18, డిసెంబర్ 2020, శుక్రవారం

గుణవంతుడుండిన

 🌳🌳🌳🌳🌳🌳🌳🌳

కులములోన నొకడు గుణవంతుడుండిన

గులము వెలయు వాని గుణము వలన

వెలయు వనములోన మలయజంబున్నట్లు

విశ్వదాభిరామ వినుర వేమ

తా:-అడవిలో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నచో అడవి అంతయూ సువాసనతో నిండిపోవును. అట్లే వంశములో ఒక్క సద్గుణవంతుడు పుట్టినచో వాని వలన ఆ వంశమంతయూ కీర్తి ప్రతిష్టలు పొందును. ఈ విషయమే చిన్న మార్పు తో వేదమునందున్నది. ఎట్లనగా - - "అడవిలో ఒక సుగంధము గల పూలచెట్టు ఉన్నచో అడవి అంతయూ పరిమళించును. అట్లే పుణ్రకర్మములు చేయువాని కీర్తి గూడ లోకములో వ్యాపించును.


13.పూజకన్ననెంచ,బుద్ధి ప్రథానంబు

మాట కన్ననెంచ మనసుద్రుఢము

కులము కన్న మిగుల గుణము ప్రధానంబు

విశ్వదాభిరామ వినుర వేమ

తా:- చేసెడి పూజకన్నను, ఎందుకు చేయుచున్నామో తెలిసిన బుద్ధి ముఖ్యమైనది. ఆడిన మాట కన్నను మాట నిలబెట్టుకొనవలెనన్న మనసు ముఖ్యము. ఆ విధముగానే ఏ కులము లో బుట్టినాడను విషయం కంటే వానికి గల సద్గుణమును ప్రధానంగా చూడవలెను.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

కామెంట్‌లు లేవు: