కేసియారు...పోరు..పాలన.
తెలంగాణా తల్లి ముద్దు బిడ్డడు
అరువది తొమ్మిది యేండ్ల దార్శనికుడు
పోరుగడ్డను ఏలేటి వీరుడు
ధీరాధిధీరుడు కేసియారు.
విపక్షాలకు ఎదురొడ్డి నిలిచి
జనం గుండెల్లో పోరు నిలిపి
మా నేల మాదంటూ
మా నీరు మాకంటూ
ఉద్యమ బావుటా రగిలించిన
రణసారధి అతడు... కేసియారు.
చీకటి కాలానికి వెలుగు తెచ్చి
స్వయం పాలనకు దారి వేసి
ఆపదల కాలాన ఆదుకున్న
ప్రజా నాయకుడు కేసియారు.
బీడు భూముల రూపు మార్చి మాగాణి
ధాన్యపు సిరుల పంటను జేసేలా
గంగను నేలన చేర్చిన
భగీరథుడికి మరో రూపం.
పంట భూములకు కొత్తదనం
జలం పరవళ్ళు తొక్కిన వైనం
పండిన పంటల ధాన్యాగారం
దేశానికే నేడు తలమానికం.
ఆడ బిడ్డలకు అన్నగా
అభాగ్యులకు అండగా
ఆపన్నులకు పెద్ద దిక్కై
ఇంటింట పెద్ద కొడుకై.
తల్లి ఒడికి కేసియారు కిట్టు
రైతన్నకి రైతు బంధు సాయం
మహిళలకు పెండ్లి కానుకలు
చేతి వృత్తులకు ప్రోత్సాహం.
నేటి బంగారు తెలంగాణ
పచ్చని పంటల మాగాణా
స్వర్ణ యుగంగా నేటి పాలన
కొనసాగే కేసియారు పాలన.
తెలంగాణ రాష్ట్ర
గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు
మీకు జన్మదిన శుభాకాంక్షలు.
అశోక్ చక్రవర్తి.నీలకంఠం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి