18, ఫిబ్రవరి 2023, శనివారం

_నిజం తెలుసుకో !

 *_ఓ మానవుడా!!_*

*_నిజం తెలుసుకో !!_*

*_కొన్నాళ్ళే నీ జీవితం_*

*_చివరికి మట్టిలో కలవక తప్పదు!_*

*_ఎక్కడ నీ ఆస్తీ,_* *_అంతస్తులు ?_*

*_ఎక్కడ నీ కుటుంబం /_* *_బందువులు ??_*

*_ఎక్కడ నీ కులం /_* *_మతం / దేవుళ్ళు ???_*

*_గర్వం,_*

*_అహంకారం,_*

*_స్వార్థం,_*

*_నేను నాది అనే విధానం_*

*_మార్చుకో...!!_*

*_శాస్త్ర సాంకేతిక రంగాలలో_* 

*_నీవు ఎంత అభివృద్ధి_*

*_సాధించినా...‌!!_*

*_స్కాములతో_*

*_దోచుకున్న_*

*_దాచుకున్న_* 

*_ఎన్ని కోట్లకు పడగెత్తినా..!!_*

*_ఇదేగా నా చివరి జీవిత మజిలీ అని మరువకు సోదరా !!!_*


*_బతికే నాలుగు రోజులు పది మంది మంచి చేయటం మరవకు.._* *_మరువకు.._*

*_పాపభీతి కలిగిఉండు..._*

*_ఆపదలో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని ప్రేమను పంచే గుణము అలవరచుకో...!!_*

👏👏👏👏👏

*_(టర్కీ భూకంపంలో మరణించిన వారి అంతిమ సంస్కారాలు చూసి_* *_చలించిన హృదయ ఘోష)_*

*_మన్నించండి 👏👏👏👏_*


     *_మీ_*

*_శ్రేయోభిలాషి_*

పెద్దదిక్కు

 *_ఇంటికి పెద్దదిక్కు  వుండాలి అంటారు. ఎందుకంటే..._* 

🪷🪷🪷🪷🪷🪷🪷🪷


 *నాలుగు మంచి మాటలు చెప్పడానికి మరియు  తప్పు చేస్తే ఖండించడానికి.* 


*అసలు మాకు పెద్ద దిక్కే వద్దు.. మంచి చెప్పే వాళ్లు వద్దు.. అని అంటే, ఆ కుటుంబం ఏమైపోతుంది..? కళ్లు గానక ఊభిలోనికి కూరుకుపోతారు...* 


*ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది.* 


• *దుర్యోధనునికి తల్లిదండ్రులు అతిప్రేమ వలన చెప్పలేకపోయారు.*

 

• *విదురుడు మంత్రిత్వం వలన చెప్పలేక పోయాడు.* 

• *భీష్ముడు పాపం తాత గారు... చనువు ఎక్కువే, అయినా ఎన్నో సార్లు చెప్పి చూశాడు. కానీ, ఆయన్నీ లెక్క చేయలేదు...* 


• *చివరికి ఏమైంది...??? మహా సామ్రాజ్యంతో పాటు సర్వమూ కూలిపోయింది...*

 

     *~~~~~*


*పెద్దలు లేని సంసారమూ, కుటుంబమూ ఏమవుతుందో తెలుసుకోవాలి..*


*వందమంది కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి. ధర్మాన్ని చెప్పేవాడు ఒక్కడైనా వుండాలి.*

 

*_అదే ధృతరాష్ట్రుని గొప్పతనం..._*


*ధృతరాష్ట్రుడు విదురుడిని ప్రక్కన పెట్టుకొన్నాడు, అందుకనే ఆయనకు శ్రీకృష్ణ విశ్వరూప దర్శన భాగ్యం లభించింది.*

*అదే శకునిని దగ్గర పెట్టుకొన్న దుర్యోధనుడి  స్థితి మనకు తెలుసు...* 


*దుర్మార్గుడైనా సరే ఓ మహాత్ముడ్ని, మంచి వాడ్ని చెంత పెట్టుకోవాలి.. దీనిని మనం బాగా గుర్తు పెట్టుకోవాలి.*


 *ధర్మరాజు విషయంలో చూడండి.. ఆయన అందరి మాట విన్నాడు. ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు. ధర్మ ప్రవర్తనతో బ్రతికారు.* 


*మరి దుర్యోధనుడో.... ఎవ్వరి మాటయినా విన్నాడా?  తల్లిదండ్రుల మాట వినలేదు. గురువుల మాట వినలేదు. పెద్దల మాట వినలేదు. శ్రేయోభిలాషుల మాట వినలేదు. భగవంతుడి మాట కూడా వినలేదు. చివరికి ఏమయ్యాడు?*


*మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడుకునియైనా తెచ్చుకోవాలి."అయ్యా మీరు మార్గ నిర్ధేశకులుగా ఉండండి, అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు!" అని ప్రాధేయపడి వుంచుకోవాలి. పెద్దవాళ్లను వుంచుకున్నందు వలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది, చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించుకోవాలి అంటారు.. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి.. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలు పాటు చల్లగా వుంటారు...* 


*ధర్మం చెప్పే పెద్దలు లేనందువలన లేదా చెప్పినా వినకపోవడం వలన సమాజం దెబ్బతింటుంది.*


*ఎవడికి వాడు నేనే పెద్ద అంటే ఎలాగా?* 

*అలాంటి జ్ఞానవంతులు వుంటేనే ఓక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూ వుంటాయి...* 


*అయ్యా శ్రీకృష్ణా! నేను ఏమి తప్పుజేసానని? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడిగితే...*

*_"ఓ తప్పును ఆపలేనప్పుడు అది జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు"_ అని అంటాడు కృష్ణుడు.* 


*ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు...*

 

*అదే విదురుడు కూడా ఆ దృశ్యాన్ని చూడకుండా అక్కడ నుండి వెళ్లిపోయినాడు...*

*కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు.* *అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు.....*

*_ఇదీ విజ్ఞులు చేసే పని._*

🌹🍀🙏(సేకరణ)🙏🍀🌹

భక్తే నాకు కావాలి.

 శ్లోకం:☝️

*న ధనం న జనం న సుందరీం*

*కవితాం వా జగదీశ కామయే*

*మమ జన్మని జన్మనీశ్వరో*

*భవతాద్భక్తిరహైతుకీ త్వయ*

(శ్రీకృష్ణచైతన్య విరచితం, శిక్షాష్టకం)


భావం: జగదీశా! నాకు ధనం వద్దు, జనం వద్దు, సుందరులు వద్దు, కవిత్వం వద్దు. జన్మ జన్మాంతరాలలో నీపట్ల అహేతుక భక్తే నాకు కావాలి.🙏

సాధకుడు- మనస్సు

సాధకుడు- మనస్సు  

అటుపిమ్మట సాధకుని ద్రుష్టి మనస్సు మీద పెట్టాలి. నిజానికి మనస్సు అనేది ఒక కోతి లాంటిది, ఏ రకంగా అయితే ఒక కోతి ఒక కొమ్మ మీదినుంచి ఇంకొక కొమ్మమీదికి నిర్విరామంగా ఉరుకుతూ, గెంతుతూ నిలకడ లేకుండా ఉంటుందో అదే విధంగా మనస్సు అనుక్షణం వివిధ విషయాలమీద మళ్ళుతూ ఉంటుంది. ఒక క్షణం నీవు చూసిన సినిమా గుర్తుకు వస్తే మరుక్షణం నీకు జరిగిన సంతోషకరమైన లేక దుఃఖకరమైన విషయం. ఒక నిముషం మీ ఊరులో ఉంటే మరుక్షణం ఇంకొక ఊరికి ఇలా పరి పరి విధాలుగా మనస్సు పయనిస్తుంది. అన్నిటికంటే వేగంగా పయనించేది మనస్సు అనేకదా మేధావులు చెపుతారు. యదార్ధానికి సాధకుడు తన శరీరాన్ని నియంత్రించుకోవటంలో ఆంతర్యం మనస్సుని నియంత్రించుకోవటానికి మాత్రమే కదా. 

మనస్సును నియంత్రించుకోవడం: 

ఒక గుర్రం వున్నదనుకోండి దాని రౌతు  చిన్న చిన్న రేకు ఫలకాలను దానికంటికి ప్రక్కగా అమరుస్తారు  దానివలన గుర్రం చూపు ప్రక్కకు మళ్లకుండా కేవలం వీడిమీదనే ఉంటుంది.  కాబట్టి గుర్రం ముందుకు మాత్రమే పరిగెడుతుంది.  అలా గుర్రం నడిపే రౌతు గుఱ్ఱాన్ని లొంగదీసుకుంటాడు. మన మనస్సు కూడా గుఱ్ఱం లాగా పరి పరి విషయాలమీదకు మళ్లకుండా కేవలం భగవంతుని మీదకు మళ్ళటానికి మనం ఏదో ఒక ఫలకాన్ని మనస్సుకు అడ్డంగా పెట్టుకోవాలి.  అది ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సాధకుడు ఏర్పాటు రకంగా వారి ఇష్టానుసారంగా  ఏర్పాటు చేసుకోవాలి.  కొంతమంది నామ స్మరణను ఎంచుకొని భగవన్నామాన్ని సదా ఉచ్చరిస్తుంటారు.   ఇంకొకరు భగంతుని భజిస్తూ వుంటారు, కొంతమంది సదా నామ జపం  చేస్తూవుంటారు. (ఉదాహరణకు ఇస్కోన్ సమస్తలోని సాధకులు) కొందరు నామాన్ని లికిస్తూవుంటారు, రామకోటి, శివకోటి వ్రాయటం మొదలగునవి. ఇలా ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటారు. ఇందులో ఇది మంచిది ఇది కాదు అని అనటానికి లేదు. విధానం ఏదైనాకూడా మనకు కావలసింది మనస్సును నియంత్రించుకోవడం మాత్రమే. మన ప్రయాణం అనాయాసంగా జరగాలి అంటే అది బస్సు అయితే నేమి రైలు అయితేనేమి గమ్యాన్ని చేరటం ముఖ్యం కదా. 

మనం తరచుగా చూస్తూవుంటాము చాలామంది పైన  పేర్కొన్నఏదో ఒక విధానాన్ని అనుసరించి అదే జీవిత లక్ష్యంగా వారి జీవనాన్ని కొనసాగిస్తారు.  కానీ మిత్రమా ఆలా ఎప్పటికి అనుకోకూడదు. ఈ పద్ధతులు కేవలం మనస్సును నియంత్రించుకోవటానికి మాత్రమే ఉపకరిస్తాయి కానీ అంతకంటే వేరొకటి కాదు నీ లక్ష్యం మోక్ష సాధన మాత్రమే. మోక్షయానికి ఈ పద్ధతులు ప్రారంభ శిక్షణగా మాత్రమే ఉపకరిస్తాయి కానీ మోక్షసిద్ది మాత్రము లభించదు. 

మనం పూర్తిగా సాధకులు ఆచరించే భక్తి మార్గాలు మోక్షాన్ని చేరుకోలేవు అని కూడా అనలేము. మనం మన చరిత్రను పరిశీలిస్తే భక్తి మార్గంతో మోక్షాన్ని చేరుకున్న మహా భక్తుల ఉదంతాలు మనకు తెలుసు. ముందుగా భక్తి మార్గాలు ఏమిటో పరిశీలిద్దాం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, తన్మయాసక్తి, పరమ విరహాసక్తి   అని పదకొండు భక్తి సాధనలున్నాయి.

          శ్రవణానికి పరీక్షిత్‌ మహారాజు, కీర్తనము వలన తుంబురుడు, విష్ణుస్మరణ వలన నారదుడు, పాదసేవ వలన  శ్రీ మహాలక్ష్మి, అర్చన వలన పృథు చక్రవర్తి, వందనము వలన అక్రూరుడు, దాస్యము వలన హనుమంతుడు, సఖ్యము వలన  అర్జునుడు, ఆత్మ నివేదన వలన బలిచక్రవర్తి ముక్తి పొందారు. ఇక పదవది తన్మయాసక్తి. భక్తితో పారవశ్యము చెంది తన్మయమైపోయాక నీవే ఆ కృష్ణ పరమాత్మగా మారి చైతన్య ప్రభువు ఎలా గంతులేస్తున్నాడో, ఎలా తనకు తెలియకుండానే గీతాలు పాడుతున్నాడో, కవిత్వము రాకుండానే కవిత్వం చెప్తున్నాడో అది తన్మయాసక్తి. పరమ విరాహసక్తి అంటే, భగవంతుని విడిచి ఒక్క క్షణము కూడా వుండలేను. ప్రియుని విడిచి వుండలేను అని ప్రియురాలు ఎలాగైతే విరహ వేదన అనుభవిస్తుందో, అలాగే. 

కాబట్టి భక్తి మార్గం కూడా ఉపయుక్తమైనదే అయితే మరి భక్తిమార్గాన్నే అనుసరించవచ్చుకదా.  జ్ఞ్యాన మార్గం ఎందుకు ఆచరించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. మనం సూక్షమంగా పరిశీలిస్తే భక్తి మార్గం వేరు జ్ఞాన మార్గం వేరుగా గోచరించవు. అటువంటప్పుడు రెండు మార్గాలు ఎందుకు వున్నాయి అంటే.  ముందుగా ఒక సాధకుడు భక్తి మార్గాన్ని అనుసరించి సాధన కొంత ముందుకు సాగిన తరువాత తనకు తానుగా జీవాత్మ వేరు పరమాత్మా వేరు కాదనే భావనలోకి  వస్తాడు. అప్పుడు తానూ ఈ చరచరా జగత్తుకు కారణభూతుడైన సర్వేశ్వరునిలో అంతర్లీనంగా వున్నాను అంటే 

అహం బ్రహ్మాస్మి 

అనే భావనలోకి వస్తాడు.  ఇలా తెలుసుకోవటమే జ్ఞ్యానం తరువాత తనకు తెలియకుండానే భ్రహ్మ జ్ఞ్యాన పిపాసకుడు అయి తానె బ్రహ్మ అవుతాడు. 

"బ్రహ్మ విత్ బ్రహ్మయేవ భవత్" 

ధ్యానం సద్గుణోపానా లేక నిర్గుణోపాసనా 

ధ్యానం సద్గుణోపానా లేక నిర్గుణోపాసనా అనే సందేహం ప్రతి సాధకుని మదిలో తొలిచే ప్రశ్నయే కొంతమంది విగ్రహారాధన సద్గుణోపాసన అని ధ్యానంలో ప్రతిమ లేదు కాబట్టి అది నిర్గుణోపాసనే అని చెపుతారు. నిజానికి సూక్ష్మంగా పరిశీలిస్తే ధ్యానం కూడా సద్గుణోపాసనే అని చెప్పవలసి వస్తుంది.  అది ఎలా అంటే బాహ్యంగా, బౌతికంగా ఎలాంటి విగ్రహం లేకపోవచ్చు కానీ అంతరంగికంగా మనం మనస్సుకు ఒక స్థాన నిర్దేశనం చేసి ధ్యానం చేస్తున్నాం. ఉదాహరణకు గీతలో కృష్ణ భగవానులు భృకుటి (రెండుకనుబొమ్మల నడుమ) జాస నిలిపి అంటే మనస్సు నిలిపి ధ్యానానం చేయమన్నారు. కొందరు సాధకులు ఈ పద్దతి సులువు కాదని పేర్కొన్నారు.  ఏదిఏమైయేన సాధకుని అనుభవంతో మాత్రమే తెలుసుకోగలడు. ఇటీవల చాలా సంస్థలు యోగా కేంద్రాలు వస్తున్నాయి. ఒక్కరు శ్వాస మీద జాస అని ఒకరు హృదయంలో జాస అని ఒకరు బిందువు మీద జాస అని కొందరు క్రియా యోగమని కొందరు సుదర్శన యోగమని ఇలా పరి పరి విధాలుగా ధ్యాన పద్ధతులు  తెలుపుతున్నారు. అవి అన్ని తప్పు అని మనం అనలేము. పద్దతి ఏదైనా కానీ అంతిమ లక్ష్యం మనస్సును నిగ్రహించటమే. కాబట్టి ఎవరికి నచ్చిన పద్దతిని వారు అనుసరించవచ్చు. 

పైన పేర్కొనిన ప్రతి పద్ధతిలోను మనస్సు వున్నది అంటే మనోవృత్తి  వున్నాడనుమాట. ఎప్పుడైతే మనస్సు లయం కాలేదో అప్పుడు అది సద్గుణమే అవుతుంది కానీ నిర్గుణం కాదు.  అయితే నిర్గుణోపాసన లేదా అని అడుగవచ్చు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే నిర్గుణోపాసన వున్నది కానీ అది ఉపాసన మాత్రం కాదు ఎందుకంటె ఉపాసన అనే పదంలోనే నీవు భగవంతునికన్నా బిన్నంగా ఉన్నవని కదా అర్ధం.  ఎప్పుడైతే మనస్సు పూర్తిగా లయం అవుతుందో అదే నిర్గుణోపాసన. అది కేవలం సమాధి స్థితిలోనే లభిస్తుంది. చిత్తవృత్తి నిరోధమే  ధ్యానం అని మహర్షులు తెలిపారు.

సాధకుడు ఎప్పుడయితే సమాధి స్థితిని పొందుతాడో అప్పుడు అతనికి బాహ్య స్మ్రుతి పూర్తిగా పోతుంది. శరీర వ్యాపారాలు అంటే ఆకలి దప్పులు, హృదయ స్పందన, శ్వాస పీల్చుకోవటం, వదలటం. స్పార్స్య జ్ఞ్యానం, ఇవి ఏవి వుండవు. శరీరం మీద పాములు, జర్రులు ప్రాకిన శరీరం చుట్టూ పుట్టలు పెరిగిన, ఎండలు కార్చినా వర్షాలు కురిసిన ప్రకృతి బీబత్సవంగా ప్రళయాలు సంభవించినా సాధకునికి స్పృహ ఉండదు.  ఆ స్థితిని చేరుకునే సాధకుడు  జీవన్ముక్తుడు. అదే మోక్షముగా మనం తెలుసుకోవచ్చు. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ప్రతి సార్దకుడు సమాధి స్థితిని చేరుకునేలా తన సాధనను కొంగసాగించాలని సాధకులందరు మోక్షగాములు కావాలని అభిలాష. 

ఓం తత్సత్,

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 

 


 

సులక్షణ మహారాజు కథ

🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

           _*శుక్రవారం*_

    _*ఫిబ్రవరి 17, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*27 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉 


*సులక్షణ మహారాజు కథ*


🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️


గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారమను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరును వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు.


నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును , పెద్దలు పుత్రులు లేనివారికి దరిద్రునికి , కృతఘ్నునకు , వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను మహర్షుల యాశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైన ఉపాయము చెప్పగలరేమో ? ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను. అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను , అచట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి యిట్లనిరి. రాజా ! వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు , సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రధసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడా మునులు  ఓక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషముతో వారికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులను , రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి , తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున అవి అన్నియు వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్భపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుని కని యొడలు తెలియకపడియుండెను. గుహలోనున్న పులి బాలింతను యీడ్చుకొని పోయి భక్షించెను.


అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి యెండ మున్నగువాని బాధ ఆ శిశువునకు లేకుండ చేసినవి. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే  సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి , అట్లు వచ్చినవారిలో ఇద్దరు భార్యలుండి సంతానము లేని  గృహస్థు ఒకడు వారితో బాటు స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి గొనిపోవలెను అని తలచి ఈ బాలుడెవరు యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను అని యెంత ఆలోచించినను వారికి సమాధానము దొరకలేదు , వనమున , జలమున , గర్భమున నెచటనున్న వానినైనను రక్షించి పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా ! ఆయనయే నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. బాలుని ఇంటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచవలెను అని పరస్పరము వివాద పడుచుండిరి ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని యెంత వెదకినను కనిపించలేదు.


అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను అచటె పండుకొనెను. తులసీ  స్పర్శవలన బాలునకా వనమున యెట్టి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడచినది యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప మరేమి చేయగలడు. వాని దైన్యము , నిస్సహాయత ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు , మృగములు , పక్షులు అచటికి వచ్చినవి , బాలుని నిస్సహాయత ధైర్యము వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా ! అట్లే బాలుడును పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా , బాలుడు పశుపక్ష్యాదులు  విభిన్నజాతులవారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోటనుండి రేవునుండి వచ్చినదే. అదియే దివ్యత్వము , కాని విచిత్రమేమనగా బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య , ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల , అట్లు వచ్చిన పక్షులు , మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ రెక్కలతో నీడను కల్పించినవి , తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములును. తేనె , ముగ్గినపండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు పక్షులు వానికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధముగా మృగములు , పక్షులు వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి వాని దుఃఖములను  మాన్పించి తమ యుపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పాదౌలో నుండుట , తులసిని జూచుట , తాకుట మున్నగు పనులను ఆతర్కితముగ చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని , యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ వాని నోటి నుండి కృష్ణ , గోవింద ,  అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పాదులో నివసించుచు , ఆడుకొనుచు కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక బాలునకట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలోనుండి మనచే పూజింపబడిన మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.


*🌳రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహము🌳*


సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని సేవకులను పంపి వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలెనే శ్రీహరినామస్మరణ చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి , తండ్రి , తాత , సోదరుడు యిట్టి బంధువుల నెరుగడు. కేవలము శ్రీహరి నామోచ్ఛారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతము నాచరింపుమని వానికి చెప్పెను. రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి మాఘస్నానము పూజ మున్నగు వానిని ప్రారంభించెను.


మాఘశుక్ల చతుర్దశినాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును చిరకాలమనుగ్రహింపుమని కోరెను. శ్రీహరి బాలకా ! నీవు రాజువై యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము , పుత్రపౌత్ర సమృద్ధిని , సంపదలను , భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను , సర్వసమృద్దులను , సర్వసుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చుమని చెప్పెను. సపరివారముగ అంతర్దానమందెను. సునందుడును రాజకుమారుని దీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను.


సులక్షణ మహారాజు ఆశ్చర్యమును , ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పేరిడెను. బాలుడు విద్యాబుద్ధులను  పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలును సమాగమనము చేసి పరలోకమునకు భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి , తల్లులకు శ్రద్ధతో శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ ప్రజారంజకముగ చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను , పౌత్రులను పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను , మనుమలతోను , భార్యలతోను కలసి జీవించియున్నంతవరకు మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


జహ్నుమునీ ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింప వలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములనంది శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు అని జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.


_*ఇరవైఏడవ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

: 🕉️ *ఓం నమః శివాయ*🔱

 🌹 *నమః పార్వతి పతయే*🌹 

   🔱 *హర హర మహాదేవ*🔱

       🔱 *శంభో శంకర!!*🔱


🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️


*ఒక ఆధ్యాత్మిక మిత్రుడు*  

 *పంపినది భాగస్వామ్యం*

       *చేయడమైనది* 


🔯 *మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం రుద్రం.....!!*🔯


శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించ గల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.


రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు.


నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |


నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||


నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం  ప్రాప్తిస్తుంది.


నమకం విశిష్టత :


నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చాలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.


అనువాకం – 1:

తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.


అనువాకం – 2 :

ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.


అనువాకం – 3:

ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు.


అనువాకం – 4:

ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:


అనువాకం – 5:

ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.


అనువాకం – 6:

ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.

ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.


అనువాకం – 7:

నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి  పశుసంపద, వస్త్రాలు, భూములు, ఆయుష్షు, మోక్షం కోసం కూడా చదువుతారు.


అనువాకం – 8:

ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.


అనువాకం –9:

ఈ అనువాకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.


అనువాకం – 10:

ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.


అనువాకం – 11:

ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.


చమకం విశిష్టత:


నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతి పనిని మనిషి ఆస్వాదించి, చివరకు


అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుండి ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే..


🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

           _*శనివారం*_

    _*ఫిబ్రవరి 18, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*28 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉 


*క్రూర (రా) కథ*


🕉️🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️


గృత్నృమహమహర్షి జహ్నుమునితో నిట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము నాచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశమువారి నందరినుద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహదేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ యుండెను. ఆమె యొక రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆ  దంపతులకు జ్ఞానియగు పుత్రుడుకలడు. అతడు దయావంతుడు ధర్మాచరణమనిన ఇష్టము కలవాడు. వాని భార్య పతి భక్తి కలిగినది ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుటయందిష్టము కలదు. బంధువులకు దీనులకు అతిథులకు అందరికి యధా శక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడును సేవచేయుచుండెను. క్రూర కోడలిని యే దోషము లేకున్నను నిందించెడిది కిట్టెడిది. అప్పుడప్పుడామె భర్తయు తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు నోర్పుతో వినయ విధేయతలతో వారికి యధాశక్తిగ సేవలు చేయుచుండెడిది.


ఒకనాడు యిట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను జూచి క్రూరా పుత్రుడు తన తల్లిదండ్రులతో నిట్లనెను. నాయనా ! అమ్మా ! నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది. మీకు కోడలిపై కోపమెందులకు ? కలహమునకు కారణమేమి ? మీ శరీరములకును బాధను కలిగించు యీ కోపముతో మీకేమి ప్రయోజనము ? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు ? నేను గాని , నా భార్యగాని మీకేమి ఉపకారమును చేసితిమి ? మీ యీ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు ధనము , కీర్తి , సుఖము , గౌరవము , జ్ఞానము మున్నగునవి నశించును కదా ! సర్వజ్ఞులైన , పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను.


పుత్రుని మాటలను విని క్రూర భర్తతోబాటు మిక్కిలి కోపముతొ యిట్లనెను. మూర్ఖుడా పో పొమ్ము. నీవెంత ? నీ భార్యయెంత ? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యను యేమి చేసినను తప్పులేదు , అని పలికి కొడుకును కోడలిని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగ కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను. కాని సహజమైన శాంతమును పొందెను. *'అయ్యో తల్లితండ్రులను ద్వేషించుట యెంత తప్పు అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటిలేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా ! విష్ణువుతో సమాన దైవము , గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగుమాటలతో నూరడించెను. ఓర్పుగా నుండుమని సమాధాన పరచెను.


కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసి వేసెను. ఆమె కుమారుడీ ఆకృత్యమును జూచి తల్లినేమియు అనలేక పితృభక్తి వలన నేమియు చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలెనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను. కోడలు ఆ గదిలో ఏడురోజులు అన్నము , నీరులేక ఆవిధముగా నిర్భంధములోనుండెను. యిరుగుపొరుగువారు, బంధువులు , మిత్రులు యీపని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు, కోడలిని అట్లె నిర్బంధించి పీడించెను. ఏడవదినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండ తలుపు తెరచి చూచెను. మరణించిన భార్యను జూచి సంతాపమునంది నిశ్చేష్టుడైయుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను.


క్రూరయూ తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖవివశుడైన పుత్రుని జూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము యెక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె యెడ్పును విని అందరును యేమియనుచు చూడవచ్చిరి. విషయమును తెలిసికొని క్రూరను బహువిధములుగ నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను.


క్రూర పశ్చాత్తాపమునందెను , పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగ శోకించుటను జూచి జనులందరును విచారించిరి. కాని ఈ సమయమున విచారించి లాభమేమి , పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసివత్ర నరకము(కత్తుల బోను) చిరకాలమనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొఱ్ఱలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు , ఉపధీరుదు అను ఇద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి , చంపానదిలో మాఘమాస స్నానము నాచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగ చెప్పుకొనిరి.


సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన , శ్రీహరి మహిమను వినుటవలన , వారి పాపములు పోయినవి. పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్యా ! మాఘమాసవ్రత మిట్టిదని యెంతకాలము చెప్పినను పూర్తికాదు. ఇంతమందియే మాఘమాసవ్రత మహిమ వలన తరలచిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి యెంతమందియో , ఉత్తమ మునులు , సజ్జనులు , రాజులు , వైశ్యులు , బ్రాహ్మణులు , శూద్రులు , పురుషులు , స్త్రీలు , బాలురు , పశుపక్ష్యాదులు వారు వీరననేల సర్వప్రాణులును మాఘమాసవ్రతము నాచరించుట వలన , చూచుట వలన , వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము నాచరించినచో , చేసిన పాపములు పోయి పుణ్య లోకములు కలుగుననుటకెన్ని ఉదాహరణములను చెప్పగలను ? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నృమదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను.


_*ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

శివునికి అభిషేకం

 🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩


*శివునికి అభిషేకం:*

_______________

*శివుడు అభిషేక ప్రియుడు.* *శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయనీ మహాశివునికి అభిషేకం చేయించడం ద్వారా వంశాభివృద్ధి చేకూరుతుందనీ విశ్వాసం.*


*శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి.* *ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవు.* *తద్వారా ఆ కుటుంబం తరతరాల పాటు సకల శుభాలను సంతరించుకుంటుంది.*


*ఆవుపాలతో శివునికి అభిషేకం చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయి.* *పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి.*

 

*మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభిస్తాయి. గరిక నీటితో శివాభిషేకం చేయించిన వారికి నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు.* 


*పెరుగుతో శివునికి అభిషేకం చేయిస్తే..  ఆరోగ్యం చేకూరుతుంది.* *పంచదారతో చేయిస్తే దుఃఖం తొలగిపోతుంది.* *రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.*


*శివాభిషేక  ఫలములు:*

------------------------


1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు 


2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 


3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 


4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును.


5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. 


6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.


7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 


8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

 

9.  తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును.


10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 


11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

 

12. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.


13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 


14. గంగోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.


15. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. 


16. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.


17. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా  బాగుంటుంది అన్న లింగార్చన).


18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.


19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.


20. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.


21. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును. 


22. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని  కలిగించును.


23. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.


24. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.🙏🙏🙏🙏


 మహా శివరాత్రి సందర్భంగా ఈ విశేషాలు అందించడం జరిగింది.🙏🙏🙏🙏🙏

So beautiful, It's so true.

 So beautiful, It's so true. 


"Go not to the temple "~ by Rabindranath Tagore: 


Go not to the temple to put flowers upon the feet of God,

First fill your own house with the Fragrance of love and kindness. 


Go not to the temple to light candles before the altar of God,

First remove the darkness of sin , pride and ego, from your heart...


Go not to the temple to bow down your head in prayer,

First learn to bow in humility before your fellowmen.

And apologise to those you have wronged. 


Go not to the temple to pray on bended knees,

First bend down to lift someone who is down-trodden.

And strengthen the young ones.  

Not crush them.


Go not to the temple to ask for forgiveness for your sins,

First forgive from your heart those who have hurt  you ! 🌺

కేసియారు...పోరు..పాలన.

 కేసియారు...పోరు..పాలన.


తెలంగాణా తల్లి ముద్దు బిడ్డడు

అరువది తొమ్మిది యేండ్ల దార్శనికుడు 

పోరుగడ్డను ఏలేటి వీరుడు

ధీరాధిధీరుడు కేసియారు.


విపక్షాలకు ఎదురొడ్డి నిలిచి

జనం గుండెల్లో పోరు నిలిపి

మా నేల మాదంటూ 

మా నీరు మాకంటూ 

ఉద్యమ బావుటా రగిలించిన

రణసారధి అతడు... కేసియారు.


చీకటి కాలానికి వెలుగు తెచ్చి

స్వయం పాలనకు దారి వేసి

ఆపదల కాలాన ఆదుకున్న

ప్రజా నాయకుడు కేసియారు.


బీడు భూముల రూపు మార్చి మాగాణి

ధాన్యపు సిరుల పంటను జేసేలా

గంగను నేలన చేర్చిన

భగీరథుడికి మరో రూపం.


పంట భూములకు కొత్తదనం

జలం పరవళ్ళు తొక్కిన వైనం

పండిన పంటల ధాన్యాగారం

దేశానికే నేడు తలమానికం.


ఆడ బిడ్డలకు అన్నగా

అభాగ్యులకు అండగా

ఆపన్నులకు పెద్ద దిక్కై

ఇంటింట పెద్ద కొడుకై.


తల్లి ఒడికి కేసియారు కిట్టు

రైతన్నకి రైతు బంధు సాయం

మహిళలకు పెండ్లి కానుకలు

చేతి వృత్తులకు ప్రోత్సాహం.


నేటి బంగారు తెలంగాణ

పచ్చని పంటల మాగాణా

స్వర్ణ యుగంగా నేటి పాలన 

కొనసాగే కేసియారు పాలన.


తెలంగాణ రాష్ట్ర 

గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు 

మీకు జన్మదిన శుభాకాంక్షలు.


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

ఉత్తమ గుణాల వలన

 శ్లోకం:☝️

*భవత్యరూపోఽపి హి దర్శనీయః*

*స్వలంకృతః శ్రేష్ఠతమైర్గుణైః స్వైః ।*

*దోషైః పరీతో మాలినీకరైస్తు*

*సుదర్శనియోఽపి విరూప ఏవ ll*


భావం: తన యొక్క ఉత్తమ గుణాల వలన వికారమైన వ్యక్తి కూడా అందంగా కనిపిస్తాడు. కానీ అందమైన వ్యక్తికి కూడా లోపాలనే మురికి అంటితే వికారంగా కనిపిస్తాడు.

ముద్దపప్పు సప్తాహములు*_

 _*తెనాలిలో ముద్దపప్పు సప్తాహములు*_ 


పూర్వం మన తెనాలి రామలింగేశ్వర పేటలో, మణెమ్మ గారి మఠం లో ప్రతి ఏడాదీ, మాఘ మాసంలో 'వార్షిక ముద్దపప్పు సప్తాహం' ఘనం గా జరిగేది! 


తెనాలి చుట్టుపక్కల గల ఆరు అగ్రహారాలనుండి వేద పండితులే కాక, ముద్దపప్పు ప్రియులు అయిన ఇతర  కులాలూ, వర్ణాల వారూ కూడా,   వేంచేసి, ఆ ముద్దపప్పు సప్తాహపు ఏడు రోజులూ, ముద్దపప్పు భోజనం, మఠం నిద్రా కావించి తిరిగి వెళ్ళేవారు!


మాఘ శుద్ధ పాడ్యమి నాడు, చెయ్యి తిరిగిన నరసరావుపేట వంట వారు కొల్లూరు గ్రామపు పొలాలలో పండిన ఏడాది వయసుగల కందిపప్పు వాడి, బాగుగా గజ భగోణీలలో గోధుమ రంగు బారే వరకూ వేయించి, అటు పిదప బాగుగా ఉడకపెట్టి, ఉప్పూ, పసుపూ వేసి దివ్యమైన ముద్ద పప్పు వండేవారు!


 ఆ ముద్ద పప్పుకు అనుపానములుగా అంగలకుదురు పుల్ల దోసకాయలు వాడి, అనకాపల్లి ఆవపిండీ, చినరావూరు గానుగ నువ్వులనూనే, బుడంపాడు ఎర్ర మిరపకాయలు కొట్టిన కారమూ, వేటపాలెం రాళ్ళ ఉప్పూ తగు పాళ్ళలో వేసి, దేవతా దోసావకాయ తయారు చేసేవారు! 


అంతే కాక, వలివేరు మెట్టపొలాలలో కాసిన ఎర్ర గుమ్మడి కాయలూ, ముదురు బెండకాయలూ యొక్క ముక్కలు బాగా తగిలించి, ప్రసస్తమైన  ఇంగువ తిరగమాత పడవేసి, గొప్ప గుమ్మడి ముక్కల పులుసు చేసేవారు! 


తెనాలి పక్కన గల అనంతారం లో పండిన వడ్ల దంపుడు బియ్యం తో, మెత్తగా వేడన్నము వండేవారు! 


ఇకపోతే, వేజెండ్ల గ్రామపు నల్లటి గోకు తేలుతున్న బర్రె నెయ్యి సిద్ధం చేశేవారు!


 సంగం జాగర్లమూడి బర్రెలు బకింగ్ హాం కాలువ తీరాన గడ్డి మేసి ఇచ్చిన చిక్కటి పాల జిడ్డు గడ్డ పెరుగు పదిహేను కుండలలో తోడు  పెట్టి సిద్ధం చేసేవారు!


 ఇంగువ మినప వడియాలూ, పెసర ఎర్ర అప్పడాలూ వేయించి ఉంచేవారు!


మధ్యాహ్న భోజన వడ్డనకి ముందు, తెనాలి పట్టణ వాస్తవ్యులైన, ప్రముఖ హరికథా భాగవతారు శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికాధా కాలక్షేపం ఏర్పాటు చేశేవారు, ఒక గంట పాటు!


అటు పిమ్మట, పచ్చల తాడిపర్రు అరిటాకులు పరచి, పంక్తులు గా వడ్డన చేయగా, అందరూ ఆ ముద్దపప్పు భోజనం కావించి తాదాత్మ్యం చెందేవారు!


ఇదే విధంగా, మాఘ శుద్ధ విదియా, తదియా, చవితీ, పంచమీ, షష్టీ, సప్తమీ దినాలలో కూడా, అదే ముద్ద పప్పూ, కానీ వేరు రకముల అనుపానాలూ, ఇతర హరికధా, బుర్రకధా, పురాణ పఠనా కాలక్షేపాలూ జరిగేవి!


ఆ 'ముద్దపప్పు సప్తాహములు ' మరల తిరిగి రావు! ఆ రోజులే రోజులు.🙏🙏🙏

మహాశివరాత్రి_

 #మహాశివరాత్రి_


 18-2-2023 నాడు శివరాత్రి. ఈరోజు ఏమి చేయాలని శాస్త్రం నిర్దేశిస్తోందో ఒకసారి పరిశీలిద్దాం. 


"వ్రతంచేద ముపవాసపూజాజాగరాత్మక కర్మత్రయ సంకల్పరూపమ్ " - అని స్మృతికౌస్తుభం చెబుతోంది. అంటే ఈ శివరాత్రి వ్రతం అనేది 3 కర్మలు కలిసిన సంకల్పం చెప్పి చేయవలసిన వ్రతము. అవి 1.పూజ 2.జాగరణ 3.ఉపవాసం.  


#విద్యారణ్యులు కూడా తమ #కాలమాధవం లో -"ఇదం వ్రత స్వరూపం త్రివిధమ్, ఉపవాసో జాగరణం పూజా చ " అని పై విషయాన్నే వివరించారు. అయితే ఈ మూడూ సముచ్చయమా? లేక వికల్పమా? అనే విచారణను విద్యారణ్యులు చేస్తూ వికల్పమనే తేల్చారు. అంటే పై మూడూ (ఉపవాస, జాగరణ, పూజలు) చేయలేని వారు ఏ రెండో లేక ఏ ఒకటో సంకల్పం లో ఉదయమే చెప్పుకుని ఆ ప్రకారం నియమాలు పాటించాలి. అంటే ఓపిక ఉన్నవారు మూడూ చేయడం లేక ఏ రెండో సంకల్పించడం చేయాలి. దానికి కూడా ఓపిక లేనివారు పూజ గానీ, ఉపవాసం గానీ, జాగరణ గానీ ఏదో ఒకటే సంకల్పం లో చెప్పుకుని ఆచరించ వచ్చును. 


👉 #ఉపవాసముండే వారు #పారణ ఎప్పుడు చేయాలి? 


       చతుర్దశి తిథి మధ్యాహ్నం ఘ20-23వి వరకు ఉన్నది. దిన ప్రమాణం 29 ఘడియలు ఉన్నది. మూడవ యామము ఘ21-45వి కు అంతమగుచున్నది. 


 "యదా యామత్రయాదర్వాగేవ చతుర్దశీ పరిసమాప్యతే , తదా తిథ్యంతే పారణమ్" - అనే ధర్మశాస్త్ర నియమానుసారం మధ్యాహ్నం 2:35 కు పారణ చేయాలి. 


👉 పూజ ఒకటే సంకల్పించే వారు 8 ఝాముల పూజ చేస్తే మంచిది. అంటే ఒక్కొక్క ఝామున ఒక్కొక్క సారి పూజ లేక అభిషేకం చేయాలి. 


పగలు

     1వ ఝాము : ఉదయం 6:01 నుండి 9:21 వరకు

      2వ ఝాము : ఉ.గం 9:21 నుండి 12:14 వరకు

      3 వ ఝాము : మ.గం. 12:14 నుండి 3:08 వరకు

      4 వ ఝాము : మ.గం. 3:08 నుండి సాగం 6:01 కు

రాత్రి 

     1వ ఝాము : సాగం 6:01 నుండి రాగం. 9:08 కు

      2వ ఝాము : రాగం 9:08 నుండి 12:15 కు

      3వ ఝాము : రాగం 12:15 నుండి 03:23 కు

      4 వ ఝాము : రాగం 3:23 నుండి తె.గం. 6:26 వరకు


👉 జాగరణ ఉండేవారు 18 వ తేదీ శనివారం నాటి సూర్యోదయం నుండి 19 వ తేదీ ఆదివారం సూర్యోదయం  వరకు నిదుర పోకూడదు. 


ఈ విధంగా మన శక్త్యనుసారం చేసి శివుని కృపాకటాక్షాలకు పాత్రులవుదాం.


*💐💐శ్రీమాత్రే నమః💐💐* 

*మహాన్యాసంలోని శివదర్శనం చేద్దామా !*

*💐💐💐💐💐💐💐💐*


*మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అంటారు కదా ! అంటే, మహాన్యాసంతో కూడినటువంటి రుద్రాభిషేకం అని అర్థం. ఈ మహాన్యాసంలో శివుని ఐదు ముఖాల వర్ణన ఉంటుంది . ఇవి పంచగుణాత్మ ప్రతీకలుగా కనిపిస్తాయి . తదనుగుణంగానే ఆయన స్వరూపాన్ని వర్ణించడం జరిగింది . ఆవిధంగా శివుని దర్శించిన తర్వాత, ఆయనకు నమక చమకాలతో కూడిన అభిషేకాన్ని నిర్వహిస్తారన్నమాట . మహాన్యాసంలోని అద్భుతమైన ఆ పరమేశ్వరుని పంచముఖాలనూ ఇక్కడ దర్శిద్దాం.*


*మహాన్యాసం రుద్రానికి ముందుగా చేయడం (పూర్వాంగంగా) జరుగుతుంది. మహాన్యాసము అంటే, భక్తుడు రుద్ర జప హోమ అర్చన అభిషేకాదులు చేసేందుకు అర్హత పొందాలి .*


*‘నారుద్రో రుద్ర మర్చయేత్ ‘ - అంటే, రుద్రుడు కానివాడు రుద్రాభిషేకమునకు అనర్హుడు అని అర్థం . ఇది ప్రమాణవచనం . అందువల్లే రుద్రుని తన ఆత్మలో నిలుపుకోవడానికి, రుద్రతత్త్వాన్ని తెలుసుకొని అర్హతపొందే ప్రక్రియ మహాన్యాసం . దీంట్లో భక్తుడు పంచాంగన్యాసం చేయాల్సి ఉంటుంది . ఇలా వివిధ శరీరభాగాలని స్పృశిస్తూ , ఆ రుద్రుని తన దేహాత్మలో మంత్రయుక్తంగా ఆవాహన చేయడం ద్వారా తానే రుద్రుడై , రుద్రార్చనకి అర్హుడవుతాడని వేదవచనం.*

 

*రుద్రమహాన్యాసము ఐదు అంగాలు కలిగిఉంటుంది . అంటే ఐదు స్వరూపాలు అన్నమాట. లేదా ఐదు తత్త్వాలు అనికూడా చెప్పుకోవచ్చు . ఈ పంచతత్త్వాలూ కలిగినవారు పంచాంగ రుద్రులు.*


*రుద్రాభిషేకంలోని  పంచముఖ ధ్యానం లోని శ్లోకాలు వాటి అర్థ సహితంగా :*


*రుద్రాభిషేకంలోని  పంచముఖధ్యానం లోని శ్లోకాలు మహాన్యాసంలో ప్రస్తావించడం జరిగింది . తత్పురుష , అఘోర , సద్యోజాత , వామదేవ, ఈశాన అనే ఐదు ముఖాలను కలిగిన రూపాలే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాలని మనకి ఋషులు అందించారు .  దీనినే శివ పంచానన స్తోత్రం అనికూడా అంటారు . ఈ ఐదు ముఖాలలో ఒక్కొక్క రూపానికి ఒక ప్రత్యేకత ఉంది . ఈ మహాన్యాస వివరణని ‘రావణ ప్రోక్త న్యాస ప్రక్రియ’లో తెలియజేశారు.*

 

*తత్పురుషముఖం - ధ్యానం :*

*సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక – ప్రస్పర్థితేజోరుణం*

*గంభీర ధ్వని సామవేద జనకం -తామ్రాధరం సుందరం*

*అర్ధేందుద్యుతిలోల పింగళజటా  - భారప్రబద్ధోరగం* 

*వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః*


*ప్రళయకాలములో జ్వలించేటటువంటి అగ్నికాంతోనూ , తటిల్లతలా మెరిసే  మెరుపుల తేజముతోనూ , బాగా కరిగిన బంగారు కాంతితోనూ పోటీపడే తేజములే తనరూపముగా కలిగినది , గంభీర ధ్వనితోపాటు భయంకరమైన అగ్నిలాగా ప్రకాశించే యెర్రని పెదవులు కలిగినది , చంద్రఖండ కాంతితో మెరిసే పింగళ వర్ణపు జడలు కలిగి , దాని చుట్టూ గట్టిగా చుట్టుకున్న సర్పములు కలది, సిద్ధులు , సురలు , అసురులు నమస్కరించేది అయిన శూలి తూర్పు ముఖానికి నమస్కరిస్తున్నాను అని అర్థం.*


*రజోగుణ ప్రధానమైన సృష్టి తత్త్వము ఈ శ్లోకములో ప్రస్తుతింపబడింది.* 


*అఘోరముఖ ధ్యానం :*


*కాలాభ్ర భ్రమరాంజన ద్యుతినిభం -వ్యావృత్త పింగేక్షణం*

*కార్నోద్భాసిత భోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం*

*సర్పప్రోత కాపాలశుక్తి శకల - వ్యాకీర్ణతా శేఖరం*

*వందే దక్షిణమీశ్వరస్య వందనం – చాతర్వనాదోదయం*


*కారుమేఘములు ,  నల్లని తుమ్మెదల వంటి మెరుపుని  పోలిన కాంతితో ప్రకాశించేటటువంటిది , బాగా మిట్టగా తిరిగేటటువంటి పింగావర్ణపు కన్నులు కలిగి, కోరలు, శిరోరత్నాలు కలిగిన నాగులు కర్ణాభరణాలుగా కలిగినది , సర్పాలతోపాటు కపాలమాలని ధరించినటువంటిది , ముత్యపు చిప్పలపోలిన కనురెప్పలపైన, ఎగుడుదిగుడు నడకతో భయంకరమైన అరణ్యాన్ని పోలిన కనుబొమ్మలు కలిగిన ఆ ఈశ్వరుని దక్షిణ ముఖమునకు నమస్కరిస్తున్నాను .  తమోగుణప్రధానమైన లయకర్త తత్త్వాన్ని ఇక్కడ స్తుతించడం జరిగింది.*


*సద్యోజాత ముఖ ధ్యానం :*

*ప్రాలేయాచల మిందుకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం*

*భస్మాభ్యంగ మనంగ దేహదహన - జ్వాలావళీ లోచనం*

*విష్ణు బ్రహ్మ మరుద్గణార్చిత పదం – ఋగ్వేదనాదోదయం*

*వందేహం సకలం కళంక రహితం - స్థాణోర్ముఖం పశ్చిమం*


*హిమవత్పర్వతం , చంద్రుడు , మల్లెపూల వంటి తెల్లని ఛాయ కలిగినది , ఆవుపాలమీది నురుగువంటి స్వచ్ఛమైన కాంతిని కలిగినది , విభూతిని ధరించి ఉన్నది , మన్మధుని శరీరాన్ని దహించే జ్వాలల పంక్తితో నిండిన త్రినేత్రాన్ని కలిగినది , బ్రహ్మాది దేవతల చేత స్తుతింపబడుతున్నది , యోగులచేత శ్రద్ధగా అర్చింపబడుతున్నది, నిర్మలమైన నిండు వదనంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ శివుని పశ్చిమ ముఖానికి నమస్కరిస్తున్నాను . సత్త్వగుణ ప్రధానమైన ఆ ఈశ్వరుని తత్త్వాన్ని ఈ శ్లోకములో స్తుతించడం జరిగింది.*


*వామదేవ ముఖం - ధ్యానం :*

*గౌరం కుంకుమ పంకితం సుతిలకం - వ్యాపాండు మండ స్థలం*

*భృవిక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం*

*స్నిగ్ధం బింబ ఫలాధరం ప్రహసితం - నీలాల కాలం కృతం*

*వందే యూజుష వేదం ఘోష జనకం - వక్త్రం హరస్యోత్తరం*


*గౌరవర్ణము (ఎరుపుతోకూడిన తెలుపు ) కలది , కుంకుమ పూతతో నిండినది , అందముగా దిద్దిన తిలకాన్ని ధరించినది, ధవళకాంతితో మెరిసేటటువంటి చెక్కిళ్ళు , కనుబొమ్మల కదలికతో కూడిన చక్కని కడగంటి చూపుతో ప్రకాశిస్తూ, తెల్లని కలువలను చెవులకి అలంకారంగా ధరించినది, చక్కని చిరునవ్వుతో మెరిసే దొండపండు వంటి క్రింది పెదవితో , దోబూచులాడే నల్లని ముంగురులతో , నిండుపున్నమి జాబిలిలా ప్రకాశించే ఆ శివుని ఉత్తరముఖమునకి నమస్కరిస్తున్నాను .  మూడుగుణాల మిశ్రమరూపమైన ఆ ఈశ్వర తత్త్వాన్ని ఇక్కడ ప్రస్తుతించారు.*


*ఈశానముఖ ధ్యానం :*


*వ్యక్తావ్యక్త నిరిపితించ పరమం – శస్త్రింశతత్వాధికం*

*తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః*

*ఓంకారాది సమస్త మంత్రం జనకం - సూక్ష్మాది సూక్ష్మం పరం*

*వందే పంచమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం*


*వ్యక్తము , అవ్యక్తము (స్పష్టరూపం కలిగినది , రూపం స్పష్టంగా లేనిది ) అనే రెండు లక్షణాల కంటే కూడా భిన్నమైన లక్షణం కలిగినది , ముప్ఫయ్ఆరు తత్వముల రూపములో పరిణమించింది , సకల తత్త్వములకంటె ఉన్నతమైనదైన అనుత్తరము అనే అక్షర (అకార) తత్వాన్ని కలిగినది , ఎల్లప్పుడూ యోగులచేత ధ్యానింపబడేది అయిన తమోగుణ రహితమైన, త్రినేత్రములు కలిగిన సూక్ష్మాతి సూక్షము కన్న ఉన్నతమైన శాశ్వతాన్ని, ఆకాశమంతా వ్యాపించి ఉన్న తేజమే తన రూపమైన ఆ సర్వేశ్వరుని ముఖమునకు నేను నమస్కరిస్తున్నాను . గుణాతీతమైన బ్రహ్మతత్త్వమును ఇక్కడ స్తుతి చేస్తున్నారు.* 


💐💐💐💐💐💐💐💐