14, అక్టోబర్ 2021, గురువారం

*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *14.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2291(౨౨౯౧)*


*10.1-1424-*


*క. దానవుని దేహజం బగు*

*మానిత శంఖంబుఁ గొనుచు మసలక బలుఁడుం*

*దో నేతేరఁగ రథి యై*

*దానవరిపుఁ డరిగె దండధరుపురికి నృపా!* 🌺



*_భావము: "ఓ రాజా! పంచజనుడనే రాక్షసుని శరీరము నుండి ఉద్భవించిన మహిమాన్వితమైన శంఖాన్ని తీసుకొని, దానవరిపుడగు (రాక్షసవిరోధి) శ్రీకృష్ణుడు ఏ మాత్రము ఆలస్యము చేయకుండా, బలరామునితో కలిసి రథముపై యమ పురికి బయలుదేరాడు."_* 🙏



*_Meaning: "O king! Then Sri krishna collected the powerful Sankha (conch), generated from the body of the demon and along with Balarama, He started towards the land of Yama, on a chariot."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

సంస్కృత మహాభాగవతం

 *14.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునైదవ అధ్యాయము*


*వేర్వేరు సిద్ధుల నామములు - వాటి లక్షణములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*15.9 (తొమ్మిదవ శ్లోకము)*


*ఏతాశ్చోద్దేశతః ప్రోక్తా యోగధారణసిద్ధయః|*


*యయా ధారణయా యా స్యాద్యథా వా స్యాన్నిబోధ మే॥12783॥*


ఉద్ధవా! ఇంతవఱకును నేను తెలిపిన ఈ సిద్ధులన్నియును యోగధారణవలన లభించునట్టివి. వాటి పేర్లనుగూడ వివరించితిని. ఇంక ఏ యోగ ధారణ వలన ఏయేసిద్ధులు ఎట్లు లభించునో విపులీకరించెదను, ఆలకింపుము.


*15.10 (పదియవ శ్లోకము)*


*భూతసూక్ష్మాత్మని మయి తన్మాత్రం ధారయేన్మనః|*


*అణిమానమవాప్నోతి తన్మాత్రోపాసకో మమ॥12784॥*


ఉద్ధవా! పంచమహాభూతముల సూక్ష్మరూపములైన పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు) నా శరీరమే. నా ఈ పంచతన్మాత్రలను మనస్సున ధారణ చేయు సాధకునకు *అణిమ* అను సిద్ధి ప్రాప్తించును.


*15.11 (పదకొండవ శ్లోకము)*


*మహత్యాత్మన్మయి పరే యథాసంస్థం మనో దధత్|*


*మహిమానమవాప్నోతి భూతానాం చ పృథక్ పృథక్॥12785॥* 


'మహత్ తత్త్వరూపమున నేనే ప్రకాశించుచున్నాను. మహత్తత్త్వ రూపములోనున్న పరమాత్మయందు మనస్సును నిలుపుటవలన *మహిమ* అను సిద్ధి సమకూరును. అట్లే ఒక్కొక్క మహాభూతముయొక్క తన్మాత్ర యందు గూడ మనస్సును లగ్నము చేసినచో, *మహిమ* అను సిద్ధి లభించును.


*15.12 (పండ్రెంఢవ శ్లోకము)*


*పరమాణుమయే చిత్తం భూతానాం మయి రంజయన్|*


*కాలసూక్ష్మార్థతాం యోగీ లఘిమానమవాప్నుయాత్॥12786॥*


వాయువు మొదలగు నాలుగు మహాభూతములయందును పరమాణురూపమున ఆకాశమే వ్యాప్తమైయున్నట్లు, నేను సర్వత్ర పరిపూర్ణముగా వ్యాపించియున్నాను. చిత్తమును నాయందే లగ్నమొనర్చునట్టి యోగి నా తాదాత్మ్యమును పొందును. అప్పుడు అతనికి *లఘిమ* అను సిద్ధి ప్రాప్తించును. ఆ విధముగనే అతడు కాలముయొక్క సూక్ష్మాతిసూక్ష్మమైన పరమాణువయ్యెడి సామర్థ్యమును గూడ పొందును.


*15.13 (పదమూడవ శ్లోకము)*


*ధారయన్ మయ్యహం తత్త్వే మనో వైకారికేఽఖిలమ్|*


*సర్వేంద్రియాణామాత్మత్వం ప్రాప్తిం ప్రాప్నోతి మన్మనాః॥12787॥*


మనస్సు ఇంద్రియములన్నింటిలో ప్రముఖమైనది. ఇది అహంతత్త్వము యొక్క సత్త్వగుణరూప వికారముచే రూపొందును. నా స్వరూపమైన సాత్త్వికాహంకారమునందు తన మనస్సును ఏకాగ్రమొనర్చిన యోగికి తన ఇంద్రియములపై ఆధిపత్యము సిద్ధించును. అట్లే మనస్సును నాయందే లగ్నమొనర్చిన భక్తునకు *ప్రాప్తి* అను సిద్ధి లభించును.


*15.14 (పదునాలుగవ శ్లోకము)*


*మహత్యాత్మని యః సూత్రే ధారయేన్మయి మానసమ్|*


*ప్రాకామ్యం పారమేష్ఠ్యం మే విందతేఽవ్యక్తజన్మనః॥12788॥*

నా అవ్యక్తరూపమునుండియే బ్రహ్మాండము యొక్క నిర్మాణము జరిగినది. మహత్తత్త్వరూపము, సూత్రాత్మయు ఐన హిరణ్యగర్భునియందు మనస్సును ధారణచేసినచో *ప్రాకామ్యము* అను సిద్ధి లభించును. అతడు బ్రహ్మాండమునకు యజమాని (అధిపతి)యై పరమేష్ఠిపదమును పొందును.


*15.15 (పదునైదవ శ్లోకము)*


*విష్ణౌ త్ర్యధీశ్వరే చిత్తం ధారయేత్కాలవిగ్రహే|*


*స ఈశిత్వమవాప్నోతి క్షేత్రజ్ఞక్షేత్రచోదనామ్॥12789॥*


ఈ ముల్లోకములకును నేనే అధిపతిని. త్రిగుణాత్మకమైన మాయకు నేనే స్వామిని. సమస్త బ్రహ్మాండములను నాశనము చేయగల కాలస్వరూపుడను నేనే. క్షేత్రమైన శరీరమునకును, క్షేత్రజ్ఞుడైన జీవాత్మకును ప్రేరణ గూర్చు పురుషోత్తముడను నేనే. నా ఈ విష్ణుస్వరూపమును చిత్తమునందు ధారణ చేసినవానికి *ఈశిత్వము* అను సిద్ధి లభించును.నా వలెనే అతనికిని ఇచ్ఛానుసారము జీవులకు ప్రేరణను గూర్చెడి సామర్థ్యము గూడ ప్రాప్తించును.


*15.16 (పదహారవ శ్లోకము)*


*నారాయణే తురీయాఖ్యే భగవచ్ఛబ్దశబ్దితే|*


*మనో మయ్యాదధద్యోగీ మద్ధర్మా వశితామియాత్॥12790॥*


*శ్లో. ఐశ్వర్యస్యసమగ్రస్య ధర్మస్య యశసఃక్రియః|*


*జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం 'భగ'ఇతీరణా॥*


షడైశ్వర్యసంపన్నుడనైన *నారాయణుడను* నేనే. తురీయస్థితికి చేరిన యోగి, నా ఈ నారాయణస్వరూపమును మనస్సునందు ధ్యానము చేసి, స్థిరముగా నిలిపినచో, అతనికి సాధర్మ్యము కలుగును. అనగా నా గుణములే లభ్యములగును. అట్టియోగికి *వశిత్వము* అను సిద్ధి లభించును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సంస్కృత మహాభాగవతం*

 *14.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునైదవ అధ్యాయము*


*వేర్వేరు సిద్ధుల నామములు - వాటి లక్షణములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*15.9 (తొమ్మిదవ శ్లోకము)*


*ఏతాశ్చోద్దేశతః ప్రోక్తా యోగధారణసిద్ధయః|*


*యయా ధారణయా యా స్యాద్యథా వా స్యాన్నిబోధ మే॥12783॥*


ఉద్ధవా! ఇంతవఱకును నేను తెలిపిన ఈ సిద్ధులన్నియును యోగధారణవలన లభించునట్టివి. వాటి పేర్లనుగూడ వివరించితిని. ఇంక ఏ యోగ ధారణ వలన ఏయేసిద్ధులు ఎట్లు లభించునో విపులీకరించెదను, ఆలకింపుము.


*15.10 (పదియవ శ్లోకము)*


*భూతసూక్ష్మాత్మని మయి తన్మాత్రం ధారయేన్మనః|*


*అణిమానమవాప్నోతి తన్మాత్రోపాసకో మమ॥12784॥*


ఉద్ధవా! పంచమహాభూతముల సూక్ష్మరూపములైన పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు) నా శరీరమే. నా ఈ పంచతన్మాత్రలను మనస్సున ధారణ చేయు సాధకునకు *అణిమ* అను సిద్ధి ప్రాప్తించును.


*15.11 (పదకొండవ శ్లోకము)*


*మహత్యాత్మన్మయి పరే యథాసంస్థం మనో దధత్|*


*మహిమానమవాప్నోతి భూతానాం చ పృథక్ పృథక్॥12785॥* 


'మహత్ తత్త్వరూపమున నేనే ప్రకాశించుచున్నాను. మహత్తత్త్వ రూపములోనున్న పరమాత్మయందు మనస్సును నిలుపుటవలన *మహిమ* అను సిద్ధి సమకూరును. అట్లే ఒక్కొక్క మహాభూతముయొక్క తన్మాత్ర యందు గూడ మనస్సును లగ్నము చేసినచో, *మహిమ* అను సిద్ధి లభించును.


*15.12 (పండ్రెంఢవ శ్లోకము)*


*పరమాణుమయే చిత్తం భూతానాం మయి రంజయన్|*


*కాలసూక్ష్మార్థతాం యోగీ లఘిమానమవాప్నుయాత్॥12786॥*


వాయువు మొదలగు నాలుగు మహాభూతములయందును పరమాణురూపమున ఆకాశమే వ్యాప్తమైయున్నట్లు, నేను సర్వత్ర పరిపూర్ణముగా వ్యాపించియున్నాను. చిత్తమును నాయందే లగ్నమొనర్చునట్టి యోగి నా తాదాత్మ్యమును పొందును. అప్పుడు అతనికి *లఘిమ* అను సిద్ధి ప్రాప్తించును. ఆ విధముగనే అతడు కాలముయొక్క సూక్ష్మాతిసూక్ష్మమైన పరమాణువయ్యెడి సామర్థ్యమును గూడ పొందును.


*15.13 (పదమూడవ శ్లోకము)*


*ధారయన్ మయ్యహం తత్త్వే మనో వైకారికేఽఖిలమ్|*


*సర్వేంద్రియాణామాత్మత్వం ప్రాప్తిం ప్రాప్నోతి మన్మనాః॥12787॥*


మనస్సు ఇంద్రియములన్నింటిలో ప్రముఖమైనది. ఇది అహంతత్త్వము యొక్క సత్త్వగుణరూప వికారముచే రూపొందును. నా స్వరూపమైన సాత్త్వికాహంకారమునందు తన మనస్సును ఏకాగ్రమొనర్చిన యోగికి తన ఇంద్రియములపై ఆధిపత్యము సిద్ధించును. అట్లే మనస్సును నాయందే లగ్నమొనర్చిన భక్తునకు *ప్రాప్తి* అను సిద్ధి లభించును.


*15.14 (పదునాలుగవ శ్లోకము)*


*మహత్యాత్మని యః సూత్రే ధారయేన్మయి మానసమ్|*


*ప్రాకామ్యం పారమేష్ఠ్యం మే విందతేఽవ్యక్తజన్మనః॥12788॥*

నా అవ్యక్తరూపమునుండియే బ్రహ్మాండము యొక్క నిర్మాణము జరిగినది. మహత్తత్త్వరూపము, సూత్రాత్మయు ఐన హిరణ్యగర్భునియందు మనస్సును ధారణచేసినచో *ప్రాకామ్యము* అను సిద్ధి లభించును. అతడు బ్రహ్మాండమునకు యజమాని (అధిపతి)యై పరమేష్ఠిపదమును పొందును.


*15.15 (పదునైదవ శ్లోకము)*


*విష్ణౌ త్ర్యధీశ్వరే చిత్తం ధారయేత్కాలవిగ్రహే|*


*స ఈశిత్వమవాప్నోతి క్షేత్రజ్ఞక్షేత్రచోదనామ్॥12789॥*


ఈ ముల్లోకములకును నేనే అధిపతిని. త్రిగుణాత్మకమైన మాయకు నేనే స్వామిని. సమస్త బ్రహ్మాండములను నాశనము చేయగల కాలస్వరూపుడను నేనే. క్షేత్రమైన శరీరమునకును, క్షేత్రజ్ఞుడైన జీవాత్మకును ప్రేరణ గూర్చు పురుషోత్తముడను నేనే. నా ఈ విష్ణుస్వరూపమును చిత్తమునందు ధారణ చేసినవానికి *ఈశిత్వము* అను సిద్ధి లభించును.నా వలెనే అతనికిని ఇచ్ఛానుసారము జీవులకు ప్రేరణను గూర్చెడి సామర్థ్యము గూడ ప్రాప్తించును.


*15.16 (పదహారవ శ్లోకము)*


*నారాయణే తురీయాఖ్యే భగవచ్ఛబ్దశబ్దితే|*


*మనో మయ్యాదధద్యోగీ మద్ధర్మా వశితామియాత్॥12790॥*


*శ్లో. ఐశ్వర్యస్యసమగ్రస్య ధర్మస్య యశసఃక్రియః|*


*జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం 'భగ'ఇతీరణా॥*


షడైశ్వర్యసంపన్నుడనైన *నారాయణుడను* నేనే. తురీయస్థితికి చేరిన యోగి, నా ఈ నారాయణస్వరూపమును మనస్సునందు ధ్యానము చేసి, స్థిరముగా నిలిపినచో, అతనికి సాధర్మ్యము కలుగును. అనగా నా గుణములే లభ్యములగును. అట్టియోగికి *వశిత్వము* అను సిద్ధి లభించును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సీతాఫలం ఉపయోగాలు

 సీతాఫలం చెట్టు ఉపయోగాలు - 


 * మంచిగా పండిన సీతాఫలం తీసుకోవడం వలన రక్తం వృద్ది చెందును . 


 * శరీరం నందు మాంస శాతాన్ని పెంచును. బక్కపలచగా ఉండువారు ఈ పండు తీసుకోవడం వలన మంచి కండ పొందగలరు. 


 * శరీరం నందు వేడిని హరించును . 


 * సీతాఫలం చెట్టు యెక్క ఆకు రసం 3 నుంచి 4 చుక్కలు దంత రంధ్రములో వేసిన క్రిములు ఊడిపడును. 


 * ఈ చెట్టు ఆకురసం పుండ్లపై పూసి పిమ్మట ఆ ఆకును ముద్దగా నూరి పుండ్లపైన వేసి కట్టు కట్టిన పుండ్లు మానును . 


 * ఈ పసరు పుండ్లపై పూయుట వలన పురుగులు పట్టిన పుండ్లు లలో పురుగులు చచ్చిపోయి పుండ్లు శీఘ్రంగా మానును . 


            ఈ యోగాన్ని పశువుల పుండ్లుపై నేను ప్రయొగించాను . చాలా మంచిఫలితాలు వచ్చాయి . రసాన్ని పుండుపై పిండి ఆకువేసి కట్టాను . 


 * దీని గింజలు రుబ్బి తలకు పట్టించిన పేలు పోవును . 


 * శీతాఫలం చెట్టు యొక్క లేత ఆకుల కషాయం ఇచ్చునచో చిన్న పిల్లల లో పేగు మలద్వారం నుంచి బయటకి వచ్చు సమస్య తీరిపోవును .


 * శీతాఫలం చెట్టు కాండం పైన ఉన్న చెక్క కషాయం ఇచ్చినచో జ్వరం , ఉబ్బసం ద్వారా వచ్చే దగ్గు మానును 


 * శీతాఫలం తీసుకోవడం వలన గుండెకు అద్బుత బలం చేకూర్చును . 


 * శీతాఫలం యొక్క పండు గుజ్జు గడ్డలపైన వేసి కట్టినచో గడ్డలు పగులును .


* దీనిఆకు పసరు గజ్జి , తామర నయం చేయును . 


* దీని విత్తనాల పొడిని పేపర్లో కొంచం కట్టి బట్టల మధ్యలో పెడితే బట్టలకు పురుగుల సమస్య ఉండదు.


 శీతాఫలం ఎక్కువ తీసుకోవడం వలన కలుగు దోషాలు - 


 * శరీరంలో శ్లేష్మము పెంచును. 


 * కొద్దిగా పైత్యం చేయును . 


 * జీర్ణక్రియ సరిగ్గా లేనివారికి జ్వరం తెచ్చును 


 * అతిమూత్ర వ్యాధి కలిగినవారు దీనిని వాడరాదు. 


 * గర్భిణి స్త్రీలు దీనిని అసలు తినరాదు. దీనికి గర్భస్రావం కలిగించే గుణము కలదు .


    


సంస్కృత మహాభాగవతం*

 *14.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునైదవ అధ్యాయము*


*వేర్వేరు సిద్ధుల నామములు - వాటి లక్షణములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*15.1 (ప్రథమ శ్లోకము)*


*జితేంద్రియస్య యుక్తస్య జితశ్వాసస్య యోగినః|*


*మయి ధారయతశ్చేత ఉపతిష్ఠంతి సిద్ధయః॥12775॥*


*శ్రీభగవానుడు వచించెను* "ఉద్ధవా! ఇంద్రియములను, ప్రాణములను, మనస్సును తన వశమునందుంచుకొని, తన చిత్తమును నాయందే లగ్నమొనర్చిన యోగికి, అతని సాధనయందు విఘ్నము కలిగించుటకుగాను పెక్కు సిద్ధులు వచ్చి అతని ముందు నిలబడును. సిద్ధులు ప్రాప్తించును".


*ఉద్ధవ ఉవాచ*


*15.2 (రెండవ శ్లోకము)*


*కయా ధారణయా కా స్విత్కథం వా సిద్ధిరచ్యుత|*


*కతి వా సిద్ధయో బ్రూహి యోగినాం సిద్ధిదో భవాన్॥12776॥*


*ఉద్ధవుడు నుడివెను* "అచ్యుతా! సకలలోకపూజ్యుడవైన నీవు యోగిపుంగవులకు సిద్ధులను ప్రసాదించు మహానుభావుడవు. సిద్ధులు ఎన్ని? దేనిని ధారణచేసనచో ఏ సిద్ధి ఎట్లు ప్రాప్తించును? దయతో వివరింపుము".


*శ్రీభగవానువాచ*


*15.3 (మూడవ శ్లోకము)*


*సిద్ధయోఽష్టాదశ ప్రోక్తా ధారణాయోగపారగైః|*


*తాసామష్టౌ మత్ప్రధానా దశైవ గుణహేతవః॥12777॥*


*శ్రీభగవానుడు పలికెను* "మహాత్మా! ఉద్ధవా! ధారణాయోగ పారంగతులైనవారు పదునెనిమిది సిద్ధులను పేర్కొనిరి. వాటిలో ఎనిమిది సిద్ధులు ముఖ్యరూపముగ నాయందే గలవు. మిగిలిన పది సిద్ధులు సత్త్వగుణముయొక్క ఉత్కర్షతో యోగులకు లభించును.


*15.4 (నాలుగవ శ్లోకము)*


*అణిమా మహిమా మూర్తేర్లఘిమా ప్రాప్తిరింద్రియైః|*


*ప్రాకామ్యం శ్రుతదృష్టేషు శక్తిప్రేరణమీశితా॥12778॥*


*15.5 (ఐదవ శ్లోకము)*


*గుణేష్వసంగో వశితా యత్కామస్తదవస్యతి|*


*ఏతా మే సిద్ధయః సౌమ్య అష్టావౌత్పత్తికా మతాః॥12779॥*


ఈ ఎనిమిది సిద్ధులలో అణిమ, మహిమ, లఘిమ, అను మూడును శరీరమునకు సంబంధించినవి. కోరిన కోర్కెలను తీర్చెడి *ప్రాప్తి* అను సిద్ధి ఇంద్రియములకు సంబంధించినది. లౌకిక పారలౌకిక పదార్థములను లభింపజేసెడి సిద్ధి ప్రాకామ్యము. మాయను, దాని కార్యములను ప్రేరేపించు సిద్ధి ఈశిత్వము. శబ్దాది విషయములయందు ఉన్నను వాటియందు ఆసక్తుడు కాకుండజేయునది వశిత్వసిద్ధి. అన్ని విధములగు కోరికలు నశించిపోవునట్టిది *కామావసాయిత* అను సిద్ధి. ఈ అష్టసిద్ధులను నాలో సహజముగనే గలవు".


*శ్లో. అణిమా, మహిమాచైవ, గరిమా లఘిమా తథా| ప్రాప్తిః, ప్రాకామ్యమ్, ఈశిత్వం, వశిత్వం చాష్టసిద్ధయః॥* అణిమా, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యమ్, ఈశిత్వం, వశిత్వం అను ఈ అష్టసిద్ధులను అమరుడు అష్టసిద్ధులుగా తెలిపెను. (అమరకోశము).


*15.6 (ఆరవ శ్లోకము)*


*అనూర్మిమత్త్వం దేహేఽస్మిన్ దూరశ్రవణదర్శనమ్|*


*మనోజవః కామరూపం పరకాయప్రవేశనమ్॥12780॥*


*15.7 (ఏడవ శ్లోకము)*


*స్వచ్ఛందమృత్యుర్దేవానాం సహక్రీడానుదర్శనమ్|*


*యథాసంకల్పసంసిద్ధిరాజ్ఞాప్రతిహతాగతిః॥12781॥*


ఇవి మాత్రమేగాక, ఇంకను మరికొన్ని సిద్ధులు గలవు. ఈ శరీరమనందు ఆకలిదప్పులను, కామక్రోధములను అదుపులో ఉంచగలుగుట, దూరప్రదేశమునగల శబ్దములను వినగలుగుట, వస్తువులను చూడగలుగుట, సశరీరముగా మనోవేగముతో ఇతర ప్రదేశములకు చేరగలుగుట, కోరుకొనిన రూపమును ధరింపగలుగుట. ఇతర శరీరమునందు ప్రవేశింపగలుగుట (పరకాయ ప్రవేశము), స్వచ్ఛందముగా దేహమును చాలింపగలుగుట, దేవతలు, దేవతలవలె అప్సరసలతోగూడి క్రీడించుట, సంకల్పించినదానిని సిద్ధింపజేసికొనగలిగి యుండుట (సంకల్పసిద్ధిని గలిగియుండుట) తిరుగులేని ఆజ్ఞాశక్తిని గలిగియుండుట. ఈ పది సిద్ధులను సత్త్వగుణవృద్ధిచే సమకూరును.


*15.8 (ఎనిమిదవ శ్లోకము)*


*త్రికాలజ్ఞత్వమద్వంద్వం పరచిత్తాద్యభిజ్ఞతా|*


*అగ్న్యర్కాంబువిషాదీనాం ప్రతిష్టంభోఽపరాజయః॥12782॥*


త్రికాల (భూత, భవిష్యద్వర్తమాన కాలముల) జ్ఞానమును కలిగియుండుట. శీతోష్ణ, సుఖదుఃఖ, రాగద్వేషాది ద్వంద్వములకు లోనుగాకుండుట, పరేంగిత జ్ఞానమును (ఇతరుల మనస్సులలోని భావమును) ఎరుంగగలుగుట. అగ్ని, సూర్యుడు, జలము, విషమువంటి శక్తులను స్తంభింపజేయుట, ఎట్టి స్థితిలోను (ఎవరివలనను) పరాజయము పాలుగాకుండుట, అను ఈ ఐదు సిద్ధులును యోగసాధన బలముచే లభించును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*454వ నామ మంత్రము* 14.10.2021


*ఓం లోలాక్షీ కామరూపిణ్యై నమః*


హరిణాక్షియై స్త్రీలకు యోగేశ్వరేశ్వర స్వరూపిణిగా భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


కామస్వరూపిణియై, సుందరమైన విశాలనయనములతో తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లోలాక్షీకామరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం లోలాక్షీ కామరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని స్మరించు భక్తులకు ఆ తల్లి కామరూపిణియై ఇష్టకామ్యసిద్ధిని కలుగజేయును.


అమ్మవారి కనులు తన ముఖసౌందర్యమనెడి ప్రవాహంలో చలించు మీనములవంటివి *(వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా)* అని లలితా సహస్ర నామావళి యందలి పదునెనిమిదవ నామ మంత్రంలో స్తుతించాము. అలాంటి మంగళకరమైన చంచలాక్షులతో పరమేశ్వరి స్త్రీ సౌందర్యానికి సంకేతంగా నిలుస్తూ, కామాక్షిగా (కంచి కామాక్షిగా) భక్తుల ఇష్టకామ్యములను నేరవేర్చునది గనుకనే ఆ తల్లి *లోలాక్షీ కామరూపిణీ* యని అనబడినది. 


పరమేశ్వరుడు కామేశ్వరుడు. భక్తుల కోర్కెలను అత్యంత సులభుడుగా తీర్చు భోళాశంకరుడు. ఆయన పత్ని అమ్మవారు తన మిలమిలలాడుతూ కనురెప్పల మధ్య మెరిసే కన్నులతో, త్రిభువనసుందరియై, ఆ పరమేశ్వరునికి కామరూపిణిగా గోచరించుచున్నది గనుకనే ఆ తల్లి *లోలాక్షీ కామరూపిణీ* యని అనబడినది.


అమ్మవారి కన్నులు భండాసురాది రాక్షసులకు మాత్రము అగ్నిగోళములై, ఉగ్రరూపంతో కనుపిస్తాయి గనుకనే ఆ నేత్రాగ్నులనే అస్త్రములకు ఆ రాక్షసులు భస్మమైపోయారు.


అమ్మవారు హరిణాక్షి (లోలాక్షి). ఆ కన్నులు అత్యంతసుందరమై, స్త్రీలకే మన్మథస్వరూపురాలుగా గోచరించుతున్నది గనుక, ఆ తల్లి *లోలాక్షీ కామరూపిణీ* యని అనబడినది.


అమ్మవారు కామరూపిణీ యని అనబడినది గదా! 1.కామము, 2.క్రోధము, 3. లోభము, 4. మదము, 5. మోహము, 6. మాత్సర్యము, 7.పైశున్యము (మోసము), 8. అసూయ అనునవి అష్టమాతలుగా వరాహపురాణమున చెప్పబడినది. కామమునకు యోగేశ్వరి, క్రోధమునకు మహేశ్వరి, లోభమునకు వైష్ణవి, మదమునకు బ్రహ్మాణి, మోహమునకు స్వయంభువు, మాత్సర్యమునకు కళ్యాణి, పైశున్యమునకు యమదండధరాదేవి, అసూయకు వరాహ అను గుణముల నామదేవతలుగా వరాహపురాణమునందు చెప్పబడినది. ఇందులో కామమునకు యోగేశ్వరి గనుక అమ్మవారు స్త్రీలకు యోగేశ్వరేశ్వర స్వరూపురాలుగా వివరింపబడినది. ఈ ఎనిమిది గుణములకు అష్టమాత్రుకలు అధిదేవతలై జీవుని కర్మఫలానుసారము ప్రవర్తించుచుండును. 


అమ్మవారు భక్తులకు ఏ పేరున పిలిస్తే ఆ పేరున కామరూపిణిగా, తన సుందరనయనములతో గోచరిస్తుంది గనుక, *లోలాక్షీ కామరూపిణీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం లోలాక్షీ కామరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*453వ నామ మంత్రము* 14.10.2021


*ఓం త్రినయనాయై నమః*


సోమసూర్యాగ్నులే తన నేత్రములై భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *త్రినయనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం త్రినయనాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు ఆ తల్లిని తన హృదయమందు దహరాకాశవాసినిగాను, తన మనోనేత్రములందు ఆ పరమేశ్వరిని సోమసూర్యాగ్ని లోచనిగాను వీక్షిస్తూ పరమమానందభరితుడై తరించును.


శివుడు త్రినేత్రుడు. శివాని (అమ్మవారు) త్రినయన. శివశక్త్యైక్యతకు సంకేతము ఇదియే. ఆ పరమేశ్వరునికి త్రికాలములు (భూతభవిష్యద్వర్తమాన కాలములు) త్రినేత్రములయితే అమ్మవారికి సోమసూర్యాగ్నులే త్రినయనములు. ఒక కంట భక్తులను తేజోమూర్తులుగాను, మరొక కంట సుధాస్వరూపులుగాను, ఫాలనేత్రముతో అగ్నిస్వరూపులై శత్రుభయంకరులుగాను మూర్తీభవింపజేయును. 


అమ్మ వారి త్రినయనములలో ఒక నయనము సూర్యుడగుటచే పగటికిని, రెండవ నేత్రము చంద్రుడగుటచే రాత్రికిని, ఫాలనేత్రము సంధ్యాకాలమునకును సంకేతములుగా కూడా భావించవచ్చును. 


శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో నలుబది ఎనిమిదవ శ్లోకంలో చెప్పిన విధానాన్ని పరిశీలిద్దాము:-


*అహః సూతే సవ్య - తవ నయనమర్కాత్మకతయా*


*త్రియామాం వామంతే - సృజతి రజనీ నాయకతయా |*


*తృతీయా - తే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచిః*


*సమాధత్తే సంధ్యాం - దివసనిశయోరంతరచరీమ్ || 48 ||*

 

అమ్మవారి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది

 

జగన్మాతా! సూర్య రూపమైన నీ కుడికన్ను వలన ఈ లోకాలకు పగలు ఏర్పడుతున్నది.చంద్రుని స్వరూపమైన నీ ఎడమ నేత్రం వలన రాత్రి ఏర్పడుతున్నది. అగ్ని రూపమైన, కొద్దిగా వికసించిన సువర్ణ కమలము వంటి నీ నుదుటి పై నున్న మూడవ నేత్రము వలన పగలుకు రాత్రికి మధ్య ఏర్పడు ప్రాతసంధ్య,సాయంసంధ్య అనబడు ఉభయ సంధ్యలు ఏర్పడుతున్నాయి. ఇలా ఏర్పడు ఈ నాలుగు కాలాలు మాపై నీవు కురిపించు నీ కరుణా కటాక్ష వీక్షణాలే కదా తల్లీ! 


పరమేశ్వరి మూడు నయనములు త్రికాలజ్ఞానములకు సంకేతము. ఆ త్రినయనములలో ఒకటి సృష్టికిని, మరియొకటి స్థితికిని, ఫాలనేత్రము లయమునకును సంకేతములు. 


త్రి అనగా మూడుమార్గములను, నయన అనగా లభింపజేయునది. అనగా జీవుడు ఈ స్థూలదేహమును వీడి పోవునప్ఫుడు దక్షిణమార్గము, ఉత్తరమార్గము, బ్రహ్మమార్గములను చూపును. జీవులకు వారి వారి కర్మఫలములననుసరించి ఏ మార్గమున బోవుటకు అర్హతఉండునో ఆ మార్గమును ఆ పరమేశ్వరి అనుగ్రహింపజేయును గనుక ఆ శ్రీమాత *త్రినయనా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం త్రినయనాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం

 *13.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*


*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*14.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*సమం ప్రశాంతం సుముఖం దీర్ఘచారుచతుర్భుజమ్|*


*సుచారుసుందరగ్రీవం సుకపోలం శుచిస్మితమ్॥12766॥*


*14.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*సమానకర్ణవిన్యస్తస్ఫురన్మకరకుండలమ్|*


*హేమాంబరం ఘనశ్యామం శ్రీవత్సశ్రీనికేతనమ్॥12767॥*


*14.40 (నలుబదియవ శ్లోకము)*


*శంఖచక్రగదాపద్మవనమాలావిభూషితమ్|*


*నూపురైర్విలసత్పాదం కౌస్తుభప్రభయా యుతమ్॥12768॥*


*14.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*ద్యుమత్కిరీటకటకకటిసూత్రాంగదాయుతమ్|*


*సర్వాంగసుందరం హృద్యం ప్రసాదసుముఖేక్షణమ్|*


*సుకుమారమభిధ్యాయేత్సర్వాంగేషు మనో దధత్॥12769॥*


ఆ ధ్యాన స్వరూపము ఇట్లుండును. ఆ రూపమునందలి అవయవములు అన్నియును సమాన ప్రమాణములో సౌష్ఠవముగా నుండును. ఆ రూపము ప్రసన్నముగా ఉండును. ముఖము ఆహ్లాదకరమైనది. ఆ మూర్తియందలి నాలుగు బాహువులును, దీర్ఘములు, సుందరములు, గ్రీవము (కంఠము) ఒప్పిదమైనది మనోహరమైనది. కపోలములు దర్శనీయములు, చిఱునవ్వు మిగుల స్వచ్ఛమైనది. సమానములుగానున్న ఆ కర్ణములయందలి కుండలములు మిలమిల తళుకు లీనుచుండును. ఆ శ్యామసుందరుని పట్టుపీతాంబరము మనోజ్ఞము. ఆ దివ్యమూర్తి వక్షస్థలము శ్రీవత్స చిహ్నముతో అలరారుచు, లక్ష్మీదేవికి నిలయమై తేజరిల్లుచుండును. ఆ స్వామి ధరించిన శంఖ, చక్ర, గదా, పద్మ, వనమాలల శోభలు అద్వితీయములు. కాళ్ళయందలి అందెలకాంతులు అద్భుతములు. కంఠమునందలి కౌస్తుభమణి దివ్యకాంతులను విరజిమ్ముచుండును. ఆ మంగళకర రూపమున విలసిల్లుచుండెడి కిరీటము, కంకణములు, కటిసూత్రము, కేయూరములు అపూర్వములై శోభిల్లుచుండును. ముఖకాంతులు, వీక్షణముల వైభవములు అనిర్వచనీయములు.  వేయేల ఆ దివ్యరూపము సర్వాంగసుందరము, హృద్యము, ప్రసన్నము, సుకుమారము. అట్టి మంగళకరరూపమును మనస్సున నిలుపుకొనవలెను.


*14.42 (నలుబది రెండవ శ్లోకము)*


*ఇంద్రియాణీంద్రియార్థేభ్యో మనసాఽఽకృష్య తన్మనః|*


*బుద్ధ్యా సారథినా ధీరః ప్రణయేన్మయి సర్వతః॥12770॥*


బుద్ధిమంతుడైన పురుషుడు మనస్సుద్వారా ఇంద్రియములను శబ్దాది విషయములనుండి మరల్చవలయును. పిమ్మట బుద్ధి అను సారథి సహాయమున మనస్సును నాయందు లగ్నము చేయవలెను.


*14.43 (నలుబది మూడవ శ్లోకము)*


*తత్సర్వవ్యాపకం చిత్తమాకృష్యైకత్ర ధారయేత్|*


*నాన్యాని చింతయేద్భూయః సుస్మితం భావయేన్ముఖమ్॥12771॥*



అంతట నా పూర్తి విగ్రహమును ధ్యానించుచుండగా, చిత్తమును సర్వాంగములనుండి తొలగించి నెమ్మదిగా ఒకే స్థానమునందు నిలుపవలెను. అందులోనూ వేరే ఇతర అంగముల చింతన చేయక, కేవలము మందహాసముతో కూడి మిగుల శోభలొలికించెడు నా యొక్క ముఖమునే ధ్యానించుచుండవలెను. (అనగా, ఇంతకుముందు సర్వాంగములను ధ్యానించుమని చెప్పబడినది. ఇప్పుడు ఏకాంగమును తలంచుమని చెప్పబడినది. అనగా - సర్వాంగములను ధ్యానముద్వారా చక్కగా తలంచుచు, క్రమముగా ఏకాంగముపై చిత్తమును కేంద్రీకరించి ధ్యానతత్పరుడు కావలెనని భగవంతుడు చెప్పినమాట. కారణమేమన, నిలకడలేని మనస్సును అనుసరించి సర్వాంగములను దర్శించినమీదట ఏకాంగమున నిలిపినచో చిత్తము ఏకాగ్రము కాగలదని సాధకులకు ముఖ్యసూచన చేయబడినది.


*14.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*తత్ర లబ్ధపదం చిత్తమాకృష్య వ్యోమ్ని ధారయేత్|*


*తచ్చ త్యక్త్వా మదారోహో న కించిదపి చింతయేత్॥12772॥*


మనస్సును చిఱునవ్వుతో ఒప్ఫుచున్న నా ముఖమునుండి మరల్చి, ఆకాశమునందు నిలుపవలెను. క్రమముగా ఆకాశచింతనమునుగూడ త్యజించి, చిత్తమును నా స్వరూపమునందే స్థిరపరచవలెను. అనంతరము నన్ను దప్ప మరి ఏ ఇతర వస్తువును గూడ స్మరింపరాదు.


*14.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*ఏవం సమాహితమతిర్మామేవాత్మానమాత్మని|*


*విచష్టే మయి సర్వాత్మన్ జ్యోతిర్జ్యోతిషి సంయుతమ్॥12773॥*


ఈ విధముగా చిత్తమును ఏకాగ్రమొనర్చినప్పుడు, ఒక జ్యోతి మరియొక జ్యోతితో చేరి, ఏకమైనట్లు తనలో నన్ను అటులే సర్వాత్మనైన నా యందు చేరియున్నట్లు అనుభవింపుము. ఇట్లు నాయందు ఏకీభావస్థితిని పొందుము.


*14.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*ధ్యానేనేత్థం సుతీవ్రేణ యుంజతో యోగినో మనః|*


*సంయాస్యత్యాశు నిర్వాణం ద్రవ్యజ్ఞానక్రియాభ్రమః॥12774॥*


తీవ్రమైన ధ్యానయోగముద్వారా యోగి తన చిత్తమును నాయందు లగ్నమొనర్చినప్పుడు ద్రవ్యము, జ్ఞానము, క్రియలు మొదలగువాటియొక్క నానాత్వభ్రమ వెంటనే తొలగిపోవును. అనగా అతనికి సకలపదార్థముల రూపముల యందును పరమాత్మనైన నా ఉనికియే గోచరించును. కేవలము పరమాత్మజ్ఞానము మాత్రమే మిగిలియుండును.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే చతుర్దశోఽధ్యాయః (14)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి   *భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము* అను పదునాలుగవ అధ్యాయము (14)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

బతుకమ్మ పండుగ

 బతుకమ్మ పండుగ న, లేక నివాళి న....


దసరా పండుగ లో దేవి అవతారాలు.....ఒక రోజు ఒక అలంకారం, ఇంకో రోజు ఇంకో అలంకారం చేసి 9 రోజుల పండుగ చేసు కుంటారు. ముఖ్యముగా చెప్పవలసి వస్తే, స్త్రీ మూర్తి, మహిళ ... ఈమె పకృతి లో ఒక భాగము, ఈమెకు గొప్ప స్థానం ఇవ్వాలని చెబుతుంది. స్త్రీ లేని ది పకృతి లేదు అని చెబుతుంది. ఈ దేవత చాలా powerful అని ...నమ్ముతారు... మనిషి పుట్టిన తరువాత దేవుడు పుట్టాడు అని నమ్మని వారు... ఎవ్వరూ powerful, ఎది వాస్తవము అని కొద్ది సేపు ప్రక్కన పెడితే.....


ముస్లిం ల దండ యాత్ర, గోల్కొండ కోట ముస్లిం ల వశము అయిన తరువాత, ఆ ముస్లిం పాలకులు దొరల పై ఆధార పడ్డారు. ఒక విధముగా చెప్పాలి అంటే, దొరలు ముస్లిం పాలకులను ప్రసన్నం చేసుకున్నారు వారి బలహీనతలను అర్థం చేసుకొని... వారి బలహీనతలను సంతృప్తి పరచి, దొరలు వారికి దగ్గర అయ్యారు. దొరలు ఏన్ని అక్రమాలు, అన్యాయాలు చేసిన పట్టించు కాకుండా వారికే వత్తాసు పలికారు. ప్రజల తో మమేకం కాకుండా, ప్రజల దగ్గరికి వెళ్లకుండ, దొరలు చెప్పేది అవాస్తవము, మోసం అని తెలిసి కూడా, దొరలు చెప్పినదే వేదం అని వారికి పెద్ద పీట వేశారు.....ముస్లిం ప్రభువులు తమ చేతి లో కీలు బొమ్మలు అని, దొరలు అగాయిత్యలకు పాల్పడ్డారు కొన్ని వందల ఎండ్లు... అయితే కొందరు మంచి దొరలు కూడా ఉన్నారు, ప్రజలను కన్న బిడ్డల కన్న ఎక్కువగా ప్రేమించారు, వారికి సేవ చేశారు. ఇక్కడ మనం మాటలాడు కోవలసింది ఈ సందర్భం లో తప్పుడు పనులు చేసిన దొరల గురించి....ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకున్న దొరలు చాలా తక్కువ, వందలో ఒక్కరూ ఇద్దరు ఉండవచ్చు....దొంగ దొరలు ప్రజల మాన ప్రాణాలను హరించరు, వారి మాట వినని వారికి నిలువ నీడ లేకుండా చేశారు. అప్పుడు ముఖ్యముగా కుల వృత్తులు ఉన్నాయి.  


 గోల్కొండ రాజులు, ఆ తరువాత నిజం పాలన సాగింది...దొరలు వీరి లో కొందరు అధిక కులస్తులు ఉన్నారు, మరి కొందరు అధిక కులస్తులు కానీ వారు కూడా ఉన్నారు అంటే ఇప్పటి బీసీ లు కొందరు... ప్రజలను చదువు కొనివ్వ లేదు, త్రాగు బోతులను చేశారు, దేవుడు దయ్యం అనే భయం ముసుగులో, మూఢ నమ్మకాలను అలవాటు చేసి, వారిని అంధకారము లో ఉంచి దొరలు వారి పబ్బం గడుపుకున్నరు. 


బడుగు బలహీనవర్గాల అడ పిల్లలను దొర దగ్గర పడుకో బెట్టలనే నియమం ను తయారు చేశారు. ఎడ్డి జనం గుడ్డి జనం ఈ నియమం ను గుడ్డీ గా అమలు చేశారు.

దొర కు బలహీన వర్గాల ప్రజలు అందరూ వంగి వంగి దండలు పెట్టే వారు. దొరల లకు ఎదురు తిరిగిన వారిని తప్పుడు కేసు లల్లో పెట్టీ పోలీస్ (రజకారులతో) కొట్టించేవారు, జైలుకు పంపించే వారు. ఎదురు తిరిగిన ఆడవారిని బలవంతముగా అనుభవించి చంపి వేయించే వారు. హిందూ మతములో దొరల కన్న ముందు ఒక వర్గం పూజారులు ఇంకో వింత ఆచారం పెట్టారు. పెండ్లి అయిన తరువాత మూడు రోజులు పెండ్లి కూతురు ఆ పూజరితో గడపాలని, అత్త గారి ఇంటికి వెళ్లా వలసిన అమ్మాయి, పూజారి ఇంటికి పంపే వారు. బడుగు బలహీనవర్గాల ఆడపిల్ల లకు విలువైన కన్యత్వం ను దూరం చేశారు. ఎందరో కన్నె పిల్లలు దొరల దోపిడీ కి గురి అయ్యారు. ఇది నిత్య కృత్యం అయ్యింది అప్పుడు, ప్రతి ఊరిలో దొరల అమనుషాలకు.  


ఆ విధముగా ప్రాణాలు కోల్పోయిన కొందరు అడ పిల్లల గుర్తుగా, దసరా పండుగ సందర్భంగా గా బతుకమ్మ ను ఏర్పాటు చేశారు. దేవి అమ్మ వారు చాలా powerful అని, ఈ 9 రోజులు బతుకమ్మను పూలతో ఏర్పాటు చేసి దొరల పాలనకు, వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, అమ్మాయిలను కాపాడాలని, పాటలు పాడుతూ, మహిళలను చైతన్య వంతులుగా చేయడానికి, సామూహిక బతుకమ్మ ను ఏర్పాటు చేశారు.  


ఒక్కో పువ్వు ను ఒక్కో కన్నె పిల్లగా భావిస్తూ, ఒక్కో రకం పువ్వును పెట్టీ, పువ్వుల నే కన్నె పిల్లలుగా భావిస్తూ, కన్నె పిల్లలను రక్షించాలని, బతుక నివ్వలని, దీన గాథలను వర్ణిస్తూ, ఆడ పిల్లల ను దొరల బారి నుండి రక్షించాలని, వారిని దొరలు వదిలి పెట్టాలని ఈ సందర్భం గా అనేక పాటలు పడుతారు మహిళలు ఆ పూల చుట్టూ తిరుగుతూ.....


గతంలో పాడిన దీన గాథలు ఇప్పుడు ప్రచారం లో లేవు. గౌరీ (పార్వతి దేవి) పేరుతో అనేక పాటలు పాడుతున్నారు. ఇప్పటి పాటలలో దొరల అకృత్యాలు లేవు, అవి అన్నీ కనుమరుగు అయ్యాయి. బతుకమ్మ అంటే అమ్మను బతుక నియండి అని అర్థం. అమ్మ అంటే ఒక స్త్రీ మూర్తి. ఆడ పిల్లలను బతుక నియాండి స్వే చ్చ గా, హుందా తనం గా అని అర్థం. ఈ చరిత్ర ప్రతి తెలంగాణ ఆడ పిల్లకు తెలియాలి. చరిత్ర తెలియ కుండ, ఫిల్మ్ పాటలు పాడితే లాభం లేదు.

గతం లో దొరలు ఆడపిల్ల లను పాడు చేస్తే, ఇప్పుడు మద్యం మత్తులో మానవ మృగాలు ఉన్నాయి. 6 నెలల పిల్లల నుండి 60 ఎండ్లా వారిని వావి వరుసలు మరిచి మాన భంగలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మగ మానవ మృగాల నుండి కాపాడ డానికి ప్రతి ఆడ పిల్ల చైతన్య వంతు రాలు కావడానికి బతుకమ్మ పేరుతో పాటలు పాడి, గతం లో బలి అయిన ఆడ పిల్లలను స్మరిస్తూ, వారికి నివాళులు అర్పిస్తూ బతుకమ్మ ఉద్యమాన్ని చేయాలి.  


అయితే తెలంగాణ బతుకమ్మ దీన గాథలకు , దేవి నవ రాత్రు ల ఆలంకరాలకు, పూజలకు సంబంధం లేదని అంటారు... గౌరీ దేవత అంటే పార్వతి దేవి. పార్వతి దేవి కూడా గత జన్మలో శివుడి ని ప్రేమించి పెండ్లి చేసుకుంటుంది. ప్రేమ పెండ్లి నచ్చని ఆమె తండ్రి, ఆమెను అవమానానికి గురి చేస్తాడు. అవమానాన్ని భరించ లేని పార్వతి అగ్ని గుండం లో పడి ఆత్మ హత్య చేసుకుంది అనే ఒక కథ ప్రచారం లో ఉంది. అంటే యువ మహిళలకు తమకు నచ్చిన వాడిని పెండ్లి చేసుకునే స్వె చ్చ ను ఇవ్వాలి అని ఈ సందర్భం గా గుర్తు చేసుకోవాలి....

సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

💐


🌷దైవం.. ధర్మం.. సంస్కృతి.. సంప్రదాయం.. పండుగలు

భారతీయ జనజీవన వారసత్వ సంపద 🌷


🏵️సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ🏵️


🌻ఇప్పటిదాకా బతుకమ్మ పండుగ మూలాలు వెలుగులోకి రాలేదు.🌻 ఈ విషయాన్ని చరిత్రకారులు, సాహితీవేత్తలు ధ్రువీకరించారు.🌹 శతాబ్దాలుగా బతుకమ్మ పండుగపై ఎన్నో జానపద గాథలు, పాటలు తెలంగాణలో ప్రచారంలో ఉన్నాయి.🥀 ఎందరో తెలుగు రీసెర్చ్ స్కాలర్లు బతుకమ్మ పండుగ ప్రాధాన్యతపై ఎన్నో పరిశోధనలు చేశారు. 🏵️కానీ ఈ పండుగను ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు? ఎలా మొదలైంది? లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.🌻 ప్రపంచంలోనే ఏకైక పూల పండుగ, స్త్రీల కోసం ఉన్న పండుగ బతుకమ్మే.🌹

కొందరు సాహితీవేత్తలు ఈ పండుగలో జైనమత అడుగుజాడలను, కాకతీయులతో ఉన్న సంబంధాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. 🏵️కానీ అవి ప్రజామోదం పొందలేదు.🥀 కాకతీయులు కొంతకాలం ఆంధ్ర దేశం అంతటినీ పాలించినా ఈ పండుగ తెలంగాణాకే పరిమితం కావడం అర్థం కాని విషయం.🌻

‘బతుకమ్మ’ చరిత్ర మూలాలు కనుక్కోవాలంటే వెయ్యేళ్ల క్రితం ‘రాజ్యపాలన చేసిన కల్యాణి చాళుక్యుల, చోళుల చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.🌻


🌺బతుకమ్మ చరిత్ర

973లో రాష్ర్టకూటుల సామంతుడైన రెండో తైలపుడు చివరి రాష్ర్టకూటరాజైన ‘కర్కుడు-2’ను ఓడించి స్వతంత్ర కల్యాణీ చాళుక్య రాజ్యం స్థాపించాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం ఇతడి ఆధీనంలో ఉండేది.🌹 ఈ కాలంలోనే వేములవాడ చాళుక్య రాజ్యంలోని వేములవాడ ‘రాజేశ్వరాలయం’ అప్పటికే ప్రసిద్ధి చెందింది. 🌺తెలంగాణ ప్రజల ఇష్ట దైవంగా రాజేశ్వరుడు పూజలు అందుకునేవాడు.🌻 రెండో అరికేసరి(930-55) వేయించిన ‘దానశాసనం’లో ఈ దేవాలయ ప్రసక్తి ఉంది.🌹 వేములవాడ చాళుక్య రాజులు రాష్ర్టకూటుల సామంతులు.🌺 అందువల్ల చోళులు, రాష్ర్టకూటుల మధ్య యుద్ధం జరిగితే వీరు రాష్ర్టకూటుల పక్షం వహించేవారు.🌻 ఈ విధంగా రెండో పరాంతకుడు వేములవాడలోని రాజేశ్వరాలయాన్ని కూడా సందర్శించాడని శాసనాల్లో పేర్కొన్నారు.🌺


🌻చోళుల కాలం నాటి చరిత్ర

రాజేంద్ర చోళుడు వేములవాడ దేవాలయాన్ని ధ్వంసం చేసిన అనంతరం వేములవాడ రాజేశ్వరుడి(బృహదీశ్వరుడి) మాహాత్మ్యం తెలుసుకుని లింగరూపంలో ఉన్న రాజేశ్వరుణ్ని కంచి నగరానికి తీసుకెళ్లాడు.🌹 తన విజయానికి గుర్తుగా తండ్రి అయిన రాజరాజచోళునికి ఈ లింగాన్ని బహూకరించాడని తెలుస్తోంది. 🌺1006లో ఈ లింగానికి(బృహదీశ్వరుడికి) తంజావూరులో దేవాలయ నిర్మాణం ప్రారంభించాడు.🌻 1010లో లింగ ప్రతిష్ఠాపన చేసి, గోపుర కలశాభిషేకాలు నిర్వహించినట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతోంది.🌹

రాజరాజచోళుడు బృహదీశ్వరుడికి కృతజ్ఞతా పూర్వకంగా బంగారు కమలాలను సమర్పించాడు. 🥀ఈ బృహదీశ్వరాలయాన్ని వేములవాడ చాళుక్య దేశంపై జరిగిన దండయాత్రలో దోచుకున్న ధనంతో నిర్మించామని తమిళ శాసనాల్లో చోళరాజులు ప్రకటించుకున్నారు.🌺 వేములవాడ భీమన్న గుడిలోని శివలింగం, బృహదీశ్వరాలయంలోని శివలింగం ఒకేలా ఉంటాయి.🏵️ తంజావురులోని బృహదీశ్వరాలయం దక్షిణ భారతదేశంలోనే ఎత్తయిన ‘విమానం’(విమానం అంటే గోపురం లేదా దేవాలయ ద్వారం) ఉన్న దేవాలయం దీన్ని ‘ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.🌹

బతుకమ్మ పండుగకు బృహదీశ్వరాలయం, వేములవాడ రాజన్న ఆలయాలతో సంబంధం ఏమిటి? చోళ, చాళుక్యుల చరిత్రను ఎందుకు ప్రస్తావించామనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.🌺 వేములవాడ నుంచి శివలింగాన్ని దౌర్జన్యంగా తంజావూరుకు తరలించి, అక్కడ గొప్ప దేవాలయం నిర్మించడం చోళులకు గర్వకారణమైన విషయమే కావొచ్చు. కానీ అది తెలంగాణ ప్రజలకు బాధను కలిగించింది.🌻 చోళులు బృహదేశ్వరుడిని తీసుకెళ్లినందుకు నిరసనగా సృష్టికి కారణభూతమైన శక్తిస్వరూపాన్ని బృహతమ్మ (బతుకమ్మ)గా పూజించారు.🏵️ అదే ‘బృహత్’ బృహతమ్మ లేదా బతుకమ్మగా ప్రాచుర్యం పొందింది.🌻


🌷బృహత్ అమ్మ, బ్రతుకమ్మ

బతుకమ్మను బృహతమ్మ రూపాంతరంగా భావిస్తూ తంజావూరు దేవాలయానికి బృహత్ అనే పదం వినియోగించారు. 🌻బృహత్ అనే పదాన్ని బృహతమ్మ (గొప్ప అమ్మ) అనే పేరుతో ఉపయోగించారు.🏵️

‘బృహత్ కథ’ అనే సంస్కృత గ్రంథం భారతీయ ప్రాచీన గాథలకు, అనేక కథలు, కావ్యాలు, నాటకాలకు మూలమైంది. 🌷దీన్ని రచించిన గుణాఢ్యుడు (మెదక్ జిల్లా) తెలంగాణ తొలికవి. బృహత్ కథను పైశాచీ నామంతో రచించాడు. రెండో శతాబ్దంలో ‘పిరంగదై’ పేరుతో తమిళంలోకి కూడా ఈ గ్రంథాన్ని అనువదించారు.🌻 రామాయణం, మహాభారతంతో సమాన ప్రతిపత్తి ఉన్న గొప్ప గ్రంథం ఇది. 🌹అనేక మంది కవులకు ‘బృహత్‌కథ’ కావ్య వస్తువుగా ఉండేది. ప్రాచీనమైన బృహత్‌ధారణ ఉపనిషత్ లేదా బృహదారణ్య ఉపనిషత్ పేరులో కూడా బృహత్ అనే పద వినియోగం కనిపిస్తుంది.🌺 బృహత్ పదాన్నే బృహతమ్మ లేదా బతుకమ్మగా ప్రజలు ఉపయోగించారని భావించాలి.🏵️

బృహతమ్మ(బతుకమ్మ) ఉద్యమం

రాజేంద్రచోళుడు వేములవాడ బృహత్ శివలింగాన్ని తంజావూరుకు తరలించాక తెలంగాణ ప్రజలు తమ ఆక్రోశాన్ని ఒక ఉద్యమంగా మార్చి చోళ రాజులకు తమ నిరసనను తెలిపే ప్రయత్నమే ‘బతుకమ్మ’ సృష్టికి దారితీసింది.🌼 తెలంగాణ నుంచి లింగాకారమైన శివుడు వెళ్లిపోయిన తర్వాత ఇక్కడున్న పార్వతిని ఊరడించే ప్రయత్నంలో భాగంగా పూలతో(సృష్టి) మేరు పర్వతంలా బతుకమ్మను పేర్చారు. 🏵️దానిపై పసుపు గౌరమ్మను రూపొందించి, దసరా సందర్భంలో తొమ్మిది రోజులు ఆటపాటలతో పదేపదే తలుస్తారు..💐🏵️🌹🌺🌻🌷🌼🌸🥀💐

బ్రతుకుతెరువు

 మన హైదరాబాదు మహానగరంలో బ్రతుకుతెరువు దొరకదు  అనేది లేదు.  పట్టుదల, నిజాయితీ, అంకితభావం వున్నప్రతివారు ఏదో ఒక పని చేసుకొని జీవించవచ్చు. 

వ్యాపారం చేయటం అనేది అనుభవం లేకుండా చేయటం వలన మంచి ఫలితాలను ఇవ్వదు.  చాలావరకు చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు వారికి అనుభవం లేకపోవటం చేత మూసివేయపడుతున్నాయి. ఆలా అని నేను ఎవ్వరిని నిరుత్సహ పరచటం లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం. ప్రయత్నే  ఫలి. కాకపొతే సరైన మార్గదర్శకత్వం కూడా  ఉండాలి. ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందుగా మనం ఎంచుకున్న వ్యాపారం సమాజంలో ఏరకంగా వున్నది అనేది ముందుగా సర్వే చేసి దానికి నాకు వున్నఅనుభవం ఎంతవరకు పనికి వస్తుంది అనేది అంచనావేసుకొని తరువాత మాత్రమే వ్యాపారం చేయాలి.  ఇలా ఎందుకు నేను చెపుతున్నానంటే నాకు అనుభవం లేకుండా ఒక వ్యాపారం భాగస్వామ్యంతో చేసి గతంలో చేతులు కాల్చుకున్నాను. 

వ్యాపారంకన్నా మీరు ఏ వ్యాపారం చేయదలచుకున్నారో ఆ వ్యాపారం చేసే వారి వద్ద హెల్పరుగా కొన్ని రోజులు పనిచేసి ఆ వ్యాపారం యొక్క మెళకువలు తెలుసుకొని తరువాత మాత్రమే సదరు వ్యాపారం చేస్తే తప్పకుండా విజయం సాధించగలరు.  ఎవ్వరి సలహాలు తీసుకోవద్దు. నేను నా అంతట నేనుగా చేయగలను అనే ధీమా వచ్చిన తరువాతే వ్యాపారం మొదలు పెట్టాలి.  పూర్తిగా అప్పుతీసుకొని వ్యాపారం చేయకూడదు, ఆలా చేస్తే మీ వ్యాపారం వృద్ధిలోకి రాకపోతే మీరు అప్పు తీర్చలేరు. 

ముందుగా నేను ఏ పనిచేయగలను అనేవిషయాన్ని సొంతంగా బేరీజు వేసుకొని తరువాత ఆ పని ఎక్కడ ఉందని విచారించి ముందుగా పనిలో ప్రావిణ్యం సంపాదించుకోవాలి.  మార్కెటు సర్వ్యే చాలా ముఖ్యం. మహిళలు కూడా వ్యాపారం చేయవచ్చు చేయవద్దని నేను అనను.  కాకపొతే వారి పరిమితులు తెలుసుకొని వ్యాపారం మొదలు పెట్టాలి.  ఎందుకంటె ఏదో ఆటోలోనో లేక మోటారుసైకిలు మీద వస్తువులు తీసుకొని దుకాణాలకు అందచేసే అటువంటి వ్యాపారాలు మహిళలు చేయలేరు. 

ప్రస్తుతం చాలా మంది మహిళలు వస్త్రాలకు సంబందించిన వ్యాపారాలు చేస్తున్నారు.  కొందరు ఊరగాయ పచ్చళ్ళ వ్యాపారాలుచేస్తున్నారు. 

కొద్దిపాటి పెట్టుబడితో చేసే వ్యాపారులు అంటే 2-5 లక్షల పెట్టుబడితో చేసేవి కూడా చాలా వున్నాయి.  కాకపొతే వాటికి సంబంధించిన ప్రజ్ఞనాన్ని ముందుగా పొంది వుండి మార్కెట్లో రిటర్న్స్ యెట్లా వున్నాయి, మూలధనం తరువాత వర్కింగ్ క్యాపిటల్ యెంత అవసరం ఉంటుంది, వస్తువులు నాణ్యంగా చేయటానికి కావలసిన మెళుకువలు, ఉత్పత్తి అయిన వస్తువులు సత్వర విక్రయం అయ్యే మార్గాలు మనకు యెంత శాతం లాభం వస్తుంది అనే విషయాలమీద ముందుగా అవగాహన తెచ్చుకోవాలి.  నా సలహా ఏమిటంటే ఎట్టి పరిస్థితిలోను వ్యాపారం చతికిల పడకూడదు.   వృద్ధి క్రమ క్రమంగా ఉండాలి. ఇటువంటి విషయాలు అన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే వ్యాపారం మొదలు పెట్టాలి.  

అందరు వ్యాపారం చేయలేరు ఆలా చేయగలిగితే చాలామంది వ్యాపారస్తులు అయ్యేవారు. 

వ్యాపారం జాతకం.  మన జాతకాన్ని బట్టి కూడా వ్యాపారాన్ని ఎంచుకోవటం మంచిది. ముందుగా బుధుడు మనకు వ్యాపారవృద్దికి తోడ్పడుతున్నాడా లేదా, మన జాతకంలో ఏగ్రహం మనకు మంచిగా సహకరిస్తుంది అనేది తెలుసుకుంటే మంచిది.  మీ జాతకంలో శని గ్రాహం మంచిగా వున్నదనుకోండి అప్పుడు ఇనుముకు సంబందించిన వ్యాపారం అంటే హార్డువేర్ మీకు రాణిస్తుంది.  అదే శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటే కళలకు సంబందించిన వ్యాపారం అనుకూలిస్తుంది. అన్ని తెలిసిన   జ్యోతిష్కుల సలహా తీసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి. 

కొద్దీ పెట్టుబడితో జీవనం గడుపుతున్నారు. మనం రోజు చూస్తున్నాము కొంతమంది రోజుకు 3-6 వేలు మాత్రమే పెట్టుబడి పెట్టి సాయంత్రానికల్లా రెండు మూడు వేలు లాభం పొందుతున్నారు.  ఆ విషయం మనకు తెలియదు. అవగాహనకోసం నేను గమనించిన కొన్ని ఉదాహరణలు మీకు తెలుపుతున్నాను. 

1) కూరగాయల వ్యాపారం.  ఇది చాలా తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారం.  ఇందులో ఫలితాలు చాలా బాగా ఉంటాయి. ప్రతివారికి కూరగాయలు రోజు అవసరం ఉంటాయి.  తెల్లవారుజామున మార్కెటుకి వెళ్లి హోలుసెలులో కూరలు తెచ్చి అమ్మితే చాలా లాభం ఉంటుంది. 

ఈ వ్యాపారంలో 300 నుంచి 500 శాతం వరకు లాభం ఉంటుంది.  కాకపొతే ఇందులో కొంత తరుగుదల ఉంటుంది.  అదేమంటే మీరు 10 కిలోలు కొన్న కూరలు మీరు ఒక్కొక్క కిలోగా లేక అరకిలోగా అమ్మితే అది 8 నుంచి 9 కిలోలుగా మాత్రమే విక్రయించ గలరు.  అయినా లాభం బాగా ఉంటుంది. ఇక రెండో విషయం ప్రారంభయంలో ధర ఎక్కువగా చెప్పి కూరలు కొద్దిగా మిగిలిన తరువాత తక్కువ ధరకు అమ్మ వలెను.  ఇలా చేయటం వలన సగటు లాభం మీకు 100-200 శాతం వరకు తగ్గుతుంది అంటే వెరసి మీకు 200-300 శాతం లాభం ఎటుపోదు.  మీరు ఒక 3 వెల పెట్టుబడితో ఒక రోజు వ్యాపారం మొదలుపెడితే సాయంత్రం వరకు హీనపక్షం  మీకు 500 నుంచి 1500 వందల వరకు లాభం కనపడుతుంది. మనం 30 రూపాయలకు కిలో కొనే ఆలుగడ్డలు హోలుసేలులో కిలో 5 రూపాయలకు దొరుకుతాయి అంటే మీరు నమ్ముతారా. 

2)  పండ్ల వ్యాపారం ఈ వ్యాపారం కూడా కూరగాయల వ్యాపారం లాగ చాలా లాభదాయకమైనది. కూరలతో కలిపి కూడా ఈ వ్యాపారం చేయవచ్చు. 

మరిన్ని వ్యాపారాల గూర్చి తరువాత ముచ్చటిద్దాం.