రవారం

రవివర్ణనమ్

 .

             ॥ రవివర్ణనమ్ ‌॥


-99- శ్లోకము :


యోనిః సామ్నాం విధాతా మధురిపురజితో ధూర్జటిః శంకరోఽసౌ


మృత్యుః కాలోఽలకాయాఃపతిరపి ధనదః పావకో జాతవేదాః


ఇత్థం సంజ్ఞా డబిత్థాది పదమృత భుజాం యా యదృచ్ఛాప్రవృత్తా-


స్తాసామేవాభిధేయోఽనుగత గుణగుణైర్యః స సూర్యోఽవతాద్వః ॥



-99- చంపకమాల :


అటు విధి సామయోని , 

మధుహంత యజయ్యుడు , 

శంకరుండు ధూ


ర్జటి , ధనదుండహో యలకరాజల

మృత్యువు కాలుఁడంచు బే


ళ్లెటు శిఖి జాతవేదుఁడని యిందఱియందు డవిత్థుడట్లు న


మ్మటు రవిఁగాన సార్థక

గుణాహ్వయుడా యినుడేలు

మిమ్ములన్‌✋️🤚



టీకా : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని సకలదేవతా

   స్వరూపుడుగా చెప్పుచున్నారు..]


అటు = (ఒక విషయమో వ్యక్తినో సూచించు అన్వయ వాచకము..) 

ఆ విధముగా ,  విధి = బ్రహ్మ , 

సామ(..వేద మంత్రములకు ) ,

యోని = ఉత్పత్తికారణము ..

మధు(..అను రాక్షసుని) , హంత = ౘంపినవాడు - విష్ణువు , 

(య)అ జయ్యుడు = జయింప శక్యము కానివాడు ..

శంకరుండు , ధూర్ + జటి = విస్తారమైన

జటలు గలవాడు ..

ధనదుండు = ధనమును యిచ్చువాడు - కుబేరుడు ,  అహో ! = ప్రశంసా వాచకము ,  (య)అలక = (కుబేరుని నగరము..) అలకాపురము నకు , రాజు ..

+ అల = అక్కడ ( సూచక వాచకము ) ,

మృత్యువు , కాలుఁడు = యమధర్మరాజు , 

+ అంచు = అనుచు , (బే)పేళ్లు = 

పేరు లు ,  + ఎటు(..లనో) ,  శిఖి = అగ్ని , [ అగ్ని - అపౌరుషేయాలైన వేదాల పుట్టుకను గురించి అగ్ని ఒక్కరికే తెలుసు. వేదాల పుట్టుక గురించి తెలిసినవాడు కనుక జాతవేదుడు ..]

జాతవేదుఁడు , + అని , యిందఱి యందు , డవిత్థుడు = కఱ్ఱలతో చేయబడిన మృగాకారము (- అనగా గుణములేవియు  లేనిది .. అటులనే పైదెల్పినవన్నియు వారి వారి సంకేత నామములే..)  + అట్లు = వలె , 

నమ్ము + అటు = నమ్ము విధముగా .. 

రవిఁ , గా(..వు)న ,  

సార్థకగుణాహ్వయుడు = తన గుణముల రీత్యా యిందరు దేవతల పనులు తానొక్కడే చేయగలవాడు ,  + ఆ ,  (యి)ఇనుడు = సూర్యుడు , + [ఏలు] ,

మిమ్ములన్‌ ,  ఏలు = రక్షించును గాక..✋️🤚



భావము : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని సకలదేవతా

   స్వరూపుడుగా చెప్పుచున్నారు..]


అటు బ్రహ్మ సామములకు ఉత్పత్తికారణము ..

మధుహంత - విష్ణువు  

అజయ్యుడు..

శంకరుండు ధూర్జటి ..

ధనమును యిచ్చువాడు - కుబేరుడు అహో ! అలకాపురమునకు రాజు ..

అల మృత్యువు యమధర్మరాజు 

అనుచు  పేరులు ఎటులనో అటులే 

అగ్ని జాతవేదుఁడు అని ..

యిందఱి యందు డవిత్థుడువలెనని నమ్ము విధము గావున.. 

రవి సార్థకగుణాహ్వయుడు - 

ఆ సూర్యుడు మిమ్ములను రక్షించును గాక..✋️🤚

కామెంట్‌లు లేవు: