18, డిసెంబర్ 2020, శుక్రవారం

మాధవ నామ సంస్మరణ

 మాధవ నామ సంస్మరణ మాధవ దేవుని దివ్యగాథలున్

మాధవుమాన్యలీలలును మాధవు భక్త జనానురాగమున్

మాధవుబోధనంబులును మార్గశిరం బనుమాసమందునన్

సాధనచేయగా దగిన చక్కని సాధు పథంబని పెద్దలందురే!


వసుధే మానసమందు భక్తి యుతయై భావించుచున్ మాధవున్

వసురూపంబున పూయుపూవుల సుశోభన్ బంతి చేమంతులన్

అసమానంబగు సేవలన్ సలుపుచున్ ఆహ్లాదంబుగా గొల్చుచున్

ససి సౌఖ్యంబున మార్గ శీర్షమున విశ్వ స్తుత్యమై యొప్పుగా.


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.

కామెంట్‌లు లేవు: